
దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘భారతరత్న’( Bharat Ratna) అవార్డును ప్రముఖ సంగీత దర్శకుడు అందుకోనున్నారని కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతుంది. ఏదైనా రంగంలో అసాధారణ సేవలు అందించి, అత్యుత్తమ పనితీరును కనబరచినవారికి ఈ అవార్డును అందజేస్తారు. ఒక ఏడాదిలో గరిష్ఠంగా ముగ్గురికి మాత్రమే ఈ పురస్కారాన్ని ప్రకటించవచ్చు. అయితే, 2025 ఏడాదికి గాను మేస్ట్రో ఇళయరాజాను (Ilaiyaraaja) భారతరత్న అవార్డ్‌తో కేంద్ర ప్రభుత్వం గౌరవించనుందని తెలుస్తోంది. ఈ ఉగాదిలోపు ప్రకటించే అవకాశం ఉంది.
మేస్ట్రో ఇళయరాజా... ఈ పేరు వింటే చాలు సంగీత ప్రియులు ఆయన సినిమాల్లోని పాటలతో కూని రాగాలు తీస్తుంటారనడంలో సందేహం లేదు. తన పాటలతో అంతలా సంగీత ప్రియులను అలరించారాయన. తనకంటూ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న ఇళయరాజాను భారతరత్న అవార్డ్‌తో కేంద్ర ప్రభుత్వం గౌరవించనున్నట్లు దాదాపు ఖాయం అయిందని సమాచారం. తన 30 సంవత్సరాల వృత్తి జీవితములో వివిధ భాషలలో దాదాపు 5వేల పాటలతో పాటుగా 1000 సినిమాలకు పైగానే సంగీత దర్శకత్వం వహించి రికార్డ్ క్రియేట్ చేశారు. బీజేపీ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఆయన కొనసాగుతున్న విషయం తెలిసిందే.

2010లో భారత ప్రభుత్వం ఆయనను "పద్మభూషణ్" పురస్కారంతో సత్కరించగా.. 2018లో "పద్మవిభూషణ్" అవార్డ్ వరించింది. ఉత్తమ సంగీత దర్శకుడుగా ఏడు సార్లు జాతీయ అవార్డు అందుకున్న దర్శకుడిగా ఆయన రికార్డ్ క్రియేట్ చేశారు. దేశంలోనే అత్యున్నతమైన 24 అవార్డ్స్‌ను ఇళయరాజా అందుకున్నారు.
లండన్‌లో ఇటీవల ఇళయరాజా ‘వాలియంట్’ పేరుతో మ్యూజికల్ ఈవెంట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. అక్కడ వెస్ట్రన్ క్లాసికల్ సింఫొనీ నిర్వహించిన తొలి ఆసియా మ్యూజిక్ కంపోజర్‌గా ఇళయరాజాకు గౌరవం దక్కింది. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా ఇళయరాజా కలిశారు.
Comments
Please login to add a commentAdd a comment