'రాబోయే తరాలకు ఆదర్శం'.. ప్రధానికి నాగార్జున కృతజ్ఞతలు | Akkineni Nagarjuna Responds On PM Modi Praises ANR In Mann Ki Baat | Sakshi
Sakshi News home page

Akkineni Nagarjuna: 'నాన్న జీవితం ఆదర్శం'.. ప్రధానికి నాగార్జున కృతజ్ఞతలు

Published Sun, Dec 29 2024 8:20 PM | Last Updated on Sun, Dec 29 2024 8:45 PM

Akkineni Nagarjuna Responds On PM Modi Praises ANR In Mann Ki Baat

భారత ప్రధాని నరేంద్ర మోదీకి టాలీవుడ్ హీరో నాగార్జున ధన్యవాదాలు తెలిపారు. మన్‌ కీ బాత్‌లో అక్కినేని నాగేశ్వరరావు పేరును ప్రస్తావించడంపై నాగ్ స్పందించారు. మా నాన్న శతజయంతి ఏడాది సందర్భంగా ఆయన సేవలను గుర్తు చేసుకున్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు అంటూ ట్వీట్ చేశారు. భారతీయ సినిమాకు ఆయన చేసిన సేవలు తరతరాలకు  స్ఫూర్తినిస్తాయని నాగార్జున పోస్ట్ చేశారు. ఈ గుర్తింపు మా కుటుంబంతో పాటు సినీ ప్రపంచానికి దక్కుతుందన్నారు. ఆయన సినీ జీవితం ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు.

కాగా.. ఏడాది ఏఎన్నాఆర్ శతజయంతి ఉత్సావాలను హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ ఏడాది అక్కినేని నాగేశ్వరరావు జాతీయ పురస్కారం అవార్డ్‌ను మెగాస్టార్ చిరంజీవి అందుకున్నారు. ఈ వేడుకలో బిగ్‌బీ అమితాబ్ బచ్చన్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు టాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్నారు. అక్కినేని శతజయంతి ఉత్సావాల సందర్భంగా చివరిసారి అక్కినేని నాగేశ్వరరావు మాట్లాడిన ఆడియోను కూడా ప్రదర్శించారు.

ఇక సినిమాల విషయానికొస్తే నాగార్జున కుబేర మూవీలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో కోలీవుడ్ స్టార్ ధనుశ్, రష్మిక మందన్నా కీలక పాత్రలు పోషిస్తున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తోన్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement