
నాగార్జున, ధనుశ్ కీలక పాత్రల్లో నటిస్తోన్న చిత్రం కుబేర. ఈ సినిమాకు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ ఏడాది సంక్రాంతికి ఈ సినిమా రిలీజవుతుందని భావించినా అలా జరగలేదు. ఈ సినిమా రిలీజ్ కోసం నాగార్జున ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో కుబేర టీమ్ విడుదల తేదీని ప్రకటించింది. ఈ మేరకు స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది.
ఈ పాన్ ఇండియా చిత్రాన్ని జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తాజాగా విడుదలైన పోస్టర్‌లో నాగార్జున్, ధనుశ్‌తో పాటు బాలీవుడ్ నటుడు జిమ్ షర్బ్ కూడా ఉన్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ నాగ్ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. రష్మిక హీరోయిన్‌గా నటిస్తుండడంతో ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
A story of power..👑
A battle for wealth..💰
A game of fate..♟️#SekharKammulasKuberaa is ready to deliver an enchanting theatrical experience from 𝟐𝟎𝐭𝐡 𝐉𝐮𝐧𝐞, 𝟐𝟎𝟐𝟓. @dhanushkraja KING @iamnagarjuna @iamRashmika @sekharkammula @ThisIsDSP @SVCLLP @amigoscreation pic.twitter.com/OUATNh4iES— Sree Venkateswara Cinemas LLP (@SVCLLP) February 27, 2025
Comments
Please login to add a commentAdd a comment