పద్మ విభూషణ్, మెగాస్టార్ చిరంజీవి మరో ప్రతిష్టాత్మక ఘనతను సొంతం చేసుకున్నారు. తెలుగు సినీ దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావు జాతీయ పురస్కారం ఆయనను వరించింది. బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియో జరిగిన ఈ కార్యక్రమంలో టాలీవుడ్ సినీతారలంతా పాల్గొన్నారు. ఈ అవార్డ్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి.. ఏఎన్‌ఆర్‌పై ప్రశంసలు కురిపించారు. ఆయనతో నాకున్న అనుబంధం ఎంతో ప్రత్యేకమైందని అన్నారు. అక్కినేని జాతీయ అవార్డు ప్రదానోత్సవంలో భావోద్వేగానికి గురైన చిరు పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు.
చిరంజీవి మాట్లాడుతూ..' ఎవరైనా ఇంటి గెలిచి రచ్చ గెలవాలంటారు. నా సినీ ప్రస్థానంలో రచ్చ గెలిచాను. ఇంట గెలిచే అవకాశం సినీ వత్రోత్సవాల్లో వచ్చింది. నాకు లెజెండరీ అవార్డు ప్రదానంతో ధన్యుడిగా భావించా. కానీ నాకు లెజెండరీ అవార్డు ఇవ్వడాన్ని కొందరు హర్షించలేదు. ఆ సమయంలో అవార్డు తీసుకోవడం సముచితం అనిపించలేదు. అందుకే ఆ రోజు లెజెండరీ అవార్డును క్యాప్సుల్ బాక్సులో వేశా. పద్మవిభూషణ్ సహా ఎన్ని అవార్డులొచ్చినా ఆ అసంతృప్తి ఇంకా మిగిలే ఉంది' అని అన్నారు.
ఏఎన్నార్ అవార్డ్ గురించి మాట్లాడుతూ.. 'ఆ రోజు నేను ఇంట గెలవలేదు. ఈ రోజు ఏఎన్నార్ అవార్డ్ అందుకున్నప్పుడు ఇంట గెలిచాననిపిస్తోంది. ఇప్పుడు ఇంట గెలిచాను.. రచ్చ గెలిచాను. ఈ అవార్డ్ గురించి నాగార్జున, వెంకట్ మా ఇంటికి వచ్చినప్పుడు చాలా ఆనందపడ్డా. నాకు పద్మభూషణ్, పద్మ విభూషణ్, గిన్నిస్ బుక్‌తో సహా ఎన్ని అవార్డులు వచ్చినా ఈ రోజు నా భావోద్వేగం వేరుగా ఉంది. నా వాళ్లు నన్ను గుర్తించి నాకు అవార్డు ఇవ్వడం చాలా గొప్ప విషయంగా అనిపించింది. అన్ని పురస్కారాలకు మించిన ఘనత ఇదేనని నాగార్జునతో చెప్పా. ఇదే మాట స్టేజీ మీద కూడా చెబుతున్నా.' అంటూ ఆనందం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment