అక్కినేని కుటుంబం మూలస్తంభాన్ని కోల్పోయింది: నాగార్జున | Akkineni Nagarjuna Emotional Comments On Yuddala Ayyappa Reddy Death, Check Post Inside | Sakshi
Sakshi News home page

Akkineni Nagarjuna: అక్కినేని కుటుంబం మూలస్తంభాన్ని కోల్పోయింది

Published Thu, Feb 27 2025 9:03 AM | Last Updated on Thu, Feb 27 2025 10:49 AM

Akkineni Nagarjuna Emotional Comments On Yuddala Ayyappa Reddy

టాలీవుడ్ స్టార్ హీరో  నాగార్జున(Akkineni Nagarjuna) సోషల్ మీడియాలో ఎమోషనల్‌ పోస్ట్‌ ఒకటి చేశారు. తన కుటుంబానికి ఎంతో ముఖ్యమైన వ్యక్తి మరణించారంటూ ఎక్స్‌ పేజీలో పేర్కొన్నారు. అక్కినేని నాగేశ్వరరావు వారసత్వంగా ఆయన అభిమానులు ఎందరో ఇప్పటికీ నాగ్‌ కుటుంబంతోనే ఉన్నారు. తన తండ్రి అభిమానులను నాగార్జున ఎంతో ప్రత్యేకంగా  చూస్తారని తెలిసిందే. ఈ క్రమంలో అక్కినేని ఫ్యామిలీ అభిమాని మరణ వార్తను తెలుసుకున్న నాగ్‌ చాలా ఎమోషనల్‌ అయ్యారు. ఈమేరకు సంతాపం తెలిపారు.

మా కుటుంబానికి ఎంతో ముఖ్యమైన వ్యక్తి యద్దుల అయ్యప్పరెడ్డి మరణించడం నన్ను బాగా కలచివేసింది. ఆయన మా నాన్నగారికి వీరాభిమాని. నాన్న నుంచే మాకు మరింత దగ్గరయ్యారు. అక్కినేని కుటుంబానికి మూలస్తంభంగా ఇన్నాళ్ల పాటు ఉన్నారు. మా ఫ్యామిలీ మీద ఆయన చూపిన ప్రేమ, అభిమానం ఎప్పటికీ మరిచిపోలేను. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి.. ఈ కష్ట సమయం నుంచి వారు త్వరగా కోలుకునే శక్తిని దేవుడు అందిస్తాడు.' అని కోరుకుంటున్నాను. 

యద్దుల అయ్యప్పరెడ్డి కర్నూలుకు చెందిన వ్యక్తి. నాగేశ్వరరావు అభిమానిగా చాలా ఏళ్ల నుంచి అక్కినేని ఫ్యామిలీకి  దగ్గరగా ఉంటున్నారు. నాగార్జున కుటుంబానికి సంబంధించిన అన్ని పనుల్లో ఆయన అండగా ఉండేవారని సమాచారం. వారి కుటుంబంలో జరిగే ప్రతి శుభకార్యంలో కూడా అయ్యప్పరెడ్డి ఉండే వారు. అక్కినేని హీరోల ప్రతి సినిమా విడుదల సమయంలో ఆయన సందడిగా కనిపించేవారని అభిమానులు చెబుతుంటారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement