టాలీవుడ్ లెజెండరీ యాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి సందర్భంగా ఆయన నటించిన పది క్లాసిక్ సినిమాలు మళ్లీ విడుదల కానున్నాయి. ఈ క్రమంలో ఇండియాస్ ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్ (FHF) వారు దేశవ్యాప్తంగా చలనచిత్రోత్సవాన్ని నిర్వహించేందుకు ఘనంగా ఏర్పాట్లు చేశారు. సెప్టెంబర్ 20న అక్కినేని నాగేశ్వరరావు 100వ జయంతి సందర్భంగా 'ANR 100 - కింగ్ ఆఫ్ ది సిల్వర్ స్క్రీన్' పేరుతో ఫిల్మ్ ఫెస్టివల్‌ని ప్రకటించిన సంగతి తెలిసిందే.
సెప్టెంబర్ 20 నుంచి మూడు రోజుల పాటు నాగేశ్వరరావు క్లాసికల్ హిట్ సినిమాల ప్రదర్శన ఉండనుంది. అన్నపూర్ణ స్టూడియోస్, హెరిటేజ్ ఫౌండేషన్, పీవీఆర్ ఐనాక్స్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేస్తుంది. సెప్టెంబర్ 20న హైదరాబాద్ సినిఫ్లెక్స్‌లో అక్కినేని నటించిన దేవదాసు సినిమా ప్రదర్శన ఉంటుంది. ఈ ప్రదర్శనకు అక్కినేని నాగార్జునతో పాటు ఆయన కుటుంబసభ్యులు అందరూ పాల్గొననున్నారు. సాయింత్రం 6:30 గంటలకు ఈ షో ఉంటుంది. టికెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి.
సెప్టెంబర్ 20 నుంచి విడుదల కానున్న సినిమాలు
దేవదాసు (1953), మిస్సమ్మ (1955), మాయాబజార్ (1957), భార్య భర్తలు (1961), గుండమ్మ కథ (1962)
డాక్టర్ చక్రవర్తి (1964), సుడిగుండాలు (1968), ప్రేమ్ నగర్ (1971), ప్రేమాభిషేకం (1981), మనం (2014)
Comments
Please login to add a commentAdd a comment