మీ గుర్తింపు ఆయన సేవలకు నిదర్శనం: నాగార్జున్ ట్వీట్ | Akkineni Nagarjuna Family Met With Prime Mnister Narendra Modi | Sakshi
Sakshi News home page

Nagarjuna Akkineni: మీ గుర్తింపు ఆయన సేవలకు నిదర్శనం: నాగార్జున్ ట్వీట్

Published Fri, Feb 7 2025 7:24 PM | Last Updated on Fri, Feb 7 2025 9:35 PM

Akkineni Nagarjuna Family Met With Prime Mnister Narendra Modi

భారత ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi)కి హీరో అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పద్మభూషణ్ అవార్డు గ్రహీత డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ రాసిన 'అక్కినేని కా విరాట్ వ్యక్తిత్వ' పుస్తకాన్ని ప్రధానికి అందజేశారు. మీకు ఈ పుస్తకాన్ని అందించడం గౌరవంగా భావిస్తున్నన్నట్లు వెల్లడించారు. ఇది నా తండ్రి ఏఎన్నార్‌ సినిమా వారసత్వానికి నివాళిగా భావిస్తున్నట్లు తెలిపారు. ఆయన సేవలను మీరు గుర్తించడం మా కుటుంబం, అభిమానులు, భారతీయ సినీ ప్రేమికులకు ఒక విలువైన జ్ఞాపకమని నాగార్జున ట్వీట్ చేశారు.

naga

పార్లమెంట్‌ హౌస్‌లో అక్కినేని కుటుంబ సభ్యులంతా ప్రధానిని కలిసి ఫోటో దిగారు. నాగార్జునతో పాటు అక్కినేని అమల, నాగచైతన్య, శోభిత ధూళిపాల కూడా నరేంద్ర మోదీని కలిశారు. కాగా.. ఇటీవల మన్‌ కీ బాత్‌లో తెలుగువారి లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు గురించి ప్రధాని మోదీ ప్రస్తావించిన సంగతి తెలిసిందే.  
 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement