
సంక్రాంతి వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి సందడి చేశారు. ఢిల్లీలోని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నివాసంలో జరిగిన సంక్రాంతి పండుగ వేడుకల్లో పాల్గొన్నారు. ప్రధాని మోదీతో పాటు జ్యోతి ప్రజ్వలన చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ సంక్రాంతిని పురస్కరించుకుని ఢిల్లీలోని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నివాసంలో వేడుకలు నిర్వహించారు. ఈ పండుగ కార్యక్రమంలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో పాటు బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు కూడా పాల్గొన్నారు.
విశ్వంభరలో చిరంజీవి..
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో నటిస్తున్న చిత్రం ‘విశ్వంభర’. ఈ సినిమాకు బింబిసార ఫేమ్ వశిష్టి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ నుంచి ఇప్పటికే టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. సోషియో ఫాంటసీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్నితెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో చిరంజీవి సరసన త్రిష నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం ఎం.ఎం.కీరవాణి అందించనున్నారు. యు.వి.క్రియేషన్స్ పతాకంపై సుమారు రూ. 200 కోట్ల బడ్జెట్‌తో విక్రమ్, వంశీ, ప్రమోద్‌లు నిర్మిస్తున్నారు.
భోళా శంకర్ డిజాస్టర్ తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని విశ్వంభర కథను చిరంజీవి ఎంపిక చేశారు. ఫ్యాన్స్ కూడా ఒక భారీ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈసారి ఇండస్ట్రీ హిట్ కొట్టడం గ్యారెంటీ అనేలా ఉంది. దర్శకుడు వశిష్ఠపై చిరంజీవి పెట్టుకున్న నమ్మకాన్ని నిలిబెట్టుకునేలా టీజర్ చూస్తే అర్థమవుతోంది. విశ్వంభర బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
#WATCH | Prime Minister Narendra Modi participates in #Pongal celebrations at the residence of Union Minister G Kishan Reddy, in Delhi.
Ace badminton player PV Sindhu and actor Chiranjeevi also attend the celebrations here.
(Video: DD News) pic.twitter.com/T7yj7LpeIG— ANI (@ANI) January 13, 2025