అత్యాచారం కేసులో నటుడు సిద్ధిఖీకి ఊరట | Supreme Court Relief For Actor Siddique | Sakshi
Sakshi News home page

అత్యాచారం కేసులో నటుడు సిద్ధిఖీకి ఊరట

Published Tue, Nov 19 2024 1:08 PM | Last Updated on Tue, Nov 19 2024 1:37 PM

Supreme Court Relief For Actor Siddique

మలయాళ నటుడు సిద్ధిఖీకి భారీ ఊరట లభించింది. అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్న ఆయనకు సుప్రీం కోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. మలయాళ చిత్ర పరిశ్రమలో నటులతో పాటు దర్శకులు కూడా నటీమణులపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారని జస్టిస్‌ హేమ కమిటీ చేసిన రిపోర్ట్‌తో అక్కడి నటీమణులు చాలామంది గతంలో తమకు జరిగిన అన్యాయాన్ని లేవనెత్తారు.  ఈ క్రమంలో కొందరు పోలీస్‌ స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేశారు.

2016లో నటిపై అత్యాచారం
మలయాళ నటి రేవతి సంపత్‌ చేసిన ఆరోపణలతో సిద్ధిఖీపై కేసు నమోదైంది. 2016లో తిరువనంతపురంలోని మస్కట్ హోటల్‌లో తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆమె ఆరోపించింది. ముందుగా ఒక సినిమాలో ఛాన్స్‌ ఇస్తానని ఫేస్‌బుక్‌ ద్వారా తనకు సిద్ధిఖీ  పరిచయం అయ్యాడని, ఆపై తన కోరికను తీర్చాలని బలవంతం చేసినట్లు పేర్కొంది. 

అందుకు తాను నిరాకరించడంతో ఒక పథకం ప్రకారం తనను హోటల్‌కు రప్పించి సిద్ధిఖీ అత్యాచారం చేసినట్లు రేవతి తెలిపింది. దీంతో ఆయనపై కేసు నమోదైంది. అయితే, చాలారోజులుగా పరారీలో ఉన్న ఆయనకు తాజాగా బెయిల్‌ లభించింది. సిద్ధిక్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదిస్తూ, నటుడు ఎలాంటి తప్పు చేయలేదని, ఫిర్యాదుదారు అభియోగాలు అనుమానాస్పదంగా ఉన్నాయని పేర్కొన్నారు.

ఫిర్యాదుకు ఎనిమిదేళ్లు ఎందుకు: కోర్టు
సిద్ధిఖీకి సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరును జస్టిస్‌ బేలా త్రివేది, సతీష్‌ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తాజాగా తీర్పు వెల్లడించింది. అయితే,  ఈ కేసులో సిద్ధిఖీపై ఫిర్యాదు చేయడానికి ఎనిమిదేళ్ల జాప్యం ఎందుకు అయిందని కోర్టు ప్రశ్నించింది. ఈ కారణంతోనే ఆయనకు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది. కానీ, అవసరమైతే పోలీసుల విచారణకు సిద్ధిఖీ సహకరించాలని సూచించింది. 

ఈ క్రమంలో తన పాస్‌పోర్ట్‌ను ట్రయల్‌ కోర్టులో డిపాజిట్‌ చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. ఫిర్యాదు విషయంలో ఆలస్యానికి బాధితురాలి తరఫు న్యాయవాది వృందా గ్రోవర్ ఇలా మాట్లాడారు.  హేమా కమిటీ నివేదికను విడుదల చేయడం ఆపై కేరళ హైకోర్టు జోక్యం చేసుకున్న తర్వాతే అత్యాచార బాధితురాలికి ఫిర్యాదు చేయడానికి ధైర్యం వచ్చిందని వారు అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement