Supreme Court
-
జగన్ కేసులతో మీకేం పని?
సాక్షి, న్యూఢిల్లీ: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సీబీఐ, ఈడీ నమోదు చేసిన కేసులతో మీకేం పనంటూ మాజీ ఎంపీ, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుకు సుప్రీం కోర్టు అక్షింతలు వేసింది. ఈ కేసుల విచారణను వేరే రాష్ట్రానికి బదలాయించాలన్న ఆయన అభ్యర్థనను తిరస్కరించింది. ఆ కేసులను మరో రాష్ట్రానికి బదలాయించే ప్రసక్తే లేదని, మహా అయితే ఈ కేసుల్లో విచారణను వేగవంతం చేయాలని కింది కోర్టుకు చెప్పగలమని స్పష్టం చేసింది.అంతే తప్ప ఎలా పడితే అలా ఆదేశాలు ఇవ్వలేమంది. జగన్ బెయిల్ రద్దు చేయాలని రఘురామకృష్ణరాజు కోరుతున్న నేపథ్యంలో, అసలు ఆ కేసులతో మీకేం సంబంధమని ఆయన్ని నిలదీసింది. వాదనలు వినిపించేందుకు సీఐడీ గడువు కోరడంతో విచారణను ఈ నెల 27కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ సతీ‹Ùచంద్ర శర్మ ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. రఘురామకృష్ణరాజుకు ప్రత్యేక కోర్టు, హైకోర్టుల్లో చుక్కెదురు.. జగన్ కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించి సీఐడీ, ఈడీ పలువురిపై కేసులు నమోదు చేసింది. ఈ కేసుల్లో జగన్‌కు సీబీఐ ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. జగన్‌పై నమోదైన కేసుల్లో సీబీఐ ప్రత్యేక కోర్టు విచారణ కొనసాగిస్తోంది. ఇదిలా ఉండగా, జగన్ బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ రఘురామకృష్ణరాజు సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దాన్ని ఆ కోర్టు కొట్టేసింది. ఆ తరువాత హైకోర్టులో పిటిషన్ వేశారు. హైకోర్టులో సైతం రఘురామకృష్ణరాజుకు చుక్కెదురైంది. దీంతో జగన్ బెయిల్‌ను రద్దు చేయడంతో పాటు, ఆయనపై నమోదైన కేసులను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతూ ఆయన 2023లో సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై సుప్రీంకోర్టు పలుమార్లు విచారణ జరిపింది. తాజాగా సోమవారం ఈ వ్యాజ్యంపై జస్టిస్ నాగరత్న నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. అసలు జగన్ కేసులతో మీకేం సంబంధమంటూ రఘురామకృష్ణరాజు తరపు న్యాయవాదిని ప్రశ్నించింది. కేసులను వేరే రాష్ట్రానికి బదిలీ చేసే ప్రసక్తేలేదని తేల్చి చెప్పింది.రాజకీయ విద్వేషంతోనే పిటిషన్ అనంతరం జగన్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ.. రాజకీయపరమైన విద్వేషంతోనే రఘురామకృష్ణరాజు ఈ పిటిషన్ దాఖలు చేశారన్నారు. సీఐబీ, ఈడీ నమోదు చేసిన కేసులపై సీబీఐ ప్రత్యేక కోర్టులో జరుగుతున్న విచారణను హైకోర్టు పర్యవేక్షిస్తోందని తెలిపారు. ప్రత్యేక కోర్టులో డిశ్చార్జ్ పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. సీబీఐ తరఫు న్యాయవాది స్పందిస్తూ.. కేసుల వివరాలు, వాటి ప్రస్తుత పరిస్థితిని వివరిస్తూ అఫిడవిట్ దాఖలు చేశామని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. సీబీఐ తరఫున వాదనలు వినిపిస్తున్న అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) మరో కేసులో వాదనలు వినిపిస్తున్నారని, అందువల్ల ఈ వ్యాజ్యంలో వాదనలు వినిపించేందుకు కొంత సమయం కావాలని సీబీఐ తరపు న్యాయవాది ధర్మాసనాన్ని కోరారు. ఇందుకు ధర్మాసనం అంగీకరిస్తూ తదుపరి విచారణను ఈ నెల 27కి వాయిదా వేసింది. -
చిక్కుల్లో బాబా రామ్‌దేవ్
తిరువనంతపురం: ప్రముఖ యోగా గురు బాబా రామ్‌దేవ్‌పై బెయిలబుల్ వారెంట్లు జారీ అయ్యింది. వినియోగదారుల్ని తప్పుదోవ పట్టించేలా ప్రకటనలు ఇస్తున్నారంటూ బాబా రామ్‌దేవ్‌తో పాటు ఆచార్య బాలకృష్ణ, దివ్య ఫార్మసీలపై కేరళ కోర్టు బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది.మోసపూరిత వ్యాపార ప్రకటనపై నమోదైన కేసులపై పాలక్కాడ్‌లోని జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ II కోర్టులో విచారణ జరిగింది. జనవరి 16న జరిగిన విచారణలో.. రామ్ దేవ్ బాబా, ఆచార్య బాలకృష్ణ, దివ్య ఫార్మసీల ప్రతినిధులు కోర్టుకు ప్రత్యక్షంగా హాజరు కావాల్సి ఉంది. కానీ కోర్టుకు రాలేదు. అందుకే నిందితులందరికీ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తున్నామని కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. తదుపరి విచారణను ఫిబ్రవరి 1కి వాయిదా వేసింది.డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ (అభ్యంతరకరమైన ప్రకటనలు) చట్టం, 1954ను ఉల్లంఘించినట్లు పతంజలి ఆయుర్వేద అనుబంధ సంస్థ దివ్య ఫార్మసీలు ప్రచారం చేసిన ప్రకటనలపై కేసులు నమోదయ్యాయి. ఆ కేసుపై కోర్టులో విచారణ కొనసాగుతుంది. గత రెండేళ్లుగా పతంజలి, దాని వ్యవస్థాపకులు అనేక చట్టపరమైన ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. పతంజలి ఆయుర్వేద్‌కు వ్యతిరేకంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) ఫిర్యాదు చేసింది. నాటి నుంచి రామ్ దేవ్ బాబా సంస్థలు సమస్యలతో సహవాసం చేస్తున్నాయి. పతంజలి ఇస్తున్న యాడ్స్‌పై సుప్రీం కోర్టు సైతం నిర్వాహకులకు మొట్టికాయలు వేసింది. తప్పుదారి పట్టించే ప్రకటనలను తాత్కాలికంగా నిషేధించాలని సూచించింది. కోర్టు నిర్ణయాన్ని ధిక్కరిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కాగా, రామ్ దేవ్ బాబా సంస్థలు తమ ఉత్పత్తుల అమ్మకాల కోసం వ్యాధులను నయం చేయడం గురించి, అల్లోపతితో సహా, ఆధునిక వైద్యాన్ని కించపరిచేలా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. -
‘సుప్రీం’ ఆదేశాలు.. తల్లి వద్దే అతుల్ సుభాష్ కుమారుడు!
న్యూఢిల్లీ: భార్య వేదింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడ్డ బెంగళూరు టెక్కీ అతుల్ సుభాష్ నాలుగేళ్ల కుమారుడి సంరక్షణ బాధ్యతలు ఎవరికి అప్పగించాలనే అంశంపై సోమవారం సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. బాలుడి తల్లి నిఖితా సింఘానియా సంరక్షణలోనే ఉంచాలని సుప్రీం కోర్టు ఈ మేరకు తీర్పిచ్చింది. తన మనువడిని తనకు అప్పగించాలని కోరుతూ అతుల్ సుభాష్ తల్లి అంజు దేవి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్‌పై దేశ అత్యున్నత న్యాయ స్థానంలో ఇవాళ విచారణ జరిగింది. బాలుడి కస్టడీని కోరిన సుభాష్ తల్లి అంజు దేవి చేసిన విజ్ఞప్తికి ప్రతిస్పందనగా సుప్రీం కోర్టు ధర్మాసనం జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఎస్సీ శర్మ సోమవారం అతుల్ సుభాష్ కుమారుడు ఆన్లైన్లో వీడియో ద్వారా మాట్లాడారు. అనంతరం తీర్పును వెలువరించారు.విచారణ సందర్భంగా అతుల్ సుభాష్ కుమారుణ్ని న్యాయమూర్తులకు చూపించేందుకు నిఖితా సింఘానియా నిరాకరించారు. దీనిపై జస్టిస్ బీవీ నాగర్నత ధర్మాసనం మాట్లాడుతూ.. ఇది హెబియస్ కార్పస్ పిటిషన్. మేం ఆ పిల్లాడిని చూడాలనుకుంటున్నాం. వెంటనే మాకు చూపించండి. బాలుడిని విచారణ చేపట్టిన అనంతరం తుది నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. విచారణ సందర్భంగా అతుల్ సుభాష్ కుమారుణ్ని న్యాయమూర్తులకు చూపించేందుకు నిఖితా సింఘానియా నిరాకరించారు. దీనిపై జస్టిస్ బీవీ నాగర్నత ధర్మాసనం మాట్లాడుతూ.. ఇది హెబియస్ కార్పస్ పిటిషన్. మేం ఆ పిల్లాడిని చూడాలనుకుంటున్నాం. వెంటనే మాకు చూపించండి. బాలుడిని విచారణ చేపట్టిన అనంతరం తుది నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. కోర్టు వ్యాఖ్యలపై 45 నిమిషాల విరామం తర్వాత బాలుడు వీడియో లింక్‌లో ప్రత్యక్షమయ్యాడు. వీడియోలో కనిపిస్తున్న అతుల్ సుభాష్ కుమారుడితో మాట్లాడారు. ఆ సమయంలో కోర్టు విచారణను ఆఫ్ లైన్ చేసింది. ఇక బాలుడితో మాట్లాడిన తర్వాత అతుల్ సుభాష్ భార్య నిఖితా సింఘానియా కుటుంబసభ్యుల సమక్షంలో ఉండాలని సుప్రీం అత్యున్నత న్యాయ స్థానం తీర్పును వెలువరించింది. అతుల్ సుభాష్ కేసేంటి?ఉత్తర ప్రదేశ్‌కు చెందిన అతుల్ సుభాష్, నిఖిత 2019లో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఆ జంట బెంగళూరుకు వెళ్లి తమ తమ ఉద్యోగాల్లో చేరింది. ఆ మరుసటి ఏడాది వారికి బాబు పుట్టాడు. 2021లో నిఖిత బెంగళూరులోని భర్తను విడిచిపెట్టి కొడుకుతో సహా పుట్టింటికి చేరింది. ఆపై భర్త, అతని కుటుంబంపై వరకట్న వేధింపుల కేసు పెట్టింది. అలా.. విచారణ కోసం అతుల్‌ను భార్య స్వస్థలం జౌన్‌పురలోని ఫ్యామిలీ కోర్టుకు కోసం వెళ్లాల్సి వచ్చేది. ఈ క్రమంలో.. మానసికంగా, శారీరకంగా అలసిపోయిన అతుల్ సుభాష్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. చనిపోయే క్రమంలో తన భార్య, ఆమె కుటుంబం ఏ స్థాయిలో మానసికంగా వేధించిందో పేజీల కొద్దీ రాసిన సూసైడ్ లేఖ, 90 నిమిషాల నిడివితో తీసిన సెల్ఫీ వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. కొడుకును అడ్డుపెట్టుకుని తన భార్య ఆర్థికంగా తనను దోచుకుందని.. న్యాయస్థానంలోనూ తనకు అన్యాయం జరిగిందని, ఇంక తన వల్ల కాకనే ఇలా ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నాడతను. అంతేకాదు.. తన కొడుకును తన తల్లిదండ్రులకు అప్పగించాలని ఆఖరికి కోరికగా కోరాడు. ఈ ఘటన తర్వాత.. లక్షల మంది మద్ధతుతో మెన్టూతో పాటు జస్టిస్ ఈజ్ డ్యూ, జస్టిస్ ఫర్ అతుల్ ట్యాగ్స్ ట్రెండింగ్‌లో కొనసాగాయి.అతుల్ సోదరుడి ఫిర్యాదు మేరకు బెంగళూరు పోలీసులు.. పరారీలో ఉన్న నిఖితా సింఘానియాను, ఆమె తల్లీ, సోదరుడిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టగా.. రిమాండ్ విధించారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతుంది. -
రఘురామ కృష్ణంరాజు లాయర్‌కు సుప్రీంకోర్టు అక్షింతలు
-
రఘురామ కృష్ణంరాజు లాయర్ కు సుప్రీంకోర్టు అక్షింతలు
-
రఘురామ కృష్ణంరాజు లాయర్‌కు సుప్రీంకోర్టు అక్షింతలు
సాక్షి, ఢిల్లీ: వైఎస్ జగన్ కేసుల విచారణ బదిలీ చేయాలన్న పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్రశర్మ ధర్మాసనం విచారణ జరిపింది. కేసుల విచారణ వేరే రాష్ట్రానికి బదిలీ చేయలేమని జస్టిస్ బీవీ నాగరత్న స్పష్టం చేశారు. ఈ కేసులను హైకోర్టు చూసుకుంటుందన్నారు. త్వరగా విచారణ జరపాలని కోరుతామని వెల్లడించారు.ఈ కేసుతో మీకు సంబంధం ఏంటని రఘురామ కృష్ణంరాజు తరఫు న్యాయవాదిని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. సీబీఐ తరఫు న్యాయవాది ఈ కేసులో వాదనలకు సమయం కోరారు. దాంతో విచారణను వచ్చే సోమవారానికి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. కేసులు విచారణను హైకోర్టు పర్యవేక్షిస్తుందని సీనియర్ న్యాయవాది ముకుల్.. కోర్టుకు తెలిపారు. ట్రయల్ కోర్టులో డిశ్చార్జ్ పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయని ముకుల్ తెలిపారు. రాజకీయపరమైన పిటిషన్‌గా ముకుల్ పేర్కొన్నారు.ఇదీ చదవండి: తనది రాక్షసపాలనే అని చెప్పడమే బాబు ఆంతర్యమా? -
సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ తరఫు న్యాయవాదుల పిటిషన్
-
పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టుకు బీఆర్ఎస్
సాక్షి, ఢిల్లీ: పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ పార్టీ (BRS Party).. సుప్రీంకోర్టు(Supreme Court)ను ఆశ్రయించింది. రెండు పిటిషన్లను బీఆర్ఎస్ దాఖలు చేసింది. ఏడుగురు ఎమ్మెల్యేల ఫిరాయింపు(Defections)పై రిట్ పిటిషన్ వేసింది. పోచారం, కాలె యాదయ్య, సంజయ్‌కుమార్, కృష్ణమోహన్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి, ప్రకాష్‌గౌడ్, గాంధీలపై రిట్ వేయగా, ముగ్గురు ఎమ్మెల్యేలపై ఎస్ఎల్పీ వేసింది. దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరిలపై ఎస్ఎల్పీ దాఖలు చేసింది. పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ స్పీకర్ కనీసం ఎమ్మెల్యేలకు నోటీసు ఇవ్వలేదని పిటిషన్లో బీఆర్ఎస్ పేర్కొంది. స్పీకర్ ఇంకా నిర్ణయం తీసుకోకపోవడంపై బీఆర్ఎస్.. సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అనర్హత పిటిషన్లపై వెంటనే స్పీకర్ చర్యలు తీసుకునేలా ఆదేశించాలని బీఆర్ఎస్ కోరింది. కాగా, ప్రస్తుతం ఢిల్లీలోనే బీఆర్ఎస్ నేత హరీష్‌రావు ఉన్నట్లు సమాచారం.పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని గత ఏడాది.. స్పీకర్ కార్యాలయానికి హైకోర్టు సూచించిన సంగతి తెలిసిందే. అయితే, మూడు నెలలు గడిచినా స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ఎమ్మెల్యేల ఫిరాయింపు అంశంపై సుప్రీంకోర్టుకు వెళ్లింది.2024లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 39 స్థానాల్లో విజయం సాధించగా, ఆ తర్వాత సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య రోడ్డు ప్రమాదంలో మృతిచెందింది. ఉప ఎన్నికల్లో సిట్టింగ్ స్థానాన్ని బీఆర్ఎస్ పార్టీ కోల్పోయింది. దీంతో పార్టీ బలం 38 మంది ఎమ్మెల్యేలకు తగ్గింది. కాగా.. భద్రాచలం, బాన్సువాడ, ఖైరతాబాద్, స్టేషన్ ఘన్ పూర్, జగిత్యాల, చేవెళ్ల, గద్వాల్, రాజేంద్రనగర్, పటాన్ చెరువు, శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఇదీ చదవండి: ఫార్ములా కేసులో ఈడీ ముందుకు కేటీఆర్.. -
నేడు కేటీఆర్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ
-
వారు జేఈఈ–అడ్వాన్స్‌డ్‌కు రిజిస్టర్ చేసుకోవచ్చు: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: ఐఐటీల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు వీలు కల్పించే జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్(జేఈఈ)–అడ్వాన్స్డ్ పరీక్షను అభ్యర్థులు కేవలం రెండుసార్లు రాసుకొనేలా జాయింట్ అడ్మిషన్ బోర్డు(జేఏబీ) తీసుకున్న నిర్ణయంలో జోక్యం చేసుకొనేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. జేఈఈ– అడ్వాన్స్డ్ ప్రయత్నాల సంఖ్యను మూడు నుంచి హఠాత్తుగా రెండుకు తగ్గించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జి మాసిహ్‌తో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. 2024 నవంబర్ 5 నుంచి 18వ తేదీ వరకు తమ కోర్సుల నుంచి డ్రాప్ అయిన అభ్యర్థులు జేఈఈ–అడ్వాన్స్డ్–2025 పరీక్ష రాసేందుకు రిజిస్టర్ చేసుకోవచ్చని స్పష్టంచేసింది. ఈ మేరకు ధర్మాసనం ఉత్తర్వు జారీ చేసింది. ప్రయత్నాల సంఖ్యను మూడు నుంచి రెండుకు తగ్గించడం వల్ల తాము నష్టపోతామని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
అలహాబాద్ హైకోర్టు నిర్ణయంతో అన్యాయం జరగదు
న్యూఢిల్లీ: శ్రీ కృష్ణ జన్మభూమి– షాహి ఈద్గా మసీదు వివాదానికి సంబంధించి హిందూ పిటిషనర్లు వేసిన 15 పిటిషన్లపై ఒకేసారి విచారణ చేపట్టాలన్న అలహాబాద్ హైకోర్టు నిర్ణయం సహేతుకంగానే ఉందని, ఇరువర్గాల వారికీ న్యాయం జరుగుతుందని సుప్రీంకోర్టు పేర్కొంది. హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మసీదు కమిటీ వేసిన పిటిషన్‌పై శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్ల ధర్మాసనం విచారణ చేపట్టింది. 1991నాటి ప్రార్థనాస్థలాల చట్టానికి సంబంధించిన కేసుల విచారణలో ఉన్నామని, ఈ దశలో ఈ అంశంలో జోక్యం చేసుకోలేమని తెలిపింది. అవసరమనిపిస్తే తర్వాత దీనిపై విచారణ చేపడతామని పేర్కొంది. అయితే, హైకోర్టులో దాఖలైన పిటిషన్లన్నీ ఒకే అంశానికి సంబంధించినవి కాకున్నా అన్నిటినీ కలిపి విచారించనుండటంతో తమకు అన్యాయం జరుగుతుందని మసీదు తరఫు లాయర్ వాదించారు. ఎలాంటి సంక్లిష్ట పరిస్థితులు తలెత్తేందుకు అవకాశం లేదని స్పష్టం చేసిన ధర్మాసనం.. ఏప్రిల్ మొదటి వారంలో ఈ పిటిషన్‌పై విచారణ చేపడతామని తెలిపింది. మసీ దులు, దర్గాలు తదితర ప్రార్థనాస్థలాలకు సంబంధించిన పిటిషన్లపై ఎలాంటి ఉత్తర్వులూ ఇవ్వొద్దని అన్ని కోర్టులకు సుప్రీంకోర్టు డిసెంబర్ 12న ఆదేశాలివ్వడం తెలిసిందే. అదేవిధంగా, మందిరం– మసీదు వివాదంపై హిందూ పక్షం వేసిన 15 అప్పీళ్లపై ఒకే దఫాలో విచారణ చేపడతామని గతేడాది జనవరి 11వ తేదీన అలహాబాద్ హైకోర్టు ప్రకటించింది. -
న్యాయం నా వైపే ఉంది.. సుప్రీంకోర్టులోనే తేల్చుకుంటా: చెవిరెడ్డి
సాక్షి, విజయవాడ: చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేయడంతో ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నారు. న్యాయం తన వైపే ఉందని.. హైకోర్టు నిర్ణయంపై సుప్రీంకోర్టుకు వెళ్తానన్నారు. ఘటన జరిగిన రోజు బాలిక తండ్రి పిలిస్తేనే తాను వెళ్లానని.. కానీ తనపై అనవసరంగా ఫోక్సో కేసు పెట్టారని చెవిరెడ్డి అన్నారు. ఈ కేసును సుప్రీంకోర్టులోనే తేల్చుకుంటానని చెవిరెడ్డి స్పష్టం చేశారు.అసలు జరిగింది ఇదే..కాగా, తిరుపతి జిల్లాలో ఓ బాధిత బాలికకు అండగా నిలిచినందుకు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై ఏకంగా 11 సెక్షన్ల కింద అక్రమ కేసు నమోదు చేయడం చంద్రబాబు సర్కారు అరాచక పాలన, దుర్మార్గాలకు పరాకాష్టగా నిలుస్తోంది. చంద్రగిరి నియోజకవర్గం ఎర్రావారిపాలెం మండలానికి చెందిన 14 ఏళ్ల బాలిక పాఠశాల నుంచి వస్తుండగా కొద్ది రోజుల క్రితం కొందరు యువకులు దాడి చేసి అపహరించుకుపోయారు.కుమార్తె కోసం గాలిస్తూ వచ్చిన ఆమె తండ్రి ముళ్ల పొదల్లో బాధితురాలిని గుర్తించినట్లు చెప్పారు. ‘బడి నుంచి వస్తున్న నా బిడ్డపై దుర్మార్గులు దాడి చేశారు. ముళ్ల పొదల్లో పడవేశారు. ముసుగు ధరించిన ఇద్దరు వ్యక్తులు అడ్డగించి కత్తితో దాడిచేశారు. నీళ్లలో మత్తు బిళ్లలు కలిపి తాగించారు. చేతిపై, కడుపుపై కత్తితో కోశారు. గంటవరకు బాలిక సృహలో లేదు.నా పరువు పోయినా పరవాలేదు.. పోలీసులు నిందితులను పట్టుకుని స్టేషన్‌కు తెచ్చి ఉరితీయాలి.. అప్పుడే మాకు న్యాయం జరిగినట్లు..’ అంటూ బాధిత బాలిక తండ్రి విలపించాడు (ఆ వీడియో కూడా ఉంది). ఈ ఘటన గురించి తెలియడంతో వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చలించిపోయారు. వెంటనే 80 కిలోమీటర్లు దూరం ప్రయాణించి బాధిత బాలికను, కుటుంబ సభ్యులను పరామర్శించి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. పరామర్శించేందుకు వెళ్లి న్యాయం కోసం నిలబడిన చెవిరెడ్డిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. -
నిబంధనలు పాటిస్తే బ్యాంకులదే బాధ్యత
అనధికార లావాదేవీలను గుర్తించడానికి, వాటిని నిరోధించడానికి బ్యాంకులు సాంకేతిక సామర్థ్యాలను ఉపయోగించాలని గువాహటి హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు(Supreme Court) ఇటీవల సమర్థించింది. థర్డ్ పార్టీ యాప్స్, టూల్స్ ఉల్లంఘనల వల్ల తలెత్తే అనధికార లావాదేవీలను బ్యాంకులే కట్టడి చేయాలని తేల్చి చెప్పింది. ఈ విషయంలో నిబంధనల ప్రకారం నడుచుకున్న వినియోగదారులపై ఎలాంటి భారం మోపకూడదని, పూర్తి బాధ్యత బ్యాంకులదేనని ఆర్బీఐ మార్గదర్శకాలను ఉటంకించింది. తన ఖాతాలో మోసపూరిత లావాదేవీలు జరిగినట్లు నివేదించిన భౌమిక్ అనే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) వినియోగదారుడికి రూ.94,204.80 తిరిగి చెల్లించాలని భారత సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు ఇచ్చింది.అసలేం జరిగిందంటే..పల్లబ్ భౌమిక్ అనే ఎస్బీఐ కస్టమర్ ఆన్లైన్లో ఓ వస్తువు కొనుగోలు చేశాడు. అది డెలివరీ అయ్యాక తనకు కొన్ని కారణాల వల్ల ప్రోడక్ట్ రిటర్న్ పెట్టాడు. రిటర్న్ ప్రాసెస్ పూర్తవ్వడానికి, తన పేమెంట్ రిటర్న్ చేయడానికి కొన్ని వివరాలు చెప్పాలంటూ కస్టమర్ సర్వీస్‌గా నటిస్తూ భౌమిక్‌కు ఒక వ్యక్తి నుంచి కాల్ వచ్చింది. అతను అనధికార లావాదేవీలను సులభతరం చేసే మొబైల్ యాప్(Mobile App)ను డౌన్లోడ్ చేయమని ఆదేశించాడు. కానీ తాను ఎలాంటి నగదును తిరిగి పొందలేదని భౌమిక్ చెప్పాడు. దీనికి సంబంధించి 24 గంటల్లోనే బ్యాంకుకు సమాచారం అందించాడు. కానీ బ్యాంకు రీఫండ్ ఇవ్వలేదు. దాంతో భౌమిక్ కోర్డును ఆశ్రయించాడు. ఆ క్రమంలో భౌమిక్ ఓటీపీలు, ఎంపీఐఎన్లు వంటి సున్నితమైన సమాచారాన్ని సైబర్ మోసగాళ్లతో షేర్ చేసుకున్నాడని ఎస్బీఐ మొదట్లో వాధించింది. అయితే, తాను ఎలాంటి సమాచారాన్ని పంచుకోలేదని, రిటైలర్ వెబ్సైట్లో డేటా ఉల్లంఘన కారణంగానే ఈ మోసం జరిగిందని భౌమిక్ పేర్కొన్నాడు.ఇదీ చదవండి: ఆహార వృథాను తగ్గిస్తూ.. ఆకలి తీరుస్తూ..థర్డ్ పార్టీ యాప్‌లు, ఆన్లైన్ టూల్స్(Online Tools) ఉల్లంఘనల వల్ల జరిగే అనధికార లావాదేవీలకు వినియోగదారులను బాధ్యులను చూయకూడదని ఆర్బీఐ మార్గదర్శకాలను ఉటంకిస్తూ గౌహతి హైకోర్టు సింగిల్ బెంచ్, డివిజన్ బెంచ్ భౌమిక్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చాయి. దీన్ని సవాలు చేస్తూ ఎస్బీఐ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు తీర్పును సమర్థించింది. వినియోగదారుడికి రూ.94,204.80 తిరిగి చెల్లించాలని ఇటీవల తీర్పు ఇచ్చింది. -
లోపలకు వచ్చినంత మాత్రాన దాడి చేస్తారా?
సాక్షి, న్యూఢిల్లీ: ‘ఇంటి లోపలకు వచ్చినంత మాత్రాన జర్నలిస్ట్‌పై దాడి చేస్తారా’అంటూ సినీనటుడు మంచు మోహన్‌బాబును సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. మరోపక్క మోహన్‌బాబుపై కఠిన చర్యలు తీసుకోవద్దంటూ రాష్ట్ర పోలీసులకు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. గతేడాది డిసెంబర్ 10న జల్పల్లిలోని తన నివాసం వద్ద జర్నలిస్ట్‌పై దాడి కేసులో మోహన్‌బాబుకు హైకోర్టులో ముందస్తు బెయిల్ రాలేదు. దీంతో ఆయన డిసెంబర్ 24న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను గురువారం జస్టిస్ సుధాంశు దులియా, జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. జర్న లిస్ట్‌పై దాడి జరిగిన సందర్భాన్ని మోహన్‌బాబు తరఫు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ ధర్మాస నానికి తెలిపారు. క్షణికావేశంలో మోహన్‌బాబు జర్నలిస్ట్ మైక్ లాక్కొని, అదే మైక్‌ను విసిరారన్నారు. అయితే ఈ ఘటనపై బహిరంగ క్షమాపణలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని, అవసరమైతే బాధిత జర్నలిస్ట్‌కు నష్టపరిహారం చెల్లించేందుకు సుముఖంగా ఉన్నారని అభ్యర్థించారు. దవడ విరగడంతో.. పైపు ద్వారా ఆహారంమోహన్బాబు దాడి చేయడం వల్లే జర్నలిస్ట్ దవడ విరిగిందని ఆయన తరఫు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసు కెళ్లారు. ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలని కోరేందుకే మోహన్ బాబు కుటుంబ సభ్యులతో కలిసి ఆస్పత్రికి వెళ్లారని ధర్మాస నానికి గుర్తు చేశారు. ఈ సందర్భంగా ముకుల్ రోహత్గీ జోక్యం చేసుకొని మోహన్‌బాబు జర్నలిస్ట్‌ను బెదిరించలేదని, అయినా హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారన్నారు. మోహన్‌బాబు ఇంటిపైకి 20–30 మంది వచ్చారని, ఇది అతిక్రమణ కిందకు వస్తుందని చెప్పారు. మోహన్‌బాబు పేరున్న నటుడని, ఎవరినైనా చంపడం, బాధపెట్టడం ఆయనకు ఇష్టం లేదని ముకుల్ రోహత్గీ ధర్మాసనానికి తెలిపారు. ప్రతివాదులకు నోటీసులు జారీ ఈ వాదనలపై జస్టిస్ దులియా స్పందిస్తూ..ఎవరైనా ఇంటిలోపలకు వచ్చినంత మాత్రాన దాడి చేస్తారా అని మోహన్‌బాబు తరపు అడ్వొకేట్ రోహిత్గీని ప్రశ్నించారు. అయితే ఇరుపక్షాలు వాదనలు విన్న ధర్మాసనం..ప్రతివా దిగా ఉన్న బాధితుడు పరిహారం కోరుకుంటున్నారా చెప్పాలని కోరింది. దీనిపై జర్నలిస్ట్ న్యాయవాదితో మాట్లాడి, ఆయనకు ఏం కావాలో చేస్తానని ముకుల్ రోహత్గీ కోర్టుకు తెలిపారు. దీంతో తదుపరి విచారణ వరకు మోహన్‌బాబుపై బలవంతపు చర్యలు వద్దని పోలీసులను ఆదేశించింది. మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఈ కేసులో ప్రతివాదులుగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి, జర్నలిస్ట్‌కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే నెల 13కు వాయిదా వేస్తున్నట్టు వెల్లడించింది. -
మోహన్ బాబును జైలుకు పంపాలా..? నష్టపరిహారం కావాలా..?: సుప్రీంకోర్టు
కొద్దిరోజుల క్రితం జర్నలిస్టుపై దాడి చేసిన కేసులో సినీ నటుడు మోహన్‌బాబుకు సుప్రీంకోర్టులో (Supreme Court ) స్వల్ప ఊరట లభించింది. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఆయన సుప్రీం కోర్టులో పిటిషన్ పెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై జస్టిస్ సుధాంశు దులియా, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా విచారణ జరిపారు. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణ జరిగే వరకు మోహన్‌బాబుపై (Mohan Babu) ఎలాంటి చర్యలు తీసుకోకవద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.అయితే, విచారణలో భాగంగా న్యాయస్థానం పలు ప్రశ్నలు అడిగింది. జర్నలిస్టులు లోపలికి వచ్చినంత మాత్రాన దాడి చేస్తారా.. ? అంటూ నటుడు మోహన్ బాబును సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అది ఆవేశంలో జరిగిన ఘటన అని, బాధితుడికి పూర్తి నష్టపరిహారం చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నట్లు మోహన్ బాబు తరపు న్యాయవాది ముకుల్ రోహిత్గి తెలిపారు. అయితే, ఈ కేసుకు సంబంధించి నష్టపరిహారం కావాలా.. ? మోహన్ బాబును జైలుకు పంపాలా..? అని జర్నలిస్టు తరపు న్యాయవాదిని సుప్రీంకోర్టు అడిగింది. అయితే, ఈ అంశం గురించి తదుపరి విచారణలో సమాధానం ఇస్తామని జర్నలిస్ట్ తరఫు న్యాయవాది చెప్పడంతో మూడు వారాల్లోపు కౌంటర్ దాఖలు చేయాలని రంజిత్ కుమార్‌ను కోర్టు ఆదేశించింది.(ఇదీ చదవండి: 400 ఏళ్ల నాటి గుడి కాన్సెప్ట్‌తో సినిమా.. గ్లింప్స్‌తోనే హైప్)మోహన్ బాబు తరపు న్యాయవాది ముకుల్ రోహిత్గి ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో ఇలా వాదనలు వినిపించారు. జర్నలిస్టులకు ఆహ్వానం లేకుండానే ఎందుకు ఇంటికి వచ్చారని న్యాయవాది ప్రశ్నించారు. అయినప్పటికీ ఇది ఆవేశంలో జరిగిన ఘటనగా చూడాలని కోరుతున్నట్లు తెలిపారు. ఈ సంఘటనతో జర్నలిస్ట్‌కు క్షమాపణలు చెపుతున్నట్లు ఆయన తెలిపారు. అయితే, నష్టపరిహారం చెల్లించేందుకు మోహన్ బాబు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ప్రస్తుతం ఆయన వయసు 76 సంవత్సరాలు కాబట్టి ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలని న్యాయస్థానాన్ని ముకుల్ కోరారు. అయితే, మోహన్ బాబు దాడిలో తీవ్రంగా గాయపడ్డానని జర్నలిస్ట్ కోర్టుకు తెలిపారు. ఆ కారణంగా ఐదు రోజులపాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకోవాల్సి వచ్చిందని ఆయన అన్నారు. ఈ దాడి వల్ల వృత్తిపరంగా తనకు నష్టం జరిగిందని జర్నలిస్ట్ తెలిపారు. -
సుప్రీంకోర్టులో కేటీఆర్ పిటిషన్
-
సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేటీఆర్
సాక్షి,హైదరాబాద్: ఫార్ములా ఈ-కార్ రేస్ కేసు(Formula E Car Race Case)లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు(Supreme Court)లో ఆయన సవాల్ చేశారు.ఫార్ములా ఈ కార్ రేసు కేసులో ఏసీబీ కేసును కొట్టేయాలని కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. ఏసీబీ దర్యాప్తులో మేం జోక్యం చేసుకోం అని తీర్పు సందర్భంగా పేర్కొంది. అయితే ఆ సమయంలో అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని కేటీఆర్ తరఫు న్యాయవాది కోరగా.. ఆ విజ్ఞప్తిని ధర్మాసనం పరిగణనలోకి తీసుకోలేదు.ఈ కేసులో తాజా పరిణామాలపై ఏసీబీ ఆఫీసులో అధికారులు భేటీ అయ్యారు. ఎఫ్ఈవో, హెచ్‌డీఏతో పాటు రెవెన్యూ అధికారుల పాత్రపై చర్చించడంతో పాటు సుప్రీం కోర్టును కేటీఆర్ ఆశ్రయించడంతో.. అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా చర్చించారు.మరో వైపు.. అధికారులు అరవింద్‌కుమార్, బీఎల్ఎన్రెడ్డి నోటీసులపై చర్చతో పాటు, మొదటి రేసు తర్వాత తప్పుకున్న కంపెనీలపై కూడా చర్చించారు. ఏసీబీ ఉన్నతాధికారులతో బంజారాహిల్స్ ఏసీపీ,సీఐతో పాటు కొంతమంది సిబ్బంది సమావేశమయ్యారు. క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేయడంతో సుప్రీంకోర్టును కేటీఆర్ ఆశ్రయించారు. కాగా, తమ వాదన కూడా వినాలని ప్రభుత్వం.. కేవీయట్ వేసింది.ఇదీ చదవండి: కేటీఆర్‌దే బాధ్యత.. ఎఫ్ఐఆర్ క్వాష్ అరుదైన నిర్ణయం: హైకోర్టు -
సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్.. విచారణ వాయిదా
కొద్దిరోజుల క్రితం జర్నలిస్టుపై దాడి చేసిన కేసులో చిక్కుకున్న సినీ నటుడు మోహన్‌బాబు ముందస్తు బెయిల్ కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అయితే, ఇదే కేసులో ఆయనకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించిన విషయం తెలిసిందే. దీంతో ఆయన తాజాగా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సోమవారం ఈ పిటిషన్‌పై జస్టిస్ సుధాంశు దులియా, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా విచారణ జరిపారు. సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి అందుబాటులో లేకపోవడంతో మోహన్ బాబు తరపు న్యాయవాది పాస్ ఓవర్ కోరారు. అందుకు అంగీకరించని న్యాయస్థానం విచారణను గురువారానికి వాయిదా వేసింది.ఏం జరిగిందంటే?ఇటీవల మోహన్‌బాబు, మనోజ్ మధ్య జరిగిన ఘర్షణ నేపథ్యంలో మీడియా ప్రతినిధులు జల్పల్లిలోని ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు. ఆ సమయంలో జర్నలిస్టు రంజిత్‌పై మోహన్‌బాబు మైక్‌తో దాడి చేశారు. దీంతో ఆయన పహడీ షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మోహన్‌బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు.మోహన్ బాబు, మంచు మనోజ్ వివాదంలో ఇప్పటికే మూడు ఎఫ్ఐఆర్లు నమోదు చేశామని రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపిన విషయం తెలిసిందే. ఇందులో జర్నలిస్ట్‌పై దాడికి సంబంధించిన కేసులో ఆయన తెలంగాణ హైకోర్టును గతంలో ఆశ్రయించారు. అయితే, డిసెంబర్ 24న పోలీసుల ముందు హాజరు కావాలని కోర్టు జారీ చేసిన ఆదేశాలను ఆయన ఉల్లంఘించడంతో ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వబోమని న్యాయస్థానం తెలిపింది. దీంతో ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు. నేడు ఆయన దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ జరగనుంది. జస్టిస్ సుధాంశు దులియా, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా నేతృత్వంలో విచారణ జరగనుంది. -
వాంగ్మూలాలు మార్చేసి.. ‘సుప్రీం’ను ఏమార్చాలి
సాక్షి, అమరావతి : సీఆర్పీసీ 164 వాంగ్మూలాలు మార్చాలి.. సుప్రీంకోర్టును ఏమార్చాలి.. ఏం చేసినా ఈ నెల 21లోగా చేసేయాలి.. అందుకు ఎంతకైనా బరితెగించాలన్నది టీడీపీ కూటమి ప్రభుత్వ కుట్రగా స్పష్టమవుతోంది. సీఐడీని అడ్డుపెట్టుకుని ఈ కుతంత్రానికి పాల్పడుతోంది. చంద్రబాబుపై అవీనీతి కేసులను నీరుగార్చడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. న్యాయస్థానంలో సీఆర్పీసీ 164 కింద వాంగ్మూలాలు ఇచ్చిన అధికారుల సంగతి తేలుస్తామని ఎన్నికల ముందు లోకేశ్ హెచ్చరించినట్టుగానే.. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం న్యాయస్థానాల్లో ఉన్న కేసులను ప్రభావితం చేసేలా అక్రమాలకు పాల్పడుతోంది. అబద్ధపు వాంగ్మూలాలు ఇప్పించి ఏకంగా సుప్రీంకోర్టునే ఏమార్చేందుకు బరితెగిస్తోంది. చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై ప్రస్తుతం సీఐడీ వరుసగా వాయిదాలు కోరుతుండటంపై సుప్రీంకోర్టు ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేయడంతో టీడీపీ కూటమి ప్రభుత్వం హడలిపోతోంది. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్టు అయిన చంద్రబాబు.. ప్రస్తుతం బెయిల్‌పై ఉన్న విషయం తెలిసిందే. ఆయనకు హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని గతంలోనే సీఐడీ దాఖలు చేసిన పిటిషన్, సుప్రీంకోర్టులో విచారణలో ఉంది. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ పిటిషన్ అంశంలో సీఐడీ ప్లేటు ఫిరాయించింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణకు ప్రభుత్వ న్యాయవాది ముకుల్ రోహత్గీ వరుసగా వాయిదాలు కోరుతుండటం గమనార్హం. గత విచారణకు కూడా ఆయన నేరుగా హాజరు కాకుండా వర్చువల్‌గా పాల్గొని వాదనలు వినిపించకుండా మరోసారి వాయిదా కోరారు. వరుస వాయిదాలు కోరడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోసారి వాయిదా ఇవ్వమని స్పష్టం చేస్తూ తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. దాంతో ఈ నెల 21న సుప్రీంకోర్టు విచారణకు హాజరై చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై సీఐడీ తరఫు న్యాయవాది తప్పనిసరిగా తన వాదనలు వినిపించాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. ఆ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సీఐడీ దాఖలు చేసిన కేసునే ఆయన వాదిస్తున్నారు. అంటే నిబంధనల ప్రకారం చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని ఆయన వాదనలు వినిపించాలి. కానీ ఈ పిటిషన్ వీగిపోయేలా చేసేందుకే ప్రస్తుత సీఐడీ ఉన్నతాధికారులు, ప్రభుత్వ పెద్దలు కుట్రలకు పదును పెడుతున్నారు. ఈ నెల 21లోగా తిమ్మిని బమ్మి చేసేందుకు బరితెగిస్తున్నారు. అబద్ధపు వాంగ్మూలాలతో ‘సుప్రీం’ను ఏమార్చే కుట్ర 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో కుంభకోణాలకు చంద్రబాబే ప్రధాన కుట్రదారు అని ఐఏఎస్ అధికారులు చెరుకూరి శ్రీధర్, అజయ్ జైన్, కాంతిలాల్ దండే స్పష్టం చేశారు. ఆమేరకు 164 సీఆర్పీసీ కింద న్యాయస్థానంలో వాంగ్మూలాలు నమోదు చేశారు. ఈ కేసులో ఆ వాంగ్మూలాలు కీలక సాక్ష్యంగా నిలుస్తున్నాయి. అందుకే వారిపై టీడీపీ కూటమి ప్రభుత్వం గురి పెట్టింది. గతంలో ఇచ్చిన వాంగ్మూలాలకు పూర్తి విరుద్ధంగా అబద్ధపు వాంగ్మూలాలను సీఆర్పీసీ 164 కింద మరోసారి నమోదు చేయించేందుకు కుతంత్రం పన్నుతోంది.సీఆర్పీసీ 164 కింద ఓసారి ఇచ్చిన వాంగ్మూలానికి విరుద్ధంగా మరో వాంగ్మూలం ఇవ్వడం తీవ్రమైన నేరంగా పరిగణిస్తారని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అయినా సరే ఈ నెల 8న ఆ అధికారులతో అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేయించాలని సీఐడీ పట్టుబడుతోంది. ఈ నెల 21లోగా అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేయించి, ఆ విషయాన్ని ప్రస్తావించడం ద్వారా సుప్రీంకోర్టును ఏమార్చేందుకు పన్నాగం పన్నింది. అప్పుడే హెచ్చరించిన లోకేశ్సీఆర్పీసీ 164 కింద న్యాయస్థానంలో వాంగ్మూలం ఇవ్వడమన్నది రాజ్యాంగం కల్పించిన అవకాశం. ప్రమాణ పూర్తిగా ఇచ్చే ఆ వాంగ్మూలాలకు న్యాయస్థానం రక్షణ కల్పిస్తోంది. కానీ అంతటి కీలకమైన 164 వాంగ్మూలాలను కూడా నారా లోకేశ్ ప్రశ్నించడం విభ్రాంతికరం. ఎన్నికల ముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు అవినీతిని బట్టబయలు చేస్తూ ఐఏఎస్ అధికారులు 164 సీఆర్పీసీ కింద వాంగ్మూలాలు ఇవ్వడమేమిటని ప్రశ్నించారు. అందుకే రెడ్‌బుక్ రాస్తున్నామని, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ అధికారుల సంగతి తేలుస్తామని హెచ్చరించారు.అప్పటికే న్యాయస్థానంలో విచారణలో ఉన్న అంశంపై ఆయన మాట్లాడటం, సాక్షులను బెదిరించడం న్యాయ ధిక్కారమేనని పరిశీలకులు స్పష్టం చేశారు. లోకేశ్ ముందుగా చెప్పినట్టుగానే టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. గతంలో 164 సీఆర్పీసీ వాంగ్మూలాలు ఇచ్చిన అధికారులను ప్రభుత్వం వేధిస్తోంది. వారితో అబద్ధపు వాంగ్మూలాలు ఇప్పించేందుకు సీఐడీ ద్వారా బరితెగిస్తోంది. ఇది కచ్చితంగా చంద్రబాబుపై అవినీతి కేసుల విచారణను ప్రభావితం చేయడమేనని పరిశీలకులు తేల్చి చెబుతున్నారు. దీన్ని న్యాయస్థానాలు తీవ్రంగా పరిగణించాలని కోరుతున్నారు. -
సుప్రీంకోర్టు రిఫర్ చేసిన కేసులో ఇంత నిర్లక్ష్యమా? మార్గదర్శి’ వ్యవహారంపై ఇంకెన్నాళ్లకు కౌంటర్లు దాఖలు చేస్తారు?
-
డేరా బాబాకు ‘సుప్రీం’ నోటీసులు
ఛండీగఢ్: ఇద్దరు మహిళలపై లైంగికదాడికి పాల్పడ్డాడన్న కేసులో జైలు శిక్షను అనుభవిస్తున్న డేరా సచ్చా సౌదా అధిపతి గుర్మీత్ రామ్ రహీమ్ (dera baba)కు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. 2002లో డేరా బాబా మాజీ మేనేజర్ రంజిత్ సింగ్ హత్య కేసుకు సంబంధించి డేరా బాబాతో పాటు మరో నలుగురికి సుప్రీం కోర్టు (supreme court) ధర్మాసనం శుక్రవారం నోటీసులు జారీ చేసింది.రంజిత్ సింగ్ హత్య కేసులో డేరా బాబా, అతని సహ నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ పంజాబ్, హర్యానా హైకోర్టు ఇచ్చిన నిర్ణయాన్ని సవాలు చేస్తూ సీబీఐ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇవాళ ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టిన దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నోటీసులు పంపింది. కేసులో విచారణకు కోర్టు ఎదుట హాజరు కావడం లేదంటే, విచారణకు సహకరించాలని సూచించింది. ఈ కేసును సుప్రీం కోర్టు జస్టిస్ బేలా ఎం త్రివేది నేతృత్వంలోని సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించనుంది. 24ఏళ్ల నాటి కేసు పూర్వా పరాల్ని పరిశీలిస్తే 2002లో పంజాబ్ విద్యార్థిని, డేరాబాబా శిష్యురాలు పేరుతో నాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ (atal bihari vajpayee), కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు, సీబీఐ, జాతీయ మానవ హక్కుల కమిషన్ (nhrc), పంజాబ్, హర్యానా ముఖ్యమంత్రులకు హిందీలో ఓ ఆకాశ రామన్న ఉత్తరం అందింది. ఆ లేఖలో సిర్సా కేంద్రంగా డేరా సచ్చా సౌదా నిర్వహిస్తున్న గుర్మీత్ దైవత్వం పొందే మార్గమంటూ దాదాపు 400 మంది శిష్యులను నంపుసకులుగా మార్చారని, సాధ్వీలపై అత్యాచారానికి పాల్పడ్డారని, తిరగబడిన వారిని హత్య చేసేవారంటూ పలు ఆధారాల్ని ఆ లేఖలో పొందుపరిచింది. అప్పటి వరకు కోట్లాది మంది భక్తులకు దైవంగా విరాజిల్లిన డేరాబాబాకు ఆ లేఖతో పతనం మొదలైంది. ఆయన భక్తులు డేరా బాబాపై తిరగబడ్డారు.ఆకాశ రామన్న ఉత్తరం రాసింది ఎవరంటే అయితే అదే సమయంలో 2002, జులై 10న డేరా బాబా మేనేజర్ రంజిత్ సింగ్ హర్యానా రాష్ట్రం కురుక్షేత్ర నగరానికి చెందిన కాన్పూర్ కాలనీలో అనుమానాస్పద రీతిలో మరణించారు. డేరాబాబా ఆకృత్యాలను ఎదిరించేలా రాసింది శిష్యురాలు కాదని, మేనేజర్ రంజిత్ సింగేనన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. హత్యకేసులో దోషులుగాఅదే సమయంలో రంజిత్ సింగ్ దారుణు హత్యకు గురయ్యాడు. అనుమానాస్పద మృతి కేసును 2021లో హర్యానా పంచాకుల సీబీఐ విచారించింది. విచారణలో రంజిత్ సింగ్ మృతిలో డేరాబాబాతో పాటు అవతార్ సింగ్, కృష్ణలాల్, జస్బీర్ సింగ్, సబ్దీల్ సింగ్‌లను దోషులుగా పరిగణించింది. నిందితులకు జీవిత ఖైదు విధించింది.కేసుల నుంచి విముక్తి కల్పించండిఈ నేపథ్యంలో మే 2024లో డేరాబాబా తనపై నమోదైన అత్యాచార కేసులు, జర్నలిస్ట్ రామచందర్ ఛత్రపతి హత్యకేసులో తనని నిర్ధోషిగా ప్రకటించాలని కోరుతూ కోర్టులలో పిటిషన్లు దాఖలు చేశారు. విచారణ చేపట్టిన పంజాబ్, హర్యానా హైకోర్టు, సీబీఐ కోర్టు డేరాబాకుకు విధించిన శిక్షను రద్దు చేసింది. రంజిత్ సింగ్ హత్య కేసులో మొత్తం ఐదుగురు నిందితులను నిర్దోషులుగా ప్రకటించింది.తాజాగా, ఈ కేసులో సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో సుప్రీం కోర్టు సైతం కేసు తదుపరి విచారణ చేపట్టేందుకు సిద్ధమైంది. 2017 నుంచి జైలు జీవితం2017లో ఇద్దరు శిష్యులపై అత్యాచారానికి పాల్పడిన కేసులో దోషిగా నిర్ధారణ అయిన తరువాత సీబీఐ కోర్టు అతనికి 20 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. రెండు అత్యాచారాలకు సంబంధించిన కేసులో దోషిగా శిక్ష అనుభవించడంతో పాటు పలు హత్యల్లో హర్యానాలోని రోహ్తక్ జైలులో జీవిత ఖైదు ఎదుర్కొంటున్నాడు. రోహ్తక్ జైలులో శిక్ష అనుభవిస్తుండగా రంజిత్ సింగ్ కేసులో సీబీఐ జీవిత ఖైదు విధించింది. -
దర్యాప్తు ఎప్పుడు పూర్తి చేస్తారు?
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అదనపు ఎస్పీ మేకల తిరుపతన్న బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. ఈ కేసులో తిరుపతన్న గతేడాది అక్టోబర్‌లో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై గురువారం జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ కోటేశ్వర్‌సింగ్ ధర్మాసనం విచారణ జరిపింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తిరుపతన్న ప్రధాన నిందితుడని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.ఫోన్ ట్యాపింగ్‌తో పాటు ఆధారాలు చెరిపివేయడంలోనూ తిరుపతన్న కీలకంగా వ్యవహరించారని.. 2023 డిసెంబర్ 3న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాగానే ఆధారాలు ధ్వంసం చే శారని లూథ్రా తెలిపారు. రాజకీయ నేతల ఆదేశాల మేరకు పలువురి ఫోన్లను ట్యాప్ చేశారని, హైకోర్టు జడ్జిల ఫోన్లు కూడా ఇందులో ఉన్నాయని వివరించారు. మరోవైపు తిరుపతన్న 9 నెలలుగా జైలులో ఉన్నారని.. ఆయన పాత్రపై ఇప్పటికే చార్జిïÙట్ దాఖలైందని తిరుపతన్న తరఫు న్యాయవాది సిద్ధార్థ దవే వాదించారు. బెయిల్ పొందడం హక్కు అని.. తప్పనిసరైతేనే జైలులో ఉంచాలని సుప్రీంకోర్టు గతంలో తీర్పులిచి్చందని దవే ప్రస్తావించారు. కాగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తిరుపతన్న పాత్రపై దర్యాప్తు సుదీర్ఘకాలం కొనసాగడం సరికాదన్న ధర్మాసనం... విచారణను ఎప్పటికి పూర్తిచేస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.అంతేగాక దర్యాప్తు పేరుతో పిటిషనర్ స్వేచ్ఛను అడ్డుకోలేరని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. దర్యాప్తు పూర్తికి ఇంకా ఎంత సమయం పడుతుందో రాతపూర్వకంగా తమకు ఇవ్వాలని ఆదేశించింది. అయితే విచారణ పూర్తయ్యేందుకు మరో 4 నెలలు సమయం పడుతుందని, అఫిడవిట్ దాఖలుకు సమయం కావాలని ప్రభుత్వ తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా ధర్మాసనాన్ని కోరారు. దీంతో తదుపరి విచారణను జస్టిస్ నాగరత్న ధర్మాసనం జనవరి 27కు వాయిదా వేసింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసుపై సుప్రీం సీరియస్
-
సుప్రీమ్ కోర్టులో అసదుద్దీన్ ఒవైసీ పిటిషన్
-
ప్రార్థనా స్థలాల చట్టంపై సుప్రీంకోర్టులో ఒవైసీ పిటిషన్
సాక్షి, ఢిల్లీ: దేశంలో ప్రార్థనా స్థలాల అంశంపై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ.. సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దేశవ్యాప్తంగా ప్రార్థనా స్థలాల చట్టం 1991 అమలు చేయాలని కోర్టును ఒవైసీ కోరారు. దీంతో, ఇదే అంశంపై దాఖలైన ఇతర పిటిషన్లతో ఒవైసీ పిటిషన్ జత చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అన్ని పిటిషన్లపై వచ్చే నెల 17న విచారణ చేపట్టనున్నట్టు కోర్టు తెలిపింది.ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ.. సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దేశవ్యాప్తంగా ప్రార్థనా స్థలాల చట్టం 1991 అమలు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో నేడు చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం విచారణ జరిపింది. విచారణ సందర్భంగా ఇదే అంశంపై దాఖలైన ఇతర పిటిషన్లతో ఒవైసీ పిటిషన్ జత చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అనంతర, అన్ని పిటిషన్లపై ఫిబ్రవరి 17న విచారణ జరుపుతామని సంజీవ్ ఖన్నా ధర్మాసనం వెల్లడించింది.