
ఢిల్లీ: శ్రీలంక శరణార్థుల అంశానికి సంబంధించి దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. శ్రీలంక శరణార్థులు పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు.. ప్రపంచంలోని నలుమూలల నుంచి వచ్చే శరణార్థులకు ఆతిథ్యం ఇచ్చేందుకు భారత్ ధర్మశాల కాదని స్పష్టం చేసింది. శ్రీలంక శరణార్థుల పిటిషన్‌పై సోమవారం(మే 19 వ తేదీ) విచారించిన ధర్మాసనం... విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది.
ప్రపంచంలోని నలుమూలల నుంచి వచ్చే శరణార్థులకు ఆతిథ్యం ఇచ్చేందుకు భారత్ ధర్మశాల కాదని స్సష్టం చేసింది. ప్రపంచ నలుమూలల నుంచి వచ్చే శరణార్థులకు భారత్ ఆతిథ్యం ఇవ్వాలా? భారత్‌లో 140 కోట్ల మంది జనాభా ఉన్నారు. అన్ని ప్రాంతాల నుండి వచ్చే విదేశీ పౌరులకు ఆతిథ్యం ఇచ్చేందుకు ధర్మశాల కాదు. వెంటనే దేశంలోని శరణార్థులు దేశం విడిచి వెళ్లాలని జస్టిస్ దీపాంకర్ దత్తా వ్యాఖ్యానించారు.
కేసు పూర్వాపరాల్ని పరిశీలిస్తే.. శ్రీలంకలో ప్రత్యేక తమిళ ఈలమ్ కోసం పోరాడిన నిషేధిత తీవ్రవాద సంస్థ ఎల్టీటీఈ సానుభూతి పరుడైన శ్రీలంక జాతీయుడైన పిటిషనర్ మరో ఇద్దరు నిందితులతో కలిసి దేశంలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడంతో 2015లో ఆధారాలతో పోలీసులు అరెస్ట్ చేశారు. 2018లో పిటిషనర్‌ను దోషిగా పరిగణలోకి తీసుకున్న న్యాయ స్థానం 2018లో చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ)కింద పది సంవత్సరాల పాటు జైలు శిక్ష విధించింది. జైలు శిక్ష కొనసాగుతున్న సమయంలో 2022లోమద్రాస్ హైకోర్టు అతని శిక్షను ఏడు సంవత్సరాలకు తగ్గించడమే కాకుండా, శిక్ష పూర్తయ్యాక వెంటనే భారత్ నుండి వెళ్లాలని, ఇక్కడ ఉండకూడదనే సూచించింది. మద్రాస్ ఇచ్చిన నాటి తీర్పుతో పిటిషనర్ మరికొద్ది రోజుల్లో దేశం విడిచి వెళ్లాల్సి ఉంది.
India is not a "dharamshala" that can entertain refugees from all over the world, the Supreme Court orally observed, while refusing to interfere with the detention of a Sri Lankan Tamil national.
Read more: https://t.co/LhaVOoiHtu#SupremeCourt pic.twitter.com/6fZD2EoiRq— Live Law (@LiveLawIndia) May 19, 2025
మద్రాస్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ
కానీ తాను, భారత్‌ను విడిచి శ్రీలంకకు వెళ్లలేనని, తనని ఇక్కడే ఉండేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ మద్రాస్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై సుప్రీంకోర్టు జస్టిస్ దీపాంకర్ దత్తా, కృష్ణన్ వినోద్ చంద్రన్ (K. Vinod Chandran) నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం(మే19) విచారణ చేపట్టింది.
భారత్ ధర్మశాల కాదు
విచారణ సందర్భంగా జస్టిస్ దీపాంకర్ దత్తా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోని నలుమూలల నుంచి వచ్చే శరణార్థులకు ఆతిథ్యం ఇచ్చేందుకు భారత్ ధర్మశాల కాదు. శరణార్థులకు ఇక్కడ ఆతిథ్యం ఇవ్వలేం. వెంటనే శరణార్థులు దేశం విడిచి వెళ్లాలని ఆదేశించారు. మద్రాస్‌కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ పిటిషనర్ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది.
‘మీకు ఇక్కడ స్థిరపడేందుకు ఎలాంటి హక్కు ఉంది?’
అనంతరం, పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టులో తన వాదనలు వినిపించారు. పిటిషనర్ శ్రీలంక జాతీయుడు. శ్రీలంక నుంచి భారత్‌కు వీసాతో వచ్చాడు. తన దేశంలో ప్రాణ భయముందని అన్నారు. పిటిషనర్ మూడేళ్లపాటు జైలు కస్డడీలో ఉన్నారని, ఆ సమయంలో అతని దేశం నుంచి పంపించేందుకు ఎలాంటి చర్య తీసుకోలేదని ప్రస్తావించారు. పిటిషనర్ తరుఫు న్యాయవాది వాదనలపై సుప్రీం జస్టిస్ దీపాంకర్ దత్తా..‘మీకు ఇక్కడ స్థిరపడేందుకు ఎలాంటి హక్కు ఉంది?’ అని ప్రశ్నించారు.
భారత్ కాకుండా వేరే దేశంలో స్థిరపడండి
అందుకు.. పిటిషనర్ న్యాయవాది స్పందిస్తూ.. ‘అతను శరణార్థి. అతని భార్య, పిల్లలు ఇక్కడే స్థిరపడ్డారని ప్రకటించారు. పిటిషనర్ శ్రీలంకకు వెళితే తనకు ప్రాణ హాని ఉందన్న పిటిషనర్ అభ్యర్థనపై జస్టిస్ దీపాంకర్ దత్తా మాట్లాడుతూ.. పిటిషనర్‌కు తన దేశంలో ప్రాణ భయం ఉందని అన్నారు కదా.. భారత్‌యేతర దేశంలో స్థిరపడండి’ అని వ్యాఖ్యానించారు.
సారీ.. దేశం విడిచి వెళ్లాల్సిందే
అదే సమయంలో పిటిషనర్ 2009లో శ్రీలంక యుద్ధంలో ఎల్‌టిటి సభ్యుడిగా పాల్గొన్నట్లు చెప్పారు. అందువల్ల తాను శ్రీలంకకు వెళితే మళ్లీ అరెస్ట్ అవ్వడంతో పాటు, తన ప్రాణానికి అపాయం వాటిల్లే అవకాశం ఉందని తెలిపారు. తన భార్య ఆరోగ్యపరమైన కారణాలతో బాధపడుతుండగా, తన కుమారుడు గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు పేర్కొన్నారు. చివరిగా ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు.. జైలు శిక్ష పూర్తయిన తర్వాత దేశం విడిచి వెళ్లాలన్న మద్రాస్ హైకోర్టు తీర్పును సమర్ధించింది. శ్రీలంకకు వెళ్లే అవసరం లేకుండా భారత్‌లో స్థిరపడేందుకు అవకాశం ఇవ్వాలని పిటిషనర్ అభ్యర్థనను సున్నితంగా తిరస్కరించింది.