
భారత్, శ్రీలంక వేదికలగా జరగనున్న టీ20 వరల్డ్‌కప్-2026కు తేదీలను ఐసీసీ ఖరారు చేసినట్లు తెలుస్తోంది ఈఎస్పీఎన్ రిపోర్ట్ ప్రకారం.. ఈ మెగా టోర్నీ వచ్చే ఏడాది ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8వరకు జరగనున్నట్లు సమాచారం. ఐపీఎల్-2026కు ముందే ఈ పొట్టి ప్రపంచకప్ జరగనుంది.
ఈ మెగా ఈవెంట్‌లో మొత్తం 20 జట్లు పాల్గోనున్నాయి. ఈ మార్య్కూ ఈవెంట్‌కు శ్రీలంక, భారత్‌లోని మొత్తం ఐదు స్టేడియాలు ఆతిథ్యమివ్వనున్నాయి. అయితే సదరు రిపోర్ట్ ప్రకారం.. ఈ టోర్నీకి సంబంధించి షెడ్యూల్‌ను మాత్రం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఇంకా ఫైన్‌లైజ్ చేయలేదంట.
కానీ ఫైనల్ మ్యాచ్‌కు వేదికలగా ఆహ్మదాబాద్, కొలంబోలను పరిశీలిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ పాక్ ఫైనల్‌కు చేరుకుంటే కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో తుది పోరు జరిగే అవకాశముంది.
ఫార్మాట్ ఇదే..
ఇక టీ20 వరల్డ్‌కప్-2026 ఫార్మాట్ విషయానికి వస్తే.. గత ఎడిషన్ మాదిరిగానే నిర్వహించనున్నారు. ఈ టోర్నీలో పాల్గోనే మొత్తం జట్లను నాలుగు గ్రూపులగా విభజిస్తారు. ప్రతీ గ్రూపులో ఐదు జట్లు ఉంటాయి. లీగ్ స్టేజిలో ప్రతీ జట్టు నాలుగు మ్యాచ్‌లు ఆడుతోంది.
లీగ్ దశ ముగిసే సమయానికి ప్రతీ గ్రూపులో టాప్-2లో నిలిచే జట్లు సూపర్-8కు ఆర్హత సాధిస్తాయి. సూపర్-8 రౌండ్‌లో టాప్ 4 జట్లు సెమీఫైనల్లో అడుగుపెడతాయి. ఆ తర్వాత సెమీస్‌లో గెలిచిన రెండు జట్లు ఫైనల్లో తలపడతాయి.
ఈ ప్రపంచకప్‌లో ఓవరాల్‌గా 55 మ్యాచ్‌లు జరగనున్నాయి. ప్రస్తుతం ఈ మెగా టోర్నీ కోసం 15 జట్లు తమ బెర్త్‌లను ఖరారు చేసుకున్నాయి. మిగిలిన ఐదు జట్లు ఆఫ్రికన్, ఆసియా, తూర్పు ఆసియా పసిఫిక్ క్వాలిఫయర్స్ నుంచి ఆర్హత సాధించనున్నాయి.
చదవండి: వేలంలో రికార్డులు బద్దలు కొట్టిన డెవాల్డ్ బ్రెవిస్.. కాస్ట్‌లీ ప్లేయర్‌గా చరిత్ర