లంకకు శుభదినం.. భారత్‌కు దుర్దినం.! | OnThisDay in 2014 Sri Lanka won First World T20 | Sakshi
Sakshi News home page

Published Fri, Apr 6 2018 2:36 PM | Last Updated on Fri, Nov 9 2018 6:46 PM

OnThisDay in 2014 Sri Lanka won First World T20 - Sakshi

2014 టీ20 ప్రపంచకప్‌ విజేత శ్రీలంక, రన్నరప్‌ మెడల్స్‌తో భారత ఆటగాళ్లు (ఇన్‌సెట్‌లో)

సాక్షి, హైదరాబాద్‌ : సరిగ్గా నాలుగేళ్ల క్రితం ఇదే రోజు భారత్‌కు అందివచ్చిన అవకాశం తృటిలో చేజారింది. 2014 టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లో ప్రత్యర్థి శ్రీలకం చేతిలో భారత్‌ కంగుతిన్నది. ఇక ఈ మ్యాచ్‌లో అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న లంకేయులు 2011 ప్రపంచకప్‌ ఫైనల్‌ ప్రతీకారం తీర్చుకున్నారు. బంగ్లాదేశ్‌లో జరిగిన ఈ ఫైనల్‌ మ్యాచ్‌లో లంక భారత్‌పై  ఆరు వికట్ల తేడాతో విజయం సాధించింది.

తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి కేవలం 130 పరుగులే చేసింది. ఆరంభదశలో జోరు మీదున్న భారత బ్యాటింగ్‌ చివర్లో తడబడింది దీంతోస్పల్ప లక్ష్యానికి పరిమితమైంది. టీమిండియా ఆటగాడు విరాట్‌కోహ్లి (77: 58 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సులు) రాణించడంతో భారీ స్కోరు కాయమని అందరు భావించారు. ఈ తరుణంలో
క్యాన్సర్‌ను జయించి పునరాగమనం చేసిన యువరాజ్‌ సింగ్‌ (11: 21 బంతుల్లో) ఎక్కువ బంతులను వృధా చేశాడు. దీంతో భారత్‌ స్కోర్‌ బోర్డు వేగం నెమ్మదించింది. దీంతో యువరాజ్‌పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. 

లంక అలవోక విజయం
భారత్ నిర్దేశించిన 131 పరుగుల లక్ష్యాన్ని శ్రీలంక 17.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి చేధించింది. శ్రీలంక జట్టులో కుమార సంగక్కర(52: 35 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్సర్) అజేయ అర్థసెంచరీతో జట్టుకు విజయాన్ని అందించాడు. దీంతో శ్రీలంక తొలిసారి టీ20 ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంది.  ఈ మ్యాచ్‌తో శ్రీలంక క్రికెటర్లు మహేల జయవర్ధనే, కుమార సంగక్కర అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పారు. లంకేయులు వరల్డ్ కప్‌ విజయంతో వీరికి ఘనంగా వీడ్కోలు పలికారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement