t20 worldcup 2014
-
'నా ఇంటిపై రాళ్లతో దాడి చేశారు'
ముంబై : 2014 టీ20 ప్రపంచకప్ ఫైనల్లో శ్రీలంకపై టీమిండియా ఓడిపోవడం పట్ల మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ పై విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌లో 21 బంతులెదుర్కొని కేవలం 11 పరుగులు చేసిన యూవీ ఓటమికి పరోక్షంగా బాధ్యత వహించాల్సి వచ్చింది. దీంతో శ్రీలంక ఆరు వికెట్ల తేడాతో టీమిండియాపై విజయం సాధించి కప్‌ను ఎగురేసుకుపోయింది. దీంతో యూవీ ఆటతీరుపై మీడియా దుమ్మెత్తి పోయగా అభిమానులు ఆగ్రహాం కట్టలు తెంచుకుంది. తాజాగా ఈ విషయాన్ని యూవీ మరోసారి గుర్తుచేసుకున్నాడు. ('ఆరోజు పాంటింగ్ చెత్త నిర్ణయం తీసుకున్నాడు') 'ఆరోజు జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఓటమికి నేను పూర్తిగా బాధ్యత వహిస్తున్న. నేను ఆరోజు అనుకున్నంత స్థాయిలో ఆడలేదు. ఇంకా దురదృష్టం ఏంటంటే నేను ఆడింది దేశం మొత్తం ప్రతిష్టాత్మకంగా భావించే టీ20 ప్రపంచకప్ ఫైనల్లో. అదే ఒకవేళ వేరే మ్యాచ్ అయ్యుంటే ఇంతలా బాధపడేవాడిని కాదు. దాని తర్వాత చాలా రోజులు నిద్రలేని రాత్రులు గడిపా. నేను ఎయిర్‌పోర్ట్‌లో అడుగుపెట్టినప్పుడు మీడియా కళ్లన్నీ నామీదే ఉన్నాయి. వారంతా గట్టి గట్టిగా అరుస్తున్న సమయంలో నా చెవిలో హెడ్‌ఫోన్స్ పెట్టుకుని అక్కడినుంచి ఎలాగోలా బయటపడ్డాను. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత నన్నందరు ఒక నేరస్తుడిలా చూశారు. నా ఇంటి మీద రాళ్లతో కూడా దాడి చేశారు. కానీ వారు చేసిన పని చూసి నాకు చాలా బాధ అనిపించింది. ఆ క్షణం నాకు నేను అభిమానుల ఆశను మోసం చేపిన నేరస్తుడిలా కనిపించాను. నేనెవెరినో చంపి జైలుకు వెళుతున్న ఫీలింగ్ కూడా కలిగింది. కానీ తర్వాత దాని నుంచి ఎలాగోలా బయటకు వచ్చినా నా జీవితాంతం ఆ సంఘటన గుర్తుండిపోతుందంటూ' యూవీ చెప్పుకొచ్చాడు. 2007 టీ20, 2011 వన్డే ప్రపంచకప్‌లు టీమిండియా గెలవడంలో యూవీ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. రెండు టోర్నీల్లోను ఆకట్టుకునే ప్రదర్శన చేసిన ఈ ఆల్‌రౌండర్ టోర్నీ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. ముఖ్యంగా 2007 టీ20 వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్‌పై యూవీ ఆరు బంతులకు ఆరు సిక్స్‌లు కొట్టడం అప్పట్లో హైలెట్‌గా నిలిచింది. 2011 వరల్డ్ కప్ తర్వాత కాన్సర్ బారీన పడిన యూవీ లండన్‌కు వెళ్లి శస్త్ర చికిత్స తీసుకొని వచ్చి టీమిండియా తరపున కొన్ని మ్యాచ్‌లు ఆడినా మునుపటి ప్రదర్శనను చూపించలేకపోయాడు. టీమిండియా తరపున యూవీ 304 వన్డేలు, 40 టెస్టులు, 58 టీ20లు ఆడాడు. -
లంకకు శుభదినం.. భారత్‌కు దుర్దినం.!
సాక్షి, హైదరాబాద్ : సరిగ్గా నాలుగేళ్ల క్రితం ఇదే రోజు భారత్‌కు అందివచ్చిన అవకాశం తృటిలో చేజారింది. 2014 టీ20 ప్రపంచకప్ ఫైనల్లో ప్రత్యర్థి శ్రీలకం చేతిలో భారత్ కంగుతిన్నది. ఇక ఈ మ్యాచ్‌లో అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న లంకేయులు 2011 ప్రపంచకప్ ఫైనల్ ప్రతీకారం తీర్చుకున్నారు. బంగ్లాదేశ్‌లో జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్‌లో లంక భారత్‌పై ఆరు వికట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి కేవలం 130 పరుగులే చేసింది. ఆరంభదశలో జోరు మీదున్న భారత బ్యాటింగ్ చివర్లో తడబడింది దీంతోస్పల్ప లక్ష్యానికి పరిమితమైంది. టీమిండియా ఆటగాడు విరాట్‌కోహ్లి (77: 58 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సులు) రాణించడంతో భారీ స్కోరు కాయమని అందరు భావించారు. ఈ తరుణంలో క్యాన్సర్‌ను జయించి పునరాగమనం చేసిన యువరాజ్ సింగ్ (11: 21 బంతుల్లో) ఎక్కువ బంతులను వృధా చేశాడు. దీంతో భారత్ స్కోర్ బోర్డు వేగం నెమ్మదించింది. దీంతో యువరాజ్‌పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. లంక అలవోక విజయం భారత్ నిర్దేశించిన 131 పరుగుల లక్ష్యాన్ని శ్రీలంక 17.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి చేధించింది. శ్రీలంక జట్టులో కుమార సంగక్కర(52: 35 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్సర్) అజేయ అర్థసెంచరీతో జట్టుకు విజయాన్ని అందించాడు. దీంతో శ్రీలంక తొలిసారి టీ20 ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌తో శ్రీలంక క్రికెటర్లు మహేల జయవర్ధనే, కుమార సంగక్కర అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పారు. లంకేయులు వరల్డ్ కప్ విజయంతో వీరికి ఘనంగా వీడ్కోలు పలికారు. -
ఫించ్ విజృంభణ, ఆస్ట్రేలియా గెలుపు
మిర్పూర్: టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాకు ఊరట విజయం లభించింది. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోయి సెమీస్ చేరలేకపోయిన ఆసీస్ తన చివరి లీగ్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. బంగ్లాదేశ్ నిర్దేశించిన 154 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. 17.3 ఓవర్లలో 158 పరుగులు చేసింది. ఆసీస్ ఓపెనర్ ఫించ్ అర్థ సెంచరీతో అదరగొట్టాడు. 45 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 71 పరుగులు చేశాడు. వార్నర్ 48, వైట్ 18, బెయిలీ 11 పరుగులు చేశారు. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది. షకీబ్ అల్ హుస్సేన్(66), ముష్ఫికర్ రహీం(47) రాణించారు. ఫించ్‌కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' దక్కింది. -
దక్షిణాఫ్రికాను వణికించిన నెదర్లాండ్
చిట్టగాంగ్: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా గురువారమిక్కడ దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్ పోరాడి ఓడింది. ఒకదశలో సఫారీలకు వణుకు పుట్టించిన డచ్ టీమ్ చివరకు 6 పరుగులతో ఓటమి పాలయింది. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 146 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నెదర్లాండ్ 18.4 ఓవర్లలో 139 పరుగులకు ఆలౌటయింది. మిబర్గ్ అర్థ సెంచరీతో అదరగొట్టాడు. 28 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 51 పరుగులు చేశాడు. అయితే మిగతా ఆటగాళ్లు రాణించకపోవడంతో నెదర్లాండ్ పరాజయం పాలయింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఇమ్రాన్ తహీర్ 4, స్టెయిన్ 2 వికెట్లు పడగొట్టారు. మిగతా బౌలర్లు తలో వికెట్ తీశారు. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 20 ఓవరల్లో 9 వికెట్లు కోల్పోయి 145 పరుగులు చేసింది.