దక్షిణాఫ్రికాను వణికించిన నెదర్లాండ్ | South Africa beats Netherlands by six runs in Twenty20 Worldcup | Sakshi
Sakshi News home page

దక్షిణాఫ్రికాను వణికించిన నెదర్లాండ్

Published Thu, Mar 27 2014 6:32 PM | Last Updated on Sat, Sep 2 2017 5:15 AM

దక్షిణాఫ్రికాను వణికించిన నెదర్లాండ్

దక్షిణాఫ్రికాను వణికించిన నెదర్లాండ్

చిట్టగాంగ్: టీ20 ప్రపంచకప్లో భాగంగా గురువారమిక్కడ దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో నెదర్లాండ్ పోరాడి ఓడింది. ఒకదశలో సఫారీలకు వణుకు పుట్టించిన డచ్ టీమ్ చివరకు 6 పరుగులతో ఓటమి పాలయింది. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 146 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నెదర్లాండ్ 18.4 ఓవర్లలో 139 పరుగులకు ఆలౌటయింది.

మిబర్గ్ అర్థ సెంచరీతో అదరగొట్టాడు. 28 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 51 పరుగులు చేశాడు. అయితే మిగతా ఆటగాళ్లు రాణించకపోవడంతో నెదర్లాండ్ పరాజయం పాలయింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఇమ్రాన్ తహీర్ 4, స్టెయిన్ 2 వికెట్లు పడగొట్టారు. మిగతా బౌలర్లు తలో వికెట్ తీశారు. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 20 ఓవరల్లో 9 వికెట్లు కోల్పోయి 145 పరుగులు చేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement