
వెస్టిండీస్, అమెరికా వేదికలగా జరగనున్న టీ20 వరల్డ్‌కప్-2024కు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును నెదర్లాండ్స్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ జట్టుకు వికెట్ కీపర్ బ్యాటర్ స్కాట్ ఎడ్వర్డ్స్ సారథ్యం వహించనున్నాడు.
అయితే ఈ మెగా ఈవెంట్‌కు ఎంపిక చేసిన డచ్ జట్టులో స్టార్ ప్లేయర్లు రోలోఫ్ వాన్ డెర్ మెర్వే కోలిన్ అకెర్‌మాన్‌లు లేకపోవడం అందరిని ఆశ్చర్యపరిచింది. ఈ జట్టులో టిమ్ ప్రింగిల్,కైల్ క్లైన్, మైఖేల్ లెవిట్ వంటి యువ ఆటగాళ్లకు చోటు దక్కింది.
డచ్ యువ సంచలనం లెవిట్ అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. నమీబియాపై 62 బంతుల్లో 11 ఫోర్లు మరియు 10 సిక్సర్లతో 135 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. ఈ క్రమంలోనే అతడికి సెలక్టర్లు చోటిచ్చారు. అదేవిధంగా తెలుగు కుర్రాడు తేజా నిడమనూరుకు సైతం వరల్డ్‌కప్‌లో జట్టులో ఛాన్స్ లభించింది. ఇక ఈ మెగా టోర్నీ జూన్ 1 నుంచి ప్రారంభం కానుంది.
నెదర్లాండ్స్ వరల్డ్‌కప్ జట్టు: స్కాట్ ఎడ్వర్డ్స్ (కెప్టెన్), ఆర్యన్ దత్, బాస్ డి లీడ్, డేనియల్ డోరమ్, ఫ్రెడ్ క్లాసెన్, లోగాన్ వాన్ బీక్, మాక్స్ ఓ'డౌడ్, మైఖేల్ లెవిట్, పాల్ వాన్ మీకెరెన్, సిబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్, తేజా నిడమనూరు, ప్రింగ్లె , విక్రమ్ సింగ్, వివ్ కింగ్మా, వెస్లీ బరేసి.
ట్రావెలింగ్ రిజర్వ్: కైల్ క్లైన్.
Comments
Please login to add a commentAdd a comment