South Africa Cricket Team
-
మరో సౌతాఫ్రికాలా తయారైంది.. ఇంకా ఎన్నేళ్లు నిరీక్షించాలో!
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.. షార్ట్‌కట్‌లో ఆర్సీబీ. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ఫ్యాన్ ఫాలోవర్స్ కలిగిన జట్టుగా ఆర్సీబీ ఎప్పుడు ముందు స్థానంలో ఉంటుంది. సీఎస్కే, ముంబై జట్లు టైటిళ్లు కొల్లగొట్టడంతో ఫ్యాన్‌బేస్‌ను పెంచుకోగా.. ఆర్సీబీ మాత్రం మొదటి సీజన్ నుంచి తాజా సీజన్ వరకు ఒక్కసారి టైటిల్ గెలవకపోయినా అభిమాన గణం మాత్రం పెంచుకుంటూనే వచ్చింది. అయితే ఆ జట్టు మాత్రం అభిమానుల ఆశలను నిలుపుకోలేక దురదృష్టవంతమైన టీమ్‌గా తయారైంది. PC: IPL Twitter మొదటి సీజన్ నుంచి చూసుకుంటే కెప్టెన్లు మారినా.. ఆటగాళ్లు మారినా ఆర్సీబీ తలరాత మాత్రం మారడం లేదు. ప్రతీసారి అంచనాలకు మించి పేపర్ బలంగా కనిపించే జట్టు ఆర్సీబీ. ''ఈసాలా కప్ నమ్దే'' అంటూ ట్యాగ్‌లైన్ ఏర్పాటు చేసుకొని ఆర్సీబీ బరిలోకి దిగుతుంటే.. అరె ఈసారి ఎలాగైనా కప్ కొడుతుంది అని అభిమానులు మురిసిపోవడం.. మొదట్లో మెరిసి ఆఖర్లో ఊసురుమనిపించడం అలవాటుగా చేసుకుంది. ఆర్సీబీకి అంత పేరు రావడానికి టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి ఉండడమే. ఆరంభం నుంచి కోహ్లి ఆర్సీబీలోనే ఉండడం.. 2014లో ఆర్సీబీ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన కోహ్లి.. 2021 ఐపీఎల్ సీజన్ వరకు కెప్టెన్‌గా ఉన్నాడు. తన ఏడేళ్ల కెప్టెన్సీలో ఆర్సీబీని కోహ్లి ఒకసారి రన్నరప్(2016), మూడుసార్లు ప్లేఆఫ్ వరకు తీసుకెళ్లగలిగాడు. ఇక 2022 ఐపీఎల్లో డుప్లెసిస్ కెప్టెన్సీలోని ఆర్సీబీ ఆరు సీజన్ల తర్వాత ఎలిమినేటర్ గండాన్ని దాటింది. అయితే క్వాలిఫైయర్ సరిహద్దును మాత్రం దాటలేకపోయింది. 8వ సారి ప్లేఆఫ్స్‌కి చేరిన ఆర్సీబీ.. ఎనిమిదో సారి కూడా రిక్త హస్తాలతోనే ఇంటిబాట పట్టింది. దీంతో ఆర్సీబీని మరో దక్షిణాఫ్రికా జట్టుతో పోలుస్తున్నారు క్రికెట్ అభిమానులు. ఇది ఎంతవరకు నిజం అని చెప్పలేం గాని.. కొన్ని విషయాల్లో మాత్రం ఆర్సీబీ ప్రొటిస్ జట్టును గుర్తుకుతెస్తుంది. PC: IPL Twitter క్రికెట్లో అత్యంత దురదృష్టవంతమైన జట్టుగా దక్షిణాఫ్రికాకు పేరుంది. ఇంతవరకు ఒక్క మేజర్ టోర్నీని(ఐసీసీ ట్రోఫీలు) గెలవని ప్రొటీస్ జట్టు పరంగా చూస్తూ మాత్రం ఎప్పుడు ఉన్నతస్థానంలోనే ఉంటుంది. 1990వ దశకం నుంచి 2017 వరకు దక్షిణాఫ్రికా జట్టు పేపర్‌పై చాలా బలంగా కనిపించేది. ద్వైపాక్షిక సిరీస్‌ల్లో చెలరేగిపోయే దక్షిణాఫ్రికా.. ఐసీసీ మేజర్ టోర్నీలంటే మాత్రం ఎక్కడలేని ఒత్తిడిని కొనితెచ్చుకునేది. ఆ ఒత్తిడితోనే గెలవాల్సిన మేజర్ ట్రోఫీలను కూడా చేజేతులా పోగొట్టుకునేది. ప్రొటీస్ జట్టలో ఆటగాళ్ల ప్రతిభకు కొదువలేదు. జట్టుకు ఆడిన దిగ్గజ ఆటగాళ్లు ఎందరో ఉన్నారు. ముఖ్యంగా 1999 వన్డే ప్రపంచకప్‌లో సెమీఫైనల్ మ్యాచ్‌లో 1 బంతికి 22 పరుగులు చేయాల్సి రావడం.. బహుశా దక్షిణాఫ్రికా జట్టుకు మాత్రమే చెల్లింది. అదృష్టానికి దూరంగా.. దురదృష్టానికి దగ్గరగా ఉన్న ప్రొటిస్ జట్టుకు, ఆర్సీబీకి కొన్ని విషయాల్లో మాత్రం చాలా పోలికలు ఉన్నాయి. ఆర్సీబీ కూడా ప్రతీసారి భారీ అంచనాలతో బరిలోకి దిగడం.. జట్టులో స్టార్ ఆటగాళ్లకు కొదువ లేకపోవడం.. కీలక మ్యాచ్‌ల్లో ఒత్తిడిని కొనితెచ్చుకోవడం.. ఫలితంగా టైటిల్‌కు దూరంగా నిలవడం జరుగుతూనే ఉంది. ఆర్సీబీ కప్ కొట్టేది ఎప్పుడు.. తమ ఒత్తిడిని జయించేది ఎన్నడూ.. ఐపీఎల్ టైటిల్ కొట్టాలన్న నిరీక్షణ ఫలించేది ఎన్నడనేది వేచి చూడాల్సిందే. చదవండి: Trolls On RCB Fan Girl: 'ఆర్సీబీ కప్ కొట్టదు.. నువ్వు పెళ్లి చేసుకోవు' కోహ్లి కెరీర్ మొత్తం కంటే ఈ సీజన్లోనే ఎక్కువ తప్పులు చేశాడు.. మరీ ఇలా -
భారత్‌తో టీ20 సిరీస్‌కు జట్టును ప్రకటించిన దక్షిణాఫ్రికా.. సీనియర్ బౌలర్ రీఎంట్రీ
టీమిండియాతో టీ20 సిరీస్‌కు దక్షిణాఫ్రికా 16 మంది సభ్యలతో కూడిన తమ జట్టును మంగళవారం ప్రకటించింది. ఈ జట్టుకు టెంబ బావుమా సారథ్యం వహించనున్నాడు. ఇక యువ ఆటగాడు ట్రిస్టన్ స్టబ్స్ దక్షిణాఫ్రికా తరుపున టీ20ల్లో అరంగేట్రం చేయునున్నాడు. అదే విధంగా ఆ జట్టు వెటరన్ పేసర్ వేన్ పార్నెల్ 2017 తర్వాత తొలి సారిగా టీ20ల్లో ఆడనున్నాడు. అదే విధంగా గాయం కారణంగా గత కొంత కాలంగా జట్టుకు దూరమైన అన్రీచ్ నోర్జే కూడా తిరిగి జట్టులోకి వచ్చాడు. ఇక భారత పర్యటనలో భాగంగా ప్రోటిస్ జట్టు ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. తొలి టీ20 ఢిల్లీ వేదికగా జూన్ 9న ప్రారంభం కానుంది. మరో వైపు భారత జట్టును బీసీసీఐ ఒకట్రెండు రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది. దక్షిణాప్రికా టెంబా బావుమా (కెప్టెన్), క్వింటన్ డి కాక్, రీజా హెండ్రిక్స్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, ఐడెన్ మార్క్రామ్, డేవిడ్ మిల్లర్, లుంగీ ఎన్గిడి, అన్రిచ్ నోర్ట్జే, వేన్ పార్నెల్, డ్వైన్ ప్రిటోరియస్, కగిసో రబాడా, తబ్రేజ్ షమ్సీ, ట్రిస్టన్ స్టబ్స్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, మార్కో జాన్సెన్ చదవండి: IPL 2022- MI Vs SRH: అతడి వల్లే ఇదంతా.. సన్‌రైజర్స్ మిగిలిన రెండు మ్యాచ్‌లు గెలవడం కష్టమే! ఎందుకంటే.. -
పోలా..! అదిరిపోలా.. ఈ క్యాచ్!
పెర్త్ : ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో దక్షిణాఫ్రికా కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ అద్భుత క్యాచ్‌తో ఔరా అనిపించాడు. సూపర్మ్యాన్లా గాల్లోకి ఎగిరి బంతినందుకున్నాడు. ఆసీస్ ఇన్నింగ్స్ మూడో ఓవర్లో చోటుచేసుకున్న ఈ అద్భుత ఫీట్‌కు మైదానంలోని ప్రేక్షకులు మైమరిచిపోయారు. ఆటగాళ్లైతే సంభ్రమాశ్చర్యానికి లోనయ్యారు. (చదవండి: అయ్యో తాహీర్.. ఎంత పనాయే!) ఇక ఈ మ్యాచ్‌తో పేసర్ డేల్ స్టేయిన్ తన రీఎంట్రీని ఘనంగా చాటుకున్నాడు. అతనేసిన రెండో ఓవర్లోనే రెండు కీలక వికెట్ల పడగొట్టి ఆసీస్ పతనాన్ని శాసించాడు. తొలుత ట్రావిస్ హెడ్‌ను ఔట్ చేసిన స్టేయిన్ అనంతరం క్రీజులోకి వచ్చిన డీఆర్సీ షార్ట్‌ను డుప్లెసిస్ అద్భుత ఫీల్డింగ్‌తో డకౌట్‌గా పెవిలియన్ చేర్చాడు. స్టెయిన్ వేసిన ఫుల్ లెంగ్త్‌ను డీఆర్సీ షాట్ భారీ షాట్‌కు ప్రయత్నించగా.. ఆ బంతి బ్యాట్‌కు ఎడ్జ్ తీసుకుని గాల్లోకి లేచింది. సెకండ్ స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న డుప్లెసిస్ అంతే వేగంతో సూపర్ మ్యాన్‌లా గాల్లోకి ఎగిరి క్యాచ్ అందుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. ఈ మ్యాచ్‌లో సఫారీ బౌలర్లు పెహ్లుక్వాయో మూడు, ఎంగిడి, స్టెయిన్, తాహిర్‌లు రెండేసి వికెట్లతో చెలరేగడంతో ఆసీస్ 152 పరుగులకే కుప్పకూలింది. (చదవండి: వారెవ్వా.. టీ20ల్లోనూ డబుల్ సెంచరీ!) Wake up for this 💯💙.!! #AUSvsSA #dalesteyn #fab @DaleSteyn62 @OfficialCSA @CAComms @ICC pic.twitter.com/2i9J9wSI82 — Ragul fraNk (@Ragulfrank) November 4, 2018 Good catch, Faf. #AUSvSA pic.twitter.com/fiMPs6lgUD — Googly (@googlyAU) November 4, 2018 -
క్రీడాస్పూర్తి చాటిన అభిమానులు
పల్లెకెలె : క్రికెట్ అంటేనే ఓ పిచ్చిగా ఆరాధిస్తారు. తమ అభిమాన జట్టుకు ఆశించిన మేర ఫలితం రాకపోతే మైదానంలో వీరంగం సృష్టిస్తారు. అభిమాన ఆటగాళ్లనే నిందిస్తారు. ఇలా మైదానంలో బాటిళ్లు విసురుతూ.. మ్యాచ్‌ను అడ్డుకునే ప్రయత్నాలు చేసిన ఘటనలున్నాయి. అభిమాన క్రికెటర్ ఇళ్లపై రాళ్ల వర్షం కురిపించిన రోజులు ఉన్నాయి. ఇలాంటి క్రికెట్లో శ్రీలంక అభిమానుల ప్రవర్తించిన తీరు ఔరా అనిపిస్తోంది. వారి చర్య యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యచకితులను చేస్తోంది. వారి ప్రవర్తన అసలు సిసలు క్రీడాస్పూర్తికి అద్దం పడుతోంది. దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరుగుతున్న వన్డే సిరీస్‌లో శ్రీలంక వరుసగా మూడు వన్డేలు ఓడి సిరీస్‌ను చేజార్చుకుంది. పల్లెకెలె మైదానంలో జరిగిన మూడో వన్డేలో శ్రీలంక 78 పరుగుల తేడాతో ఓడింది. ఈ మ్యాచ్ లంక ఓడినా ఆ దేశ అభిమానులు చేసిన పనికి యావత్ క్రికెట్ ప్రపంచం గర్వపడుతోంది. ఓటమిని లెక్క చేయకుండా అభిమానులు స్టేడియంలోని చెత్త ఏరుతూ క్రీడాస్పూర్తిని చాటుకున్నారు. ఈ వీడియోను శ్రీలంక క్రికెట్ బోర్డు సోషల్ మీడియాలో పోస్టు చేయగా వైరల్ అయింది. ఇలా అభిమానులు క్రీడా స్పూర్తి చాటడం ఇదే తొలిసారి కాదు. ఇటీవల ముగిసిన ఫిఫా ప్రపంచకప్‌లో జపాన్ అభిమానులు తమ జట్టు ఓడినా.. పంటి బిగువున ఆ బాధను భరిస్తూనే తాము వీక్షించిన స్టేడియంలోని చెత్తాచెదారమంతా శుభ్రంచేశారు. ఈ మ్యాచే కాకుండా అంతకుముందు తమ జట్టు పాల్గొన్న నాలుగుమ్యాచ్లలోనూ ఇదే రకమైన నైతికవిలువలు, స్ఫూర్తిని ప్రదర్శించారు. దీంతో అప్పట్లో వారిపై ప్రశంసల జల్లు కురిసింది. మూడో వన్డేలో సఫారీ అరంగేట్ర బ్యాట్స్‌మన్ రీజా హెండ్రీక్స్ అజెయ సెంచరీ సాధించడంతో ఆ జట్టు 78 పరుగుల భారీ విజయాన్ని నమోదు చేసింది. రీజా హెండ్రీక్స్ 89 బంతుల్లో 102 పరుగులు చేయడంతో సఫారీ 364 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. అనంతరం బరిలోకి దిగిన ఆతిథ్య జట్టు 285 పరుగులకు కుప్పకూలింది. අවවාදයට වඩා ආදර්ශය උතුම්...ඔබට අපෙන් පැසසුම්..🙏 #LKA #SLvSA pic.twitter.com/FWVjKuCBMK — Sri Lanka Cricket (@OfficialSLC) August 8, 2018 చదవండి: ఇదీ క్రీడా స్ఫూర్తి.! -
కోహ్లి రికార్డులకు డేంజర్?
సాక్షి : టీమిండియా డాషింగ్ బ్యాట్స్‌మన్, కెప్టెన్ విరాట్ కోహ్లీ దూకుడు చూస్తుంటే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ రికార్డును అందుకునేందుకు ఎంతో కాలం పట్టేలా కనిపించటం లేదు. అయితే కోహ్లీ రికార్డులపైనే కన్నేసిన ఓ క్రికెటర్ మాత్రం అతని కంటే ముందుగా ఆ పని చేస్తాడా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. సౌతాఫ్రికా జట్టు ఓపెనర్ హషీమ్ ఆమ్లా, మరో రికార్డును నెలకొల్పాడు. వన్డేల్లో కోహ్లి సాధించిన 26 సెంచరీల రికార్డును.. ఆమ్లా తక్కువ మ్యాచ్‌ల్లోనే అధిగమించటం విశేషం. ఆదివారం బంగ్లాదేశ్‌తో డైమండ్ ఓవల్ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో ఆమ్లా ఈ ఫీట్‌ను సాధించాడు. కోహ్లి 166 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధిస్తే... ఆమ్లా కేవలం 154 మ్యాచ్‌ల్లోనే ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఆమ్లాకు కోహ్లి రికార్డులను బద్ధలు కొట్టడం కొత్తేం కాదు. గతంలో కోహ్లి 7 వేల పరుగుల ఘనతను కూడా అతితక్కువ మ్యాచ్‌ల్లోనే ఆమ్లా సాధించాడు. ఆమ్లా 150 ఇన్నింగ్స్, కోహ్లి 169 ఇన్నింగ్స్‌లతో ఆ ఘనత అందుకున్నారు. సౌతాఫ్రికా జట్టు తరపున అత్యంత వేగం పరుగులు సాధిస్తున్న క్రీడాకారుడిగా ఆమ్లా రికార్డుకెక్కాడు. అయితే ఆమ్లా తన కన్నా వయసులో పెద్దవాడు కావటం.. ఎక్కువ కాలం కెరీర్‌ను కొనసాగించే అవకాశాలు లేకపోవటంతో భవిష్యత్తులో కోహ్లి హవా కొనసాగొచ్చనే విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక బంగ్లాతోనే జరిగిన మ్యాచ్‌లోనే మరికొన్ని రికార్డులు నమోదయ్యాయి. వికెట్ కోల్పోకుండా 279 పరుగుల లక్ష్యాన్ని చేధించి వన్డేల్లో అత్యధిక ఓపెనింగ్ సాధించిన బ్యాట్స్‌మెన్‌గా మూడో స్థానంలో ఆమ్లా-డి కాక్ నిలిచారు. బంగ్లా తరపున సౌతాఫ్రికాపై తొలి సెంచరీ సాధించిన ఆటగాడిగా ముషిఫికర్ రహీమ్ చరిత్ర సృష్టించాడు. -
దక్షిణాఫ్రికా క్రికెటర్లకు జరిమానా
కేప్ టౌన్: ఆస్ట్రేలియాతో జరిగిన ఐదో వన్డేలో స్లో ఓవరేట్తో బౌలింగ్ చేసినందుకు దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టుకు జరిమానా వేశారు. సౌతాఫ్రికా కెప్టెన్ డు ప్లెసిస్‌కు మ్యాచ్ ఫీజులో 20 శాతం, ఇతర ఆటగాళ్లకు మ్యాచ్ ఫీజులో 10 శాతం చొప్పున జరిమానా విధించారు. వచ్చే 12 నెలల్లో దక్షిణాఫ్రికా మరోసారి స్లో ఓవరేట్తో బౌలింగ్ చేస్తే డు ప్లెసిస్ సస్పెన్షన్ ఎదుర్కొనే ప్రమాదం ఉంది. ఇక ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్‌తో దురుసుగా ప్రవర్తించినందుకు దక్షిణాఫ్రికా స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్‌కు మ్యచ్ ఫీజులో 30 జరిమానా వేశారు. ప్రవర్తన నియమావళిని తాహిర్ ఉల్లంఘించాడని, ఇది క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని ఐసీసీ పేర్కొంది. -
మైదానంలో సఫారీ డ్రోన్
అడ్డుకున్న బంగ్లా బోర్డు క్షమాపణ చెప్పిన దక్షిణాఫ్రికా జట్టు ఢాకా: తమ ప్రాక్టీస్ సెషన్లో డ్రోన్‌ను ఉపయోగించిన దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు బంగ్లాదేశ్ మిలిటరీకి గురువారం క్షమాపణలు చెప్పింది. ఏరియల్ వ్యూ నుంచి ఆటగాళ్ల ఫొటోలను, వీడియోలను తీసేందుకు బుధవారం నాటి సెషన్లో ఈ డ్రోన్‌ను ఉపయోగించారు. అయితే జాతీయ భద్రతా చర్యల కింద బంగ్లాలో ఇలాంటివి వాడడం నిషేధం. విషయం తెలిసిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధికారులు వెంటనే తమ అభ్యంతరాన్ని తెలిపి అడ్డుకున్నారు. ‘జట్టుతో పాటు వచ్చిన ‘బిహైండ్ ది సీన్’ టీవీ సిబ్బంది తమ యూట్యూబ్ చానెల్ కోసం వీడియోలు, సృజనాత్మక ఫొటోల కోసం డ్రోన్‌ను వాడారు. అయితే బంగ్లాదేశ్ గగనతలంపై ఇలాంటి వాటిని నిషేధించిన విషయం మాకు తెలీదు. జరిగిన పొరపాటుకు క్షమాపణలు చెప్పి వెంటనే దాన్ని ఉపయోగించడం మానేశాం’ అని ప్రొటీస్ టీమ్ మేనేజర్ మొహమ్మద్ మూసజీ తెలిపారు. -
దక్షిణాఫ్రికాను వణికించిన నెదర్లాండ్
చిట్టగాంగ్: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా గురువారమిక్కడ దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్ పోరాడి ఓడింది. ఒకదశలో సఫారీలకు వణుకు పుట్టించిన డచ్ టీమ్ చివరకు 6 పరుగులతో ఓటమి పాలయింది. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 146 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నెదర్లాండ్ 18.4 ఓవర్లలో 139 పరుగులకు ఆలౌటయింది. మిబర్గ్ అర్థ సెంచరీతో అదరగొట్టాడు. 28 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 51 పరుగులు చేశాడు. అయితే మిగతా ఆటగాళ్లు రాణించకపోవడంతో నెదర్లాండ్ పరాజయం పాలయింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఇమ్రాన్ తహీర్ 4, స్టెయిన్ 2 వికెట్లు పడగొట్టారు. మిగతా బౌలర్లు తలో వికెట్ తీశారు. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 20 ఓవరల్లో 9 వికెట్లు కోల్పోయి 145 పరుగులు చేసింది.