
టీమిండియాతో టీ20 సిరీస్‌కు దక్షిణాఫ్రికా 16 మంది సభ్యలతో కూడిన తమ జట్టును మంగళవారం ప్రకటించింది. ఈ జట్టుకు టెంబ బావుమా సారథ్యం వహించనున్నాడు. ఇక యువ ఆటగాడు ట్రిస్టన్ స్టబ్స్ దక్షిణాఫ్రికా తరుపున టీ20ల్లో అరంగేట్రం చేయునున్నాడు. అదే విధంగా ఆ జట్టు వెటరన్ పేసర్ వేన్ పార్నెల్ 2017 తర్వాత తొలి సారిగా టీ20ల్లో ఆడనున్నాడు.
అదే విధంగా గాయం కారణంగా గత కొంత కాలంగా జట్టుకు దూరమైన అన్రీచ్ నోర్జే కూడా తిరిగి జట్టులోకి వచ్చాడు. ఇక భారత పర్యటనలో భాగంగా ప్రోటిస్ జట్టు ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. తొలి టీ20 ఢిల్లీ వేదికగా జూన్ 9న ప్రారంభం కానుంది. మరో వైపు భారత జట్టును బీసీసీఐ ఒకట్రెండు రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది.
దక్షిణాప్రికా
టెంబా బావుమా (కెప్టెన్), క్వింటన్ డి కాక్, రీజా హెండ్రిక్స్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, ఐడెన్ మార్క్రామ్, డేవిడ్ మిల్లర్, లుంగీ ఎన్గిడి, అన్రిచ్ నోర్ట్జే, వేన్ పార్నెల్, డ్వైన్ ప్రిటోరియస్, కగిసో రబాడా, తబ్రేజ్ షమ్సీ, ట్రిస్టన్ స్టబ్స్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, మార్కో జాన్సెన్
Comments
Please login to add a commentAdd a comment