సెయింట్స్ కిట్స్ వేదికగా మంగళవారం జరగాల్సిన భారత్-వెస్టిండీస్ మూడో టీ20 కూడా గంటన్నర ఆలస్యంగా ప్రారంభం కానుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభం కావాల్సిన మ్యాచ్.. ఇప్పుడు 9:30 గంటలకు మొదలుకానుంది. కాగా వరుసగా రెండు మ్యాచ్‌లు జరగనుండడంతో ఆటగాళ్ల విశ్రాంతి దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విండీస్ క్రికెట్ తెలిపింది.
కాగా భారత్-విండీస్ మధ్య జరిగిన రెండో టీ20 మూడు గంటల ఆలస్యంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. "విండీస్-భారత మధ్య మూడో టీ20 ఆలస్యంగా ప్రారంభం కానుంది. సోమవారం నాటి మ్యాచ్ ఆలస్యంగా మొదలు కావడంతో మూడో టీ20కు ముందు ఆటగాళ్లకు తగినంత విశ్రాంతి దొరికే అవకాశం కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఇరు జట్ల అంగీకారంతో మూడో టీ20 మ్యాచ్‌ను గంటన్నర ఆలస్యంగా ప్రారంభించాలని అనుకుంటున్నాము.
ఈ మ్యాచ్ మధ్యాహ్నం 12:00 గంటల(భారత కాలమానం ప్రకారం రాత్రి 9: 30 గంటలు)కు ప్రారంభమవుతుంది" అని విండీస్ క్రికెట్ బోర్డు ఓ ప్రకటనలో పేర్కొంది. బీసీసీఐ సైతం ఈ విషయాన్ని ధ్రువీకరించింది. ఇక ఆలస్యంగా ప్రారంభమైన రెండో టీ20లో భారత్‌పై విండీస్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రస్తుతం 1-1తో సమమైంది.
Watch as the #MenInMaroon celebrate clinching victory in the second match of the @goldmedalindia T20 Cup, presented by Kent Water Purifiers #WIvIND 🏏🌴 pic.twitter.com/UV5Sl2zfAc
— Windies Cricket (@windiescricket) August 1, 2022
వెస్టిండీస్ వర్సెస్ ఇండియా రెండో టీ20:
లగేజీ సమయానికి రాని కారణంగా మ్యాచ్ ఆలస్యం
►వేదిక: వార్నర్ పార్క్, సెయింట్ కిట్స్, వెస్టిండీస్
►టాస్: వెస్టిండీస్- బౌలింగ్
►ఇండియా స్కోరు: 138 (19.4)
►వెస్టిండీస్ స్కోరు: 141/5 (19.2)
►విజేత: 5 వికెట్ల తేడాతో వెస్టిండీస్ గెలుపు
►5 మ్యాచ్‌ల సిరీస్ ప్రస్తుతం 1-1తో సమం
►ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: ఒబెడ్ మెకాయ్(4 ఓవర్లలో 17 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు)
చదవండి: IND vs WI 2nd T20: మ్యాచ్ గెలవాలని.. ముందస్తు ప్లాన్ అయితే కాదుగా!.. వసీం జాఫర్ ఫన్నీ ట్రోల్
🚨 UPDATE 🚨
— BCCI (@BCCI) August 2, 2022
Revised timing for the 3rd #WIvIND T20I at St Kitts on August 02, 2022:
Toss: 9:00 PM IST (11:30 AM Local Time)
Start of play: 9:30 PM IST (12 PM Local Time) #TeamIndia
Comments
Please login to add a commentAdd a comment