దక్షిణాఫ్రికా క్రికెటర్లకు జరిమానా
కేప్ టౌన్: ఆస్ట్రేలియాతో జరిగిన ఐదో వన్డేలో స్లో ఓవరేట్తో బౌలింగ్ చేసినందుకు దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టుకు జరిమానా వేశారు. సౌతాఫ్రికా కెప్టెన్ డు ప్లెసిస్కు మ్యాచ్ ఫీజులో 20 శాతం, ఇతర ఆటగాళ్లకు మ్యాచ్ ఫీజులో 10 శాతం చొప్పున జరిమానా విధించారు. వచ్చే 12 నెలల్లో దక్షిణాఫ్రికా మరోసారి స్లో ఓవరేట్తో బౌలింగ్ చేస్తే డు ప్లెసిస్ సస్పెన్షన్ ఎదుర్కొనే ప్రమాదం ఉంది.
ఇక ఆస్ట్రేలియా బ్యాట్స్మన్ డేవిడ్ వార్నర్తో దురుసుగా ప్రవర్తించినందుకు దక్షిణాఫ్రికా స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్కు మ్యచ్ ఫీజులో 30 జరిమానా వేశారు. ప్రవర్తన నియమావళిని తాహిర్ ఉల్లంఘించాడని, ఇది క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని ఐసీసీ పేర్కొంది.