Slow over-rate
-
స్లో ఓవర్ రేట్ దెబ్బ.. ఇంగ్లండ్, ఆసీస్‌లకు భారీ షాక్
ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన యాషెస్ సిరీస్ 2-2తో డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే. తొలి రెండు టెస్టులు ఆసీస్ నెగ్గితే.. మూడు, ఐదో టెస్టు ఇంగ్లండ్ నెగ్గింది. ఇక నాలుగో టెస్టు డ్రాగా ముగిసింది. ఈ నేపథ్యంలో ఐదోటెస్టు గెలిచిన ఇంగ్లండ్ డబ్ల్యూటీసీ పట్టికలో పాయింట్ల పరంగా ఆస్ట్రేలియాతో సమానంగా నిలిచింది. ఇరుజట్లు ఐదు టెస్టుల్లో రెండు విజయాలు, రెండు ఓటములు, ఒక డ్రాతో నిలిచాయి. ఈ లెక్కన ఇరుజట్లు 26 పాయింట్లు(43.33 పర్సంటేజీ పాయింట్స్)తో పట్టికలో మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. ఇంగ్లండ్‌కు ఈ మురిపెం ఒక్కరోజుకే పరిమితమైంది. తాజాగా బుధవారం ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలకు ఐసీసీ షాక్ ఇచ్చింది. యాషెస్ సిరీస్‌లో భాగంగా ఐదుటెస్టుల్లో స్లో ఓవర్ రేట్ నమోదైన కారణంగా ఇంగ్లండ్, ఆసీస్ ఆటగాళ్లకు మ్యాచ్ ఫీజులో జరిమానా విధించడంతో పాటు ఇరుజట్లకు డబ్ల్యూటీసీ పాయింట్లలోనూ భారీ కోత పడింది. ఆస్ట్రేలియా ఓల్డ్ ట్రాఫర్డ్ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో స్లో ఓవర్ రేట్ నమోదు చేసింది. టెస్టుల్లో ఒకరోజుకు ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లు వేయాల్సి ఉంటుంది(ఇరుజట్లు లేదా ఒకే జట్టు). అయితే ఆసీస్ నాలుగో టెస్టులో నిర్ణీత సమయంలోగా 10 ఓవర్లు తక్కువగా వేసినందుకు గానూ ఒక్క షార్ట్ ఓవర్ కింద ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో ఓవర్‌కు 5శాతం చొప్పున జరిమానాతో పాటు ఒక డబ్ల్యూటీసీ పాయింట్ కోత విధిస్తారు. ఈ లెక్కన ఆసీస్ 10 ఓవర్లు చొప్పున 10 డబ్ల్యూటీసీ పాయింట్లను కోల్పోయింది. ఇక మ్యాచ్‌లో ఆటగాళ్లకు 50శాతం జరిమానా విధించారు. ఇక ఇంగ్లండ్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. యాషెస్‌లో జరిగిన ఐదు టెస్టుల్లో ఏకంగా నాలుగు టెస్టుల్లో స్లో ఓవర్ రేట్ నమోదు చేసిన ఇంగ్లండ్‌కు గట్టి దెబ్బపడింది. తొలి టెస్టుల్లో రెండు ఓవర్లు, రెండో టెస్టులో తొమ్మిది ఓవర్లు, నాలుగో టెస్టులో మూడు ఓవర్లు, ఇక చివరి టెస్టులో ఐదు ఓవర్లు.. మొత్తంగా 19 ఓవర్లు తక్కువ వేసింది. దీంతో ఒక ఓవర్ చొప్పున ఇంగ్లండ్‌కు 19 ఓవర్లకు 19 డబ్ల్యూటీసీ పాయింట్లు కోత పడ్డాయి. దీంతో ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులోనూ జరిమానా పడింది. తొలి టెస్టులో 10 శాతం, రెండో టెస్టులో 45 శాతం, నాలుగో టెస్టులో 15శాతం, చివరి టెస్టులో 25శాతం జరిమానా విధించారు. దీంతో ఒక్కరోజు వ్యవధిలోనే డబ్ల్యూటీసీ పట్టికలో భారీ మార్పులు చోటుచేసుకోవడం విశేషం. 19 పాయింట్లు కోల్పోయిన ఇంగ్లండ్ ప్రస్తుతం 13 పాయింట్లు(15 పర్సంటేజీ పాయింట్స్)తో ఐదో స్థానానికి పడిపోయింది. ఇక 10 పాయింట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా 30 పర్సంటేజీ పాయింట్స్‌తో మూడో స్థానంలో ఉన్నప్పటికి భారీగా పాయింట్లు కోల్పోవడం ఆ జట్టుకు దెబ్బ అని చెప్పొచ్చు. ఇక టీమిండియాతో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఓటమి పాలైన విండీస్ 16.67 పర్సంటేజీ పాయింట్స్‌తో నాలుగో స్థానంలో నిలిచింది. The latest points table of WTC 2023-25: 1. Pakistan - 100% 2. India - 66.67% 3. Australia - 30% 4. West Indies - 16.67% 5. England - 15% pic.twitter.com/gaoojRbIUi — CricketMAN2 (@ImTanujSingh) August 2, 2023 🚨 Points Deduction 🚨 Due to slow over-rates during the Ashes series, England lost 19 points and Australia lost 10 points in the WTC points table. 🏴🇦🇺#WTC #Ashes #ENGvAUS pic.twitter.com/wdFXbSgDhu — Sportskeeda (@Sportskeeda) August 2, 2023 చదవండి: R Ashwin: 'టీమిండియా బజ్‌బాల్ ఆడితే జట్టులో ఎవరు మిగలరండి' -
స్లో ఓవర్ రేట్.. టీమిండియాకు పడింది దెబ్బ
భాగ్యనగరం వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో విజయంతో ఉత్సాహంలో ఉన్న టీమిండియాకు బిగ్‌షాక్ తగిలింది. టీమిండియాకు స్లో ఓవర్ రేట్ దెబ్బ పడింది. నిర్ణీత సమయం ముగిసేలోగా రోహిత్ సేన మూడు ఓవర్లు తక్కువగా వేసినట్లు తేలడంతో మ్యాచ్ ఫీజులో 60 శాతం కోత విధించినట్లు ఐసీసీ మ్యాచ్ రిఫరీ జగవల్ శ్రీనాథ్ తెలిపారు. ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద ఆర్టికల్ 2.22 ప్రకారం మ్యాచ్ నిర్ణీత సమయం ముగిసేలోగా టీమిండియా మూడు ఓవర్లు తక్కువ వేసినట్లు తేలడంతో స్లో ఓవర్ రేట్గా పరిగణించినట్లు తెలిపారు. మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ నమోదు చేసినందుకు టీమిండియా ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో మూడు ఓవర్ల చొప్పున ఒక్కో ఓవర్‌కు 20 శాతం కింద మ్యాచ్ ఫీజులో 60 శాతం కోత విధించినట్లు ఐసీసీ పేర్కొంది. కాగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన తప్పును అంగీకరించినట్లు వెల్లడించింది. దీంతో విచారణ అవసరం లేదని ఐసీసీ తెలిపింది. ఇక మ్యాచ్‌లో టీమిండియా 12 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. భాగ్యనగరం వేదికగా జరిగిన వన్డే మ్యాచ్‌లో బ్యాటర్లు పండుగ చేసుకున్నారు. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా శుబ్‌మన్ గిల్ డబుల్ సెంచరీతో మెరవడంతో 8 వికెట్ల నష్టానికి 349 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ మైకెల్ బ్రాస్‌వెల్ మెరుపు శతకంతో రాణించి టీమిండియాను వణికించాడు. అయితే లోకల్ బాయ్ సిరాజ్ చివర్లో అద్భుతంగా బౌలింగ్ చేయడంతో న్యూజిలాండ్ 337 పరుగులకు ఆలౌటైంది. సిరాజ్‌కు నాలుగు వికెట్లు దక్కాయి. ఇక ఇరుజట్ల మధ్య రెండో వన్డే రాయ్‌పూర్ వేదికగా శనివారం(జనవరి 21న) జరగనుంది. చదవండి: రెండో వన్డేలోనూ ఉమ్రాన్‌కు నో ఛాన్స్! ఒకవేళ ఆడించినా.. -
ఓటమి బాధలో ఉన్న టీమిండియాకు ఐసీసీ షాక్
బంగ్లాదేశ్‌తో తొలి వన్డేలో ఓటమితో బాధలో ఉన్న టీమిండియాకు ఐసీసీ గట్టి షాక్ ఇచ్చింది. బంగ్లాతో తొలి వన్డేలో స్లోఓవర్ రేట్ కారణంగా టీమిండియా మ్యాచ్ ఫీజులో 80శాతం కోత విధిస్తూ నిర్ణయం తీసుకుంది. సాధారణంగా షెడ్యూల్ సమయానికి ఓవర్లు పూర్తి చేయలేకపోతే 20 శాతం మ్యాచ్ ఫీజుని పెనాల్టీని విధిస్తారు. అయితే తొలి వన్డేలో టీమిండియా... ఓవర్ రేటుకి ఏకంగా నాలుగు ఓవర్లు తక్కువగా వేసింది. దీంతో తక్కువ వేసిన ఒక్కో ఓవర్‌కి 20 శాతం చొప్పున 80 శాతం మ్యాచ్ ఫీజును కోత విధిస్తున్నట్లు ఐసీసీ పేర్కొంది. ''ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆర్టికల్ నిబంధన ప్రకారం స్లో ఓవర్ రేటు చేసిన జట్టు ప్లేయర్లకు, సపోర్టింగ్ స్టాఫ్‌కి, అలాగే జట్టుతో సంబంధం ఉన్న ఇతర సిబ్బందికి ఒక్కో ఓవర్‌కి 20 శాతం మ్యాచ్ ఫీజు కోత విధించడం జరుగుతుంది.మ్యాచ్ రిఫరీ రంజన్ మదుగల్లే, టీమిండియా నెట్ ఓవర్ రేటుకి ఏకంగా నాలుగు ఓవర్లు తక్కువగా వేసినట్టు గుర్తించారు'' అంటూ ఐసీసీ తన ట్విటర్లో పేర్కొంది. కాగా స్లో ఓవర్ రేటుపై రిఫరీకి క్షమాపణలు తెలిపిన రోహిత్ శర్మ మ్యాచ్ ఫీజు కోతకి అంగీకరించాడు. దీంతో తొలి వన్డేలో ఆడిన టీమిండియా ఆటగాళ్లు మ్యాచ్ ఫీజు కింద కేవలం 20 శాతం మాత్రమే అందుకోనున్నారు. ఇక ఢాకాలో జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఒక్క వికెట్ తేడాతో ఓడిపోయింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 41.2 ఓవర్లలో 186 పరుగులకి ఆలౌట్ అయ్యింది. పిచ్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉండడంతో టీమిండియా బౌలర్లు కూడా చెలరేగారు. దీంతో బంగ్లాదేశ్ 136 పరుగులకే 9 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. మరొక వికెట్ తీస్తే చాలు, టీమిండియాదే విజయం అనుకుంటున్న సమయంలో మెహిడీ హసన్, ముస్తాఫిజుర్ రహ్మన్ కలిసి 10వ వికెట్‌కి 51 పరుగులు జోడించి జట్టుకు చారిత్రక విజయాన్ని అందించారు. 2019లో కెప్టెన్‌గా బంగ్లాదేశ్‌పై టీ20 మ్యాచ్ ఓడిపోయిన రోహిత్ శర్మ, వన్డే మ్యాచ్‌లోనూ పరాజయాన్ని చవిచూశాడు. బంగ్లాదేశ్‌పై టీ20, వన్డేల్లో ఓటమి చవిచూసిన మొట్టమొదటి భారత కెప్టెన్‌గా రోహిత్ చెత్త రికార్డు నెలకొల్పాడు . ఇరు జట్ల మధ్య డిసెంబర్ 7న(బుధవారం) రెండో వన్డే జరగనుంది. ఇప్పటికే తొలి వన్డేలో ఓడిన భారత జట్టు రెండో వన్డేలో గెలిచి సిరీస్ సమం చేయాలని భావిస్తోంది. అయితే స్వదేశంలో ఆస్ట్రేలియాపై సిరీస్ గెలిచిన బంగ్లాదేశ్..రోహిత్ సేనపై ఇదే రిజల్ట్‌ని రిపీట్ చేయాలని భావిస్తోంది. చదవండి: FIFA: మ్యాచ్ సమయంలో మెస్సీ ఎందుకు నడుస్తాడో తెలుసా? ఫలితం రాదనుకున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్ అద్బుతం -
స్లో ఓవర్ రేట్.. క్రికెట్ ఆస్ట్రేలియా వినూత్న ఆలోచన
క్రికెట్లో స్లో ఓవర్ రేట్ పెద్ద మైనస్. సమయంలోగా మ్యాచ్‌ను పూర్తి చేయాలనుకున్నా ఏదో ఒక రూపంలో అడ్డంకి ఎదురవుతూ జట్లకు శాపంగా మారుతుంది. బ్యాటింగ్.. బౌలింగ్ ఇలా ఏ సమయంలోనైనా నిర్ణీత సమయంలోగా మ్యాచ్‌ను పూర్తి చేయకపోతే స్లో ఓవర్ రేట్ కింద కెప్టెన్ సహా ఆటగాళ్లకు జరిమానా విధిస్తూ వస్తున్నారు. అయితే ఈ రూల్‌లో ఐసీసీ కాస్త మార్పులు చేసింది. ఇకపై స్లో ఓవర్ రేట్ నమోదైతే.. మ్యాచ్ ఫీజులో కోత విధించకుండా.. ఫీల్డింగ్ జట్టులో కొత్త నిబంధన తీసుకొచ్చింది. సాధారణంగా పవర్ ప్లే అనంతరం 30 గజాల సర్కిల్ బయట ఐదుగురు ఫీల్డర్లను మోహరించే అవకాశం ఉంటుంది. స్లో ఓవర్ రేట్ నమోదైతే స్లాగ్ ఓవర్లలో ఐదుగురు ఫీల్డర్లకు బదులు నలుగురు ఫీల్డర్లు మాత్రమే ఉండేలా రూల్ తీసుకొచ్చింది. తాజగా ఈ నిబంధన మ్యాచ్ విజయాలపై ప్రభావం చూపుతుంది. అయితే స్లో ఓవర్ రేట్‌కు మరో ప్రధాన కారణం.. బ్యాటర్లు కొట్టే బౌండరీలు, సిక్సర్లు. బౌండరీ వెళ్లిన ప్రతీసారి బంతి తీసుకునేందుకు కొంచెం సమయం పడుతుంది. దీనివల్ల కూడా మ్యాచ్ నిర్ణీత సమయంలోగా పూర్తవ్వడం లేదు. అందుకే ఆస్ట్రేలియా క్రికెట్ ఒక వినూత్న ఆలోచన చేసింది. ఇకపై బ్యాటర్ బౌండరీలు, సిక్సర్లు కొట్టిన తర్వాత ఆ బంతి తీసుకురావడానికి గ్రౌండ్‌లోని సపోర్ట్ స్టాఫ్ సహా డగౌట్లో ఉన్న ఆటగాళ్లను ఉపయోగించాలని భావిస్తుంది. బ్యాటర్ బౌండరీలు, సిక్సర్లు కొట్టిన ప్రతీసారి ఫీల్డర్లు పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఇటీవలే ఇంగ్లండ్‌తో జరిగిన ఒక మ్యాచ్‌లో ఈ స్ట్రాటజీని ఉపయోగించగా.. అది చక్కగా పనిచేసింది. ఈ పని ద్వారా స్లో ఓవర్ రేట్‌ను దాదాపు నియంత్రించొచ్చు అనేది ఆసీస్ క్రికెట్ వాదన. దీంతో ఆస్ట్రేలియా క్రికెట్ ఐసీసీ అనుమతితో టి20 వరల్డ్‌కప్‌లో ఇలాంటి రూల్‌ను అమల్లోకి తీసుకొచ్చింది. ఇప్పటికే క్వాలిఫయింగ్ మ్యాచ్‌ల్లో దీనిని అమలు చేస్తున్నారు. A clever ploy from the Aussies who are keen to avoid the fielding restriction penalty if overs aren't bowled in time during this #T20WorldCup pic.twitter.com/5e73KABQcd — cricket.com.au (@cricketcomau) October 19, 2022 చదవండి: 'టీమిండియా సెమీస్ చేరే అవకాశాలు 30 శాతమే' var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1971406958.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
'రోజులో 90 ఓవర్లు వేయకపోతే ఇంకెందుకు?.. సస్పెండ్ చేయాల్సిందే'
టెస్టు క్రికెట్ అంటే ఐదు రోజుల మ్యాచ్. రోజుకు 90 ఓవర్లు చొప్పున ఐదు రోజుల పాటు 450 ఓవర్లు అందుబాటులో ఉంటాయి. ఒకప్పుడు టెస్టు మ్యాచ్ అంటే కచ్చితంగా రోజులో 90 ఓవర్లు బౌలింగ్ చేయడం ఆనవాయితీగా వచ్చేది. కానీ రానురాను పరిస్థితి మారిపోయింది. స్లో ఓవర్ రేట్ .. వెలుతురులేమి.. వర్షం అంతరాయం ఇలా ఎన్నో అడ్డంకులు వస్తుండడంతో రోజులో 90 ఓవర్ల ఆట సాధ్యమవడం లేదు. అయితే వర్షం అంతరాయం, వెలుతురులేమి వదిలేస్తే ఓవర్ రేట్ అనేది మన చేతుల్లో పని. - సాక్షి వెబ్‌డెస్క్ మ్యాచ్ ప్రారంభమైన సమయం నుంచి టైంను వృథా చేయకుండా బౌలింగ్ చేస్తే కచ్చితంగా రోజులో 90 ఓవర్లు పూర్తి చేయొచ్చు. ఆయా జట్ల కెప్టెన్లు ఇలా చేయలేక అనవసరంగా జరిమానాలు.. కొత్తగా డబ్ల్యూటీసీ పాయింట్లలో కోత పడుతుంది. ఇవన్నీ నష్టాన్ని కలిగించేవి. తాజాగా ఆస్ట్రేలియన్ దిగ్గజం ఇయాన్ చాపెల్ టెస్టు క్రికెట్లో వస్తున్న మార్పులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫోలో చాపెల్ ఇదే అంశంపై తన కాలమ్‌లో రాసుకొచ్చాడు. ''టెస్టు మ్యాచ్‌లు అనేవి ఎప్పుడు ఆసక్తిగానే ఉంటాయి. వన్డే, టి20 క్రికెట్ వచ్చినా సంప్రదాయ ఫార్మాట్‌కు ఉన్న మోజు మాత్రం తగ్గలేదు. అయితే ఇప్పుడున్న టెస్టు క్రికెట్లో ప్రధానంగా వేధిస్తున్న సమస్య రోజులో 90 ఓవర్లు బౌలింగ్ పూర్తి చేయలేకపోవడం. వాతావరణ సమస్య.. వెలుతురులేమి ఇతరత్రా కారణాలు వదిలేస్తే మ్యాచ్‌లో మరో కీలకఅంశం ముడిపడి ఉంది. అదే ఓవర్ రేట్. వన్డేలు, టి20లు ఒక్కరోజులో ముగిసేవి కాబట్టి స్లోఓవర్ రేట్ పడడం సాధారణం. కానీ టెస్టులు ఐదు రోజుల పాటు జరిగేవి. సరిగ్గా వినియోగించుకుంటే రోజులో కచ్చితంగా 90 ఓవర్లు బౌలింగ్ చేయొచ్చు. అలా చేయని పక్షంలో జట్టు కెప్టెన్ దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఒక టెస్టులో తమ బౌలర్లతో రోజులో 90 ఓవర్లు బౌలింగ్ చేయించకపోతే కెప్టెన్‌ను సస్పెండ్‌ను చేసే అంశాన్ని పరిగణించాలి. దీనివల్ల టెస్టు క్రికెట్లో కొంతైనా మార్పు వస్తుంది. ఇటీవల ఇంగ్లండ్, టీమిండియాల మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో 90 ఓవర్ల ఆట కాస్త కనబడింది. దాదాపు మూడురోజులు ఇరు జట్లు 90 ఓవర్ల ఆట పూర్తి చేయడానికి మొగ్గుచూపాయి. ఇది అభినందిచాల్సిన విషయం. కొన్ని డీఆర్ఎస్లు సమయాన్ని వృథా చేయడంతో ఓవర్‌రేట్ పడడంతో మూడు నాలుగు ఓవర్లు మిగిలిపోయాయి. అందుకే ఓవర్ రేట్లపై తక్షణ శ్రద్ధ అవసరం. అంపైర్లు ఈ విషయంలో ఆన్-ఫీల్డ్ ప్రోటోకాల్‌ను అమలు చేయలేరు ఎందుకంటే వారికి అధికారాలు లేకపోవడమే. ఇక బౌలర్లు ఆరు గంటల్లో 90 ఓవర్లు బౌలింగ్ చేసేలా ప్రోత్సహించాలి. ఈ లక్ష్యం నెరవేరకపోతే కెప్టెన్‌ను ప్రశ్నించకుండా సస్పెండ్ చేయాలి. దశాబ్దాలుగా ఓవర్‌రేట్ అనేది టెస్టు క్రికెట్‌కు ఇబ్బందిగా మారింది. దీనివల్ల టెస్టు ఆటకు ముప్పు ఉందని'' చాపెల్ పేర్కొన్నాడు. చదవండి: MS Dhoni: లండన్ వీధుల్లో ధోనికి వింత అనుభవం England Cricketer Reece Topley: ఇంగ్లండ్ స్టార్ రీస్ టాప్లీ.. ఐదేళ్ల క్రితం కథ వేరే Yasir Shah: రీఎంట్రీలోనూ సంచలనమే.. పాక్ బౌలర్ ప్రపంచ రికార్డు -
విజయానందంలో ఉన్న ఇంగ్లండ్‌కు ఐసీసీ షాక్..
న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో సంచలన విజయం సాధించిన ఇంగ్లండ్‌కు ఐసీసీ షాక్ ఇచ్చింది. స్లో ఓవర్ రేట్ కారణంగా ఇంగ్లండ్ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ సహా జట్టులోని సభ్యుల మ్యాచ్ ఫీజు నుంచి 40 శాతం కోత విధిస్తున్నట్లు పేర్కొంది. దీంతో పాటు వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) పాయింట్లలో రెండు పాయింట్లు డీమెరిట్ చేసింది. ఈ మేరకు ఐసీసీ మ్యాచ్ రిఫరీ రిచీ రిచర్డ్సన్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశాడు. నిర్ణీత సమయాన్ని పరిగణనలోకి తీసుకున్న తర్వాత లక్ష్య చేధనలో రెండు ఓవర్లు తక్కువగా ఉన్నట్లు తేలడంతో ఇంగ్లండ్ జట్టుకు స్లో ఓవర్-రేట్ కింద జరిమానా విధిస్తున్నట్లు తెలిపాడు. ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్.. ఆర్టికల్ 2.22 నిబంధన ప్రకారం స్లో ఓవర్ రేట్ కారణంగా ఇంగ్లండ్ ఆటగాళ్లు సహా సిబ్బందికి ఒక ఓవర్ చొప్పున మ్యాచ్ ఫీజులో 20 శాతం(రెండు ఓవర్లకు 40 శాతం) కోత విధించామని.. అలాగే ఆర్టికల్ 16.11.2 ప్రకారం.. డబ్ల్యూటీసీ పాయింట్ల నుంచి రెండు పాయింట్లు( ఓవర్ చొప్పున ఒక పాయింట్) డీమెరిట్ చేసినట్లు రిఫరీ వెల్లడించారు. న్యూజిలాండ్‌పై విజయంతో ఇంగ్లండ్ ఖాతాలో 42 పాయింట్లు ఉండగా.. స్లో ఓవర్ రేట్ కారణంగా ఐసీసీ రెండు పాయింట్లు కోత విధించడంతో 40 పాయింట్లకు తగ్గింది. ఇక పట్టికలో 8వ స్థానంలో ఉన్న ఇంగ్లండ్ పాయింట్ పర్సంటేజీ 25 నుంచి 23.80కి తగ్గింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే రెండో టెస్టులో ఇంగ్లండ్ ఐదు వికెట్లతో సంచలన విజయం సాధించింది. 299 పరుగుల విజయలక్ష్యాన్ని ఇంగ్లండ్ 50 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. చివరి సెషన్లో ఇంగ్లండ్ విజయానికి 160 పరుగులు చేయాల్సిన దశలో మ్యాచ్ ‘డ్రా’ కావడం ఖాయమనిపించింది. కానీ బెయిర్‌స్టో (92 బంతుల్లో 136; 14 ఫోర్లు, 7 సిక్స్‌లు), స్టోక్స్ (75 నాటౌట్; 10 ఫోర్లు, 4 సిక్స్‌లు) విధ్వంసక బ్యాటింగ్‌తో ఇంగ్లండ్ విజయతీరాలకు చేరింది. చదవండి: Wasim Jaffer: 'ఏడాది వ్యవధిలో ఎంత మార్పు'.. కొత్త కెప్టెన్, కోచ్ అడుగుపెట్టిన వేళ 16 ఓవర్లలో 160 పరుగులు.. విధ్వంసానికి పరాకాష్ట.. టెస్టు క్రికెట్లో నయా రికార్డు -
కేఎల్ రాహుల్‌కు భారీ షాక్.. రూ.12 లక్షలు జరిమానా!
ఐపీఎల్-2022లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌కు భారీ షాక్ తగిలింది. శనివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా రాహుల్ పై రూ.12 లక్షల జరిమానా ఐపీఎల్ నిర్వహకులు విధించారు. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ప్రకారం.. "ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 20 ఓవర్ల కోటాను నిర్ణీత సమయంలో పూర్తి చేయనందుకు రాహుల్‌పై రూ.12 లక్షలు జరిమానా విధించబడింది" అని ఐపిఎల్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇక ముంబై ఇండియన్స్‌పై లక్నో సూపర్ జెయింట్స్ 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ సెంచరీతో మెరిశాడు. 60 బంతుల్లో 103 పరుగులు సాధించి అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. ఇక ఐపీఎల్లో తాను ఆడుతున్న వందో మ్యాచ్‌లో సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా కేఎల్ రాహుల్ చరిత్ర సృష్టించాడు. చదవండి: IPL 2022: కోహ్లి సింగిల్ హ్యాండ్ స్టన్నింగ్ క్యాచ్.. అనుష్క శర్మ వైపు చూస్తూ.. వైరల్ -
తొలి టెస్టు విజయం.. టీమిండియాకు ఐసీసీ షాక్
India Fined For Slow Over-rate 1st Test Vs South Africa.. సౌతాఫ్రికాతో తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ విజయాన్ని ఆస్వాధిస్తున్న టీమిండియాకు స్లో ఓవర్ రేట్ పేరుతో ఐసీసీ గట్టిషాక్ ఇచ్చింది. సెంచూరియన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ స్లో ఓవర్ రేట్ నమోదు చేసింది. ఈ కారణంతో టీమిండియా జట్టుకు 20 శాతం జరిమానా విధిస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది. తాజాగా విధించిన జరిమానాతో టీమిండియాకు డబ్య్లూటీసీ 2022-23 పాయింట్స్‌లో ఒక పాయింట్ కోత పడనుంది. చదవండి: Virat Kohli: 'చరిత్రను తిరగరాశాం.. ప్రపంచ ముగ్గురు అత్యుత్తమ పేసర్లలో షమీ ఒకడు' ఆర్టికల్ 2.22 ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం.. మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లోనూ టీమిండియా నిర్ణీత సమయంలో బౌలింగ్ పూర్తి చేయలేకపోయింది. స్టో ఓవర్ రేటు నమోదు చేసిన కారణంగా టీమిండియా జట్టుతో పాటు సహాయకి సిబ్బందికి మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధిస్తున్నట్లు ఐసీసీ పేర్కింది. దీంతోపాటు ఆర్టికల్ 16.11 ప్రకారం.. స్లో ఓవర్ రేట్ కారణంగా టీమిండియాకు ఐసీసీ వరల్డ్‌టెస్టు చాంపియన్‌షిప్ 2022-23లో ఒక పాయింట్ కోత పడింది. ప్రస్తుతం డబ్య్లూటీసీ పట్టికలో టీమిండియా నాలుగో స్థానంలో ఉంది. ఇక తొలి టెస్టులో 113 పరుగుల తేడాతో భారీ విజయం అందుకున్న టీమిండియా.. జనవరి 3 నుంచి జోహెన్నెస్‌బర్గ్ వేదికగా రెండో టెస్టు ఆడనుంది. చదవండి: సౌతాఫ్రికా గడ్డపై టీమిండియా రాసింది ఒక చరిత్ర.. -
ఇంగ్లండ్‌కు షాకిచ్చిన ఐసీసీ.. డబ్ల్యూటీసీపై ప్రభావం
యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్‌కు దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. ఇప్పటికే తొలి టెస్టులో ఓటమి చూసిన ఇంగ్లండ్ రెండో టెస్టులోనూ అదే తరహా ఆటతీరును ప్రదర్శిస్తోంది. తాజాగా ఇంగ్లండ్‌కు ఐసీసీ షాక్ ఇచ్చింది. బ్రిస్బేన్ వేదికగా ముగిసిన తొలి టెస్టులో స్లో ఓవర్‌రేట్ కారణంగా ఇంగ్లండ్‌కు డబ్ల్యూటీసీ నుంచి 8 పాయింట్లు కోత విధించింది. ఈ దెబ్బతో ఇంగ్లండ్ డబ్య్లూటీసీ పాయింట్ల పట్టికలో ఏడో స్థానానికి పడిపోయింది. అయితే తొలి టెస్టు ముగిసిన వెంటనే స్లో ఓవర్ రేట్ పేరుతో ఐసీసీ అప్పుడే ఇంగ్లండ్ జట్టు నుంచి 5 పాయింట్లు కోత విధిస్తున్నట్లు పేర్కొంది. తాజాగా దీనికి క్లారిటీ ఇస్తూ శుక్రవారం ఐసీసీ వివరణ ఇచ్చుకుంది. కాగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన తొలి టెస్టు నాలుగురోజుల్లోనే ముగిసింది. అయితే ఆట ముగిసేసమయానికి బౌలింగ్‌లో ఇంగ్లండ్ 8 ఓవర్లు వెనుకబడినట్లు తేలింది. ఆర్టికల్ 2.22 ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద ఆటగాళ్లు, సిబ్బంది నుంచి 20 శాతం మ్యాచ్ ఫీజు కోత విధించింది. దీంతో 8 ఓవర్ల స్లో ఓవర్ రేటు కారణంగా ఐదు పాయింట్లకు బదులు ఓవర్‌కు ఒక పాయింట్ చొప్పున 8 పాయింట్లు ఇంగ్లండ్ జట్టు నుంచి కోత విధిస్తున్నట్లు ఐసీసీ పేర్కొంది. ఐసీసీ ప్లేయింగ్ రూల్స్ క్లాజ్ 16.1.2 ప్రకారమే ఇంగ్లండ్ జట్టు నుంచి ఈ కోత విధిస్తున్నట్లు ఐసీసీ వివరించింది. ఇక ఇంగ్లండ్ తాజాగా 8 పాయింట్లు కోల్పోవడంతో ఓవరాల్‌గా 10 పాయింట్లు కోల్పోయి 6 మ్యాచ్‌ల్లో 1 విజయం.. మూడు ఓటములు.. ఇక డ్రాతో 10 పర్సంటేజీ పాయింట్లతో డబ్ల్యూటీసీ 2021-23 పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ రూల్ ప్రకారం మ్యాచ్ గెలిచిన జట్టుకు 12 పాయింట్లు, డ్రా చేసుకుంటే 4 పాయింట్లు, టై అయితే ఆరు పాయింట్లు ఇస్తారు. Here is how the WTC points table looks like after England are penalised 8 points for slow over-rate in the first Ashes Test 📈#Australia #England #AUSvENG #Ashes pic.twitter.com/hwRq2u4MCP — Sportskeeda (@Sportskeeda) December 17, 2021 -
టీమిండియా, ఇంగ్లండ్‌లకు షాకిచ్చిన ఐసీసీ
దుబాయ్: దుబాయ్: టీమిండియా, ఇంగ్లండ్‌లకు ఐసీసీ షాక్ ఇచ్చింది. నాటింగ్హమ్ వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా భారత్, ఇంగ్లండ్ క్రికెట్ల జట్లకు ఐసీసీ జరిమానా విధించింది. మ్యాచ్ ఫీజులో 40 శాతం కోత విధించడంతో పాటు వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్(2021-23)కు సంబంధించి ఇరు జట్ల నుంచి రెండు పాయింట్లు కోత విధించింది. ఈ విషయాన్ని ఐసీసీ బుధవారం స్పష్టం చేసింది. ఇక తొలి టెస్ట్ విషయానికి వస్తే.. వరుణుడు అడ్డం పడడంతో మ్యాచ్ డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 183 పరుగులకు ఆలౌట్ కాగా.. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 278 పరుగులకు ఆలౌట్ అయింది. తద్వారా 95 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆడిన ఇంగ్లండ్ 303 పరుగులకు ఆలౌట్ అయింది. 208 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా వికెట్ నష్టానికి 52 పరుగులు చేసింది. ఆట ఆఖరిరోజు పూర్తిగా వర్షార్పణం కావడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఇరు జట్ల మధ్య గురువారం(ఆగస్టు 12) నుంచి లార్డ్స్ వేదికగా రెండో టెస్టు జరగనుంది. -
IPL 2021: మూడోసారి తప్పుచేస్తే మ్యాచ్ నిషేధం
ముంబై: ఐపీఎల్ 14వ సీజన్‌కు సంబంధించి బీసీసీఐ పలు కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. సాఫ్ట్ సిగ్నల్ తొలగింపు, షార్ట్ రన్‌పై థర్ఢ్ అంపైర్ కన్ను, 90 నిమిషాల్లోనే ఒక ఇన్నింగ్స్ పూర్తి చేయడం( 20 ఓవర్లు) లాంటి కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ రూల్స్ అన్ని ఈ సీజన్ ప్రారంభం నుంచే అమల్లోకి రానున్నాయి. తాజాగా బీసీసీఐ మరో కీలక ప్రతిపాధనతో ముందుకొచ్చింది. స్లో ఓవర్‌రేట్ కారణంగా కొన్ని మ్యాచ్‌లు అనుకున్న సమయం కంటే ఎక్కువసేపు జరుగుతున్నాయి. దీంతో స్లో ఓవర్‌రేట్ నమోదు చేసే ఆయా జట్లకు బీసీసీఐ దండిగానే జరిమానా విధించనుంది. ఐపీఎల్ నిబంధనల ప్రకారం ఒకజట్టు మొదటిసారి స్లోఓవర్ రేటు నమోదు చేస్తే సదరు జట్టు కెప్టెన్‌కు రూ. 12 లక్షల జరిమానా విధించనుంది. రెండోసారి అదే తప్పు చేస్తే.. కెప్టెన్‌కు రూ. 24 లక్షల జరిమానాతో పాటు జట్టులోని సభ్యులందరి నుంచి ఫీజులో రూ. 6 లక్షలు లేదా 25 శాతం కోత విధించడం జరుగుతుంది. అయితే ఇక్కడ కెప్టెన్‌కు మినహాయింపు ఉంటుంది. ఇక మూడోసారి అదే తప్పు రిపీట్ అయితే మాత్రం కెప్టెన్‌కు రూ .30 లక్షల జరిమానాతో పాటు ఒక మ్యాచ్ ఆడకుండా నిషేదం పడనుంది. దీంతో పాటు జట్టు సభ్యులందరి మ్యాచ్ ఫీజులోంచి రూ. 12 లక్షలు లేదా 50శాతం కోత విధించనున్నారు. దీని నుంచి కూడా కెప్టెన్‌కు మినహాయింపు ఉంటుంది. కాగా ఐపీఎల్ 14వ సీజన్ ఏప్రిల్ 9న ముంబై ఇండియన్స్, ఆర్సీబీ మధ్య జరగనున్న మ్యాచ్‌తో ఆరంభం కానుంది. చదవండి: ఐపీఎల్ 2021: వైఫై అస్సలు బాలేదు.. సాయం చేయండి పంజాబ్ కింగ్స్ కొత్త జెర్సీ.. వారిని కాపీ కొట్టిందా! -
ఆ స్లో ఓవర్‌రేట్ మా కొంపముంచింది: లాంగర్
సిడ్నీ: టీమిండియాతో మెల్బోర్న్ వేదికగా జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ మా కొంపముంచిందంటూ ఆసీస్ ప్రధాన కోచ్ జస్టిన్ లాంగర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో జస్టిన్ లాంగర్ మాట్లాడుతూ.. ఆ మ్యాచ్‌లో మా బౌలర్లు గంటలో 15 ఓవర్లు వేయాల్సి ఉండగా.. రెండు ఓవర్లు తక్కువగా వేశారు. దాంతో మాపై స్లో ఓవర్ రేట్ నమోదైంది. ఐసీసీ నిబంధనల ప్రకారం మేము నాలుగు పాయింట్లు కోల్పోవాల్సి వచ్చింది. దాంతో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. అప్పటికీ ఈ విషయంపై మా జట్టు మేనేజర్ గెవిన్ డెవోయ్‌తో పాటు ఆసీస్ టెస్టు కెప్టెన్ టిమ్ పైన్‌తో చర్చించాను. స్లో ఓవర్ రేట్ వల్ల పాయింట్లు కోల్పోయే అవకాశం ఉందని.. అది ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌పై ప్రభావం చూపే అవకాశం ఉందని పేర్కొన్నా. ఇదే విషయంలో ఆసీస్ బౌలర్లను కూడా హెచ్చరించా. సిడ్నీ, బ్రిస్బేన్ టెస్టుల్లో స్లో ఓవర్‌రేట్ కాకుండా చూసుకోవాలని తెలిపా. కానీ అనూహ్యంగా కరోనా కారణంగా దక్షిణాఫ్రికా టూర్ రద్దవడం మాకు పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు. ఆ సిరీస్ రద్దు కావడం.. టీమిండియాతో జరిగిన సిరీస్‌ను మేం చేజార్చుకోవడంతో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ అర్హతకు మరింత దూరం కావాల్సి వచ్చింది. అంటూ తెలిపాడు. ఇదిలా ఉంచితే.. ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో టీమిండియా విజయం సాధించడం ద్వారా టెస్టుల్లో అగ్రస్థానంలో నిలవడంతో పాటు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో సగర్వంగా అడుగుపెట్టింది. జూన్‌లో సౌతాంప్టన్ వేదికగా జరగనున్న ఫైనల్లో టీమిండియా న్యూజిలాండ్‌ను ఎదుర్కోనుంది. అయితే డబ్ల్యూటీసీ పట్టికలో పీసీటీ పాయింట్ల పరంగా చూస్తే టీమిండియా 72 శాతంతో మొదటి స్థానంలో ఉండగా.. న్యూజిలాండ్ 70 శాతంతో రెండో స్థానంలో.. ఆసీస్ 69.2 శాతంతో మూడో స్థానంలో ఉన్నాయి. పాయింట్ల పరంగా చూస్తే.. కివీస్‌కు, ఆసీస్‌కు 0.8 శాతం తేడా మాత్రమే ఉంది. ఐసీసీ కొత్త నిబంధనల ప్రకారం... అనుకున్న సమయానికి ఒక ఓవర్ తక్కువ వేస్తే.. మ్యాచ్ ఫీజులో 20 శాతం జరిమానాతో పాటు రెండు ఫెనాల్టీ పాయింట్లు విధిస్తారు. ఆ విధంగా ఆసీస్ రెండు ఓవర్లు తక్కువ వేయడంతో మ్యాచ్ ఫీజులో 40 శాతం జరిమానాతో పాటు నాలుగు ఫెనాల్టీ పాయింట్లు దక్కించుకుంది. చదవండి: 'ఆ వార్తలు నా కుటుంబాన్ని బాధించాయి' ఆసీస్ జట్టులో విభేదాలు.. కారణం అతనే! -
దక్షిణాఫ్రికాకు భారీ షాక్
సెంచూరియన్: టీమిండియాతో జరిగిన రెండు టెస్ట్ మ్యాచ్‌ల్లో విజయం సాధించి సిరీస్‌ను దక్కించుకున్న దక్షిణాఫ్రికా జట్టుకు ఊహించని షాక్ తగిలింది. భారత్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో నిర్ణీత సమయంలో తక్కువ ఓవర్లు వేసినందుకు సఫారీ టీమ్‌కు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) భారీ జరిమానా విధించింది. రెండు ఓవర్లు తక్కువగా వేసినట్టు గుర్తించడంతో కెప్టెన్ డు ప్లెసిస్ మ్యాచ్ ఫీజులో 40 శాతం, జట్టు సభ్యుల మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత పెట్టింది. ఐసీసీ ప్రవర్తనా నియమావళి ప్రకారం నిర్దేశిత సమయంలో ఏదైనా జట్టు ఒక ఓవర్ తక్కువగా వేస్తే ఆటగాళ్లు, సహాయక సిబ్బంది మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధిస్తారు. కెప్టెన్‌కు రెట్టింపు జరిమానా వేస్తారు. దీని ప్రకారం సౌతాఫ్రికా టీమ్‌కు 20 శాతం జరిమానా విధించగా, డుప్లెసిస్ తన మ్యాచ్ ఫీజులో 40 శాతం కోల్పోనున్నాడు. కాగా మూడో రోజు ఆటలో అంపైర్లు, రిఫరీతో వాగ్వాదానికి దిగిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిపై కూడా ఐసీసీ మంగళవారం క్రమశిక్షణా చర్య తీసుకుంది. అతడి మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానాతో పాటు ఒక డీ మెరిట్ పాయింట్ వేసింది. ఆటగాళ్ల డీ మెరిట్ పాయింట్ల విధానం అమల్లోకి వచ్చాక కోహ్లి తొలిసారి ఈ చర్యకు గురయ్యాడు. -
దక్షిణాఫ్రికా క్రికెటర్లకు జరిమానా
కేప్ టౌన్: ఆస్ట్రేలియాతో జరిగిన ఐదో వన్డేలో స్లో ఓవరేట్తో బౌలింగ్ చేసినందుకు దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టుకు జరిమానా వేశారు. సౌతాఫ్రికా కెప్టెన్ డు ప్లెసిస్‌కు మ్యాచ్ ఫీజులో 20 శాతం, ఇతర ఆటగాళ్లకు మ్యాచ్ ఫీజులో 10 శాతం చొప్పున జరిమానా విధించారు. వచ్చే 12 నెలల్లో దక్షిణాఫ్రికా మరోసారి స్లో ఓవరేట్తో బౌలింగ్ చేస్తే డు ప్లెసిస్ సస్పెన్షన్ ఎదుర్కొనే ప్రమాదం ఉంది. ఇక ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్‌తో దురుసుగా ప్రవర్తించినందుకు దక్షిణాఫ్రికా స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్‌కు మ్యచ్ ఫీజులో 30 జరిమానా వేశారు. ప్రవర్తన నియమావళిని తాహిర్ ఉల్లంఘించాడని, ఇది క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని ఐసీసీ పేర్కొంది. -
బెయిలీపై ఓ మ్యాచ్ నిషేధం?
మెల్ బోర్న్: ఆస్ట్రేలియా కెప్టెన్ బెయిలీ పై ఒక్క మ్యాచ్ నిషేధం విధించే అవకాశం ఉంది. ఆదివారం భారత్‌తో జరిగిన మ్మాచ్‌లో ఆసీస్ స్లో ఓవర్ రేట్‌తో బౌలింగ్ చేసింది. దీంతో బెయిలీ సస్పెన్షన్‌కు గురయ్యే అవకాశం ఉంది. ఈ నెల 23 న ఇంగ్లాండ్ తో జరగనున్న మ్యాచ్‌లో బెయిలీ ఆడేది సందేహంగా మారింది.