
టెస్టు క్రికెట్ అంటే ఐదు రోజుల మ్యాచ్. రోజుకు 90 ఓవర్లు చొప్పున ఐదు రోజుల పాటు 450 ఓవర్లు అందుబాటులో ఉంటాయి. ఒకప్పుడు టెస్టు మ్యాచ్ అంటే కచ్చితంగా రోజులో 90 ఓవర్లు బౌలింగ్ చేయడం ఆనవాయితీగా వచ్చేది. కానీ రానురాను పరిస్థితి మారిపోయింది. స్లో ఓవర్ రేట్ .. వెలుతురులేమి.. వర్షం అంతరాయం ఇలా ఎన్నో అడ్డంకులు వస్తుండడంతో రోజులో 90 ఓవర్ల ఆట సాధ్యమవడం లేదు. అయితే వర్షం అంతరాయం, వెలుతురులేమి వదిలేస్తే ఓవర్ రేట్ అనేది మన చేతుల్లో పని.
- సాక్షి వెబ్‌డెస్క్
మ్యాచ్ ప్రారంభమైన సమయం నుంచి టైంను వృథా చేయకుండా బౌలింగ్ చేస్తే కచ్చితంగా రోజులో 90 ఓవర్లు పూర్తి చేయొచ్చు. ఆయా జట్ల కెప్టెన్లు ఇలా చేయలేక అనవసరంగా జరిమానాలు.. కొత్తగా డబ్ల్యూటీసీ పాయింట్లలో కోత పడుతుంది. ఇవన్నీ నష్టాన్ని కలిగించేవి. తాజాగా ఆస్ట్రేలియన్ దిగ్గజం ఇయాన్ చాపెల్ టెస్టు క్రికెట్‌లో వస్తున్న మార్పులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్ఫోలో చాపెల్ ఇదే అంశంపై తన కాలమ్‌లో రాసుకొచ్చాడు.
''టెస్టు మ్యాచ్‌లు అనేవి ఎప్పుడు ఆసక్తిగానే ఉంటాయి. వన్డే, టి20 క్రికెట్ వచ్చినా సంప్రదాయ ఫార్మాట్‌కు ఉన్న మోజు మాత్రం తగ్గలేదు. అయితే ఇప్పుడున్న టెస్టు క్రికెట్లో ప్రధానంగా వేధిస్తున్న సమస్య రోజులో 90 ఓవర్లు బౌలింగ్ పూర్తి చేయలేకపోవడం. వాతావరణ సమస్య.. వెలుతురులేమి ఇతరత్రా కారణాలు వదిలేస్తే మ్యాచ్‌లో మరో కీలకఅంశం ముడిపడి ఉంది. అదే ఓవర్ రేట్.
వన్డేలు, టి20లు ఒక్కరోజులో ముగిసేవి కాబట్టి స్లోఓవర్ రేట్ పడడం సాధారణం. కానీ టెస్టులు ఐదు రోజుల పాటు జరిగేవి. సరిగ్గా వినియోగించుకుంటే రోజులో కచ్చితంగా 90 ఓవర్లు బౌలింగ్ చేయొచ్చు. అలా చేయని పక్షంలో జట్టు కెప్టెన్ దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఒక టెస్టులో తమ బౌలర్లతో రోజులో 90 ఓవర్లు బౌలింగ్ చేయించకపోతే కెప్టెన్‌ను సస్పెండ్‌ను చేసే అంశాన్ని పరిగణించాలి. దీనివల్ల టెస్టు క్రికెట్‌లో కొంతైనా మార్పు వస్తుంది.
ఇటీవల ఇంగ్లండ్, టీమిండియాల మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో 90 ఓవర్ల ఆట కాస్త కనబడింది. దాదాపు మూడురోజులు ఇరు జట్లు 90 ఓవర్ల ఆట పూర్తి చేయడానికి మొగ్గుచూపాయి. ఇది అభినందిచాల్సిన విషయం. కొన్ని డీఆర్‌ఎస్‌లు సమయాన్ని వృథా చేయడంతో ఓవర్‌రేట్ పడడంతో మూడు నాలుగు ఓవర్లు మిగిలిపోయాయి. అందుకే ఓవర్ రేట్లపై తక్షణ శ్రద్ధ అవసరం. అంపైర్లు ఈ విషయంలో ఆన్-ఫీల్డ్ ప్రోటోకాల్‌ను అమలు చేయలేరు ఎందుకంటే వారికి అధికారాలు లేకపోవడమే. ఇక బౌలర్లు ఆరు గంటల్లో 90 ఓవర్లు బౌలింగ్ చేసేలా ప్రోత్సహించాలి. ఈ లక్ష్యం నెరవేరకపోతే కెప్టెన్‌ను ప్రశ్నించకుండా సస్పెండ్ చేయాలి. దశాబ్దాలుగా ఓవర్‌రేట్ అనేది టెస్టు క్రికెట్‌కు ఇబ్బందిగా మారింది. దీనివల్ల టెస్టు ఆటకు ముప్పు ఉందని'' చాపెల్ పేర్కొన్నాడు.
చదవండి: MS Dhoni: లండన్ వీధుల్లో ధోనికి వింత అనుభవం
England Cricketer Reece Topley: ఇంగ్లండ్ స్టార్ రీస్ టాప్లీ.. ఐదేళ్ల క్రితం కథ వేరే
Yasir Shah: రీఎంట్రీలోనూ సంచలనమే.. పాక్ బౌలర్ ప్రపంచ రికార్డు