
మెల్‌బోర్న్: టెస్టు క్రికెట్‌ను బతికించుకోవాలంటే ఏం చేయాలో అగ్రశ్రేణి ఆటగాళ్లంతా కూర్చొని చర్చించాలని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్ అభిప్రాయ పడ్డారు. ఈతరం ఆటనుంచి మంచి టెస్టు క్రికెటర్లు రావడం లేదని, ఎంత సేపూ భారీ హిట్టింగ్‌పైనే వారంతా దృష్టి పెడుతున్నారని ఆయన అన్నారు. ‘ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటేనే మున్ముందూ టెస్టు క్రికెట్ ప్రకాశిస్తుంది. లేదంటే అదంతా గతంలా మారిపోతుంది.
అన్ని రకాల నైపుణ్యాలతో అన్ని ఫార్మాట్‌లలోనూ రాణించాలంటే ప్రాధమికాంశాల్లో ఎంతో పట్టుండాలి. విరాట్ కోహ్లి దానికి అసలైన ఉదాహరణ. ఊరికే మాటలు చెప్పడం కాకుండా నిజంగా టెస్టు క్రికెట్‌కు తాము విలువ ఇస్తున్నామని భావిస్తే టాప్ ప్లేయర్లంతా ఆట భవిష్యత్తు కోసం తమ వైపునుంచి ప్రయత్నించాలి. విరాట్ కోహ్లి మాత్రమే అలాంటి వేదికకు సరైన అధికార ప్రతినిధి కాగలడు’ అని ఇయాన్ చాపెల్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
చదవండి: అందుకే సిరాజ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ ఇవ్వలేదట!
Comments
Please login to add a commentAdd a comment