Ian Chappell
-
పుజారా భయపడుతున్నాడు.. అయ్యర్ పిరికిపందలా ఉన్నాడు: ఆసీస్ మాజీ కెప్టెన్
India vs Australia, 3rd Test: ‘‘టీమిండియాలో కొంత మంది స్పిన్ బౌలింగ్‌లో అద్భుతంగా ఆడగలరని విన్నాను. కానీ వాళ్ల ఆట తీరు మాత్రం నన్ను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. తొలిరోజు ఆస్ట్రేలియన్లు ఇంకాస్త ముందే టీమిండియాను ఆలౌట్ చేస్తారనుకున్నా. పిచ్ సంగతి ఎలా ఉందన్న విషయం కాసేపు పక్కనపెడితే.. ఆస్ట్రేలియా స్పిన్నర్లు సరైన రీతిలో బౌలింగ్ చేశారు. తమకున్న అవకాశాలను చక్కగా సద్వినియోగం చేసుకున్నారు. కానీ భారత బ్యాటర్లు మాత్రం ఫెయిలయ్యారు. గత రెండు మ్యాచ్‌లలో ఆస్ట్రేలియా బ్యాటర్లు ఎలా తేలిపోయారో.. వీళ్లు కూడా అలాగే విఫలమయ్యారు. ముఖ్యంగా ఛతేశ్వర్ పుజారా భయపడుతూ బ్యాటింగ్ చేశాడు. ఈ సిరీస్ ఆరంభం నుంచే అతడు నెర్వస్‌గా కనిపిస్తున్నాడు. ఇక శ్రేయస్ అయ్యర్ స్పిన్ బౌలింగ్‌లో బాగా ఆడతాడని విన్నాను. కానీ.. ఇప్పటి వరకు అతడి నుంచి మెరుగైన బ్యాటింగ్ చూడలేకపోయాం. నేనైతే అతడి ఆట తీరుతో అస్సలు కన్విన్స్ కాలేకపోయాను. తనని చూస్తే వట్టి పిరికిపందలా అనిపించాడు’’ అని ఆస్ట్రేలియా టెస్టు దిగ్గజం ఇయాన్ చాపెల్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. పుజారా భయం భయంగా ఆస్ట్రేలియాతో మూడో టెస్టులో టీమిండియా బ్యాటర్లు ఛతేశ్వర్ పుజారా, శ్రేయస్ అయ్యర్ అంచనాలు అందుకోలేకపోయారని విమర్శించాడు. అదే సమయంలో.. ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్ చక్కగా సమన్వయం చేసుకుంటూ మెరుగైన ఇన్నింగ్స్ ఆడారని ప్రశంసించాడు. కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండోర్‌లో మార్చి 1న మొదలైన మూడో టెస్టులో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న సంగతి తెలిసిందే. అయితే, మూడో రోజు నుంచి బంతి స్పిన్‌కు టర్న్ అవుతుందని భావిస్తే.. తొలిరోజే గింగిరాలు తిరిగింది. దీంతో టీమిండియా బ్యాటర్లకు కష్టాలు తప్పలేదు. అంతా రివర్స్ ఆసీస్ స్పిన్నర్లు మాథ్యూ కుహ్నెమన్ ఐదు వికెట్లతో చెలరేగగా.. నాథన్ లియోన్ 3, టాడ్ మర్ఫీ ఒక వికెట్ తీశారు. దీంతో భారత జట్టు 109 పరుగులకే ఆలౌట్ అయింది. ముఖ్యంగా వన్‌డౌన్ బ్యాటర్ పుజారా ఒక్క పరుగుకే పరిమితం కాగా.. ఆరోస్థానంలో వచ్చిన శ్రేయస్ అయ్యర్ డకౌట్ అయి పూర్తిగా నిరాశపరిచాడు. విరాట్ కోహ్లి 22, శుబ్‌మన్ గిల్ 21 పరుగులు చేయగా.. మిగతా వాళ్లెవరూ కనీసం 20 పరుగుల మార్కును అందుకోలేకపోయారు. మరోవైపు.. ఆస్ట్రేలియా రెండో రోజు ఆటలో భాగంగా 197 పరుగులకు ఆలౌట్ అయింది. ఖవాజా 60, లబుషేన్ 31 పరుగులతో రాణించి ఆసీస్‌కు ఆధిక్యాన్ని అందించారు. అయితే, రెండో ఇన్నింగ్స్‌లో పుజారా రాణిస్తుండటం విశేషం. ముందుందిలే ఈ నేపథ్యంలో ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫో షోలో ఇయాన్ చాపెల్ మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇక అయ్యర్ రెండో టెస్టులో కేవలం 16 పరుగులు మాత్రమే చేయగా.. పుజారా 31 పరుగులతో అజేయంగా నిలిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇదిలా ఉంటే.. టీమిండియా ఫ్యాన్స్ మాత్రం ఇయాన్ వ్యాఖ్యలపై తమదైన శైలిలో కౌంటర్లు వేస్తున్నారు. ‘‘వాళ్లిద్దరు విఫలమైన మాట వాస్తవమే! అయినా రెండు టెస్టుల్లో ఏం జరిగిందో చూశారు కదా! ఇప్పుడే ఇంకా అయిపోలేదు. ముందుంది అసలైన సవాల్’’ అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. ఇక నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఇప్పటికే టీమిండియా రెండు విజయాలతో 2-0తో ఆధిక్యంలో ఉండగా.. మిగిలిన రెండు టెస్టుల్లో సత్తా చాటాలని ఆసీస్ ఉవ్విళ్లూరుతోంది. చదవండి: BGT 2023: 688వ వికెట్ అత్యంత ప్రత్యేకం.. అశ్విన్ అరుదైన ఘనత! కపిల్‌దేవ్‌ను దాటేసి.. BGT 2023: 688వ వికెట్ అత్యంత ప్రత్యేకం.. అశ్విన్ అరుదైన ఘనత! కపిల్‌దేవ్‌ను దాటేసి.. -
BGT: ఇప్పటి వరకు చెత్త పిచ్ ఇదే! కానీ 109 పరుగులకే ఆలౌట్ కావడం వారి వైఫల్యమే!
Ind vs Aus 3rd test- Ian Chappell Slams Players, Administrators Over Pitch: బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023 టెస్టు సిరీస్‌లో ముగిసిన తొలి రెండు టెస్టులతో పోలిస్తే ఇండోర్ పిచ్ చెత్తగా ఉందని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్ విమర్శించాడు. మేనేజ్మెంట్, ఆటగాళ్లు పిచ్ రూపకల్పన విషయంలో జోక్యం చేసుకోకూడదని, ఆ విషయాన్ని పూర్తిగా క్యూరేటర్కే వదిలేయాలన్నాడు. మూడో టెస్టు మొదటి రోజు కంగారూ జట్టుకు అదృష్టం కలిసి వచ్చిందని.. ఏదేమైనా 109 పరుగులకే ఆలౌట్ కావడం టీమిండియా వైఫల్యానికి నిదర్శనమని అభిప్రాయపడ్డాడు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2021-23 సీజన్లో భాగంగా టీమిండియా స్వదేశంలో ఆస్ట్రేలియాతో నాలుగు మ్యాచ్‌ల సిరీస్ ఆడుతున్న సంగతి తెలిసిందే. ఆది నుంచే పిచ్‌పై నిందలు సొంతగడ్డపై భారత్‌ను ఓడించడం తేలికైన విషయం కాదని ఆసీస్‌కు గతంలో ఎన్నోసార్లు అవగతమైంది. అయితే, ఈసారి మాత్రం ఎలాగైనా గత రికార్డులు చెరిపేస్తామంటూ ప్రగల్భాలు పలికారు ఆస్ట్రేలియా ఆటగాళ్లు. ఈ క్రమంలో సిరీస్ ఆరంభానికి ముందే పిచ్‌పై నిందలు వేయడం మొదలుపెట్టారు. నాగ్‌పూర్, ఢిల్లీ టెస్టులు రెండున్నర రోజుల్లోనే ముగిసి టీమిండియా విజయం సాధించడంతో ఆస్ట్రేలియా మీడియా సహా మాజీల విమర్శలు ఎక్కువయ్యాయి. ఉపఖండ పిచ్‌లపై అక్కసు వెళ్లగక్కుతూ అసహనం వ్యక్తం చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో తాజాగా ఇండోర్ మ్యాచ్‌లో తొలి రోజు నుంచే బంతి స్పిన్‌కు టర్న్‌కు అవుతుండటంతో విమర్శలు మరింత ఎక్కువయ్యాయి. ఇక మొదటి రోజు ఆటలో ఆసీస్ స్పిన్నర్లు మాథ్యూ కుహ్నెమన్, నాథన్ లియోన్, టాడ్ మర్ఫీ చెలరేగడంతో టీమిండియా 109 పరుగులకే తొలి ఇన్నింగ్స్ ముగించింది. ఈ నేపథ్యంలో ఇయాన్ చాపెల్ ఈఎస్‌పీఎన్‌క్రిక్ ఇన్ఫోతో మాట్లాడుతూ.. పిచ్ గురించి ఘాటు వ్యాఖ్యలు చేశాడు. అత్యంత చెత్తగా ఉంది.. కానీ ‘‘ఇప్పటి వరకు చూసిన మూడు పిచ్‌లలో ఇది అత్యంత చెత్తగా ఉంది. కానీ.. మరీ ఇక్కడ 109 పరుగులు మాత్రమే చేయడం అంటే బ్యాటర్ల వైఫల్యమే. టీమిండియా 109 పరుగులకే ఆలౌట్ కావడానికి పూర్తిగా పిచ్‌నే కారణంగా చెప్పలేము. నిజానికి ఆస్ట్రేలియాకు అదృష్టం కలిసి వచ్చిందనే చెప్పాలి. అయినా పిచ్ రూపకల్పన అన్న అంశం పూర్తిగా క్యూరేటర్కే వదిలేయాలి. అప్పుడే తమ ఆలోచనలకు అనుగుణంగా వాళ్లు మెరుగైన పిచ్ తయారు చేస్తారు. అప్పుడు ఆటగాళ్లు తమ పని చేసుకుంటారు. చెరువులో దూకమని చెప్పినట్లే అలా కాకుండా మేనేజ్మెంట్, క్రికెటర్లు క్యూరేటర్ దగ్గరికి వెళ్లి మాకు అలాంటి పిచ్ కావాలి! ఇలాంటి పిచ్ కావాలి! అని ఒత్తిడి చేస్తే క్యూరేటర్‌ను ఇబ్బందుల్లో పడేసినట్లే! మీరిలా చేస్తున్నారు అంటే క్యూరేటర్‌ను వెళ్లి చెరువులో దూకమని చెప్పడం కిందే లెక్క!’’ అని ఇయాన్ చాపెల్ పేర్కొన్నాడు. అప్పుడు కూడా ఇలాగే అంటారా? ఈ క్రమంలో టీమిండియా అభిమానులు ఇయాన్ చాపెల్ హితవచనాలకు తమదైన శైలిలో కౌంటర్లు వేస్తున్నారు. ‘‘ఆస్ట్రేలియాలో పేస్‌కు అనూకలించే పిచ్‌ల విషయంలోనూ పర్యాటక జట్టు ఓడిపోయినప్పుడు ఇలాగే మాట్లాడతావా? లేదంటే అప్పుడు మరోలా మాట మారుస్తావా? ఒకవేళ మొదటి రోజు టీమిండియా బ్యాటర్లు మంచి స్కోరు నమోదు చేస్తే ఏమనేవాడివో! అవును.. నాగ్‌పూర్, ఢిల్లీ మ్యాచ్‌లో మీ బ్యాటర్లు ఏం చేశారో గుర్తుందా?’’ అని కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. మూడో టెస్టులో ఆసీస్ 197 పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్ ముగించింది. చదవండి: Legends League Cricket 2023: ఇండియా, ఆసియా కెప్టెన్లు ఎవరంటే! PSL 2023: రోవమన్ పావెల్ ఊచకోత.. బాబర్ సేన ఘన విజయం -
అలా చేయకపోయుంటే కోహ్లి హవాలో రోహిత్ కొట్టుకుపోయేవాడు..!
Rohit Sharma-Virat Kohli: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గురించి ఆస్ట్రేలియా మాజీ సారధి ఇయాన్ ఛాపెల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మిడ్ డే కాలమ్‌కు రాసిన ఓ ఆర్టికల్‌లో ఛాపెల్ రోహిత్ శర్మతో పాటు టీమిండియా మాజీ సారధి, రన్ మెషీన్ విరాట్ కోహ్లి పేరునూ ప్రస్తావిస్తూ.. రోహిత్ శర్మను టెస్ట్‌ల్లో ఓపెనింగ్ స్థానంలో పంపడం వల్ల టీమిండియా మేనేజ్మెంట్ అతని కెరీర్‌ను కాపాడిందని, కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టడం హిట్‌మ్యాన్ కెరీర్లో నిలదొక్కుకోవడానికి దోహదపడిందని బోల్డ్ కామెంట్స్ చేశాడు. రోహిత్ మిడిలార్డర్ బ్యాటింగ్ దిగి తన అపార నైపుణ్యాన్ని వృధా చేసుకుంటున్నాడని ఓ దశలో అనిపించిందని, అప్పుడే రోహిత్ టెస్ట్ కెరీర్‌కు ఎండ్ కార్డ్ పడుతుందని భావించానని ఛాపెల్ తన కథనంలో పేర్కొన్నాడు. ఓపెనర్‌గా ప్రమోషన్ పొందే విషయంలో రోహిత్ టీమిండియా మేనేజ్మెంట్ను ఒప్పించడంలో సఫలం అయ్యాడని, వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్న హిట్‌మ్యాన్ ఓపెనర్‌గా స్థిరపడ్డాడని అన్నాడు. ఇలా జరుగకపోయి, మిడిలార్డర్లో, అదీ కోహ్లి తర్వాత బరిలోకి దిగుతూ వచ్చి ఉంటే.. రోహిత్ ఎప్పుడో కోహ్లి హవాలో కొట్టుకుపోయి ఉండేవాడని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించే క్రమంలో రోహిత్ బ్యాటింగ్ తీరు చాలా మెరుగుపడిందని, ఓ రకంగా చెప్పాలంటే కెప్టెన్సీ రోహిత్ కెరీర్‌ను కాపాడిందని అన్నాడు. ఇదే కాలమ్‌లో ఛాపెల్.. రోహిత్ శర్మ బ్యాటింగ్‌ను ఆకాశానికెత్తాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023లో భాగంగా నాగ్‌పూర్ వేదికగా ఆసీస్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో ఘన విజయం సాధించడంలో రోహత్ పెద్దన్న పాత్ర పోషించాడని, ఉపఖండపు పిచ్‌లపై ఎలా బ్యాటింగ్ చేయాలో రోహిత్ ఇరు జట్ల ఆటగాళ్లకు బోధపడేలా చేశాడని తెలిపాడు. తొలి టెస్ట్‌లో రోహిత్ మాస్టర్ క్లాస్ ఇన్నింగ్స్ ఆడాడని, మెలికలు తిరిగే పిచ్‌పై రోహిత్ సెంచరీ చేయడం అద్వితీయమని కొనియాడాడు. రోహిత్ కాన్ఫిడెంట్‌గా బ్యాటింగ్ చేస్తుండటం చూసి ఆసీస్ బౌలర్లు విసిగిపోయారని, ఇదీ రోహిత్ కెపాసిటీ అని ప్రశంసలు కురిపించాడు. -
45 ఏళ్ల కామెంటరీ కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన క్రికెట్ దిగ్గజం
ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్ తన 45 ఏళ్ల కామెంటరీ కెరీర్‌కు విడ్కోలు పలికాడు. చాపెల్ తన నిర్ణయాన్ని సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆదివారం ప్రకటించాడు. చాలా కాలం నుంచి కామెంటరీకు గుడ్‌బై చేప్పాలని ఆలోచనలో ఉన్నట్లు చాపెల్ తెలిపాడు. చాపెల్ 75 టెస్టు మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా తరపున ప్రాతినిథ్యం వహించాడు. వాటిలో 30 మ్యాచ్‌లకు ఆసీస్ కెప్టెన్‌గా చాపెల్ వ్యవహరించాడు. 1977లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన చాపెల్.. అనంతరం కామెంటెటర్‌గా తన కెరీర్ ప్రారంభించాడు. ఇక సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్‌తో చాపెల్ మాట్లాడుతూ.. "క్రికెట్ నుంచి నేను తప్పుకోవాలని అనుకున్న రోజు ఇప్పటకీ నాకు బాగా గుర్తుంది. నా క్రికెట్ కెరీర్లో అఖరి రోజు వాచ్ చూశాను. టైమ్ 11 దాటింది. ఇక చాలు అని డిసైడయ్యాను. ఇక వ్యాఖ్యానం విషయంలోనూ అదే నిర్ణయం తీసుకున్నా. కొన్నేళ్ల కిందట నాకు గుండెపోటు వచ్చింది. నేను అదృష్టవశాత్తూ ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాను. కానీ ఆ తర్వాత ఆరోగ్య పరంగా చాలా సమస్యలు ఎదుర్కొన్నాను. ఎక్కడికైనా ప్రయాణం చేయాలి అనుకున్న, మెట్లు ఎక్కడంలాంటి పనులు చేసిన అలసట ఎక్కువగా వచ్చేది. అ సమయంలో రగ్బీ లీగ్ వాఖ్యత లెజెండరీ రే వారెన్ చెప్పిన విషయం ఒకటి గుర్తొచ్చింది. ఒక తప్పు చేయడానికి ఒక అడగు దూరంలో మీరుంటారు అని అతడు చెప్పేవాడు. అప్పడే ఇక కామెంటరీని వదిలేయాలని నిర్ణయించుకున్నా" అని చాపెల్ పేర్కొన్నాడు. చదవండి: Hasin Jahan: ఇండియా పేరు మార్చండి.. ప్రధాని మోదీకి క్రికెటర్ షమీ ‘భార్య’ అభ్యర్ధన -
'రోజులో 90 ఓవర్లు వేయకపోతే ఇంకెందుకు?.. సస్పెండ్ చేయాల్సిందే'
టెస్టు క్రికెట్ అంటే ఐదు రోజుల మ్యాచ్. రోజుకు 90 ఓవర్లు చొప్పున ఐదు రోజుల పాటు 450 ఓవర్లు అందుబాటులో ఉంటాయి. ఒకప్పుడు టెస్టు మ్యాచ్ అంటే కచ్చితంగా రోజులో 90 ఓవర్లు బౌలింగ్ చేయడం ఆనవాయితీగా వచ్చేది. కానీ రానురాను పరిస్థితి మారిపోయింది. స్లో ఓవర్ రేట్ .. వెలుతురులేమి.. వర్షం అంతరాయం ఇలా ఎన్నో అడ్డంకులు వస్తుండడంతో రోజులో 90 ఓవర్ల ఆట సాధ్యమవడం లేదు. అయితే వర్షం అంతరాయం, వెలుతురులేమి వదిలేస్తే ఓవర్ రేట్ అనేది మన చేతుల్లో పని. - సాక్షి వెబ్‌డెస్క్ మ్యాచ్ ప్రారంభమైన సమయం నుంచి టైంను వృథా చేయకుండా బౌలింగ్ చేస్తే కచ్చితంగా రోజులో 90 ఓవర్లు పూర్తి చేయొచ్చు. ఆయా జట్ల కెప్టెన్లు ఇలా చేయలేక అనవసరంగా జరిమానాలు.. కొత్తగా డబ్ల్యూటీసీ పాయింట్లలో కోత పడుతుంది. ఇవన్నీ నష్టాన్ని కలిగించేవి. తాజాగా ఆస్ట్రేలియన్ దిగ్గజం ఇయాన్ చాపెల్ టెస్టు క్రికెట్లో వస్తున్న మార్పులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫోలో చాపెల్ ఇదే అంశంపై తన కాలమ్‌లో రాసుకొచ్చాడు. ''టెస్టు మ్యాచ్‌లు అనేవి ఎప్పుడు ఆసక్తిగానే ఉంటాయి. వన్డే, టి20 క్రికెట్ వచ్చినా సంప్రదాయ ఫార్మాట్‌కు ఉన్న మోజు మాత్రం తగ్గలేదు. అయితే ఇప్పుడున్న టెస్టు క్రికెట్లో ప్రధానంగా వేధిస్తున్న సమస్య రోజులో 90 ఓవర్లు బౌలింగ్ పూర్తి చేయలేకపోవడం. వాతావరణ సమస్య.. వెలుతురులేమి ఇతరత్రా కారణాలు వదిలేస్తే మ్యాచ్‌లో మరో కీలకఅంశం ముడిపడి ఉంది. అదే ఓవర్ రేట్. వన్డేలు, టి20లు ఒక్కరోజులో ముగిసేవి కాబట్టి స్లోఓవర్ రేట్ పడడం సాధారణం. కానీ టెస్టులు ఐదు రోజుల పాటు జరిగేవి. సరిగ్గా వినియోగించుకుంటే రోజులో కచ్చితంగా 90 ఓవర్లు బౌలింగ్ చేయొచ్చు. అలా చేయని పక్షంలో జట్టు కెప్టెన్ దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఒక టెస్టులో తమ బౌలర్లతో రోజులో 90 ఓవర్లు బౌలింగ్ చేయించకపోతే కెప్టెన్‌ను సస్పెండ్‌ను చేసే అంశాన్ని పరిగణించాలి. దీనివల్ల టెస్టు క్రికెట్లో కొంతైనా మార్పు వస్తుంది. ఇటీవల ఇంగ్లండ్, టీమిండియాల మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో 90 ఓవర్ల ఆట కాస్త కనబడింది. దాదాపు మూడురోజులు ఇరు జట్లు 90 ఓవర్ల ఆట పూర్తి చేయడానికి మొగ్గుచూపాయి. ఇది అభినందిచాల్సిన విషయం. కొన్ని డీఆర్ఎస్లు సమయాన్ని వృథా చేయడంతో ఓవర్‌రేట్ పడడంతో మూడు నాలుగు ఓవర్లు మిగిలిపోయాయి. అందుకే ఓవర్ రేట్లపై తక్షణ శ్రద్ధ అవసరం. అంపైర్లు ఈ విషయంలో ఆన్-ఫీల్డ్ ప్రోటోకాల్‌ను అమలు చేయలేరు ఎందుకంటే వారికి అధికారాలు లేకపోవడమే. ఇక బౌలర్లు ఆరు గంటల్లో 90 ఓవర్లు బౌలింగ్ చేసేలా ప్రోత్సహించాలి. ఈ లక్ష్యం నెరవేరకపోతే కెప్టెన్‌ను ప్రశ్నించకుండా సస్పెండ్ చేయాలి. దశాబ్దాలుగా ఓవర్‌రేట్ అనేది టెస్టు క్రికెట్‌కు ఇబ్బందిగా మారింది. దీనివల్ల టెస్టు ఆటకు ముప్పు ఉందని'' చాపెల్ పేర్కొన్నాడు. చదవండి: MS Dhoni: లండన్ వీధుల్లో ధోనికి వింత అనుభవం England Cricketer Reece Topley: ఇంగ్లండ్ స్టార్ రీస్ టాప్లీ.. ఐదేళ్ల క్రితం కథ వేరే Yasir Shah: రీఎంట్రీలోనూ సంచలనమే.. పాక్ బౌలర్ ప్రపంచ రికార్డు -
Ind Vs Eng: బుమ్రాకు కెప్టెన్సీ ఇవ్వడం పెద్ద సాహసమే! అందుకేనేమో!
India Vs England 5th Test: టీమిండియా టెస్టు జట్టు తాత్కాలిక కెప్టెన్‌గా జస్ప్రీత్ బుమ్రాను నియమించడాన్ని ఆస్ట్రేలియా దిగ్గజం ఇయాన్ చాపెల్ సాహసోపేతమైన నిర్ణయంగా అభివర్ణించాడు. బహుశా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ టెస్టు జట్ల కెప్టెన్ల నియామకాల్ని చూసి బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుని ఉంటుందని అభిప్రాయపడ్డాడు. కాగా ఇంగ్లండ్‌తో రీషెడ్యూల్డ్(ఐదో) టెస్టుకు ముందు రోహిత్ శర్మ కోవిడ్ బారిన పడిన నేపథ్యంలో బుమ్రాకు బీసీసీఐ సారథ్య బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్‌లో బుమ్రా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు. 16 బంతుల్లో 31 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అదే విధంగా ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో భాగంగా 3 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. కెప్టెన్‌గా, ఆటగాడిగా అద్భుతంగా రాణించాడు. అయితే, నాలుగో రోజు ఆటలో ఇంగ్లండ్ పైచేయి సాధించడంతో అంతా తలకిందులైంది. నిజంగా పెద్ద సాహసమే! ఇదిలా ఉంటే.. బుమ్రాకు కెప్టెన్సీ ఇవ్వడంపై స్పందించిన ఆసీస్ మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్ ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫో కాలమ్‌లో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ‘‘టెస్టు జట్టు కెప్టెన్లుగా ప్యాట్ కమిన్స్, బెన్‌స్టోక్స్ సక్సెస్ చూసిన ఇండియా.. ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాను ఇంగ్లండ్‌తో టెస్టుకు సారథిగా నియమించినట్లుంది. నిజానికి ఇది చాలా సాహసోపేతమైన నిర్ణయం. బుమ్రా సమర్థత ఏమిటో ఈ ఒక్క విషయంతో అర్థం చేసుకోవచ్చు’’ అని ప్రశంసలు కురిపించాడు. అదే విధంగా టెసుట క్రికెట్లో ఇంగ్లండ్ కెప్టెన్‌గా బెన్‌స్టోక్స్, ఆసీస్ సారథిగా ప్యాట్ కమిన్స్ సమర్థవంతంగా జట్టును ముందుకు నడిపిస్తున్నారని, వాళ్ల సక్సెస్ తనకు ఏమాత్రం ఆశ్చర్యం కలిగించడం లేదంటూ ప్రశంసించాడు. చదవండి: Ind Vs Eng: జాతి వివక్ష.. టీమిండియా ఫ్యాన్స్‌కు చేదు అనుభవం.. అసభ్య పదజాలంతో దూషిస్తూ.. -
'ఇయాన్ చాపెల్ వ్యాఖ్యలను బాత్రూం అద్దానికి అంటించా'
Steve Smith Says Ian Chapell Coloumn Stuck On Bathroom Mirror: ఆస్ట్రేలియా సీనియర్ ఆటగాడు స్టీవ్ స్మిత్ కెరీర్లో బాల్ టాంపరింగ్ ఉదంతం ఒక చీకటికోణంలా మిగిలిపోయింది. 2018లో సౌతాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో డేవిడ్ వార్నర్, బెన్క్రాఫ్ట్లతో కలిసి స్మిత్ బాల్ టాంపరింగ్‌కు పాల్పడడం సంచలనంగా మారింది. ఈ అంశం అప్పట్లో తీవ్ర దుమారం రేపడంతో క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) సీరియస్‌గా పరిగణించింది. కెప్టెన్సీ పదవి నుంచి స్మిత్‌ను తొలిగించిన సీఏ అతనితో పాటు డేవిడ్ వార్నర్‌పై ఏడాదిపాటు నిషేధం.. బెన్‌క్రాఫ్ట్‌పై తొమ్మిది నెలల నిషేధం విధించింది. అలా 2018 నుంచి 2019 వరకు క్రికెట్‌కు దూరంగా ఉన్న స్మిత్ రీ ఎంట్రీలో అదరగొట్టాడు. చదవండి: WI vs SL: క్రీజులో పాతుకుపోయాడు.. తెలివైన బంతితో బోల్తా తాజాగా ఇంగ్లండ్‌తో యాషెస్ సిరీస్‌కు సిద్ధమవుతున్న ఈ ఆసీస్ ఆటగాడు మరోసారి ఆ చీకటి రోజులను గుర్తుచేసుకున్నాడు. ఆ సమయంలో ఇయాన్ చాపెల్ చేసిన వ్యాఖ్యలు తనకు ఎప్పటికి గుర్తుండిపోయాయని చెప్పుకొచ్చాడు. '' బాల్ టాంపరింగ్ ఉదంతం నాకు చీకటిరోజులు. ఈ ఉదంతంతో ఏడాది పాటు నిషేధం ఎదుర్కొన్న నేను నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపాను. నాకు ఇయాన్ చాపెల్ వ్యాఖ్యలు బాగా గుర్తున్నాయి. ఒక పత్రికలో ఇయాన్ చాపెల్ తన కాలమ్‌లో '' బాల్ టాంపరింగ్ ఉదంతంతో ఏడాది పాటు ఆటకు దూరం కానున్న స్మిత్ .. ఏడాది తర్వాత రీ ఎంట్రీలో అతనిలో అదే బ్యాటర్ కనబడడు'' అని పేర్కొన్నాడు. ఇయాన్ చాపెల్ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న నేను ఆ పేపర్ ముక్కను కట్‌చేసి నా బాత్రూం గోడకు తగిలించాను. ప్రతీరోజు రాత్రి నిద్రపోయే ముందు.. ఉదయం నిద్ర లేవగానే దానిని చూసుకునేవాడిని. ఆ వ్యాఖ్యల చదువుతూ బ్రష్ చేసేవాడిని. అయితే 2019లో రీఎంట్రీ తర్వాత యాషెస్ సిరీస్‌లో భాగంగా ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీలు సాధించాను. ఈ ఒక్క ఇన్నింగ్స్‌తో అటు చాపెల్‌కు.. విమర్శలకు ఒక విషయం చెప్పా.. అదేంటంటే.. ''నిషేధం తర్వాత నేను ఏం కోల్పోలేదు.. అది ఇంకా నా దగ్గరే ఉంది''. ఈ విషయం నాకు ఎప్పుడు గుర్తుకు వచ్చినా నేను సాధించాననే సంతోషం కలుగుతుంది'' అంటూ పేర్కొన్నాడు. చదవండి: Joshua da Silva Vs Dhananjaya de Silva: వార్నీ.. ప్రతీకారం ఇలా కూడా తీర్చుకుంటారా! ఇక ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లు ప్రతిష్టాత్మకంగా భావించే యాషెస్ టెస్టు సిరీస్ డిసెంబర్ 8 నుంచి ప్రారంభం కానుంది. ఇక సెక్స్ స్కాండల్ ఆరోపణలతో టిమ్ పైన్ అనూహ్యంగా కెప్టెన్సీ పదవికి రాజీనామా చేయడంతో పాట్ కమిన్స్‌కు నాయకత్వ బాధ్యతలు అప్పగించారు. ఇక స్టీవ్ స్మిత్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్న సంగతి తెలిసిందే. ఇక 2019లో జరిగిన యాషెస్ సిరీస్‌ను ఆస్ట్రేలియా 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఏడాది నిషేధం నుంచి తిరిగొచ్చిన స్టీవ్ స్మిత్ ఈ సిరీస్‌లో రెండు సెంచరీలు సహా మొత్తంగా 777 పరుగులు సాధించి ఆసీస్ సిరీస్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. -
టీ20 ప్రపంచకప్‌లో సెమీస్‌కు చేరే జట్లు ఇవే...
Ian Chappell picks his semifinal contenders: టీ20 ప్రపంచకప్- 2021లో భాగంగా ప్రస్తుతం సూపర్ 12 పోటీలు జరగుతున్నాయి. ఈ క్రమంలో ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు ఇయాన్ ఛాపెల్ సెమీఫైనల్‌కు చేరే జట్లను ముందుగానే అంచనావేశాడు. ఈ మెగా టోర్నీలో గ్రూప్-1 నుంచి ఇంగ్లండ్, వెస్టిండీస్, గ్రూప్-2 నుంచి భారత్, పాకిస్తాన్ సెమీఫైనల్‌కు ఆర్హత సాధిస్తాయని ఛాపెల్ అభిప్రయపడ్డాడు. అయితే గ్రూప్ 2 లో మిగితా జట్లకు కేన్ విలియమ్సన్ నేతృత్వంలోని న్యూజిలాండ్ జట్టు గట్టి పోటిస్తుంది అని అతడు తెలిపాడు. "గ్రూప్ 2నుంచి సెమిఫైనల్‌కు చేరే అవకాశాలు భారత్, పాకిస్తాన్లకు ఎక్కువగా ఉన్నాయి. అయితే వారికి న్యూజిలాండ్ నుంచి గట్టి పోటి ఉంటుంది. కాగా గ్రూప్ 1లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా,వెస్టిండీస్ నాలుగు జట్లు పటిష్టంగా ఉన్నాయి. అంచనా వేయడం చాలా కష్టం. కానీ ఇంగ్లండ్, వెస్టిండీస్‌లకు సెమీఫైనల్‌కు చేరే అవకాశాలు ఉన్నాయి. టీ20 ప్రపంచకప్ ఒక లాటరీ లాంటిది అని ఛాపెల్ ఓ స్పోర్ట్స్ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. యూఏఈ పరిస్ధితులు పాక్‌కు బాగా కలిసొచ్చాయి... టీ20 వరల్డ్‌కప్-2021 టోర్నీలో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఓటమిపై ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు ఇయాన్ ఛాపెల్ స్పందించాడు. యూఏఈలో ఆడిన ఆనుభవం పాక్‌ను గెలిపించింది అని అతడు తెలిపాడు. "గత దశాబ్దం నుంచి యూఏఈలో పాకిస్తాన్ క్రికెట్ ఆడుతుంది. అక్కడి పరిస్థితులు ఆ జట్టుకు బాగా తెలుసు. యూఏఈలో ఆడిన ఆనుభవం పాక్‌కు ఈ టోర్నమెంట్లో బాగా కలిసిస్తోంది అని భావిస్తున్నాను. మరోవైపు ఇటీవల ముగిసిన ఐపీఎల్లో జట్టులోని చాలా మంది ఆటగాళ్లు అక్కడ ఆడినందున భారత్‌కు కూడా ప్రయోజనం చేకూరుతుంది" అని ఛాపెల్ తెలిపాడు. చదవండి: Ind Vs Pak: టీమిండియా చేసిన పెద్ద తప్పు అదే.. అతడిని ఆడించకపోయి ఉంటే: ఆసీస్ మాజీ క్రికెటర్ -
Test Cricket: కోహ్లిని ‘అధికార ప్రతినిధి’ని చేయండి!
మెల్బోర్న్: టెస్టు క్రికెట్‌ను బతికించుకోవాలంటే ఏం చేయాలో అగ్రశ్రేణి ఆటగాళ్లంతా కూర్చొని చర్చించాలని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్ అభిప్రాయ పడ్డారు. ఈతరం ఆటనుంచి మంచి టెస్టు క్రికెటర్లు రావడం లేదని, ఎంత సేపూ భారీ హిట్టింగ్‌పైనే వారంతా దృష్టి పెడుతున్నారని ఆయన అన్నారు. ‘ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటేనే మున్ముందూ టెస్టు క్రికెట్ ప్రకాశిస్తుంది. లేదంటే అదంతా గతంలా మారిపోతుంది.అన్ని రకాల నైపుణ్యాలతో అన్ని ఫార్మాట్లలోనూ రాణించాలంటే ప్రాధమికాంశాల్లో ఎంతో పట్టుండాలి. విరాట్ కోహ్లి దానికి అసలైన ఉదాహరణ. ఊరికే మాటలు చెప్పడం కాకుండా నిజంగా టెస్టు క్రికెట్‌కు తాము విలువ ఇస్తున్నామని భావిస్తే టాప్ ప్లేయర్లంతా ఆట భవిష్యత్తు కోసం తమ వైపునుంచి ప్రయత్నించాలి. విరాట్ కోహ్లి మాత్రమే అలాంటి వేదికకు సరైన అధికార ప్రతినిధి కాగలడు’ అని ఇయాన్ చాపెల్ అభిప్రాయం వ్యక్తం చేశారు. చదవండి: అందుకే సిరాజ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ ఇవ్వలేదట!Virat Kohli: 'కోహ్లి నోరు తెరిస్తే బూతులే': మాజీ క్రికెటర్ -
‘క్రికెట్ జట్లను నడిపించడానికే పుట్టాడు’
మెల్బోర్న్: ఆస్ట్రేలియాతో ఇక్కడ జరిగిన రెండో టెస్టులో టీమిండియా విజయం సాధించడంతో కెప్టెన్‌గా వ్యవహరించిన అజింక్యా రహానేపై సర్వత్రా ప్రశంసలు వర్షం కురుస్తూనే ఉంది. విరాట్ కోహ్లి గైర్హాజరీతో జట్టును ఎలా ముందుకు తీసుకెళతాడో అన్న వాళ్లకి రహానే మ్యాచ్ గెలిపించి చూపించాడు. కాగా, ఆ మ్యాచ్‌లో సెంచరీతో జట్టును గట్టెక్కించి విజయంలో కీలక పాత్ర పోషించిన రహానేను ఆసీస్ మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్ కొనియాడాడు. క్రికెట్ కోసమే రహానే పుట్టాడని చాపెల్ అభినందించాడు. ఈసీపీఎన్ క్రికెట్ ఇన్ఫోకు రాసిన కాలమ్‌లో రహానేను చాపెల్ ప్రత్యేకంగా ప్రశంసించాడు. (రోహిత్ బీఫ్ ఆర్డర్ చేశాడా.. హిట్‌మ్యాన్‌పై ట్రోలింగ్!) ‘రహానే చాలా ధైర్యవంతుడే కాదు.. ఒక స్మార్ట్ క్రికెటర్ కూడా. క్రికెట్ జట్లను నడిపించడానికే పుట్టాడు. 2017లో ధర్మశాలలో జరిగిన టెస్టు మ్యాచ్‌లో కూడా రహానే సారథ్యం వహించి జట్టును గెలిపించాడు. 2017లో ఆ మ్యాచ్‌కు మొన్న ఎంసీజీలో జరిగిన మ్యాచ్‌కు చాలా ఎక్కువగా దగ్గర పోలికలున్నాయి. ఆసీస్ క్రికెటర్లు వార్నర్-స్మిత్‌లు సెంచరీకి పైగా భాగస్వామ్యం నమోదు చేసిన దశలో కుల్దీప్ యాదవ్‌కు బౌలింగ్ ఇచ్చి ఆ జోడిని విడగొట్టాడు. కుల్దీప్ బౌలింగ్‌లో వార్నర్ స్లిప్‌లో రహానేకే క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ సమయంలో కుల్దీప్ యాదవ్‌తో బౌలింగ్ చేయించడం చాలా గొప్ప ముందుచూపు. అదే అతని కెప్టెన్సీ సక్సెస్‌కు కారణం కూడా. ఆ నేపథ్యంలో టీమిండియాకు రహానే కెప్టెన్‌గా చేయడంలో ఆశ్చర్యం ఏమీలేదు. అతనికి కెప్టెన్‌గా చేసే అన్ని అర్హతలు ఉన్నాయి. అతను కెప్టెన్‌గా చేసే జట్టుకు ఎంతో గౌరవం ఇస్తాడు’ అని ఇయాన్ చాపెల్ పేర్కొన్నాడు. -
'శాస్త్రి ఆ విషయం నాకు ముందే చెప్పాడు'
ముంబై : ఆసీస్‌తో జరగనున్న నాలుగు టెస్టు సిరీస్‌లో భాగంగా మొదటి టెస్టు డిసెంబర్ 17 నుంచి అడిలైడ్ వేదికగా ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో టీమిండియా బౌలింగ్ కూర్పులో మూడో సీమర్ ఎవరనే దానిపై చర్చ నడుస్తుంది. అయితే ఆసీస్‌తో జరగబోయే తొలి టెస్టులో మూడో పేసర్ ఎవరన్నది తనకు తెలుసని ఆసీస్ మాజీ ఆటగాడు ఇయాన్ చాపెల్ పేర్కొన్నాడు. ప్రస్తుతమున్న అనుభవం దృష్యా ఉమేశ్ యాదవ్‌కే మూడో పేసర్‌గా ఎక్కువ అవకాశాలు ఉన్నాయని తెలిపాడు. (చదవండి : డ్రింక్స్ తాగడానికే ఐపీఎల్‌కు వచ్చేవాడు : సెహ్వాగ్) 'టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రితో కలిసి సరదాగా డ్రింక్ తాగుతున్న సందర్భంగా ఈ అంశం చర్చకు వచ్చింది. తొలి టెస్టుకి టీమిండియాలో మూడో పేసర్ అవసరం ఉందని.. ఇషాంత్ గైర్హాజరీలో అనుభవం దృష్యా ఉమేశ్‌కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని శాస్త్రి నాతో చెప్పాడు. ప్రస్తుతం టీమిండియా టెస్టు జట్టులో మహ్మద్ షమీ, బుమ్రాలు కీలకంగా మారారని.. ఉమేశ్ లాంటి బౌలర్ ఉంటే మరింత ప్రయోజనం కలుగుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో టీమిండియా తొలి టెస్టును డే నైట్‌లో ఆడడం సానుకూలాశంగా మారనుంది. ఒకవేళ భారత్ మొదటి బ్యాటింగ్ చేసి 300 పరుగులు సాధిస్తే గెలిచే అవకాశాలు మెండుగా ఉంటాయి. మొదటి టెస్టు తర్వాత కోహ్లి స్వదేశానికి వెళ్లనున్ననేపథ్యంలో టీమిండియాకు మిగిలిన టెస్టుల్లో ఇబ్బందులు ఎదురయ్యే చాన్స్‌లు ఉన్నాయి. కాగా కోహ్లి స్థానంలో అజింక్యా రహానే మిగిలిన మూడు టెస్టులకు కెప్టెన్‌గా పనిచేయనున్నాడు.(చదవండి : ‘కోహ్లిని పక్కకు పెట్టి ఒత్తిడి తగ్గించండి’) వాస్తవానికి ఆసీస్ టూర్‌కు మొదట ఇషాంత్ శర్మ మూడో పేసర్‌గా ఎంపికయ్యాడు. అయితే ఐపీఎల్ 13వ సీజన్ సందర్భంగా ఇషాంత్ గాయపడడంతో ఆసీస్ టూర్ నుంచి తప్పించారు. అతని స్థానంలో మహ్మద్ సిరాజ్‌ను తీసుకున్నారు. ప్రస్తుతం టీమిండియా పేస్ బౌలింగ్ దళంలో షమీ, బుమ్రాలతో పాటు ఉమేశ్ యాదవ్, నవదీప్ సైనీ, మహ్మద్ సిరాజ్‌లు ఉన్నారు. -
ఆ షాట్లను బ్యాన్ చేయండి..
సిడ్నీ; క్రికెట్లో స్విచ్ హిట్ షాట్లకు చరమగీతం పాడాలని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఇయాన్ చాపెల్ అభిప్రాయపడ్డాడు. గత కొన్ని రోజులుగా స్విచ్ హిట్ షాట్లపై పదే పదే వార్తలో నిలుస్తున్న చాపెల్.. ఒకవేళ ఆ షాట్లు ఆడితే దాన్ని డెడ్‌బాల్‌గా ప్రకటించాలని సూచించాడు. ఆసీస్ క్రికెటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఈ తరహా షాట్లతో టీమిండియాతో జరుగుతున్న సిరీస్‌లో అలరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే స్విచ్ షాట్ అనేది బ్యాట్స్‌మెన్‌కు ఎక్కువ ప్రయోజనం చేకూరుస్తుందని, ఇది సరికాదని ఇయాన్ చాపెల్ పేర్కొన్నాడు. ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫోకు రాసిన ఒక కాలమ్‌లో స్విచ్ హిట్‌పై ఇయాన్ చాపెల్ ధ్వజమెత్తాడు. (పృథ్వీ షా, గిల్ డకౌట్లు.. రహానే శతకం) ‘స్విచ్ హిట్టర్లకు ఇది చాలా ప్రయోజనం చేకూరుస్తుంది. ఆ షాట్‌ను బ్యాన్ చేయడమే మార్గం. లేకపోతే ఆ బాల్‌ను డెడ్‌బాల్‌గా ప్రకటించాలి’ అని పేర్కొన్నాడు. ఇది ఫీల్డ్ అంపైర్లకు అదనపు పనిగా మారిపోతుందని అంతర్జాతీయ మాజీ అంపైర్ సైమన్ టైఫల్ పేర్కొన్నాడు. అది స్విచ్ హిట్ అవునా.. కాదా అనే విషయాన్ని అంచనా వేయడం అంపైర్లకు కొన్ని సందర్భాల్లో కఠినంగా మారిపోతుందన్నాడు. అయితే దీనితో చాపెల్ విభేదించాడు. ఇది కాస్త కఠినతరమే అయినా తప్పదన్నాడు. స్వేర్ లెగ్ అంపైర్ ఎప్పుడూ బ్యాట్స్‌మన్ కాళ్ల కదిలికలను చూస్తూ ఉంటాడు కాబట్టి దాన్ని వారికే అప్పచెప్పాలన్నాడు. స్టంపింగ్ విషయాన్ని లెగ్ అంపైర్ ఎలా చూస్తాడో అలానే స్విచ్ హిట్ల పని కూడా వారికే అప్పచెబితే బాగుంటుందన్నాడు. -
కోహ్లి దూరం: ఆ చాన్స్ కొట్టేస్తే లక్కీయే!
సిడ్నీ: కరోనా లాక్డౌన్లో ఎంటర్టైన్మెంట్ లేక మొహం వాచిపోయిన క్రికెట్ అభిమానులను ఐపీఎల్ 2020 కొంత అలరించింది. అయితే, వేదిక యూఏఈలో కావడం, మ్యాచ్‌లు వీక్షించేందుకు అభిమానులకు అవకాశం లేకపోవడం అక్కడ మైనస్. ఈక్రమంలోనే మరో ఐదు రోజుల్లో ఆస్ట్రేలియా భారత్ మధ్య మొదలు కానున్న క్రికెట్ సమరంపై అటు క్రీడాకారులు, ఇటు అభిమానులు ఉత్సుకతతో ఎదురు చూస్తున్నారు. సీటింగ్ కెపాసిటీలో సగం మంది అభిమానులను ఈ మ్యాచ్‌లకు అనుమతించడమే దీనికి కారణం. ఇక విరాట్ కోహ్లి సారథ్యంలోని టీమిండియా ఆసీస్ గడ్డపై 2018-19 బోర్డర్ గావస్కర్ ట్రోఫిని సాధించి రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. 2-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా మళ్లీ అదే మ్యాజిక్ చేయాలని ఉవ్విళ్లూరుతోంది. అయితే, తొలి టెస్టు అవగానే కోహ్లి భారత్‌కు తిరుగుపయనం కానుండటం కలవరపెట్టే విషయం. అనుష్క శర్మ డెలివరీ నేపథ్యంలో డిసెంబర్ 17న మొదలయ్యే తొలి టెస్టు తర్వాత కోహ్లి స్వదేశానికి రానున్నాడు. (చదవండి: పుజారా,రహానేలు కీలకం) మిగతా మూడు టెస్టులకు కోహ్లి దూరమవడం టీమిండియా బ్యాటింగ్‌పై తీవ్ర ప్రభావం చూపడం ఖాయమని ఆసీస్ మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్ అభిప్రాయపడ్డాడు. కోహ్లి స్థానంలో ఎవరిని ఎంపిక చేయాలనే విషయమై భారత సెలక్టర్లకు పరీక్షగా మారిందని చెప్పాడు. కోహ్లి స్థానంలో యువ ఆటగాడికి అవకాశం కల్పిస్తే మాత్రం వారు అదృష్టవంతులని ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫోతో మాట్లాడుతూ చాపెల్ పేర్కొన్నాడు. ఆసీస్ జట్టుకు కూడా వార్నర్‌తో పాటు ఓపెనింగ్‌కు దిగే జోడి సెలక్షన్ కష్టంగా మారిందని, యువ క్రికెటర్ పుకోవ్స్కీ దానికి సరిపోతాడని అనుకుంటున్నట్టు చాపెల్ తెలిపాడు. ఇక ఇరు దేశాల మధ్య జరగుతున్న నాలుగు టెస్టుల సిరీస్ ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్లో భాగం. టెస్టు చాంపియన్ షిప్లో ప్రస్తుతం భారత్-ఆస్ట్రేలియాలు టాప్‌లో ఉన్నాయి. (చదవండి: భారత్ వెళ్లేందుకు బోర్డు అవకాశం ఇచ్చినా...) -
ఐపీఎల్ కఠిన పరీక్ష లాంటిది: ఇయాన్ చాపెల్
న్యూఢిల్లీ: భారత్, ఆస్ట్రేలియా క్రికెటర్లకు ఈ ఏడాది జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కఠిన పరీక్ష లాంటిదని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్ పేర్కొన్నాడు. కరోనా విరామం అనంతరం జరుగుతోన్న అతిపెద్ద, సుదీర్ఘ క్రికెట్ టోర్నీ ఇదే అవ్వడం, అందులోనూ ‘బయో సెక్యూర్ బబుల్’ దాటి వెళ్లకుండా అన్ని రోజుల పాటు ఉండటం క్రికెటర్లకు సవాల్ లాంటిదే అని ఆయన పేర్కొన్నాడు. ఇక్కడ వీరు కుదురుకోగలిగితే... ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియా వేదికగా జరిగే భారత్–ఆస్ట్రేలియా సిరీస్‌లో ఆటగాళ్లు పెద్దగా ఇబ్బంది పడే అవకాశం ఉండదని చాపెల్ వ్యాఖ్యానించాడు. ‘మనసుంటే మార్గముంటుంది. అత్యుత్తమ ప్లేయర్లు ఊరికే ఉండరు. సవాళ్ల నుంచి సమాధానాలను సాధిస్తారు. మనం ప్రస్తుతం కరోనా కాలంలో ఉన్నాం. బయో సెక్యూర్ బబుల్స్, ఐసోలేషన్ నిబంధనలు, భౌతిక దూరం అంటూ క్రికెట్లో సరికొత్త మార్పులను చూస్తున్నాం. అంతర్జాతీయ క్రికెట్ ఆడేవాళ్లు వీటికి అలవాటు పడాలి’ అని చాపెల్ పేర్కొన్నాడు. ఐపీఎల్ తర్వాత ఆస్ట్రేలియాలో భారత్ పర్యటించాల్సి ఉండటంతో... ఇటువంటి పరిస్థితులకు భారత క్రికెటర్లు ఎంత త్వరగా అలవాటు పడితే అంత మంచిదని చాపెల్ అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ ముగిసిన వెంటనే భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు బయలుదేరనుంది. అందులో భారత్ మూడు ఫార్మాట్లలో సిరీస్‌లను ఆడనుంది. -
బీసీసీఐ మాటే నెగ్గుతుంది: చాపెల్
మెల్బోర్న్: షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది టి20 వరల్డ్ కప్ జరిగే అవకాశాలు చాలా స్వల్పంగా కనిపిస్తున్నాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్ అన్నారు. అక్టోబర్‌లో ఈ మెగా టోర్నీ జరుగుతుందనే నమ్మకం తనకు లేదని చాపెల్ పేర్కొన్నారు. బీసీసీఐ తలచుకుంటే ఐసీసీ టోర్నీ స్థానంలో ఐపీఎల్ నిర్వహించే అవకాశముందని ఆయన అభిప్రాయపడ్డారు. ‘అక్టోబర్‌లో ఐపీఎల్ నిర్వహించాలని బీసీసీఐ అనుకుంటే వారికి కచ్చితంగా మార్గం సుగమం అవుతుంది. ఈ విషయంలో బీసీసీఐ గెలుస్తుంది. ఈ పరిస్థితుల్లో వరల్డ్ కప్ నిర్వహణకు చాలా తక్కువ అవకాశాలున్నాయి. అసలు లేవని కూడా చెప్పవచ్చు’ అని చాపెల్ పేర్కొన్నారు. -
‘ఎల్బీల్లో ఆ నిబంధనకు చరమగీతం పాడాలి’
సిడ్నీ: ప్రపంచ క్రికెట్లో ఎల్బీడబ్యూ విషయంలో ప్రస్తుతం ఉన్న నిబంధనను సమూలంగా మార్చాల్సిన అవసరం ఉందని ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు, మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్ అభిప్రాయపడ్డాడు. బంతి బ్యాట్స్‌మన్ బ్యాట్‌కు తగలకుండా ప్యాడ్లను తాకి వికెట్ల మీదుగా వెళుతున్నట్లు భావిస్తే అది కచ్చితంగా ఔట్ ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశాడు. ఇక్కడ బంతి ఎక్కడ పిచ్ అయ్యిందనే విషయానికి చరమగీతం పాడాలన్నాడు. ప్రస్తుత రూల్ ప్రకారం ఏ బంతైనా లైన్‌కు అవతల పిచ్ అయి బ్యాట్స్‌మన్ బ్యాట్‌కు తగలకుండా ప్యాడ్‌కు తాకినా ఎల్బీగా పరిగణించరు. ప్రధానంగా బంతి ఆఫ్ స్టంప్‌పై కానీ, లెగ్ స్టంప్‌పై కానీ పడి ప్యాడ్ తగిలి వికెట్ల మీదకు వెళుతున్నా అది ఔట్ కాదు. కచ్చితంగా లైన్లో పడి మాత్రమే పడి బ్యాట్మన్ బంతిని టచ్ చేయలేని క్రమంలో ప్యాడ్‌కు తగిలి వికెట్ల మీదుకు వెళుతున్నప్పుడు ఎల్బీగా ఇస్తారు. దీని వల్ల ఎక్కువగా స్పిన్నర్లు నష్టపోతూ ఉంటారు. కాగా, ఈ విషయంలో కీలక మార్పులు చేయాలని అంటున్నాడు ఇయాన్ చాపెల్. బంతి ఎక్కడ పడింది అనేది ప్రధానం కాదని, బ్యాట్స్‌మన్ ప్యాడ్‌కు తగిలి వికెట్లను గిరాటేస్తుందని తేలితే అది ఔట్‌గానే పరిగణించాలన్నాడు. (అప్పుడు గెలిచారు.. ఇప్పుడు గెలవండి..!) బంతి ఎక్కడ పిచ్ అయిందనేది లెక్కల్లోకి తీసుకోకూడదన్నాడు. అలా నిబంధనను మార్చిన క్రమంలో బ్యాట్స్‌మన్ ఎప్పుడూ బ్యాట్‌తోనే వికెట్‌ను కాపాడుకోవడానికి చూస్తాడన్నాడు. అదే సమయంలో బౌలర్ కూడా స్టంప్సే లక్ష్యంగా బంతులను సంధిస్తాడని చాపెల్ పేర్కొన్నాడు. ఒకవేళ ప్యాడ్లకు తాకితే అది కేవలం గాయం నుంచి తప్పించుకునేలా ఉండాలి కానీ, ఔట్ నుంచి తప్పించుకునే విధంగా ఉండకూడదన్నాడు. కొంతమంది కావాలనే ప్యాడ్లతో కొన్ని బంతుల్ని ఎదుర్కోవడాన్ని చాపెల్ పరోక్షంగా ప్రస్తావించాడు. ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియా-భారత్‌ల టెస్టు సిరీస్ గురించి ఇటీవల మాట్లాడిన చాపెల్.. ఈసారి టీమిండియా సిరీస్‌ను సాధించడం చాలా కష్టమన్నాడు. గతంలో ఆస్ట్రేలియాలో పర్యటించిన భారత్ టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకుని ఉండవచ్చు కానీ, రాబోవు సిరీస్‌లో మాత్రం ఆసీస్ అంత తేలిగ్గా లొంగదన్నాడు. డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్‌లను తొందరగా పెవిలియన్‌కు పంపిస్తేనే టీమిండియా గెలిచే అవకాశం ఉంటుందని, అలా కాని పక్షంలో ఆసీస్‌దే గెలుపు అని చాపెల్ పేర్కొన్నాడు.(వార్నర్ నోట ‘పోకిరి’ డైలాగ్) -
టీమిండియా.. ఈసారి గెలిచి చూపించండి!
సిడ్నీ: ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియాలో పర్యటించనున్న భారత జట్టు టెస్టు సిరీస్ గెలవాలంటే అది అంత ఈజీ కాదని అంటున్నాడు ఆసీస్ గ్రేట్ ఇయాన్ చాపెల్. భారత అదృష్టం కేవలం ఇద్దరి ఆట తీరుపై మాత్రమే ఆధారపడి ఉందన్నాడు. అది డేవిడ్ వార్నర్-స్టీవ్ స్మిత్‌లేనని ఇయాన్ చాపెల్ స్పష్టం చేశాడు. వీరిద్దర్నీ తొందరగా పెవిలియన్‌కు పంపితేనే భారత్ విజయం సాధించడానికి మార్గం ఏర్పడుతుందన్నాడు. ‘సోనీ టెన్ పిట్ స్టాప్’ షోలో.. భారత్-ఆస్ట్రేలియాల తదుపరి సిరీస్ గురించి మాట్లాడాడు. గత ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ టెస్టు సిరీస్ సాధించడాన్ని ప్రస్తావిస్తూ అడిగిన ప్రశ్నకు చాపెల్ బదులిచ్చాడు. ఆ పర్యటన వేరు, జరగబోయే సిరీస్ వేరు అంటూ సమాధానమిచ్చాడు. అప్పుడు గెలిచారు ఓకే, కానీ ఇప్పుడు ఆస్ట్రేలియాలో గెలిచి చూపించాలన్నాడు.(ధావన్ ఒక ఇడియట్.. స్ట్రైక్ తీసుకోనన్నాడు..!) ‘ఈసారి టీమిండియా సిరీస్ సాధించడం చాలా కష్టం. సిరీస్ సాధించాలంటే టీమిండియా మిక్కిలి శ్రమించక తప్పదు. ఆస్ట్రేలియాలోని పరిస్థితులు టీమిండియా క్రికెటర్లకు బాగా తెలుసు. కానీ ఆస్ట్రేలియాలో ఆసీస్‌ను ఓడించాలంటే దూకుడు మంత్రాన్ని అవలంభించాలి. అది కూడా చాలా గట్టిగా ఉండాలి. గతంలో ఆస్ట్రేలియాకు వచ్చినప్పుడు భారత్ బ్యాటింగ్ బాలేదు. ఇప్పుడు భారత్ బ్యాటింగ్ బలోపేతం అయ్యింది. కానీ డేవిడ్ వార్నర్-స్టీవ్ స్మిత్‌లే ఆసీస్‌కు వెన్నుముక. వీరిని తొందరగా ఔట్ చేస్తే టీమిండియా పైచేయి సాధిస్తుంది. అప్పుడు విజయం సాధించే అవకాశం ఉంటుంది. ఒకవేళ వార్నర్-స్మిత్‌లు ఎక్కువ సేపు క్రీజ్‌లో ఉంటే మాత్రం ఆసీస్‌దే విజయం’ అని చాపెల్ చెప్పుకొచ్చాడు. మరొకవైపు కోహ్లి నేతృత్వంలోని భారత జట్టు బ్యాటింగ్ విభాగం కూడా చాలా బలంగా ఉందన్నాడు. ఇక ఆసీస్-భారత్‌ల బౌలింగ్ కూడా పటిష్టంగా ఉండటంతో ఇరు జట్ల మధ్య ఆసక్తికర పోరు నడుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా, ఈ ఏడాది చివర్లో టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగంగా ఆస్ట్రేలియాలో భారత్ పర్యటించాల్సి ఉంది. కరోనా వైరస్ కారణంగా ఆ పర్యటనకు భారత్ వెళుతుందా లేదా అనేది అనుమానమే. అప్పటికి పరిస్థితులు చక్కబడితే ఇరు జట్ల మధ్య సిరీస్ జరుగుతుంది. (‘ఆ బ్యాట్‌తో ధోని ఆడొద్దన్నాడు’) -
రెండింటిలోనూ కోహ్లినే గ్రేట్: చాపెల్
సిడ్నీ: ఆసీస్ క్రికెటర్, మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ కంటే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లినే అత్యుత్తమ ఆటగాడని ఆసీస్ దిగ్గజ ఆటగాడు ఇయాన్ చాపెల్ అభిప్రాయపడ్డాడు. ఇక్కడ కోహ్లి కేవలం ఆటగాడిగానే కాకుండా కెప్టెన్‌గానూ స్మిత్ కంటే అత్యుత్తమని పేర్కొన్నాడు. రోనా వైరస్ విజృంభణతో విశ్వవ్యాప్తంగా టోర్నీలన్నీ రద్దుకావడంతో ఇండ్లకే పరిమిమైన ఆటగాళ్లు, వ్యాఖ్యతలు సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులను అలరిస్తున్నారు. ఈ క్రమంలోనే చాపెల్ ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాలు వ్యక్తపరిచాడు. ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫో రౌనక్ కపూర్ అడిగిన ప్రశ్నకు చాపెల్ బదులిచ్చాడు. (‘ఇక టీమిండియాను ఓడించడమే లక్ష్యం’) కోహ్లి, స్మిత్‌లలో ఒకరిని ఎంచుకోవాలని రౌనక్ కపూర్ అడగ్గా, కెప్టెన్‌గానా.. బ్యాట్స్‌మన్‌గానే అని చాపెల్ తిరిగి ప్రశ్నించాడు. అయితే రెండింటిలోనూ మీ అభిప్రాయం చెప్పండి అని కోరగా కోహ్లిని ఎంచుకున్నాడు చాపెల్. రెండు విభాగాల్లోనూ కోహ్లినే గ్రేట్ అంటూ పేర్కొన్నాడు. ఇటీవల కోహ్లి, ఏబీ డివిలియర్స్‌లే ప్రపంచ అత్యుత్తమ ఆటగాళ్లని న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ పేర్కొన్న సంగతి తెలిసిందే. ప్రస్తుత క్రికెట్లో కోహ్లితో పాటు దక్షిణాఫ్రికా ఆటగాడు ఏబీ డివిలియర్స్‌లే అత్యుత్తమం అని విలియన్స్ పేర్కొన్నాడు. ప్రస్తుత శకంలో కోహ్లి, డివిలియర్స్‌లే బెస్ట్ బ్యాట్స్‌మెన్ అని కొనియాడాడు. అన్ని ఫార్మాట్లలో ఆధిక్యం కనబరుస్తున్న కోహ్లినే ఒక అసాధారణ ఆటగాడన్నాడు. ఇక ఫ్రాంచైజీ క్రికెట్ ఆడుతున్న ఏబీ ఒక అరుదైన బ్యాట్స్‌మన్ అని విలియమ్సన్ తెలిపాడు. వీరిద్దరే ప్రస్తుతం అత్యుత్తమం అని కేన్ పేర్కొన్నాడు. (హార్దిక్.. టాలెంట్ ఉంటే సరిపోదు!) -
ఆసీస్ మాజీ ఆల్‌రౌండర్ కన్నుమూత
సిడ్నీ: ఆస్ట్రేలియా మాజీ ఆల్ రౌండర్ గ్రేమ్ వాట్సన్(75) కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న గ్రేమ్ వాట్సన్ తుది శ్వాస విడిచిన విషయాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) తన ట్వీటర్ అకౌంట్ ద్వారా తెలిపింది. 1966-72 వరకూ ఆసీస్ క్రికెట్ జట్టులో కొనసాగిన వాట్సన్.. ఐదు టెస్టు మ్యాచ్‌లు, రెండు వన్డేలు ఆడారు. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్, మీడియం పేసర్ అయిన గ్రేమ్ వాట్సన్ 1966-67 సీజన్లో దక్షిణాఫ్రికా పర్యటనతో అంతర్జాతీయ అరంగేట్రం చేశారు. ఆ పర్యటన రెండో టెస్టులో వాట్సన్ హాఫ్ సెంచరీ మెరిశాడు. కాగా, గాయం కారణంగా ఆ తర్వాత టెస్ట్‌కి దూరమయ్యారు. ఇక నాలుగో టెస్టులో వాట్సన్ తన కెరీర్లోనే అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన చేసినప్పటికీ ఆస్ట్రేలియా సిరీస్ కోల్పోయింది. వాట్సన్ తన కెరీర్లో తరుచు గాయాలతోనే సతమతమయ్యేవారు. (ఆత్మహత్య ఆలోచనలో నా భార్య గుర్తొచ్చింది..) ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 4, 674 పరుగులు సాధించిన గ్రేమ్ వాట్సన్.. 186 వికెట్లను తీశారు. తన క్రికెట్ కెరీర్‌ను విక్టోరియా తరఫున ఆరంభించిన వాట్సన్..ఆపై వెస్ట్రన్ ఆస్ట్రేలియాకు మారారు. 1971-72, 1972-73, 1974-75 సీజన్లలో వెస్ట్రన్ ఆస్ట్రేలియా షెఫల్డ్ షీల్డ్ ట్రోఫీలు గెలవడంలో వాట్సన్ కీలక పాత్ర పోషించారు. ఆస్ట్రేలియా రూల్స్ ఫుట్‌బాల్ క్రీడలో కూడా వాట్సన్‌కు ప్రావీణ్యం ఉంది. మెల్బోర్న్ జట్టు తరఫున ఆస్ట్రేలియా రూల్స్ ఫుట్‌బాల్ మ్యాచ్‌లను వాట్సన్ ఆడారు. గ్రేమ్ వాట్సన్ మృతికి ఆసీస్ దిగ్గజ ఆటగాడు ఇయాన్ చాపెల్ సంతాపం వ్యక్తం చేశారు. -
‘టీమిండియాను కాపీ కొట్టండి’
సిడ్నీ: ఇటీవల భారత్‌లో దక్షిణాఫ్రికా పర్యటన ముగిసిన తర్వాత స్వదేశానికి చేరుకున్న ఆ దేశ కెప్టెన్ డుప్లెసిస్ వ్యంగ్యంగా మాట్లాడిన సంగతి తెలిసిందే. ప్రతీ టెస్టులోనూ టీమిండియా మొదటి బ్యాటింగ్ చేయడం, మూడో రోజు చీకటి పడుతుందనగా ఇన్నింగ్స్ డిక్లేర్డ్ చేయడం చేసిందని, కాపీ-పేస్ట్ తరహాలో ఇదే పద్ధతిని అవలంభించిందంటూ తమ ఓటమిని సమర్దించుకునే యత్నం చేశాడు. దీనిపై టీమిండియా అభిమానులు తీవ్ర స్థాయిలో డుప్లెసిస్పై విమర్శల వర్షం కురిపించారు. ఇదిలా ఉంచితే, టీమిండియా ఆటన కాపీ కొట్టాలని అంటున్నాడు ఆసీస్ దిగ్గజం ఇయాన్ చాపెల్. గత కొంతకాలంగా ఆట పరంగా టీమిండియా ఎంతో పరిణితి సాధించిందని, వారి ఆటను కాపీ కొట్టడానికి యత్నించడంటూ మిగతా జట్లకు హితవు పలికాడు. మంచి ఫలితాలు సాధించాలంటే భారత క్రికెట్ జట్టును ఆదర్శంగా తీసుకోవాలని సూచించాడు. క్రికెట్లో అత్యున్నత శిఖరాలు అందుకొనేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాలు అద్భుతమని చాపెల్ కొనియాడాడు. క్రికెట్లో తమదైన ముద్ర వేయాలని తపించే దేశాలు భారత్‌ను ఆదర్శంగా తీసుకోవాలని పేర్కొన్నాడు. తద్వారా టెస్ట్ క్రికెట్ మరింత బలోపేతమవుతుందని అభిప్రాయపడ్డాడు. ఇటీవలి టెస్ట్ సిరీస్‌లో సౌతాఫ్రికాను 3-0తో వైట్‌వాష్ చేసిన టీమిండియాను చూసి మిగతా క్రికెట్ దేశాలు అసూయ చెందుతుంటాయన్నాడు. ‘భవిష్యత్‌లో టెస్ట్ క్రికెట్ బతికి బట్టకట్టాలంటే ఆటలో ప్రమాణాలు పెరగాలి. భారత్‌లో క్రికెట్ ప్రమాణాలు అమోఘంగా ఉన్నాయంటే అందుకు..ప్రతిభావంతులకు కొదవలేకపోవడం, అపార ఆర్థిక వనరులతోపాటు ఐపీఎల్ కూడా ఒక కారణం. అంతేకాదు అత్యున్నత శిఖరాలు చేరేందుకు భారత్ అనుసరిస్తున్న విధానాలను క్రికెట్లో బలమైన జట్టుగా మారాలని భావించే దేశాలు అనుసరించాలి’ అని చాపెల్ రాసిన ఒక కాలమ్‌లో పేర్కొన్నాడు. -
‘టీమిండియాకు అనేక అవకాశాలు’
సిడ్నీ: వన్డే వరల్డ్‌కప్‌లో టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగిన భారత క్రికెట్ జట్టుపై ఆసీస్ దిగ్గజం ఇయాన్ చాపెల్ ప్రశంసలు కురిపించాడు. ప్రధానంగా భారత బౌలింగ్ యూనిట్‌ను చాపెల్ కొనియాడాడు. తమ బౌలింగ్ వనరులను సక్రమంగా ఉపయోగించుకునేందుకు కోహ్లి నేతృత్వంలోని టీమిండియాకు అనేక అవకాశాలు ఉన్నాయన్నాడు. ‘ భారత జట్టు అటు బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లో కూడా పటిష్టంగానే ఉంది. వరుస విరామాల్లో వికెట్లు సాధించే సత్తా భారత్‌కు ఉంది. ప్రత్యేకంగా మధ్య ఓవర్లలో భారత్ బౌలింగ్ యూనిట్ అత్యంత ప్రభావం చూపే అవకాశం ఉంది. అది భారత జట్టు వరల్డ్‌కప్ సాధించడానికి దోహద పడుతుందనే నేను భావిస్తున్నా. ప్రస్తుత క్రికెట్లో భారీ స్కోర్లు వస్తున్నాయి. వన్డేల్లో భారీ స్కోర్లు చేయడం అనేది తరచు చూస్తున్నాం. వరల్డ్‌కప్‌లో కూడా భారీ స్కోర్లు రావడం ఖాయం. అయితే ఇక్కడ ఎటాకింగ్ బౌలింగ్ అనేది కీలక పాత్ర పోషిస్తుంది. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లతో పోలిస్తే భారత్ పేస్ దళం కాస్త వెనుకంజలో ఉంది. అయినప్పటికీ ఇంగ్లండ్ పిచ్‌లపై భారత్ పేస్ త్రయం(బుమ్రా, భువనేశ్వర్, షమీ)లు అత్యంత ప్రభావం చూపుతారనే నేను విశ్వసిస్తున్నా. ఇక పిచ్‌లు పొడిబారిన సమయంలో కుల్దీప్ యాదవ్, చహల్‌లతో చాలా ప్రమాదకరంగా మారతారు. మరొకవైపు ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా ఉండనే ఉన్నాడు. ఇలా భారత్‌కు బౌలింగ్ విభాగంలో అనేక అవకాశాలు ఉన్నాయి’ అని చాపెల్ విశ్లేషించాడు. -
‘మా బౌలర్లను మోకరిల్లేలా చేశాడు’
సిడ్నీ: టీమిండియా ఆటగాడు చతేశ్వర్ పుజారా అద్భుతమైన ఆట తీరుతో తమ బౌలర్లను మోకరిల్లేలా చేశాడని ఆసీస్ దిగ్గజ ఆటగాడు ఇయాన్ చాపెల్ పేర్కొన్నాడు. కోహ్లి కింగ్డమ్లో అసాధారణ బ్యాటింగ్‌తో పుజారా ఆకట్టుకున్నాడంటూ చాపెల్ ప్రశంసించాడు. నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను టీమిండియా 2-1తో సొంతం చేసుకుని ఆసీస్ గడ్డపై చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా చాపెల్ మాట్లాడుతూ.. ‘భారత క్రికెట్లో ఇప్పుడు విరాట్ కోహ్లి రాజు కావొచ్చు. కానీ.. ఆ రాజ్యంలో పుజారా కూడా ఎన్నో గౌరవాలకి అర్హుడని నిరూపించాడు. ఈ సిరీస్‌లో టీమిండియాకు ఎంతో మంచి జరిగింది. సిరీస్ చేజిక్కించుకోడమే కాదు.. పుజారాలోని పట్టుదల, క్రమశిక్షణ, ఓపిక విలువ తెలిసింది’ అని కొనియాడాడు. ‘పుజారా అద్భుత బ్యాటింగ్ నుంచి మా జట్టు చాలా నేర్చుకుని ఉంటుంది. సుదీర్ఘ సమయం క్రీజులో నిలిచిన పుజారా.. భీకరమైన ఆస్ట్రేలియా బౌలర్లని సైతం అసహనంతో మోకాళ్లపై కూలబడేలా చేశాడు. ఆస్ట్రేలియాలో మూడు సెంచరీలు చేసిన అతడు సునీల్ గావస్కర్ రికార్డును సమం చేశాడు. ఆసీస్ గడ్డపై ఏడు ఇన్నింగ్స్‌ల్లో మూడు సెంచరీలు సాధించి 521 పరుగులు చేయడం అంటే సాధారణ విషయం కాదు. పటిష్టమైన మా బౌలింగ్ లైనప్‌ను కకావికలం చేసి మరీ శతకాలపై శతకాలు సాధించాడు’ అని చాపెల్ ప్రశంసలు కురిపించాడు. -
విరాట్ సేనకు ఇయాన్ చాపెల్ వార్నింగ్!
సిడ్నీ: మరో రెండు నెలల్లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లబోతున్న టీమిండియా క్రికెట్ జట్టు ఇప్పుడే బ్యాటింగ్ లోపాలు సరిదిద్దుకునే పనిలో పడాలని, ఒకవేళ కాని పక్షంలో విరాట్ సేనకు ఘోర పరాభవం తప్పదని ఆసీస్ మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్ హెచ్చరించాడు. ఇంగ్లండ్ పర్యటన ఆధారంగా టీమిండియా బ్యాటింగ్ శైలిని విశ్లేషించిన చాపెల్.. అదే సమయంలో తమ బౌలింగ్ విభాగం ఎంత పటిష్ఠంగా ఉందో చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా పర్యటనకు వచ్చే ముందే టీమిండియా తమ బ్యాటింగ్ లోపాలను సరిదిద్దుకోవాలన్నాడు. లేదంటే సొంతగడ్డపై చురకత్తుల్లాంటి బంతులు విసిరే ఆసీస్ బౌలర్లను ఎదుర్కోవడం కష్టమేనని పేర్కొన్నాడు. ఆసీస్‌తో సిరీస్‌ను తేలిగ్గా తీసుకుంటే మాత్రం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్నాడు. 'ఆస్ట్రేలియాలో అడుగు పెట్టకముందే టీమిండియా బ్యాటింగ్ లోపాలను సరిదిద్దుకోవాలి. స్టీవ్‌స్మిత్, డేవిడ్ వార్నర్ లేని ఆసీస్ బ్యాటింగ్ ప్రశ్నార్ధకంగానే కనిపించినా బౌలింగ్ మాత్రం ధీటుగా ఉంటుంది. మిచెల్ స్టార్క్, హేజిల్‌వుడ్, ప్యాట్ కమిన్స్‌లు సిరీస్ ఆసాంతం ఫిట్నెస్తో ఉంటే విరాట్ సేనను చిరాకు తెప్పిస్తారు’ అని ఇయాన్ చాపెల్ విశ్లేషించాడు. ఇంగ్లండ్‌లో బంతి గమనం గాలిలో ఉంటే ఆసీస్‌లో అదనపు బౌన్స్ సైతం తోడవుతుందని, దాంతో తమ బౌలింగ్ యూనిట్‌ను ఎదుర్కోవడం అంత ఈజీ కాదన్నాడు. నవంబర్ 21 నుంచి జనవరి 18 వరకు ఆసీస్ గడ్డపై భారత్ 3 టీ20లు, 4 టెస్టులు, 3 వన్డేలు ఆడనుంది. -
‘టీమిండియాకు మంచి అవకాశం’
సిడ్నీ: ఇంగ్లండ్ గడ్డపై టెస్టు సిరీస్ గెలవడానికి భారత్‌కు ఇదే మంచి అవకాశమని అంటున్నాడు ఆసీస్ మాజీ క్రికెటర్ ఇయాన్ చాపెల్. జూలైలో భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ నేపథ్యంలో ఆసీస్ మాజీ క్రికెటర్ ఇయాన్ చాపెల్ మాట్లాడుతూ...‘ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు బ్యాటింగ్ లైనప్ చాలా బాగుంది. బౌలర్లతో పాటు బ్యాట్స్మెన్లు ఈ పర్యటనలో మెరుగైన ప్రదర్శన చేస్తే భారత్‌దే విజయం. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఇంగ్లండ్ గడ్డపై సిరీస్ గెలిచేందుకు భారత్‌కు ఇదో అరుదైన, మంచి అవకాశం కూడా. ఒత్తిడిని తట్టుకోలేక ఇంగ్లండ్ ఇటీవల లార్డ్స్ వేదికగా పాక్‌తో జరిగిన టెస్టులో ఓడిపోయింది. ఓపెనర్ కుక్ ఇంగ్లండ్ జట్టుకు మంచి ఆరంభాన్ని ఇవ్వలేకపోతున్నాడు. దీంతో ఆ జట్టుకు ఈ మధ్య కాలంలో శుభారంభమే దక్కడం లేదు. దీన్ని భారత్ పూర్తిగా సద్వినియోగం చేసుకుంటుందని భావిస్తున్నా. భారత బౌలర్లు ఇంగ్లిష్ మిడిలార్డర్‌ను దెబ్బకొడితే వారు తేరుకోవడం కష్టం’ అని చాపెల్ విశ్లేషించాడు. భారత తన పర్యటనలో ఇంగ్లండ్‌తో టీ20, వన్డే, టెస్టు సిరీస్‌లు ఆడనుంది. జులై 3 నుంచి ఇరు దేశాల మధ్య టీ20 సిరీస్ జరగనుంది. ఆగస్టులో టెస్టు సిరీస్ ప్రారంభంకానుంది. -
అసలు చాపెల్ ఎవడు : గేల్ ఫైర్
ముంబై : ఐపీఎల్-11 సీజన్లో తన బ్యాట్‌తో అభిమానులను అలరించాడు వెస్టిండీస్ విధ్వంసకర్ బ్యాట్స్‌మన్ క్రిస్‌గేల్. అయితే ఓ చానెల్ ఇంటర్వ్యూలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఇయాన్ చాపెల్ పేరును ప్రస్తావిస్తే చిర్రుబుర్రులాడాడు. 2016 బిగ్‌బాష్ లీగ్ సందర్భంగా గేల్ మహిళా జర్నలిస్టు పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి విమర్శలు ఎదుర్కొన్నా విషయం తెలిసిందే. అప్పట్లో ఈ ఘటనపై ఇయాన్ చాపెల్ స్పందిస్తూ.. గేల్‌ను ప్రపంచ వ్యాప్తంగా నిషేదించాలన్నాడు. క్రికెట్ ఆస్ట్రేలియా బిగ్‌బాష్ లీగ్‌లో అనుమతించకుండా చర్యలు తీసుకోవాలని కోరాడు. ఇక క్రికెట్ ఆస్ట్రేలియా సైతం గేల్‌కు 10 వేల యూఎస్ డాలర్లు జరిమానాగా విధించింది. అనంతరం బిగ్ బాష్ లీగ్ లో మ్యాచ్ ఫిక్సింగ్ వంటి ఘటనలు ఏమైనా జరిగితే మాత్రమే జోక్యం చేసుకుంటామని, ఆటగాళ్ల నియమాకాల విషయం మాత్రం తమకు సంబంధం లేదని, బిగ్ బాష్‌లీగ్‌లో గేల్ ఆడేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని సీఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జేమ్స్ సదర్లాండ్ పేర్కొనడంతో గేల్‌కు ఊరట లభించింది. అసలు అప్పుడేం జరిగిందంటే.. 2016 బిగ్ బాష్ లీగ్ సందర్భంగా హోబార్ట్ హరికేన్స్-మెల్బోర్న్ రెనగేడ్స్ మ్యాచ్ అనంతరం మహిళా జర్నలిస్టు పట్ల గేల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. మ్యాచ్ అనంతరం టెన్ స్పోర్ట్స్ ప్రజెంటర్ మెలానీ మెక్‌లాఫిలిన్ గేల్‌ను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారు. గేల్ ఇన్నింగ్స్ గురించి కొన్ని ప్రశ్నలు అడగ్గా.. గేల్ స్పందిస్తూ.. 'నువ్వు చేసే ఈ ఇంటర్వ్యూ కోసమే నేను చాలా బాగా బ్యాటింగ్ చేశాను. నీ కళ్లు చాలా అందంగా ఉన్నాయి. మనం కలిసి డ్రింక్స్‌కు వెళ్దామా.. మరీ సిగ్గుతో పొంగిపోకు బేబి' అని అన్నాడు. తాజాగా ఈ వివాదాన్ని గుర్తు చేస్తూ సదరు రిపోర్టర్ ఇయన్ చాపెల్ వ్యాఖ్యలను ప్రస్తావించగా.. అసలు ఇయాన్ చాపెల్ ఎవడని గేల్ ఘాటుగా సమాధానమిచ్చాడు. ఐపీఎల్ ఫైనల్‌పై స్పందిస్తూ.. రెండు బీకర జట్ల మధ్య జరిగిన మ్యాచ్ చూడకుండా ఉంటామా అని, 179 పరుగులు సాధించిన సన్‌రైజర్స్ గెలుస్తుందనుకున్నానని, కానీ షేన్ వాట్సన్ అద్భుత ఇన్నింగ్స్‌తో చెన్నైని గెలిపించాడని గేల్ పేర్కొన్నాడు. క్రీజులో పరుగుల తీయడానికి వెనకడుగేస్తారన్న ప్రశ్నకు సైతం ఆగ్రహం వ్యక్తం చేశాడు. అవసరమైతే నాలుగు పరుగులు కూడా తీస్తానన్నాడు. ఈ సీజన్ కింగ్స్‌పంజాబ్ తరపున బరిలోకి దిగిన గేల్.. ప్రారంభ మ్యాచుల్లో విధ్వంసం సృష్టించినా చివర్లో తడబడటంతో ఆ జట్టు లీగ్ దశ నుంచే నిష్క్రమించిన విషయం తెలిసిందే.