'ఆ క్రికెటర్ లేకపోతే కష్టమే' | without Ben Stokes, England have no chance in Ashes | Sakshi
Sakshi News home page

'ఆ క్రికెటర్ లేకపోతే కష్టమే'

Sep 30 2017 2:04 PM | Updated on Sep 30 2017 6:13 PM

without Ben Stokes, England have no chance in Ashes

సిడ్నీ: ఇంగ్లండ్ క్రికెట్ లో ఆల్ రౌండర్ గా కీలక పాత్ర పోషిస్తున్న బెన్ స్టోక్స్ ఆ జట్టుకు దూరమైతే మాత్రం అది కచ్చితంగా పూడ్చలేనిలోటేనని ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ ఇయాన్ చాపెల్ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం ఒక వ్యక్తిపై దాడి చేసి సస్పెన్షన్ ఎదుర్కొంటున్న బెన్ స్టోక్స్ లేకుండా ఇంగ్లండ్ యాషెస్ సిరీస్ ను ఎట్టిపరిస్థితుల్లోనూ గెలుచుకోలేదని చాపెల్ పేర్కొన్నాడు. 'బెన్ స్టోక్స్ లేకుండా ఇంగ్లండ్ యాషెన్ ను గెలిచే చాన్సే లేదు. దీనికి చాలా కారణాలున్నాయి. అతని శక్తి సామర్థ్యాలు అటువంటవి. అతనొక మ్యాచ్ విన్నింగ్ ఆటగాడు. అత్యుత్తమ జట్లపై స్టోక్స్ కు ఎప్పుడూ మంచి రికార్డే ఉంది. అత్యుత్తమ ఆల్ రౌండర్లలో స్టోక్స్ ఒకడు. అటువంటి ఆటగాడు జట్టులో లేకపోతే ఆ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. స్టోక్స్ లేనిపక్షంలో ఇంగ్లండ్ యాషెస్ ను ఆశించడం కష్టం' అని ఇయాన్ చాపెల్ జోస్యం చెప్పాడు.

ప్రస్తుతం బెన్ స్టోక్స్ నిషేధం ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఒక వ్యక్తిపై దాడికి సంబంధించి అతనిపై సస్పెన్షన్ పడింది. ఆ విచారణ పూర్తయ్యే వరకూ అతనిపై నిషేధం కొనసాగుతుందని ఈసీబీ స్పష్టం చేసింది. ఒకవేళ ఆ ఘటనలో స్టోక్స్ దోషిగా తేలితే మాత్రం అతని భవితవ్యం ప్రశ్నార్థకం కానుంది.

బతికి 'చెడ్డ' వాడు!

బెన్‌ స్టోక్స్‌పై ఈసీబీ ‘సస్పెన్షన్‌’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement