లండన్: ఇంగ్లండ్ టెస్టు క్రికెట్ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ మూడు నెలల పాటు ఆటకు దూరం కానున్నాడు. ఇటీవల న్యూజిలాండ్‌తో మూడో టెస్టు సందర్భంగా గాయపడ్డ స్టోక్స్... వచ్చే నెలలో శస్త్రచికిత్స చేయించుకోనున్నాడు. దీంతో మరో మూడు నెలల పాటు అతడు మైదానంలోకి దిగబోడని ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. వచ్చే ఏడాది జరగనున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి స్టోక్స్ దూరం కానున్నాడు.
ఇప్పటికే ఆ టోర్నీ కోసం ఇంగ్లండ్ బోర్డు జట్టును ప్రకటించగా... అందులో 33 ఏళ్ల స్టోక్స్‌కు చోటు కల్పించలేదు. గతంలోనూ కండరాల గాయంతో ఇబ్బంది పడ్డ స్టోక్స్... శ్రీలంక, పాకిస్తాన్‌తో సిరీస్‌లకు దూరమయ్యాడు. ఇప్పుడు మరోసారి అదే గాయం తిరగబెట్టడంతో శస్త్రచికిత్స చేయించుకోవాలని నిర్ణయించుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment