injury
-
నెల క్రితం గాయం.. 'మన్మథుడు' హీరోయిన్ కి ఏమైంది?
'మన్మథుడు' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ అన్షు (Anshu Sagar).. ఆ తర్వాత పెళ్లి చేసుకుని లండన్ లో సెటిలైపోయింది. దాదాపు 20 ఏళ్ల తర్వాత తిరిగి తెలుగు సినిమా చేసింది. అదే 'మజాకా' (Mazaka Movie). ఈ మూవీ థియేటర్లలో సరిగా ఆడలేదు. అయితే ఈ చిత్ర ప్రమోషన్స్ టైంలో అన్షు.. నుదుటిపై ప్లాస్టర్ తో కనిపించింది. ఏం జరిగిందా అనుకున్నారు గానీ ఈమె చెప్పకపోవడంతో ఎవరూ దీని గురించి అడగలేదు.(ఇదీ చదవండి: 'సలార్' విలన్ కి కారు ఈఎంఐ కష్టాలు)ఇప్పుడు స్వయంగా అన్షునే తనకు గాయమైన విషయాన్ని బయటపెట్టింది. దాదాపు నెల క్రితం ఊహించని విధంగా గాయపడ్డానని చెప్పింది. కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ ప్రేమ వల్ల ప్రస్తుతం కోలుకున్నానని చెప్పుకొచ్చింది. అయితే ఆ ప్లాస్టర్ కెమెరాల కోసం పెట్టుకున్నది కాదని, అది నిజమేనని క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది.నుదుటిపై పెద్ద గాయం కావడంతో ఆస్పత్రికి అన్షు వెళ్లడంతో కుట్లు వేశారు. తర్వాత దానిపై ప్లాస్టర్ పెట్టుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోల్ని.. వీడియోగా చేసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇలాంటి గాయాలు తనని ఆపలేవని, మరింత బలంగా బౌన్స్ బ్యాక్ అవుతానని అన్షు చెప్పుకొచ్చింది. మజాకా మూవీపై చాలా ఆశలు పెట్టుకుంది గానీ ఇదేమంత పెద్దగా ఆడకపోవడంతో తిరిగి లండన్ వెళ్లిపోయింది.(ఇదీ చదవండి: 'కన్నప్ప' మూవీని ట్రోల్ చేస్తే శాపానికి గురవుతారు: రఘుబాబు) View this post on Instagram A post shared by Anshu (@actressanshuofficial) -
స్టోక్స్... మూడు నెలలు ఆటకు దూరం
లండన్: ఇంగ్లండ్ టెస్టు క్రికెట్ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ మూడు నెలల పాటు ఆటకు దూరం కానున్నాడు. ఇటీవల న్యూజిలాండ్‌తో మూడో టెస్టు సందర్భంగా గాయపడ్డ స్టోక్స్... వచ్చే నెలలో శస్త్రచికిత్స చేయించుకోనున్నాడు. దీంతో మరో మూడు నెలల పాటు అతడు మైదానంలోకి దిగబోడని ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. వచ్చే ఏడాది జరగనున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి స్టోక్స్ దూరం కానున్నాడు. ఇప్పటికే ఆ టోర్నీ కోసం ఇంగ్లండ్ బోర్డు జట్టును ప్రకటించగా... అందులో 33 ఏళ్ల స్టోక్స్‌కు చోటు కల్పించలేదు. గతంలోనూ కండరాల గాయంతో ఇబ్బంది పడ్డ స్టోక్స్... శ్రీలంక, పాకిస్తాన్‌తో సిరీస్‌లకు దూరమయ్యాడు. ఇప్పుడు మరోసారి అదే గాయం తిరగబెట్టడంతో శస్త్రచికిత్స చేయించుకోవాలని నిర్ణయించుకున్నాడు. -
స్టార్ హీరో ప్రభాస్ మళ్లీ గాయపడ్డాడా?
వరస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ప్రభాస్ మరోసారి గాయపడినట్లు తెలుస్తోంది. గతేడాది 'సలార్', ఈ ఏడాది 'కల్కి 2898 ఏడీ' చిత్రాలతో బ్లాక్‌బస్టర్ సక్సెస్ అందుకున్న డార్లింగ్ హీరో.. ప్రస్తుతం రాజాసాబ్, ఫౌజీ (వర్కింగ్ టైటిల్) మూవీస్ షూటింగ్స్‌లో పాల్గొంటున్నాడు. మరి ఎప్పుడు జరిగిందో గానీ ప్రభాస్ చిత్రీకరణ సందర్భంగా గాయపడ్డాడట. ఈ విషయాన్ని స్వయంగా ఇతడే వెల్లడించినట్లు కొన్ని ఫొటోలు వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: 'వరుడు' హీరోయిన్ భానుశ్రీ ఇంట్లో విషాదం)'బాహుబలి' తర్వాత నుంచి ప్రభాస్ తన ప్రతి సినిమాను జపాన్‌లోనూ విడుదల చేస్తున్నాడు. రాబోయే జనవరి 3న 'కల్కి' జపాన్‌లో రిలీజ్ చేయనున్నట్లు కొన్నిరోజుల క్రితం ప్రకటించారు. ఈ సినిమా ప్రీమియర్ కోసం ప్రభాస్ వెళ్లే ప్లాన్ ఫిక్సయింది. ఇప్పుడు ఇతడి చీలమండ బెణికిందని, దీంతో జపాన్ రాలేకపోతున్నానని జపనీస్ భాషలో ప్రభాస్ ఓ లెటర్ ఒకటి వైరల్ అవుతుంది. దీంతో ప్రభాస్ త్వరగా కోలుకోవాలని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. గతంలో పలుమార్లు ప్రభాస్ గాయపడ్డాడు!ప్రభాస్ 'రాజాసాబ్' మూవీ.. వచ్చే ఏడాది ఏప్రిల్ 10న థియేటర్లలో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ ఇప్పటికే చాలా షూటింగ్ పెండింగ్‌లో ఉందని, బహుశా ఈ తేదీకి రాకపోవచ్చనే రూమర్స్ నడుస్తున్నాయి. విడుదల తేదీ ఇంకా చాలా దూరముంది కాబట్టి ఇప్పుడే ఏం చెప్పలేం. మరోవైపు హను రాఘవపూడి దర్శకత్వంలో 'ఫౌజీ' చేస్తున్నాడు. దీని తర్వాత సందీప్ రెడ్డి వంగా 'స్పిరిట్' మూవీ మొదలవుతుంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 30 సినిమాలు) -
జొకోవిచ్ దూరం
బెల్గ్రేడ్: పురుషుల టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నమెంట్ ఏటీపీ ఫైనల్స్ టైటిల్‌ను సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్ ఈసారి నిలబెట్టుకోలేకపోతున్నాడు. ఈనెల 10 నుంచి 17 వరకు ఇటలీలోని ట్యూరిన్ నగరంలో ఈ మెగా టోర్నీ జరగనుంది. గాయం కారణంగా తాను ఏటీపీ ఫైనల్స్ టోర్నీలో పాల్గొనడంలేదని ప్రపంచ ఐదో ర్యాంకర్, డిఫెండింగ్ చాంపియన్ జొకోవిచ్ మంగళవారం ప్రకటించాడు. ‘ఏటీపీ ఫైనల్స్ టోర్నీలో ఆడాలని ఆసక్తితో ఎదురుచూశా. కానీ గాయం నుంచి ఇంకా కోలుకోకపోవడంతో ఈ టోర్నీలో ఆడటంలేదు. నా ఆట చూసేందుకు ప్రణాళికలు చేసుకున్న వారికి క్షమించాలని కోరుతున్నాను. ఈ టోరీ్నలో ఆడబోతున్న ఆటగాళ్లందరికీ నా తరఫున శుభాకాంక్షలు. త్వరలో మళ్లీ కలుద్దాం’ అని జొకోవిచ్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పేర్కొన్నాడు. ఏడుసార్లు విజేతగా... 54 ఏళ్ల చరిత్ర కలిగిన ఏటీపీ ఫైనల్స్ టోర్నీలో అత్యధికసార్లు విజేతగా నిలిచిన ప్లేయర్‌గా జొకోవిచ్ రికార్డు నెలకొల్పాడు. ఈ ప్రతిష్టాత్మక టోర్నీ టైటిల్‌ను జొకోవిచ్ ఏడుసార్లు (2008, 2012, 2013, 2014, 2015, 2022, 2023) సొంతం చేసుకున్నాడు. స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెడరర్ (6 సార్లు) పేరిట ఉన్న రికార్డును గత ఏడాది జొకోవిచ్ బద్దలు కొట్టాడు. 37 విజయాలతో ముగింపు... ఇప్పటికే అత్యధికంగా 24 గ్రాండ్‌స్లామ్ పురుషుల సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన ప్లేయర్‌గా గుర్తింపు పొందిన జొకోవిచ్ ఈ ఏడాది తన కెరీర్‌ను పరిపూర్ణం చేసుకున్నాడు. ఎన్నో ఏళ్లుగా ఊరిస్తోన్న ఒలింపిక్స్ వ్యక్తిగత సింగిల్స్ స్వర్ణ పతకాన్ని అతను ‘పారిస్’లో అందుకున్నాడు.వింబుల్డన్ టోర్నీలో, షాంఘై మాస్టర్స్ టోర్నీలో ఫైనల్ చేరుకున్నా రన్నరప్ ట్రోఫీలతో సంతృప్తి పడ్డాడు. ఓవరాల్‌గా ఈ ఏడాది జొకోవిచ్ 37 మ్యాచ్‌ల్లో గెలిచి, 9 మ్యాచ్‌ల్లో ఓడిపోయి మొత్తం 44,21,916 డాలర్ల (రూ. 37 కోట్ల 19 లక్షలు) ప్రైజ్‌మనీని గెల్చుకున్నాడు. -
తీవ్రంగా గాయపడిన 'కలర్ ఫోటో' హీరోయిన్
'కలర్ ఫోటో' మూవీతో హీరోయిన్గా బోలెడంత గుర్తింపు తెచ్చుకున్న తెలుగమ్మాయి. చాందిని చౌదరి.. తీవ్రంగా గాయపడింది. ఆ విషయాన్ని ఈమెనే స్వయంగా బయటపెట్టింది. అయితే చాన్నాళ్ల క్రితం ఇది జరగ్గా.. తాను లైట్ తీసుకున్నానని ఇప్పుడు అనుభవిస్తున్నానని చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: డబ్బు లాక్కొని హీరోయిన్ని భయపెట్టిన బిచ్చగాడు)చాందిని ఏం చెప్పింది?'హలో.. నేను గత కొన్నిరోజుల నుంచి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా లేను. ఎందుకంటే కొన్నాళ్ల క్రితం నాకు ఓ గాయమైంది. దాన్ని పెద్దగా పట్టించుకోకుండా షూటింగ్స్‌లో పాల్గొన్నాను. ఇప్పుడు ఆ గాయం తిరగబెట్టింది. షూట్ కోసం వెళ్తుంటే గాయం వల్ల మరింత నొప్పిగా అనిపిస్తుంది. దీంతో అన్నింటికి కొన్నాళ్లు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. మళ్లీ ఆరోగ్యం కుదుటపడిన తర్వాత సోషల్ మీడియాలోకి వస్తా' అని చాందిని చౌదరి ఇన్ స్టాలో స్టోరీ పోస్ట్ చేసింది.షార్ట్ ఫిల్మ్స్ నటిగా కెరీర్ మొదలుపెట్టిన చాందిని చౌదరి.. టాలీవుడ్‌లోనూ హీరోయిన్గా పలు సినిమాలు చేసింది. ఈ ఏడాది గామి, మ్యూజిక్ షాప్ మూర్తి, యేవమ్ చిత్రాలతో వచ్చింది. ప్రస్తుతం బాలకృష్ణ కొత్త మూవీలో నటిస్తోంది. బహుశా ఈమెకు సంబంధించిన చిత్రీకరణ పూర్తయినట్లు ఉంది. అందుకే కొన్నాళ్లపాటు రెస్ట్ తీసుకుంటానని చెప్పినట్లు అనిపిస్తోంది.(ఇదీ చదవండి: షోలో కన్నీళ్లు పెట్టుకున్న హీరో సూర్య) -
నేనోపాఠం నేర్చుకున్నాను
వ్యాయామాలు చేసే సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలని, లేకపోతే తనలానే ఇబ్బంది పడాల్సి వస్తుందని అంటున్నారు రకుల్‌ప్రీత్ సింగ్. ఇంతకీ విషయం ఏంటంటే... వ్యాయామాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే రకుల్ ఇటీవల హెవీ వర్కౌట్ చేశారు. ఈ కారణంగా ఆమెకు గాయం కావడంతో ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ విషయంపై రకుల్ స్పందించారు. ‘‘నా ఆరోగ్యం గురించి నేనొక అప్డేట్ ఇస్తున్నాను. నేనొక పిచ్చి పని చేశాను. నా శరీరం చెప్పే మాటను నేను పట్టించుకోలేదు. హెవీ వర్కౌట్ చేశాను. ఇందుకు ఫలితంగా నేను గాయపడ్డాను.ఆరు రోజులుగా నేను బెడ్‌పై విశ్రాంతి తీసుకుంటున్నాను. పూర్తి స్థాయిలో నేను కోలుకోవడానికి మరో వారం రోజులు పడుతుందనిపిస్తోంది. నేను తొందరగానే కోలుకుంటానని అనుకుంటున్నాను. ఎందుకంటే రెస్ట్ తీసుకోవడం అనేది నాకు ఇష్టం ఉండదు. అలాగే నేనొకపాఠం కూడా నేర్చుకున్నాను. మీకు మీ శరీరం ఏదైనా సిగ్నల్ ఇచ్చినప్పుడు పట్టించుకోండి. తేలికగా తీసుకుని బలవంతంగా వర్కౌట్స్ చేయకండి. నాకు తెలిసి నా శరీరం కన్నా నా బ్రెయిన్ స్ట్రాంగ్ అనుకుంటున్నాను. కానీ అన్ని వేళలా ఇది వర్కౌట్ కాదు. ఇక నా మేలును ఆశించి నాకు సందేశాలు పంపుతున్న వారికి థ్యాంక్స్. నేను త్వరలోనే కోలుకుని, మరింత స్ట్రాంగ్‌గా వస్తాను’’ అని పేర్కొన్నారు రకుల్ ప్రీత్‌సింగ్. ఇదిలా ఉంటే.. 80 కేజీల బరువు ఎత్తడంవల్లే రకుల్‌కి గాయం అయిందని బాలీవుడ్ టాక్. -
ప్రపంచ చాంపియన్‌షిప్ లక్ష్యం
సొనెపట్: కొత్త సీజన్‌ను వంద శాతం ఫిట్నెస్తో ప్రారంభిస్తానని భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా అన్నాడు. రెండు వరుస ఒలింపిక్స్‌లలో స్వర్ణ, రజత పతకాల విజేత అయిన 26 ఏళ్ల ఈ స్టార్ గాయం నుంచి కోలుకున్నట్లు చెప్పాడు. వచ్చే ఏడాది జరిగే ప్రపంచ చాంపియన్íÙప్లో టాప్–3లో నిలవడమే లక్ష్యంగా శ్రమిస్తానని పేర్కొన్నాడు. బ్రస్సెల్స్‌లో జరిగిన డైమండ్ లీగ్ ఫైనల్లో చోప్రా రెండో స్థానంలో నిలిచి సీజన్‌ను ఘనంగా ముగించాడు. హరియాణాలోని స్పోర్ట్స్ యూనివర్సిటీలో నిర్వహించిన ‘మిషన్ ఒలింపిక్స్–2036’ పాల్గొన్న నీరజ్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ‘ఇప్పటిదాకా జరిగిన సీజన్ ముగిసింది. కొత్త సీజన్‌పై దృష్టి పెట్టాలి. ఇందులో పెద్ద లక్ష్యాన్ని నిర్దేశించుకున్నా. 2025లో టోక్యోలో జరిగే ప్రపంచ చాంపియన్íÙప్లో పతకమే లక్ష్యంగా సన్నాహాలు ప్రారంభించాల్సి ఉంది. ఒలింపిక్స్ అనేది ఎప్పటికైనా పెద్ద ఈవెంటే. కానీ దానికి ఇంకా నాలుగేళ్ల సమయముంది’ అని అన్నాడు. ఈ ఏడాది గాయంతో ఇబ్బంది పడిన తను ప్రస్తుతం కోలుకున్నానని చెప్పాడు. పూర్తిస్థాయి ఫిట్నెస్తో కొత్త సీజన్ బరిలోకి దిగుతానన్నాడు. సాంకేతిక అంశాలపై కూడా దృష్టి సారించినట్లు చెప్పిన చోప్రా జర్మన్ బయోమెకానిక్ నిపుణుడైన క్లాస్ బార్టొనిజ్తో కలిసి పురోగతి సాధించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పాడు. స్వదేశంలోనూ శిక్షణ తీసుకోవచ్చని అయితే పోటీలు విదేశాల్లో ఉండటంతో అక్కడే ట్రెయినింగ్‌లో పాల్గొంటున్నానని వివరించాడు. ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో వరుస ఒలింపిక్స్ క్రీడల్లో పతకాలు గెలిచిన భారత తొలి అథ్లెట్‌గా ఘనతకెక్కిన చోప్రా ఒలింపిక్స్‌లో ఆరు పతకాలే సాధించినా... ఎక్కువగా నాలుగో స్థానాలు వచ్చాయన్న సంగతిని గుర్తు చేశాడు. దీంతో ఒక్క స్వర్ణం లేకపోయినా మన ప్రదర్శన తీసికట్టుగా భావించాల్సిన అవసరం లేదన్నాడు. అయితే పారాలింపిక్స్‌లో మన పారా అథ్లెట్లు అసాధారణ స్థాయిలో పతకాలు సాధించారని అభినందించాడు. తదుపరి మెగా ఈవెంట్లలో భారత్ బలమైన జట్టుగా బరిలోకి దిగుతుందని, మరిన్ని పతకాలు సాధిస్తుందని చెప్పాడు. అంతకుముందు కేంద్ర క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవీయతో నీరజ్ భేటీ అయ్యాడు. తాను సంతకం చేసిన జెర్సీని మంత్రికి నీరజ్ అందజేశాడు. -
'ఆ ప్రమాదం వల్లే యాక్టివ్‌గా లేను'.. పుష్ప భామ రష్మిక పోస్ట్ వైరల్!
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రస్తుతం పుష్ప-2లో కనిపించనుంది. బన్నీ- సుకుమార్ కాంబోలో వస్తోన్న ఈ చిత్రంలో శ్రీవల్లిగా మరోసారి అభిమానులను అలరించనుంది. పుష్పకు సీక్వెల్‌గా వస్తోన్న ఈ సినిమా డిసెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సంద డి చేయనుంది. ఆగస్టు 15న రిలీజ్ కావాల్సిన షూటింగ్ పెండింగ్‌లో ఉండడంతో వాయిదా పడిన సంగతి తెలిసిందే.అయితే తాజాగా రష్మిక చేసిన ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. చాలా రోజుల నుంచి సోషల్ మీడియాకు దూరంగా ఉన్నానని తెలిపింది. ఎందుకంటే గత నెల రోజులుగా యాక్టివ్‌గా లేకపోవడానికి ఓ కారణం ఉందని వెల్లడించింది. నాకు చిన్న ప్రమాదం జరిగిందని.. అందుకే సోషల్ మీడియాకు దూరంగా ఉన్నానని శ్రీవల్లి చెప్పుకొచ్చింది. డాక్టర్ల సలహాతో కోలుకున్నానని.. ప్రస్తుతం తాను ఇంట్లోనే ఉన్నట్లు పేర్కొంది. ఇకనుంచి నా రోజువారీ కార్యకలాపాలతో యాక్టివ్‌గా ఉంటానని రాసుకొచ్చింది.అంతే కాకుండా 'మీరు కూడా ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా వహించండి.. ఎందుకంటే ఈ జీవితం చాలా చిన్నది.. రేపు అనేది ఉంటుందో లేదో తెలియదు.. అందుకే ప్రతి రోజు సంతోషంగా జీవించండి' అంటూ అభిమానులకు సలహా ఇచ్చింది ముద్దుగుమ్మ. త్వరలోనే ఫుల్‌గా లడ్డులు తింటూ మరో అప్డేట్ ఇస్తానని ఫన్నీగా పోస్ట్ చేసింది రష్మిక. ఇది చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. Hey guys🥰How've you been?💛I know it's been a whileeeee since I came on here or was even seen in the public.. 🏃🏻♀️➡️The reason I haven't been very active in last month is because I had a little accident, (a minor one) and I was recovering and was staying at home as I was… pic.twitter.com/TrTieza3eM— Rashmika Mandanna (@iamRashmika) September 9, 2024 -
ఆస్పత్రి నుంచి హీరో రవితేజ డిశ్చార్జ్.. ట్వీట్ వైరల్
తెలుగు స్టార్ హీరో రవితేజ.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. ఈ విషయమై ట్విటర్లో పోస్ట్ పెట్టాడు. సర్జరీ సాఫీగా సాగిందని, విజయవంతంగా పూర్తయిందని.. దీంతో డిశ్చార్జ్ అయినట్లు పేర్కొన్నాడు. అందరి ఆశీర్వాదాలు, మద్ధతుకి కృతజ్ఞతలు చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: 'మిస్టర్ బచ్చన్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సయిందా?)రీసెంట్గా 'మిస్టర్ బచ్చన్' సినిమాతో వచ్చిన రవితేజ.. ప్రస్తుతం భాను భోగవరపు అనే కొత్త దర్శకుడు తీస్తున్న ఓ సినిమాలో నటిస్తున్నాడు. శ్రీలీల హీరోయిన్. షూటింగ్లో భాగంగా రవితేజ గాయపడగా.. హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. శస్త్ర చికిత్స చేశారు. అయితే రవితేజ గాయపడిన ఫొటో ఇదేనంటూ ఓ ఫేక్ పిక్‌ని తెగ వైరల్ చేశారు. ఇప్పుడు డిశ్చార్జ్ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.(ఇదీ చదవండి: ప్రభాస్-అర్షద్ వివాదం.. సెటిల్ చేస్తున్న నాగ్ అశ్విన్) -
ఎన్టీఆర్‌కి రోడ్డు ప్రమాదం అని రూమర్స్.. టీమ్ క్లారిటీ
'దేవర' షూటింగ్ ఎన్టీఆర్ పూర్తి చేశాడు. తన పాత్రకు సంబంధించిన చిత్రీకరణ పూర్తయిందని తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. దీంతో అభిమానులు మూవీ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఇంతలోనే ఇతడు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడని, ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్నాడని రూమర్స్ వచ్చాయి. ఇవి నిజం కాదని స్వయంగా తారక్ టీమ్ క్లారిటీ ఇచ్చింది.(ఇదీ చదవండి: నాగచైతన్య ఎంగేజ్మెంట్.. అతనితో సమంత డేటింగ్!)కొన్నిరోజుల క్రితం జిమ్‌లో వర్కౌట్ చేస్తుండగా ఎడమ చేయి మణికట్టు దగ్గర కాస్త బెణికిందని, కానీ దాన్ని భరిస్తూనే 'దేవర' షూటింగ్ పూర్తి చేశారని.. దీనికి బదులు రోడ్డు ప్రమాదమని రూమర్స్ వస్తున్నాయి. అయితే ఈ రూమర్స్ ఎవరూ నమ్మొద్దని ఎన్టీఆర్ టీమ్ క్లారిటీ ఇచ్చింది. రెండు వారాలు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని చెప్పుకొచ్చారు.'ఆర్ఆర్ఆర్' తర్వాత ఎన్టీఆర్.. కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర' చేస్తున్నాడు. సెప్టెంబరు 27న తొలి పార్ట్ థియేటర్లలోకి రానుంది. జాన్వీ కపూర్ హీరోయిన్. ఇప్పటికే రెండు పాటలు రిలీజ్ చేయగా, అవి రెండు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. నెక్స్ట్ ఏం ప్రమోషనల్ కంటెంట్ వస్తుందా అని ఫ్యాన్స్ వెయిటింగ్.(ఇదీ చదవండి: జూనియర్ ఎన్టీఆర్ దేవర.. అప్డేట్ ఇచ్చిన యంగ్ టైగర్!) -
హీరో సూర్యకు గాయం
హీరో సూర్య స్వల్పంగా గాయపడ్డారు. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో సూర్య హీరోగా ఓ గ్యాంగ్‌స్టర్ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్నారు. సూర్య, జ్యోతిక, కార్తీక్ సుబ్బరాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం ఊటీలో జరుగుతోందని కోలీవుడ్ టాక్. అక్కడ ఓ యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరించే సమయంలో సూర్య తలకు గాయం అయిందనే వార్తలు వచ్చాయి.దీంతో సూర్యకు ఏమైందోనని ఆయన అభిమానులు కంగారుపడ్డారు. అయితే అది చిన్న గాయమేనని, అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సూర్య అన్న బాగానే ఉన్నారని ఈ చిత్రం సహ–నిర్మాతల్లో ఒకరైన రాజశేఖర్ పాడియన్ ‘ఎక్స్’లో షేర్ చేశారు. దీంతో సూర్య అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. -
హీరో సూర్య తలకు గాయం.. నిర్మాత క్లారిటీ!
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం కార్తిక్ సుబ్బరాజు డైరెక్షన్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని వర్కింగ్ టైటిల్ సూర్య44 పేరుతో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. తాజాగా ఈ మూవీ షూటింగ్లో హీరో సూర్యకు గాయాలైనట్లు తెలుస్తోంది. ఆయనకు తలకు బలమైన గాయమైనట్లు కోలీవుడ్‌లో వార్తలు రావడంతో ఫ్యాన్స్‌కు షాక్‌కు గురయ్యారు. ఈ నేపథ్యంలో ఈ విషయంపై చిత్ర నిర్మాత క్లారిటీ ఇచ్చారు. ఈ విషయాన్న ట్విటర్ వేదికగా పంచుకున్నారు.నిర్మాత రాజశేఖరన్ పాండియన్ సోషల్ మీడియా వేదికగా సూర్య గాయంపై స్పందించారు. సూర్యకు గాయమైన మాట వాస్తవమేనని.. అయితే చిన్నదేనని తెలిపారు. ప్రస్తుతం ఆయన బాగానే ఉన్నారని.. అభిమానులు ఎవరూ ఆందోళన చెందవద్దని సూచించారు. కాగా.. ఈ మూవీ షూటింగ్ ఇటీవలే ఊటీలో ప్రారంభమైంది. సూర్యకు స్వల్ప గాయాలు కావడంతో వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. సూర్య నటించిన భారీ యాక్షన్ చిత్రం కంగువా అక్టోబరు 10న విడుదల కానుంది.Dear #AnbaanaFans, It was a minor injury. Pls don’t worry, Suriya Anna is perfectly fine with all your love and prayers. 🙏🏼— Rajsekar Pandian (@rajsekarpandian) August 9, 2024 -
ఓటమి బాధలో ఉన్న విండీస్‌కు బిగ్ షాక్.. టోర్నీ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్?
టీ20 వరల్డ్‌కప్ గ్రూపు స్టేజిలో అజేయంగా నిలిచిన వెస్టిండీస్‌కు సూపర్-8లో బిగ్ షాక్ తగిలింది. సెయింట్ లూసియా వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో వెస్టిండీస్ ఓటమి పాలైంది. 181 పరుగుల భారీ లక్ష్యాన్ని కాపాడుకోవడంలో విండీస్ బౌలర్లు విఫలమయ్యారు. 181 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లీష్ జట్టు 17.2 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. ఇంగ్లండ్ ఓపెనర్ ఫిల్ సాల్ట్( 7 ఫోర్లు, 5 సిక్స్‌లతో 87 నాటౌట్) అద్బుత ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు.విండీస్‌కు బిగ్ షాక్..ఇక ఓటమి బాధలో ఉన్న కరేబియన్ జట్టుకు మరో బిగ్ షాక్ తగిలే అవకాశం ఉంది. ఆ జట్టు స్టార్ ఓపెనర్ బ్రాండెన్ కింగ్ గాయం కారణంగా టోర్నీలో మిగిలిన మ్యాచ్‌లకు దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కింగ్ గాయపడ్డాడు. సామ్కుర్రాన్ బౌలింగ్‌లో కవర్స్ దిశగా షాట్ ఆడే సమయంలో కింగ్ పక్కటెముకలకు గాయమైంది. దీంతో హఠాత్తుగా తీవ్రమైన నొప్పితో కింగ్ విల్లవిల్లాడు. వెంటనే ఫిజియో వచ్చి చికిత్స అందించినప్పటికి అతడి నొప్పి మాత్రం తగ్గలేదు. దీంతో ఫిజియో సాయంతో కింగ్ మైదానాన్ని వీడాడు. అతడు ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు సమాచారం. అయితే కింగ్ గాయంపై విండీస్ క్రికెట్ బోర్డు ఎటువంటి ప్రకటన చేయలేదు. విండీస్ తమ తదుపరి మ్యాచ్‌లో జూన్ 22న అమెరికాతో తలపడనుంది. -
గాయంతో ఐపీఎల్ మిగతా మ్యాచ్‌కు మయాంక్ దూరం
పదునైన పేస్ బౌలింగ్‌తో ఈ ఐపీఎల్లో వెలుగులోకి వచ్చిచన మయాంక్ యాదవ్ మిగతా సీజన్‌కు దూరమయ్యాడు. పక్కటెముకల గాయంతో బాధపడుతున్న ఈ లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్ మిగిలిన మ్యాచ్‌లు ఆడే అవకాశం లేదని జట్టు కోచ్ జస్టిన్ లాంగర్ వెల్లడించాడు. తొలిసారి ఐపీఎల్ బరిలోకి దిగిన 21 ఏళ్ల మయాంక్ తొలి రెండు మ్యాచ్‌లలో అద్భుత ప్రదర్శన కనబర్చాడు. లక్నో విజయాల్లో కీలక పాత్ర పోషించి ఐపీఎల్లో ఆడిన తొలి రెండు మ్యాచ్‌లలో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచిన తొలి ఆటగాడిగా నిలిచాడు. ప్రతీ మ్యాచ్‌లో 150 కిలోమీటర్లకు పైగా వేగంతో బౌలింగ్ చేస్తూ సత్తా చాటిన అతను గాయంతో మూడో మ్యాచ్ మధ్యలో తప్పుకున్నాడు. ఆ తర్వాత లక్నో ఆడిన ఐదు మ్యాచ్‌లకు దూరమైన అతను కోలుకొని ముంబైతో మ్యాచ్‌లో మళ్లీ బరిలోకి దిగాడు. ఈ మ్యాచ్‌లో తన నాలుగో ఓవర్లో ఒక బంతి వేయగానే గాయం తిరగబెట్టడంతో మెదానం వీడాడు. లక్నో ప్లే ఆఫ్స్‌కు చేరితే మయాంక్ ఆడే అవకాశాలు ఉన్నాయని భావించినా... ఇప్పుడు ఆ అవకాశం లేదని తేలిపోయింది. -
రాహుల్ అవుట్
రాజ్‌కోట్: భారత సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ మూడో టెస్టుకూ దూరమయ్యాడు. గాయంతో అతన్ని రెండో టెస్టు నుంచి తప్పించి... ఇటీవలే మూడో టెస్టుకు ఎంపిక చేశారు. ఫిట్నెస్ సంతరించుకుంటేనే తుది జట్టుకు ఆడతాడని సెలక్షన్ సమయంలోనే స్పష్టం చేశారు. తాజాగా అతను పూర్తిగా కోలుకునేందుకు మరికొంత సమయం పట్టనుండటంతో మూడో టెస్టు నుంచి తప్పించారు. అతని స్థానంలో కర్ణాటక ఎడంచేతి వాటం బ్యాటర్ దేవదత్ పడిక్కల్‌ను ఎంపిక చేశారు. ‘రాహుల్ వందశాతం ఫిట్నెస్తో ఉంటేనే తుది జట్టుకు పరిగణిస్తామని ఇదివరకే చెప్పాం. అతను 90 శాతం కోలుకున్నట్లు తెలియడంతో రాజ్‌కోట్ టెస్టుకూ పక్కన బెట్టాం. అతని పరిస్థితిని బోర్డు మెడికల్ టీమ్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంది’ అని బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో పునరావాస శిబిరంలో ఉన్న రాహుల్ నాలుగో టెస్టుకల్లా కోలుకుంటాడని ఆశాభావంతో ఉన్నట్లు ఆయన చెప్పారు. భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య మూడో టెస్టు 15 నుంచి రాజ్‌కోట్‌లో జరుగుతుంది. రాజ్‌కోట్‌కు ఇంగ్లండ్ స్వల్ప విరామం కోసం అబుదాబి వెళ్లిన ఇంగ్లండ్ క్రికెట్ జట్టు సోమవారం తిరిగి భారత్ చేరుకుంది. వారంపాటు అక్కడ సేదతీరిన పర్యాటక జట్టు మూడో టెస్టు కోసం రాజ్‌కోట్ వేదికకు వచి్చంది. మంగళవారం సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (ఎస్సీఏ) గ్రౌండ్లో ఇంగ్లండ్ ఆటగాళ్లు నెట్ ప్రాక్టీస్ చేస్తారని స్థానిక వర్గాలు తెలిపాయి. స్పిన్నర్ జాక్ లీచ్ మోకాలి గాయంతో మిగతా టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు. అతను అబుదాబి నుంచే స్వదేశానికి పయనమయ్యాడు. స్పిన్ త్రయం హార్ట్లీ, రేహాన్ అహ్మద్, బషీర్‌లతో పాటు పార్ట్‌టైమ్ స్పిన్ పాత్ర పోషించే జో రూట్ అందుబాటులో ఉండటంతో లీచ్ స్థానంలో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఇంకెవరినీ ఎంపిక చేయలేదు. నిజానికి అతను తొలిటెస్టు మాత్రమే ఆడాడు. లీచ్ రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 2 వికెట్లే తీశాడు. తర్వాతి రెండో టెస్టుకు దూరమయ్యాడు. -
ఆస్పత్రి పాలైన 'దేవర' విలన్.. ఇంతకీ కారణం ఏంటంటే?
'దేవర' సినిమాలో విలన్‌గా చేస్తున్న సైఫ్ అలీ ఖాన్ ఆస్పత్రి పాలయ్యాడు. బాలీవుడ్లో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఇతడు.. గతేడాది 'ఆదిపురుష్' విలన్‌గా నటించాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నాడు. అయితే షూటింగ్లో భాగంగా ఈ మధ్య సైఫ్‌కి గాయాలయ్యాయని రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు ఇతడు ఆస్పత్రిలో చేరడంతో అది నిజమని తేలింది. (ఇదీ చదవండి: సైలెంట్‌గా ఎంగేజ్మెంట్ చేసుకున్న 'బిగ్‌బాస్' శోభాశెట్టి) ప్రస్తుతం 'దేవర' షూటింగ్ చివరి దశలో ఉంది. అయితే కొన్నాళ్ల ముందు యాక్షన్ సన్నివేశాలు తీస్తున్నప్పుడు విలన్‌గా చేస్తున్న సైఫ్.. మోకాలి, భూజానికి గాయాలయ్యాయట. అయితే అప్పుడు పెద్దగా తెలియలేదు గానీ ఇప్పుడు ఆ గాయాలు సీరియస్ కావడంతో ముంబయిలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో చేరాడు. అయితే గతంలో సైఫ్‌కి గాయమైందట. తాజాగా అది తిరగబెట్టడంతో ట్రైసప్(కండ) సర్జరీ కచ్చితంగా చేయాల్సి వచ్చిందట. అలా ఇప్పుడు ఆ శస్త్రచికిత్స జరిగినట్లు తెలుస్తోంది. బాలీవుడ్లో హీరోగా అప్పట్లో హిట్స్ కొట్టిన సైఫ్.. ఇప్పుడు సరైన సినిమాలు పడకపోయేసరికి రూట్ మార్చాడు. ప్రతినాయక పాత్రలైనా సరే ఒప్పుకొంటున్నాడు. అలా గతేడాది ప్రభాస్ 'ఆదిపురుష్'లో రావణుడిగా కనిపించాడు. ఇప్పుడు ఎన్టీఆర్ 'దేవర' చిత్రంలో భైరా అనే పాత్రలో నటిస్తున్నాడు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 27 సినిమాలు రిలీజ్.. అదొక్కటి స్పెషల్) -
ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు నాదల్ దూరం
స్పెయిన్ దిగ్గజ టెన్నిస్ ప్లేయర్ రాఫెల్ నాదల్ ఈనెల 14 నుంచి 28 వరకు జరిగే సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు నాదల్ దూరం నుంచి వైదొలిగాడు. కెరీర్లో 22 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన 37 ఏళ్ల నాదల్ గత ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ తర్వాత తుంటి గాయంతో ఏడాదిపాటు ఆటకు దూరమయ్యాడు. గతవారం బ్రిస్బేన్ ఓపెన్ టోర్నీతో నాదల్ పునరాగమనం చేశాడు. ఈ టోర్నీ లో జోర్డాన్ థాంప్సన్ (ఆస్ట్రేలియా)తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయిన నాదల్ ఈ మ్యాచ్ సందర్భంగా ఎడమ కాలి కండరాల గాయానికి గురయ్యాడు. -
టీమిండియాకు భారీ షాక్.. స్టార్ ఆల్‌రౌండర్‌కు గాయం
సెంచూరియన్: తొలి టెస్టులో ఓడిన భారత్‌కు మరో దెబ్బ! బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా సెంచూరియన్ టెస్టు ఆడిన శార్దుల్ ఠాకూర్ గాయపడ్డాడు. అయితే ఇది మ్యాచ్ సమయంలో కాదు! నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా అతని ఎడమ భుజానికి గాయమైంది. వెంటనే జట్టు ఫిజియో ఐస్ ప్యాక్‌తో ఉపశమన సపర్యలు చేశాడు. అనంతరం మళీ ప్రాక్టీస్‌కు దిగలేదు. దీంతో అతను కేప్‌టౌన్‌లో జనవరి 3 నుంచి జరిగే ఆఖరి టెస్టుకు దూరమయ్యే అవకాశముంది. గాయం తీవ్రతను తెలుసుకునేందుకు శార్దుల్ భుజానికి స్కానింగ్ తీయాల్సి ఉంది. దీన్నిబట్టే అతను అందుబాటులో ఉంటాడ లేదా అనే విషయంపై స్పష్టత వస్తుంది. సఫారీ బౌలర్ కొయెట్జీ అవుట్ దక్షిణాఫ్రికా పేసర్ గెరాల్డ్ కొయెట్జీ రెండో టెస్టుకు దూరమయ్యాడు. 23 ఏళ్ల బౌలర్ పొత్తికడుపు నొప్పితో సతమతమవుతున్నాడు. ఈ నొప్పితోనే తొలిటెస్టు ఆడటంతో వాపు మొదలైందని జట్టు వర్గాలు తెలిపాయి. దీంతో కొయెట్జీ కేప్‌టౌన్ టెస్టుకు అందుబాటులో లేడని దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు సోషల్ మీడియా ‘ఎక్స్’ ద్వారా వెల్లడించింది. ఇదివరకే రెగ్యులర్ కెపె్టన్ బవుమా కూడా గాయంతో రెండో టెస్టుకు గైర్హాజరు కానున్నాడు. కొయెట్జీ స్థానాన్ని ఎన్గిడి, ముల్డర్లలో ఒకరితో భర్తీ చేసే అవకాశముంది. -
ఆ విషయం తెలిసి చాలా బాధపడ్డా: మెగాస్టార్ ట్వీట్
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ గాయంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ఆయన త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్ చేశారు. కేసీఆర్ సార్‌కు గాయమైందన్న విషయం తెలిసి చాలా బాధపడ్డానని పేర్కొన్నారు. ఆయనకు శస్త్ర చికిత్స విజయవంతమై త్వరగా కోలుకోవాలని మెగాస్టార్ ఆకాంక్షించారు. ఇప్పటికే సోమాజిగూడలోని యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ ఆరా తీశారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు రేవంత్ తెలిపారు. కేసీఆర్‌ను మెరుగైన వైద్య చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. కాగా.. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి.. బింబిసార ఫేమ్ మల్లిడి వశిష్ట దర్శకత్వంలో మెగా 156 చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాకు 'విశ్వంభర' అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. బింబిసార చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలో సూపర్ హిట్ కొట్టిన వశిష్ఠ చాలా గ్యాప్ తీసుకుని పక్కా ప్లాన్‌తో చిరంజీవి కోసం కథ సిద్ధం చేశారు. యూవీ క్రియేషన్స్ ద్వార విక్రమ్, వంశీ, ప్రమోద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. Deeply pained to learn about the injury suffered by Sri KCR garu! Wishing him a successful surgery and a very speedy recovery. — Chiranjeevi Konidela (@KChiruTweets) December 8, 2023 -
గాయపడిన 'లియో' డైరెక్టర్.. వాళ్లని కలవడానికి వెళ్లి!
లియో మూవీ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ గాయపడ్డాడు. ఈ విషయాన్ని స్వయంగా అతడే వెల్లడించాడు. దసరా కానుకగా థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. కలెక్షన్స్‌లో అదరగొడుతోంది. ప్రస్తుతం రూ.400 కోట్లకు పైగా వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ప్రమోషన్స్‌లో భాగంగా ఫ్యాన్స్‌ని కలవడానికి వెళ్లిన లోకేశ్ గాయపడటం కాస్త కలవరపాటుకి గురిచేసింది. (ఇదీ చదవండి: హీరో ప్రభాస్ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం అదా?) 'లియో'తో కలిపి లోకేశ్ కనగరాజ్ తీసింది జస్ట్ ఐదు సినిమాలే. కానీ దక్షిణాదిలో కల్ట్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. తమిళ హీరోలందరినీ కలిపి లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్ తీస్తుంటడమే ఇందుకు కారణం. లోకేశ్ తీసిన ఖైదీ, విక్రమ్, లియో సినిమాలు.. ఈ యూనివర్స్‌లో భాగమే. ఇకపోతే 'లియో' సక్సెస్‌లో భాగంగా కేరళలోని పాలక్కాడ్ వెళ్లాడు లోకేశ్. పాలక్కాడ్‌లోని అరోమా థియేటర్‌కి వెళ్లి ఫ్యాన్స్‌తో కలిసి లియో సినిమా చూశారు. ఆ తర్వాత బయటకు వచ్చిన అభిమానులతో కలిసి సెల్ఫీ కూడా తీసుకున్నాడు. అయితే ఊహించిన దానికంటే ఎక్కువమంది జనాలు వచ్చేసరికి పోలీసులు కంట్రోల్ చేయలేకపోయారు. దీంతో తనకు గాయమైందని లోకేశ్ స్వయంగా చెప్పుకొచ్చాడు. మరోసారి త్వరలో కేరళ వస్తానని అన్నాడు. అతడి ట్వీట్ బట్టి చూస్తుంటే గాయం చిన్నదే అనిపిస్తుంది. (ఇదీ చదవండి: పవన్ కల్యాణ్ సీఎం కావాలని నేను ఎప్పటికీ కోరుకోను: రేణు దేశాయ్) Thank you Kerala for your love.. Overwhelmed, happy and grateful to see you all in Palakkad. ❤️ Due to a small injury in the crowd, I couldn’t make it to the other two venues and the press meeting. I would certainly come back to meet you all in Kerala again soon. Till then… pic.twitter.com/JGrrJ6D1r3 — Lokesh Kanagaraj (@Dir_Lokesh) October 24, 2023 Director lokesh at palakkad,aroma theatre 🤩 " Thalapathy enna sonnaru nu kettaralama when lokesh said he is going to kerala "🤩😍 @actorvijay na come here one time na 🙂 #Leo #LeoIndustryHit pic.twitter.com/87TQJd9kDf — Hari Vj Fanatic (@Vijayfanzh) October 24, 2023 -
హార్దిక్ పాండ్యాకు గాయం
ప్రపంచకప్ వేటలో ఉన్న భారత శిబిరంలో కాస్త ఆందోళన పెంచే ఘటన మైదానంలో జరిగింది. బంగ్లాతో మ్యాచ్‌లో బౌలింగ్ చేస్తూ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గాయపడ్డాడు. తన తొలి ఓవర్ మూడో బంతిని బ్యాటర్ దాస్ నేరుగా ఆడగా బంతిని ఆపే ప్రయత్నంలో పాండ్యా తన కాలును బాగా ముందుకు జరిపాడు. ఈ క్రమంలో అతని చీలమండ భాగం మడత పడింది. దాంతో అతను నొప్పితో విలవిల్లాడాడు. ప్రాథమిక చికిత్స చేసినా లాభం లేకపోవడంతో అలాగే మైదానం వీడాడు. కొద్ది సేపటికే ఈ మ్యాచ్‌లో అతను బౌలింగ్ చేయడని బీసీసీఐ ప్రకటించింది. అతని కాలికి స్కాన్ నిర్వహించినట్లు తెలిసింది. దాని ఫలితాలపై పూర్తి సమాచారం లేకున్నా మ్యాచ్ తర్వాత రోహిత్ ‘పెద్దగా ప్రమాదం ఏమీ లేకపోవడం మాకు ఊరట. అయితే ప్రతీ రోజు గాయాన్ని వైద్యులు పర్యవేక్షిస్తారు’ అని స్పష్టతనిచ్చాడు. పాండ్యా తప్పుకోవడంతో ఆ ఓవర్లో మిగిలిన మూడు బంతులను కోహ్లి బౌల్ చేయడంతో స్టేడియం హోరెత్తింది. దీనికి ముందు 2017లో శ్రీలంకపై చివరిసారిగా కోహ్లి బౌలింగ్ చేశాడు. -
ప్రపంచకప్‌కు నసీమ్ షా దూరం!
వచ్చే నెలలో భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్ ప్రారంభానికి ముందే పాకిస్తాన్ జట్టుకు గట్టి దెబ్బ తగిలే అవకాశముంది. ఆ జట్టు యువ పేస్ బౌలర్ నసీమ్ షా ఈ మెగా ఈవెంట్ మొత్తానికి దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఆసియా కప్ టోర్నీలో భాగంగా భారత్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా నసీమ్ షా భుజానికి గాయమైంది. ఈ గాయానికి స్కాన్లు నిర్వహించారు. గాయం తీవ్రతదృష్ట్యా నసీమ్ షా మూడు నెలలు ఆటకు దూరమయ్యే అవకాశముందని తెలిసింది. 20 ఏళ్ల నసీమ్ పాక్ తరఫున 14 వన్డేలు ఆడి 32 వికెట్లు తీశాడు. -
కాజోల్కు ఏమైంది?.. ఆందోళన చెందుతున్న ఫ్యాన్స్!
బాలీవుడ్ భామ కాజోల్ ఇటీవలే ది ట్రయల్ అనే వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సిరీస్‌లో లాయర్ పాత్రలో మెప్పించింది. ఈ సిరీస్‌లో ఆమె నటనకు ప్రశంసలు అందుకుంటోంది. ది గుడ్ వైఫ్ అనే అమెకరిన్ సిరీస్‌కు రీమేక్‌గా తెరకెక్కించారు అయితే బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్‌ను పెళ్లాడిన భామ.. ఇటీవలే 49వ పుట్టిన రోజు వేడుకలు సెలబ్రేట్ చేసుకుంది. అయితే తాజాగా కాజోల్కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. (ఇది చదవండి: అలాంటి వారే వ్యక్తుల గురించి మాట్లాడతారు.. సోనమ్ పోస్ట్ వైరల్! ) ఆమె మోచేతికి కర్ర (ఎల్బో క్రచ్) సాయంతో నడుస్తూ వీడియో కనిపించింది. కాజోల్ తన ఇంటి నుంచి బయటకు వెళ్తుండగా.. కెమెరాల కంటికి చిక్కింది. దీంతో ఆమె ఫ్యాన్స్ కాజోల్కు ఏమైందంటూ ఆరా తీస్తున్నారు. త్వరగా కోలుకోవాలంటూ పోస్టులు పెడుతున్నారు. వీడియోలో గమనిస్తే కాజోల్ కాలికి గాయమైనట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. అంతే కాకుండా గాయంతోనే షూటింగ్‌కు వెళుతున్నట్లు సమాచారం. కాగా.. కాజోల్ మిస్టరీ థ్రిల్లర్ దో పట్టిలో కృతి సనన్‌తో కలిసి నటించనుంది. ఈ ప్రాజెక్ట్ నేరుగా ఓటీటీలోనే రిలీజ్ కానుంది. (ఇది చదవండి: ఆ హీరోయిన్‌కి క్షమాపణలు చెప్పిన రానా) View this post on Instagram A post shared by Snehkumar Zala (@snehzala) -
'డబుల్ ఇస్మార్ట్' షూటింగ్లో ప్రమాదం.. సంజయ్ దత్‌కు గాయాలు!
టాలీవుడ్ హీరో రామ్ పోతినేని నటిస్తోన్న తాజా చిత్రం 'డబుల్ ఇస్మార్ట్'. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 2019లో పూరి జగన్నాథ్ డైరెక్షన్లో ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఆ సినిమా మాస్ ఆడియన్స్‌ను ఎంతో ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలోనే ఇస్మార్ట్ శంకర్‌కు సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ సరసన బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధ కపూర్ నటిస్తోంది. మరో హీరోయిన్గా మీనాక్షి చౌదరిని తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ పాన్ ఇండియా సినిమాని పూరి కనెక్ట్స్ సంస్థ నిర్మిస్తుండగా.. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. భారీ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమాని తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. (ఇది చదవండి: పూరి 'ఇస్మార్ట్ శంకర్' వచ్చేస్తున్నాడు.. ఈసారి బాలీవుడ్ హీరోయిన్) అయితే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ థాయ్‌లాండ్‌లో జరుగుతోంది. తాజాగా ఈ సినిమా సెట్లో సంజయ్ దత్‌కు గాయాలైనట్లు తెలుస్తోంది. కత్తితో ఫైట్ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కించే సమయంలో సంజయ్ దత్ గాయపడినట్లు సమాచారం. అతని తలకు గాయం కాగా.. రెండు కుట్లు పడినట్లు చిత్రబృందం తెలిపింది. అయినప్పటికీ అతను వెంటనే సెట్‌కి తిరిగి వచ్చి షూటింగ్‌ని ప్రారంభించాడని చిత్ర యూనిట్ పేర్కొంది. ఇప్పటికే ముంబయిలో మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. రెండో షెడ్యూల్ థాయ్‌లాండ్‌లో కొనసాగుతోంది. కాగా.. సంజయ్ దత్ కేజీఎఫ్-2 చిత్రంలో కీలకపాత్రలో నటించిన సంగతి తెలిసిందే. కాగా.. జూలైలో మేకర్స్ సంజయ్ దత్ పాత్రను 'బిగ్ బుల్'గా అభిమానులకు పరిచయం చేశారు. అతని ఫస్ట్ లుక్ పోస్టర్‌ను సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు. ఈ చిత్రం మార్చి 8, 2024న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండగా ఛార్మి, పూరి నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. కాగా.. ఇప్పటికే రామ్- బోయపాటి కాంబోలో భారీ యాక్షన్ మూవీ 'స్కంద' చేస్తున్నాడు. దీనిని సెప్టెంబర్ 15న పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ చేస్తున్నారు. (ఇది చదవండి: తీసింది నాలుగు సినిమాలు.. అన్నింటికీ సీక్వెల్స్ చేస్తానంటున్న డైరెక్టర్) -
Yadamma Raju Leg Injury Video: నడవలేని స్థితికి చేరుకున్న ఏదమ్మరజు
-
స్టార్ హీరో షారుక్ ఖాన్‌కి యాక్సిడెంట్!
బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్‌కి ప్రమాదం జరిగింది. అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో సినిమా షూటింగ్ చేస్తున్న సమయంలో ఓ సీన్ సందర్భంగా గాయమైంది. దీంతో హుటాహుటిన దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు పెద్దగా ప్రమాదం లేదని చెప్పినప్పటికీ.. మైనర్ సర్జరీ అవసరమని సూచించారట. ప్రస్తుతం షారుక్.. స్వదేశానికి వచ్చేశారని, రెస్ట్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. (ఇదీ చదవండి: మహేశ్నే మించిపోయిన సితార.. ఆ ఒక్క విషయంలో) షారుక్‌కి యాక్సిడెంట్ నేషనల్ మీడియా కథనాల ప్రకారం.. తన కొత్త సినిమా షూటింగ్ కోసం కొన్నాళ్ల ముందు షారుక్ లాస్ ఏంజెల్స్ వెళ్లారు. ఓ సన్నివేశం తీస్తున్న క్రమంలోనే ఆయన ముక్కుకి తీవ్ర గాయమైంది. డాక్టర్స్ అప్పటికప్పుడు ఫస్ట్ ఎయిడ్ చేయడంతో త్వరగానే డిశ్చార్జ్ అయిపోయారు. కానీ మైనర్ సర్జరీ చేయాలని సూచించారు. ఈ ప్రమాదం కొన్నిరోజుల క్రితమే జరిగనప్పటికీ.. ఇప్పుడు ఈ విషయం లీక్ అయింది. దీంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. కానీ షారుక్ క్షేమంగానే ఉన్నారని తెలిసి రిలాక్స్ అయ్యారు. 'జవాన్' కోసం వెయిటింగ్ దాదాపు ఐదేళ్ల తర్వాత థియేటర్లలోకి వచ్చిన షారుక్ ఖాన్.. 'పఠాన్'తో బ్లాక్‌బ్లస్టర్ హిట్ కొట్టారు. ప్రస్తుతం రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో 'డంకీ' మూవీ చేస్తున్నారు. తమిళ డైరెక్టర్ అట్లీతో చేసిన 'జవాన్' విడుదలకు రెడీగా ఉంది. ఇది సెప్టెంబరు 7న పాన్ ఇండియా లెవల్లో థియేటర్లలోకి రాబోతుంది. ఇప్పటికే ఫస్ట్ లుక్, టీజర్ సినిమాపై అంచనాల్ని అమాంతం పెంచేశాయి. ఇలా షారుక్ సినిమాల కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు.. గాయమైందనే వార్త కాస్త కలవరపరిచింది. (ఇదీ చదవండి: పాయల్ కొత్త సినిమా టీజర్.. అలాంటి సీన్స్‌తో!) -
షూటింగ్లో ప్రమాదం.. బిగ్ బాస్ నటికి తీవ్రగాయాలు!
బిగ్ బాస్ ద్వారా ఫేమ్ తెచ్చుకున్న బాలీవుడ్ నటి అర్చన గౌతమ్. ఆమె ప్రస్తుతం రోహిత్ శెట్టి హోస్ట్ చేస్తున్న ఖత్రోన్ కే ఖిలాడీ షోలో నటిస్తోంది. ఈ షో షూటింగ్ ప్రస్తుతం ముంబయిలో జరుగుతోంది. తాజాగా జరిగిన షూటింగ్లో అర్చనా గౌతమ్‌కు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆమె తన ఇన్‌స్టా స్టోరీస్‌లో వెల్లడించింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఫోటోలను పంచుకుంది నటి. (ఇది చదవండి: పుట్టబోయే బిడ్డ కోసం ఉపాసన కీలక నిర్ణయం!) అర్చన గడ్డం కింద బలమైన గాయం అయినట్లు తెలుస్తోంది. ఆమె గాయానికి వైద్యులు కుట్లు వేసినట్లు తెలుస్తోంది. ఈ షోలో ధైర్యవంతులైన కంటెస్టెంట్లలో అర్చన గౌతమ్ ఒకరు. డేరింగ్ స్టంట్ చేస్తుండగానే తీవ్ర గాయాలయ్యాయి. కాగా.. షూటింగ్ ప్రారంభమైన కొన్ని వారాల్లోనే రోహిత్ బోస్ రాయ్, అంజుమ్ ఫకీ అర్జిత్ తనేజా, ఐశ్వర్య శర్మ, నైరా బెనర్జీ పలువురు విన్యాసాలు చేస్తూ గాయపడ్డారు. కాగా.. అర్చన గౌతమ్ ఇటీవల హర్ష్ లింబాచియా షో ఎంటర్టైన్మెంట్ కా రాత్-హౌస్‌ఫుల్‌లో కనిపించింది. రాజకీయ నాయకురాలైన అర్చనా 'బిగ్ బాస్- 16'లో మరింత గుర్తింపు సాధించింది. (ఇది చదవండి: మహిళతో సహజీవనం.. లైవ్‌లో కమెడియన్ ఆత్మహత్యాయత్నం!) View this post on Instagram A post shared by khatron ke khiladi 13 Khabri (@kkk13_biggbossott2.tazakhabar) -
WTC Final: రోహిత్ శర్మకు గాయం..? టీమిండియా అభిమానుల ఆందోళన
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 ఫైనల్‌కు ముందు రోజు ఓ షాకింగ్ వార్త వినాల్సి వచ్చింది. ఇన్ని రోజులు గాయాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండిన భారత ఆటగాళ్లు, మ్యాచ్‌కు కొద్ది గంటల సమయం మాత్రమే ఉందనగా దెబ్బలు తగిలించుకున్నారు. నిన్న ప్రాక్టీస్ సందర్భంగా ఇషాన్ కిషన్ స్వల్పంగా గాయపడగా.. తాజాగా (ఇవాళ) జట్టు సారధి రోహిత్ శర్మ చేతి వేలికి దెబ్బతగిలించుకున్నాడు. గాయం తీవ్రత తదితర విషయాలపై ఎలాంటి సమాచారం లేనప్పటికీ రోహిత్ ఎడమ చేతి వేలికి బ్యాండ్ ఎయిడ్ చుట్టుకుంటూ కనిపించిన ఓ దృశ్యం ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తుంది. ఇది చూసి భారత అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఫైనల్ మ్యాచ్‌కు హిట్‌మ్యాన్ అందుబాటులో ఉంటాడా లేదా అని విచారించుకుంటున్నారు. రోహిత్ గాయంపై పూర్తి సమాచారం కొరకు గూగుల్ చేస్తున్నారు. రోహిత్ గాయం వార్త నిజమా లేక ఫేక్ న్యూసా అని క్రాస్ చెక్ చేసుకుంటున్నారు. ప్రముఖ వార్తా సంస్థల కథనాల ప్రకారం.. ఇవాళ ఉదయం ప్రాక్టీస్ సెషన్ సందర్భంగా రోహిత్ బ్యాటింగ్ చేస్తూ గాయపడ్డాడు. అనంతరం హిట్ మ్యాన్ ప్రాక్టీస్‌కు రాకుండా రెస్ట్ తీసుకున్నాడు. రోహిత్ చేతి వేలికి స్కానింగ్ కూడా చేసినట్లు సమాచారం. కాగా, రేపటి (జూన్ 7) నుంచి జూన్ 11 వరకు భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య కెన్నింగ్స్టన్ ఓవల్ వేదికగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 ఫైనల్ జరుగనున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు చాలా రోజులుగా కఠోరంగా శ్రమిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇరు జట్లలోని ఆటగాళ్లు గాయాల బారిన పడ్డారు. ఆసీస్ తరఫున హాజిల్‌వుడ్, తాజాగా టీమిండియా తరఫున రోహిత్ శర్మ గాయపడ్డారు. మరి హిట్‌మ్యాన్ మ్యాచ్ సమయానికి అందుబాటులో ఉంటాడా లేక గాయం వార్త ఫేక్ న్యూసా తేలాలంటే మరికొద్ది గంటలు వెయిట్ చేయాల్సిందే. తుది జట్లు (అంచనా).. ఆస్ట్రేలియా: ఉస్మాన్ ఖ్వాజా, డేవిడ్ వార్నర్, మార్నస్ లబూషేన్, స్టీవ్ స్మిత్, ట్రవిస్ హెడ్, కెమరూన్ గ్రీన్, అలెక్స్ క్యారీ (వికెట్‌కీపర్), పాట్ కమిన్స్, నాథన్ లియోన్, స్కాట్ బోలండ్, మిచెల్ స్టార్క్ టీమిండియా: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, అజింక్య రహానే, ఇషాన్ కిషన్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, జయదేవ్ ఉనద్కత్, మహ్మద్ సిరాజ్ చదవండి: WTC Final: ఆస్ట్రేలియా తుది జట్టులో నిప్పులు చెరిగే ఫాస్ట్ బౌలర్ -
WTC ఫైనల్ లో ఆస్ట్రేలియాకి కోలుకోలేని దెబ్బ స్టార్ పేసర్ అవుట్
-
ధోని సర్జరీ, అసలు విషయం చెప్పిన CSK సీఈఓ..!
-
చరిత్రలో తోలి సారి కంకషన్ సబ్ స్టిట్యూట్
-
WTC ఫైనల్ కి ముందు కోహ్లి గాయం...అడతాడ లేదా..
-
జైలు బాత్రూమ్లో కుప్పకూలిన సత్యేంద్ర జైన్.. ఆసుపత్రి తరలింపు
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. ఆయన గురువారం ఉదయం తీహార్ జైలులోని బాత్రూమ్లో కళ్లు తిరిగి పడిపోయారు. దీంతో, జైలు అధికారులు సత్యేంద్ర జైన్‌ను వెంటనే పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆసుపత్రికి తరలించారు. కాగా, జైన్ గడచిన వారం రోజుల్లో అనారోగ్యంతో రెండుసార్లు ఆసుపత్రిలో చేరారు. తీహార్ జైలు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం రాత్రి సత్యేంద్ర జైన్ తన వార్డులోని బాత్రూమ్లో పడిపోయారు. దీనికిముందు మే 22న అనారోగ్యం కారణంగా సత్యేంద్ర జైన్‌ను ఢిల్లీ పోలీసులు సఫ్దర్ జంగ్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం తిరిగి జైలుకు తీసుకువచ్చారు. అయితే, బాత్రూమ్లో పడిపోవడంతో ఆయన వెన్నముకకు గాయమైనట్టు తెలుస్తోంది. కాగా, మాజీ మంత్రి జైన్ మనీ లాండరింగ్ కేసులో నిందితునిగా ఉన్నారు. అందులో భాగంగానే జైలు శిక్ష అనుభవిస్తున్నారు. Jailed AAP leader Satyendar Jain admitted to hospital after slipping in washroom#satyendrajain #AAP https://t.co/6L82iMxk83 — Kalinga TV (@Kalingatv) May 25, 2023 ఇది కూడా చదవండి: పార్లమెంట్: రాజ్యసభలో రెడ్, లోక్‌సభలో గ్రీన్ కార్పెట్.. ఎందుకో తెలుసా? -
షూటింగ్లో ప్రమాదం.. సల్మాన్‌ఖాన్‌కు గాయాలు
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ గాయపడ్డాడు. సినిమా షూటింగ్లో యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కిస్తుండగా సల్మాన్ భుజానికి గాయమైంది. ఈ విషయాన్ని స్వయంగా సల్మాన్ తెలిపారు. ఎడమ భుజానికి గాయమైనట్లుత తెలుపుతూ ఓ ఫోటోను ట్విటర్లో పోస్ట్ చేశారు.దీంతో గెట్ వెల్ సూన్ అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. కాగా ప్రస్తుతం సల్మాన్ ‘టైగర్-3’షూటింగ్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో వచ్చిన ఏక్ థా టైగర్, టైగర్ జిందా హైకి సీక్వెల్‌గా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు శరవేగంగా కొనసాగుతుంది. ఈ మూవీలో సల్మాన్‌పై భారీ యాక్షన్ సీన్స్‌ను చిత్రీకరిస్తున్నారు. ఈ క్రమంలో అనుకోకుండా సల్మాన్ భుజానికి గాయమైంది. ఇక ఈ సినిమాలో షారుక్ ఖాన్ గెస్ట్ రోల్లో కనిపించనున్నారు. చదవండి: ఒకే ఫ్రేమ్‌లో రజనీకాంత్, కపిల్ దేవ్.. నెట్టింట ఫోటో వైరల్ అంతేకాకుండా వీరిద్దరి మధ్య ఓ యాక్షన్ సీన్ కూడా ఉండనుందట. ఇటీవలె కిసీకా భాయ్ కిసీకి జాన్‌తో ప్రేక్షకులను పలకరించిన సల్మాన్‌కు ఆ సినిమా నిరాశనే మిగిల్చింది. దీంతో టైగర్-3 కోసం బాగానే కసరత్తులు చేస్తున్నాడు ఈ కండల వీరుడు. Wen u think u r carrying the weight of the world on your shoulders , he says duniya ko chodo paanch kilo ka dumbbell utha ke dikhao .Tiger Zakhmi Hai . #Tiger3 pic.twitter.com/nyNahitd24 — Salman Khan (@BeingSalmanKhan) May 18, 2023 -
#Rafael Nadal: తిరగబెట్టిన గాయం.. ఫ్రెంచ్ ఓపెన్‌కు దూరం
స్పెయిన్ బుల్.. టెన్నిస్ స్టార్ రఫేల్ నాదల్ గాయం కారణంగా ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌కు దూరమయ్యాడు. దీనికి తుంటి ఎముక గాయం తిరగబెట్టడమే కారణమని తెలిసింది. ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో తుంటి గాయంతో టోర్నీ మధ్యలోనే నాదల్ వైదొలిగాడు. అప్పటినుంచి గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. తాజాగా మరోసారి గాయం తిరగబెట్టడంతో గురువారం తాను ఫ్రెంచ్ ఓపెన్ ఆడడం లేదని నాదల్ స్వయంగా స్పష్టం చేశాడు. కాగా 2004 నుంచి వరుసగా ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ ఆడుతూ వస్తున్న నాదల్ తనకు అచ్చొచ్చిన గ్రాండ్‌స్లామ్‌కు దూరమవ్వడం ఇదే తొలిసారి. క్లేకోర్టు రారాజుగా అభివర్ణించిన నాదల్ ఇప్పటివరకు 22 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ కొల్లగొడితే.. అందులో 14 టైటిల్స్ ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లే కావడం విశేషం. అంతేకాదు ఫ్రెంచ్ ఓపెన్‌లో 115 మ్యాచ్‌లు ఆడిన నాదల్ 112 మ్యాచ్‌లు గెలిచి కేవలం మూడు మాత్రమే ఓడిపోయాడు. దీన్నిబట్టే ఫ్రెంచ్ ఓపెన్‌లో నాదల్ ఆధిపత్యం ఎలా ఉందనేది అర్థం చేసుకోవచ్చు. ఇక 2024 ఏడాదిలో నాదల్ టెన్నిస్ కెరీర్‌కు ముగింపు పలికే అవకాశాలు ఉన్నట్లు AFP ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పటివరకు 22 గ్రాండ్‌స్లామ్స్ కొల్లగొట్టిన నాదల్.. అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ విషయంలో జొకోవిచ్‌తో కలిసి సంయుక్తంగా తొలి స్థానంలో ఉన్నాడు. -
'కెరీర్‌ను తలకిందులు చేసింది.. మళ్లీ నడుస్తాననుకోలేదు'
ఇంగ్లండ్ స్టార్ వికెట్ కీపర్ జానీ బెయిర్ స్టో గతేడాది ఆగస్టులో ప్రమాదవశాత్తూ గాయపడిన సంగతి తెలిసిందే. గోల్ఫ్ ఆడే క్రమంలో స్టిక్ కాలికి బలంగా తగలడంతో బెయిర్ స్టోకు తీవ్ర గాయాలయ్యాయి. కాలికి సర్జరీ అనంతరం ఎనిమిది నెలల పాటు విశ్రాంతి తీసుకొని కోలుకున్నాడు. ఈ కారణంగానే ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌కు దూరమయ్యాడు. పంజాబ్ కింగ్స్ మినీ వేలంలో బెయిర్ స్టోను రూ. 6.75 కోట్లకు దక్కించుకుంది. తాజాగా గాయం నుంచి కోలుకున్న బెయిర్ స్టోను ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) వచ్చే నెలలో ఐర్లాండ్‌తో జరగనున్న ఏకైక టెస్టుకు ఎంపికచేసింది. నిజానికి బెయిర్ స్టో గాయపడే సమయానికి కెరీర్లో పీక్ ఫామ్‌లో ఉన్నాడు. తనను మళ్లీ జట్టులోకి ఎంపిక చేయడంపై బెయిర్ స్టో స్పందించాడు. ఏదో కాలక్షేపం కోసం ఆడిన గోల్ఫ్ తన కెరీర్‌ను తలకిందులు చేసిందని ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోకు ఇచ్చిన ఇంటర్య్వూలో తెలిపాడు. '' నిజానికి మళ్లీ నడుస్తాననుకోలేదు.. ఎందుకంటే కాలికి గోల్ఫ్ స్టిక్ బలంగా తగిలింది. ఇక జీవితంలో జాగ్ చేయడం, నడవడం, పరిగెత్తడం చేయలేకపోవచ్చనుకున్నా. ఈ దెబ్బతో క్రికెట్‌కు దూరమైనట్లేనని భావించా. గాయం నుంచి కోలుకునే సమయంలో నా మైండ్‌లో అన్ని ఇవే ఆలోచనలు. కానీ మన ఆలోచనలే సగం భయాన్ని కలిగిస్తాయి. ఎప్పుడైతే పాజిటివ్‌గా ఆలోచిస్తావో నీలోని ఆందోళన మొత్తం తొలిగిపోతుంది అని డాక్టర్లు నాకు మనోధైర్యాన్ని ఇచ్చారు. వారి సూచనలను సీరియస్‌గా తీసుకొని వర్కౌట్స్ చేశా. వంద శాతం ఫలితం వచ్చింది. కానీ ఇంతకముందులా మైదానంలో పరుగులు తీయగలనా.. ఫీల్డింగ్ చేయగలనా అనే సందేహం ఉండేది. కానీ ఫిట్నెస్ పరంగా తీసుకున్న జాగ్రత్త చర్యలు నాలోని భయాన్ని మొత్తం పోగొట్టాయి.'' అంటూ తెలిపాడు. చదవండి: #RileeRossouw: అచ్చొచ్చిన స్థానం.. మించినోడు లేడు -
తీవ్ర గాయం.. ప్రమాదంలో పాక్ క్రికెటర్ భవితవ్యం!
పాకిస్తాన్ ఆల్‌రౌండర్ మహ్మద్ నవాజ్ తీవ్రంగా గాయపడ్డాడు. బుధవారం న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డేలో ఇన్నింగ్స్ 21వ ఓవర్ మహ్మద్ నవాజ్ వేశాడు. ఓవర్ తొలి బంతిని డారిల్ మిచెల్ స్ట్రెయిట్ షాట్ ఆడాడు. బంతిని ఆపే ప్రయత్నంలో నవాజ్ చేతి వేలికి తగిలింది. బంతి వేగంగా రావడంతో అతని చూపుడు వేలు విరిగినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. నొప్పితో విలవిల్లాడిపోయిన నవాజ్ తట్టుకోలేకపోయాడు. వెంటనే ఫిజియో వచ్చి వేలిని పరిశీలించగా.. బోన్ బ్రేక్ అయినట్లు గుర్తించాడు. దీంతో నవాజ్‌ను సిబ్బంది ఆసుపత్రికి తరలించి ఎక్స్-రే తీయించారు. కాగా రిపోర్ట్ ఇంకా రావాల్సి ఉంది. గాయం తీవ్రత ఎంతనేది తెలియకపోయినప్పటికి వేలు విరిగితే మాత్రం అతని కెరీర్ ప్రమాదంలో పడినట్లే. సర్జరీ జరిగినప్పటికి చూపుడు వేలు గ్రిప్ కోల్పోయే అవకాశం ఉండడంతో భవిష్యత్తులో మహ్మద్ నవాజ్ బౌలింగ్ వేసే చాన్స్ తక్కువగానే ఉంటుంది. కేవలం బ్యాటింగ్‌కు మాత్రమే పరిమితం అయ్యే అవకాశం ఉంటుంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే పాకిస్తాన్ వరుసగా మూడో వన్డేలోనూ విజయం సాధించి మరో రెండు మ్యాచ్‌లు ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకుంది. పాకిస్తాన్‌కు 2011 తర్వాత న్యూజిలాండ్‌పై వన్డే సిరీస్ గెలవడం మళ్లీ ఇదే. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. ఇమామ్ ఉల్ హక్ 90, బాబర్ ఆజం 54 పరుగులతో రాణించారు. అనంతరం బ్యాటింగ్ చేసిన కివీస్ 49.1 ఓవర్లలో 261 పరుగులకు ఆలౌట్ కావడంతో పాక్ 26 పరుగులతో విజయాన్ని అందుకుంది. టామ్ బ్లండల్ 65, కొల్ మెక్నికొంచి 64, టామ్ లాథమ్ 45 పరుగులు చేశారు. పాక్ బౌలర్లలో షాహిన్ అఫ్రిది, నసీమ్ షా, మహ్మద్ వసీమ్‌లు తలా రెండు వికెట్లు తీశారు. Yaar ye kya hogya 😭 The main finger of M Nawaz has been broken yaar ☹️🥺💔 Plzz remember him in ur prayers to comeback as quick as possible 🙏🤲❤️#BabarAzam𓃵 #NaseemShah #PAKvNZ #muhammadNawaz @Awaisii6 pic.twitter.com/NPOors4m0i — 𝘽𝙖𝙗𝙖𝙧 ⁵⁶ × 𝘼𝙞𝙢𝙖𝙡 ¹¹ ⚡ (@Aymalkhan_112) May 3, 2023 చదవండి: ఐపీఎల్లో 16 సీజన్లు ఆడిన ఆటగాళ్లు ఎవరో తెలుసా? -
బిగ్‌షాక్.. ఐపీఎల్‌కు కేఎల్ రాహుల్ దూరం!
లక్నో సూపర్‌జెయింట్స్ జట్టుకు బిగ్‌షాక్ తగిలింది. గాయంతో లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ ఐపీఎల్ టోర్నీకి మొత్తానికి దూరం కానున్నట్లు సమాచారం. సోమవారం ఆర్సీబీతో మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ ఫీల్డింగ్ చేస్తూ తీవ్రంగా గాయపడ్డాడు. బౌండరీలైన్ వద్ద బంతిని ఆపేందుకు పరిగెడుతూ.. మైదానంలో కుప్పకూలాడు. దీంతో తొడ కండరానికి గాయం కావడంతో లేవడానికి ఇబ్బంది పడ్డాడు. ఫిజియోలు వచ్చి స్ట్రెచర్‌పై రాహుల్‌ను తీసుకెళ్లారు. అయితే లక్నో బ్యాటింగ్ సమయంలో ఆఖర్లో వచ్చిన రాహుల్ పరిగెత్తడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. పీటీఐ సమాచారం మేరకు.. ''కేఎల్ రాహుల్ ప్రస్తుతం లక్నో జట్టుతో ఉన్నప్పటికి సీఎస్కేతో మ్యాచ్‌కు దూరంగా ఉండనున్నాడు. సీఎస్కేతో మ్యాచ్ పూర్తవ్వగానే జట్టును వీడనున్న రాహుల్ ముంబైకి వెళ్లనున్నాడు. అక్కడ బీసీసీఐ ఆధ్వర్యంలో వైద్యులు స్కానింగ్ నిర్వహించనున్నారు. రిపోర్ట్స్ ద్వారా వచ్చే ఫలితంపై కేఎల్ రాహుల్ ఆడతాడా లేదా అనే విషయంపై స్పష్టత రానుంది. ''ఒకవేళ రాహుల్ గాయంలో తీవ్రత ఎక్కువగా ఉంటే ఐపీఎల్ టోర్నీ మొత్తానికే దూరం కానున్నాడు. ఐపీఎల్ తర్వాత జరగనున్న ప్రతిష్టాత్మక డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడేది కూడా అనుమానమే.కాగా ఆర్సీబీతో మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్‌లో గాయపడిన లక్నో బౌలర్ జయదేవ్ ఉనాద్కట్ ప్రస్తుతం ముంబైలో బీసీసీఐ పర్యవేక్షణలోనే ఉన్నాడు.'' అని పేర్కొంది. లక్నోకు ఎదురుదెబ్బే? ఈ సీజన్ ఆరంభంలో వరుస విజయాలతో దూసుకెళ్లిన లక్నో ప్రస్తుతం ఓటములతో సతమతమవుతోంది. ఈ సమయంలో కెప్టెన్ కేఎల్ రాహుల్‌తో పాటు ఉనాద్కట్ దూరమవ్వడం లక్నోకు ఎదురుదెబ్బే అని చెప్పొచ్చు. ప్రస్తుతం లక్నోకు స్టాండిన్ కెప్టెన్‌గా ఉన్న కృనాల్ పాండ్యా.. కేఎల్ రాహుల్ దూరమైతే మిగతా మ్యాచ్‌ల్లోనే అతనే జట్టును నడిపించనున్నాడు. రాహుల్ దూరమైతే డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశం ఎవరికి? ఇక జూన్ 7 నుంచి 11 వరకు జరగనున్న డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడేందుకు ఎంపిక చేసిన టీమిండియా జట్టులో రాహుల్ సభ్యుడిగా ఉన్నాడు. గాయంతో కేఎల్ రాహుల్ దూరమైతే అతని స్థానంలో ఎవరిని ఎంపిక చేయాలన్నది బీసీసీఐ ఆలోచిస్తుంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం రాహుల్ దూరమైతే.. సర్ఫరాజ్ ఖాన్, ఇషాన్ కిషన్, హనుమ విహారిలలో ఎవరో ఒకరిని ఎంపిక చేసే అవకాశం ఉందని అభిమానులు పేర్కొన్నారు. We didn't win on the night, but one man won hearts everywhere. 💙 KL, we love you. Get well soon, skip! 🫶 pic.twitter.com/1x896mj9dF — Lucknow Super Giants (@LucknowIPL) May 2, 2023 చదవండి: 'నా చివరి ఐపీఎల్ అని మీరే డిసైడ్ అయ్యారా?' -
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనలకు శ్రేయాస్ అయ్యర్ దూరం
-
షూటింగ్లో పేలుడు.. సంజయ్ దత్‌కి గాయాలు? అసలు నిజమిదే
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కన్నడ సినిమా ‘కేడీ’ షూటింగ్లో గాయపడ్డారంటూ బుధవారం సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్‌గా మారింది. ధృవ సర్జా హీరోగా జోగి ప్రేమ్ దర్శకత్వంలో ‘కేడీ: ది డెవిల్’ చిత్రం రూపొందుతోంది. బెంగళూరు సమీపంలోని మాగడి వద్ద వేసిన సెట్లో ఇటీవల ఫైట్ మాస్టర్ రవి వర్మ ఆధ్వర్యంలో బాంబు బ్లాస్ట్ సీన్స్ తీస్తుండగా సంజయ్ దత్‌కి గాయాలైనట్లు వార్త గుప్పుమంది. అయితే ఈ వార్త నిజం కాదని సంజయ్ దత్ సోషల్ మీడియా ద్వారా స్పష్టం చేశారు. ‘‘నాకు గాయాలైనట్లు వచ్చిన వార్త అవాస్తవం. నేను ప్రస్తుతం ‘కేడీ’ షూటింగ్లో పాల్గొంటున్నాను. యూనిట్ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు’’ అన్నారు సంజయ్ దత్. There are reports of me getting injured. I want to reassure everyone that they are completely baseless. By God’s grace, I am fine & healthy. I am shooting for the film KD & the team's been extra careful while filming my scenes. Thank you everyone for reaching out & your concern. — Sanjay Dutt (@duttsanjay) April 12, 2023 -
అదే జరిగితే పుండు మీద కారం చల్లినట్లే..!
ఐపీఎల్ 16వ సీజన్‌ను ఐదుసార్లు ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్ ఎప్పటిలాగే ఓటమితో ప్రారంభించింది. ఆర్సీబీతో జరిగిన తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. గాయాల కారణంగా బుమ్రా, జై రిచర్డ్సన్ లాంటి టాప్ బౌలర్లు ముంబై ఇండియన్స్‌కు దూరమవ్వడం జట్టు ఓటమిపై ప్రభావితం చేసింది. అయితే తాజాగా ఇంగ్లండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ కూడా మోచేతి గాయంతో బాధపడుతున్నాడని.. శనివారం రాత్రి సీఎస్కేతో మ్యాచ్‌కు అతను దూరమయ్యాడంటూ మాజీ క్రికెటర్ బద్రీనాథ్ తన యూట్యూబ్ చానెల్లో పేర్కొన్నాడు. సొంత స్టేడియంలో మ్యాచ్ ఆడబోతున్న ముంబై ఇండియన్స్‌కు ఇది షాకింగ్ లాంటి వార్త. మోచేతి గాయంతో బాధపడుతున్న ఆర్చర్ సీఎస్కేతో మ్యాచ్‌కు దూరమయినట్లు తెలుస్తోంది. ఇది సీఎస్కేకు సానుకూలాంశంగా మారనుంది. అయితే జోఫ్రా ఆర్చర్ గాయంపై ముంబై ఇండియన్స్ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం అందలేదు. ఒకవేళ ఆర్చర్ గాయం నిజమైతే మాత్రం ముంబై ఇండియన్స్‌కు ఇది పుండు మీద కారం చల్లినట్లే అవుతుంది. కాగా ఆర్చర్ ఆర్సీబీతో మ్యాచ్‌లో అంతగా ఆకట్టుకోలేకపోయాడు. 4 ఓవర్లు వేసి 33 పరుగులిచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. అయితే ఆర్చర్ ప్రస్తుతం ముంబైకి ప్రధాన బౌలర్‌గా ఉన్నాడు. అయితే జోఫ్రా ఆర్చర్ గాయంపై ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ కోచ్ కీరన్ పొలార్డ్ క్లారిటీ ఇచ్చాడు. జట్టులో ఉన్న ఆటగాళ్లంతా ఫిట్‌గా ఉన్నారని.. ఎవరు గాయపడలేదు. ఎవరైనా ఆటగాడు గాయపడినా ముంబై ఇండియన్స్ అధికారికరంగా ప్రకటించేవరకు వేచి చూడడం మంచిది అంటూ తెలిపాడు. ఇప్పటికే జస్ప్రీత్ బుమ్రా, జై రిచర్డ్‌సన్‌లు అందుబాటులో లేకపోవడంతో ముంబై ఇండియన్స్ బౌలింగ్ బలహీనంగా తయారైంది. -
బిగ్‌బాస్ ఫేం అఖిల్‌కు గాయం.. ఆసుపత్రిలో చేరిక
బిగ్‌బాస్ ఫేమ్ అఖిల్ సార్థ్క్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. రెండుసార్లు(బిగ్‌బాస్-4, బిగ్‌బాస్ ఓటీటీ)లలో రన్నరప్‌గా నిలిచి ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న అఖిల్ ప్రస్తుతం ఓ డ్యాన్స్ రియాలిటీ షోలో పర్ఫార్మెన్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. తేజస్వి మదివాడతో కలిసి జంటగా పాల్గొని డ్యాన్స్ దుమ్మురేపుతున్నాడు. ఈసారి ఎలాగైనా టైటిల్ కొట్టాలనే కసితో ఉన్న అఖిల్‌కు ఈసారి కూడా ఎదురుదెబ్బ తగిలింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అఖిల్ తాజాగా ఈ విషయాన్ని బయటపెట్టాడు. ఎప్పటినుంచో నాకు ఈ బాధ ఉంది. కానీ నేనే పెద్దగా పట్టించుకోలేదు. కానీ సాంగ్ పర్ఫెర్మెన్స్ చేస్తున్నప్పుడు కూడా నొప్పితోనే చేశాను. నా గాయాలు బయటకు కనపించనందున ఎవరికి నచ్చినట్లు వాళ్లు కామెంట్స్ చేస్తున్నారు. అందుకే ఈ విషయం గురించి చెప్పాలనుకుంటున్నా. నా కడుపు కింది భాగంలో తీవ్రవైన నొప్పితో బాధపడుతున్నాను. ఇప్పటికే ఆలస్యం చేయడంతో అది మరింత నన్ను బాధిస్తుంది. నేను, తేజు మా సాయశక్తులా కష్టపడ్డాం. కానీ ఏం చేయలేని పరిస్థితుల్లో నేను షో నుంచి బయటకు వచ్చేశాను. ఇంకా షాకింగ్ విశేషమేమిటంటే మేం బాటమ్2లో ఉన్నాం. అయినా ఏం పర్లేదు. మరో అద్భుతమైన షోతో మళ్లీ మిమ్మల్ని త్వరలోనే అలరిస్తాను అంటూ అఖిల్ ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. View this post on Instagram A post shared by 𝐀𝐊𝐇𝐈𝐋𝐒𝐀𝐑𝐓𝐇𝐀𝐊 (@akhilsarthak_official) -
గాయం... ఓ మంచి బహుమతి
గాయం తియ్యగా ఉంటుందా... మనసు తీసుకునేదాన్ని బట్టి ఉంటుంది. కొందరు కథానాయికలు కొన్ని గాయాలను అలానే తీసుకున్నారు. పవర్ఫుల్ రోల్స్ చేసేటప్పుడు అయిన గాయాలను ‘బహుమతి’గా, ‘తియ్యని గాయం’లా అనుకుంటున్నారు. ‘ఆగేదే లేదు’ అంటూ దూసుకెళుతున్నారు. ఆ నాయికల గురించి తెలుసుకుందాం. యాక్షన్‌కి దక్కిన బహుమతి ఒకవైపు మయోసైటిస్ వ్యాధితో పోరాటం చేసి, దాదాపు కోలుకున్న సమంత మరోవైపు ‘సిటాడెల్’ వెబ్ సిరీస్‌లో పో రాట సన్నివేశాల్లో నటిస్తున్నారు. ఈ సిరీస్‌లో పవర్ఫుల్ రోల్ చేస్తున్న సమంత హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ యానిక్ బెన్ దగ్గర శిక్షణ తీసుకున్నారు. ఆ తర్వాత షూట్లో పా ల్గొన్నారు. అయితే యాక్షన్ సీన్ తీస్తున్నప్పుడు ఆమె రెండు చేతులకు గాయాలయ్యాయి. మంగళవారం ఆ ఫోటోను షేర్ చేసి, ‘యాక్షన్‌కి దక్కిన బహుమతి ఇది’ అని పేర్కొన్నారు సమంత. ప్రియాంకా చోప్రా ఓ లీడ్ రోల్లో రూసో బ్రదర్స్ తెరకెక్కించిన హాలీవుడ్ వెబ్ సిరీస్ ‘సిటాడెల్’కి ఇండియన్ వెర్షన్‌గా వరుణ్ ధావన్, సమంత లీడ్ రోల్స్‌లో రాజ్ అండ్ డీకే ఈ సిరీస్‌ని తెరకెక్కిస్తున్నారు. నొప్పిని మరచి... గాయం చిన్నదైనా పెద్దదైనా నొప్పి మాత్రం కామన్. అయితే త్రిష మాత్రం గాయం తాలూకు నొప్పి తెలియలేదు అంటున్నారు. మణిరత్నం దర్శకత్వం వహించిన పొ న్నియిన్ సెల్వన్’ షూట్లో తగిలిన గాయాల గురించే త్రిష ఈ విధంగా అన్నారు. విక్రమ్, ‘జయం’ రవి, కార్తీ, ఐశ్వర్యా రాయ్, త్రిష తదితరులు ప్రధాన తారాగణంగా రెండు భాగాలుగా మణిరత్నం దర్శకత్వం వహించిన చిత్రం పొ న్నియిన్ సెల్వన్’. తొలి భాగం గత ఏడాది సెప్టెంబర్ 30న విడుదల కాగా మలి భాగం ఏప్రిల్ 28న రిలీజ్ కానుంది. ఇందులో యువరాణి కుందవై పా త్ర చేశారు త్రిష. పో రాట సన్నివేశాల్లో నటించినప్పుడు తన చేతులకు గాయాలయ్యాయని, శోభిత (పొ న్నియిన్...’లో ఓ కీలక పా త్రధారి) చెవులకు కూడా గాయం అయిందని త్రిష పేర్కొన్నారు. అయితే గాయాల తాలూకు నొప్పిని మరచిపో యి షాట్ గ్యాప్‌లో కబుర్లు చెప్పుకుని, ఆ తర్వాత షూటింగ్లో పా ల్గొనేవాళ్లమని త్రిష పేర్కొన్నారు. అలాగే పొ న్నియిన్ సెల్వన్’ తన జీవితంలో ఓ మంచి జ్ఞాపకం అని కూడా అన్నారామె. తియ్యని గాయం ‘క్రికెట్ చూడ్డానికి ఎగ్జయిటింగ్‌గా ఉంటుంది కానీ ఆడేటప్పుడు తెలుస్తుంది ఎంత కష్టమో’ అంటున్నారు జాన్వీ కపూర్. రాజ్‌కుమార్ రావ్, జాన్వీ కపూర్ క్రికెటర్లుగా కనిపించనున్న చిత్రం ‘మిస్టర్ అండ్ మిసెస్ మహీ’. ఈ సినిమాలోని పా త్ర కోసం టీమిండియా క్రికెటర్ దినేష్ కార్తీక్ వద్ద శిక్షణ తీసుకున్నారు జాన్వీ. ఇటీవల తన పా త్రకు సంబంధించిన షూట్‌ని పూర్తి చేశారీ బ్యూటీ. ఈ సందర్భంగా ఈ సినిమా తనకు ఎప్పటికీ మరచిపో లేని అనుభూతిని మిగిల్చిందని పేర్కొన్నారామె. ‘‘ఈ సినిమా కోసం కెమెరా ముందు క్రికెట్ ఆడినప్పుడు రెండు సార్లు నా భుజానికి గాయం అయింది. ఎముక పొషన్ మారింది. అయినప్పటికీ తియ్యని గాయం అనుకుంటున్నాను. ఒంటరిగా కూర్చుని నేను చేసిన సినిమాల గురించి ఆలోచించుకున్నప్పుడు కచ్చితంగా ‘మిస్టర్ అండ్ మిసెస్ మహీ’ ముందు గుర్తొస్తుంది. ఇది నాకు అపురూపమైన సినిమా’’ అన్నారు జాన్వీ. శరణ్ శర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. గాయంతోనే షూటింగ్ వివేక్ రంజన్ అగ్నిహోత్రి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ది వాక్సిన్ వార్’. ఈ చిత్రంలో కీలక పా త్ర చేస్తూ, ఓ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు పల్లవీ జోషి. ఆ మధ్య ఈ చిత్రం చివరి షెడ్యూల్ హైదరాబాద్ శివార్లలో వేసిన సెట్లో జరిగింది. ఓ సన్నివేశం చిత్రీకరిస్తుండగా వాహనం అదుపు తప్పడంతో పల్లవీ జోషికి స్వల్ప గాయాలయ్యాయి. అయినప్పటికీ ఆ సన్నివేశం పూర్తి చేశాకే ఆమె డాక్టర్ దగ్గరికి వెళ్లారు. ఈ నాయికలే కాదు.. ఆ మధ్య టబు, శిల్పా శెట్టి వంటి తారలు కూడా షూటింగ్స్‌లో గాయపడ్డారు. -
వెబ్ సిరీస్ షూటింగ్ లో సమంత చేతికి గాయాలు
-
వార్నర్ కూడా అవుట్
న్యూఢిల్లీ: భారత పర్యటనలో మైదానంలోనే కాకుండా మైదానం బయట కూడా ఆ్రస్టేలియా కష్టాలు కొనసాగుతున్నాయి. కాలి కండరాల గాయంతో ఇప్పటికే పేస్ బౌలర్ హాజల్‌వుడ్ సిరీస్ నుంచి తప్పుకొని స్వదేశానికి వెళ్లిపోగా... హాజల్‌వుడ్ సరసన తాజాగా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ కూడా చేరాడు. రెండో టెస్టులో గాయపడ్డ వార్నర్ ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లోని మిగతా రెండు టెస్టులకూ దూరమయ్యాడు. అతను స్వదేశానికి పయనమవుతాడని, అయితే వచ్చే నెలలో జరిగే మూడు వన్డేల సిరీస్‌కల్లా జట్టుకు అందుబాటులో ఉంటాడని క్రికెట్ ఆ్రస్టేలియా (సీఏ) వర్గాలు తెలిపాయి. ‘ఢిల్లీలో జరిగిన రెండో టెస్టులో వార్నర్ మోచేతికి ఫ్రాక్చర్ అయింది. వైద్య పరీక్షల అనంతరం గాయం తీవ్రత దృష్ట్యా పూర్తిగా కోలుకునేందుకు పునరావాస శిబిరానికి పంపాలని సీఏ నిర్ణయించింది. నాలుగు టెస్టుల సిరీస్ ముగిశాక జరిగే వన్డే సిరీస్ ఆడతాడని బోర్డు అంచనా వేస్తుంది’ అని సీఏ తెలిపింది. 36 ఏళ్ల ఓపెనర్ ఈ పర్యటనలో నిరాశ పరిచాడు. మైదానంలో గాయపడటంతో అతని స్థానంలో కన్కషన్ సబ్‌స్టిట్యూట్‌గా రెన్షా బరిలోకి దిగాడు. మూడో టెస్టు మార్చి 1 నుంచి ఇండోర్‌లో, నాలుగో టెస్టు 9 నుంచి అహ్మదాబాద్‌లో జరుగుతుంది. -
తీవ్ర గాయం.. స్ట్రెచర్‌పై వెస్టిండీస్ ప్లేయర్
వెస్టిండీస్ మహిళా సీనియర్ క్రికెటర్ స్టెఫానీ టేలర్ తీవ్రంగా గాయపడింది. మహిళల టి20 ప్రపంచకప్‌లో భాగంగా టీమిండియాతో మ్యాచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే.. టీమిండియా ఇన్నింగ్స్ సమయంలో 8వ ఓవర్ రమ్హాక్రాక్ వేసింది. ఓవర్ ఆఖరి బంతిని హర్మన్‌ప్రీత్ కౌర్ షార్ట్‌ఫైన్ దిశగా ఆడింది. షార్ట్ఫైన్లోనే ఫీల్డింగ్ చేస్తున్న స్టెఫానీ టేలర్ బంతిని త్రో వేద్దామని ప్రయత్నించింది. అయితే పట్టు తప్పి జారిపడడంతో కాలు బెణికినట్లయింది. దీంతో మైదానంలో కూలబడింది. టేలర్ పైకి లేవడానికి ఇబ్బంది పడడంతో వెంటనే మెడికల్ సిబ్బంది స్ట్రెచర్‌పై ఆమెను గ్రౌండ్ నుంచి బయటకు తీసుకెళ్లారు. ఈ సమయంలో ఆటకు కాసేపు విరామం ఇచ్చారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే మహిళల టి20 ప్రపంచకప్‌లో టీమిండియా మరో విజయం నమోదు చేసింది. బుధవారం గ్రూప్-బిలో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 119 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా మరో 11 బంతులు మిగిలి ఉండగానే టార్గెట్‌ను అందుకుంది. రిచా ఘోష్ 44 నాటౌట్, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (33) జట్టునువ విజయతీరాలకు చేర్చారు. ఈ విజయంతో భారత మహిళల జట్టు వరుసగా రెండో విజయం నమోదు చేయగా.. విండీస్‌కు ఇది రెండో పరాజయం. చదవండి: చరిత్ర సృష్టించిన దీప్తి శర్మ.. టీమిండియా తొలి బౌలర్‌గా -
Australian Open: బిగ్‌షాక్.. రఫేల్ నాదల్ ఓటమి
ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో డిఫెండింగ్ చాంపియన్.. స్పెయిన్ బుల్ రఫేల్ నాదల్(ప్రపంచ రెండో ర్యాంకర్) పోరు ముగిసింది. 23వ గ్రాండ్‌స్లామ్ అందుకోవాలన్న కల తీరకుండానే నాదల్ రెండో రౌండ్లో ఇంటిముఖం పట్టాడు. పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో భాగంగా బుధవారం నాదల్.. అమెరికాకు చెందిన అన్‌సీడెడ్ మెకంజీ మెక్‌డొనాల్డ్ చేతిలో 4-6,4-6,5-7 స్కోర్‌తో ఓటమి పాలయ్యాడు. నాదల్ నిష్రమణకు గాయం కూడా ఒక కారణం. ఎడమకాలికి గాయం అయినప్పటికి బై ఇవ్వడానికి ఇష్టపడని నాదల్ మ్యాచ్‌లో బరిలోకి దిగాడు. నొప్పితో సరిగా ఆడలేకపోవడంతో మెకంజీ తొలి రెండు సెట్లు ఈజీగా గెలిచేశాడు. మూడోసెట్ ఆడుతుండగా నాదల్ మరోసారి గాయంతో ఇబ్బంది పడ్డాడు. అప్పటికే మెకంజీ మూడో సెట్లో 7-5తో స్పష్టమైన ఆధిక్యంలో నిలవడంతో నాదల్ సర్వీస్ చేయకుండా పక్కకు తప్పుకున్నాడు. దీంతో మెకంజీ మెక్‌డొనాల్డ్ మూడోరౌండ్లో అడుగుపెట్టాడు. Mission accomplished for @mackiemacster 🇺🇸 The impressive American has beaten Nadal 6-4 6-4 7-5. @wwos • @espn • @eurosport • @wowowtennis • #AusOpen • #AO2023 pic.twitter.com/fkaTpk11te — #AusOpen (@AustralianOpen) January 18, 2023 Always a pleasure, @RafaelNadal 🫶#AusOpen • #AO2023 pic.twitter.com/CdnOMzYDK0 — #AusOpen (@AustralianOpen) January 18, 2023 చదవండి: మాజీ బాయ్‌ఫ్రెండ్ మొహం చూడకూడదని గోడ కట్టించింది -
IPL 2023: ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్! 17 కోట్ల ‘ఆల్‌రౌండర్’ దూరం?!
IPL 2023- Mumbai Indians- Cameron Green: ముంబై ఇండియన్స్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. ఐపీఎల్ మినీ వేలం-2023లో ఏకంగా 17 కోట్లు పెట్టి కొన్న ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ కొన్నాళ్లపాటు కేవలం బ్యాటర్‌గానే సేవలు అందించనున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 13 వరకు అతడు స్పెషలిస్టు బ్యాటర్‌గా మాత్రమే అందుబాటులో ఉంటాడని, ఆ తర్వాతే అతడు బౌలింగ్ చేస్తాడని సమాచారం. ఒకవేళ ఏదేని కారణాల చేత టీమిండియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్ ఆడకపోతే మాత్రం ఐపీఎల్లో తొలి మ్యాచ్ నుంచి బౌలింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు క్రికెట్ ఆస్ట్రేలియా చెప్పినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం పేర్కొంది. వర్క్‌లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. వేలికి గాయం! దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో భాగంగా గ్రీన్ కు గాయమైన సంగతి తెలిసిందే. మెల్బోర్న్ వేదికగా జరిగిన రెండో మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో అతడి చేతి వేలికి బంతి బలంగా తాకింది. రక్తం కూడా కారడంతో రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు. అయితే, ఆ తర్వాత మళ్లీ బ్యాటింగ్ చేశాడు. అనంతరం ఎక్స్‌రేకు వెళ్లగా వేలు విరిగినట్లు తేలింది. దీంతో అతడు ప్రొటిస్‌తో మూడో టెస్టుకు దూరమయ్యాడు. ఇక ఈ సిరీస్ తర్వాత ఆసీస్.. భారత పర్యటనకు రానుంది. ఇందులో భాగంగా ఫిబ్రవరిలో టెస్టు, వన్డే సిరీస్‌లు ఆడనుంది. గాయం ఇబ్బంది పెడితే.. ఈ నేపథ్యంలో వర్క్‌లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా గ్రీన్ గనుక టెస్టు సిరీస్ ఆడితే.. నాలుగు వారాల పాటు అతడు బౌలింగ్‌కు దూరంగా ఉంటాడని సీఏ గతంలో పేర్కొంది. అయితే, ఇప్పుడు గాయం కారణంగా అతడు జట్టుకు దూరమయ్యాడు. భారత పర్యటన నాటికి కోలుకుంటే టీమిండియాతో సిరీస్‌లో ఆడతాడు.. గాయం ఇబ్బంది పెడితే ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లకూ దూరమయ్యే అవకాశం లేకపోలేదు. కాగా వేలంలో ముంబై గ్రీన్ కోసం 17.5 కోట్లు ఖర్చు చేయగా అత్యధిక ధర పలికిన ఆటగాళ్ల జాబితాలో అతడు రెండో స్థానంలో నిలిచాడు. చదవండి: Ind Vs SL: రుతురాజ్, ఉమ్రాన్‌కు నో ఛాన్స్.. గిల్ అరంగేట్రం! IND vs SL: శ్రీలంకతో వన్డే సిరీస్.. జట్టులోకి బుమ్రా.. బీసీసీఐ ప్రకటన -
చేతి వేలికి ఫ్రాక్చర్ కాలేదు.. ఎముక పక్కకు జరిగింది: రోహిత్ శర్మ
బుధవారం ఢాకా వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో 5 పరుగుల తేడాతో భారత్ పరజాయం పాలైంది. భారత కెప్టెన్ రోహిత్ శర్మ అఖరి వరకు పోరాడనప్పటికీ జట్టును గెలిపించకలేకపోయాడు. కాగా బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌లో రోహిత్ ఫీల్డింగ్ చేస్తుండగా కుడి చేతి బొటనవేలికి గాయమైంది. వెంటనే ఫీల్డ్‌ను విడిచి వెళ్లిన రోహిత్ చికిత్స చేయించుకుని తిరిగి బ్యాటింగ్‌లో 9వ స్థానంలో వచ్చాడు. అఖరిలో బ్యాటింగ్‌కు వచ్చిన హిట్‌మ్యన్ ఒక వైపు నొప్పిని భరిస్తునే.. బంగ్లా ఆటగాళ్లకు చెమటలు పట్టించాడు. చివరి ఓవర్లో 20 రన్స్ అవసరం కాగా.. ముస్తఫిజుర్ వేసిన ఓవర్లో రెండు ఫోర్లు, ఒక సిక్స్ కొట్టాడు. ఈ క్రమంలో అఖరి బంతికి 6 పరుగులు కావల్సిన నేపథ్యంలో.. రోహిత్ ఒక్క పరుగు కూడా సాధించ లేకపోయాడు. దీంతో రోహిత్ విరోచిత పోరాటం వృధా అయిపోయింది. ఈ మ్యాచ్‌లో 28 బంతులు ఎదుర్కొన్న రోహిత్.. 5 సిక్స్‌లు, 3 ఫోర్లతో 51 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. కాగా గాయపడిన రోహిత్ ఈ సిరీస్‌లో అఖరి వన్డేకు దూరమయ్యాడు. టెస్టులకు కూడా అతడి అందుబాటుపై సందిగ్ధం నెలకొంది. ఇక మ్యాచ్ అనంతరం తన గాయం గురించి రోహిత్ శర్మ అప్డేట్ ఇచ్చాడు. తన వేలికి ఫ్రాక్చర్ అయితే కాలేదని, ఎముక కాస్త జరిగినట్లు రోహిత్ తెలిపాడు." నిజం చెప్పాలంటే చాలా నొప్పితోనే ఈ మ్యాచ్ బ్యాటింగ్ చేశాను. నా బొటనవేలు సరిగ్గా లేదు. వేలి ఎముక కాస్త పక్కకు జరిగింది. కొన్ని కుట్లు పడ్డాయి. అయితే దేవుడు దయవల్ల ఫ్రాక్చర్ మాత్రం కాలేదు. అందుకే నేను బ్యాటింగ్ వచ్చాను. ప్రతీ మ్యాచ్‌లోనూ పాజిటివ్, నెగెటివ్‌లు ఉంటాయి. కానీ 70 పరుగులకు 6 వికెట్లు కోల్పోయి ఉన్న బంగ్లాను 270 పరుగుల వరకు రానివ్వడం కచ్చితంగా బౌలర్ల విఫలమే అని" రోహిత్ పేర్కొన్నాడు. చదవండి: IND vs BAN: రోహిత్ భయ్యా నీ ఇన్నింగ్స్‌కు హ్యాట్సప్.. ఓడిపోయినా పర్వాలేదు -
రోహిత్ భయ్యా నీ ఇన్నింగ్స్‌కు హ్యాట్సాఫ్.. ఓడిపోయినా పర్వాలేదు
బంగ్లాదేశ్‌తో జరగిన రెండో వన్డే భారత్ ఓటమి పాలైనప్పటికీ... కెప్టెన్ రోహిత్ శర్మ విరోచిత పోరాటానికి మాత్రం అభిమానులు పిధా అయిపోయారు. ఒక వైపు బొటన వేలి గాయంతో భాదపడతునే అఖరి బంతి వరకు రోహిత్ అద్భుతమైన పోరాట పటిమ కనబరిచాడు. హిట్‌మ్యాన్ తన సునామీ ఇన్నింగ్స్‌తో బంగ్లా జట్టుకు చెమటలు పట్టించాడు. అఖరి బంతికి భారత విజయం సాధించాలంటే ఒక సిక్సర్ అవసరమైంది. ఈ క్రమంలో బంగ్లా బౌలర్ ముస్తఫిజుర్ రెహ్మన్ ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. దీంతో 5 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో 28 బంతులు ఎదుర్కొన్న రోహిత్.. 5 సిక్స్‌లు, 3 ఫోర్లతో 51 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. తద్వారా సిరీస్‌ను కూడా మరో మ్యాచ్ మిగిలూండగానే 2-0తో బంగ్లా సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇక మ్యాచ్ అనంతరం పెవిలియన్‌కు నడుస్తున్న రోహిత్‌ను ప్రత్యర్థి జట్టు అభిమానులు సైతం చప్పట్లతో అభినందించారు. అదే విధంగా విరోచిత ఇన్నింగ్స్ ఆడిన రోహిత్ శర్మపై అభిమానులు సోషల్ మీడియా వేదికగా కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. "రోహిత్ భయ్యా నీ ఇన్నింగ్స్‌కు హ్యాట్సప్.. ఓడిపోయినా మాకు ఏ బాధ లేదంటూ" నెటిజన్లు ట్విటర్లో పోస్టులు చేస్తున్నారు. What a fight with injured thumb🙏🏽🙏🏽🙏🏽🙏🏽 #RohitSharma#Respect pic.twitter.com/pQpYTMVgNS — vennela kishore (@vennelakishore) December 7, 2022 🙌 𝐎 𝐜𝐚𝐩𝐭𝐚𝐢𝐧, 𝐦𝐲 𝐜𝐚𝐩𝐭𝐚𝐢𝐧! 💙 We are proud to have such an inspiring leader! 👏 Chin up, Skip. You did your best! 📷 Getty • #RohitSharma #INDvBAN #BANvIND #TeamIndia #BharatArmy pic.twitter.com/OvEonl3rAG — The Bharat Army (@thebharatarmy) December 7, 2022 చదవండి: Ind VS BAN: వారెవ్వా! రోహిత్ అరుదైన రికార్డ్.. ప్రపంచ క్రికెట్లో రెండో ఆటగాడిగా.. -
టీమిండియాకు బిగ్ షాక్.. రోహిత్ శర్మకు గాయం! ఆసుపత్రికి తరలింపు..
బంగ్లాదేశ్‌తో రెండో వన్డే సందర్భంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడ్డాడు. బంగ్లా ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేసిన మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో నాలుగో బంతిని అనముల్ హక్ డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో బంతి ఎడ్జ్ తీసుకుని సెకెండ్ స్లిప్ దిశగా వెళ్లింది. స్లిప్‌లో క్యాచ్ పట్టే క్రమంలో రోహిత్ శర్మ చేతి వేలికి గాయమైంది. దీంతో రోహిత్ నొప్పితో వెంటనే ఫీల్డ్‌ను వదిలి వెళ్లాడు. అతడి స్థానంలో రజిత్ పటిదార్ సబ్‌స్ట్యూట్ ఫీల్డర్‌గా మైదానంలోకి వచ్చాడు. అయితే గాయపడిన రోహిత్‌ను వెంటనే స్కానింగ్ కోసం ఆసుపత్రికి తరిలించినట్లు బీసీసీఐ ట్వీట్ చేసింది. రెండో వన్డే ఫీల్డింగ్ సందర్భంగా భారత కెప్టెన్ రోహిత్ శర్మ బొటన వేలికి గాయమైంది. Update: India Captain Rohit Sharma suffered a blow to his thumb while fielding in the 2nd ODI. The BCCI Medical Team assessed him. He has now gone for scans. pic.twitter.com/LHysrbDiKw — BCCI (@BCCI) December 7, 2022 బీసీసీఐ వైద్య బృందం అతడిని స్కానింగ్ కోసం పంపించింది అంటూ బీసీసీఐ ట్విటర్లో పేర్కొంది. ఇక ఈ మ్యాచ్‌లో రోహిత్ బ్యాటింగ్‌కు వచ్చేది అనుమానంగా మారింది. కాగా రెండో వన్డేలో భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నారు. కీలక మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్ సమం చేయాలని రోహిత సేన భావిస్తోంది. pic.twitter.com/SoOLqQYLn1#RohitSharma — Shivam Rajvanshi (@social_timepass) December 7, 2022 చదవండి: Rohit Sharma: ఒక్క మ్యాచ్‌కే తప్పించారా? కుల్దీప్ను పక్కనపెట్టడానికి కారణమిదే! -
ఓటమి బాధలో ఉన్న పాకిస్తాన్‌కు భారీ షాక్!
ఇంగ్లండ్‌తో తొలి టెస్టు ఓటమి బాధలో ఉన్న పాకిస్తాన్‌కు బిగ్ షాక్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ హరీస్ రౌఫ్ గాయం కారణంగా సిరీస్‌లో మిగిలిన రెండు టెస్టులకు దూరమయ్యాడు. ఇంగ్లండ్‌తో తొలి టెస్టు సందర్భంగా రౌఫ్ రెడ్‌బాల్ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ఈ చారిత్రాత్మక టెస్టులో మొదటి రోజు ఫీల్డింగ్ చేస్తుండగా రౌఫ్ కుడి కాలికి గాయమైంది.అనంతరం అతడిని ఆసుపత్రికి తరిలించి స్కాన్ చేయించగా గాయం తీవ్రమైనదిగా తేలింది. దీంతో అతడికి దాదాపు నెల రోజుల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు సమచారం. ఈ క్రమంలోనే హరీస్ మిగిలిన రెండు టెస్టులకు దూరమయ్యాడు. ఇక గాయపడిన రౌఫ్ స్థానంలో ఫహీమ్ అష్రఫ్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే స్టార్ పేసర్ షాహీన్ షా అఫ్రిది గాయం కారణంగా దూరం కాగా.. ఇప్పుడు రౌఫ్ దూరం కావడం పాక్‌ను కలవరపెడుతోంది. ఇక ఇది ఇలా 17 ఏళ్ల తర్వాత సొంత గడ్డపై ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో పాకిస్తాన్ ఓటమి చవిచూసింది. ఈ చారిత్రాత్మక టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్ 74 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక ఇరు జట్ల మధ్య రెండో టెస్టు ముల్తాన్ వేదికగా డిసెంబర్ 9 నుంచి జరగనుంది. చదవండి: World Test Championship: పాకిస్తాన్‌కు ఊహించని షాక్.. ఫైనల్ అవకాశాలు సంక్లిష్టం! మరి టీమిండియా పరిస్థితి? -
నడవలేని స్థితిలో బుట్టబొమ్మ.. ఫోటో వైరల్..!
అందాల భామ, బుట్టబొమ్మ పూజా హెగ్డే ఇటీవల ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఆమెకు కాలుకు బలమైన గాయం కావడంతో ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆమె ఎడమకాలి పాదం గాయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. తాజాగా ఆమె వాకర్ పట్టుకుని నడక ప్రాక్టీస్ చేస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరలవుతోంది. సల్మాన్ ఖాన్‌తో నటిస్తున్న 'కిసీ కా భాయ్ కిసీ కి జాన్' సినిమా షూటింగ్ సమయంలో నటి పూజా హెగ్డేకు గాయమైంది. ఆమె చివరిసారిగా విజయ్ నటించిన 'బీస్ట్' చిత్రంలో కనిపించింది. (చదవండి: పూజా హెగ్డే ఐరన్ లెగ్ సెంటిమెంట్!) ఆ ఫోటోలో పూజా హెగ్డే.. నర్సు సాయంతో వాకర్ పట్టుకుని నడక ప్రాక్టీస్ చేస్తూ కనిపించింది. వాకర్ పట్టుకుని స్టెప్స్ వేస్తున్న ఓ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇన్‌స్టాలో హ్యాండిల్లో రాస్తూ..' నేను నా జీవితంలో రెండవ సారి నడక నేర్చుకుంటున్నాను. దీన్ని తలుచుకుంటేచాలా ఫన్నీగా ఉంది.' అంటూ రాసుకొచ్చింది బుట్టబొమ్మ. పూజా హెగ్డే తదుపరి చిత్రం మహేష్ బాబుతో జతకట్టనుంది. త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ డిసెంబర్ మొదటి వారంలో ప్రారంభం కానుంది. ఆమె రణ్వీర్ సింగ్ నేతృత్వంలోని హిందీ మూవీ 'సర్కస్'లోనూ కనిపించనుంది. -
ఆస్పత్రిలో షాహీన్ ఆఫ్రిది.. ఫోటో షేర్ చేసిన స్పీడ్ స్టర్!
ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్లో పాకిస్తాన్ స్పీడ్‌స్టార్ షాహీన్ షా అఫ్రిది మెకాలి గాయం కారణంగా మ్యాచ్ మధ్యలోనే ఫీల్డ్‌ను వీడిన సంగతి తెలిసిందే. అయితే అతడు కేవలం మెకాలి గాయంతోనే కాకుండా అపెండిక్స్తో కూడా బాధపడుతున్నాడు. తాజాగా అఫ్రిది తన గాయం గురించి అప్డేట్ ఇచ్చాడు. అపెండెక్టమీ సర్జరీ చేయించుకున్నట్లు ట్విటర్ వేదికగా షాహీన్ వెల్లడించాడు. "ఈరోజు అపెండెక్టమీ చేయించుకున్నాను. అల్లా దయవల్ల బాగానే ఉన్నాను. మీరు నాపై చూపిస్తున్న ప్రేమకు దన్యవాదాలు" అంటూ షాహీన్ ట్వీట్ చేశాడు. ఈ క్రమంలో అతడి అభిమానులు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నారు. కాగా గాయం తీవ్రత దృష్ట్యా అతడు సుమారు ఆర్నెళ్ల పాటు జట్టు నుంచి దూరంగా ఉండనున్నట్లు సమాచారం. ఈ క్రమంలో వచ్చె నెలలో స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగే టెస్టు సిరీస్‌కు ఆఫ్రిది దూరమయ్యే అవకాశం ఉంది. Had an appendectomy today but Alhumdulillah feeling better. Remember me in your prayers. 🤲 pic.twitter.com/M70HWwl9Cn — Shaheen Shah Afridi (@iShaheenAfridi) November 20, 2022 చదవండి: IND vs NZ: సూర్యకుమార్‌పై కోహ్లి ప్రశంసలు.. వీడియో గేమ్ ఇన్నింగ్స్ అంటూ! -
తన ఆరోగ్యంపై కీలక అప్డేట్ ఇచ్చిన విజయ్ దేవరకొండ
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తన ఆరోగ్యంపై కీలక అప్డేట్ ఇచ్చాడు. ఎట్టకేలకు 8నెలల తర్వాత గాయం నుంచి కోలుకున్నట్లు తెలిపాడు. విజయ్‌కు కొన్నినెలల కొందట భుజానికి గాయం అయ్యింది. ఆ నొప్పితోనే లైగర్ షూటింగ్‌తో పాటు ప్రమోషన్స్‌లో పాల్గొన్నాడు. అయితే చికిత్స అనంతరం ఇప్పుడు పూర్తిగా ఈ సమస్య నుంచి బయటపడినట్లు విజయ్ పేర్కొన్నాడు. ఈ మేరకు ఓ ఫోటోను షేర్ చేస్తూ.. ‘బీస్ట్ బయటకు రావడానికి ఉబలాటపడుతోంది. అది ఇంతకాలం పంజరంలో ఉండిపోయింది’ అంటూ ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చాడు. సినిమాల్లోకి రాకముందే విజయ్‌కు షోల్డర్ ఇంజ్యురీ అయ్యిందట. లైగర్ షూటింగ్ సమయంలో ఆ గాయం మళ్లీ తిరిగబెట్టిందని సమాచారం. ఇదిలా ఉండగా ప్రస్తుతం విజయ్ శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో సమంత హీరోయిన్గా నటిస్తుంది. ఇప్పటికే కొంతవరకు షూటింగ్ కంప్లీట్ అయ్యింది. కానీ సమంత అనారోగ్యం కారణంగా కొద్ది రోజులు షూటింగ్‌కు బ్రేక్‌పడింది. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. -
లంకకు దెబ్బ మీద దెబ్బ.. మరో కీలక ఆటగాడు దూరం
టి20 ప్రపంచకప్‌లో శ్రీలంక జట్టును గాయాలు వీడడం లేదు. ఇప్పటికే ముగ్గురు టాప్ ఆటగాళ్లు గాయాలతో జట్టును వీడగా.. తాజాగా లంక స్టార్ పేసర్ బినురా ఫెర్నాండో ఈ జాబితాలో చేరాడు. తొడ కండరాల గాయంతో టి20 ప్రపంచకప్ నుంచి వైదొలిగాడు. అతని స్థానంలో 27 ఏళ్ల ఆసిత ఫెర్నాండోను ఎంపిక చేసినట్లు లంక క్రికెట్ బోర్డు వెల్లడించింది. ఐర్లాండ్‌తో తొలి మ్యాచ్‌లో గెలిచిన లంకకు ఆ తర్వాత ఆస్ట్రేలియా చేతిలో పరాజయమే ఎదురైంది. కాగా ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో బౌలింగ్ చేసిన బినురా ఫెర్నాండో తన తొలి ఓవర్లోనే గాయపడ్డాడు. ఓవర్ ఐదో బంతి వేస్తుండగా తొడ కండరాల పట్టేయడంతో మ్యాచ్‌ను నుంచి పక్కకు తప్పుకున్నాడు. అప్పటినుంచి గాయం నుంచి కోలుకోని ఫెర్నాండో తాజాగా టి20 ప్రపంచకప్ నుంచి మొత్తానికే దూరమైనట్లు బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే దనుష్క గుణతిలక, దుష్మంత చమీరా, దిల్షాన్ మధుషనకలు గాయాలతో జట్టును వీడారు. గ్రూఫ్-1లో ఉన్న శ్రీలంక ఒక గెలుపు, ఓటమితో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతున్నది. లంక తన తర్వతి మ్యాచ్ శనివారం సిడ్నీ వేదికగా పటిష్టమైన కివీస్‌తో ఆడనుంది. శ్రీలంక జట్టు: దాసున్ షనక (కెప్టెన్), పాతుమ్ నిస్సాంక, కుశాల్ మెండిస్, చరిత్ అసలంక, భానుక రాజపక్సే, ధనంజయ డి సిల్వా, వనిందు హసరంగా, మహేశ్ తీక్షణ, జెఫ్రీ వాండర్సే, చమిక కరుణరత్నే, కసున్ రజిత, అషెన్ బండార, లహిరు కుమారా, ప్రమోద్ మధుషన్, అసిత ఫెర్నాండో. స్టాండ్‌బై ప్లేయర్స్: ప్రవీణ్ జయవిక్రమ, దినేష్ చండిమల్, నువానీడు ఫెర్నాండో. చదవండి: లైవ్ మ్యాచ్‌లో లవ్ ప్రపోజ్.. మరో దీపక్ చహర్ మాత్రం కాదు -
హార్దిక్ పాండ్యాకు ఏమైంది.. పాక్‌తో మ్యాచ్‌కు డౌటేనా!
టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా మోకాలి గాయంతో బాధపడుతున్నాడా. మెల్బోర్న్ వేదికగా ఇవాళ(ఆదివారం) చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో ఆడేది అనుమానమేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పాక్‌తో పోరుకు ముందు మెల్బోర్న్ గ్రౌండ్లో టీమిండియా ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్న ఫోటో ఒకటి బయటికొచ్చింది. ఆ ఫోటోలో ఆటగాళ్లంతా ప్రాక్టీస్‌లో తలమునకలయ్యుంటే పాండ్యా మాత్రం ఏదో ఆలోచిస్తున్నట్లు నిలబడిపోయాడు. ఆ సమయంలో అతని కుడి మోకాలికి పట్టి కనిపించింది. దీంతో పాండ్యాకు గాయమైందని.. పాక్‌తో మ్యాచ్‌లో ఆడేది అనుమానమేనా అంటూ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారు. అయితే పాండ్యా గాయంపై ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఇదంతా పుకార్లే అని కొట్టిపారేశారు. ''అతను ఎలాంటి గాయంతో ఇబ్బంది పడడం లేదని.. మాములుగా మోకాలిపై ఒత్తిడి పడకుండా క్రికెటర్లు పట్టి వేసుకుంటారు. ఆ పట్టీని చూసి గాయమైందనుకుంటే ఎలా'' అంటూ కొందరు అభిమానులు పేర్కొన్నారు. మరోవైపు రోహిత్ శర్మ కూడా శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ''పాకిస్తాన్‌తో ఆడే తుది జట్టును ఆల్రెడీ నిర్ణయించాం. అందులో ఎలాంటి మార్పు ఉండదు. ప్రపంచకప్ కొట్టి తొమ్మిదేళ్లు కావొస్తుంది. అయినా ప్రతీ మ్యాచ్‌కు జట్టును మార్చే అవకాశాలు ఉన్నాయి. వీటన్నింటికి ఆటగాళ్లు సిద్ధమై ఉండాలి. ఏదైనా మార్పు ఉంటే ముందే చెప్తాం.. చివరి నిమిషంలో ఆటగాళ్లను ఎంపికచేయడం నాకు నచ్చదు. ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్‌కున్న ప్రాధాన్యం ఏంటనేది అందరికి తెలుసు.. పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు'' అంటూ పేర్కొన్నాడు. Hardik Pandya has his right knee strapped. Could be a knee cap, as well. But he is limping a bit. @Sportskeeda #INDvPAK #T20WorldCup pic.twitter.com/72KKE9xSyO — Srinjoy Sanyal (@srinjoysanyal07) October 22, 2022 చదవండి: దాయాదుల సమరం.. అమ్మ, ఆవకాయలాగే ఎప్పుడు బోర్ కొట్టదు var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4911494512.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
శ్రీలంకకు భారీ షాక్.. యువ బౌలర్ దూరం
టీ20 ప్రపంచకప్-2022లో శ్రీలంకకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు యువ పేసర్ దిల్షాన్ మధుశంక గాయం కారణంగా ఈ మెగా ఈవెంట్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ మెగా టోర్నీ ఆరంభానికి ముందు ట్రైనింగ్‌లో సెషన్లో మధుశంక మెకాలికి గాయమైంది. దీంతో అతడిని ఎమ్మరై స్కాన్‌కు తరలించగా.. గాయం తీవ్రమైనదిగా తేలింది. ఈ క్రమంలోనే టోర్నీ మొత్తానికి మధుశంక దూరమయ్యాడు. అదే విధంగా త్వరలోనే అతడి స్థానాన్ని శ్రీలంక క్రికెట్ భర్తీ చేసే అవకాశం ఉంది. అయితే రిజర్వ్ జాబితా ఉన్న బినూర ఫెర్నాండో ప్రధాన జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఇక ఈ మెగా ఈవెంట్ తొలి మ్యాచ్‌లో గీలాంగ్ వేదికగా నమీబియాతో శ్రీలంక తలపడుతోంది. చదవండి: Women's Asia Cup 2022: శ్రీలంకపై అద్భుత విజయం.. అమ్మాయిల సెలబ్రేషన్స్ మామాలుగా లేవుగా -
బంగ్లాను వెంటాడుతున్న గాయాలు.. ఇద్దరు కీలక ఆటగాళ్లు దూరం
ఆసియాకప్ 2022 ప్రారంభానికి ముందే బంగ్లాదేశ్‌ను గాయాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే బంగ్లా స్టార్ బ్యాట్స్‌మన్ లిట్టన్ దాస్ కండరాల గాయంతో నెలరోజుల కిందటే జట్టుకు దూరమయ్యాడు. తాజాగా బంగ్లా జట్టుకు మరో షాక్ తగిలింది. జట్టులో కీలక ఆటగాళ్లుగా ఉన్న హసన్ మహ్ముద్, వికెట్ కీపర్ నురుల్ హసన్‌లు గాయాలతో దూరమయ్యారు. గతవారం ట్రెయినింగ్ సెషన్లో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో హసన్ చీలమండకు గాయమైంది. ఎక్స్‌రే తీయగా గాయం తీవ్రత పెద్దదని తేలడంతో నెలరోజుల విశ్రాంతి అవసరమైంది. ఇక మరో ఆటగాడు నురుల్ హసన్ ఇటీవలే చేతి వేలికి గాయం అవడంతో సర్జరీ జరిగింది. అతను కోలుకోవడానికి రెండు వారాలు పట్టే అవకాశం ఉంది. దీంతో ఈ ఇద్దరు ఆసియాకప్ టోర్నీకి దూరమవ్వాల్సి వచ్చింది.ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ షకీబుల్ హసన్ ఆసియా కప్‌లో జట్టును నడిపించనున్న సంగతి తెలిసిందే. షకీబ్ నేతృతంలోని 17 మందితో కూడిన బంగ్లాదేశ్ జట్టు మంగళవారం యూఏఈలో అడుగుపెట్టింది. రానున్న టి20 ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకొని షకీబ్‌కు జట్టు పగ్గాలు అప్పగించినట్లు బీసీబీ(బంగ్లా క్రికెట్ బోర్డు) ప్రకటించింది. చదవండి: Asia Cup 2022: తాత్కాలిక హెడ్‌కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్! Sikandar Raza: పాక్ మూలాలున్న బ్యాటర్.. అయినా సరే మనసు దోచుకున్నాడు -
'యూఎస్ ఓపెన్‌కు దూరం'.. రిటైర్మెంట్ ప్లాన్‌లో మార్పులు
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా గాయం కారణంగా యూఎస్ ఓపెన్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. వాస్తవానికి ఈ ఏడాది యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ అనంతరం సానియా తన ప్రొఫెషనల్ ఆటకు గుడ్‌బై చెప్పాలనుకుంది. అయితే తాజాగా గాయంతో యూఎస్ ఓపెన్‌కు దూరం కావడంతో సానియా రిటైర్మెంట్లో పలు మార్పులు ఉండనున్నాయి. ఈ సందర్భంగా సానియా తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందించింది. 'హాయ్ గయ్స్. ఒక క్విక్ అప్డేట్. నా దగ్గర అంత గొప్ప వార్త ఏమీ లేదు. రెండు వారాల క్రితం కెనడాలో ఆడుతున్నప్పుడు మోచేతికి గాయమయింది. నిన్న స్కానింగ్ చేయించుకునేంత వరకు ఆ గాయం ఎంత తీవ్రమైనదో నాకు అర్థం కాలేదు. మోచేతి దగ్గర లిగ్మెంట్ కాస్త దెబ్బతింది. ఈ కారణంగా కొన్ని వారాల పాటు ఆటకు దూరంగా ఉండబోతున్నాను. యూఎస్ ఓపెన్ నుంచి వైదొలగుతున్నా. ఈ పరిణామాల నేపథ్యంలో నా రిటైర్మెంట్ ప్లాన్స్ లో కొన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూనే ఉంటా' అని ఆమె పేర్కొంది. మహిళల డబుల్స్‌లో మాజీ నెంబర్ వన్ అయిన సానియా మీర్జా డబుల్స్ విభాగంలో ఆస్ట్రేలియన్ ఓపెన్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్లు ఒక్కోసారి నెగ్గింది. అలాగే మిక్స్డ్ డబుల్స్ విభాగంలో ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, యూఎస్ ఓపెన్లను కూడా గెలిచింది. ఇక 2016 రియో ఒలింపిక్స్‌లో మిక్స్డ్ డబుల్స్‌లో సెమీఫైనల్లో ఓడిన సానియా జంట తృటిలో పతకం చేజార్చుకుంది. చదవండి: BWF Championship 2022: అదరగొట్టిన సైనా నెహ్వాల్.. నేరుగా మూడో రౌండ్‌కు Victor Amalraj: పుస్తక రూపంలో భారత దిగ్గజ ఫుట్‌బాలర్ బయోగ్రఫీ.. -
ఆరు నెలల తర్వాత రీ ఎంట్రీ.. బ్యాటర్లకు చుక్కలు చూపించిన చాహర్!
ఆరు నెలల తర్వాత జట్టులోకి వచ్చిన భారత పేసర్ దీపక్ చాహర్ అదరగొట్టాడు. హరారే వేదికగా జింబాబ్వే జరుగుతోన్న తొలి వన్డేలో చాహర్ నిప్పులు చేరిగాడు. ఈ మ్యాచ్‌లో 7 ఓవర్లు బౌలింగ్ చేసిన చహర్ మూడు కీలక వికెట్లు పడగొట్టి 27 పరుగులు ఇచ్చాడు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వేను ఆదిలోనే ఓపెనర్లు కియా, మారుమణి పెవిలియన్‌కు పంపి చాహర్ కోలుకోలేని దెబ్బకొట్టాడు. అనంతరం వన్‌డౌన్ బ్యాటర్ మాధేవేరేను కూడా ఔట్ చేసి చాహర్ మూడో వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా చాహర్ ఈ ఏడాది ఫిబ్రవరిలో గాయపడ్డాడు. దీంతో అతడు ఐపీఎల్‌తో పాటు పలు సిరీస్‌లకు కూడా దూరమయ్యాడు. అనంతరం గాయం నుంచి కోలుకున్న చాహర్ జింబాబ్వే సిరీస్‌తో పునరాగామనం చేశాడు. అదే విధంగా ఆసియా కప్-2022కు స్టాండ్‌బైగా చహర్ ఎంపికయ్యాడు. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే భారత బౌలర్లు చేలరేగడంతో 189 పరుగులకే కుప్పకూలింది. టీమిండియా బౌలర్లలో చహర్, ప్రసిధ్ కృష్ణ, అక్షర్ పటేల్ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. సిరాజ్ ఒక్క వికెట్ తీశాడు. ఇక జింబాబ్వే ఇన్నింగ్స్‌లో టెయిలండర్లు రిచర్డ్ నగరవా(34), బ్రాడ్ ఎవన్స్(33) అద్భుతమైన ఆటతీరుతో అకట్టుకున్నారు. Deepak Chahar announced his comeback with a scintillating performance 💛🥳 7 Overs | 27 Runs | 3 Wickets#ZIMvIND #WhistlePodu @deepak_chahar9 📷 Getty Images pic.twitter.com/nEVR0IWRnY — WhistlePodu Army ® - CSK Fan Club (@CSKFansOfficial) August 18, 2022 చదవండి: ZIM vs IND: టీమిండియాపై జింబాబ్వే టెయిలండర్ల కొత్త చరిత్ర ! -
కాలు విరగ్గొట్టుకున్నా డోంట్ కేర్ అంటున్న హీరోయిన్స్
‘రిస్కీ ఫైట్ చేయాలా? డూప్ వద్దు.. చేసేస్తాం’ అని కొందరు హీరోయిన్లు యాక్షన్ సీన్స్ చేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో గాయాలపాలవుతుంటారు. అలా ఈ మధ్య టబు, శిల్పా శెట్టి, సంయుక్తా హెగ్డే షూటింగ్లో గాయపడ్డారు. అయితే వెనక్కి తగ్గేదే లే అంటున్నారు. కోలుకున్నాక డూప్ లేకుండానే ఫైట్స్ చేస్తాం అంటున్నారు. ‘ఆడపులులం మేము’ అంటూ ఇటీవల వీరు చేసిన రిస్కీ యాక్షన్ గురించి తెలుసుకుందాం. టబు పేరు గుర్తు రాగానే ‘కొత్త కొత్తగా ఉన్నది...’ అంటూ వెంకటేశ్‌తో ‘కూలీ నెం. 1’లో, ‘ఎటో వెళ్లిపోయింది మనసు..’ అంటూ ‘నిన్నే పెళ్లాడతా’లో నాగార్జునతో రొమాంటిక్‌గా ఆడిపాడిన పాటలు గుర్తొస్తాయి. అలాంటి క్యూట్ రోల్స్ చేసిన టబు వీలు కుదిరినప్పుడల్లా పవర్ఫుల్ రోల్స్ చేస్తుంటారు. తాజాగా ‘భోలా’ చిత్రంలో ఆమె పోలీసాధికారి పాత్ర చేస్తున్నారు. పవర్ఫుల్ పోలీసాఫీసర్ అన్నమాట. ఈ సినిమా కోసం ఇటీవల టబు పాల్గొనగా ఓ ఛేజింగ్ సీన్ చిత్రీకరించారు. ఆ సమయంలో ఓ మోటారు సైకిల్, ట్రక్కు ఢీ కొనడంతో ప్రమాదం జరిగింది. ట్రక్కు అద్దాలు పగలడంతో టబు నుదురు, కంటి దగ్గర గాయాలయ్యాయి. అయితే పెద్ద ప్రమాదం కాకపోవడంతో యూనిట్ ఊపిరి పీల్చుకుంది. కానీ టబు కంటి దగ్గర గాయం కావడంతో అది తగ్గే వరకూ షూటింగ్‌కి బ్రేక్ ఇచ్చారు. ఈ చిత్రంలో అజయ్ దేవగణ్ కథానాయకుడు. ఇక టబు గాయపడిన ఒకట్రెండు రోజులకు మరో నటి శిల్పాశెట్టి ప్రమాదం బారిన పడ్డారు. ప్రస్తుతం శిల్పా చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో ‘ఇండియన్ పోలీస్ ఫోర్స్’ ఒకటి. శిల్పాకి ఇది తొలి వెబ్ సిరీస్. ఇందులో శిల్పాది పోలీసాఫీసర్ క్యారెక్టర్. సో.. ఫైట్స్ ఉండటం సహజం. ‘ఒక యాక్షన్ సీన్ తీస్తూ.. యాక్షన్ అని చెప్పి, కాలు విరగ్గొట్టుకో అని నా యూనిట్ సభ్యులు అన్నారు. ఆ మాటలను సీరియస్‌గా తీసుకున్నాను. అంతే.. కాలికి బలమైన గాయం అయింది. ఫలితంగా ఆరు వారాలు షూటింగ్‌కి బ్రేక్. బలంగా తిరిగొస్తా.. ఫైట్ సీన్ చేస్తా’ అని పేర్కొన్నారు శిల్పా శెట్టి. మరోవైపు యువకథానాయిక సంయుక్తా హెగ్డే కూడా ఇటీవల షూటింగ్లో గాయపడ్డారు. ‘కిర్రాక్ పార్టీ’ చిత్రం ద్వారా ఈ కన్నడ బ్యూటీ తెలుగు తెరకు పరిచయమయ్యారు. తాజాగా ‘క్రీమ్’ అనే కన్నడ చిత్రంలో నటిస్తున్నారామె. ఇది యాక్షన్ థ్రిల్లర్ మూవీ. సంయుక్తాకి మార్షల్ ఆర్ట్స్ వచ్చు. ఈ సినిమాకి ఆమెను కథానాయికగా ఎంపిక చేయడానికి అదొక కారణం. కాగా, ‘క్రీమ్’ సినిమా కోసం మార్షల్ ఆర్ట్స్ టెక్నిక్‌తో ప్రత్యర్థులను ఎదుర్కొనే ఫైట్ సీన్లో సంయుక్తా హెగ్డేకి బలమైన గాయం తగిలింది. కాలికి గాయం కావడంతో రెండు నెలలు విశ్రాంతి సూచించారు. ‘‘ఇంటిపట్టున కూర్చోవడం అంటే నాకు ఇష్టం ఉండదు. అయితే ఇప్పుడు కాలు కదపలేని పరిస్థితి. ఈ రెండు నెలల్లో పాటలు పాడటం నేర్చుకోవాలనుకుంటున్నాను. అలాగే గతంలో కొన్ని కథలు రాశాను. వాటికి స్క్రీన్‌ప్లే రాసే టైమ్ దొరకలేదు. ఇప్పుడు ఆ పని కూడా పూర్తి చేయాలను కుంటున్నాను’’ అన్నారు సంయుక్తా. కథానాయికలకు గ్లామరస్ రోల్స్ ఎక్కువగా వస్తుంటాయి. అందుకు భిన్నంగా చాలెంజింగ్ రోల్స్ వస్తే, ఎంత రిస్క్ అయినా తీసుకుంటారు. టబు, శిల్పా, సంయుక్తా ఇటీవల గాయపడిన తారలైతే గతంలో తాప్సీ, కంగనా రనౌత్ వంటి కథానాయికలు షూటింగ్స్‌లో ప్రమాదాల బారిన పడ్డారు. అయినప్పటికీ సవాల్‌లాంటి క్యారెక్టర్ అంటే ‘సై’ అంటున్నారు. ‘ఆడపులులు’ అంతే మరి.. -
టీమిండియాకు భారీ షాక్.. టీ20 ప్రపంచకప్‌కు కూడా అతడు దూరం!
టీ20 ప్రపంచకప్-2022కు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలే అవకాశం ఉంది. గాయం కారణంగా ఆసియా కప్‌కు దూరమైన స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా.. టీ20 ప్రపంచకప్‌లో కూడా పాల్గొనడం అనుమానంగా మారింది. బుమ్రా ప్రస్తుతం తీవ్రమైన వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు. అంతకు మందు 2019లో బుమ్రా ఇదే గాయంతో బాధపడ్డాడు. దీంతో బుమ్రా గతంలో చాలా మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఇక ఇప్పడు అతడి గాయం మళ్లీ తిరగబెట్టింది. బుమ్రా ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఉన్నాడు. ఇక టీ20 ప్రపంచకప్‌కు జట్టు ప్రకటించడానికి నెల రోజుల సమయం మాత్రమే ఉన్నందున బుమ్రా గాయం బీసీసీఐను ఆందోళనకు గురిచేస్తోంది. "బుమ్రా గాయం మా జట్టును కలవరపెడుతోంది. అతడు ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. అతడి పాత గాయం మళ్లీ తిరిగి బెట్టింది. ప్రస్తుతం బుమ్రా వెన్ను నొప్పి తీవ్రమైంది. ప్రపంచ కప్‌కు మాకు కేవలం రెండు నెలల సమయం మాత్రమే ఉంది. ఈ సమయంలో బుమ్రా గాయపడడం మా దురదృష్టమనే చెప్పుకోవాలి. అతడు మా జట్టు ప్రాధాన బౌలర్. కాబట్టి అతడు గాయం నుంచి తొందరగా కోలుకుని తిరిగి జట్టులోకి చేరుతాడని ఆశిస్తున్నాము" అని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు ఇన్సైడ్ స్పోర్ట్స్‌తో పేర్కొన్నారు. కాగా టీ20 ప్రపంచకప్ ఈ ఏడాది అక్టోబర్-నవంబర్‌లో ఆస్ట్రేలియా వేదికగా జరగనుంది. చదవండి: 'భవిష్యత్తులో అతడు టీమిండియా కెప్టెన్ కావడం ఖాయం' -
ఐర్లాండ్‌తో టీ20 సిరీస్.. దక్షిణాఫ్రికాకు బిగ్ షాక్..!
ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌కు ముందు దక్షిణాఫ్రికాకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ కగిసో రబాడ గాయం కారణంగా ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌కు దూరం కానున్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20 లో రబాడా ఎడమ కాలి చీలమండకు గాయమైంది. దీంతో అతడు ఇంగ్లండ్‌తో జరిగిన అఖరి టీ20కూడా దూరమయ్యాడు. అయితే రబాడ గాయం నుంచి కోలుకోవడానికి దాదాపు రెండు నెలల సమయం పట్టనున్నట్లు ప్రోటిస్ జట్టు బృందం తెలిపింది. ఈ క్రమంలో అతడు ఐర్లాండ్ సిరీస్‌తో పాటు ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు కూడా దూరమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. కాగా ఇంగ్లండ్ వేదికగా రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఐర్లాండ్‌తో ప్రోటీస్ తలపడనుంది. ఐర్లాండ్-దక్షిణాఫ్రికా మధ్య తొలి టీ20 బ్రిస్టల్ వేదికగా బుధవారం జరగనుంది. ఈ సిరీస్ మొత్తం బ్రిస్టల్ వేదికగా జరగనుంది. ఇక ఈ సిరీస్ ముగిసిన అనంతరం దక్షిణాఫ్రికా మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఇంగ్లండ్‌తో తలపడనుంది. కాగా ఇంగ్లండ్‌తో మూడు టీ20 సిరీస్‌ను 2-1తో దక్షిణాఫ్రికా కైవసం చేసుకుంది. ఐర్లాండ్‌తో టీ20లకు దక్షిణాఫ్రికా జట్టు డేవిడ్ మిల్లర్ (కెప్టెన్), రీజా హెండ్రిక్స్, ఐడెన్ మార్క్రామ్, రిలీ రోసౌ, రాస్సీ వాన్ డెర్ డ్యూసెన్, వేన్ పార్నెల్, ఆండిలే ఫెహ్లక్వాయో, డ్వైన్ ప్రిటోరియస్, క్వింటన్ డి కాక్, హెన్రిచ్ క్లాసెన్, ట్రిస్టన్ స్టబ్స్, గ్రెరాల్డ్ కోట్జీ, కేశవ్ మహారాజ్,తబ్రైజ్ షమ్సీ, లుంగి ఎన్గిడి, అన్రిచ్ నోర్ట్జే చదవండి: IND vs WI 3rd T20: భారత్-విండీస్ మూడో టీ20 కూడా ఆలస్యం.. కారణం ఇదే..! -
KTR: రామారావు ఆన్ వర్క్‌ఫ్రమ్‌హోం
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు గాయపడిన సంగతి తెలిసిందే. ఎడమ కాలి చీలమండ కండరం గాయంతో బాధపడుతూ మూడు వారాల విశ్రాంతి తీసుకుంటున్నారు ఆయన. ఈ క్రమంలో మంచి సినిమాలు, వెబ్ సిరీస్‌లు రిఫర్ చేయాలంటూ ఆయన నెటిజన్స్‌ని కోరారు. ఇక ఇప్పుడు ఐటీ మంత్రి కేటీ రామారావు తన విభాగం ఫైల్స్‌ను చూస్తున్న ఫొటోను మంగళవారం ట్విట్టర్లో షేర్ చేశారు. వర్క్‌ఫ్రమ్ హోంలోనూ కొన్ని ఫైళ్లకు సంబంధించిన పని జరుగుతోందని ఈ సందర్భంగా కేటీఆర్ వ్యాఖ్యానించారు. Getting some file work done #WorkFromHome pic.twitter.com/SC2v7RtI5j — KTR (@KTRTRS) July 26, 2022 చదవండి: కేటీఆర్ కోసం మోకాళ్లపై గుడి మెట్లెక్కిన ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య -
భారత్‌కు భారీ షాక్.. కామన్వెల్త్ గేమ్స్ నుంచి నీరజ్ చోప్రా ఔట్!
బర్మింగ్‌హామ్ వేదికగా జరగనున్న కామన్వెల్త్ గేమ్స్-2022కు ముందు భారత్‌కు భారీ షాక్ తగిలింది. ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్, జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా గాయం కారణంగా కామన్వెల్త్ గేమ్స్‌కు దూరమయ్యాడు. కాగా తాజాగా ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్-2022లో నీరజ్ చోప్రా రజత పతకం సాధించి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ఫైనల్ సమయంలో అతడి గజ్జలో గాయమైంది. ఫైనల్లో కఠిన పరిస్థితులు ఎదుర్కొన్నానని, పరుగెత్తుతున్నప్పుడు తొడ కండరాలు పట్టేశాయని నీరజ్ చోప్రా పతకం సాధించిన అనంతరం చెప్పాడు. అయితే అతడి గాయం ప్రస్తుతం తీవ్రం కావడంతో కామన్వెల్త్ గేమ్స్ నుంచి తప్పుకున్నట్లు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ తెలిపింది. "ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా గాయం కాణంగా కామన్వెల్త్ గేమ్స్‌లో భాగం కాలేకపోతున్నాడు. అతడు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాము" అని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ట్విటర్లో పేర్కొంది. చదవండి: Lovlina Borgohain: బీఎఫ్ఐ అధికారులు వేధిస్తున్నారు.. టోక్యో ఒలింపిక్స్ మెడలిస్ట్ సంచలన ఆరోపణలు Our Olympic Champ @Neeraj_chopra1 will not be defending his title at @birminghamcg22 due to concerns regarding his fitness. We wish him a speedy recovery & are supporting him in these challenging times.#EkIndiaTeamIndia #WeareTeamIndia pic.twitter.com/pPg7SYlrSm — Team India (@WeAreTeamIndia) July 26, 2022 -
శ్రీలంకతో రెండో టెస్టు.. పాకిస్తాన్‌కు భారీ షాక్..!
గాలే వేదికగా జూలై 24 నుంచి శ్రీలంకతో జరగనున్న రెండో టెస్టుకు ముందు పాకిస్తాన్‌కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ షాహీన్ షా అఫ్రిది గాయం కారణంగా రెండో టెస్టుకు దూరమయ్యాడు. గాలేలో జరిగిన మొదటి టెస్టులో అఫ్రిది మోకాలి గాయంతో బాధపడ్డాడు. దాంతో అతడు మ్యాచ్ నాలుగు రోజు ఆట మధ్యలో మైదానం వీడాడు. అయితే అతడి గాయం తీవ్రం కావడంతో కీలక రెండో టెస్టుకు దూరమయ్యాడు. ఇక తొలి టెస్టులో పాక్ విజయంలో షాహీన్ షా అఫ్రిది కీలక పాత్ర పోషించాడు. తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు కీలక వికెట్లు పడగొట్టి ఆతిథ్య జట్టును కేవలం 222 పరుగులకే కట్టడి చేశాడు. ఇక గాయ పడిన అతడి స్థానంలో యువ పేసర్ హరీస్ రవూఫ్ తుది జట్టులోకి రానున్నాడు. కాగా రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో పాక్ 1-0 అధిక్యంలో ఉంది. రెండో టెస్టుకు పాకిస్తాన్ తుది జట్టు(అంచనా) అబ్దుల్లా షఫీక్, ఇమామ్-ఉల్-హక్, అజర్ అలీ, బాబర్ ఆజం (సి), అఘా సల్మాన్, మహ్మద్ రిజ్వాన్ (wk), మహ్మద్ నవాజ్, యాసిర్ షా, హసన్ అలీ,హరీస్ రవూఫ్ , నసీమ్ షా చదవండి: WI vs IND 1st ODI: వెస్టిండీస్‌తో భారత్ తొలి పోరు.. ధావన్‌కు జోడీ ఎవరు? -
దక్షిణాఫ్రికాతో నాలుగో టీ20.. టీమిండియా యువ పేసర్ దూరం..!
దక్షిణాఫ్రికాతో నాలుగో టీ20కు ముందు భారత్‌కు ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. జట్టు యువ పేసర్ ఆవేష్ ఖాన్ గాయం కారణంగా రాజ్‌కోట్ వేదికగా జరగనున్న నాలుగో టీ20కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. వైజాగ్ వేదికగా జరగిన మూడో టీ20లో ఆవేష్ ఖాన్ కుడి చేతికి గాయమైంది. దీంతో అతడు మ్యాచ్ మధ్యలోనే ఫీల్డ్‌ను విడిచి పెట్టి వెళ్లాడు. అయితే అతడు గాయం నుంచి కోలుకోవడానికి వారం రోజులు సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. దీంతో అతడు స్థానంలో డెత్ స్పెషలిస్ట్ ఆర్షదీప్ సింగ్ తుది జట్టులోకి రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక రాజ్‌కోట్ వేదికగా నాలుగో టీ20 శుక్రవారం జరగనుంది. చదవండి: అరంగేట్రంలోనే ప్రపంచ రికార్డును తిరగరాసిన ఆఫ్ఘాన్ బౌలర్ -
IND Vs SA: కేఎల్ రాహుల్ దూరం.. కెప్టెన్‌గా రిషబ్ పంత్
సౌతాఫ్రికాతో టి20 సిరీస్‌కు ముందు టీమిండియాకు బిగ్‌షాక్ తగిలింది. గాయంతో కెప్టెన్ కేఎల్ రాహుల్ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. రాహుల్‌తో పాటు కుల్దీప్ యాదవ్ కూడా టి20 సిరీస్ నుంచి వైదొలిగాడు. కాగా కేఎల్ రాహుల్ స్థానంలో రిషబ్ పంత్ జట్టును నడిపించనుండగా.. హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. తొలి టి20 జరగనున్న అరుణ్ జైట్లీ స్టేడియంలో బుధవారం సాయంత్రం ప్రాక్టీస్ అనంతరం గజ్జల్లో గాయం ఇబ్బంది పెడుతున్నట్లు కేఎల్ రాహుల్ మేనేజ్మెంట్కు తెలిపాడు. కాగా ఇవాళ ఉదయమే రాహుల్ గాయం తీవ్రతను వైద్యులు పరిశీలించారు. అయితే సాయంత్రానికి నొప్పి ఎక్కువ అవడంతో మేనేజ్మెంట్ కేఎల్ రాహుల్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంది. రానున్న ఇంగ్లండ్ సిరీస్‌ను దృష్టిలో పెట్టుకొని సౌతాఫ్రికా సిరీస్‌కు దూరంగా ఉంచాలని ఒక నిర్ణయానికి వచ్చింది. దీంతో సౌతాఫ్రికాతో టి20 సిరీస్ నుంచి కేఎల్ రాహుల్ వైదొలిగినట్లు మేనేజ్మెంట్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇక కుల్దీప్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో గాయం బారీన పడ్డాడు. దీంతో అతను కూడా కొన్ని రోజుల పాటు ఆటకు దూరం కానున్నాడు. ఇక గురువారం(జూన్ 9న) ఇరుజట్ల మధ్య తొలి టి20 మ్యాచ్ జరగనుంది. భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా టీ20 సిరీస్ మొదటి టీ20: జూన్ 9- గురువారం- అరుణ్ జైట్లీ స్టేడియం- ఢిల్లీ రెండో టీ20: జూన్ 12- ఆదివారం- బరాబతి స్టేడియం- కటక్ మూడో టీ20: జూన్ 14- మంగళవారం- డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ- వీడీసీఏ క్రికెట్ స్టేడియం- విశాఖపట్నం నాలుగో టీ20: జూన్ 17, శుక్రవారం- సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం- రాజ్‌కోట్ ఐదో టీ20: జూన్ 19- ఎం.చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు చదవండి: Mitali Raj Intresting Facts: మిథాలీరాజ్‌లో మనకు తెలియని కోణాలు.. పాండ్యా, సంజూపై ద్రవిడ్ ప్రశంసలు.. అతడికి జట్టులో చోటు మాత్రం ఇవ్వరు కదా! -
ఇంగ్లండ్‌తో రెండో టెస్టు.. న్యూజిలాండ్‌కు భారీ షాక్..!
Colin de Grandhomme ruled out of England tour: ఇంగ్లండ్‌తో తొలి టెస్టు ఓటమి నుంచి కోలుకోక ముందే న్యూజిలాండ్‌కు మరో ఎదరు దెబ్బ తగిలింది. గాయం కారణంగా కివీస్ స్టార్ ఆల్‌రౌండర్ కొలిన్ డి గ్రాండ్‌హోమ్ మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యాడు. గ్రాండ్‌హోమ్ తన కుడి కాలి గాయం కారణంగా సిరీస్ నుంచి తప్పుకున్నాడు. అతడు గాయం నుంచి కోలుకోవడానికి 10 నుంచి 12 వారాలు పడుతుందని వైద్యులు తెలిపారు. అయితే సిరీస్ ఆరంభానికి ముందే గ్రాండ్‌హోమ్‌కు బ్యాకప్‌గా హెన్రీ నికోల్స్‌ను న్యూజిలాండ్ క్రికెట్ ఎంపిక చేసింది. కాగా నికోల్స్ ఇంగ్లండ్‌కు చేరుకున్న తర్వాత కరోనా బారిన పడ్డాడు. దీంతో గ్రాండ్‌హోమ్ స్థానంలో మైఖేల్ బ్రేస్‌వెల్ తుది జట్టులోకి రానున్నాడు. ఇక ఇరు జట్లు మధ్య రెండో టెస్టు ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా శుక్రవారం(జూన్14) ప్రారంభం కానుంది. కాగా లార్డ్స్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ చేతిలో 5 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ ఓటమి పాలైంది. చదవండి: Lionel Messi : మెస్సీ ‘వన్‌మ్యాన్ షో’.. అర్జెంటీనా ఘనవిజయం -
కోమా నుంచి కోలుకున్న దక్షిణాఫ్రికా యువ క్రికెటర్..
Mondli Khumalo Health Condition: బ్రిడ్జ్‌వాటర్‌లో గత ఆదివారం(మే 29న) దుండగుల చేతిలో తీవ్రంగా గాయపడిన దక్షిణాఫ్రికా యువ క్రికెటర్ ఖుమాలో కోమా నుంచి బయట పడ్డాడు. ఈ విషయాన్ని అతడి సహచర ఆటగాడు లాయిడ్ ఐరిష్ తెలిపాడు. మొండ్లీ ఖుమా యూకేలో కౌంటీ క్రికెట్ ఆడేందుకు వచ్చాడు. అతను నార్త్ పెర్తర్టన్కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. కాగా గత ఆదివారం తెల్లవారుజామున తన పని ముగించుకొని ఇంటికి వెళ్తున్న మొండ్లీ ఖుమాలోపై కొందరు దుండగులు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. దీంతో అతడి తలకు తీవ్ర గాయమైంది. అతడి మెదడులో రక్తం గడ్డ కట్టడంతో వైద్యులు మూడు సర్జరీలు చేశారు. "మొండ్లీ శుక్రవారం కోమా నుంచి కోలుకున్నాడు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉంది. అతడు తన తల్లి కోసం అడుగుతున్నాడు. అదే విధంగా ఇంగ్లండ్, న్యూజిలాండ్ టెస్ట్ మ్యాచ్‌ను చూస్తున్నాడు. ఇక అతడి తదుపరి మ్యాచ్ ఎప్పుడు అని కూడా తెలుసుకోవాలనుకుంటున్నాడు. గత 24 గంటల్లో అతడు బాగా కోలుకున్నాడు అని లాయిడ్ ఐరిష్ పేర్కొన్నాడు. ఇక 20 ఏళ్ల మొండ్లీ ఖుమాలో 2018లో క్వాజులు-నాటల్ ఇన్లాండ్ తరపున టి20 అరంగేట్రం చేశాడు. 2020 అండర్-19 ప్రపంచకప్ సౌతాఫ్రికా జట్టులో ఖుమాలో చోటు దక్కించుకున్నాడు. ఇక 2020 మార్చి 7న లిస్ట్-ఏ, 2021 మార్చి 4న ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ఐదు ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు, రెండు లిస్ట్-ఏ మ్యాచ్‌లు, 4 టి20 మ్యాచ్‌లు ఆడాడు. చదవండి: నీ క్రీడాస్ఫూర్తికి సలామ్ నాదల్: సచిన్, రవిశాస్త్రి ప్రశంసలు -
French Open: హోరాహోరీ సమరం... గాయంతో సమాప్తం
పాయింట్ పాయింట్‌కూ పోరాటం... సుదీర్ఘ ర్యాలీలు... 3 గంటల 13 నిమిషాలు ముగిసినా పూర్తి కాని రెండు సెట్లు... ఫ్రెంచ్ ఓపెన్‌లో 13 సార్లు చాంపియన్ రాఫెల్ నాదల్, జర్మనీ స్టార్ అలెగ్జాండర్ జ్వెరెవ్ మధ్య శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్ తీరిది. తొలి సెట్‌ను అతికష్టమ్మీద నెగ్గిన నాదల్కు రెండో సెట్లోనూ ఒక్కో పాయింట్‌కు తన అనుభవాన్నంతా రంగరించి పోరాడాల్సిన స్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో మ్యాచ్ తుది ఫలితం ఎలా ఉంటుందోనని అభిమానులు ఆలోచిస్తున్న తరుణంలో కోర్టులో ఊహించని సంఘటన జరిగింది. రెండో సెట్ 12వ గేమ్‌లో నాదల్ రిటర్న్ షాట్‌ను అందుకోనే క్రమంలో బేస్‌లైన్ వద్ద జ్వెరెవ్ జారి పడటంతో చీలమండకు తీవ్ర గాయమైంది. పడిన వెంటనే జ్వెరెవ్ నొప్పితో విలవిలలాడాడు. మైదానంలో ప్రథమ చికిత్స తర్వాత జ్వెరెవ్‌ను చక్రాల కుర్చీపై బయటకు తీసుకెళ్లారు. ఐదు నిమిషాల తర్వాత జ్వెరెవ్ ‘క్రచెస్’ సహాయంతో కోర్టులోకి వచ్చి అభిమానులకు అభివాదం చేసి వెళ్లిపోయాడు. దాంతో రాఫెల్ నాదల్ తనకెంతో కలిసొచ్చిన ఫ్రెంచ్ ఓపెన్‌లో 14వ సారి ఫైనల్లోకి ప్రవేశించాడు. గతంలో ఫైనల్ చేరిన 13 సార్లూ నాదలే విజేతగా నిలిచాడు. కాస్పర్ రూడ్ (నార్వే), సిలిచ్ (క్రొయేషియా) మధ్య రెండో సెమీఫైనల్ విజేతతో ఆదివారం జరిగే ఫైనల్లో నాదల్ తలపడతాడు. పారిస్: తన 36వ పుట్టిన రోజు విజయం రుచి చూసిన స్పెయిన్ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్ ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఫైనల్లోకి అడుగు పెట్టాడు. మూడో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ)తో శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి సెమీఫైనల్లో నాదల్ తొలి సెట్‌ను 7–6 (10/8)తో టైబ్రేక్‌లో గెలిచాడు. రెండో సెట్లోని 12వ గేమ్ చివర్లో నాదల్ రిటర్న్ షాట్‌ను అందుకునే క్రమంలో జ్వెరెవ్ కోర్టులో జారి పడ్డాడు. దాంతో పాయింట్ నాదల్కు లభించింది. స్కోరు 6–6తో సమమైంది. కోర్టులో జారిపడ్డ జ్వెరెవ్‌కు గాయం త్రీవంగా ఉండటంతో అతను మళ్లీ బరిలోకి దిగలేకపోయాడు. దాంతో నాదల్‌ను విజేతగా ప్రకటించారు. 3 గంటల 13 నిమిషాలపాటు జరిగిన పోరులో జ్వెరెవ్ రెండు సెట్లలో నాదల్కు చెమటలు పట్టించాడు. తొలి సెట్ టైబ్రేక్‌లో జ్వెరెవ్ 6–2తో ఆధిక్యంలో నిలిచి నాలుగు సెట్ పాయిం ట్లు సంపాదించాడు. కానీ పట్టువదలకుండా పోరాడినా నాదల్ వరుసగా ఐదు పాయింట్లు గెలిచి 7–6తో ఆధిక్యంలోకి వచ్చాడు. ఆ తర్వాత స్కోరు 7–7తో, 8–8తో సమమైంది. ఈ దశలో నాదల్ వరుసగా రెండు పాయింట్లు గెలిచి తొలి సెట్‌ను గంటా 38 నిమిషాల్లో గెల్చుకున్నాడు. రెండో సెట్లోనూ జ్వెరెవ్ అద్భుతంగా ఆడుతూ 5–3తో ఆధిక్యంలోకి వచ్చి సెట్ కోసం సర్వీస్ చేశా డు. కానీ తొమ్మిదో గేమ్‌లో జ్వెరెవ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన నాదల్ ఆ తర్వాత తన సర్వీస్‌ను నిలబెట్టుకొని స్కోరును 5–5తో సమం చేశాడు. 11వ గేమ్‌లో జ్వెరెవ్ తన సర్వీస్‌ను కాపాడుకోగా... 12వ గేమ్‌లో నాదల్ సర్వీస్‌లో చివరి పాయింట్ సమయంలో జ్వెరెవ్ జారి పడటంతో మ్యాచ్ ముగిసింది. నేడు మహిళల సింగిల్స్ ఫైనల్ స్వియాటెక్ (పోలాండ్) X కోకో గాఫ్ (అమెరికా) సా. గం. 6:30 నుంచి సోనీ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ కోసం అమెరికా టీనేజర్ కోకో గాఫ్... రెండోసారి ఫ్రెంచ్ ఓపెన్ నెగ్గాలనే లక్ష్యంతో స్వియాటెక్ నేడు మహిళల సింగిల్స్ టైటిల్ పోరులో తలపడనున్నారు. ⚔️ A thrilling battle came to a tough end with an injury to @AlexZverev but he and @RafaelNadal played some amazing points! Check out the Highlights by @emirates 🎥#RolandGarros | #EmiratesFlyBetterMoment pic.twitter.com/E9vn2iRF1v — Roland-Garros (@rolandgarros) June 3, 2022 -
‘రెండు నెలల్లో కోలుకుంటా’
తొడ కండరాల గాయంతో ఆటకు దూరమైన భారత క్రికెటర్ అజింక్య రహానే 6–8 వారాల్లోగా కోలుకుంటానని విశ్వాసం వ్యక్తం చేశాడు. ఐపీఎల్లో కోల్‌కతా తరఫున ఆడుతూ రహానే గాయపడ్డాడు. జాతీయ క్రికెట్ అకాడమీలో పది రోజుల పాటు తన రీహాబిలిటేషన్ జరిగిందని, గాయం తీవ్రత ప్రస్తుతం తగ్గిందని అతను అన్నాడు. రహానే సారథ్యంలో ఆస్ట్రేలియాపై సాధించిన గత టెస్టు సిరీస్ విజయంపై రూపొందించిన డాక్యుమెంటరీలో తన మెల్బోర్న్ టెస్టు సెంచరీని అతను ప్రత్యేకంగా ప్రస్తావించాడు. -
ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్.. స్టార్ ఆటగాడు దూరం..!
Suryakumar Yadav ruled out IPL 2022: ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ గాయం కారణంగా ఐపీఎల్-2022 సీజన్ నుంచి తప్పుకున్నాడు. మే 6న గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో యాదవ్ ఎడమ చేయి కండరానికి గాయమైంది. దీంతో ఈ సీజన్లో మిగిలిన మ్యాచ్‌లకు సూర్యకుమార్ దూరమయ్యాడు. ఈ విషయాన్ని ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ అధికారికంగా వెల్లడించింది. "సూర్యకుమార్ యాదవ్ ఎడమ చేయి కండరానికి గాయమైంది. దీంతో ఈ సీజన్లో మిగితా మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. బీసీసీఐ వైద్య బృందం అతడిని కొన్ని వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని" సూచించారు అని ముంబై ఫ్రాంచైజీ పేర్కొంది. ఇక ఈ ఏడాది సీజన్లో ఆరంభ మ్యాచ్‌లకు గాయం కారణంగా సూర్యకుమార్ దూరమయ్యాడు. ఆ తరువాత ఏంట్రీ ఇచ్చిన సూర్యకుమార్ ఆద్భుతంగా రాణించాడు. ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడిన సూర్యకుమార్ 303 పరుగులు సాధించాడు. చదవండి: IPL 2022: ముంబై ఇండియన్స్ వర్సెస్ కేకేఆర్ లైవ్ అప్డేట్స్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
పంజాబ్ కింగ్స్ కెప్టెన్ ఆడకపోవడంపై ధావన్ క్లారిటీ
ఆదివారం ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌కు పంజాబ్ కింగ్స్ రెగ్యులర్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ దూరంగా ఉన్నాడు. అతని స్థానంలో శిఖర్ ధావన్ కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్నాడు. మయాంక్ అగర్వాల్ మ్యాచ్‌కు ఎందుకు దూరమయ్యాడన్న సందేహం చాలా మంది అభిమానుల్లో మెదిలింది. అయితే టాస్ సమయంలో గ్రౌండ్‌కు వచ్చిన ధావన్ దీనిపై క్లారిటీ ఇచ్చాడు. ''మయాంక్ అగర్వాల్ కాలి బొటనవేలి గాయంతో బాధపడుతున్నాడు. ప్రస్తుతం ఈ మ్యాచ్‌కు మాత్రమే దూరంగా ఉంటున్నాడు. అతని స్థానంలో నేను జట్టును నడిపిస్తున్నా. అతని పరిస్థితి బాగానే ఉంది. బహుశా తర్వాతి మ్యాచ్‌కు మయాంక్ అగర్వాల్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.'' అంటూ చెప్పుకొచ్చాడు. కాగా మయాంక్ అగర్వాల్ ఈ సీజన్లో పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాడు. కెప్టెన్‌గా తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తున్న మయాంక్ బ్యాటర్‌గా మాత్రం విఫలమవుతున్నాడు. కాగా పంజాబ్ కింగ్స్ ఈ సీజన్లో ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌ల్లో మూడింట గెలిచి.. రెండు ఓడి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతుంది. చదవండి: 'సాధారణ ఆటగాడిలా ఫీలవ్వు'.. కోహ్లికి మాజీ క్రికెటర్ సలహా -
T20 World Cup 2022: టీమిండియాకు భారీ షాక్..!
టీమిండియా పేసర్, చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బౌలర్ దీపక్ చాహర్ గాయం కారణంగా ఐపీఎల్-2022కు దూరమైన సంగతి తెలిసిందే. తొడ కండరాల గాయం నుంచి కోలుకున్న చాహర్.. బెంగుళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ప్రాక్టీస్ చేస్తుండగా మరో సారి గాయపడ్డాడు. నెట్స్‌లో బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు అతడి వెన్నెముకకు గాయమైంది. దీంతో ఈ ఏడాది సీజన్లో సీఎస్కేకు సెకెండ్ హాఫ్‌లో ఎంట్రీ ఇస్తాడనుకున్న చాహర్ పూర్తిగా దూరమయ్యాడు. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం.. కనీసం నాలుగు నెలలపాటు క్రికెట్‌కు దీపక్ చాహర్ దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. నాలుగు నెలలపాటు అతడికి విశ్రాంతి అవసరమని వైద్యులు తెలిపినట్లు సమాచారం.. ఈ క్రమంలో ఈ ఏడాది ఆక్టోబర్‌లో ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు చాహర్ అందుబాటుపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఒక వేళ టీ20 ప్రపంచకప్‌కు చాహర్ దూరమైతే భారత్‌కు పెద్ద ఎదురుదెబ్బ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆస్ట్రేలియా వంటి ఫాస్ట్ ట్రాక్ పిచ్‌లపై అద్భుతంగా రాణించే సత్తా చాహర్‌కు ఉంది. ఇక ఐపీఎల్-2022 మెగా వేలంలో చాహర్ రూ.14 కోట్ల భారీ ధరకు చాహర్‌ను సీఎస్కే కొనుగోలు చేసింది. కాగా ప్రస్తుత సీజన్లో చాహర్ లేని లోటు సీఎస్కే బౌలింగ్‌లో సృష్టంగా కన్పిస్తోంది. చదవండి: IPL 2022: ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ చెత్త రికార్డు.. తొలి జట్టుగా! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4141448520.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఓటమి బాధలో ఉన్న రాజస్తాన్ రాయల్స్‌కు బిగ్‌షాక్
ఆర్సీబీతో మ్యాచ్‌లో ఓటమితో షాక్‌లో ఉన్న రాజస్తాన్ రాయల్స్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గాయంతో ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ నాథన్ కౌల్టర్‌నీల్ సీజన్ మొత్తానికే దూరమయ్యాడు. ఈ విషయాన్ని రాజస్తాన్ యాజమాన్యం ట్విటర్ వేదికగా స్వయంగా ప్రకటించింది. కాగా ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్తో జరిగిన తొలి మ్యాచ్‌లో కౌల్టర్ నీల్ ఆడాడు. ఆటలో చివరి ఓవర్ బౌలింగ్ చేస్తుండగా గాయపడ్డాడు. గాయం తీవ్రత ఎక్కువగా ఉందని.. ప్రస్తుతం అతనికి రెస్ట్ అవసరమని వైద్యులు దృవీకరించారు. కౌల్టర్ నీల్ తాను కోలుకునే వరకు స్వదేశంలో రీహాబిటేషన్‌లో గడపనున్నాడు. ఈ నేపథ్యంలోనే రాజస్తాన్ రాయల్స్.. ''తొందరగా కోలుకో.. మనం మళ్లీ కలుద్దా ఎన్సీఎన్(నాథన్ కౌల్టర్ నీల్)'' అంటూ క్యాప్షన్ జత చేసింది. కాగా కౌల్టర్ నీల్‌కు ప్రత్యామ్నాయంగా ఎవరని ఎంపిక చేస్తుందన్న విషయం తెలియాల్సి ఉంది. ఇక ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో 3 ఓవర్లు బౌలింగ్ చేసిన కౌల్టర్ నీల్ 48 పరుగులిచ్చి ఒక్క వికెట్ పడగొట్టలేకపోయాడు. ఆ మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ ఘన విజయం సాధించింది. ఇక ఐపీఎల్ మెగావేలంలో రాజస్తాన్ రూ. 2 కోట్లకు నాథన్ కౌల్టర్ నీల్‌ను దక్కించుకుంది. కౌల్టర్ నీల్ ఐపీఎల్లో 38 మ్యాచ్‌లాడి 48 వికెట్లు పడగొటగ్టాడు. ఐపీఎల్లో మధ్యలోనే వైదొలగడం కౌల్టర్ నీల్‌కు ఇది రెండోసారి. ఇంతకముందు 2014లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు ఆడుతున్న సమయంలో తొడ కండరాల గాయంతో టోర్నీ మొత్తానికే దూరమయ్యాడు. ఇక కండరాల గాయంతో 2021 ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరంగా ఉన్నాడు. మంగళవారం రాత్రి ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ ఓటమి పాలైంది. ఒక దశలో మ్యాచ్‌లో పట్టు చిక్కినప్పటికి.. దినేశ్ కార్తిక్ విధ్వంసానికి తోడూ.. షాబాజ్ అహ్మద్ నిలకడైన ఆటతీరుతో ఆర్సీబీ సంచలన విజయం సాధించింది. రాజస్తాన్ రాయల్స్ తన తర్వాతి మ్యాచ్ ఏప్రిల్ 10న లక్నో సూపర్ జెయింట్స్‌తో ఆడనుంది. చదవండి: Jos Buttler: 'నాకు అన్నీ తెలుసు.. అంపైర్‌తో పని లేదు' Ayush Badoni: ఆ ఆటగాడు పెను సంచలనం.. నాలుగేళ్ల క్రితం ట్వీట్ వైరల్ Until we meet again, NCN. 💗 Speedy recovery. 🤗#RoyalsFamily | #HallaBol | @coulta13 pic.twitter.com/XlcFUcTg5L — Rajasthan Royals (@rajasthanroyals) April 6, 2022 -
భారత్‌తో రెండో టీ20.. శ్రీలంకకు భారీ షాక్!
టీమిండియాతో జరిగిన తొలి టీ20లో ఓటమి చెందిన శ్రీలంకకు మరో ఎదరుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్పిన్నర్ మహేశ్ తీక్షణ గాయం కారణంగా మిగితా రెండు టీ20లకు దూరమయ్యాడు. అదే విధంగా భారత్‌తో సిరీస్‌కు శ్రీలంక స్టార్ ఆల్‌రౌండర్ వనిందు హసరంగా కరోనా బారిన పడి దూరమైన సంగతి తెలిసిందే.కాగా భారత్-శ్రీలంక రెండో టీ20 ధర్మశాల వేదికగా ఫిబ్రవరి 26న జరగనుంది.ఇక ఈ మ్యాచ్‌కు స్టార్ బ్యాటర్ కుశాల్ మెండిస్ అందుబాటుపై కూడా సందేహం నెలకొంది. మరోవైపు శ్రీలంక టెస్టు జట్టులో సభ్యులుగా ఉన్న నిరోషన్ డిక్వెల్లా , ధనంజయ డిసిల్వా చివరి రెండు మ్యాచ్‌ల కోసం టీ20 జట్టులో చేర్చబడ్డారు. ఇక తొలి టీ20 విషయానికి వస్తే.. శ్రీలంకపై టీమిండియా 62 పరుగల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా.. ఇషాన్ కిషన్(89), శ్రేయస్ అయ్యర్(57) సునామీ ఇన్నింగ్స్‌లు ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో 199 పరుగులు సాధించింది. 200 పరుగల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 6 వికెట్లు కోల్పోయి నిర్ణీత 20 ఓవర్లలో 137 పరుగులకే పరిమితమైంది. చదవండి: IND vs SL: ''కోహ్లి స్ధానంలో అతడే సరైనోడు'' -
ఐపీఎల్‌కు దూరం కానున్న స్టార్ ఆల్‌రౌండర్.. రూ. 14 కోట్లు వ్యర్థమేనా!
టీమిండియా యంగ్ ఆల్‌రౌండర్ దీపక్ చహర్ తొడ కండరాల గాయంతో శ్రీలంకతో టి20 సిరీస్‌కు దూరమైన సంగతి తెలిసిందే. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం దీపక్ చహర్‌కు గాయం త్రీవత ఎక్కువగా ఉందని తేలింది. దీంతో చహర్ ఐపీఎల్ 2022 సీజన్‌కు దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తన్నాయి. ఇదే నిజమైతే సీఎస్కే పెద్ద దెబ్బ పడినట్లే. ఎందుకంటే ఈసారి మెగావేలంలో సీఎస్కే దీపక్ చహర్‌ను రూ. 14 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. సీజన్‌కు చహర్ దూరమైతే మాత్రం సీఎస్కే భారీ మొత్తంలో నష్టపోనుంది. గతేడాది ఐపీఎల్లో చహర్ సీఎస్కే తరపున అదరగొట్టాడు. ఒక రకంగా సీఎస్కే టైటిల్ గెలవడంలో దీపక్ చహర్ కీలకపాత్ర పోషించాడు. చహర్ దూరమైతే అతనికి రీప్లేస్మెంట్ విషయంలోనూ సీఎస్కేకు సరైన ఆటగాడు లేడు. అంతేకాదు ఏడాది కాలంగా దీపక్ చహర్ బంతితోనే కాదు బ్యాట్‌తోనూ అదరగొడుతున్నాడు. శ్రీలంక గడ్డపై జరిగిన వన్డే సిరీస్‌లో 65 పరుగుల కీలక ఇన్నింగ్స్‌తో తనలో ఆల్‌రౌండర్ ఉన్నాడని నిరూపించిన చహర్ ఆ తర్వాత చాలా సందర్భాల్లోనూ టీమిండియా తరపున పలు మ్యాచ్‌లో మెరిశాడు. ఇక విండీస్‌తో ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మూడో టి20లో బౌలింగ్ చేస్తూ గాయపడ్డాడు. ప్రస్తుతం దీపక్ చహర్ బెంగళూరులోని ఎన్సీఏ అకాడమీలో రీహాబిటేషన్‌లో ఉన్నాడు. ఇప్పటికైతే చహర్ గాయం తీవ్రత గురించి ఎలాంటి సమాచారం లేనప్పటికి.. ఐపీఎల్ ప్రారంభమయ్యే నాటికి ఈ విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ ఏడాది ఐపీఎల్ 2022 సీజన్‌ను మార్చి చివరి వారం లేదా ఏప్రిల్ మొదటివారం నుంచి ప్రారంభించేలా బీసీసీఐ సన్నాహాకాలు చేస్తుంది. చదవండి: Formula One: 'ఫార్ములావన్‌ను యువతులు ఎగబడి చూస్తున్నారు.. ఆటపై ఇష్టంతో కాదు' 1992 World Cup: అందరూ ఉన్నారు.. ఒక్కడు మాత్రం మిస్సయ్యాడు.. ఎవరది? -
జోష్ మీదున్న టీమిండియాకు దెబ్బ.. రెండో టి20కి ఆ ఇద్దరు డౌటే!
India Vs West Indies 2nd T20: వెస్టిండీస్‌తో జరిగిన తొలి టి20లో 6 వికెట్ల తేడాతో గెలిచి ఫుల్ జోష్‌లో ఉన్న టీమిండియాకు షాక్ తగిలే అవకాశం ఉంది.ఫీల్డింగ్ సమయంలో ఆల్‌రౌండర్లు దీపక్ చహర్, వెంకటేశ్ అయ్యర్లు గాయాల బారిన పడడం ఆందోళన కలిగిస్తోంది. రెండో టి20 మ్యాచ్‌కు వీరు దూరమయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్‌లు టి20 సిరీస్ నుంచి ఔటైన సంగతి తెలిసిందే. వీరు కూడా దూరమైతే టీమిండియా ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం ఉంది. చదవండి: సూర్య మాటకు కట్టుబడిన వెంకటేశ్ అయ్యర్.. వీడియో వైరల్ విషయంలోకి వెళితే.. విండీస్ ఇన్నింగ్స్ సమయంలో ఇన్నింగ్స్ 16వ ఓవర్లో కెప్టెన్ పొలార్డ్ స్వ్కేర్‌లెగ్ దిశగా ఆడాడు. బంతిని ఆపే ప్రయత్నంలో చహర్ కుడిచేతికి గాయమయింది. దీంతో తన కోటా ఓవర్లు పూర్తి కాకుండానే డ్రెస్సింగ్‌రూమ్‌కు వెళ్లిపోయాడు. మూడు ఓవర్లు వేసిన చహర్ 28 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు. చహర్ మిగిలిన ఓవర్‌ను హర్షల్ పటేల్ పూర్తి చేశాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు అవకాశం రాలేదు. అయితే గాయం తీవ్రతను బట్టి చహర్ రెండో వన్డే ఆడేది లేనిది తెలుస్తుంది. ఇక మరో ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్ కూడా ఫీల్డింగ్ సమయంలో గాయపడ్డాడు. ఇన్నింగ్స్ 17వ ఓవర్లో పొలార్డ్ కొట్టిన షాట్‌ను ఆపే క్రమంలో జారిపడడంతో అయ్యర్ కుడిచేతికి గాయం అయింది. అయితే ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన అయ్యర్ 13 బంతుల్లో 24 పరుగులు చేసి టీమిండియాకు విజయం అందించాడు. కాగా వీరిద్దరికి స్కానింగ్ నిర్వహించి.. వచ్చే ఫలితాలను బట్టి రెండో టి20కి అందుబాటులో ఉంటారా.. దూరమవుతారా అనేది ఆసక్తిగా మారింది. ఇరుజట్ల మధ్య రెండో టి20 మ్యాచ్ ఫిబ్రవరి 18న ఈడెన్ గార్డెన్స్ వేదికగానే జరగనుంది. చదవండి: అరంగేట్రంలో రవి బిష్ణోయి రికార్డు.. కల నిజమైంది.. కానీ ఇది అస్సలు ఊహించలేదు! -
రిపబ్లిక్ డే వేడుకలలో అపశ్రుతి.. తలపై పడిన డ్రోన్
భోపాల్: మధ్యప్రదేశ్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలలో అపశ్రుతి చోటు చేసుకుంది. ఈ ఘటన జబల్పూర్ స్టేడియంలో జరిగింది. కాగా, అధికారులు వివిధ కార్యక్రమంలో భాగంగా డ్రోన్లను ప్రదర్శించారు. అయితే, ఈ డ్రోన్లు.. రిపబ్లిక్ వేడుకలలో పాల్గొనడానికి వచ్చిన వారి మీద పడ్డాయి. వేడుకలలో భాగంగా గిరిజన నృత్యం కొనసాగుతుంది. ఈ క్రమంలో.. డ్రోన్ ఒక్కసారిగా అదుపు తప్పి నృత్యం చేస్తున్న వారిమీద పడింది. దీంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని అధికారులు ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిని ఇందు కుంజమ్(38), గంగోత్రి కుంజమ్(18)లుగా గుర్తించారు. వీరు గిరిజన తెగకు చెందిన వారిగా.. దిండోరి జిల్లా నుంచి గణతంత్ర వేడుకలకు చూడటానికి జబల్ వచ్చినట్లు అధికారులు గుర్తించారు. వీరు పండిత్ రవి శుక్లా స్టేడియంలో గిరిజన నృత్యం చేయడానికి వచ్చినట్లు అధికారులు తెలిపారు. చదవండి: రైల్వే పరీక్షా ఫలితాలపై నిరసన... ఏకంగా రైలుకే నిప్పుపెట్టారు -
జనావాసాల్లో గాయపడ్డ విదేశీ కొంగ
సాక్షి, అంబర్‌పేట(హైదరాబాద్): ఉస్మానియా యూనివర్సిటీ అడవికి ఆనుకొని ఉన్న బాగ్ అంబర్‌పేట మల్లికార్జున్‌నగర్‌లో ఓ విదేశీ పక్షి గాయపడింది. బుధవారం ఉదయం స్థానికులు గమనించి అంబర్‌పేట పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు పక్షిని పోలీసుస్టేషన్‌కు తీసుకువచ్చి జూ పార్కు అధికారులకు సమాచారం అందించారు. జూ పార్కు అధికారులు ఈ పక్షి నైబీరియా నుంచి వలస వచ్చినట్లుగా జూ పార్కు అధికారులు గుర్తించారు. గాలిపటం మాంజా కారణంగా ఈ పక్షి గాయపడి నేలపై పడ్డట్లు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. జూ పార్కుకు తరలించి చికిత్స అందిస్తామని అధికారులు తెలిపారు. -
దక్షిణాఫ్రికాకు బిగ్‌షాక్.. గాయంతో స్టార్ పేసర్ దూరం
Anrich Nortje Ruled Out Of Test Series Vs IND.. టీమిండియాతో టెస్టు సిరీస్ ఆరంభానికి ముందే దక్షిణాఫ్రికా గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వరుస గాయాలతో ఇబ్బంది పడుతున్న దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ అన్రిచ్ నోర్ట్జే టెస్టు సిరీస్ మొత్తానికే దూరమయినట్లు క్రికెట్ సౌతాఫ్రికా ట్విటర్లో ప్రకటించింది. టి20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత నోర్ట్జే వరుస గాయాలతో సతమతమవుతున్నాడు. తాజాగా మోకాలి గాయం తిరగబెట్టడంతో టీమిండియాతో సిరీస్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఇక నోర్జ్టే దక్షిణాఫ్రికా తరపున 12 టెస్టుల్లో 47 వికెట్లు తీశాడు. ఇందులో మూడుసార్లు ఐదు వికెట్ల హాల్‌ను సాధించాడు. ఇక ఇటీవలే ముగిసిన టి20 ప్రపంచకప్‌లోనూ నోర్ట్జే మంచి ప్రదర్శన కనబరిచాడు. నెట్‌రన్‌రేట్ కారణంగా దక్షిణాఫ్రికా సెమీస్ అవకాశాలను చేజార్చుకుంది. ఇక ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడుతున్న నోర్ట్జే రెండేళ్లుగా మంచి ప్రదర్శన కనబరుస్తూ స్థిరంగా వికెట్లు తీశాడు. ''దక్షిణాఫ్రికాకు కీలకబౌలర్‌గా ఉన్న నోర్జ్టే టీమిండియాతో టెస్టు సిరీస్‌కు దూరమవ్వడం మాకు పెద్ద లోటు. కానీ వరుస గాయాలతో అతను ఇబ్బంది పడుతుండడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. వన్డు సిరీస్‌కు కూడా నోర్జ్టే అందుబాటులోకి వస్తాడా లేదో చెప్పలేని పరిస్థితి. ఇక నోర్ట్జే స్థానంలో టెస్టు సిరీస్‌కు ఎవరిని ఎంపికచేయడం లేదు. నోర్జ్టే గైర్హాజరీలోనూ కగిసో రబాడ, బీరన్ హెండ్రిక్స్, గ్లెంటన్ స్టుర్మాన్, డ్యుయాన్నే ఒలివర్, సిసండా మగాలాలతో నాణ్యమైన పేసర్లు ఉన్నారు. వీరితో పాటు వియాన్ ముల్డర్, మార్కో జాన్సెన్లు పేస్ ఆల్రౌండర్లుగా సేవలందించనున్నారు. అని సీఎస్ఏ చెప్పుకొచ్చింది. -
వార్నర్ నువ్వు గ్రేట్.. నొప్పి బాదిస్తున్నా
యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. వరుసగా రెండు టెస్టుల్లో సెంచరీ మార్క్‌ను చేజార్చుకున్న వార్నర్ వరుసగా 94, 95 పరుగులతో మెరిశాడు. ఇక తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ సమయంలో స్టోక్స్ వేసిన బంతి వార్నర్ పక్కటెముకలకు బలంగా తాకింది. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో వార్నర్ బ్యాటింగ్ దిగకుండా రెస్ట్ తీసుకున్నాడు. అయితే నొప్పి నుంచి కోలుకోవడంతో వార్నర్ రెండో టెస్టులో బరిలోకి దిగాడని అంతా భావించారు. కానీ వార్నర్ ఇంకా పక్కటెముకల గాయంతో బాధపడుతూనే ఉన్నట్లు తేలింది. దీనిలో భాగంగానే ఇంగ్లండ్ బ్యాటింగ్ సమయంలో వార్నర్ ఫీల్డింగ్‌కు రాలేదు. ఇక ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 13 పరుగులు చేసిన వార్నర్ రనౌటయ్యాడు. డ్రెస్సింగ్‌రూమ్‌లో స్మిత్‌తో సుధీర్ఘంగా చర్చిస్తున్న సమయంలో వార్నర్ నొప్పితో బాధపడినట్లు క్లియర్‌గా కనిపించింది. వీడియోలో వార్నర్ స్నీజ్(ముక్కు చీదుతూ) ఒక పక్కకు పడిపోవడంతో స్మిత్‌తో పాటు కోచ్ జస్టిన్ లాంగర్ కాసేపు ఆందోళనకు లోనయ్యారు. అయితే వార్నర్ తన పరిస్థితి బాగానే ఉందని సైగలు చేయడంతో అంతా కూల్ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: Steve Smith: 'అర్ధరాత్రి పడుకోకుండా ఇదేం పని బాబు'.. వీడియో వైరల్ ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఇంగ్లండ్ మరో ఓటమి దిశగా పయనిస్తోంది. 468 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన ఇంగ్లండ్ టీ విరామ సమయానికి వికెట్ నష్టానికి 20 పరుగులు చేసింది. హమీద్ హసీబ్ డకౌట్ కాగా.. బర్న్స్ 20, డేవిడ్ మలాన్ 4 పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 236 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. ఇక ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 473 పరుగులు చేయగా.. రెండో ఇన్నింగ్స్‌లో 230/9 వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఇప్పటికే పిచ్ బౌలర్లకు అనుకూలిస్తుండడంతో ఆటకు ఒకరోజు మొత్తం మిగిలిఉన్న నేపథ్యంలో ఇంగ్లండ్ ఓటమి నుంచి తప్పించుకోవడం కష్టమే. చదవండి: ''మా జట్టును చూస్తే కోపం, చిరాకు వస్తుంది'' Rib soreness + sneezing = scenes. Poor David Warner 🙈😅 #Ashes pic.twitter.com/nfjE6g38hv — 7Cricket (@7Cricket) December 19, 2021 -
Akthar: తాను హెచ్చరించిన గంటన్నరలోపే హార్ధిక్ గాయపడ్డాడు..!
Shoaib Akhtar On Hardik Pandya Injury: వెన్నెముక గాయం కారణంగా టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా కెరీర్ ప్రమాదంలో పడిన సంగతి తెలిసిందే. గాయానికి ముందు ఓ వెలుగు వెలిగిన ఈ ముంబై ఇండియన్స్ ఆటగాడు.. శస్త్ర చికిత్స అనంతరం తిరిగి జట్టులోకి వచ్చినప్పటికీ మునుపటి ఫామ్‌ను అందుకోలేకపోతున్నాడు. ఇటీవలి కాలంలో అతని ఫామ్ మరీ దారుణంగా ఉండటంతో జట్టులో స్థానాన్ని సైతం కోల్పోయాడు. ఈ నేపథ్యంలో పాండ్యా గాయంపై పాక్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆకాశ్ చోప్రా ఛానల్‌తో మాట్లాడుతూ.. హార్ధిక్ గాయాన్ని ముందు ఊహించానంటూ వ్యాఖ్యానించాడు. తాను హెచ్చరించిన గంటన్నరలోపే హార్ధిక్ గాయపడ్డాడని తెలిపాడు. 2018 ఆసియా కప్ సందర్భంగా హార్ధిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రాలను కలిశానని, ఆ సమయంలో వాళ్లు మరీ బక్కపలచగా ఉన్నారని, వాళ్లకి వెన్నెముకలు ఉన్నాయా లేవా అన్నట్లు ఉండేవారని అన్నాడు. అప్పుడే తాను పాండ్యా గాయపడతావని హెచ్చరించానని, తాను చెప్పిన గంటన్నరలోపే పాక్‌తో మ్యాచ్ సందర్భంగా అతడు గాయపడ్డాడని చెప్పుకొచ్చాడు. కాగా, గాయం కారణంగా ఫామ్ కోల్పోయిన హార్ధిక్ టెస్టులకు గుడ్‌బై చెప్పి, పరిమిత ఓవర్ల ఫార్మాట్‌కు మాత్రమే పరిమతమయ్యే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. చదవండి: విజయ్ హజారే ట్రోఫీలో తెలుగు కుర్రాడి విధ్వంసం.. -
Australian Open: టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ దూరం
అమెరికా మహిళా టెన్నిస్ స్టార్, 23 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ విజేత సెరెనా విలియమ్స్ జనవరిలో జరిగే సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో బరిలోకి దిగడంలేదు. తొడ కండరాల గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదని... తన వైద్య బృందం సలహా మేరకు ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆడట్లేదని 40 ఏళ్ల సెరెనా తెలిపింది. గాయంతో ఈ ఏడాది వింబుల్డన్‌లో తొలి రౌండ్ మధ్యలోనే వైదొలిగిన సెరెనా ఆ తర్వాత మరే టోర్నీలోనూ ఆడలేదు. -
ప్రపంచ చాంపియన్‌షిప్‌కు తొలిసారి సైనా దూరం
భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ తొలిసారి ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీలకు దూరమైంది. 2006 నుంచి క్రమం తప్పకుండా ఈ టోర్నీ ఆడుతున్న ఆమె ఈ ఏడాది మాత్రం తప్పుకుంది. స్పెయిన్‌లో ఈ నెల 12 నుంచి 19 వరకు ఈ టోర్నీ జరగనుంది. ప్రస్తుతం ఆమె మోకాలి గాయం నుంచి కోలుకుంటుంది. గత కొంతకాలంగా సైనా ఏ టోర్నీనీ పూర్తిస్థాయిలో ఆడలేకపోయింది. ఉబెర్ కప్, ఫ్రెంచ్ ఓపెన్‌లో ఆడేందుకు వచ్చి గాయంతో మధ్యలోనే వైదొలిగింది. -
తలకు బలంగా తగిలిన బంతి.. ఫీల్డ్‌లోనే కుప్పకూలాడు
Jeremy Solozano taken to hospital after blow to head.. వెస్టిండీస్- శ్రీలంక మధ్య జరుగుతున్న తొలి టెస్టులో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. విండీస్ క్రికెటర్ జెరెమీ సోలోజానో అనూహ్యరీతిలో గాయపడ్డాడు. ఆట తొలి సెషన్లో 24వ ఓవర్లో ఇది చోటుచేసుకుంది. రోస్టన్ చేజ్ వేసిన షార్ట్ డెలివరిని లంక కెప్టెన్ దిముత్ కరుణరత్నే షార్ట్‌లెగ్ దిశగా ఆడాడు. అయితే అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న జెరెమీ సోలోజానో హెల్మెట్‌కు తాకింది. అయితే షాట్ పవర్ఫుల్ కావడంతో హెల్మెట్ గ్రిల్స్ అదిరి తలకు బలంగా తాకింది. చదవండి: Tim Paine scandal: క్రికెట్‌కు తప్పని రాసలీలల చెదలు.. సెక్స్ స్కాండల్‌లో నలిగిన ఆటగాళ్లు దీంతో సోలోజానో ఫీల్డ్‌లోనే కిందపడిపోయి నొప్పితో విలవిల్లాడాడు. కాసేపటికి ఫిజియో వచ్చి అతన్ని పరీక్షించి వెంటనే ఆసుపత్రికి తరలించారు. కాగా జెరెమీ సోలోజానోకు టెస్టుల్లో ఇదే డెబ్యూ మ్యాచ్ కావడం విశేషం. ఈ ఘటనతో అటు లంక, విండీస్ క్రికెటర్లు ఆందోళనకు గురయ్యారు. ప్రస్తుతం సోలోజానోను స్కానింగ్, వైద్యపరీక్షల నిమిత్తం ఆసుపత్రిలో ఉంచారు. అతను తొందరగా కోలుకోవాలని క్రికెట్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేస్తున్న శ్రీలంక మూడో సెషన్లో 61 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. కెప్టెన్ కరుణరత్నే 90, మాథ్యూస్ 1 బ్యాటింగ్ ఆడుతున్నారు. అంతకముందు పాతుమ్ నిస్సంక 56 పరుగులు చేసి ఔటయ్యాడు. చదవండి: ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు.. 115 ఏళ్ల తర్వాత.. చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా బౌలర్ 🚨Injury Update 🚨 Debutant Jeremy Solozano was stretchered off the field after receiving a blow to his helmet while fielding. He has been taken to the hospital for scans. We are hoping for a speedy recovery 🙏🏽#SLvWI pic.twitter.com/3xD6Byz1kf — Windies Cricket (@windiescricket) November 21, 2021 Get Well soon Jeremy Solozano 🥺#SLvWI #SLvsWI #WIvSL pic.twitter.com/k5w2Zn7EFa — CRICKET VIDEOS 🏏 (@AbdullahNeaz) November 21, 2021 -
T20 World Cup 2021: సెమీస్‌కు ముందు ఇంగ్లండ్‌కు భారీ షాక్..
Tymal Mills Ruled Out Of T20 World Cup 2021: టీ20 ప్రపంచకప్-2021 కీలక దశకు ముందు ఇంగ్లండ్ జట్టుకు అతి భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ బౌలర్ తైమాల్ మిల్స్ గాయం కారణంగా టోర్నీ నుంచి నిష్క్రమించాడు. సోమవారం(నవంబర్ 1) శ్రీలంకతో మ్యాచ్‌లో 1.3 ఓవర్లు వేసిన మిల్స్.. తొడ కండరాలు పట్టేయడంతో మ్యాచ్ మధ్యలోనే వైదొలిగాడు. స్కానింగ్‌లో గాయం తీవ్రమైందిగా తేలడంతో అతను టోర్నీ నుంచి వైదొలుగుతాడని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) బుధవారం ప్రకటించింది. దీంతో ఈసీబీ అతని స్థానాన్ని రీస్ టాప్లేతో భర్తీ చేసింది. ఈ టోర్నీలో ఇంగ్లండ్ ఆడిన 4 మ్యాచ్‌ల్లో బరిలోకి దిగిన మిల్స్.. 15.42 సగటుతో నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే, ప్రస్తుత మెగా టోర్నీలో మోర్గాన్ సేన సూపర్ ఫామ్‌లో కొనసాగుతుంది. ఆడిన 4 మ్యాచ్‌ల్లోనూ భారీ విజయాలు సాధించి సెమీస్‌కు దూసుకెళ్లింది. టోర్నీలో ఇంగ్లండ్ మరో మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఇంగ్లీష్ జట్టు నవంబర్ 6న దక్షిణాఫ్రికాతో తలపడనుంది. చదవండి: పసికూనపై మార్టిన్ గప్తిల్ ప్రతాపం.. పలు రికార్డులు సొంతం -
T20 World Cup 2021: బంగ్లాదేశ్‌కు భారీ షాక్..
Shakib Al Hasan Ruled Out Of T20 World Cup 2021: టీ20 ప్రపంచ కప్-2021లో బంగ్లాదేశ్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలిగాడు. సూపర్-12లో ఆడిన 3 మ్యాచ్‌ల్లో ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించిన బంగ్లాదేశ్‌కు ఇది మరో మింగుడుపడని విషయం. కాగా, షకీబ్ ప్రస్తుత మెగా టోర్నీలో బంగ్లా తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. టోర్నీ మొత్తంలో 6 మ్యాచ్‌లు ఆడిన షకీబ్ 21.83 సగటుతో 131 పరుగులతో పాటు 11 వికెట్లు తీశాడు. బంగ్లాదేశ్‌కు ఈ టోర్నీలో మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. నవంబర్ 2న దక్షిణాఫ్రికా, 4న ఆస్ట్రేలియాతో బంగ్లాదేశ్ తలపడాల్సి ఉంది. చదవండి: క్రికెట్ ఆస్ట్రేలియాలో విషాదం.. గంటల వ్యవధిలో ఇద్దరు దిగ్గజాల కన్నుమూత -
న్యూజిలాండ్‌కు షాక్‌ల మీద షాక్‌లు.. గాయంతో మరో ఆటగాడు ఔట్
Lockie Ferguson Ruled Out Of T20 World Cup 2021: టీ20 ప్రపంచకప్-2021లో న్యూజిలాండ్ జట్టుకు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్ చేతిలో ఓటమిపాలై కుంగిపోయి ఉన్న ఆ జట్టుకు పుండు మీద కారం చల్లినట్లుగా గాయాల సమస్య పెద్ద తలనొప్పిగా మారింది. తొలుత పాక్‌తో మ్యాచ్ సందర్భంగా ఓపెనర్ మార్టిన్ గప్తిల్ గాయపడి భారత్‌తో కీలక మ్యాచ్‌కు దూరం కాగా.. తాజాగా ఆ జట్టు ప్రధాన పేసర్ ఫెర్గూసన్ టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. కాలి గాయంతో బాధపడుతున్న ఫెర్గూసన్‌కు ఎంఆర్ఐ స్కానింగ్‌లో ఫ్రాక్చర్ అని తేలడంతో వైద్యులు అతన్ని విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దీంతో న్యూజిలాండ్ బోర్డు ప్రపంచకప్ జట్టును నుంచి ఫెర్గూసన్‌ను తప్పించి, అతని స్థానంలో ఆడమ్ మిల్నేను జట్టులోకి తీసుకుంది. ఇదిలా ఉంటే, పొట్టి ప్రపంచకప్‌లో భాగంగా భారత్-న్యూజిలాండ్ మధ్య ఈనెల 31న జరగనున్న మ్యాచ్ ఇరు జట్లకు కీలకంగా మారింది. ఈ టోర్నీలో సెమీస్‌కు చేరాలంటే ఇరు జట్లకు ఈ మ్యాచ్‌లో తప్పకుండా గెలవడం చాలా ముఖ్యం. భారత్, న్యూజిలాండ్ జట్లు పాక్ చేతిలో పరాజయం పాలవ్వడమే ప్రస్తుత పరిస్థితికి కారణం. కాగా, గ్రూప్-2లో భారత్, న్యూజిలాండ్, పాకిస్థాన్, జట్లతో పాటు బలహీనమైన అఫ్గానిస్థాన్, స్కాట్లాండ్, నమీబియా జట్లు ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఆరు జట్ల నుంచి కేవలం రెండు జట్లకు మాత్రమే సెమీస్‌కు చేరే ఛాన్స్ ఉండడం.. పాక్ సెమీస్ బెర్తు దాదాపు ఖరారు కావడంతో మిగిలిన ఒక్క బెర్త్ కోసం భారత్, న్యూజిలాండ్ మధ్య పోటీ నెలకొంది. చదవండి: T20 WC 2021: అక్తర్‌కు ఘోర అవమానం.. లైవ్‌లో పరువు తీసిన హోస్ట్ -
టీమిండియాకు మరో బిగ్ షాక్.. ఆ స్టార్ ఆటగాడు దూరం!
Hardik Pandya Taken For Scan After Being Hit On Shoulder In Match Against Pakistan: టీ20 వరల్డ్‌కప్-2021లో భాగంగా ఆదివారం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా అనుహ్యంగా ఓటమి చెందింది. అయితే ఈ మ్యాచ్‌లో భారత జట్టు స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ చేస్తుండగా గాయపడ్డాడు. పాండ్యా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు 11 పరుగుల వద్ద అతడి కుడి భుజానికి గాయమైంది. దీంతో అతడు ఫీల్డింగ్‌కు రాలేదు. పాండ్యా స్ధానంలో ఇషన్ కిషన్ ఫీల్డింగ్ చేయడానికి వచ్చాడు. ఈ క్రమంలో హార్దిక్ పాండ్యాను స్కానింగ్‌కు పంపినట్లు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. దీంతో న్యూజిలాండ్‌తో జరిగే తదుపరి మ్యాచ్‌కు హార్దిక్ అందుబాటుపై సందిగ్దత నెలకొంది. కాగా ఈ మ్యాచ్‌లో కేవలం 11 పరుగులే చేసి హార్దిక్ పెవిలియన్‌కు చేరాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడి బ్యాటింగ్‌కు భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి.. 151 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్తాన్ ఓపెనర్లు మహ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజం చెలరేగడంతో అలవోకగా 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తద్వారా ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌పై టీమిండియా జైత్రయాత్రకు బ్రేక్ పడినట్లయింది. చదవండి: Ashish Nehra: రిజ్వాన్, బాబర్ చాలా బాగా బ్యాటింగ్ చేశారు.. అయితే.. -
సోహైబ్ మక్సుద్ ఔట్.. పాక్ జట్టులోకి సీనియర్ క్రికెటర్
Shoaib Malik Replaced By Sohaib Maqsood... టి20 ప్రపంచకప్ ప్రారంభానికి ముందే పాకిస్తాన్ జట్టుకు షాక్ తగిలింది. వెన్ను నొప్పితో బాధపడుతున్న బ్యాటర్ సోహైబ్ మక్సూద్ జట్టు నుంచి వైదొలిగాడు. కాగా మక్సూద్ స్థానంలో షోయబ్ మాలిక్‌ను ఎంపిక చేసినట్లు పీసీబీ ఒక ప్రకటనలో పేర్కొంది.నేషనల్ టి20 కప్‌లో ఆడుతున్న మక్సూద్ అక్టోబర్ 6న మ్యాచ్ ఆడుతుండగా వెన్నునొప్పితో ఇబ్బందిపడ్డాడు. మ్యాచ్ అనంతరం వైద్యులు అతన్ని పరీక్షలకు పంపారు. తాజాగా వచ్చిన ఎమ్ఆర్ఐ స్కాన్ రిపోర్ట్‌లో మక్సూద్ గాయం తీవ్రత ఎక్కువగా ఉందని తేలిందని.. కొన్నివారాల పాటు విశ్రాంతి తీసుకుంటే బాగుంటుందని సలహా ఇచ్చారు. ఇక మక్సూద్ స్థానంలో జట్టులోకి వచ్చిన షోయబ్ మాలిక్ 2007 టి20 ఆరంభ ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌కు కెప్టెన్‌గా వ్యవహరించి జట్టును ఫైనల్ చేర్చాడు. అనంతరం 2009 టి20 ప్రపంచకప్ విజేత పాకిస్తన్ జట్టులో సభ్యుడిగా ఉన్న షోయబ్ ఆ తర్వాత 2012, 2014, 2016లో టి20 ప్రపంచకప్‌లు ఆడాడు. సీనియర్ ఆల్‌రౌండర్‌గా పేరుపొందిన షోయబ్ మాలిక్ పాక్ తరపున 35 టెస్టులు, 287 వన్డేలు, 116 టి20లు ఆడాడు. చదవండి: T20 World Cup: ఓపెనర్‌గా సెలక్ట్ అయ్యానని విరాట్ భాయ్ చెప్పాడు! దీంతో పీసీబీ అతన్ని టి20 ప్రపంచకప్ జట్టు ప్రాబబుల్స్ నుంచి తప్పించినట్లు పేర్కొంది. కాగా సోహైబ్ మక్సూద్ పాకిస్తాన్ తరపున 29 వన్డేల్లో 781 పరుగులు.. 26 టి20ల్లో 273 పరుగులు సాధించాడు. కాగా టి20 ప్రపంచకప్‌కు సంబంధించి శుక్రవారం పీసీబీ సెలెక్టర్లు పాకిస్తాన్ జట్టులో మూడు మార్పులు చేశారు. మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్‌తో పాటు హైదర్ అలీ, ఫఖర్ జమాన్‌లు 15 మంది ప్రాబబుల్‌సలో చోటు దక్కించుకున్నారు. కాగా అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకు జరగనున్న టి20 ప్రపంచకప్ టోర్నీలో పాకిస్తాన్ తన తొలి మ్యాచ్‌ను టీమిండియాతో అక్టోబర్ 24న ఆడనుంది. చదవండి: T20 World Cup 2021: పాకిస్తాన్ టి20 జట్టులో మూడు మార్పులు.. ఆ ముగ్గురికి చోటు టి20 ప్రపంచకప్: పాకిస్తాన్ 15మందితో కూడిన జట్టు బాబర్ అజమ్ (కెప్టెన్), షాదాబ్ ఖాన్ (వైస్ కెప్టెన్), ఆసిఫ్ అలీ, ఫఖర్ జమాన్, హైదర్ అలీ, హారిస్ రౌఫ్, హసన్ అలీ, ఇమాద్ వసీం, మహ్మద్ హఫీజ్, మహ్మద్ నవాజ్, మహ్మద్ రిజ్వాన్, మొహమ్మద్ వసీం జూనియర్, సర్ఫరాజ్ అహ్మద్, షహీన్ షా అఫ్రిది, షోయబ్ మాలిక్ రిజర్వ్ ఆటగాళ్లు- కుష్దిల్ షా, షానవాజ్ దహాని, ఉస్మాన్ ఖాదిర్ -
ఇంగ్లండ్ జట్టుకు భారీ షాక్.. చారిత్రక సిరీస్‌కు స్టార్ ఆల్‌రౌండర్ దూరం
Ben Stokes To Miss Ashes Series 2021-22: ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌కు ముందు ఇంగ్లండ్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ చేతి వేలికి మరో సర్జరీ జరగడంతో యాషెస్ సిరీస్ నుంచి తప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది భారత్‌లో జరిగిన ఐపీఎల్-2021 తొలి దశ సందర్భంగా స్టోక్స్ గాయపడ్డాడు. ఆ సమయంలో అతను గాయానికి సర్జరీ చేయించుకున్నాడు. అయితే తాజాగా అదే చేతి వేలికి మరో సర్జరీ జరగడంతో అతను యాషెస్ నుంచి తప్పుకుంటాడని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి స్టోక్స్ పూర్తి ఫిట్‌గా ఉన్నా.. ఇప్పట్లో క్రికెట్ ఆడే అవకాశం మాత్రం లేదని ఓ నివేదిక వెల్లడించింది. ఈ విషయాన్ని స్టోక్స్ సైతం సూచనప్రాయంగా అంగీకరించాడు. బుధవారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫొటోను పోస్ట్ చేయగా.. అందులో అతను చేతి వేలికి బ్యాండేజీతో కనిపించాడు. ఈ ఫోటోలో స్టోక్స్ భార్య క్లేర్ కూడా ఉంది. కాగా, స్టోక్స్.. ఐపీఎల్లో గాయం తర్వాత మానసిక సమస్యల కారణంగా భారత్‌తో టెస్ట్ సిరీస్, ఐపీఎల్ సెకెండ్ ఫేస్, టీ20 ప్రపంచకప్ వంటి మెగా టోర్నీలకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, ఆస్ట్రేలియా వేదికగా జరిగే యాషెస్ సిరీస్‌లో పాల్గొనేందుకు ఇంగ్లండ్ జట్టు సిద్ధమైనట్లు ప్రముఖ వార్తా సంస్థ వెల్లడించింది. కరోనా కఠిన క్వారంటైన్ నిబంధనలను సడలించేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం ఒప్పుకోవడంతో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) ఈ మేరకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే స్టార్ ఆటగాళ్లు జోస్ బట్లర్, బెన్ స్టోక్స్‌లు ఈ సిరీస్‌కు దూరంగా ఉంటున్నట్లు సమాచారం. ఆసీస్-ఇంగ్లండ్ జట్ల మధ్య డిసెంబర్ 8 నుంచి జనవరి 18 వరకు యాషెస్ సిరీస్ జరుగనుంది. చదవండి: చరిత్ర తిరగరాసిన ఆర్సీబీ బౌలర్.. బుమ్రా రికార్డు బద్దలు -
టీ20 ప్రపంచకప్‌కు ముందు టీమిండియాకు బిగ్ షాక్..!
Varun Chakravarthy Dodgy Knees Became Biggest Head Ache For Team India: త్వరలో ప్రారంభంకానున్న టీ20 ప్రపంచకప్‌కు ముందు టీమిండియాకు ఓ షాకింగ్ వార్త పెద్ద తలనొప్పిగా మారింది. యువ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి మెగా టోర్నీలో ఆడటం అనుమానంగా ఉందని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం ఐపీఎల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున ఆడుతున్న వరుణ్..మోకాళ్ల నొప్పులతో సతమతమవుతున్నాడు. పెయిన్ కిల్లర్ లేకుండా అతను బరిలోకి దిగే పరిస్థితి లేదు. దీంతో పొట్టి ప్రపంచకప్‌కు అతను అందుబాటులో ఉంటాడా లేదా అన్నది అనుమానంగా మారింది. ఈ నేపథ్యంలో వరుణ్ స్థానంలో చహల్‌ను జట్టులోకి తీసుకునే అంశం బీసీసీఐ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. అక్టోబరు 10 వరకు తుది జట్లలో మార్పులు చేర్పులు చేసుకునేందుకు అవకాశం ఉన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, వరుణ్.. ప్రస్తుత ఐపీఎల్లో కేకేఆర్ తరఫున 13 మ్యాచ్‌ల్లో 15 వికెట్లతో సూపర్ ఫామ్‌లో కొనసాగుతున్నాడు. 30 ఏళ్ల ఈ మిస్టరీ స్పిన్నర్ టీమిండియా తరఫున 3 టీ20ల్లో 2 వికెట్లు, 27 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 33 వికెట్లు పడగొట్టాడు. చదవండి: T20 World Cup 2021: ఈ ఐదు తొలిసారిగా.. సరికొత్తగా.. ఆసక్తికర విశేషాలు -
T20 World Cup 2021: ఇంగ్లండ్‌కు బిగ్ షాక్.. స్టార్ ఆల్‌రౌండర్ దూరం
Sam Curran Ruled Out T20 World Cup 2021.. టి20 ప్రపంచకప్ 2021 ఆరంభానికి ముందు ఇంగ్లండ్ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. వెన్నునొప్పి కారణంగా స్టార్ ఆల్‌రౌండర్ సామ్ కరన్ ఇంగ్లండ్ టి20 ప్రపంచకప్ జట్టు నుంచి వైదొలిగాడు. సామ్ కరన్ స్థానంలో అతని సోదరుడు టామ్ కరన్‌ను తుది జట్టులోకి తీసుకున్నట్లు ఈసీబీ ప్రకటించింది. కాగా రీస్ టోప్లేను రిజర్వ్ ప్లేయర్‌గా ఎంపికచేసినట్లు తెలిపింది. ఇప్పటికే బెన్ స్టోక్స్ రూపంలో సేవలు కోల్పోయిన ఇంగ్లండ్ తాజాగా సామ్ కరన్ లాంటి నాణ్యమైన ఆల్‌రౌండర్‌ను కోల్పోవడం పెద్ద దెబ్బే అని చెప్పొచ్చు. ఇక సామ్ కరన్ ఇంగ్లండ్ తరపున 24 టెస్టుల్లో 815 పరుగులు.. 47 వికెట్లు, 11 వన్డేల్లో 141 పరుగులు.. 12 వికెట్లు, 16 టి20ల్లో 91 పరుగులు.. 16 వికెట్లు తీశాడు. చదవండి: T20 World Cup: కోహ్లి సేనకు అంత సీన్ లేదు.. మాకు అసలు పోటీనే కాదు ప్రస్తుతం ఐపీఎల్లో సీఎస్కే తరపున ఆడుతున్న సామ్ కరన్ శనివారం రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వెన్నునొప్పితో బాధపడ్డాడు. మ్యాచ్ అనంతరం సామ్ కరన్‌ను పరీక్షల కోసం స్కానింగ్‌కు పంపించారు. తాజాగా వెల్లడించిన రిపోర్ట్స్‌లో సామ్‌కు గాయం తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు తేలిందని ఈసీబీ తెలిపింది. ఈ మేరకు మరో రెండురోజుల్లో యూకేకు చేరుకోనున్న సామ్ కరన్‌ను తదుపరి మెడికల్ పరీక్షలకు పంపనున్నట్లు వెల్లడించింది. ఇంగ్లండ్ టి20 ప్రపంచకప్ జట్టు: ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), మొయిన్ అలీ, జానీ బెయిర్‌స్టో, సామ్ బిల్లింగ్స్, జోస్ బట్లర్, టామ్ కరన్, క్రిస్ జోర్డాన్, లియామ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ మలన్,టైమల్ మిల్స్, ఆదిల్ రషీద్, జాసన్ రాయ్, డేవిడ్ విల్లీ, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్ రిజర్వ్ ఆటగాళ్లు: లియామ్ డాసన్, రీస్ టోప్లే, జేమ్స్ విన్స్ -
సీఎస్కే ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఆ ప్లేయర్‌కు ఏం కాలేదు
Faf Du Plessis Is Alright Collision With Mustafizur Rahman.. ఐపీఎల్ 2021లో సీఎస్కే దుమ్మురేపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన సీఎస్కేకు మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. సీఎస్కే విజయాలలో ఓపెనర్ల పాత్ర కీలకమని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, డుప్లెసిస్‌లు ప్రతీ మ్యాచ్‌లోనూ ఘనమైన ఆరంభానిస్తూ జట్టను పటిష్ట స్థితిలో నిలుపుతున్నారు. రుతురాజ్ ఈ సీజన్లో ఇప్పటికే 500 పరుగుల మార్క్‌ను దాటగా.. డుప్లెసిస్460 పరుగులతో టాప్ 5లో కొనసాగుతున్నాడు. అయితే తాజాగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో డుప్లెసిస్ అనుకోకుండా గాయపడిన సంగతి తెలిసిందే. చదవండి: ఆఖరి ఓవర్ అంటే జడేజాకు ఇష్టమనుకుంటా.. అందుకే Courtesy: IPL Twitter సీఎస్కే బ్యాటింగ్ సమయంలో ముస్తాఫిజుర్ బౌలింగ్‌లో షాట్ ఆడిన డివిలియర్స్ పరుగు కోసం వచ్చాడు. అదే సమయంలో ముస్తాఫిజుర్ అక్కడే ఉండడం.. అతని కాళ్లకు డుప్లెసిస్ మెడ బలంగా తగలడంతో ఇద్దరు అక్కడే కూలబడ్డారు. అయితే డుప్లెసిస్ మెడకు గట్టిగా తగలడంతో కాసేపు అలానే కూర్చొండిపోయాడు. కాసేపటికి ఫిజియోథెరపీ వచ్చి అతని మెడకు మర్ధన చేశాడు. అయితే ఆ తర్వాత డుప్లెసిస్ తన ఇన్నింగ్స్‌కు కొనసాగించాడు. డుప్లెసిస్ గాయం తీవ్రత ఎంతనేది సీఎస్కే ఎక్కడ వెల్లడించలేదు. దీంతో డుప్లెసిస్ ఐపీఎల్ నుంచి పక్కకు తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సీఎస్కే యాజమాన్యం అభిమానులకు గుడ్‌న్యూస్ తెలిపింది. ''డుప్లెసిస్‌కు ఏం కాలేదని.. అతనిప్పుడు బాగానే ఉన్నాడని.. మెడనొప్పిపై తమకు ఏం చెప్పలేదని.. అతను నెట్స్‌లో బాస్కెట్ బాల్ ఆడుతూ ఉత్సాహంగా కనిపించాడు.'' అంటూ సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథన్ ప్రకటించాడు. ఈ సందర్భంగా డుప్లెసిస్ ఫోటోను షేర్ చేస్తూ .. ''డుప్లెసిస్ కొత్త ఉత్సాహంతో కనిపిస్తున్నాడు..'' అంటూ ట్విటర్లో తెలిపింది. Courtesy: IPL Twitter] కాగా పీఎస్ఎల్ 2021లో డుప్లెసిస్ ఇదే తరహాలో కంకషన్‌కు గురయ్యాడు. మ్యాచ్ సందర్భంగా బంతిని అందుకునే ప్రయత్నంలో తోటి ఫీల్డర్‌తో జరిగిన కొలిషన్‌లో డుప్లెసిస్ తీవ్రంగా గాయపడ్డాడు. 72 గంటల తర్వాత సీరియస్ ఇంజ్యురీ అని తేలడంతో డుప్లెసిస్ ఆసుపత్రి పాలయ్యాడు. ఆ తర్వాత కోలుకున్నప్పటికి మసక కంటిచూపుతో ఇబ్బంది పడడంతో హండ్రెడ్ టోర్నీకి పూర్తిగా దూరమవ్వాల్సి వచ్చింది. తాజాగా అదే తరహాలో డుప్లెసిస్ మరోసారి గాయపడడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే డుప్లెసిస్‌కు ఏం కాలేదంటూ.. మిగతా మ్యాచ్‌లు ఆడుతాడని యాజమాన్యం స్పష్టం చేయడంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. చదవండి: IPL 2021: వార్నర్‌కు పట్టిన గతే ఆ సీఎస్కే ఆటగాడికి కూడా పడుతుంది..! pic.twitter.com/YBKESsGzrv — Maqbool (@im_maqbool) October 2, 2021 -
హీరో రామ్ పోతినేనికి గాయాలు.. షూటింగ్‌కు బ్రేక్
Ram Pothineni Got Injured : హీరో రామ్ పోతినేని గాయాలపాలయ్యారు. జిమ్‌లో వర్కవుట్స్ చేస్తుండగా ఆయన మెడకు గాయమైంది. ఈ విషయాన్ని స్వయంగా రామ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. తనకు అయిన గాయాన్ని చూపిస్తూ ఫోటోను షేర్ చేశాడు. దీంతో 'రామ్ త్వరగా కోలుకోవాలి..గెట్ వెల్ సూన్' అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ప్రస్తుతం రామ్ లింగుస్వామి దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం తన బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కోసం రామ్ జిమ్‌లో వ్యాయామం చేస్తూ గాయాలపాలయ్యారు. RAPO19గా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం సెట్స్‌పై ఉంది. రామ్‌కి గాయం కావడంతో ప్రస్తుతం షూటింగ్‌కి బ్రేక్ ఇచ్చినట్లు తెలుస్తుంది. కృతిశెట్టి ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది. View this post on Instagram A post shared by RAm POthineni (@ram_pothineni) -
అర్జున్ టెండూల్కర్‌కు గాయం.. ఒక్క మ్యాచ్ ఆడకుండానే
Arjun Tendulkar Injury Ruled Out IPL 2021.. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ గాయంతో ఐపీఎల్ 2021లో మిగతా మ్యాచ్‌లకు దూరమయ్యాడు. గత డిసెంబర్లో జరిగిన వేలంలో అర్జున్ టెండూల్కర్‌ను ముంబై ఇండియన్స్ కనీస ధర రూ. 20 లక్షలకు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే అర్జున్ ముంబై తరపున ఒక్క మ్యాచ్‌లో కూడా బరిలోకి దిగలేదు. అలా ఐపీఎల్ ఆడకుండానే గాయం కారణంగా అర్జున్ తప్పుకోవాల్సి వచ్చింది. ఇక అర్జున్ ముంబై తరపున సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో రెండో టి20 మ్యాచ్‌లు ఆడాడు. చదవండి: IPL 2021: ఫామ్‌లో లేకపోతే అంతే.. మూలకు కూర్చోవాల్సిందే కాగా గాయంతో దూరమైన అర్జున్ టెండూల్కర్ స్థానంలో రైట్ ఆర్మ్ మీడియం పేసర్ సిమర్జీత్ సింగ్‌ను తీసుకున్నట్లు ముంబై ఇండియన్స్ తన ట్విటర్లో ప్రకటించింది. కాగా 23 ఏళ్ల సిమర్జీత్ సింగ్ దేశవాలి క్రికెట్లో 10 ఫస్ట్‌క్లాస్, 19 లిస్ట్ ఏ మ్యాచ్‌లు.. 15 టి20లు ఆడి మొత్తంగా 74 వికెట్లు పడగొట్టాడు. అయితే సిమర్జీత్ సింగ్ గత జూలైలో శ్రీలంకలో పర్యటించిన టీమిండియా జట్టుకు నెట్ బౌలర్‌గా ఎంపికయ్యాడు. చదవండి: IPL 2021: ఔటవ్వాల్సింది బతికిపోయాడు.. కృనాల్, రోహిత్ క్రీడాస్పూర్తికి రాహుల్ ఫిదా Ashwin Vs Morgan: మోర్గాన్ తప్పు లేదు.. అశ్విన్‌ను అడ్డుకునే హక్కు ఉంది 🚨 Squad Update 🚨 Right-arm medium pacer Simarjeet Singh will be replacing Arjun Tendulkar for the remainder of #IPL2021 📰 Read all the details 👇#OneFamily #MumbaiIndians https://t.co/AcfBJsYf2w — Mumbai Indians (@mipaltan) September 29, 2021 -
గాయం వేధిస్తున్నా పెయిన్ కిల్లర్ తీసుకుని మరీ ఆడాడు..
ఓవల్: గత కొంతకాలంగా వరుస వైఫల్యాలతో సతమతమవుతూ వస్తున్న టీమిండియా నయా వాల్ పుజారా ఇప్పుడిప్పుడే గాడిలో పడుతున్నట్లు కనపిస్తున్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్ట్‌లో సెంచరీకి చేరువగా వెళ్లిన పుజారా.. ప్రస్తుతం జరుగుతున్న ఓవల్ టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో కీలకమైన అర్ధసెంచరీ(61) సాధించి టీమిండియాను పటిష్ట స్థితికి చేర్చడంలో కీలకపాత్ర పోషించాడు. అయితే, తాజా ఇన్నింగ్స్ సందర్భంగా పుజారా కాలి మడమ గాయంతో బాధపడ్డాడు. వికెట్ల మధ్య పరుగులు తీసే సమయంలో అతని మడమ మడత పడటంతో నొప్పితో విలవిలలాడిపోయాడు. దీంతో మధ్యమధ్యలో పెయిన్ కిల్లర్‌ను తీసుకుంటూ మరీ ఇన్నింగ్స్‌ను కొనసాగించాడు. టీమిండియా పటిష్ట స్థితికి చేరిన అనంతరం రాబిన్సన్ బౌలింగ్‌లో మొయిన్ అలీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇదే ఓవర్లో భారత్ రోహిత్ వికెట్‌ను కూడా కోల్పోయింది. Cheteshwar Pujara rolls his ankle over. After receiving treatment, he is back on his feet and continues to bat💪💪#ENGvIND pic.twitter.com/yLsam8DpRu — BCCI (@BCCI) September 4, 2021 ఇదిలా ఉంటే, భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్ రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే 171 పరుగుల ఆధిక్యంలో ఉన్న కోహ్లి సేన భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తుంది. మరో ఏడు వికెట్లు చేతిలో ఉన్నాయి. ప్రస్తుతం క్రీజ్‌లో కోహ్లి(22 బ్యాటింగ్; 4 ఫోర్లు), రవీంద్ర జడేజా (9 బ్యాటింగ్; 2 ఫోర్లు)ఉన్నారు. వెలుతురు లేమి కారణంగా మూడో రోజు ఆట నిలిపి వేసే సమయానికి భారత్ 92 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 270 పరుగులు చేసింది. తద్వారా 171 పరుగుల కీలక ఆధిక్యాన్ని కూడగట్టుకుంది. భారత్ రెండో ఇన్నింగ్స్‌లో రోహిత్(256 బంతుల్లో 127;14 ఫోర్లు, సిక్స్) శతకంతో కదంతొక్కితే పుజారా (127 బంతుల్లో 61; 9 ఫోర్లు), కేఎల్ రాహుల్ (101 బంతుల్లో 46; 6 ఫోర్లు; 1 సిక్స్) తమ వంతు పాత్ర పోషించారు. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులకు ఆలౌట్ కాగా, 290 వద్ద ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. ఫలితంగా ఇంగ్లండ్‌కు 99 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. చదవండి: అచ్చం సెహ్వాగ్‌లాగే.. సచిన్ ఒక్కడే అత్యధికంగా ఇలా..! -
ఆండర్సన్ ఏంటా అంకిత భావం.. రక్తం కారుతున్నా పట్టించుకోవా..?
ఓవల్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ ఆట పట్ల తనకున్న అంకిత భావాన్ని మరోసారి ప్రదర్శించాడు. తొలి రోజు ఆటలో ఇన్నింగ్స్ 42 ఓవర్ బౌల్ చేస్తున్న జిమ్మీ.. మోకాళ్లకు రక్తపు గాయాలతో కనిపించాడు. రెండు మోకాళ్ల వద్ద ప్యాంట్ రక్తంతో తడిసిపోయింది. అయినప్పటికీ ఆండర్సన్ మైదానాన్ని వీడకుండా, తన కోటా ఓవర్‌ను పూర్తి చేశాడు. ఈ సన్నివేశం టీవీల్లో స్పష్టంగా కనిపించడంతో సోషల్‌మీడియాలో వ్యాప్తంగా ఆండర్సన్పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆట పట్ల ఈ వెటరన్ క్రికెటర్‌కు ఉన్న అంకితభావానికి హ్యాట్సాఫ్ అంటూ నెటిజన్లు ఆకాశానికెత్తుతున్నారు. ఆండర్సన్ ఏంటా అంకిత భావం.. రక్తం కారుతున్నా పట్టించుకోవా..? అంటూ మరికొందరు కొనియాడుతున్నారు. కాగా, ఈ గాయలు ఎప్పుడు తగిలాయన్నది టీవీల్లో కనబడలేదు. బహుళా ఫీల్డింగ్ చేసేటప్పుడు అతను ఈ గాయాల బారిన పడి ఉండవచ్చని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయి 191 పరుగులకు ఆలౌటైంది. కోహ్లి(50), శార్దూల్ ఠాకూర్(57) రాణించడంతో టీమిండియా ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ముఖ్యంగా శార్దూల్ ఠాకూర్ ఆఖర్లో బౌండరీలు, సిక్సర్లతో చెలరేగిపోయాడు. 31 బంతుల్లో 6 ఫోర్లు, 3 భారీ సిక్సర్ల సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఇంగ్లండ్ బౌలర్లలో వోక్స్ 4, రాబిన్సన్ 3, ఆండర్సన్, ఓవర్టన్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఇంగ్లండ్‌కు టీమిండియా రివర్స్ కౌంటరిచ్చింది. టీమిండియా పేసు గుర్రం బుమ్రా చెలరేగిపోవడంతో ఇంగ్లీష్ జట్టు 6 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. బుమ్రా నిప్పులు చెరిగే బంతులతో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌పై విరుచుకుపడ్డాడు. టీ విరామానికి ముందు ఇంగ్లండ్ స్కోర్ 11/2. చదవండి: అందుకే మనోళ్లు 'బ్లాక్ రిబ్బన్స్'తో బరిలోకి దిగారు.. -
మూడో టెస్ట్‌కు ముందు ఇంగ్లండ్ జట్టుకు భారీ షాక్..!
లండన్: టీమిండియాతో బుధవారం నుంచి ప్రారంభంకానున్న మూడో టెస్ట్‌కు ముందు ఇంగ్లండ్ జట్టుకు భారీ షాక్ తగిలింది. భుజం గాయంతో ఆ జట్టు స్టార్ పేసర్ మార్క్ వుడ్ హెడింగ్లీ టెస్ట్‌కు దూరమయ్యాడు. లార్డ్స్ టెస్ట్ నాలుగో రోజు ఆటలో ఈ ఇంగ్లీష్ పేసర్ గాయపడ్డాడు. మూడో టెస్ట్ సమయానికి అతడు కోలుకుంటాడని ఇంగ్లండ్ జట్టు యాజమాన్యం భావించింది. అయితే వుడ్ పూర్తి ఫిట్నెస్ సాధించలేకపోవడంతో అతను మూడో టెస్ట్‌కు దూరంగా ఉంటాడని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) ప్రకటించింది. అయితే మార్క్ వుడ్ జట్టుతోనే ఉంటాడని, వైద్యుల పర్యవేక్షణలో కోలుకోవడంపై దృష్టిసారిస్తాడని ఈసీబీ వెల్లడించింది. మూడో టెస్ట్ అనంతరం అతనికి మరోసారి ఫిట్నెస్ పరీక్ష నిర్వహిస్తామని, అప్పటికీ కోలుకోలేకపోతే సిరీస్ నుంచి తప్పిస్తామని పేర్కొంది. కాగా, గాయాల కారణంగా ఇప్పటికే స్టువర్ట్ బ్రాడ్, జోఫ్రా ఆర్చర్, క్రిస్ వోక్స్, బెన్ స్టోక్స్ లాంటి స్టార్ పేసర్ల సేవలను కోల్పోయిన ఇంగ్లండ్ జట్టును తాజాగా వుడ్‌కు తగిలిన గాయం మరింత కలవరపెడుతోంది. భారత్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో రెండు టెస్ట్‌ల అనంతరం 0-1తో వెనుకబడిన రూట్ సేనకు ఇది పెద్ద ఎదురుదెబ్బ అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చదవండి: ఈ టీమిండియా క్రికెటర్లు ఫ్యాట్‌గా ఉంటే ఎలా ఉండేవారో ఓ లుక్కేయండి..! -
బ్రేకింగ్: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి గాయం
సాక్షి, విజయవాడ: కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డికి గాయమైంది. కారు ఎక్కుతుండగా కిషన్‌రెడ్డి తలకు డోర్ తగలడంతో గాయం తగిలింది. విజయవాడలో గురువారం జరిగిన జన ఆశీర్వాద సభ ముగించుకుని వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రథమ చికిత్స తీసుకుని తెలంగాణకు బయల్దేరారు. అయితే కార్యకర్తల అత్యుత్సాహంతో ఈ ఘటన జరిగింది. కారు ఎక్కేముందు ఫొటోల కోసం బీజేపీ కార్యకర్తలు ప్రయత్నించిన సమయంలో కారు డిక్కీ తీసి వేస్తున్న సమయంలో గాయమైంది. అయితే గాయాన్ని లెక్కచేయకుండా తెలంగాణలోని నల్లబండగూడెం నుంచి జన ఆశీర్వాదయాత్రకు బయల్దేరారు. కోదాడ బహిరంగ సభలో సాయంత్రం కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. అంతకుముందు కిషన్ రెడ్డి ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. ‘కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక తెలుగు ప్రజల ఆశీర్వాదం కోసం వచ్చా. నిన్న తిరుపతి వెంకన్నను, ఇవాళ దుర్గమ్మను దర్సించుకున్నా. దేశ సంస్కృతీసాంప్రదాయాలను పరిరక్షించాలని మోడీ అకాంక్షించారు. వరంగల్‌లోని వీరభద్ర ఆలయాన్ని యునెస్కొ హెరిటేజ్ సెంటర్‌గా గుర్తించింది. రానున్న రోజుల్లో ఏపీలో 126 కేంద్రాలున్నాయి. వాటిని రాష్ట్ర ప్రభుత్వం తో చర్చించి అభివృద్ధి చేస్తాం. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్ధలను పిలిచి సీఎస్ఆర్ ఫండ్ కింద అభివృద్ధి చేస్తాం. పర్యాటక శాఖ చాలా ఛాలెంజ్‌తో జూడుకుంది. రెండేళ్లుగా కోవిడ్‌తో టూరిజం దెబ్బతింది’ అని తెలిపారు. జనవరి 1వ తేదీ నాటికి కోవిడ్ తగ్గగానే పర్యాటకాన్ని మరింత అభివృద్ధి చేస్తాం. భారత్ దర్శన్ ద్వారా చారిత్రాత్మక కట్టడాల విశిష్టతను అందరికీ తెలిపేలా కార్యక్రమాలు చేపడతాం. పర్యాటక శాఖ ద్వారా నా వంతు సహకారం తెలుగు రాష్ట్రాలకు తెలుగువాడిగా అందిస్తా. ఏపీ, తెలంగాణ మోదీకి రెండు కళ్లులాంటివి. సీఎం జగన్ మర్యాదపూర్వకంగానే ఆహ్వానించారు. తెలుగువాడికి కేంద్రమంత్రి అవకాశం రావడంతోనే తేనేటి విందుకు ఆహ్వానించారు. దుర్మమ్మ ఆలయాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు నా సహకారం అందిస్తా’ అని తెలిపారు. చదవండి: కంటి ఆపరేషన్ చేయించుకున్న రాష్ట్రపతి చదవండి: రుణాల ఎగవేత: కార్వీ ఎండీ పార్థసారథి అరెస్ట్ -
కోహ్లీ సేనకు భారీ షాక్.. యువ ఆల్‌రౌండర్ దూరం..?
డర్హమ్: ఇంగ్లండ్ పర్యటనలో కోహ్లీ సేనను గాయాల బెడద వేధిస్తోంది. ఇప్పటికే ఓపెనర్ శుభ్‌మన్ గిల్ కాలి గాయంతో సిరీస్ నుంచి అర్దంతరంగా వైదొలగగా, బుధవారం స్టాండ్ బై బౌలర్ ఆవేశ్ ఖాన్ తీవ్రంగా గాయపడ్డాడు. తాజాగా ఈ జాబితాలో యువ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ కూడా చేరాడు. టీమిండియాతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో కౌంటీ సెలెక్ట్ ఎలెవెన్ తరఫున బరిలోకి దిగిన సుందర్.. గురువారం ఆటలో గాయపడినట్లు సమాచారం. అతని చేతి వేలికి గాయమైందని, అయితే గాయం తీవ్రతపై స్పష్టత లేదని, స్కానింగ్ తీసిన తర్వాతే గాయంపై క్లారిటీ వస్తుందని ప్రముఖ వార్తా సంస్థ పేర్కొంది. గాయంతో సుందర్ పడుతున్న ఇబ్బంది చూస్తే.. వేలు విరిగినట్లు అర్థమవుతుందని సదరు సంస్థ తెలిపింది. ఇదే జరిగితే ఇంగ్లండ్ టూర్ నుంచి ఈ యువ ఆల్‌రౌండర్ తప్పుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఇదిలా ఉంటే, ఆగస్టు 4 నుంచి ఇంగ్లండ్‌తో ప్రారంభమయ్యే ఐదు టెస్ట్‌ల సిరీస్‌కు సన్నాహకంగా కౌంటీ ఎలెవన్‌తో జరుగుతున్న మూడు రోజు వార్మప్ మ్యాచ్‌లో అవేశ్ ఖాన్‌తో పాటు వాషింగ్టన్ సుందర్ గాయపడ్డారు. ఈ మ్యాచ్‌లో కౌంటీ సెలెక్ట్ ఎలెవన్ తరఫున అవేశ్ ఖాన్, సందర్ బరిలోకి దిగారు. ఆ జట్టులోని ఆటగాళ్లు అందుబాటులో లేకపోవడంతో ఈ ఇద్దరు బరిలోకి దిగాల్సి వచ్చింది. అయితే తొలి రోజు ఆటలో ఇన్నింగ్స్ 10వ ఓవర్‌ను అవేశ్ ఖాన్ బౌలింగ్ చేయగా.... విహారి కొట్టిన రిటర్న్ షాట్‌ను ఆపే ప్రయత్నంలో అతని ఎడమ చేతి బొటన వేలుకు గాయమైంది. స్కానింగ్‌లో అవేశ్ ఖాన్ వేలు విరిగినట్లు తేలింది. అతను కోలుకోవడానికి కనీసం నెల రోజులకు పైగా సమయం పడుతుందని బీసీసీఐ తెలిపింది. దీంతో అతని ఇంగ్లండ్ పర్యటన అర్థంతరంగా ముగిసింది. తాజాగా సుందర్ సైతం అదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. కాగా, 24 మంది సభ్యుల జట్టులో ముగ్గురు ఆటగాళ్లు గాయాల బారిన పడటం కోహ్లీ సేనను కలవరపెడుతోంది. మరోవైపు శ్రీలంక పర్యటనలో ఉన్న పృథ్వీషా, దేవదత్ పడిక్కల్‌ను ఇంగ్లండ్‌కు పంపాలని కోహ్లీ సేన చేసిన విజ్ఞప్తిని సెలెక్టర్లు తిరస్కరించిన విషయం తెలిసిందే. -
లంక జట్టుకు మరో షాక్.. గాయం కారణంగా స్టార్ క్రికెటర్ ఔట్
కొలొంబో: భారత్‌తో జరుగబోయే పరిమిత ఓవర్ల సిరీస్‌లకు శ్రీలంక సీనియర్ బ్యాట్స్‌మెన్ కుశాల్ పెరీరా దూరం కానున్నాడు. ఇటీవల ఇంగ్లండ్‌తో ముగిసిన సిరీస్‌కి కెప్టెన్‌గా వ్యవహరించిన కుశాల్ పెరీరా.. సెంట్రల్ కాంట్రాక్ట్ విషయంలో ఆ దేశ క్రికెట్ బోర్డు పెద్దలతో విభేదించిన విషయం తెలిసిందే. అయితే.. అదే సమయంలో అతని భుజానికి కూడా గాయం కావడంతో అతను సిరీస్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. కుశాల్ పెరీరా గాయాన్ని పరిశీలించిన వైద్యులు కనీసం ఆరు వారాలు విశ్రాంతి అవసరమని సూచించినట్లు తెలుస్తోంది. దీంతో.. జులై 18 నుంచి 29 వరకు టీమిండియాతో జరుగనున్న సిరీస్‌కు అతను దూరంగా ఉండటం ఖరారైంది. ఇదిలా ఉంటే, ధవన్ సేనతో సిరీస్ కోసం లంక జట్టును ఇంకా ప్రకటించలేదు. కాగా, 2013లో శ్రీలంక జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన కుశాల్ పెరీరా.. ఇప్పటి వరకూ 22 టెస్టులు, 107 వన్డేలు, 49 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఈ క్రమంలో 8 సెంచరీలు నమోదు చేసిన అతను.. నమ్మదగిన ఓపెనర్, వికెట్ కీపర్‌గా ఎదిగాడు. కుశాల్ పెరీరా స్థానంలో భారత్‌తో సిరీస్‌కు శనక కెప్టెన్‌గా ఎంపికయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ విషయమై లంక క్రికెట్ బోర్డు నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. -
విషాదం: ఊహించని రీతిలో మృత్యువు ఒడికి..
ఆ యువ ఆటగాడి జీవితాన్ని విధి విచిత్రంగా కాటేసింది. సంబురంగా గడుపుతున్న టైంలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఆ ఘటనతో అతను తీవ్రంగా గాయపడగా.. కొన ఊపిరితో మూడుగంటలు పోరాడి మరీ ప్రాణం విడిచాడు. మాటిస్ కివ్‌లెనిక్స్(24)..లాత్వియాకు చెందిన ఐస్ హకీ ఆటగాడు. నేషనల్ హాకీ లీగ్‌లో కొలంబస్ బ్లూ జాకెట్స్ తరపున గోల్టెండర్(గోల్‌ను అడ్డుకునే క్రీడాకారుడు)గా అతనికి మాంచి ఫ్యాన్‌ఫాలోయింగ్ ఉంది. తొమిదేళ్ల కెరీర్లో జట్టుకు మంచి సేవలు అందించాడు. అలాంటి టాలెంటెడ్ ఆటగాడి జీవితం అర్థాంతరంగా ముగిసింది. ఆదివారం రాత్రి బ్లూ జాకెట్స్ కోచ్ మెన్సీ లెగస్ ఇంట్లో(మిషిగాన్)లో పార్టీ జరిగింది. పటాకుల్ని పేల్చి సంబురాలు చేసుకుంది టీం. ఆ టైంలో కివ్‌లెనిక్స్ సహా ఆటగాళ్లంతా హాట్ టబ్‌లో కూర్చుని ముచ్చటించుకుంటున్నారు. అయితే పటాకులు ఒక్కసారిగా ఆటగాళ్ల వైపు దూసుకొచ్చాయి. దీంతో తప్పించుకునే ప్రయత్నంలో అంతా తలోదిక్కు పరిగెత్తారు. అయితే కాలు జారి బాత్ టబ్‌లో పడిన కివ్‌లెనిక్స్.. గాయపడ్డ విషయాన్ని తోటి టీం మేట్స్ గుర్తించారు. హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. తొలుత బాత్ టబ్‌లో పడిపోవడంతో అతని తలకు గాయమై చనిపోయి ఉంటాడని డాక్టర్లు భావించారు. అయితే దూసుకొచ్చిన ఫైర్వర్క్స్ మోటర్ బలంగా ఛాతిని ఢీకొట్టడంతో.. అంతర్గతంగా గాయాలై చనిపోయాడని శవపరీక్షలో తేలింది. కాగా, ఈ యువ ఆటగాడి దుర్మరణంపై క్లబ్‌తో పాటు నేషనల్ హాకీ లీగ్ సంతాపం వ్యక్తం చేసింది. కివ్‌లెనిక్స్ లాత్వియా తరపున పలు ఇంటర్నేషనల్ టోర్నమెంట్లో పాల్గొన్నాడు. ఈ మే-జూన్‌లో జరిగిన ప్రపంచ టోర్నమెంట్లో కెనెడాపై లాత్వియా తొలి విజయానికి కివ్‌లెనిక్స్ షూట్ అవుట్ కారణం కావడం విశేషం. -
టీమిండియాకు గట్టి షాక్.. గాయంతో యువ ఓపెనర్ ఔట్..?
లండన్: ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌కు ముందు టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ సిరీస్ మొత్తానికి దూరమయ్యే సూచనలు కనబడుతున్నాయి. ఈ విషయాన్ని బీసీసీఐ ప్రతినిధి ఒకరు ప్రముఖ వార్త సంస్థ పీటీఐకి తెలియజేశారు. 21 ఏళ్ల గిల్.. కాలి పిక్క కండరాల్లో గాయంతో బాధపడుతున్నాడని, గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో శస్త్రచికిత్స చేయించాల్సిన పరిస్థితి ఏర్పడిందని, దీంతో అతను ఇంగ్లండ్‌తో జరిగే ఐదు టెస్ట్‌ల సిరీస్‌కు అందుబాటులో ఉండకపోవచ్చని ఆయన వెల్లడించారు. అయితే, గిల్ గాయంపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. మరోవైపు గిల్‌కు ప్రత్యామ్నాయంగా మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్, హనుమ విహారిలతో పాటు అభిమన్యు ఈశ్వరన్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడ్డ గిల్ ప్రస్తుతం ఫిజియో నితిన్ పటేల్ పర్యవేక్షణలో ఫిట్నెస్ మెరుగుపరుచుకునే పనిలో ఉన్నట్లు సమాచారం. ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌కు మరో నెల రోజుల గడువు ఉన్న నేపథ్యంలో గిల్, గాయం నుంచి కోలుకునే అవకాశాలు కూడా లేకపోలేదు. టెంట్ బ్రిడ్జ్‌లో ఆగస్టు 4 నుంచి భారత్, ఇంగ్లండ్ మధ్య తొలి టెస్ట్ ప్రారంభంకానుంది. ఈ ఐదు టెస్ట్‌ల సిరీస్‌తోనే డబ్ల్యూటీసీ సెకండ్ ఎడిషన్ ప్రారంభంకానుంది. కాగా, శుభ్‌మన్ గిల్ ఇప్పటి వరకు 8 టెస్టుల్లో టీమిండియాకు ప్రాతనిధ్యం వహించాడు. 3 అర్ధశతకాల సాయంతో 31.84 సగటుతో 414 పరుగులు చేశాడు. -
టీమిండియాకు షాక్.. స్టార్ ఆటగాడికి గాయం
సౌథాంప్టన్: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ హోదాను తృటిలో చేజార్చుకున్న బాధలో ఉన్న టీమిండియాకు మరో షాక్ తగిలింది. స్టార్ ఆటగాడు, సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ గాయపడ్డాడు. అతడి కుడి చేతి మధ్య, ఉంగరపు వేళ్లకు గాయాలవ్వడంతో కుట్లు వేశారు. దీంతో అతను ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్‌కు అందుబాటులో ఉంటాడో లేదోనన్న అనుమానాలు మొదలయ్యాయి. అయితే ఈ విషయమై బీసీసీఐ మాత్రం ధీమాగా ఉంది. ఇషాంత్ తొలి టెస్ట్ లోపు కోలుకుంటాడని ఆశాభావం వ్యక్తం చేస్తుంది. కాగా, డబ్ల్యూటీసీ ఫైనల్ రెండో ఇన్నింగ్స్‌లో తన బౌలింగ్‌లోనే ఓ బంతిని ఆపే క్రమంలో ఇషాంత్ గాయపడ్డాడు. అతని చేతి వేళ్లకు గాయాలయ్యాయి. తీవ్రంగా రక్తస్రావం కావడంతో వెంటనే అతను మైదానాన్ని వీడాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియాపై న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే. కాగా, ఇంగ్లండ్‌తో తొలి టెస్ట్‌కు మరో ఆరు వారాల సమయం ఉన్న నేపథ్యంలో అప్పట్లోగా ఇషాంత్ పూర్తిగా కోలుకుంటాడని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. డబ్ల్యూటీసీ ఫైనల్ అయ్యాక టీమిండియాకు 20 రోజుల విరామం లభించనుంది. ఆటగాళ్లు తమ కుటుంబ సభ్యులతో కలిసి గ్రేట్ బ్రిటన్ పరిధిలో విహరించే అవకాశాన్ని బీసీసీఐ కల్పించింది. దీంతో గురువారం సాయంత్రమే ఆటగాళ్లంతా సౌథాంప్టన్ నుంచి లండన్ బయల్దేరారు. చదవండి: కెప్టెన్ కోహ్లీని ఘోరంగా అవమానించిన కివీస్ వెబ్సైట్ -
మైదానంలో ఆటగాడికి గాయం.. ప్రత్యర్ధి అభిమానులు ఏం చేశారో తెలుసా..?
కోపెన్‌హెగెన్: ఆట శత్రువులను సైతం దగ్గరికి చేస్తుందనటానికి ఇప్పుడు మనం చూడబోయే వీడియోనే ప్రత్యక్ష ఉదాహరణ. యూరోకప్ 2020 ఫుట్‌బాల్ పోటీల్లో భాగంగా ఫిన్లాండ్, డెన్మార్క్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ అపురూప ఘట్టం చోటు చేసుకుంది. అనూహ్యంగా చోటు చేసుకున్న ఈ ఘటన క్రీడా ప్రేమికులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. వివరాల్లోకి వెళితే.. ఈ మ్యాచ్ తొలి అర్ధభాగంలో డెన్మార్క్ స్టార్ ప్లేయర్ క్రిస్టియన్ ఎరిక్సన్ గాయపడ్డాడు. గ్రౌండ్‌లోనే కుప్పకూలిపోయాడు. దీంతో అతన్ని స్ట్రెచర్‌పై బయటకు తీసుకెళ్లాల్సి వచ్చింది. ఈ సమయంలో ఎరిక్సన్ కెమెరా కంట పడకుండా డెన్మార్క్ ఆటగాళ్లంతా చుట్టూ రక్షణగా నిలిచారు. ఇది గమనించిన ఫిన్లాండ్ అభిమానులు తమ చేతుల్లోని జాతీయ జెండాలను డెన్మార్క్ ఆటగాళ్లకు ఇచ్చారు. Prayers for Christian Eriksen 🙏 Finland fans gave their flags after Christian Eriksen collapsed during the match 🇫🇮 Wishing him speedy recovery. pic.twitter.com/LZ3hSn4Gka — Nigel D'Souza (@Nigel__DSouza) June 12, 2021 వాటి సాయంలో డెన్మార్క్ క్రీడాకారులు ఎరిక్సన్ను మైదానం బయటకు తీసుకెళ్లారు. ఈ సమయంలో ఇరు దేశాల అభిమానులు క్రిస్టియన్ ఎరిక్సన్ పేరును స్మరిస్తూ.. హర్షధ్వానాలు చేశారు. కాగా, ఫిన్లాండ్ అభిమానులు చూపిన ఔదార్యం క్రీడాభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. సోషల్ మీడియా వేదికగా ఆ దేశ అభిమానులపై ప్రశంసల వర్షం కురుస్తుంది. నిజమైన క్రీడా ప్రేమికులు తమ అభిమానాన్ని ఇలానే చాటుతారంటూ కామెంట్ల వర్షం కురుస్తుంది. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో ఫిన్లాండ్ 1-0 తేడాతో డెన్మార్క్‌పై విజయం సాధించింది. సెకండాఫ్‌లో ఫిన్లాండ్ ప్లేయర్ జోయెల్ పోజాన్పాలో గోల్ చేసి, తమ జట్టుకు అపురూప విజయాన్ని అందించాడు. చదవండి: పాపం మనీశ్ పాండే.. అవకాశాలివ్వకుండా తొక్కేశారు! -
WTC FINAL: టీమిండియాకు భారీ షాక్.. కెప్టెన్ కోహ్లీకి గాయం?
సౌతాంప్టన్: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు ముందు టీమిండియాకు ఆందోళన కలిగించే వార్త వెలువడింది. గురువారం నెట్ ప్రాక్టీస్ సందర్భంగా జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ గాయపడినట్లు తెలుస్తుంది. నెట్స్‌లో పేసర్ మహ్మద్ షమీ విసిరిన బౌన్సర్ కోహ్లీ పక్కటెముకలను తీవ్రంగా గాయపరిచిందని, దీంతో అతను మూడు నుంచి ఆరు వారాల పాటు క్రికెట్‌కు దూరం కావాల్సి వస్తుందని జాతీయ మీడియాలో ప్రచారం సాగుతోంది. అయితే దీనిపై ఇప్పటి వరకూ ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ఒకవేళ కోహ్లీకి గాయం నిజమే అయితే, అది టీమిండియాకు గట్టి ఎదురు దెబ్బేనని క్రికెట్ పండితులు అభిప్రాయపడుతున్నారు. గత రెండు రోజులుగా టీమిండియా సభ్యులంతా కలిసి ప్రాక్టీస్ చేస్తున్న నేపథ్యంలో గురువారం కోహ్లీ, షమీతో పాటు బుమ్రా, గిల్, ఇషాంత్, పుజారాలు నెట్స్‌లో చెమటోడ్చారు. ఈ నెల 18 నుంచి భారత్, న్యూజిలాండ్‌ల మధ్య డబ్యూటీసీ ఫైనల్ ప్రారంభం కానుండగా.. టీమిండియా ఆటగాళ్లు ప్రిపరేషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఫైనల్‌కు ముందు ఎటువంటి ప్రాక్టీస్ మ్యాచ్ లేకపోవడంతో ఆటగాళ్లంతా నెట్స్‌లోనే తీవ్రంగా శ్రమిస్తున్నారు. మరోవైపు సౌతాంప్టన్‌లోని మేఘావృతమైన వాతావరణానికి అలవాటు పడేందుకు జట్టు సభ్యులు ఎక్కువ సమయాన్ని గ్రౌండ్‌లోనే గడుపుతున్నారు. చదవండి: నాడు అంతర్జాతీయ అథ్లెట్.. నేడు దినసరి కూలీ -
కేన్ విలియమ్సన్ మోచేతికి గాయం.. కివీస్‌లో కలవరం
బర్మింగ్హమ్: న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మోచేతి గాయంతో బాధపడుతున్నాడు. ఇంగ్లండ్‌తో జరగుతున్న టెస్టు సిరీస్‌లో మొదటి టెస్టు ఆఖరిరోజు అతని ఎడమ మోచేతికి గాయం అయింది. వెంటనే ఫిజియో వచ్చి పరీక్షించి గాయం తీవ్రత పెద్దగా లేదని.. రెండ్రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని తెలిపాడు. కానీ కేన్ గాయం కివీస్‌ను కలవరానికి గురిచేస్తుంది. గాయం తీవ్రత ఎక్కువగా లేకున్నా.. టీమిండియాతో మరో 9 రోజుల్లో ఐసీసీ ప్రపంచటెస్టు చాంపియన్‌షిప్ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో విలియమ్సన్కు గాయం తిరగబెడితే పరిస్థితి ఏంటని కివీస్ ఆలోచనలో పడింది. ఇదే విషయమై కివీస్ కోచ్ గ్యారీ స్టెడ్ స్పందించాడు.'' కేన్ మోచేతి గాయంలో పెద్దగా తీవ్రత లేదు. ఇంగ్లండ్‌తో జరగనున్న రెండో టెస్టుకు కేన్ ఆడుతాడా లేదా అనేది ఇంకా నిర్ణయించలేదు. అతని పరిస్థితి గమనించి నిర్ణయం తీసుకుంటాం. అయితే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఇంకా తొమ్మిది రోజులు సమయం ఉండడంతో విలియమ్సన్కు ఎలాంటి ఇబ్బంది లేదు. ఆ సమయానికి అతను పూర్తి ఫిట్నెస్తో బరిలోకి దిగుతాడు. ఇక తొలి మ్యాచ్‌లో ఆడిన మిచెల్ సాంట్నర్ ఎడమ చూపుడువేలుకు గాయం కావడంతో రెండో టెస్టు ఆడడం లేదు.. అతని స్థానంలో బౌల్ట్ తుది జట్టులోకి రానున్నాడు.'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఇంగ్లండ్‌తో జరిగిన మొదటి టెస్టులో న్యూజిలాండ్ అద్భుత ప్రదర్శన నమోదు చేసినా.. వర్షం అంతరాయంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. కివీస్ ఓపెనర్ డెవన్ కాన్వే సూపర్ సెంచరీ సాధించి డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు తన సత్తా ఏంటో చూపించాడు. అయితే కేన్ విలియమ్సన్ మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. తొలి ఇన్నింగ్స్‌లో 13, రెండో ఇన్నింగ్స్‌లో సింగిల్ రన్‌కే అవుటయ్యాడు. కాగా కేన్ రెండుసార్లు జేమ్స్ అండర్సన్ బౌలింగ్‌లో వెనుదిరగడం విశేషం. ఇక ఇరు జట్ల మధ్య రెండో టెస్టు జూన్ 10న ఎడ్జ్‌బాస్టన్ వేదికగా మొదలుకానుంది. ఇక ప్రతిష్టాత్మక ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ టీమిండియా, కివీస్‌ల మధ్య జూన్ 18 నుంచి 22 వరకు సౌతాంప్టన్ వేదికగా జరగనుంది. చదవండి: WTC Final : లెజెండ్‌తో నేను సిద్ధంగా ఉన్నా WTC: 13 ఏళ్ల క్రితం సెమీస్‌లో.. ఇప్పుడు ఫైనల్లో -
తొలి టెస్ట్‌కు ముందు ఇంగ్లండ్‌కు గట్టి షాక్..
లండన్: న్యూజిలాండ్‌తో రేపటి నుంచి (జూన్ 2) ప్రారంభంకానున్న తొలి టెస్ట్‌కు ముందు ఇంగ్లాండ్‌కు గట్టి షాక్ తగిలింది. నెట్ ప్రాక్టీస్ సందర్భంగా ఆ జట్టు సారధి జో రూట్ గాయపడ్డాడు. బ్యాటింగ్ సాధన చేసేటప్పుడు అతని చేతికి గాయంకావడంతో వెంటనే అతను నెట్స్ నుంచి వెళ్లిపోయాడు. నెట్స్‌లో డాగ్ థ్రోయర్ ద్వారా కోచ్ క్రిస్ సిల్వర్‌వుడ్ సంధించిన బంతి నేరుగా కుడి చేతిని తాకడంతో రూట్ కొద్దిసేపు బాధతో విలవిలలాడిపోయాడు. అసిస్టెంట్ కోచ్ పాల్ కొలింగ్‌వుడ్ సహకారంతో అతను గ్రౌండ్‌ను వీడాడు. మరి కొద్దిగంటల్లో న్యూజిలాండ్‌తో టెస్ట్ మ్యాచ్ ఆడాల్సిన పరిస్థితుల్లో అతను గాయపడటం ఇంగ్లండ్ జట్టును కలవరపెడుతుంది. ఇప్పటికే కీలక ఆటగాళ్లు జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్, జేసన్ రాయ్ జట్టుకు దూరం కాగా, తాజాగా కెప్టెన్ రూట్ కూడా గాయం బారిన పడటంతో ఇంగ్లీష్ జట్టులో ఆందోళన మొదలైంది. గత కొద్దికాలంగా సూపర్ ఫామ్‌లో ఉన్న రూట్ ఇంగ్లండ్ విజయావకాశాలను కచ్చితంగా ప్రభావితం చేయగలడని అభిమానులు ఆశలు పెంచుకున్నారు. అయితే గాయం కారణంగా అతను మ్యాచ్‌కు దూరమైతే తమ జట్టు ఓటమి పాలవుతుందని ఇంగ్లండ్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ మ్యాచ్‌కు రూట్ అందుబాటులో ఉండకపోతే అతని స్థానాన్ని సామ్ బిల్లింగ్స్ భర్తీ చేస్తాడని జట్టు యాజమాన్యం సూచన ప్రాయంగా తెలిపింది. చదవండి: త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్న పాక్ కెప్టెన్ -
ఇటాలియన్ గ్రాండ్ ప్రిలో విషాదం.. మోటో3 రైడర్ మృతి
రోమ్: ఇటాలియన్ గ్రాండ్ ప్రిక్స్‌లో విషాదం చోటచేసుకుంది. శనివారం నిర్వహించిన క్వాలిఫయింగ్ టోర్నీలో స్విట్జర్లాండ్‌కు చెందిన మోటో 3 డ్రైవర్ జాసన్ డుపాస్క్వియర్ ప్రమాదవశాత్తు బైక్ అదుపుతప్పడంతో తీవ్రంగా గాయపడ్డాడు. కాగా తీవ్ర గాయాలతో పాటు ఇంటర్నల్ బ్లీడింగ్ ఎక్కువగా ఉండడంతో జాసన్ ఆదివారం మృతి చెందినట్లు ఇటాలియన్ గ్రాండ్ప్రిక్స్ మోటోజీపి నిర్వాహకులు ప్రకటించారు. జాసన్ డుపాస్క్వియర్ మృతి పట్ల మోటోజీపీ ట్విటర్లో సంతాపాన్ని ప్రకటించింది. 'మోటోజీపీ తరపున జాసన్ డుపాస్క్వియర్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని కోరుతున్నాం. ఇంత చిన్న వయసులో అతను మనల్ని వదలివెళ్లడం బాధాకరం. ఈ సందర్భంగా అతని ఫ్యామిలీ, మిత్రులకు మా ప్రగాడ సానభూతిని తెలుపుతున్నాం అని ట్వీట్ చేసింది. కాగా మోటో 3 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో డుపాస్క్వియర్ ప్రస్తుతం రెండవ సీజన్లో ఉన్నాడు. కాఆగా అతను 27 పాయింట్లతో మోటో3లో 12వ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. డుపాస్క్వియర్ తన కెరీర్‌ను సూపర్మోటోలో ప్రారంభించాడు, అక్కడ అతను చాలాసార్లు స్విస్ జాతీయ ఛాంపియన్‌గా నిలిచాడు. జూనియర్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌కు వెళ్లేముందు 2016 లో ఎన్ఇసి ఛాంపియన్షిప్ మోటో 3 టైటిల్‌ను గెలుచుకున్నాడు. చదవండి: డబ్బులు ఇవ్వమన్నందుకు సుశీల్ నన్ను చితకబాదాడు -
ఇంగ్లండ్‌కు ఎదురుదెబ్బ.. కీలక ఆటగాడు దూరం
లండన్: న్యూజిలాండ్‌తో సొంతగడ్డపై జరగనున్న రెండు టెస్టుల సిరీస్ ముందు ఇంగ్లండ్ జట్టుకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. మోచేతికి శస్త్రచికిత్స కారణంగా ఇంగ్లాండ్ స్టార్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ నాలుగు వారాల పాటు క్రికెట్‌కు దూరం కానున్నాడు. సర్జరీ కారణంగా జూలై వరకు అతడు జాతీయ జట్టు తరఫున క్రికెట్ ఆడే అవకాశం లేదు. గత జనవరి నుంచి గాయాల బారీన పడుతూ వస్తున్న ఆర్చర్ టీమిండియాతో జరిగిన వన్డే సిరీస్‌లో మరోసారి గాయపడడంతో టోర్నీ మధ్యలోనే లండన్‌కు వెళ్లిపోయాడు. వైద్యులు అతన్ని పరీక్షించి శస్త్ర చికిత్స నిర్వహించారు. దీంతో ఐపీఎల్ 14వ సీజన్‌కు ఆర్చర్ దూరమవ్వాల్సి వచ్చింది. ఆ తర్వాత గాయం నుంచి కోలుకున్నట్లే కనిపించిన ఆర్చర్ కౌంటీ చాంపియన్‌షిప్‌లో పాల్గొన్నాడు. ససెక్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్చర్‌కు గతవారం మోచేతి గాయం మళ్లీ తిరగబెట్టింది. స్పెషలిస్ట్ వైద్యుల సలహా మేరకు ఆర్చర్ శుక్రవారం శస్త్రచికిత్స చేయించుకున్నట్లు ఈసీబీ బుధవారం వెల్లడించింది. కాగా తాజాగా మరోసారి ఆర్చర్ గాయంతో దూరం కానుండడం ఇంగ్లండ్‌కు పెద్ద దెబ్బగా పరిగణించవచ్చు. కాగా ఆర్చర్ ఇంగ్లండ్ తరపున 13 టెస్టుల్లో 42 వికెట్లు.. 17 వన్డేల్లో 30 వికెట్లు.. 12 టీ20ల్లో 14 వికెట్లు తీశాడు. చదవండి: ఆర్చర్‌కు తిరగబెట్టిన గాయం... కోచ్ అసహనం -
ఆసుపత్రిలో చేరిన ప్రియాంక చోప్రా భర్త నిక్ జోనస్
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా భర్త, ప్రముఖ హాలీవుడ్ గాయకుడు నిక్ జోనస్ ఆసుత్రిలో చేరినట్లు తెలుస్తోంది. లాస్ ఏంజెల్స్‌లో శనివారం రియాలిటీ షో ‘ది వాయిస్’ షూటింగ్ చేస్తున్న సమయంలో నిక్కు స్వల్ప గాయాలయినట్లు, దీంతో అతన్ని వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేసినట్లు సమాచారం. గాయాలు పెద్దవేమి కాకపోవడంతో డాక్టర్ల చికిత్స అనంతరం ఆదివారం డిశ్చార్జ్ అయినట్లు వినికిడి. నిక్ యదావిధిగా సోమవారం మాత్రం తన రియాలిటీ షో ‘ది వాయిస్’లో పాల్గొనబోతున్నట్లు స్థానిక మీడియా పేర్కొంది. అయితే అతనికి గాయాలు ఎలా అయ్యాయనే విషయం తెలియరాలేదు. కాగా 2018లో ప్రియాంక, ప్రముఖ అమెరికన్ గాయకుడు నిక్ జొనాస్‌ను ప్రియాంక ప్రేమించి పెళ్లి చేసున్న విషయం తెలిసిందే. ప్రియాంక కంటే నిక్ పదేళ్లు చిన్న వాడు. ప్రస్తుతం వీరిద్దరూ తమతమ వృత్తుల్లో బిజీగా ఉన్నారు. ప్రియాంక తన ప్రాజెక్ట్స్ కోసం లండన్, నిక్ జోనస్ లాస్ ఏంజెల్స్‌లో ఉంటున్నాడు. మరోవైపు భారత్‌లో కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో ప్రియాంకా చోప్రా, తనభర్త నిక్ జోనాస్ కలిసి కోవిడ్ బాధితుల కోసం ‘టుగెదర్ ఇండియా’ అంటూ విరాళాలు సేకరిస్తున్న సంగతి తెలిసిందే. చదవండి: అవును ఒప్పుకుంటున్న, నా వయసైపోతుంది: ప్రియాంక -
రాజస్తాన్‌కు మరో షాక్.. స్టార్ ఆటగాడు దూరం
చెన్నై: రాజస్తాన్ రాయల్స్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇంగ్లండ్ స్టార్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ ఐపీఎల్ 14వ సీజన్‌కు పూర్తిగా దూరమయ్యాడు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు తెలిపింది. భారత్‌తో జరిగిన సిరీస్‌లో గాయంతోనే బరిలోకి దిగిన ఆర్చర్ వన్డే సిరీస్ మధ్యలోనే శస్త్ర చికిత్స కోసం స్వదేశానికి వెళ్లిపోయాడు. ఆర్చర్ చేతి వేలికి వైద్యులు శస్త్ర చికిత్స నిర్వహించగా.. ఐపీఎల్ తొలి అంచె పోటీలకు ఆర్చర్ దూరమైనా.. రెండో అంచె పోటీలకు అందుబాటులో ఉంటాడని అంతా భావించారు. కానీ ఆర్చర్ గాచం నుంచి కోలుకోవడానికి మరింత సమయం పడుతుందని తాజాగా వైద్యులు నిర్థారించారు. దీంతో ఐపీఎల్ 14వ సీజన్‌కు ఆర్చర్ పూర్తిగా దూరమైనట్లు ఈసీబీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే ఈ సీజన్లో తొలి మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ బెన్ స్టోక్స్ గాయపడి సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ఇక బయోబబూల్‌లో ఉండలేనంటూ లియామ్ లివింగ్‌స్టోన్ అర్థంతరంగా స్వదేశానికి వెళ్లిపోయాడు. తాజాగా ఆర్చర్ కూడా దూరమవ్వడంతో రాజస్తాన్‌కు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఇక ఐపీఎల్ 14వ సీజన్లో రాజస్తాన్ రాయల్స్ ఫేలవ ప్రదర్శన కొనసాగిస్తుంది. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడు ఓటములు.. ఒక్క విజయంతో పాయింట్ల పట్టికలో ఆఖరిస్థానంలో నిలిచింది. గురువారం ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. చదవండి: రాజస్తాన్ రాయల్స్‌కు కొత్త ఆటగాడు.. రాత మారుతుందా! ఇలా అయితే ఐపీఎల్ నుంచి మొదటగా వెళ్లేది వాళ్లే -
ప్రముఖ డ్యాన్స్ షోలో ప్రమాదం..కంటెస్టెంట్‌కు తీవ్ర గాయం!
ప్రముఖ డ్యాన్స్ షో ఢీ తెలుగునాట సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ షో ద్వారా ఎంతో మంది డ్యాన్సర్లు సినిమాల్లో స్టార్ కొరియోగ్రాఫర్లుగా రాణిస్తున్నారు. అంతేకాక కంటెస్టెంట్లు సైతం సినిమాల్లో పలు పాటలకు చిందేస్తున్నారు. ఇప్పటివరకు పన్నెండు సీజన్లు పూర్తి చేసుకున్న ఢీ.. ప్రస్తుతం 13వ సీజన్‌ను నిర్వహిస్తుంది. అయితే తాజాగా షోలో డ్యాన్స్ చేస్తూ ఓ లేడీ కంటెస్టెంట్ ప్రమాదానికి గురైంది. దీనికి సంబంధించిన ప్రోమో ఇటీవలె విడుదలైంది. ఇందులో..డ్యాన్స్ చేస్తూ ఓ కంటెస్టెంట్ ప్రమాదవశాత్తూ స్టేజ్ కింద పడిపోయింది. దీంతో ఆమె తలకు బలమైన గాయం అయ్యింది. దీనికి సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఈ ప్రమాదం జరిగిందని స్పష్టమవుతోంది. డ్యాన్స్ చేస్తూ కిందకు దూకే ఓ షాట్లో కంటెస్టెంట్ ప్రమాదవశాత్తూ కింద పడిపోవడంతో తలకు తీవ్రంగా దెబ్బ తగిలి రక్తస్రావమైంది. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది? ఇది నిజంగానే ప్రమాదమా లేక పబ్లిసిటీ స్టంటా అన్నది తెలియాలంటే మాత్రం వచ్చే వారం ఏప్రిల్14న విడుదలయ్యే ఫుల్ ఎపిసోడ్ చూడాల్సి ఉంది. చదవండి : ఈ బుల్లితెర జంట విడిపోనుందా? చూస్తుండగానే మోనాల్‌కు ముద్దు పెట్టిన కుర్ర మాస్టర్! -
శ్రేయస్‌కు తగిలిన గాయం చాలా తీవ్రమైంది..
న్యూఢిల్లీ: ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో బౌండరీని ఆపే క్రమంలో గాయం బారిన పడిన టీమిండియా స్టార్ మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ శ్రేయస్ అయ్యర్‌కు తగిలిన గాయం చాలా తీవ్రమైందని, ఏప్రిల్ 8న ఆయనకు శస్త్ర చికిత్స చేయనున్నామని, అతను కోలుకోవడానికి కనీసం 5 నెలలు పడుతుందని డాక్టర్లు వెల్లడించారు. గాయం కారణంగా ఇంగ్లండ్‌తో ఆఖరి రెండు వన్డేలకు దూరమైన అయ్యర్.. ఏప్రిల్ 9 నుంచి ప్రారంభంకానున్న ఐపీఎల్ 2021 సీజన్ మొత్తానికి, అలాగే ఆగస్టులో జరిగే ఇంగ్లండ్ పర్యటనకు దూరంకానున్నాడు. సొంతగడ్డపై సెప్టెంబర్‌లో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాలతో జరిగే టీ20 సిరీస్‌లకు అతడు మళ్లీ జట్టులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న అయ్యర్ స్థానంలో యాజమాన్యం కొత్త సారథిని ప్రకటించాల్సి ఉంది. కాగా, ఇంగ్లండ్‌తో తొలి వన్డే సందర్భంగా అయ్యర్ ఎడమ భుజానికి గాయమైన విషయం తెలిసిందే. చదవండి: ప్రపంచకప్ సూపర్ లీగ్‌లో మెరుగుపడిన టీమిండియా స్థానం -
టీమిండియాకు షాక్.. కీలక ఆటగాడు దూరం!
పుణే: ఇంగ్లండ్‌తో జరిగిన మొదటి వన్డేలో విజయం సాధించి జోష్‌లో ఉన్న టీమిండియాకు షాక్ తగిలింది. ఇంగ్లండ్ బ్యాటింగ్ సమయంలో శ్రెయాస్ అయ్యర్ ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన సంగతి తెలిసిందే. బంతిని ఆపే క్రమంలో శ్రేయస్ అయ్యర్ భుజానికి బలంగా దెబ్బ తగిలింది. వెంటనే మైదానం వీడిన అతడిని స్కానింగ్ కోసం పంపించారు.గాయం తీవ్రత దృష్ట్యా అయ్యర్ తదుపరి మ్యాచ్‌ల్లో అతను బరిలోకి దిగే అవకాశాలు తక్కువగానే ఉన్నట్లు తెలిసింది. అయితే అయ్యర్ గాయం తీవ్రతపై బీసీసీఐ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం అందలేదు. మిగిలిన వన్డేలకు ఒకవేళ అయ్యర్ దూరమైతే మాత్రం సూర్యకుమార్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. అంతకముందు టీమిండియా బ్యాటింగ్ సమయంలో వుడ్ వేసిన బంతి రోహిత్ కుడి మోచేతికి బలంగా తాకింది. నొప్పికి రెండుసార్లు మైదానంలోనే చికిత్స చేయించుకొని ఆట కొనసాగించిన అతను ఆ తర్వాత ఫీల్డింగ్‌కు రాలేదు. అయితే రోహిత్ గాయం పెద్దది కాకపోవడంతో అతను రెండో వన్డే ఆడే అవకాశాలు ఎక్కువగా ఆ తర్వాత ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ఫీల్డింగ్‌లో గాయపడిన ఇంగ్లండ్ కెపె్టన్ మోర్గాన్ కూడా చేతికి నాలుగు కుట్లతో బ్యాటింగ్‌కు దిగాడు. చదవండి: 'నో చాన్స్.. బుమ్రా ఆ అవకాశం ఇవ్వడు' వైరల్: విచిత్రరీతిలో బ్యాట్స్‌మన్ రనౌట్ -
సన్‌రైజర్స్‌కు వార్నర్ షాక్ ఇవ్వనున్నాడా!
సిడ్నీ: ఐపీఎల్ 2021 సీజన్ ఆరంభానికి ముందే సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు భారీ దెబ్బ తగిలేలా ఉంది. ఆ జట్టు కెప్టెన్.. ప్రధాన బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్ ఐపీఎల్ ఆడేది అనుమానంగా కనిపిస్తుంది. ఆసీస్, టీమిండియా సిరీస్ మధ్యలో వార్నర్ గాయపడిన సంగతి తెలిసిందే. భారత్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో గజ్జల్లో గాయం అవడంతో మూడో వన్డేతో పాటు టీ 20 సిరీస్‌కు దూరమయ్యాడు. ఆ తర్వాత జరిగిన టెస్టు సిరీస్ మొదటి రెండు మ్యాచ్‌లకు దూరమైన వార్నర్‌ను మూడు, నాలుగు టెస్టులకు మాత్రం ఎంపికయ్యాడు. అతను పూర్తి ఫిట్‌గా లేకున్నా కూడా సీఏ అతన్ని బరిలోకి దింపిందంటూ తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే తాను వంద శాతం ఫిట్‌గా ఉన్నానని.. అందుకే మిగిలిన టెస్టులకు ఎంపిక చేశారంటూ వార్నర్ అప్పట్లో చెప్పుకొచ్చాడు. అయితే చివరి రెండు టెస్టుల్లో నాలుగు ఇన్నింగ్స్‌లు ఆడిన వార్నర్ 5,13, 1,48 పరుగులు చేశాడు. తాజాగా వార్నర్‌కు గజ్జల్లో గాయం మళ్లీ తిరగబెట్టినట్లు తెలుస్తోంది. దాంతో పూర్తి స్థాయి ఫిట్నెస్ సాధించేందుకు కనీసం ఆరు నుంచి తొమ్మిది నెలల సమయం పడుతుందని వార్నరే స్వయంగా వెల్లడించాడు. దీంతో ఏప్రిల్ మొదటివారం నుంచి మొదలుకానున్న ఐపీఎల్ 2021 సీజన్లో డేవిడ్ వార్నర్ ఆడటంపై సందేహాలు నెలకొన్నాయి. ఒకవేళ ఐపీఎల్లోపూ పూర్తి స్తాయిలో కోలుకుంటే కచ్చితంగా పాల్గొంటానని స్పష్టం చేశాడు. ఐపీఎల్లో పాల్గొనాలంటే సీఏ జారీ చేసిన ఎన్వోసీ తప్పనిసరిగా ఉండాలి. వార్నర్ ఫిట్‌గా లేకుంటే మాత్రం సీఏ ఎన్వోసీ ఇవ్వదు.. దీంతో ఎన్వోసీ లేకుండా అతను ఐపీఎల్లో ఆడలేడు. అలా చూసుకుంటే వార్నర్ ఐపీఎల్ 14వ సీజన్‌కు దూరమైతే మాత్రం ఎస్ఆర్హెచ్కు పెద్ద ఎదురుదెబ్బే అని చెప్పొచ్చు. వార్నర్ దూరమైతే అతని స్థానంలో న్యూజిలాండ్ ఆటగాడు కేన్ విలియమ్సన్ వ్యహరించే అవకాశం ఉంది. 2018లో బాల్ టాంపరింగ్ కారణంగా డేవిడ్ వార్నర్‌పై ఏడాది నిషేధం పడగా.. అప్పుడు హైదరాబాద్ కెప్టెన్‌గా కేన్ విలియమ్సన్ బాధ్యతలు నిర్వర్తించిన విషయం తెలిసిందే. ఐపీఎల్లో ఇప్పటి వరకూ 142 మ్యాచ్‌లాడిన డేవిడ్ వార్నర్.. 5,254 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు, 48 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 2016లో వార్నర్ సారధ్యంలోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ టైటిల్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. చదవండి: 'ఓడిపోయుండొచ్చు.. కోహ్లి మనసు గెలిచాం' అశ్విన్ అవసరం తీరిపోయింది.. కమ్‌బ్యాక్ కష్టమే -
పుజారాకు గాయం.. రెండో ఇన్నింగ్స్‌కు డౌటే!
చెన్నై: టీమిండియా టెస్ట్ స్పెషలిస్ట చతేశ్వర్ పుజారా గాయపడినట్లు తెలుస్తుంది. రెండో టెస్టు తొలిరోజు టీమిండియా బ్యాటింగ్ సమయంలో పుజారా చేతికి బంతి తగిలి గాయమైంది. దీనిలో భాగంగానే రెండో రోజు ఆటలో ఇంగ్లండ్ ఇన్సింగ్స్ సమయంలో పుజారా ఆన్‌ఫీల్డ్‌లో కనిపించలేదు. అతని స్థానంలో మయాంక్ అగర్వాల్ సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా వ్యవహరించాడు. గాయం తీవ్రత గురించి తెలియదు కానీ.. గాయం పెద్దదైతే మాత్రం పుజారా రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. కాగా పుజారా తొలి ఇన్నింగ్స్‌లో 21 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికైతే ఇంగ్లండ్ ఇన్నింగ్స్ వరకు పుజారా ఫీల్డింగ్‌కు వచ్చే అవకాశం లేదని జట్టు మేనుజ్మెంట్ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా రోహిత్ సెంచరీతో మెరవడంతో టీమిండియా తొలిరోజు 300 పరుగులు ప్కోరును దాటింది. రెండో రోజు మాత్రం క్రితం రోజు స్కోరుకు కేవలం 29 పరుగులు మాత్రమే జోడించి ఆలౌట్ కాగా.. రిషబ్ పంత్ 58 నాటౌట్ మెరిశాడు. కాగా ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో తడబడుతుంది. లంచ్ విరామం సమయానికి 39 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. -
ఆసీస్‌కు మరో దెబ్బ.. స్మిత్ అనుమానమే!
అడిలైడ్ : టీమిండియాతో టెస్టు సిరీస్ ఆరంభానికి ముందే ఆసీస్‌కు దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. ఇప్పటికే స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ గాయంతో దూరం కాగా.. ఆసీస్ కీలక బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ తొలి టెస్టు ఆడేది అనుమానంగా కనిపిస్తుంది. మంగళవారం ఉదయం ప్రాక్టీస్ సమయంలో ఫీల్డింగ్ చేస్తున్న స్మిత్‌కు గాయమైనట్లు సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ ఒక ప్రకటనలో పేర్కొంది. దీంతో బ్యాటింగ్ చేయకుండానే స్మిత్ హోటల్ రూంకు వెళ్లిపోయాడని తెలిపింది. (చదవండి : రబ్బిష్.. కోహ్లిని మేమెందుకు తిడతాం) అయితే స్మిత్ గాయంపై ఎటువంటి క్లారిటీ లేదు. ఒకవేళ గాయం ఎక్కువగా ఉంటే మాత్రం తొలి టెస్టు ఆడేది అనుమానంగా కనిపిస్తుంది. ఇదే నిజమైతే ఆసీస్‌కు పెద్ద దెబ్బే అని చెప్పొచ్చు. వన్డే సిరీస్‌ను ఆసీస్ గెలవడంలో స్మిత్ కీలక పాత్ర పోషించాడు. వరుస సెంచరీలతో హోరెత్తించిన అతను అద్భుత ఫామ్ కనబరుస్తూ టెస్టు సిరీస్‌కు కీలకంగా మారాడు. ఈ దశలో స్మిత్‌కు గాయం కావడం ఆసీస్‌కు ఇబ్బందిగా మారనుంది. (చదవండి : అంపైర్ చీటింగ్.. అసలు అది ఔట్ కాదు) ఇప్పటికే స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ దూరమవడం.. తాజాగా స్మిత్ గాయపడడం దీనిని మరింత రెట్టింపు చేసింది. అంతేగాక యువ ఓపెనర్ విన్ పుకోవిస్కి త్యాగి బౌన్సర్ దెబ్బకు మొదటి టెస్టుకు దూరం కావాల్సి వచ్చింది. ఇక టీమిండియాతో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఆసీస్ కీలక బౌలర్ సీన్ అబాట్ కండరాలు పట్టేయడంతో రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్‌కు దిగలేదు. ఆ తర్వాత అబాట్ తొలి టెస్టుకు దూరమైనట్లు క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. అంతకముందు బుమ్రా ఆడిన స్ట్రెయిట్డ్రైవ్ కామెరాన్ గ్రీన్ తలకు బలంగా తాకడంతో తొలి టెస్టుకు అతను కూడా దూరమవుతాడని భావించారు.. కానీ అదృష్టం బాగుండి గాయం తీవ్రత పెద్దగా లేకపోవడంతో తొలి టెస్టులో గ్రీన్ ఆడుతున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. ఏదైమైనా స్మిత్ తొలి టెస్టుకు దూరమైతే మాత్రం ఆసీస్ విజయంపై ప్రభావం పడనుంది. 2018-19 సిరీస్‌లోనూ స్మిత్, వార్నర్‌లు ఆడకపోవడంతో 2-1 తేడాతో టీమిండియా సిరీస్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 17న అడిలైడ్ వేదికగా కాగా ఇరుజట్ల మధ్య తొలి డే నైట్ టెస్ట్ మ్యాచ్ జరగనుంది. -
‘రోహిత్ గాయం పెరిగే ప్రమాదం ఉంది’
దుబాయ్: భారత స్టార్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ గాయం తీవ్రతకు సంబంధించి ఇప్పటి వరకు బీసీసీఐ అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఆస్ట్రేలియా పర్యటనకు అతడిని ఎంపిక చేయకపోవడంపై వివాదం కూడా నెలకొంది. అయితే జట్టు హెడ్ కోచ్ రవిశాస్త్రి దీనిపై మొదటిసారి పెదవి విప్పాడు. అతను గాయం మరింత పెద్దది కాకూడదనే కారణంతోనే జాగ్రత్త పడుతున్నామని వెల్లడించాడు. తొందర ప్రదర్శించి బరిలోకి దిగితే రోహిత్‌కు మరింత సమస్య ఎదురు కావచ్చని రవిశాస్త్రి అన్నాడు. ‘బీసీసీఐ వైద్య బృందం దీనిపై స్పష్టతనిచ్చింది. ఈ టీమ్ తమ నివేదికను సెలక్టర్లకు అందజేసింది. అందులో మా పాత్ర ఏమీ లేదు. దానిని బట్టి వారు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత గాయానికి విశ్రాంతి అవసరమని, తొందరపడి ఆడే ప్రయత్నం చేస్తే అతను మళ్లీ తనను తాను గాయపర్చుకునే ప్రమాదం ఉందని ఆ నివేదికలో ఉంది. నేను సెలక్షన్ కమిటీలో సభ్యుడిని కాను. అతడిని పక్కన పెట్టడంలో నేను ఎలాంటి పాత్ర పోషించలేదు’ అని రవిశాస్త్రి వ్యాఖ్యానించాడు. -
గేటు దూకబోయి.. ఇనుప రాడ్డులో
పిడుగురాళ్ల (గురజాల): వాకింగ్ కోసం వచ్చిన ఓ విద్యార్థి గేటు దూకబోయి.. అందులో చేయి ఇరుక్కొని తీవ్రంగా గాయపడిన ఘటన గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో సోమవారం చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన కొపావత్ వెంకట్ నిఖిల్ నాయక్ విజయవాడలోని సిద్ధార్థ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. సోమవారం వాకింగ్ కోసం స్థానిక మన్నెం పుల్లారెడ్డి జెడ్పీ ఉన్నత పాఠశాలకు వచ్చాడు. పాఠశాల గేటుకు తాళం వేసి ఉండటంతో గేటు దూకి లోపలికి వెళదామని ప్రయత్నించే క్రమంలో కాలు జారి గేటు పైనున్న ఇనుప కడ్డీలోకి ఎడమ చేయి పూర్తిగా చొచ్చుకునిపోయింది. (చదవండి: విషాదం.. వివాహమైన 28 రోజులకే..) కడ్డీలో నుంచి చేయి తీయాలని ప్రయతి్నంచినా రాలేదు. స్థానికుల సమాచారం మేరకు పల్నాడు ఆస్పత్రి వైద్యుడు అశోక్‌కుమార్ ఘటనా స్థలానికి చేరుకొని నిఖిల్‌కు మత్తు ఇంజక్షన్ ఇచ్చి సుమారు గంటన్నర సమయం వెచ్చించి ఇనుప రాడ్డులో నుంచి చేయిని బయటకు తీసి వెంటనే ఆస్పత్రికి తరలించారు. పోలీసులు, వైద్యులు వెంటనే స్పందించడంతో ప్రమాదం తప్పిందని కుటుంబ సభ్యులు తెలిపారు. -
రోహిత్ శర్మ అవుట్
ముంబై: న్యూజిలాండ్‌తో టి20 సిరీస్‌ను 5–0తో క్లీన్‌స్వీప్ చేసిన ఉత్సాహంలో ఉన్న భారత జట్టుకు ఎదురు దెబ్బ తగిలింది. కాలి పిక్క గాయం కారణంగా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ మిగిలిన పర్యటన నుంచి తప్పుకున్నాడు. బుధవారం నుంచి జరిగే వన్డే సిరీస్‌తో పాటు ఆ తర్వాత జరిగే రెండు టెస్టుల సిరీస్‌కు కూడా రోహిత్ దూరమయ్యాడు. మౌంట్ మాంగనీలో ఆదివారం జరిగిన చివరి టి20 మ్యాచ్‌లో 60 పరుగులు చేసిన అనంతరం కాలి పిక్క గాయంతో అతను రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత పరీక్షల్లో దాని తీవ్రత ఎక్కువని తేలింది. ‘రోహిత్ గాయం చిన్నదేమీ కాదు. ఫిజియో దీనిని పర్యవేక్షిస్తున్నాడు. అయితే న్యూజిలాండ్‌తో మిగిలిన సిరీస్‌లో మాత్రం ఆడే అవకాశం లేదని తేలిపోయింది. అతను ఈ పర్యటన నుంచి తప్పుకుంటున్నాడు’ అని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు. ఓపెనర్‌గా భారత జట్టుకు తిరుగులేని విజయాలు అందిస్తున్న రోహిత్ శర్మ లేకపోవడం వన్డేల్లో టీమిండియాను బలహీనం చేస్తుందనడంలో సందేహం లేదు. గత ఏడాది టెస్టుల్లో కూడా ఓపెనర్‌గా బరిలోకి దిగిన తర్వాత రోహిత్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. విశాఖపట్నంలో తొలి టెస్టులోనే రెండు సెంచరీలు చేసిన అతను ఆ తర్వాత రాంచీలో డబుల్ సెంచరీతో చెలరేగాడు. ఇప్పుడు విదేశీ గడ్డపై సత్తా చాటేందుకు సిద్ధమవుతున్న తరుణంలో గాయం అతని జోరుకు బ్రేక్ వేసింది. పృథ్వీ షాకు నో! రోహిత్ శర్మ స్థానంలో న్యూజిలాండ్‌లోనే భారత ‘ఎ’ జట్టు తరఫున ఆడుతున్న శుబ్‌మన్ గిల్, మయాంక్ అగర్వాల్‌లకు టెస్టు, వన్డే జట్లలో స్థానం లభించనున్నట్లు సమాచారం. అయితే బీసీసీఐ నుంచి దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. తొలి అనధికారిక టెస్టులో డబుల్ సెంచరీ చేయడం గిల్ స్థానాన్ని అవకాశాలను పటిష్టం చేయగా... విండీస్ వన్డే సిరీస్‌కు జట్టులో భాగంగా ఉన్న మయాంక్‌కు ఇప్పుడు మరో అవకాశం లభించింది. రాహుల్ కూడా అందుబాటులో ఉన్న కారణంగా... ప్రస్తుతం వన్డే జట్టులోకి ఎంపికైన పృథ్వీ షాను ఇంకా టెస్టుల్లోకి పరిశీలించలేదని తెలుస్తోంది. -
ప్రాక్టీస్ చేస్తుండగా బాణం గుచ్చుకోవడంతో..
న్యూఢిల్లీ : ఖేలో ఇండియా క్రీడల సందర్భంగా గురువారం 12 ఏళ్ల ఆర్చరీ క్రీడాకారిణి శివాంగిని గొహేన్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో పారపాటుగా ఒక బాణం వచ్చి ఆమె మెడకు గుచ్చుకుంది. దీంతో ఆమెను గుహావటిలోని ఆస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి కాస్త సీరియస్‌గా ఉండడంతో అక్కడి నుంచి ఢిల్లీలోని ఎయిమ్స్ ట్రూమా సెంటర్‌కు తరలించినట్లు స్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(శాప్) పేర్కొంది. 'ఈరోజు(శుక్రవారం) ఉదయం 8గంటల ప్రాంతంలో శివాంగిని జాయిన్ అయ్యారు. ప్రస్తుతం ఆమెను అబ్జర్వేజన్‌లో ఉంచామని, చికిత్సకు సంబంధించి నిర్ణయం తీసుకోనున్నట్లు' ఎయిమ్స్ మెడికల్ సూపరిండెంట్ డాక్టర్ అమిల్ లత్వాల్ పేర్కొన్నారు. శాయ్ అథారిటీ సెక్రటరీ శ్యామ్ జులానియా మాట్లాడుతూ.. గురువారం అస్సాంలోని దిబ్రూఘర్‌లో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో పొరపాటున ఒక బాణం వచ్చి శివాంగిని మెడకు గుచ్చుకుంది. ఆమె పరిస్థితి కొంత విషమంగా మారడంతో ఎయిమ్స్ ట్రూమా సెంటర్‌కు తరలించాము.శివాంఘి కోలుకునేవరకు ఆమెకయ్యే వైద్య ఖర్చులన్నింటిని శాయ్ భరించనుందని స్పష్టం చేశారు. కాగా ఖేలో ఇండియా క్రీడలు ఈరోజు(జనవరి 10) నుంచి ప్రారంభం కానున్నాయి. జనవరి 22 వరకు జరగనునన్న ఈ పోటీలు మొత్తం 20 విభాగాల్లో నిర్వహించనున్నారు. దాదాపు 6500 మంది అథ్లెట్లు అండర్-17, అండర్-21 కేటగిరీల్లో పోటీ పడనున్నారు. -
రెజ్లర్ సుశీల్ కుమార్‌కు ఝలక్
న్యూఢిల్లీ: రెండు సార్లు ఒలింపిక్ పతక విజేత, భారత రెజ్లర్ సుశీల్ కుమార్‌కు భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) ఝలక్ ఇచ్చింది. తాను గాయంతో బాధపడుతున్న కారణంగా తన 74 కేజీల విభాగంలో నిర్వహించే ట్రయల్స్‌ను వాయిదా వేయాలంటూ కోరిన విన్నపాన్ని తోసిపుచ్చింది. ఈ ట్రయల్స్‌లో విజేతలుగా నిలిచిన వారు ఈ నెలలో రోమ్ వేదికగా జరిగే ఫస్ట్ ర్యాంకింగ్ సిరీస్ టోర్నీకి, న్యూఢిల్లీలో ఫిబ్రవరిలో జరిగే ఆసియా చాంపియన్‌షిప్‌కు, మార్చిలో చైనాలోని జియాన్‌లో జరిగే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్‌కు అర్హత సాధిస్తారు. అయితే ఈ టోర్నీకి రోజుల వ్యవధిలో సుశీల్ గాయపడటంతో... తన విభాగంలో జరిగే ట్రయల్స్‌ను వాయిదా వేయాలని కోరాడు. దీనిపై స్పందించిన డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ‘ట్రయల్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగవు. 74 కేజీల విభాగంలో పోటీ పడటానికి చాలా మంది రెజ్లర్లు ఉన్నారు. సుశీల్ గాయపడితే మేమేం చేయగలం. 74 కేజీల విభాగంలో అర్హత సాధించిన రెజ్లర్ల ప్రదర్శనను ర్యాంకింగ్ సిరీస్ ఈవెంట్స్‌లో పరిశీలిస్తాం. ఈ విభాగంలో సుశీల్ కంటే మెరుగైన రెజ్లర్ లేరనిపిస్తే... మార్చిలో జరిగే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్‌లో అతనికి తప్పక అవకాశం ఇస్తాం’ అని పేర్కొన్నాడు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన సుశీల్ ‘నేను రెండు వారాల్లో పూర్తి ఫిట్నెస్ సాధిస్తాను. నేను గాయంతో బాధపడుతున్న సంగతి వారికి (డబ్ల్యూఎఫ్ఐ) తెలుసు. ఒక వేళ వారు ట్రయల్స్‌ను కొనసాగించాలనుకుంటే కొనసాగించుకోవచ్చు.’ అంటూ ఘాటుగా బదులిచ్చాడు. -
ఫెర్గుసన్‌కు గాయం.. వాన్ కొత్త ప్రతిపాదన
పెర్త్: మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరగుతున్న తొలి మ్యాచ్‌లో పర్యాటక న్యూజిలాండ్ జట్టును కష్టాలు వెంబడిస్తున్నాయి. తొలి రోజు ఆటలో భాగంగా కివీస్ పేస్ బౌలర్ ఫెర్గుసన్ కాలికి గాయమైంది. దీంతో అతడు మైదానాన్ని వీడాడు. కేవలం 11 ఓవర్లు వేసిన అనంతరం ఫెర్గుసన్ మైదానం వీడటంతో ఒక బౌలర్ లోటుతోనే కివీస్ తొలి ఇన్నింగ్స్‌ను గట్టెక్కించింది. ఫెర్గుసన్ గాయం తీవ్రత దృష్ట్యా అతడు తొలి టెస్టులో బౌలింగ్ చేయకపోవడమే మంచిదని అయితే బ్యాటింగ్‌కు దిగొచ్చని డాక్టర్లు పేర్కొన్నట్లు కివీస్ క్రికెట్ బోర్డు తొలుత ఓ ప్రకటన చేసింది. అనంతరం ఫెర్గుసన్‌కు తొలి టెస్టుకు విశ్రాంతి నివ్వడమే మంచిదని డాక్డర్లు సూచించినట్లు మరో ప్రకటన విడుదల చేసింది. దీంతో ఫెర్గుసన్ గాయంపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత రాలేదు. అయితే ఫెర్గుసన్ మైదానంలోకి దిగినా బౌలింగ్ చేసే అవకాశమే లేదని కివీస్ బోర్డు నిర్దారణకు వచ్చింది. దీంతో ఒక బౌలర్ లోటు తోనే తొలి టెస్టును నెట్టుకురావాల్సిన పరిస్థితి విలియమ్స్ సేనకు ఏర్పడింది. అయితే ఈ సందర్భంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ ఓ కొత్త ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చాడు. మిగతా నాలుగు రోజులు కివీస్ ఒక ప్రధాన బౌలర్ సేవలను కోల్పోనుందని, ఇది ఏ జట్టుకైన ఇబ్బందేనని పేర్కొన్నాడు. అయితే ఇలాంటి తరుణంలో కాంకషన్ సబ్‌స్టిట్యూట్ మాదిరిగానే ‘ఇండిపెండెంట్ డాక్టర్ ఆన్ సైట్’ అనే ప్రతిపాదనను ఐసీసీ ముందుంచాడు. మ్యాచ్ సందర్భంగా ఆటగాడు గాయపడితే మైదానంలో ఉన్న నియమిత డాక్టర్ అతడిని పరీక్షించిన అనంతరం ఆ క్రికెటర్ మ్యాచ్ ఆడే వీలులేదని ప్రకటిస్తే మరో ఆటగాడిని జట్టులోకి తీసుకునే వెసులుబాటును కల్పించాలన్నాడు. దీంతో ఏ జట్టు నష్టపోదని వాన్ అభిప్రాయపడుతున్నాడు. మరి ఈ ప్రతిపాదనపై క్రికెట్ దేశాలు, ఐసీసీ ఏ నిర్ణయం తీసుకుంటాయో వేచిచూడాలి. -
హార్దిక్‌కు గాయం.. ఐపీఎల్‌కూ డౌటే?
హైదరాబాద్: టీమిండియాను గాయాల బెడద వేధిస్తోంది. క్రికెటర్లపై పనిభారం పడకుండా బీసీసీఐ పలు జాగ్రత్తలు తీసుకుంటున్నా టీమిండియాను గాయాల సమస్య వీడట్లేదు. ఇప్పటికే ప్రధాన పేసర్ జస్ప్రిత్ బుమ్రా గాయం కారణంగా దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు. తాజాగా టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు వెన్నుగాయం తిరగబెట్టింది. దీంతో దాదాపు ఐదు నెలల పాటు క్రికెట్‌కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఆసియా కప్ సమయంలో వెన్నుగాయం కారణంగా టోర్నీ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. (ఫైల్ ఫోటో) మంగళవారం హార్దిక్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో వెన్నునొప్పితో బాధపడ్డాడు. దీంతో అతడికి వైద్యపరీక్షల చేసిన వైద్యులు గాయం తీవ్రత దృష్ట్యా కనీసం ఐదు నెలల విశ్రాంతి అసరమని తెలిపినట్లు సమాచారం. అంతేకాకుండా శస్త్రచికిత్స కూడా అవసరమని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వెన్ను గాయానికి మైరుగైన చికిత్స కోసం బ్రుమాను ఇంగ్లండ్‌కు పంపించిన బీసీసీఐ.. హార్దిక్‌ను కూడా అక్కడికే పంపించాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. దీంతో బంగ్లాదేశ్‌తో జరిగే టీ20 సిరీస్‌కు హార్దిక్ దూరమవనున్నాడని బీసీసీఐకి చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు. అయితే హార్దిక్ గాయం తీవ్రత దృష్ట్యా వచ్చే ఐపీఎల్‌కు కూడా అందుబాటులో ఉండే అవకాశాలు లేనట్లు తెలుస్తోంది. -
వైజాగ్ టు హైదరాబాద్
క్లాస్ హీరోగా కనిపించే నాగశౌర్య యాక్షన్ సీన్స్‌లో కూడా అదుర్స్ అనిపించగలరు. ‘ఛలో’ సినిమాలోని కొన్ని యాక్షన్ సీక్వెన్స్ మాస్ ఆడియన్స్‌కు కిక్ ఇచ్చాయి. ఈ కిక్‌ను మరింత అందించాలనే ఆలోచనలో ఉన్నారు నాగశౌర్య. అందుకు తగ్గట్లుగా తన తాజా చిత్రంలో రిస్కీ యాక్షన్ సీక్వెన్స్‌లో పాల్గొంటున్నారు. ఈ చిత్రంతో రమణ తేజ దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఉషా ముల్పూరి నిర్మిస్తున్నారు. ఇటీవల వైజాగ్‌లో మొదలైన ఈ సినిమా భారీ షెడ్యూల్ ముగిసింది. ఈ షెడ్యూల్లోనే నాగశౌర్య కాలికి గాయమై షూటింగ్‌కు కాస్త బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. కొంచెం విరామం తీసుకున్న తర్వాత షూట్లో పాల్గొన్నారు నాగశౌర్య. ఈ షెడ్యూల్లో ఎక్కువగా యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. ‘కేజీఎఫ్’ చిత్రానికి ఫైట్స్ కంపోజ్ చేసిన అన్బు అరివు ఆథ్వర్యంలో యాక్షన్ సీన్స్‌ను తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ వచ్చే నెలలో హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. -
గాయం బెడద భయం గొల్పుతోంది
న్యూఢిల్లీ : వెన్ను గాయం నుంచి కోలుకుని సాధన కొనసాగిస్తున్నా... దాని ప్రభావం తిరగబెట్టే ప్రమాదంపై తాను ఆందోళన చెందుతున్నట్లు భారత అగ్రశ్రేణి వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను పేర్కొంది. గతేడాది గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం నెగ్గిన అనంతరం వైద్యులు సైతం నిర్దిష్టమైన కారణం చెప్పలేనంతగా మీరాబాయి వెన్నునొప్పికి గురైంది. దీంతో ఆసియా క్రీడలు, ప్రపంచ చాంపియన్ షిప్‌నకు ఆమె దూరమైంది. దాదాపు 9 నెలల అనంతరం కోలుకున్న మీరా ఫిబ్రవరిలో థాయ్‌లాండ్‌లో జరిగిన ఎగాట్ కప్‌లో బరిలో దిగి 49 కేజీల విభాగంలో స్వర్ణం; ఏప్రిల్‌లో జరిగిన ఆసియా చాంపియన్‌షిప్‌లో లోయర్క్లీన్ అండ్ జర్క్ అంశంలో రజతం సాధించింది. తాజాగా ముగిసిన కామన్వెల్త్ చాంపియన్‌షిప్‌లోనూ బంగారు పతకం గెలుచుకుంది. అయితే, సెప్టెంబరులో జరుగనున్న ప్రపంచ చాంపియన్‌షిప్‌ను దృష్టిలో పెట్టుకుని గాయం తిరగబెట్టకుండా ఆమె సాధనలో జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌కు ఈ చాంపియన్‌షిప్‌ను క్వాలిఫయింగ్ టోర్నీగా పరిగణిస్తారు. ఈ నేపథ్యం లోనే మీరాబాయి ఆందోళన వ్యక్తం చేస్తోంది. -
జిల్లెట్ రేజర్లు వాడుతున్నారా..?
సాధారణంగా కొన్ని రకాల మందులు, భద్రతా కారణాల రీత్యా ఆటో కంపెనీలు, లేదా ఫుడ్ ఉత్పతుల రీకాల్‌ను చూస్తుంటాం. కానీ రేజర్లు రీకాల్స్ చేయడం చాలా అరుదు. అయితే షేవింగ్ బ్లేడ్స్, షేవింగ్ క్రీమ్ తయారీ దిగ్గజ సంస్థ జిల్లెట్ తాజాగా భారీ సంఖ్యలో రేజర్లను రీకాల్ చేస్తోంది. మరీ పదునుగా ఉన్నాయనీ, తద్వారా తెగి పోవడం, లోతైన గాయం అయ్యే అవకాశం ఉందంటూ రెండు ఉత్సత్తులను వెనక్కి తీసుకుంటోంది. వీనస్ సింప్లీ 3 డిస్పోజబుల్ రేజర్ 4-ప్యాక్, డైసీ క్లాసిక్ 12 + 1 వీనస్ సింప్లీ 3 బోనస్ ప్యాక్ ఇందులో ఉన్నాయని కంపెనీ ఒక ప్రకటన విడుదల చేసింది. మరీ ఎక్కువ షార్ప్‌గా ఉన్నాయంటూ 87వేల డిస్పోజబుల్ రేజర్లను జిల్లెట్ రీకాల్ చేస్తోంది. తయారీలో లోపం కారణంగా రేజర్‌లోని బ్లేడ్ల అమరిక తప్పుగా ఉందని కంపెనీ వెల్లడించింది. ఈ ఏడాది జనవరి-మే నెలల మధ్య విక్రయించిన ఉత్పత్తులు ప్రభావితమయ్యాయని వాటిని వెనక్కి తీసుకుంటామని తెలిపింది. ఈ రేజర్లను ఉపయోగించడాన్ని వెంటనే ఆపివేసి, వాటిని జిల్లెట్‌కు అందించి రీప్లేస్మెంట్ వోచర్ తీసుకోవాలని వినియోగదారులకు సూచిస్తోంది. లక్షలాది మంది మహిళల భద్రత, వారి విశ్వాసమే తమకు ముఖ్యమని జిల్లెట్ ఒక ప్రకటనలో తెలిపింది. మరిన్ని వివరాలు జిల్లెట్ అధికారిక వెబ్సైట్లో లభ్యం. -
ధావన్‌కు గాయం: ఫ్లైట్ ఎక్కనున్న పంత్?
లండన్: ప్రపంచకప్‌లో టీమిండియాకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో శతక్కొట్టి భీకర ఫామ్‌లోకి వచ్చిన శిఖర్ ధావన్ గాయం కారణంగా ప్రపంచకప్ నుంచి వైదొలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదివారం ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో కౌల్టర్ నైల్ వేసిన ఓవర్లో ధావన్ ఎడమచేతి బొటన వేలికి బంతి బలంగా తాకడంతో గాయమైంది. నొప్పిను భరిస్తూనే సెంచరీ సాధించిన ధావన్ జట్టు భారీస్కోరు సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. వేలి నొప్పితో ధావన్ ఫీల్డింగ్‌కు రాకుండా పెవిలియన్‌కే పరిమితమయ్యాడు. అతడి స్థానంలో రవీంద్ర జడేజా ఫీల్డింగ్ చేశాడు. ధావన్ వేలికి స్కానింగ్ తీసిన డాక్టర్లు మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. అయితే డాక్టర్ల సూచనల మేరకు జూన్ నెల మొత్తం ధావన్ విశ్రాంతి తీసుకోనున్నాడు. అందువల్ల లీగ్‌లో మిగతా జట్లతో జరిగే మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. భారత్ సెమీస్‌కు చేరితే మాత్రం ధావన్ తిరిగి బ్యాట్ పట్టే అవకాశముంది. అయితే ధావన్‌ను ప్రపంచకప్‌లో కొనసాగిస్తూనే ఓపెనర్‌గా రాహుల్‌ను పంపించాలని మెనేజ్మెంట్ భావిస్తోంది. దీంతో రాహుల్ ఓపెనింగ్‌కు వస్తే మిడిలార్డర్లో కార్తీక్, విజయ్‌శంకర్‌లతో నెట్టుకరావాలని తొలుత భావించింది. అయితే కీలక ప్రపంచకప్ నేపథ్యంలో రిస్క్ చేయకూడదనే ఉద్దేశంలో ఉన్న మేనేజ్మెంట్ రిషభ్ పంత్‌ను ఇంగ్లండ్‌కు రప్పించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే సీనియర్ ప్లేయర్ అంబటి రాయుడు ఉన్నప్పటికీ ప్రస్తుత ఫామ్ దృష్ట్యా పంత్ వైపే మొగ్గు చూపే అవకాశం ఉన్నట్లు సమాచారం. (చదవండి: కోహ్లిసేనకు ఎదురు దెబ్బ) కివీస్‌తో మ్యాచ్‌కు డౌటే.. అయితే రిషభ్ పంత్ అత్యవసరంగా ఇంగ్లండ్‌కు బయల్దేరిన గురువారం న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌కు అందుబాటులో ఉండే అవకాశం లేదని తెలుస్తోంది. అయితే ఆదివారం జరగబోయే పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు పంత్ అందుబాటులో ఉండే అవకాశం ఉంది. అయితే ధావన్ గాయంపై, పంత్ రాకపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. అయితే ధావన్ గాయం, విశ్రాంతిపై స్పష్టత వచ్చాకే తుది నిర్ణయం తీసుకుంటామని బీసీసీఐకి చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు. -
విజయ్ శంకర్‌కు గాయం!
లండన్: ప్రపంచ కప్ సమరాంగణంలో తొలి సన్నాహకానికి భారత్ సిద్ధమైంది. ఓవల్ మైదానంలో నేడు జరిగే తమ మొదటి ప్రాక్టీస్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో కోహ్లి సేన తలపడుతుంది. కొన్నాళ్ల క్రితం న్యూజిలాండ్ గడ్డపై జరిగిన వన్డే సిరీస్‌లో ఈ రెండు టీమ్‌లు ఆడాయి. మ్యాచ్ ఫలితం టోర్నీపై ఎలాంటి ప్రభావం చూపకున్నా... తాజా వరల్డ్ కప్ ఫార్మాట్లో అన్ని టీమ్‌లతో ఆడే అవకాశం ఉండటంతో ఇరు జట్లకు కూడా ప్రత్యర్థి బలాబలాలపై అవగాహనకు ఈ మ్యాచ్ ఉపకరిస్తుంది. ఈ ప్రాక్టీస్ మ్యాచ్‌ను 15 మంది ఆటగాళ్లు (మ్యాచ్‌లో 11 మంది బ్యాటింగ్, 11 మంది బౌలింగ్ చేయవచ్చు) కూడా పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలని భారత్ భావిస్తోంది. అందుకే ఎవరికీ విశ్రాంతినివ్వకుండా బ్యాట్స్‌మెన్, బౌలర్లు అందరినీ పరీక్షించే అవకాశం ఉంది. ముఖ్యంగా నాలుగో స్థానంలో తీవ్ర చర్చ సాగిన నేపథ్యంలో దానిపై కూడా టీమ్ మేనేజ్మెంట్ దృష్టి పెట్టనుంది. కేదార్ ప్రాక్టీస్ ... ప్రాక్టీస్ మ్యాచ్‌కు ముందు రోజు భారత జట్టుకు ఎదురు దెబ్బ తగిలింది. నెట్స్‌లో సాధన చేస్తున్న సమయంలో ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ కుడి చేతికి గాయమైంది. పేసర్ ఖలీల్ అహ్మద్ వేసిన బంతిని పుల్ చేసే క్రమంలో శంకర్ దెబ్బ తగిలించుకున్నాడు. నొప్పితో విలవిల్లాడిన అతను వెంటనే డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిపోయాడు. అనంతరం గాయాన్ని నిర్ధారించిన టీమ్ మేనేజ్మెంట్ అతడికి స్కానింగ్ చేయించాల్సి ఉందని ప్రకటించింది. మరో వైపు గాయంనుంచి కోలుకుంటున్న కేదార్ జాదవ్ కూడా రెండు రోజుల పాటు స్వల్పంగా ప్రాక్టీస్ చేశాడు. -
ప్రపంచకప్ 2019: విజయ్ శంకర్‌కు గాయం?
లండన్: మరికొద్ది రోజుల్లో ప్రపంచకప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆటగాళ్ల గాయాలు టీమిండియాకు ఆందోళనలు కలిగిస్తున్నాయి. ఇప్పటికే ఐపీఎల్లో కేదార్ జాదవ్ గాయం కలవరానికి గురి చేసిన విషయం తెలిసిందే. తాజాగా విజయ్ శంకర్ శుక్రవారం నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా గాయపడినట్టు స్థానిక మీడియా కథనం ప్రచురించింది. ప్రాక్టీస్ సెషన్లో భాగంగా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో కుడి చేతికి గాయం కావడంతో మైదానాన్ని వీడాడని, కివీస్‌తో జరగబోయే వార్మప్ మ్యాచ్‌కు అందుబాటులో ఉండే అవకాశం లేదని కథనంలో పేర్కొంది. అయితే విజయ్ శంకర్ గాయంపై ఇప్పటివరకు బీసీసీఐ అధికారిక ప్రకటన చేయలేదు. ప్రపంచకప్‌కు ప్రకటించిన టీమిండియా జాబితాలో శంకర్ అనూహ్యంగా చోటు దక్కించుకున్నాడు. త్రీ డైమెన్షన్ ప్లేయర్ అంటూ సెలక్టర్లు అంబటి రాయుడుని కాదని శంకర్‌కు అవకాశం కల్పించారు. ఇక ప్రపంచకప్‌లో భాగంగా టీమిండియా న్యూజిలాండ్, బంగ్లాదేశ్‌లో వార్మప్ మ్యాచ్‌లు ఆడనుంది. అనంతరం జూన్ 5న దక్షిణాప్రికాతో ప్రపంచకప్ తొలి పోరును టీమిండియా ప్రారంభించనుంది. -
ఐపీఎల్: రూ.8.40 కోట్ల క్రికెటర్ ఔట్
మొహాలి: కింగ్స్ పంజాబ్ యువ ఆటగాడు వరుణ్ చక్రవర్తి గాయం కారణంగా ఐపీఎల్ మిగతా టోర్నీ నుంచి నిష్క్రమించాడు. కొద్ది రోజుల క్రితం ప్రాక్టీస్ సెషన్లో గాయపడిన అతడు ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ప్రాక్టీస్‌లో భాగంగా చేతి వేలికి తీవ్ర గాయమైంది. దీంతో వైద్యులు వరుణ్‌కు విశ్రాంతి అవసరమని తేల్చి చెప్పారు. తాజాగా మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించగా ఈ తమిళనాడు లెగ్ స్పిన్నర్ గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో మరింత విశ్రాంతి అవసరమని వైద్యులు తెలిపారు. దీంతో తాజా ఐపీఎల్ సీజన్‌కు పూర్తిగా దూరమయ్యాడు. ఈ సీజన్లో ఒకేఒక మ్యాచ్ ఆడిన ఈ యువ స్పిన్నర్.. కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో 35 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ దక్కించుకున్నాడు. కేకేఆర్ మ్యాచ్ అనంతరం వరుణ్‌కు కింగ్స్ పంజాబ్ మరో అవకాశం ఇవ్వలేదు. గతేడాది చివర్లో జరిగిన ఐపీఎల్ వేలంలో అత్యధిక ధర పలికి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు తమిళనాడు యువ క్రికెటర్ వరుణ్ చక్రవర్తి. ఎవరూ ఊహించని రీతిలో ఏకంగా 8.4 కోట్లకు వరుణ్ చక్రవర్తిని పంజాబ్ కింగ్స్ దక్కించుకుంది. విశేషమేమిటంటే ఇతని ధర కేవలం రూ.20 లక్షలుగా మాత్రమే నిర్ణయించడం జరిగింది. కానీ, ఊహించని రీతిలో 8.4 కోట్లకు ధర పలకడం విశేషం. తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో ఆకట్టుకోవడంతో వరుణ్‌కు ఈ బంపర్ ఆఫర్ లభించింది. -
బుమ్రా గాయంపై ఆందోళన అనవసరం: బీసీసీఐ
ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్ సందర్భంగా గాయపడిన భారత పేసర్ బుమ్రా గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బీసీసీఐ ప్రకటించింది. ఫీల్డింగ్ చేస్తూ కిందపడటంతో బుమ్రా ఎడమ భుజానికి గాయమైంది. సోమవారం నిర్వహించిన వైద్య పరీక్షల అనంతరం బుమ్రా గాయం చిన్నదేనని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. స్కానింగ్ రిపోర్ట్ కూడా మామూలుగానే ఉందని పేర్కొన్నారు. తదుపరి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ కోసం ముంబై జట్టు ఇప్పటికే బెంగళూరు చేరగా... బుమ్రా కూడా జట్టుతో కలుస్తాడని వెల్లడించారు. -
అడవి దున్న హల్చల్
సాక్షి, గండేపల్లి: మండలంలోని సింగరంపాలెం పరిధి పొలాల్లో మగ అడవి దున్న హల్చల్ చేస్తోంది. స్థానికులు, పొలాలకు వెళ్లే రైతులు భయభ్రాంతులకు గురవుతున్నారు. పామాయిల్ తోటలో దున్న సంచారాన్ని గమనించిన స్థానికులు మంగళవారం ఫారెస్ట్ అధికారి నూకాసాహెబ్కు సమాచారం అందజేశారు. దున్న నోటికి గాయమై ఏమీ తినలేక నీరసించి ఉందని అటవీ శాఖ అధికారి తెలిపారు. దున్నను బంధించి బోను సహాయంతో విశాఖ జూకు లేదా మారేడుమిల్లికి గానీ తరలిస్తామని ఆ అధికారి చెప్పారు. విశాఖ నుంచి మత్తుమందు ఇచ్చే వైద్యులు రావాల్సి ఉందన్నారు. ఇదిలా ఉండగా గతంలో కె.గోపాలపురం అడవికి సమీపంలో ఒక దున్న మృత్యువాతకు గురైన విషయాన్ని స్థానికులు గుర్తుచేస్తున్నారు. అధికారులు త్వరితగతిన చర్యలు చేపట్టి దున్నను సంరక్షించాలని గ్రామస్థులు కోరుతున్నారు. -
నితిన్.. మీరు ఇప్పుడు బాగానే ఉన్నారా?
నితిన్, రష్మిక మందన్న జంటగా తెరకెక్కనున్న భీష్మా చిత్రానికి వెంకీ కుడుముల దర్శకత్వం వహించనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం గురించి సామాజిక మాధ్యమాల్లో ఎదురవుతున్న ప్రశ్నలపై వెంకీ ట్విటర్లో స్పందించారు. తన భుజానికి అయిన గాయం నుంచి నితిన్ ప్రస్తుతం కోలుకుంటున్నారని తెలిపారు. భీష్మాలో తన బెస్ట్ లుక్ ఇవ్వడాని నితిన్ ప్రయత్నిస్తున్నట్టు వెల్లడించారు. భీష్మా చిత్రం స్ర్కిప్ట్ తుది దశలో ఉందని తెలిపారు. రష్మిక తన షూటింగ్‌లతో బీజిగా ఉందని పేర్కొన్నారు. ఓ మంచి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని అన్నారు. కాగా, రష్మికను తెలుగు తెరకు పరిచయం చేసిన వెంకీ ఈ చిత్రంలో కూడా ఆమెనే హీరోయిన్గా తీసుకున్నారు. ‘నితిన్ సార్‌కు గాయమైనట్టు తెలియదు’ వెంకీ ట్వీట్‌పై రష్మిక స్పందించారు. ‘మూవీ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాను. నితిన్ సార్‌కు గాయమైనట్టు నాకు తెలియదు. నితిన్ మీరు ఇప్పుడు బాగానే ఉన్నారా?. మీరు బాగుండాలని కోరుకుంటున్నా’ అని అమె ట్వీట్లో పేర్కొన్నారు. త్వరలో కలుద్దాం.. రష్మిక, వెంకీ ట్వీట్లపై నితిన్ స్పందించారు. నేను ప్రస్తుతం బాగానే ఉన్నాను. భీష్మా షూట్ కోసం ఎదురుచూస్తున్నానని తెలిపారు. త్వరలోనే సెట్లో కలుద్దామని రష్మికకు తెలిపారు. షూటింగ్ ఎప్పుడూ ప్రారంభమవుతుందని వెంకీని సరదాగా అడిగారు. -
ఆదిలోనే కోహ్లిసేనకు ఎదురుదెబ్బ!
సిడ్నీ : ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్‌కు ముందే భారత్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. డిసెంబర్ 6 నుంచి ప్రారంభమయ్యే 4 టెస్ట్‌ల సిరీస్ సన్నాహకంలో భాగంగా క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఎలెవన్‌తో జరుగుతోన్న నాలుగు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో యువకెరటం, ఓపెనర్ పృథ్వీషా గాయపడ్డాడు. సీఏ ఎలెవన్ ఇన్నింగ్స్‌లో ఆ జట్టు ఓపెనర్ మ్యాక్స్ బ్రియాంట్ క్యాచ్ అందుకునే క్రమంలో ఈ ముంబై క్రికెటర్ ఎడమ చీలిమండకు గాయమైంది. అతని ఎడమ మడిమ సుమారు 90 డిగ్రీలు వంగిపోయింది. వెంటనే ఫిజియోలు షాను ఆసుపత్రికి తరిలించి పరీక్షలు జరిపారు. అతని చీలిమండ కీలుకు గాయం అయిందని తేలడంతో పృథ్వీషా తొలి అడిలైడ్ టెస్ట్ ఆడటం లేదని బీసీసీఐ పేర్కొంది. ఇక వెస్టిండీస్‌తో అరంగేట్ర టెస్ట్‌లోనే శతకం బాధిన పృథ్వీ షా అందరి దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే. ఈ ప్రదర్శనతోనే ప్రతిష్టాత్మక ఆసీస్ పర్యటనకు ఎంపికయ్యాడు. ప్రాక్టీస్ మ్యాచ్‌లో సైతం పృథ్వీ షా (69 బంతుల్లో 66; 11 ఫోర్లు) తనదైన శైలిలో చెలరేగాడు. మంచి ఫామ్‌లో ఉన్న పృథ్వీషా ఇలా గాయంతో జట్టుకు దూరం కావడం కోహ్లిసేనకు తీరని లోటే. అసలే టాపర్డర్‌లో ఎవరిని ఆడించాలని తలపట్టుకుంటున్న టీమిండియా మేనేజ్మెంట్కు పృథ్వీషా గాయం మరింత చిక్కులో పడేసింది. ఇక షా రెండో టెస్ట్‌లోపు అందుబాటులోకి వస్తాడా లేక సిరీస్ నుంచి దూరమవుతాడా? అనేది అతని గాయం తీవ్రతపై ఆధారపడి ఉంది. ఒక వేళ షా సిరీస్ మొత్తం దూరమైతే.. అతని స్థానంలో శిఖర్‌కు అవకాశం కల్పించవచ్చని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. Update: The medical team is assessing Prithvi Shaw at the moment. He hurt his left ankle while attempting to take a catch at the boundary ropes. Shaw is being taken to the hospital for scans #TeamIndia pic.twitter.com/PVyCHBO98e — BCCI (@BCCI) November 30, 2018 -
సరిగ్గా 10 బంతులు వేసాడో లేదో..అంతలోనే!
-
అరంగేట్రం అంతలోనే గాయం!
సాక్షి, హైదరాబాద్ : ‘రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పలేదన్నట్లు’ టీమిండియా యువబౌలర్ శార్థుల్ ఠాకుర్‌కు రాకరాక అవకాశం వస్తే అంతలోనే దురదృష్టం వెంటాడింది. ఉప్పల్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టుతో ఈ యువబౌలర్ అంతర్జాతీయ టెస్ట్‌ల్లో అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టాస్‌గెలిచిన విండీస్.. బ్యాటింగ్ ఎంచుకోవడంతో భారత్ ఫీల్డింగ్‌కు దిగింది. తొలి టెస్ట్ ఉత్సాహంతో బంతి అందుకున్న శార్థుల్ సరిగ్గా 10 బంతులు వేసాడో లేదో అతని చీలమండ గాయం తిరగబెట్టింది. ఈ నొప్పితో అతను విలవిలలాడాడు. చివరకు, కెప్టెన్ కోహ్లి, ఫిజియో సూచన మేరకు మైదానం వీడాడు. దీంతో మైదానంలోని ఆటగాళ్లు, ప్రేక్షకులు అయ్యో ఠాకుర్ అంటూ సానుభూతి వ్యక్తం చేశారు. శార్థుల్ 3.4 బంతులే వేయగా అశ్విన్ మిగిలిన రెండు బంతులను పూర్తి చేశాడు. -
తొలి టెస్టుకు ముందే భారత్‌కు ఎదురు దెబ్బ!
చెమ్స్‌ఫోర్డ్ : ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న టీమిండియాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే గాయాలతో కీలక పేసర్లైన భువనేశ్వర్ కుమార్ సిరీస్ మొత్తానికి దూరం కాగా.. జస్ప్రిత్ బుమ్రా ఆడటంపై అనుమానాలు నెలకొన్నాయి. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ గాయపడ్డాడు. కౌంటీ జట్టు ఎస్సెక్స్‌తో జరుగుతున్న ప్రాక్టీస్ మ్యాచ్‌లో అతను బౌలింగ్ చేయలేదు. దీంతో భారత శిబిరంలో కొంత కలవరపాటు నెలకొంది. ఆందోళన పడాల్సిన విషయం ఏమీ లేదని జట్టు మేనేజ్మెంట్ వెల్లడించినా.. అశ్విన్ ఆడటంపై అనేక ఊహాగానాలు ప్రచారం అవుతున్నాయి. ఇప్పటికే కీలక బౌలర్ల గాయాలతో బలహీనమైన బౌలింగ్ విభాగం అశ్విని గైర్హాజరుతో మరింత బలహీనం కానుంది. అశ్విన్‌కు భవిష్యత్తు టెస్టుల దృష్ట్యా తొలి టెస్టుకు విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే వన్డేల్లో రాణించిన కుల్దీప్ యాదవ్‌కు అవకాశం దక్కనుంది. సీనియర్ స్పిన్నర్ రవీంద్ర జడేజాతో కలిసి కుల్దీప్ జతకట్టనున్నాడు. చదవండి: పేసర్లకు ప్రాక్టీస్ -
నాదల్ పెద్ద తప్పే చేశాడా?
పారిస్/రొనాల్డ్ గారోస్: టెన్నిస్ రారాజు రఫెల్ నాదల్ 11వ ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నెగ్గి సరికొత్త రికార్డును నెలకొల్పాడు. ఆదివారం జరిగిన ఫైనల్ పోరులో ఏడో సీడ్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా)ను 6-4, 6-3, 6-2 సెట్ల తేడాతో చిత్తుగా ఓడించాడు. అయితే ఫైనల్ సమరంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించాడనే విమర్శలు నాదల్‌పై ఇప్పుడు మొదలయ్యాయి. అసలేం చేశాడు... ఫిలిప్పె ఛాట్రైర్ కోర్టులో జరిగిన ఫైనల్ పోరు సందర్భంగా మూడో సెట్ సమయంలో నాదల్ తన ఫిజిషియన్‌ను కోర్టులోకి రప్పించి మణికట్టుకు చికిత్స చేయించుకున్నాడు. అయితే అలా చికిత్స చేయించుకోవటం టోర్నీ రూల్స్ ప్రకారం విరుద్ధం. దీంతో విమర్శలు వెల్లువెత్తాయి. (కల నెరవేర్చాడు..! ఆసక్తికర కథనం) దిగ్గజాల మండిపాటు... నాదల్ చేసింది ఘోర తప్పిదమని టెన్నిస్ దిగ్గజాలు అభిప్రాయపడుతున్నారు. ‘అలాంటప్పుడు మెడికల్ టైమ్ అవుట్లో తాత్కాలిక ఉపశమనం కోసం ప్రయత్నించొచ్చు. కానీ, ఇలా సెట్ మధ్యలో ఉండగా ఫిజిషియన్‌ను రప్పించుకుని చికిత్స చేయించుకోవటం మాత్రం ముమ్మాటికీ నేరమే’ అని మాజీ ఆటగాడు గ్రెగ్ రుసెదిస్కి చెబుతున్నారు. ఇక ఈ వ్యవహారంలో నాదల్‌పై చర్యలు తీసుకోవాల్సిందేనని మరో దిగ్గజం అన్నాబెల్ క్రోఫ్ట్ ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీ నిర్వాహకులను డిమాండ్ చేస్తున్నారు. రూల్స్ నాదల్కు వర్తించవా?.. ఈ టోర్నీలో రాబిన్ హాసే(నెదర్లాండ్స్), డెవిడ్ గొఫ్ఫిన్ (బెల్జియం) మ్యాచ్ సందర్భంగా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. అయితే చైర్ అంఫైర్లు మాత్రం చికిత్సకు నిరాకరించారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ రుసెదిస్కి టోర్నీ నిర్వాహకులపై మండిపడ్డాడు. ‘నాదల్స్కు రూల్స్ వర్తించవా? అతనికి మినహాయింపు ఎందుకిచ్చారు? అతనికి శిక్ష పడాల్సిందే... అంటూ రుసెదిస్కి కోరుతున్నారు. నాదల్ రియాక్షన్... వివాదంపై నాదల్ స్పందించాడు. చేతి కండరాలు పట్టేయటంతోనే ఫిజీషియన్‌ను పిలిపించుకున్నట్లు తెలిపాడు. సెమీస్ నుంచే తనకు నొప్పి వేధించిందని, ఈ వివాదాన్ని అనవసరంగా పెద్దది చేయొకండంటూ ఆయన మాజీలకు విజ్ఞప్తి చేస్తున్నాడు. -
వెన్నెముక గాయానికి చికిత్స!
వెన్నెముకకు గాయమైతే శరీరం సగభాగం చచ్చుబడిపోవడం మొదలుకొని అనేక సమస్యలు ఎదురవుతాయి. వీటికి ఇప్పటివరకూ సమర్థమైన చికిత్స లేనేలేదు. వెన్నెముక నాడులు తమంతట తాము మరమ్మతులు చేసుకునేలా ప్రేరేపించడం ద్వారా ఈ సమస్యలను అధిగమించచవచ్చునని శాస్త్రవేత్తలు ఇప్పటికే గుర్తించగా.. ఇటీవలి కాలంలో ఎలుకలు.. కోతుల్లో జరిగిన ప్రయోగాలూ సత్ఫలితాలే ఇచ్చాయి. ఈ నేపథ్యంలో చైనా శాస్త్రవేత్తలు కొందరు తీవ్రమైన వెన్నెముక గాయాలతో బాధపడుతున్న కోతులను తాము సరిచేయగలిగామని ప్రకటించారు. కోతులకు, మనుషులకు జన్యు సారూప్యత ఎక్కువగా ఉన్నందున ఈ చికిత్స విధానం మానవుల్లోనూ సక్రమంగా పనిచేస్తుందని అంచనా వేస్తున్నట్లు ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ఒకరు చెప్పారు. రొయ్యల్లాంటి జీవుల నుంచి తీసిన ఒక రసాయనాన్ని వెన్నెముక గాయాలున్న కోతులకు అందించినప్పుడు వాటి కేంద్ర నాడీ వ్యవస్థలో మార్పులు చోటు చేసుకున్నట్లు తెలిపారు. వెన్నెముకలో ప్రతి సెంటీమీటర్‌కు కొంత చొప్పున ఈ రసాయనాన్ని చేర్చామని... దీని లోపల ఉండే న్యూరోట్రోపిక్ మందు ఎన్టీ3 ఆ ప్రాంతంలో దీర్ఘకాలం పాటు నెమ్మదిగా విడుదలవుతూ వచ్చిందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ఒకరు చెప్పారు. రసాయనం, మందు రెండూ చుట్టుపక్కల ప్రాంతాల్లో మంట/వాపు కలిగిస్తున్న కణాల పెరుగుదలను అడ్డుకుంటూనే.. నాడీ సంబంధిత మూలకణాలు పెరిగేలా చేశాయని ఫలితంగా అక్కడ ఏర్పడ్డ న్యూరాన్ల నెట్వర్క్ మళ్లీ సంకేతాలు పంపడం మొదలుపెట్టడంతో కోతుల్లో కదలికలు కనిపించాయని వివరించారు. -
ఫ్రెంచ్ ఓపెన్ : ఆడకుండానే వైదొలిగిన పులి
పారిస్/రొనాల్డ్ గారోస్ : బిడ్డకు పాలిచ్చి వచ్చిన పులి సెరెనా. బోనులోంచి బయటికి వచ్చిన చిరుత షరపోవా. ఇద్దరిలో ఆకలి ఉంది. బరిలో ఆహారం ఉంది. ఇదొక యుగాంతపు ఆట అని, ఉమెన్స్ టెన్నిస్‌లో ఈరోజు ధూమ్స్ డే అనుకున్న అభిమానులకు నిరాశే ఎదురైంది. ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ విభాగం నాలుగో రౌండ్లో భాగంగా అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్, రష్యా స్టార్ మారియా షరపోవాల మధ్య ఉత్కంఠగా సాగుతుందనుకున్న మ్యాచ్ జరగనేలేదు. సెరెనా భుజ కండరాల గాయంతో మ్యాచ్‌కు ముందే తప్పుకోవడంతో షరపోవా ఆడకుండానే గెలిచి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. క్వార్టర్ ఫైనల్లో రష్యా స్టార్ ముగురుజ(స్పెయిన్), లెసియా సురెంకో (ఉక్రెయిన్)ల్లో ఒకరితో తలపడనుంది. సెరెనా ఆవేదన.. ‘దురదృష్టవశాత్తు భుజ కండరాల గాయంతో టోర్నీ నుంచి నిష్క్రమిస్తున్నాను. ఈ పరిస్థితుల్లో నేను ఆడలేను. ఇది చాలా కష్టంగా ఉంది. మారియాతో పోటీని ఎప్పుడు ఇష్టపడుతాను. ఇలా జరుగుతుందని ఊహించలేదు. చాలా బాధేస్తుంది. నా కూతురు, కుటుంబానికి దూరంగా ఉంటూ సాధన చేశాను. ఈ పరిస్థితి చాలా కఠినంగా ఉంది.’అని సెరెనా ఆవేదన వ్యక్తం చేసింది. ఇక ఆదివారం జరిగిన ఉమెన్ డబుల్స్‌లో విలియమ్స్ సిస్టర్స్ అండ్రెజా క్లెపాక్(స్లోవేనియా)-మరియా జోస్ మార్టినెజ్(ఇటలీ) చేతిలో ఓటమిపాలైన విషయం తెలిసిందే. చదవండి: పులి.. చిరుత -
రోడ్ టెర్రర్..
సాక్షి, జనగాం జిల్లా : రాష్ట్రంలో వరుస రోడ్డు ప్రమాదాలు ప్రయాణికులను హడలెత్తిస్తున్నాయి. నిత్యకృత్యంగా మారిన రహదారి ప్రమాదాలతో ఎన్నో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. తాజాగా జనగాం మండలం పెంబర్తి గ్రామ శివార్లలో ఆర్టీసి బస్సు, బైక్ ఢీకొన్న ఘటనలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. మృతులను రామన్నగూడెం గ్రామానికి చెందిన తండ్రి కొడుకులు తీగల నర్సయ్య(56), తీగల కృష్ణ(28)గా గుర్తించారు. నర్సయ్య ప్రమాద అక్కడికక్కడే చనిపోగా, కృష్ణ జనగాం ఏరియా అసుపత్రిలో చికిత్స పొందుతు మృతి చెందాడు. అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాలను పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు. మరో ఘటనలో.. పాలకుర్తి మండలం సిరిసన్న గూడెం శివారులో ట్రాక్టర్ బోల్తా పడిన దుర్ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. హూటాహుటిన వారిని ఆసుపత్రికి తీసుకురావటం వల్ల ప్రమాదం తప్పింది. అధిక లోడు కారణంగానే ట్రాక్టర్ బోల్తా పడిందని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. పాము కాటుకు రైతు మృతి బచ్చన్నపేట మండలంలోని సాల్వాపూర్ గ్రామంలో పాము కాటుకు పడాల నరేందర్ అనే రైతు మృతి చెందాడు. రాత్రి సమయంలో పొలానికి నీరు పెట్టేందుకు వెళుతుండగాదారిలో పాము కాటువేసింది. సకాలంలో వైద్యం అందకే మృతి చెందాడని కుటుంబ సభ్యులు విలపించారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. -
సన్‌రైజర్స్‌కు ఎదురుదెబ్బ!
ముంబై : సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే జట్టు సీనియర్ ఆటగాళ్లంతా గాయాలతో ఇబ్బంది పడ్తుంటే.. తాజాగా ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ బిల్లీ స్టాన్లేక్ గాయంతో టోర్నీ నుంచి నిష్క్రమించాడు. వేలు విరగడంతో స్టాన్లేక్ టోర్నీకి దూరమవుతున్నాడని, అతను త్వరంగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ.. సన్‌రైజర్స్ ట్వీట్ చేసింది. ఈ సీజన్లో నాలుగు మ్యాచ్‌లు ఆడిన స్టాన్ లేక్ 5 వికెట్లు పడగొట్టి సన్‌రైజర్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. సన్‌రైజర్స్ తరపున బౌలింగ్ జాబితాలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. అయితే గత ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ ఈ ఆసీస్ బౌలర్ గాయపడ్డాడు. సర్జరీ చేయించుకోవాలని డాక్టర్లు సూచించడంతో ఈ క్యాష్ రిచ్ లీగ్‌కు దూరమయ్యాడు. భువనేశ్వర్‌కు అండగా రాణిస్తాడని భావించిన సన్ యాజమాన్యానికి నిరాశే మిగిలింది. వేలంలో ఈ ఆసీస్ ఆటగాడిని సన్‌రైజర్స్ రూ.50 లక్షలకు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. Billy Stanlake has been ruled out of the remainder of IPL 2018 owing to a fractured finger. The #OrangeArmy wishes him a speedy recovery. — SunRisers Hyderabad (@SunRisers) 24 April 2018 -
సారీ భయ్యా..: హార్ధిక్ పాండ్యా
సాక్షి, ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-11లో భాగంగా మంగళవారం రాత్రి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ యువ క్రికెటర్ ఇషాన్ కిషన్ గాయపడ్డ విషయం తెలిసిందే. ఆ సమయంలో కీపర్ హెల్మెట్ ధరించక పోవడంతో హార్దిక్ పాండ్యా త్రో విసిరిన బంతి నేరుగా ఇషాన్ కిషన్ కుడి కనుబొమ్మకు తగిలింది. దీంతో అతను విలవిల్లాడుతూ మైదానంలో కుప్పకూలిపోయాడు. వెంటనే ముంబై జట్టు వైద్య సిబ్బంది అతన్ని మైదానం నుంచి తీసుకెళ్లారు. ఇక కిషాన్ స్థానంలో రంజీ ఆటగాడు ఆదిత్య తారే కీపింగ్ చేశాడు. ఈ ఆకస్మిక ఘటనతో పాండ్యా మాత్రం తెగ భయపడ్డాడు. అతనికి తీవ్రంగా గాయమైందేమోనని ఆందోళన చెందాడు. అయితే ఈ వ్యవహారంలో పాండ్యా తప్పులేకున్నా.. తన వల్ల ఓ ఆటగాడు గాయపడ్డాడని ఈ ఆల్‌రౌండర్ తీవ్ర మథనపడ్డాడు. గాయం తీవ్రమైంది కాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. మ్యాచ్ ముగిసిన తర్వాత రోజు పాండ్యా, ఇషాన్‌ను కలిశాడు. అతడితో ఫొటో దిగి ట్విటర్లో పోస్ట్ చేశాడు. నా ప్రియమైన సోదరుడా నన్ను మన్నించు.. దృఢంగా నిలబడు అని వ్యాఖ్యానించాడు. కాగా, 2018 ఐపీఎల్ వేలంలో ఇషాన్‌ను రూ.6.2 కోట్లకు ముంబై ఇండియన్స్ దక్కించుకుంది. Mera cutie pie 🤕 Sorry bhai! Stay strong, @ishankishan23. pic.twitter.com/CeN6pF9Xkt — hardik pandya (@hardikpandya7) April 18, 2018 -
ఇషాన్ కిషన్ గాయం.. పాండ్యాకు టెన్షన్.!
ముంబై : రాయల్‌చాలెంజర్స్ బెంగళూరుతో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ తీవ్రంగా గాయపడి మైదానం వీడిన విషయం తెలిసిందే. అయితే ఈ సమయంలో బంతిని విసిరిన హార్ధిక్ పాండ్యా తెగ టెన్షన్ పడ్డాడు. అసలేం జరిగిందంటే.. ఆర్సీబీ ఇన్నింగ్స్.. బుమ్రా వేసిన 13వ ఓవర్లో స్ట్రైకింగ్‌లో ఉన్న కోహ్లి మిడ్‌వికెట్ మీదుగా వచ్చిన బంతిని షాట్ ఆడాడు. ఫ్రంట్ ఫీల్డర్ అద్భుత డైవ్‌తో బంతిని ఆపే ప్రయత్నం చేయగా.. అది కొంత దూరం వెళ్లింది. అయితే బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న పాండ్యా పరుగెత్తుకుంటూ వచ్చి అదే వేగంతో బంతని వికెట్‌కీపర్‌కు విసిరాడు. ఈ బంతి అనూహ్యంగా బౌన్స్ అయి ఇషాన్‌కు తగిలింది. ఈ సమయంలో అతను హెల్మెట్ ధరించకపోవడంతో బంతి నేరుగా కుడి కనుబొమ్మకు తగిలింది. దీంతో అతను విలవిలలాడుతూ మైదానంలో కుప్పకూలిపోయాడు. వెంటనే ముంబై జట్టు వైద్య సిబ్బంది అతన్ని మైదానం నుంచి తీసుకెళ్లారు. ఇక కిషాన్ స్థానంలో రంజీ ఆటగాడు ఆదిత్య తారే కీపింగ్ చేశాడు. ఈ ఆకస్మిక ఘటనతో మైదానంలో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం నెలకొంది. అయితే బంతి విసిరిన పాండ్యా మాత్రం తెగ భయపడ్డాడు. అతనికి తీవ్రంగా గాయమైందేమోనని ఆందోళన చెందాడు. ఈ విషయం టీవీ కెమెరాల్లో స్పష్టం అయింది. అయితే ఈ వ్యవహారంలో పాండ్యా తప్పులేకున్నా.. తన వల్ల ఓ ఆటగాడు గాయపడ్డాడని ఈ ఆలౌరౌండర్ తీవ్ర మదనపడ్డాడు. అదృష్టవశాత్తు బంతి కనుబొమ్మకు తగలడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కన్నుకు తగిలి ఉంటే ఇషాన్ కెరీర్ ప్రశ్నార్థకంలో పడేదని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. తదుపరి మ్యాచ్‌కు కోలుకుంటాడు : రోహిత్ శర్మ గాయపడ్డ ఇషాన్ తదుపరి మ్యాచ్‌కు కోలుకుంటాడని మ్యాచ్ అనంతరం ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఆశాభావం వ్యక్తం చేశాడు. ‘దురదృష్టవశాత్తు.. వ్యక్తిగతంగా అతన్ని పరీక్షంచలేదు. మ్యాచ్ ప్రజంటేషన్ కోసం ఇక్కడకు వచ్చాను. అతని కుడి కన్నుకు కొంచెం వాపు వచ్చింది. రేపటి కల్లా అంతా సర్థుకుంటుంది. మేం మా తదుపరి మ్యాచ్‌ను ఏప్రిల్ 22న ఆడనున్నాం. ఇంకా మూడు, నాలుగు రోజుల సమయం ఉంది. కాబట్టి అప్పటిలోపు అతను కోలుకుంటాడు.’ అని రోహిత్ పేర్కొన్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో ముంబై 46 పరుగుల తేడాతో ఆర్సీబీపై విజయం సాధించి ఈ సీజన్లో ఖాతా తెరిచింది.