టీ20 వరల్డ్‌కప్ గ్రూపు స్టేజిలో అజేయంగా నిలిచిన వెస్టిండీస్‌కు సూపర్-8లో బిగ్ షాక్ తగిలింది. సెయింట్ లూసియా వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో వెస్టిండీస్ ఓటమి పాలైంది. 181 పరుగుల భారీ లక్ష్యాన్ని కాపాడుకోవడంలో విండీస్ బౌలర్లు విఫలమయ్యారు.
181 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లీష్ జట్టు 17.2 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. ఇంగ్లండ్ ఓపెనర్ ఫిల్ సాల్ట్( 7 ఫోర్లు, 5 సిక్స్‌లతో 87 నాటౌట్) అద్బుత ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు.
విండీస్‌కు బిగ్ షాక్..
ఇక ఓటమి బాధలో ఉన్న కరేబియన్ జట్టుకు మరో బిగ్ షాక్ తగిలే అవకాశం ఉంది. ఆ జట్టు స్టార్ ఓపెనర్ బ్రాండెన్ కింగ్ గాయం కారణంగా టోర్నీలో మిగిలిన మ్యాచ్‌లకు దూరం కానున్నట్లు తెలుస్తోంది.
ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కింగ్ గాయపడ్డాడు. సామ్‌కుర్రాన్ బౌలింగ్‌లో కవర్స్ దిశగా షాట్ ఆడే సమయంలో కింగ్ పక్కటెముకలకు గాయమైంది. దీంతో హఠాత్తుగా తీవ్రమైన నొప్పితో కింగ్ విల్లవిల్లాడు. వెంటనే ఫిజియో వచ్చి చికిత్స అందించినప్పటికి అతడి నొప్పి మాత్రం తగ్గలేదు.
దీంతో ఫిజియో సాయంతో కింగ్ మైదానాన్ని వీడాడు. అతడు ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు సమాచారం. అయితే కింగ్ గాయంపై విండీస్ క్రికెట్ బోర్డు ఎటువంటి ప్రకటన చేయలేదు. విండీస్ తమ తదుపరి మ్యాచ్‌లో జూన్ 22న అమెరికాతో తలపడనుంది.
Comments
Please login to add a commentAdd a comment