
యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. వరుసగా రెండు టెస్టుల్లో సెంచరీ మార్క్‌ను చేజార్చుకున్న వార్నర్ వరుసగా 94, 95 పరుగులతో మెరిశాడు. ఇక తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ సమయంలో స్టోక్స్ వేసిన బంతి వార్నర్ పక్కటెముకలకు బలంగా తాకింది. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో వార్నర్ బ్యాటింగ్ దిగకుండా రెస్ట్ తీసుకున్నాడు. అయితే నొప్పి నుంచి కోలుకోవడంతో వార్నర్ రెండో టెస్టులో బరిలోకి దిగాడని అంతా భావించారు. కానీ వార్నర్ ఇంకా పక్కటెముకల గాయంతో బాధపడుతూనే ఉన్నట్లు తేలింది.
దీనిలో భాగంగానే ఇంగ్లండ్ బ్యాటింగ్ సమయంలో వార్నర్ ఫీల్డింగ్‌కు రాలేదు. ఇక ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 13 పరుగులు చేసిన వార్నర్ రనౌటయ్యాడు. డ్రెస్సింగ్‌రూమ్‌లో స్మిత్‌తో సుధీర్ఘంగా చర్చిస్తున్న సమయంలో వార్నర్ నొప్పితో బాధపడినట్లు క్లియర్‌గా కనిపించింది. వీడియోలో వార్నర్ స్నీజ్(ముక్కు చీదుతూ) ఒక పక్కకు పడిపోవడంతో స్మిత్‌తో పాటు కోచ్ జస్టిన్ లాంగర్ కాసేపు ఆందోళనకు లోనయ్యారు. అయితే వార్నర్ తన పరిస్థితి బాగానే ఉందని సైగలు చేయడంతో అంతా కూల్ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
చదవండి: Steve Smith: 'అర్ధరాత్రి పడుకోకుండా ఇదేం పని బాబు'.. వీడియో వైరల్
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఇంగ్లండ్ మరో ఓటమి దిశగా పయనిస్తోంది. 468 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన ఇంగ్లండ్ టీ విరామ సమయానికి వికెట్ నష్టానికి 20 పరుగులు చేసింది. హమీద్ హసీబ్ డకౌట్ కాగా.. బర్న్స్ 20, డేవిడ్ మలాన్ 4 పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 236 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. ఇక ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 473 పరుగులు చేయగా.. రెండో ఇన్నింగ్స్‌లో 230/9 వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఇప్పటికే పిచ్ బౌలర్లకు అనుకూలిస్తుండడంతో ఆటకు ఒకరోజు మొత్తం మిగిలిఉన్న నేపథ్యంలో ఇంగ్లండ్ ఓటమి నుంచి తప్పించుకోవడం కష్టమే.
చదవండి: ''మా జట్టును చూస్తే కోపం, చిరాకు వస్తుంది''
Rib soreness + sneezing = scenes.
— 7Cricket (@7Cricket) December 19, 2021
Poor David Warner 🙈😅 #Ashes pic.twitter.com/nfjE6g38hv