
ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ సూపర్ ఫామ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఇంగ్లండ్‌తో జరుగుతున్న యాషెస్ సిరీస్‌లో తొలి రెండు టెస్టుల్లో కొద్దిలో సెంచరీ చేజార్చుకున్నప్పటికి విజయంలో తనవంతు పాత్ర పోషించాడు. ఇప్పటికే మూడు టెస్టులు వరుసగా గెలిచిన ఆసీస్ సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఐదు టెస్టుల సిరీస్‌లో 3-0తో ఆధిక్యంలో ఉన్న ఆసీస్.. ఇంగ్లండ్‌ను వైట్‌వాష్ చేయాలని భావిస్తోంది. కాగా ఇరుజట్ల మధ్య జనవరి 5 నుంచి నాలుగో టెస్టు మ్యాచ్ జరగనుంది.
చదవండి: Mohammed Shami: సూపర్ షమీ.. ఒకే దెబ్బకు రెండు పిట్టలు
ఈ విషయం పక్కనబెడితే.. వార్నర్ ఆటలో ఎంత యాక్టివ్‌గా ఉంటాడో.. కుటుంబంతో కూడా అంతే ఆనందంగా గడుపుతాడు. మెల్‌బోర్న్ వేదికగా జరిగిన మూడోటెస్టుకు వార్నర్ ఫ్యామిలీ కూడా హాజరైంది. మ్యాచ్ గెలిచిన తర్వాత వార్నర్ తన కూతుర్లతో కలిసి అధికారుల అనుమతితో ఎంసీజీలో క్రికెట్ ఆడాడు. దీనికి సంబంధించిన వీడియోనూ వార్నర్ తన ట్విటర్‌లో షేర్ చేసుకున్నాడు. కాగా వీడియోలో వార్నర్ కూతురు ఇండీ తండ్రిని మించిపోయింది. ఇండీకి బంతి వేస్తే.. లెగ్‌సైడ్ దిశగా భారీ షాట్ ఆడింది. ఈ విషయాన్ని వార్నర్ ట్విటర్‌లో పంచుకుంటూ.. ఎంసీజీ మైదానంలో ఇండీ ఫస్ట్ షాట్ కొట్టింది.. అంటూ క్యాప్షన్ జత చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీలైతే మీరు ఒక లుక్కేయండి.
చదవండి: BBL 2021: ఆండ్రూ టైకి ఊహించని షాక్ ఇచ్చిన అంపైర్లు
Indi having her first hit at the MCG 👌👌 pic.twitter.com/fb9eqd85u0
— David Warner (@davidwarner31) December 28, 2021