
ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో భాగంగా లీడ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా కష్టాల్లో పడినట్లుగా అనిపిస్తుంది. లంచ్ విరామ సమయానికి ఆస్ట్రేలియా నాలుగు వికెట్ల నష్టానికి 91 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్ 5, ట్రెవిస్ హెడ్ 10 పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు ఆసీస్ బ్యాటింగ్‌లో మార్నస్ లబుషేన్ 21, స్టీవ్ స్మిత్ 22 పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ రెండు వికెట్లు తీయగా.. మార్క్ వుడ్, క్రిస్ వోక్స్ చెరొక వికెట్ తీశారు.
ఇక ఆస్ట్రేలియా స్టార్ స్టీవ్ స్మిత్ ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్నాడు. లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో సెంచరీతో మెరిశాడు. అయితే మూడో టెస్టులో 22 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలో స్మిత్ ఒక అరుదైన రికార్డు సాధించాడు. యాషెస్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో స్టీవ్ స్మిత్ మూడో స్థానానికి చేరుకున్నాడు.
లీడ్స్ టెస్టులో 22 పరుగులు చేసిన స్మిత్ ఇప్పటివరకు 3226 పరుగులు సాధించాడు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా దిగ్గజం అలెన్ బోర్డర్(3222 పరుగులు)ను దాటిన స్మిత్ మూడో స్థానానికి చేరుకున్నాడు. స్మిత్ కంటే ముందు జాక్ హాబ్స్(3636 పరుగులు) రెండో స్థానంలో ఉండగా.. తొలి స్థానంలో ఆస్ట్రేలియన్ దిగ్గజం సర్ డాన్ బ్రాడ్‌మన్(5028 పరుగులు) ఎవరికి అందనంత ఎత్తులో ఉన్నాడు.
ఇక స్మిత్‌కు ఇది వందో టెస్టు మ్యాచ్ కావడం విశేషం. ఆసీస్ తరఫున ఈ మైలురాయిని గతంలో 14 మంది చేరుకోగా.. స్మిత్ 15వ ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. చిరకాలం గుర్తుండిపోయే తన 100వ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి, మరింత స్పెషల్‌గా మార్చుకోవాలని స్మిత్ భావిస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో ఆసీస్ గెలిస్తే, సిరీస్‌ను సైతం సొంతం చేసుకుంటుంది. స్మిత్ జట్టులోకి వచ్చాక ఆసీస్.. ఇంగ్లండ్‌లో యాషెస్ సిరీస్ గెలిచింది లేదు. దీంతో ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి చిరస్మరణీయంగా మార్చుకోవాలని స్మిత్ అనుకుంటున్నాడు.కెరీర్‌లో ఇప్పటివరకు 99 టెస్ట్‌లు ఆడిన స్మిత్.. 32 సెంచరీలు, 37 అర్ధసెంచరీల సాయంతో 59.56 సగటున 9113 పరుగులు చేశాడు.
100 seconds of Steve Smith gold, ahead of his 100th Test for Australia tonight! #Ashes pic.twitter.com/y1JbDt3k8t
— cricket.com.au (@cricketcomau) July 6, 2023
చదవండి: భారత్‌లో అత్యంత ధనవంతుడైన క్రికెటర్ ఎవరో తెలుసా?.. కోహ్లి, సచిన్, ధోనిలు కాదు!