highest runs record
-
వందో టెస్టులో స్టీవ్ స్మిత్ అరుదైన రికార్డు
ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో భాగంగా లీడ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా కష్టాల్లో పడినట్లుగా అనిపిస్తుంది. లంచ్ విరామ సమయానికి ఆస్ట్రేలియా నాలుగు వికెట్ల నష్టానికి 91 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్ 5, ట్రెవిస్ హెడ్ 10 పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు ఆసీస్ బ్యాటింగ్‌లో మార్నస్ లబుషేన్ 21, స్టీవ్ స్మిత్ 22 పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ రెండు వికెట్లు తీయగా.. మార్క్ వుడ్, క్రిస్ వోక్స్ చెరొక వికెట్ తీశారు. ఇక ఆస్ట్రేలియా స్టార్ స్టీవ్ స్మిత్ ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్నాడు. లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో సెంచరీతో మెరిశాడు. అయితే మూడో టెస్టులో 22 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలో స్మిత్ ఒక అరుదైన రికార్డు సాధించాడు. యాషెస్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో స్టీవ్ స్మిత్ మూడో స్థానానికి చేరుకున్నాడు. లీడ్స్ టెస్టులో 22 పరుగులు చేసిన స్మిత్ ఇప్పటివరకు 3226 పరుగులు సాధించాడు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా దిగ్గజం అలెన్ బోర్డర్(3222 పరుగులు)ను దాటిన స్మిత్ మూడో స్థానానికి చేరుకున్నాడు. స్మిత్ కంటే ముందు జాక్ హాబ్స్(3636 పరుగులు) రెండో స్థానంలో ఉండగా.. తొలి స్థానంలో ఆస్ట్రేలియన్ దిగ్గజం సర్ డాన్ బ్రాడ్‌మన్(5028 పరుగులు) ఎవరికి అందనంత ఎత్తులో ఉన్నాడు. ఇక స్మిత్‌కు ఇది వందో టెస్టు మ్యాచ్ కావడం విశేషం. ఆసీస్ తరఫున ఈ మైలురాయిని గతంలో 14 మంది చేరుకోగా.. స్మిత్ 15వ ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. చిరకాలం గుర్తుండిపోయే తన 100వ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి, మరింత స్పెషల్‌గా మార్చుకోవాలని స్మిత్ భావిస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో ఆసీస్ గెలిస్తే, సిరీస్‌ను సైతం సొంతం చేసుకుంటుంది. స్మిత్ జట్టులోకి వచ్చాక ఆసీస్.. ఇంగ్లండ్‌లో యాషెస్ సిరీస్ గెలిచింది లేదు. దీంతో ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి చిరస్మరణీయంగా మార్చుకోవాలని స్మిత్ అనుకుంటున్నాడు.కెరీర్లో ఇప్పటివరకు 99 టెస్ట్‌లు ఆడిన స్మిత్.. 32 సెంచరీలు, 37 అర్ధసెంచరీల సాయంతో 59.56 సగటున 9113 పరుగులు చేశాడు. 100 seconds of Steve Smith gold, ahead of his 100th Test for Australia tonight! #Ashes pic.twitter.com/y1JbDt3k8t — cricket.com.au (@cricketcomau) July 6, 2023 చదవండి: భారత్‌లో అత్యంత ధనవంతుడైన క్రికెటర్ ఎవరో తెలుసా?.. కోహ్లి, సచిన్, ధోనిలు కాదు! -
యాషెస్ సమరం.. పరుగుల వరద పారించిన టాప్-10 బ్యాటర్లు
మరికొద్ది గంటల్లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ సమరానికి తెరలేవనుంది. ప్రస్తుతం యాషెస్ సిరీస్‌కు ఇంగ్లండ్ వేదిక కానుంది. ఐదు మ్యాచ్‌ల టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇవాళ(జూన్ 16న) ఎడ్జ్‌బాస్టన్ వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుంది. యాషెస్ ట్రోపీ ప్రస్తుతం ఆస్ట్రేలియా వద్ద ఉండగా.. 2015 తర్వాత మళ్లీ యాషెస్ గెలవని ఇంగ్లండ్ ఈసారి ఎలాగైనా ఆసీస్‌ను దెబ్బతీయాలని కంకణం కట్టుకుంది. బజ్‌బాల్‌తో దూకుడైన ఆటతీరు ప్రదర్శిస్తున్న ఇంగ్లండ్‌ను.. ఇటీవలే ప్రపంచ టెస్టు చాంపియన్‌గా అవతరించిన ఆసీస్ ఏ మేరకు నిలువరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఇక ప్రతిష్టాత్మక సిరీస్‌లో పరుగుల వరద పారడం ఖాయంగా కనిపిస్తోంది. ఒకవైపు వికెట్లతో బౌలర్లు చెలరేగితే.. మరోపక్క బ్యాటర్లు సెంచరీలు, డబుల్ సెంచరీలు అందుకోవాలని చూస్తుంటారు. ఆసీస్ త్రయం స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్, ట్రెవిస్ హెడ్ సూపర్‌ఫామ్‌లో ఉండడం కలిసొచ్చే అంశం. వీరి నుంచి భారీ ఇన్నింగ్స్‌లు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో యాషెస్ చరిత్రలో పరుగుల వరద పారించి టాప్-10 క్రికెటర్లను ఇప్పుడు చూద్దాం. డాన్ బ్రాడ్‌మన్: ఆస్ట్రేలియా దిగ్గజం డాన్ బ్రాడ్‌మన్ యాషెస్ సిరీస్‌లో లీడింగ్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. యాషెస్ సిరీస్‌లో 37 టెస్టులాడిన బ్రాడ్‌మన్ 5028 పరుగులు సాధించాడు. ఈ దిగ్గజం చేసిన 10వేల పరుగుల్లో సగం పరుగులు యాషెస్ సిరీస్‌లోనే వచ్చాయంటే బ్రాడ్‌మన్ ఎంత కసితో ఆడాడో అర్థమవుతుంది. 90 సగటుతో బ్యాటింగ్ చేసిన బ్రాడ్‌మన్ 1930లో జరిగిన సిరీస్‌లో ఏకంగా 974 పరుగులు సాధించాడు. ఇప్పటికి ఇదే అత్యధికంగా ఉంది. జాక్ హబ్స్: ఇంగ్లండ్ దిగ్గజ క్రికెటర్‌గా పేరు పొందిన జాక్ హబ్స్ యాషెస్‌లో 41 టెస్టులాడి 3636 పరుగులు సాధించాడు. 12 సెంచరీలు బాదిన జాన్ హబ్స్ బెస్ట్ ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. అలెన్ బోర్డర్: ఇంగ్లండ్ దిగ్గజ కెప్టెన్ అలెన్ బోర్డర్‌కు కూడా యాషెస్ సిరీస్‌లో మంచి రికార్డు ఉంది. 28 టెస్టులు ఆడిన అలెన్ బోర్డర్ 55.55 సగటుతో 3222 పరుగులు చేశాడు. స్టీవ్ వా: ఆసీస్ దిగ్గజ కెప్టెన్‌గా పేరు పొందిన స్టీవ్ వాకు కూడా యాషెస్‌లో మంచి రికార్డు ఉంది. ఆల్‌రౌండర్‌గా తనదైన ముద్ర వేసిన స్టీవ్ వా 3143 పరుగులు సాధించాడు. ఆసీస్ తరపున అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా పేరు పొందిన స్టీవ్ వాకు యాషెస్‌లో కెప్టెన్‌గా మంచి రికార్డు ఉంది. అతని కెప్టెన్సీలో ఆస్ట్రేలియా రెండుసార్లు యాషెస్ ట్రోపీని నెగ్గడంతో పాటు అతని కెప్టెన్సీలో యాషెస్‌లో తొమ్మిది మ్యాచ్‌లు ఆడి ఎనిమిది మ్యాచ్‌ల్లో విజయాలు అందుకోవడం విశేషం. స్టీవ్ స్మిత్: ప్రస్తుతం బ్రాడ్‌మన్ రికార్డును అందుకోగల సత్తా కేవలం స్టీవ్ స్మిత్‌కు మాత్రమే ఉంది. ఈ శకంలో బెస్ట్ టెస్టు క్రికెటర్‌గా పేరు పొందిన స్మిత్ యాషెస్‌లో 32 టెస్టుల్లో 3044 పరుగులు బాదాడు. తాజాగా జరగనున్న సిరీస్‌లో స్టీవ్‌స్మిత్ కీలకం కానున్నాడు. బీభత్సమైన ఫామ్‌లో ఉన్న స్మిత్ ఇంగ్లండ్ బౌలర్లకు తలనొప్పిగా తయారయ్యాడు. ఒక్కసారి క్రీజులో కుదురుకున్నాడంటే ఔట్ చేయడం మహా కష్టం. డేవిడ్ గోవర్ ఇంగ్లండ్ దిగ్గజం డేవిడ్ గోవర్ యాషెస్‌లో 38 టెస్టులాడి 3037 పరుగులు చేశాడు. వాలీ హామండ్: ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ వాలీ హామండ్ 33 టెస్టుల్లోనే 3852 పరగులు సాధించాడు. హెర్బర్ట్ సట్‌క్లిఫ్ ఇంగ్లండ్ దిగ్గజ క్రికెటర్‌గా పేరు పొందిన హెర్బర్ట్ సట్‌క్లిఫ్ 27 టెస్టుల్లోనే 2741 పరుగులు సాధించాడు. క్లిమెంట్ హిల్: ఆస్ట్రేలియా క్రికెటర్ క్లిమెంట్ హిల్ 41 టెస్టుల్లో 2660 పరుగులు సాధించాడు. జాన్ హెడ్రిచ్: ఇంగ్లండ్‌కు చెందిన జాన్ హెడ్రిచ్ యాషెస్‌లో 32 మ్యాచ్‌లాడి 2644 పరుగులు సాధించాడు. చదవండి: ట్రోల్స్ పట్టించుకోలేదు.. హాలిడే మూడ్‌లో రోహిత్ శర్మ 'సంతోషంగా ఉంది.. బీసీసీఐ పరిస్థితి అర్థమైంది' -
ప్లేఆఫ్స్.. ముంబై ఇండియన్స్ పేరిట అరుదైన రికార్డు
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో ముంబై ఇండియన్స్ ఎలిమినేటర్ మ్యాచ్ ఆడుతున్న సంగతి తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది.కామెరాన్ గ్రీన్ 41 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. సూర్యకుమార్ 33, తిలక్ వర్మ 26, నిహాల్ వదేరా 23 పరుగులతో రాణించారు. ఇక జట్టులో ఒక్కరు కూడా ఫిఫ్టీ మార్క్ అందుకోనప్పటికి ప్లేఆఫ్‌లో అత్యధిక పరుగులు సాధించిన జట్టుగా ముంబై ఇండియన్స్ తొలిస్థానంలో నిలిచింది. ఇంతకముందు 2018 ఫైనల్లో సీఎస్కేపై ఎస్ఆర్హెచ్ 178 పరుగులు చేసింది. ఆ మ్యాచ్‌లో ఒక్క ఫిఫ్టీ కూడా నమోదు కాలేదు. 2018లోనే క్వాలిఫయర్-2లో ఎస్ఆర్హెచ్.. కేకేఆర్‌పై 174 పరుగులు, 2013 క్వాలిఫయర్-2లో ముంబై ఇండియన్స్‌పై రాజస్తాన్ రాయల్స్ 165 పరుగులు, 2008 ఫైనల్లో రాజస్తాన్ రాయల్స్‌పై సీఎస్కే 163 పరుగులు చేసింది. చదవండి: కోహ్లితో కదా వైరం.. రోహిత్ ఏం చేశాడు! -
ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్.. చరిత్ర సృష్టించనున్న విరాట్ కోహ్లి
ఐపీఎల్-2023లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య ఇవాళ (మే 6) రాత్రి 7: 30 గంటలకు జరుగనున్న మ్యాచ్‌లో ఓ భారీ రికార్డు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి 12 పరుగులు చేస్తే.. ఐపీఎల్ చరిత్రలో 7000 పరుగుల మార్కును అందుకున్న తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించనున్నాడు. ప్రస్తుతం కోహ్లి ఖాతాలో 6988 పరుగులు (232 మ్యాచ్‌ల్లో) ఉన్నాయి. ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లి టాప్‌లో ఉండగా.. ఆ తర్వాత శిఖర్ ధవన్ (6536), డేవిడ్ వార్నర్ (6189), రోహిత్ శర్మ (6063) వరుసగా 2, 3, 4 స్థానాల్లో ఉన్నారు. చదవండి: CSK VS MI: ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు మూటగట్టుకున్న రోహిత్ శర్మ కాగా, ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో సూపర్ ఫామ్‌లో (9 మ్యాచ్‌ల్లో 364 పరుగులు, 5 ఫిఫ్టీలు) ఉన్న విరాట్ కోహ్లికి ఢిల్లీతో మ్యాచ్‌లోనే 7000 పరుగుల మార్కును అధిగమించడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. ఐపీఎల్-2023 50వ మ్యాచ్‌లో కోహ్లి ఈ మైలురాయిని అందుకోగలిగితే, అతనికి ఈ మ్యాచ్‌లో చిరకాలం గుర్తుండిపోతుంది. ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించే విషయంలోనూ ఈ మ్యాచ్ చాలా కీలకంగా ఉన్నందున, కోహ్లి సైతం ఈ మ్యాచ్‌లో శక్తి మేరకు రాణించాలని ఆశిస్తాడు. ఆర్సీబీ ప్రస్తుతం 9 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో (-0.030) కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ భారీ తేడాతో గెలిస్తే ఏకంగా 3 స్థానాలు మెరుగుపర్చుకుని రెండో ప్లేస్‌కు (ముంబై చేతిలో చెన్నై ఓడితే) ఎగబాకుతుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో గుజరాత్ టాప్‌లో (14 పాయింట్లు) ఉండగా.. లక్నో (11 పాయింట్లు, 0.639) రెండులో, సీఎస్కే (11 పాయింట్లు, 0.329) మూడులో, రాజస్థాన్ (10 పాయింట్లు, 0.448) నాలుగో స్థానంలో ఉన్నాయి. చదవండి: DC Vs RCB: విరాట్ సెంచరీ కొట్టు.. ఆర్సీబీని గెలిపించు! అదే దాదాకు నువ్విచ్చే కానుక -
ఇంగ్లండ్‌కు వరంలా మారాడు.. 39 ఏళ్ల రికార్డు బద్దలు
పాకిస్తాన్‌తో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌ను ఇంగ్లండ్ 3-0తో క్లీన్‌స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. 17 ఏళ్ల తర్వాత టెస్టు సిరీస్ ఆడేందుకు వచ్చిన ఇంగ్లండ్.. పాక్‌ను వారి సొంతగడ్డపై వైట్‌వాస్ చేసి ఆ జట్టుకు ఘోర పరాభవాన్ని మిగిల్చింది. ఇక ఈ సిరీస్ ద్వారా హ్యారీ బ్రూక్ రూపంలో ఇంగ్లండ్‌కు మంచి బ్యాటర్ దొరికాడు. ఈ సిరీస్‌లో బ్రూక్స్ మూడు టెస్టులు కలిపి 468 పరుగులు సాధించాడు. 93.60 స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్ చేసిన బ్రూక్ ఖాతాలో మూడు సెంచరీలు, ఒక అర్థసెంచరీ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే హ్యారీ బ్రూక్ 39 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు. అదేంటంటే.. పాక్ గడ్డపై ఇంగ్లండ్ తరపున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా హ్యారీ బ్రూక్ నిలిచాడు. ఇంతకముందు 1983-84లో ఇంగ్లండ్ బ్యాటర్ డేవిడ్ గోవర్ 449 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు ఉన్నాయి. ఇదే సిరీస్‌లో 179 పరుగులు నాటౌట్‌గా నిలిచాడు. అంతేకాదు మరో ఇంగ్లండ్ మాజీ ఆటగాడైన మార్కస్ ట్రెస్కోథిక్ రికార్డును కూడా బద్దలు కొట్టాడు. ట్రెస్కోథిక్ పాక్ గడ్డపై 12 ఇన్నింగ్స్‌లు కలిపి 445 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. తాజాగా వీరిద్దరి రికార్డులను బద్దలు కొట్టిన హ్యారీ బ్రూక్ పాక్ గడ్డపై అత్యధిక పరుగులు చేసిన తొలి ఇంగ్లండ్ బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. ఇక పాకిస్తాన్‌తో జరిగిన మూడో టెస్టులో ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా మూడు టెస్టుల సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. కనీసం ఆఖరి టెస్టులోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని చూసిన పాకిస్తాన్‌కు పరాభవమే ఎదురైంది. 167 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 28.1 ఓవర్లలో టార్గెట్‌ను అందుకుంది. బెన్ డకెట్ (78 బంతుల్లో 82 పరుగులు నాటౌట్), బెన్ స్టోక్స్(43 బంతుల్లో 35 పరుగులు నాటౌట్) ఇంగ్లండ్‌ను విజయతీరాలకు చేర్చారు. చదవండి: ఇంగ్లండ్ చేతిలో వైట్‌వాష్.. సొంతగడ్డపై ఘోర పరాభవం అంపైర్‌కు దడ పుట్టించిన బెన్ స్టోక్స్.. -
T20 WC IND VS BAN: చరిత్ర సృష్టించనున్న కింగ్ కోహ్లి..!
టీ20 వరల్డ్‌కప్-2022 గ్రూప్-2లో భాగంగా బంగ్లాదేశ్‌తో ఇవాళ (నవంబర్ 2) జరుగునున్న కీలకమైన మ్యాచ్‌లో భారత్ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి చరిత్ర సృష్టించబోతున్నాడా..? కింగ్ ప్రస్తుత ఫామ్‌ను బట్టి చూస్తే అవుననే చెప్పాలి. ఇంతకీ కోహ్లి సృష్టించబోతున్న ఆ చరిత్ర ఏంటీ అంటే..? టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో ఇప్పటివరకు 22 ఇన్నింగ్స్‌ల్లో 80కి పైగా సగటుతో 1001 పరుగులు చేసిన కోహ్లి.. ఇవాళ బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్‌లో మరో 16 పరుగులు చేస్తే, మెగా ఈవెంట్ చరిత్రలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కుతాడు. ఈ రికార్డు ప్రస్తుతం శ్రీలంక దిగ్గజం మహేళ జయవర్ధనే పేరిట ఉంది. జయవర్ధనే టీ20 వరల్డ్‌కప్‌ల్లో 31 మ్యాచ్‌లు ఆడి 1016 పరుగులు చేశాడు. చదవండి: T20 WC 2022 IND VS BAN Live Updates: తొలుత బ్యాటింగ్ చేయనున్న టీమిండియా ఇదిలా ఉంటే, ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్‌కప్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్న కోహ్లి.. సౌతాఫ్రికాతో జరిగిన గత మ్యాచ్‌లో నిరాశపరిచాడు. ఈ మ్యాచ్‌లో కింగ్ కేవలం 12 పరుగులు మాతమే చేసి ఔటయ్యాడు. అంతకుముందు తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై చారిత్రక ఇన్నింగ్స్ (82 నాటౌట్) ఆడిన కోహ్లి.. అనంతరం నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా అజేయమైన అర్ధ సెంచరీతో (62) రాణించాడు. -
రెండు ఐపీఎల్ రికార్డులపై కన్నేసిన చెన్నై ఓపెనర్..
Ruturaj Gaikwad On Verge Of KL Rahul Record: ఐపీఎల్-2021 సెకెండ్ ఫేస్‌లో భాగంగా నేడు ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగబోయే మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ రెండు ఐపీఎల్ రికార్డులను బద్దలు కొట్టేందుకు సిద్ధమయ్యాడు. ప్రస్తుత సీజన్లో పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ పేరిట ఉన్న అత్యధిక పరుగులు(528 పరుగులు), అత్యధిక సిక్సర్ల(22) రికార్డులకు రుతురాజ్ అతి చేరువలో ఉన్నాడు. ప్రస్తుతం అతని పేరిట 508 పరుగులు, 20 సిక్సర్లు ఉన్నాయి. నేటి మ్యాచ్‌లో మరో 21 పరుగులు, 3 సిక్సర్లు బాదితే కేఎల్ రాహుల్ నుంచి ఆరెంజ్ క్యాప్‌తో పాటు అత్యధిక సిక్సర్ల రికార్డును రుతురాజ్ లాగేసుకుంటాడు. ప్రస్తుతం ఉన్న గణాంకాలను ఈ ఇద్దరు క్రికెటర్లు 12 మ్యాచ్‌ల్లోనే సాధించారు. ఇదిలా ఉంటే, నేటి మ్యాచ్‌లో తలపడుతున్న ఢిల్లీ, సీఎస్కే జట్ల గణాంకాలు ఇప్పటివరకు సమానంగా ఉన్నాయి. ఇరు జట్లు చెరో 12 మ్యాచ్‌ల్లో 9 విజయాలు సాధించి తలో 18 పాయింట్లు తమ ఖాతాల్లో వేసుకున్నారు. అయితే రన్‌రేట్ పరంగా చూస్తే మాత్రం సీఎస్కే జట్టుదే కాస్త పైచేయిగా ఉంది. ఈ జట్టుకు 0.829 నెట్ రన్‌రేట్ ఉండగా.. ఢిల్లీకి 0.551 రన్‌రేట్ ఉంది. ఇక ఇరు జట్ల మధ్య హెడ్ టూ హెడ్ విషయానికొస్తే.. ఇప్పటివరకు ఈ రెండు జట్ల మధ్య 24 మ్యాచ్‌లు జరగ్గా సీఎస్కే 15, ఢిల్లీ 9 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించాయి. ఈ సీజన్ తొలిదశలో జరిగిన మ్యాచ్‌లో సీఎస్కేపై ఢిల్లీ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మరోవైపు ఈ మ్యాచ్‌లో ఢిల్లీ విజయం సాధిస్తే.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకోవడంతో పాటు ఐపీఎల్లో 100వ విజయాన్ని నమోదు చేస్తుంది. చదవండి: మ్యాక్స్‌వెల్ టీ20 ప్రపంచకప్ జట్టు.. అనూహ్యంగా ఆ ఇద్దరికి చోటు -
పొట్టి క్రికెట్లో అరుదైన మైలురాయిని దాటేసిన విండీస్ యోధుడు
సెయింట్ కిట్స్: టీ20 క్రికెట్లో విండీస్ పరిమిత ఓవర్ల సారధి, ముంబై ఇండియన్స్ స్టార్ ఆటగాడు కీరన్ పోలార్డ్ ఓ అరుదైన మైలురాయిని క్రాస్ చేశాడు. ఈ ఫార్మాట్లో 11వేల పరుగుల ల్యాండ్ మార్క్‌ను దాటిన రెండో బ్యాట్స్‌మెన్‌గా చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకు పొట్టి ఫార్మాట్లో 554 మ్యాచ్‌లు ఆడిన పోలార్డ్(11,008).. కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) 2021లో భాగంగా సెయింట్ లూసియా కింగ్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఈ అరుదైన ఫీట్‌ను సాధించాడు. ఈ జాబితాలో యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్.. 14,108 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, పాకిస్థాన్ వెటరన్ ఆటగాడు షోయబ్ మాలిక్(10,741) మూడో స్థానంలో, ఆసీస్ స్టార్ ప్లేయర్ డేవిడ్ వార్నర్(10,0017) నాలుగో ప్లేస్‌లో, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి(9922) ఐదో స్థానంలో కొనసాగుతున్నారు. పోలార్డ్ బౌలింగ్‌లో 297 వికెట్లు పడగొట్టి.. పొట్టి క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఆల్ రౌండర్లలో ముఖ్యుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. చదవండి: విండీస్ విధ్వంసకర ఆటగాడిని దక్కించుకున్న రాజస్తాన్ రాయల్స్ -
నా పరుగుల దాహం తీరనిది: మిథాలీ రాజ్
వార్సెస్టెర్: రెండు దశాబ్దాలకుపైగా అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నప్పటికీ తన పరుగుల దాహం ఇంకా తీరలేదని భారత మహిళా స్టార్ క్రికెటర్, టెస్టు, వన్డే జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ తెలిపింది. వచ్చే ఏడాది న్యూజిలాండ్‌లో జరిగే వన్డే ప్రపంచకప్‌లో రాణించి కెరీర్‌కు వీడ్కోలు పలుకుతానని తెలిపింది. శనివారం ఇంగ్లండ్‌తో జరిగిన చివరిదైన మూడో వన్డేలో భారత సారథి అద్భుత పోరాటపటిమతో జట్టును గెలిపించింది. ఈ క్రమంలోనే ఆమె అంతర్జాతీయ క్రికెట్లో మూడు ఫార్మాట్లలో కలిపి అత్యధిక పరుగులు చేసిన మహిళా క్రికెటర్‌గా చరిత్ర పుటలకెక్కింది. మ్యాచ్ అనంతరం వర్చువల్ మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ‘ఈ సుదీర్ఘ పయనం అంత సులువుగా సాగలేదు. ఎన్నో సవాళ్లు, మరెన్నో ఒడిదుడుకులు అన్నింటినీ తట్టుకున్నాను. అయినా ఎందుకనో... కొన్నిసార్లు వీడ్కోలు చెప్పాలని అనిపించిన ప్రతీసారి ఏదో శక్తి నన్ను బలంగా ముందుకు సాగేలా చేసింది. అందువల్లే 22 ఏళ్ల పాటు ఇంకా అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగుతూనే ఉన్నాను. ఇన్నేళ్లు ఆడినా కూడా నా పరుగుల దాహం, పరుగులు చేయాలనే తపన నానాటికీ పెరుగుతూనే ఉంది. టీమిండియాకు ఇంకా ఎన్నో విజయాలు అందించాలనే పట్టుదల అలాగే ఉంది. మారిన పరిస్థితులు, ప్రత్యర్థి బౌలర్ల ఎత్తుగడల నేపథ్యంలో బ్యాటింగ్‌లో మార్పుచేసుకోవాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు నేను వాటి మీదే దృష్టి పెట్టాను’ అని 38 ఏళ్ల మిథాలీ వివరించింది. తన స్ట్రయిక్ రేట్‌పై విమర్శించే వారితో తనకు పనిలేదని చెప్పింది. ‘గతంలో నేను ఎన్నోసార్లు ఇదే చెప్పాను. ఇప్పుడూ చెబుతున్నా... నేనెపుడు విమర్శకుల్ని పట్టించుకోను. నా స్ట్రయిక్ రేట్‌పై వారి వ్యాఖ్యల్ని కూడా పరిగణించను. ఏళ్ల తరబడి ఆడతున్న నాకు వాళ్ల ధ్రువీకరణ అక్కర్లేదు. క్రీజులో బ్యాటింగ్ చేసే సమయంలో నాకు ఎదురయ్యే బౌలర్లపై కన్నేయాలి. షాట్ల ఎంపిక, బంతిని ఎక్కడకు పంపించి పరుగులు తీయాలనే అంశాలపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఇతరత్రా అంశాలతో నాకు పనిలేదు. నేనేంటో... నాపై జట్టు బరువుబాధ్యతలెంటో నాకే బాగా తెలుసు’ అని ఘాటుగా స్పందించింది. ఇంగ్లండ్‌తో ఏకైక టెస్టును ‘డ్రా’ చేసుకున్న భారత జట్టు మూడు వన్డేల సిరీస్‌ను 1–2తో కోల్పోయింది. ఈ పర్యటనలో చివరిదైన మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్ ఈనెల 9న జరిగే తొలి మ్యాచ్‌తో మొదలవుతుంది. -
సచిన్ రికార్డుకు సరిగ్గా 14 ఏళ్లు.. నేటికీ చెక్కుచెదరలేదు
ముంబై: సరిగ్గా 14 సంవత్సరాల క్రితం ఇదే రోజున(జూన్ 29) క్రికెట్ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ వన్డే క్రికెట్లో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఈ ఫార్మాట్లో 15 వేల పరుగులు పూర్తి చేసుకున్న తొలి క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో సచిన్ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో 227 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. సచిన్ (106 బంతుల్లో 93; 13 ఫోర్లు, 2 సిక్సర్లు) భారీ అర్ధశతకం సాయంతో దక్షిణాఫ్రికాపై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ క్రమంలోనే సచిన్.. వన్డేల్లో 15 వేల పరుగుల మైలురాయిని దాటాడు. నాడు నెలకొల్పిన ఈ రికార్డు నేటికీ చెక్కుచెదరకపోవడం విశేషం. కాగా, 15 నవంబరు 1989లో టెస్ట్ క్రికెట్లో కాలు మోపిన సచిన్.. అదే ఏడాది డిసెంబరు 18న తొలి వన్డే ఆడాడు. 200 టెస్టుల్లో 68 అర్ధశతకాలు, 51 శతకాల సాయంతో 15,921 పరుగులు సాధించిన సచిన్.. 463 వన్డేల్లో 96 హాఫ్ సెంచరీలు, 49 సెంచరీల సాయంతో 18,426 పరుగులు చేశాడు. వన్డే ఫార్మాట్లో తొలి ద్విశతకంతో పాటు పలు రికార్డులను తన ఖాతాలో వేసుకన్న ఈ క్రికెట్ దేవుడు.. 23 ఏళ్ల సుదీర్ఘకాలం పాటు వన్డే క్రికెట్లో కొనసాగాడు. ఈ క్రమంలో ఆయన ఆరు వన్డే ప్రపంచకప్‌లలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 2011లో ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో సచిన్ సభ్యుడు. చదవండి: 'చెత్త' పనికి పరిహారం కట్టిన టీమిండియా మాజీ క్రికెటర్ -
మరో 89 పరుగులే.. ఐపీఎల్లో చరిత్ర సృష్టించనున్న కోహ్లి
చెన్నై: ఐపీఎల్ 2021లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య నేడు జరుగనున్న మ్యాచ్‌లో ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లి చరిత్ర సృషించే అవకాశం ఉంది. ఐపీఎల్లో ఇప్పటి వరకు 185 ఇన్నింగ్స్‌ల్లో 130.6 స్ట్రయిక్ రేట్‌తో 5911 పరుగులు సాధించిన కోహ్లి.. మరో 89 పరుగులు చేస్తే, టోర్నీ చరిత్రలో 6000 పరుగులు సాధించిన తొలి బ్యాట్స్‌మన్‌గా చరిత్ర సృష్టిస్తాడు. ఐపీఎల్లో అత్యధిక పరుగుల వీరుల జాబితాలో కోహ్లి తరువాత సురేష్ రైనా (5422), రోహిత్ శర్మ (5292), శిఖర్ ధావన్ (5282), డేవిడ్ వార్నర్ (5257)లు ఉన్నారు. ఇదిలా ఉంటే లీగ్ చరిత్రలో అత్యధిక శతకాల రికార్డు విండీస్ విధ్వంసకర యోధుడు క్రిస్ గేల్(6 సెంచరీలు) పేరిట ఉంది. ఐపీఎల్లో ఇప్పటి వరకు ఐదు సెంచరీలు నమోదు చేసిన కోహ్లి, నేటి మ్యాచ్‌లో మరో శతకం సాధిస్తే గేల్‌తో సమానంగా అగ్రస్థానంలో నిలిచే అవకాశం ఉంది. కాగా, ఓవరాల్ టీ20 ఫార్మాట్లో ఇప్పటివరకు 9764 పరుగులు చేసిన కోహ్లి... పదివేల పరుగులు పూర్తి చేయడానికి మరో 236 పరుగులు మాత్రమే అవసరం ఉంది. టీ20 ఫార్మాట్లో ఇప్పటివరకు క్రిస్ గేల్, కీరన్ పోలార్డ్, షోయబ్ మాలిక్‌లు మాత్రమే పదివేల పరుగులు పూర్తి చేశారు. వీరిలో గేల్ అత్యధికంగా 13000కు పైగా పరుగులు సాధించి అందరికంటే టాప్‌లో ఉన్నాడు. -
ద్రవిడ్, టెండూల్కర్లను అధిగమించిన కోహ్లీ
భారత టెస్టు జట్టుకు సరికొత్త సారథిగా వ్యవహరిస్తున్న విరాట్ కోహ్లీ.. ఓ సరికొత్త రికార్డు కూడా సృష్టించాడు. ఆస్ట్రేలియా జట్టు మీద ఆ దేశంలో ఆడిన సిరీస్‌లో ఇప్పటి వరకు ఏ భారతీయ బ్యాట్స్‌మన్ చేయనన్ని పరుగులు చేశాడు. సిరీస్‌లో నాలుగు సెంచరీలు చేసిన విరాట్ కోహ్లీ.. మొత్తం 639 పరుగులు చేశాడు. ఇప్పటివరకు ఆస్ట్రేలియాలో ఒక సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు రాహుల్ ద్రవిడ్ (619) పేరు మీద ఉంది. సచిన్ టెండూల్కర్ అయితే.. ఒక సిరీస్‌లో అత్యధికంగా 493 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో.. ఇప్పటివరకు ఆస్ట్రేలియా జట్టును వాళ్ల సొంత గడ్డ మీద వణికించిన వీరుడిగా విరాట్ నిలిచాడు.