ద్రవిడ్, టెండూల్కర్లను అధిగమించిన కోహ్లీ | virat kohli surpasses rahul dravid and sachin tendulkar | Sakshi
Sakshi News home page

ద్రవిడ్, టెండూల్కర్లను అధిగమించిన కోహ్లీ

Published Thu, Jan 8 2015 6:28 PM | Last Updated on Sat, Sep 2 2017 7:24 PM

ద్రవిడ్, టెండూల్కర్లను అధిగమించిన కోహ్లీ

ద్రవిడ్, టెండూల్కర్లను అధిగమించిన కోహ్లీ

భారత టెస్టు జట్టుకు సరికొత్త సారథిగా వ్యవహరిస్తున్న విరాట్ కోహ్లీ.. ఓ సరికొత్త రికార్డు కూడా సృష్టించాడు. ఆస్ట్రేలియా జట్టు మీద ఆ దేశంలో ఆడిన సిరీస్లో ఇప్పటి వరకు ఏ భారతీయ బ్యాట్స్మన్ చేయనన్ని పరుగులు చేశాడు. సిరీస్లో నాలుగు సెంచరీలు చేసిన విరాట్ కోహ్లీ.. మొత్తం 639 పరుగులు చేశాడు.

ఇప్పటివరకు ఆస్ట్రేలియాలో ఒక సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు రాహుల్ ద్రవిడ్ (619) పేరు మీద ఉంది. సచిన్ టెండూల్కర్ అయితే.. ఒక సిరీస్లో అత్యధికంగా 493 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో.. ఇప్పటివరకు ఆస్ట్రేలియా జట్టును వాళ్ల సొంత గడ్డ మీద వణికించిన వీరుడిగా విరాట్ నిలిచాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement