Australia series
-
కుదుపు రేపే నిర్ణయం
భారత క్రికెట్ రంగంలో బుధవారం ఉరుము లేని పిడుగు పడింది. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా భారత జట్టు అయిదు టెస్ట్‌లు ఆడుతుండగా సిరీస్ మధ్యలోనే అగ్రశ్రేణి భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన రిటైర్మెంట్ ప్రకటించడం అనేకమందిని ఆశ్చర్యపరిచింది. ఆస్ట్రేలియాలో బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో భాగంగా బ్రిస్బేన్‌లోని మూడో టెస్ట్‌తో పాటు అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ సైతం ముగిసింది. సంచలనం రేపిన ఈ వార్త పలు అనుమానాలు, ఊహాగానాలకు కూడా తెర తీసింది. తాజాగా పెర్త్, బ్రిస్బేన్ మ్యాచ్‌లలో తుది జట్టులో స్థానం దక్కకపోవడంతో అశ్విన్ స్వచ్ఛందంగా ఆట నుంచి రిటైర్ అవుతున్నట్టు ప్రకటించారు. ‘సిరీస్‌లో ఇప్పుడు నా అవసరం లేనట్టయితే, ఆటకు గుడ్‌బై చెప్పేస్తాను’ అంటూ రిటైర్మెంట్కు ముందు భారత కెప్టెన్ రోహిత్ శర్మకు ఆయన తేల్చిచెప్పేశారు. ‘ఆడే సత్తా నాలో ఇంకా మిగిలే ఉంది. బహుశా, (ఐపీఎల్ లాంటి) క్లబ్–స్థాయి క్రికెట్లో దాన్ని చూపుతాను. భారత జట్టు తరఫున ఆడడం మాత్రం ఇదే ఆఖరి రోజు’ అన్న అశ్విన్ ప్రకటన క్రికెట్ అభిమానులు జీర్ణించుకోలేని విషయమే. మొత్తం 106 టెస్టుల్లో 537 వికెట్లు సాధించిన అశ్విన్ అత్యధిక వికెట్లు పడగొట్టిన రెండో భారత క్రికెటర్. 132 మ్యాచ్‌లలో 619 వికెట్లు సాధించిన నిన్నటి తరం అగ్రశ్రేణి స్పిన్నర్ అనిల్ కుంబ్లే తరువాత అలా ద్వితీయ స్థానంలో నిలిచారు అశ్విన్. బంతితోనే కాదు... బ్యాట్‌తోనూ అరడజను శతకాలు, 14 అర్ధ శతకాలతో 3,503 పరుగులు సాధించిన ఘనత ఆయనది. ఇంకా చెప్పాలంటే, గత 14 ఏళ్ళ పైచిలుకు కాలంలో స్వదేశంలో భారత జట్టు తిరుగులేని శక్తిగా ఎదగడం వెనుక ఈ తమిళ తంబి కీలక పాత్రధారి. ఈ ఏడాది బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో ఆయన ఏకంగా 11వ సారి మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా ఎంపికై, ప్రపంచ రికార్డును సమం చేశారు. బరిలో ఓర్పు, బంతి విసరడంలో నేర్పు, ప్రత్యర్థిని బోల్తా కొట్టించడంలో నైపుణ్యం ఉన్న తెలివైన ఆటగాడాయన.అందుకే, ఆటలో ఈ అగ్రశ్రేణి ఆఫ్ స్పిన్నర్ చూపే ప్రతిభకు ప్రేక్షకులు జేజేలు పలికారు. ప్రస్తుత భారత జట్టు బౌలర్లలో ప్రత్యేకంగా నిలిచారు. ఏ క్రికెటరైనా విదేశాల్లో కాకుండా సొంతగడ్డపై ఆటకు స్వస్తి పలకాలనుకుంటారు. అది సర్వసాధారణం. ఎందుకంటే, స్వదేశంలో సొంత క్రీడాభిమానుల జయజయ ధ్వానాల మధ్య ఘనంగా వీడ్కోలు పలకవచ్చని భావిస్తారు. కానీ, అశ్విన్ అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరించారు. దానికి కారణాలు లేకపోలేదు. ఆడే సత్తా ఉన్న ఏ క్రీడాకారుడైనా బరిలో ఉండాలనుకుంటాడే తప్ప, అవకాశం కోసం నిరీక్షిస్తూ బెంచ్ మీద కూర్చొనే జాబితాలో చేరాలనుకోడు. అది ఎవరికైనా బాధాకరమే. అలాంటిది... టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఆరు టెస్ట్ సెంచరీలు, 500కు పైగా వికెట్లు తీసుకొన్న ఏకైక క్రికెటర్‌కు తరచూ అలాంటి అనుభవం ఎదురైతే? అది మరింత బాధ కలిగిస్తుంది. 38 ఏళ్ళ వయస్సులో, కెరీర్లో కాలం కరిగిపోతున్న వేళ... అశ్విన్‌కు అది అవమానమూ అనిపించింది. భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా సిరీస్‌లో మధ్యలో ఆయన హఠాత్తుగా తన రిటైర్మెంట్ ప్రకటించారనుకోవాలి. సరిగ్గా పదేళ్ళ క్రితం 2014 డిసెంబర్లో మరో అగ్రశ్రేణి భారత క్రికెటర్ ధోనీ సైతం ఇలాగే ఆటకు అల్విదా చెప్పారు. ఈ వాస్తవ పరిణామాలన్నీ గమనిస్తూ, క్షేత్రస్థాయి అంశాలను గమనంలోకి తీసుకున్న వారికి మాత్రం అశ్విన్ నిర్ణయం మరీ దిగ్భ్రాంతికరంగా తోచదు. అదే సమయంలో జీవితంలో, ఆటలో అత్యంత కఠినమైన ఈ నిర్ణయం తీసుకుంటున్నప్పుడు కూడా విమర్శల జోలికి పోకుండా, పక్కా జెంటిల్మన్గానే వ్యవహరిస్తూ అశ్విన్ తన నిర్ణయాన్ని ప్రకటించడం చెప్పుకోదగ్గ విషయం. ఆస్ట్రేలియా సిరీస్‌లోని తొలి మూడు టెస్టుల్లో అడిలైడ్‌లోని రెండో టెస్ట్‌లో మాత్రమే అశ్విన్‌కు జట్టులో స్థానం దక్కింది. ప్రతిభావంతుడైన పాతికేళ్ళ వాషింగ్టన్ సుందర్ అంతకంతకూ ముందు కొస్తూ, అశ్విన్‌ను పక్కకు జరిపి జట్టులో చోటు సంపాదించుకుంటూ పోతున్నారు. ఫలితంగా అశ్విన్ హుందాగానే పక్కకు తప్పుకున్నారు. వికెట్లు పడగొట్టడంలో పేరున్న ఈ స్పిన్నర్ నిర్ణయం ‘వ్యక్తిగతం’ అని రోహిత్ శర్మ చెప్పారు కానీ రిటైర్మెంట్ ప్రకటన అనంతరం విలేఖరుల ప్రశ్నలు వద్దని అశ్విన్ సున్నితంగానే తప్పుకోవడంతో కంటికి కనిపించని కథలున్నాయనే వాదనకు బలం చేకూరింది. అయితే, అశ్విన్ ఆది నుంచి జట్టు సమష్టి ప్రయోజనాలకై ఆడినవారే. అనేక సందర్భాల్లో సెలెక్టర్ల బంతాటలో వైట్ బాల్ గేమ్స్‌లో స్థానం దక్కించుకోకున్నా, పట్టుదలతో ఆడుతూ తనదైన స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇప్పటికీ కనీసం మరో రెండేళ్ళ పాటు అంతర్జాతీయ స్థాయిలో ఆడగల సత్తా ఆయనకుంది. అయినా పక్కకు తప్పుకున్నారు. గతంలో ధోనీ ఆస్ట్రేలియాతోనే మెల్ బోర్న్ టెస్ట్‌లో హుందాగా టెస్ట్ క్రికెట్ నుంచి పక్కకు తప్పుకొని, యువకులకు దోవ ఇచ్చారు. కార ణాలేమైనా, అశ్విన్ ప్రస్తుతానికి పెదవి విప్పి పెద్దగా చెప్పకుండానే పదవీ విరమణ ప్రకటించారు. పేరు ప్రతిష్ఠలు, డబ్బు అన్నీ కెరీర్లో భాగమైన ఆటగాళ్ళు వాటన్నిటినీ వదులుకొని, రిటైరవుతున్నట్టు చెప్పడం నిజానికి ఎప్పుడూ కష్టమే. అశ్విన్ కూడా అందుకు మినహాయింపేమీ కాదు. కాకుంటే, పైకి గంభీరంగా కనిపిస్తూ భావోద్వేగాల్ని ప్రదర్శించకపోవడం విశేషం. అశ్విన్ వ్యక్తిగతం మాటెలా ఉన్నా, ఆయన నిష్క్రమణతో భారత క్రికెట్ ఇప్పుడో చిత్రమైన సంధి దశలో నిలిచింది. బహుశా, ఈ ప్రతిభావంతుడి తాజా నిర్ణయంతో ఒకప్పటి ఫామ్ కోల్పోయి, తడబడుతున్న రోహిత్ శర్మ, కోహ్లీలు సైతం ఆత్మపరిశీలనలో పడాల్సి రావచ్చు. ఎంతైనా ఆర్ట్ ఆఫ్ ‘లీవింగ్’ కూడా ఆర్ట్ ఆఫ్ ‘లివింగ్’లో భాగమే కదా! వెరసి, అశ్విన్ స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడి కోసం అన్వేషణతో పాటు ఆయన నిష్క్రమణకు దారి తీసిన పరిస్థితులపై చర్చ చాలాకాలం కొనసాగడం ఖాయం. -
ఆసీస్ పర్యటనకు ముందు గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నా: రిషబ్
న్యూఢిల్లీ: ధోనీ వారసుడిగా అప్పటి వరకు సాఫీగా సాగిన అతని ప్రయాణం.. అధిక అంచనాలు, బ్యాటింగ్‌లో నిలకడలేమీ, వికెట్ల వెనుక వైఫల్యం, ఫిట్నెస్ సమస్యల కారణంగా ఏకంగా జట్టులో స్థానం కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడి, కుదుపునకు లోనైంది. ఇటీవల ముగిసిన ఐపీఎల్ సీజన్లో(14 మ్యాచ్‌ల్లో 343 పరుగులు) బ్యాట్‌తో పర్వాలేదనిపించినా, వికెట్ కీపింగ్‌లో వైఫల్యాలు, అధిక బరువు కారణంగా.. సోషల్ మీడియాలో అతని అభిమానులకే టార్గెట్‌గా మారిపోయాడు. అయితే ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఆసీస్ పర్యటనలో టీమిండియా సాధించిన చారిత్రక విజయంలో కీలక పాత్ర పోషించిన అతను.. ప్రపంచవ్యాప్త క్రికెట్ అభిమానులకు ఆరాధ్యుడయ్యాడు. సోషల్ మీడియాలో తనను అవమానించిన వాళ్లకు ఇప్పుడతను డార్లింగ్ క్రికెటర్‌గా మారిపోయాడు. అతడే రిషబ్ పంత్. ఆసీస్ పర్యటనను విజయవంతంగా ముగించుకొని స్వదేశానికి చేరుకున్న రిషబ్ పంత్ మీడియాతో మాట్లాడుతూ.. విమర్శలను పట్టించుకోకుండా ఆటపై దృష్టి సారించినందుకే తాను పూర్వవైభవాన్ని సాధించగలిగానని పేర్కొన్నాడు. ఆసీస్ పర్యటనకు ముందు చాలా గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నానని, అయినప్పటికీ తాను ఏమాత్రం కుంగిపోలేదని, తన బలాన్ని మాత్రమే నమ్ముకొని ముందుకు సాగానని వివరించాడు. ఆటలో వైఫల్యాలు ఎదురైనప్పుడు విమర్శలు మామూలేనని, వాటిని ఆటతీరుతోనే తిప్పికొట్టాలని నిర్ణయించుకొన్నట్లు ఆయన పేర్కొన్నాడు. విమర్శలను పట్టించుకోకుండా ఉండేందుకు తాను సోషల్ మీడియాకు కూడా దూరంగా ఉన్నట్లు వెల్లడించాడు. ఆసీస్ పర్యటనలో అత్యధిక పరుగులు(3 టెస్టుల్లో 68.50 సగటుతో 274 పరుగులు) సాధించిన భారత క్రికెటర్‌గా నిలిచిన ఈ ఉత్తరాఖండ్ కుర్రాడు.. తన ఆటతీరుతో విమర్శకుల నోళ్లు మూయించాడు. సిడ్నీ టెస్టులో అతను సాధించిన 97 పరుగులు, బ్రిస్బేన్ టెస్టులో అతని మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్(89 నాటౌట్) టీమిండియా అభిమానులకు చిరకాలం గుర్తుండిపోతుంది. ఈ క్రమంలో అతను అత్యంత వేగంగా 1000 పరుగులు సాధించిన భారత వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్‌గా రికార్డు సృష్టించాడు. గతంలో ఈ రికార్డు ధోనీ పేరిట నమోదైవుంది. ఆసీస్ పర్యటనకు కేవలం టెస్టు జట్టు సభ్యుడిగా ఎంపికైన పంత్.. నిలకడలేమి, అధిక బరువు సమస్యల కారణంగా తుది జట్టులో ఆడతాడా లేదా అన్న అనుమానం ప్రతి భారతీయుడిలో ఉండింది. అయితే అనూహ్యంగా వచ్చిన అవకాశాన్ని ఒడిసిపట్టుకున్న పంత్ తన ఆటతీరుతో విమర్శకుల ప్రశంసలనందుకున్నాడు. -
ఇక అగస్త్య డ్యూటీ...
ముంబై: నాలుగు నెలల పాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్), ఆస్ట్రేలియా సిరీస్ అంటూ క్రికెట్లో తలమునకలై ఉన్న హార్దిక్ పాండ్యా శనివారం కొత్త బాధ్యతల్ని స్వీకరించాడు. తన నాలుగు నెలల కొడుకు అగస్త్య బాగోగుల్ని పాండ్యా భుజానికెత్తుకున్నాడు. ఆసీస్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌కే ఎంపికైన హార్దిక్ భారత్‌కు తిరిగి వచ్చేశాడు. ఇంటికి చేరుకోగానే తన బుజ్జాయి అగస్త్యకు పాలు పట్టిస్తూ సేదతీరాడు. ఆ ఫొటోను ట్విట్టర్లో పంచుకున్న పాండ్యా ‘జాతీయ విధుల నుంచి తండ్రి బాధ్యతల్లోకి’ అనే వ్యాఖ్యను జతచేశాడు. ఆసీస్‌తో వన్డేలు, టి20ల్లో అదరగొట్టిన పాండ్యాకు టెస్టు జట్టులో చోటు దక్కలేదు. ‘వన్డే, టి20 సిరీస్ ముగియగానే ఇంటికి వెళ్లేందుకే ప్రణాళికలు వేసుకున్నా. నేను వదిలి వచ్చినప్పుడు అగస్త్య 15 రోజుల పసికందు. ఇప్పుడు 4 నెలల చిన్నారి. అతన్ని చాలా మిస్ అయ్యా. ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్లాలా అని ఎదురు చూశా’ అని పాండ్యా పేర్కొన్నాడు. -
‘మ్యాట్’పై విహారి సాధన...
సాక్షి, హైదరాబాద్ : భారత ఆటగాళ్లు, పలువురు దేశవాళీ క్రికెటర్లు ఐపీఎల్ 2020 కోసం యూఏఈలో సన్నద్ధమవుతుండగా... తెలుగు కుర్రాడు, టెస్టు జట్టు సభ్యుడు హనుమ విహారి ఏడాది చివర్లో జరిగే ఆస్ట్రేలియా పర్యటన కోసం భిన్నమైన కసరత్తులు చేస్తున్నాడు. బోర్డు కాంట్రాక్టు ప్లేయర్ అయిన విహారి క్లిష్టమైన కంగారు పర్యటన కోసం బ్యాటింగ్ ప్రాక్టీస్‌లో నిమగ్నమయ్యాడు. ‘ఐపీఎల్లో అవకాశం దక్కి ఉంటే బావుండేది. అయితే ఆడే చాన్స్ లేకపోవడంపై ఎక్కువగా ఆలోచించడం లేదు. ఇప్పుడు నేను ప్రాక్టీస్‌పైనే దృష్టి సారించాను. కోచ్ శ్రీధర్ సార్ ఆధ్వర్యంలో నా సాధన కొనసాగుతోంది’ అని విహారి అన్నాడు. లాక్డౌన్ వల్ల బయటికి వెళ్లి ప్రాక్టీస్ చేసే అవకాశం లేకపోవడంతో తన ఇంటి పరిసరాల్లోనే మ్యాటింగ్ వికెట్‌పై ప్రాక్టీస్ చేస్తున్నాడు. నెట్ సెషన్ కోసం కోచ్ సలహా మేరకు ఈ ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపాడు. ఆసీస్‌లోని బౌన్సీ వికెట్లపై ఆడేందుకు ఈ విధమైన మ్యాటింగ్ వికెట్ ప్రాక్టీస్ దోహదం చేస్తుందని విహారి తెలిపాడు. భారత దిగ్గజాలుగా ఎదిగిన అజహరుద్దీన్, వీవీఎస్ లక్ష్మణ్‌లు కూడా ఇలాంటి మ్యాట్ పిచ్‌లపైనే ప్రాక్టీసే చేశారు. ఐపీఎల్లో ఆడని భారత క్రికెటర్ల సన్నాహాల్ని ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్ పర్యవేక్షిస్తున్నారు. నిజానికి విహారి ఇంగ్లండ్‌లో కౌంటీ క్రికెట్ ఆడాల్సి ఉంది. అయితే కరోనా వైరస్ వల్ల అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు ఉండటంతో అక్కడికి వెళ్లలేకపోయాడు. -
టీమిండియాకు అదో హెచ్చరిక
ముంబై: ప్రపంచకప్ సులువుగా గెలుస్తుందనుకున్న టీమిండియాకు ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్ ఓ హెచ్చరిక వంటిదని మాజీ దిగ్గజ క్రికెటర్, అండర్-19 కోచ్ రాహుల్ ద్రవిడ్ పేర్కొన్నాడు. తొలి రెండు మ్యాచ్‌లు గెలిచి ఆధిక్యంలో ఉన్నప్పటికీ 2-3తో సిరీస్ కోల్పోవడం దారుణమన్నాడు. బుధవారం స్థానికంగా ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో సంజయ్ మంజ్రేకరతో కలిసి పాల్గొన్న ద్రవిడ్ పలు విషయాలపై చర్చించారు. రెండేళ్లుగా టీమిండియా అద్భుత ఫామ్‌లో ఉందని.. దీంతో ప్రపంచకప్ సులువుగా గెలుస్తుందని అందరూ భావించారన్నారు. ఇలాంటి సమయంలో ఆసీస్‌తో సిరీస్ ఓటమి ఆశ్చర్యానికి గురిచేసిందన్నాడు. అయితే ప్రపంచకప్‌కు ముందు ఈ ఓటమి కోహ్లి సేనకు ఎంతో మంచి చేస్తుందని ద్రవిడ్ అభిప్రాయపడ్డాడు. ఈ ఓటమితో ఆటగాళ్లు మరింత క్రమశిక్షణతో కష్టపడాలని సూచించాడు. ఆసీస్‌పై అనూహ్యంగా ఓడిపోయినప్పటికీ కోహ్లి సేననే ప్రపంచకప్‌లో ఫేవరేట్ అంటూ ద్రవిడ్ పేర్కొన్నాడు. అయితే అక్కడి పరిస్థితులు, ఒత్తిళ్లను ఎంత తొందరగా జయిస్తే అంతమంచిదన్నాడు. ప్రస్తుతం హాట్ టాపిక్‌గా నడుస్తున్న ఐపీఎల్లో ఆటగాళ్ల పనిభారంపై కూడా స్పందించాడు. కీలక ఆటగాళ్లకు విశ్రాంతినివ్వాలని బోర్డు ఫ్రాంచైజీలకు సూచించాల్సిన అవసరం లేదన్నాడు. తమ శరీరం, ఫిట్‌నెస్‌పై ఆటగాళ్లకు ఓ అవగాహను ఉంటుందన్నారు. క్రమం తప్పకుండా బౌలింగ్ చేయడం వలన లయ తప్పకుండా ఉంటుందని కమిన్స్ చెప్పిన మాటలను ద్రవిడ్ గుర్తు చేశారు. ఈ మధ్య కాలంలో టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తరుచూ గాయపడుతున్నాడని.. ఈ విషయాన్ని అతడే గమనించుకోవాలన్నాడు. ఐపీఎల్లో ఆడాలా వద్దా అనే నిర్ణయాన్ని ఆటగాళ్లకే వదిలేయాలని ద్రవిడ్ సూచించాడు. -
అశ్విన్‌పై హర్భజన్ విమర్శలు
ముంబై: ఆస్ట్రేలియా సిరీస్‌లో భారత ఆఫ్‌స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఫిట్నెస్ తీరును మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తీవ్రంగా తప్పు పట్టాడు. జట్టు ప్రధాన స్పిన్నర్ సొంతగడ్డపై మాత్రమే వికెట్లు తీస్తూ విదేశాల్లో గాయాలకు గురవుతున్నా డంటే ఆందోళన చెందాల్సిన అంశమని అతను అన్నాడు. ‘ఇంగ్లండ్‌లో తొలి టెస్టులో మాత్రమే అశ్విన్ రాణించాడు. ఆ తర్వాత అతను పదును కోల్పోవడంతో పాటు గాయాలపాలయ్యాడు. అడిలైడ్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు తీసిన అశ్విన్‌కు మరో 3 వికెట్లు తీసేందుకు ఏకంగా 52 ఓవర్లు అవసరమయ్యాయంటే విదేశాల్లో అతని పేలవ రికార్డు ఏమిటో తెలుస్తుంది’ అని భజ్జీ విరుచుకు పడ్డాడు. జడేజా, కుల్దీప్‌లనే మున్ముందు అశ్విన్‌కు బదులుగా ప్రధాన స్పిన్నర్లుగా తుది జట్టులోకి తీసుకోవాలని అతను సూచించాడు. -
కోహ్లి మోనాలిసా పెయింటింగ్లాంటోడు!
సిడ్నీ: టీమిండియా సారథి విరాట్ కోహ్లి రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దేశవిదేశాల్లో ఫ్యాన్ ఫాలోయింగ్, మాజీ క్రికెటర్ల నుంచి ప్రశంసలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు డీన్ జోన్స్ టీమిండియా సారథిపై ప్రశంసలు జల్లు కురిపించారు. కోహ్లి బ్యాటింగ్ చేస్తుంటే అలానే చూడాలనిపిస్తుందని పేర్కొన్నాడు. షాట్ సెలక్షన్, టైమింగ్‌లో ప్రస్తుత క్రికెటర్లలో కోహ్లిని మించిన వారెవరూ లేరని పొగడ్తలతో ముంచెత్తాడు. కేవలం స్వదేశంలోనే కాక విదేశాల్లోనూ కోహ్లి అదరగొడుతుండటం అతని ప్రతిభకు నిదర్శనమని ప్రశంసించాడు. కోహ్లితో జాగ్రత్తగా ఉండమని ఆసీస్ ఆటగాళ్లను కూడ హెచ్చరించాడు. (సచిన్ రికార్డులపై కన్నేసిన కోహ్లి) ‘కోహ్లి బ్యాటింగ్‌లో లోపాలను వెతకాలనుకోవడం.. మోనాలిసా పెయింటింగ్‌లో తప్పులను వెతకడంవంటిది. ఏ జట్టయినా అతన్ని కవర్ డ్రైవ్ ఆడకుండా చూడాలి. ఆస్ట్రేలియా బౌలర్లూ అదే పని చేయాలి. పిచ్‌పై వేర్వేరు ప్రాంతాల్లో బౌలింగ్ చేయాలి. అతని వికెట్ దక్కాలని అనుకునే బౌలర్లు వైవిధ్యమైన బంతులేయాలి’అంటూ డీన్ జోన్స్ పేర్కొన్నాడు. అద్భుత ఫామ్‌లో ఉన్న కోహ్లి ఆస్ట్రేలియాతో జరగబోయే నాలుగు టెస్టుల సిరీస్‌లో అదరగొట్టడం ఖాయమని జోన్స్‌తో సహా అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఆసీస్‌లోనూ కోహ్లికి ఘనమైన రికార్డే ఉంది. ఆసీస్ గడ్డపై ఎనిమిది టెస్టుల్లో ఐదు శతకాల సహాయంతో 992 పరుగులు సాధించాడు. ఇక ఈ సిరీస్‌లో మరో రెండు శతకాలు సాధిస్తే సచిన్ టెండూల్కర్(6) రికార్డును కోహ్లి అధిగమించే అవకాశం ఉంది. (కోహ్లికైతే ఇలాగే చేస్తారా: గావస్కర్) -
వారెవ్వా షా.. వాటే క్రేజ్
సిడ్నీ: ఆరంగేట్రంతోనే ఎన్నో రికార్డులు తన ఖాతాలో వేసుకుని టీమిండియా భవిష్యత్తు ఆశా కిరణంగా పృథ్వీ షా కనిపించిన విషయం తెలిసిందే. ఇక తొలి మ్యాచ్‌లోనే అనుభవమున్న ఆటగాడిగా కచ్చితమైన షాట్లతో, అద్భుతమైన టైమింగ్‌తో షా ఆకట్టుకున్నాడు. దీంతో ఈ యంగ్ ప్లేయర్‌ను అభిమానులు, క్రీడా విశ్లేషకులు సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వగ్, ఎంఎస్ ధోనిలతో పొల్చడం మొదలెట్టేశారు. తన ప్రతిభతో కీలక ఆసీస్‌తో నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా తలపడబోయే టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. తొలి సారి ఆసీస్ పర్యటనకు వచ్చిన షాకు నమ్మశక్యంకాని అనుభవం ఎదురైంది. క్రికెట్లో టీమిండియా స్థానం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దేశవిదేశాల్లో టీమిండియా క్రికెటర్లకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇంకా పట్టుమని పది మ్యాచ్‌లు కూడా ఆడని షాకు ఆసీస్‌లోని ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో క్రికెట్ ఆస్ట్రేలియా ఎలెవన్‌తో ప్రాక్టీస్ మ్యాచ్ సందర్భంగా మైదానం బయట పృథ్వీషాతో సెల్ఫీలు దిగడానికి ఫ్యాన్స్ పోటీపడ్డారు. అయితే అభిమానులను నిరుత్సాహపరచకుండా ఓపికగా సెల్ఫీలు దిగి వారందరినీ ఆనందపరిచాడు. దీనికి సంబంధించిన వీడియో బీసీసీఐ షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆసీస్‌లో షా క్రేజ్‌ను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. -
సచిన్ రికార్డులపై కన్నేసిన కోహ్లి
హైదరాబాద్: క్రికెట్ రికార్టులు తిరగరాయటమే అలవాటుగా మార్చుకున్న టీమిండియా సారథి విరాట్ కోహ్లి మరిన్ని రికార్డులపై కన్నేశాడు. సుదీర్ఘ పర్యటనలో భాగంగా టీమిండియా ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టులు ఆడనున్న విషయం తెలిసిందే. అయితే ఆసీస్ గడ్డపై అరుదైన రికార్డును సాధించేందుకు టీమిండియా పరుగుల యంత్రం కోహ్లి మరో రెండు సెంచరీల దూరంలో ఉన్నాడు. ఇప్పటివరకు ఆసీస్‌లో ఐదు టెస్టు శతకాలు సాధించి లెజండర్ క్రికెటర్ సునీల్ గవాస్కర్ రికార్డును సమం చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుత సిరీస్‌లో మరో రెండు సెంచరీలు సాధిస్తే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్(6) రికార్డును అధిగమించే అవకాశం ఉంది. ఇక క్రికెట్ గాడ్ టెస్టుల్లో ఆసీస్‌లో సాధించిన పరుగుల రికార్డును కూడా కోహ్లి తిరగరాసే అవకాశం ఉంది. సచిన్ ఆసీస్ పిచ్‌లపై 20 టెస్టుల్లో 1809 పరుగుల సాధించగా.. కోహ్లి ఎనిమిది టెస్టుల్లోనే 992 పరుగులు సాధించాడు. దీంతో ఈ సిరీస్‌లో మరో 817 పరుగులు సాధిస్తే సచిన్ రికార్డును అధిగమిస్తాడు. భీకరఫామ్‌లో ఉన్న టీమిండియా రన్ మిషన్ ఈ రికార్డులు సాధించడం సులువే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తాజాగా వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లోనూ అతి తక్కువ ఇన్నింగ్స్‌లలో (205) పది వేల పరుగుల మైలురాయిని చేరిన ఆటగాడిగా సచిన్ టెండూల్కర్ (259 ఇన్నింగ్స్) పేరిట ఉన్న రికార్డును కోహ్లి అధిగమించిన విషయం తెలిసిందే. -
విరాట్ కోహ్లి గొప్ప కెప్టెనేం కాదు!
హైదరాబాద్: మ్యాచ్ మ్యాచ్‌కు సరికొత్త రికార్డులను సృష్టిస్తూ క్రికెట్లో సరికొత్త అధ్యయాన్ని టీమిండియా సారథి విరాట్ కోహ్లి లిఖిస్తున్న విషయం తెలిసిందే. ఆటగాడిగా, సారథిగా అపురూప విజయాలును సాధిస్తున్న కోహ్లిపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ఎన్డీటీవీతో ఆఫ్రిది మాట్లాడుతూ.. ‘ప్రస్తుత బ్యాట్స్మన్లలో విరాట్ కోహ్లికి నేను వీరాభిమానిని. ప్రస్తుత క్రికెట్లో అతడే అత్యుత్తమం. కానీ కోహ్లి నాయకత్వ లక్షణాలు అందిపుచ్చుకోవడానికి మరికొంత సమయం పడుతుంది. ధోని నుంచి నాయకత్వ లక్షణాల గురించి కోహ్లి చాలానే నేర్చుకోవాలి. ఎంఎస్ ధోనిలా మైదానంలో వేగంగా నిర్ణయాలు తీసుకోవాలంటే కోహ్లి ఇంకాస్త పరిణితి చెందాలి. నా దృష్టిలో ధోనినే అత్యుత్తమ సారథి. ధోని కూల్ కెప్టెన్సీ, మైదనంలో తీసుకునే నిర్ణయాలకు ఫిదా అయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి’ అంటూ ఆఫ్రిది ధోనిపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నాడు. ఇక ప్రస్తుతం కోహ్లి సేన ఆస్ట్రేలియాపై గెలవడమనేది వారి చేతుల్లోనే ఉందన్నాడు. పొరపాట్లకు ఆస్కారమివ్వకుండా ఆడితే టీమిండియా సులువుగా గెలుస్తుందన్నాడు. యువ ఆటగాళ్లతో కూడిన టీమిండియా బలంగా ఉందన్నాడు. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ జట్లలో అత్యంత బలమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన జట్టు టీమిండియానేనని ప్రశంసించాడు. ఆసీస్ బౌన్సీ పిచ్‌లకు పెద్దగా భయపడాల్సిన అవసరం లేదని, కాస్త జాగ్రత్తగా ఆడితే సులువుగా పరుగులు రాబట్టవచ్చాన్నాడు. -
ఏయ్ చహల్.. ప్రోటీన్ పౌడర్ తీసుకో!
టీమిండియా యువ క్రికెటర్లు సోషల్ మీడియాలో చాలా ఆక్టీవ్‌గా ఉంటారన్న విషయం తెలిసిందే. వారికి సంబందించిన ప్రతీ అప్డేట్స్ని అభిమానులతో పంచుకుంటారు. సహచర ఆటగాళ్లతో సరదా సన్నివేశాలు, ఫన్నీ వీడియోలు, వర్కౌట్ వీడియోలు షేర్ చేస్తూ అలరిస్తుంటారు. అయితే తాజాగా టీమిండియా స్పిన్నర్ యజువేంద్ర చహల్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియో తెగ ట్రోల్ అవుతోంది. ఇక వెస్టిండీస్ విధ్వంసకర ఆటగాడు క్రిస్‌గేల్ సైతం ‘దేవుడా సహాయం చేయ్’ అంటూ చహల్‌పై సెటైర్ వేశాడు. ఆ వీడియోలో ఏముందంటే.. కీలక ఆస్ట్రేలియాతో సిరీస్ సందర్భంగా సెషన్ల వారిగా ప్రాక్టీస్ చేస్తూ టీమిండియా ఆటగాళ్లు చెమట చిందిస్తున్నారు. దీనిలో భాగంగా చహల్ జిమ్‌లో వర్కౌట్స్ చేస్తున్న వీడియో షేర్ చేశాడు. దీనిపై నెటిజన్లు ఫన్నీగా స్పందించారు. ‘బక్కపలచగా ఉండే చహల్ రోజు ప్రోటీన్ పౌడర్ తీసుకో’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సందిస్తున్నారు. ‘నువ్వు ఎంత ట్రై చేసినా గేల్లా బాడీ పెంచలేవు’ అంటూ మరికొందరు ఫన్నీగా స్పందిస్తున్నారు. View this post on Instagram Trying to UP the game down under #stayahead #IndvsAus A post shared by Yuzvendra Chahal (@yuzi_chahal23) on Nov 20, 2018 at 3:46am PST -
‘కోహ్లి పద్దతిగా వ్యవహరించు’
ముంబై: తన బ్యాటింగ్ మెరుపులు, రికార్డులతోనే కాకుండా వివాదాలతోనూ టీమిండియా సారథి విరాట్ కోహ్లి వార్తల్లో నిలుస్తుంటాడు. ఓ అభిమానిని ‘ నీకు నచ్చకుంటే దేశం వదిలి వెళ్లు’ అంటూ చేసిన కామెంట్ పెద్ద వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. దీంతో కీలక ఆస్ట్రేలియా పర్యటన, అభిమానితో వివాదం నేపథ్యంలో సుప్రీంకోర్టు నేతృత్వంలో ఏర్పాటైన బీసీసీఐ పరిపాలన కమిటీ (సీఓఏ) కోహ్లికి క్లాస్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. (దేశం విడిచి వెళ్లిపో : విరాట్ కోహ్లి) 64 రోజుల సుదీర్ఘ పర్యటన నేపథ్యంలో ఆసీస్‌కు టీమిండియా బయలుదేరే ముందు సీఓఏకు చెందిన ఓ ముఖ్య అధికారి విరాట్ కోహ్లితో ప్రత్యేకంగా సంభాషించారని తెలిసింది. మీడియా సమావేశాల్లో, అభిమానులతో మాట్లాడే సమయంలో హుందాగా వ్యవహరించాలని కోహ్లికి సీఓఏ తెలిపినట్లు ముంబై మిర్రర్లో వార్తా కథనం వచ్చింది. ఈ కథనం ప్రకారం సీఓఏ మెంబర్ తొలుత కోహ్లీతో వాట్సాప్‌లో చాట్ చేసి, ఆ తర్వాత ఫోన్లో మాట్లాడారని పేర్కొంది. (రవిశాస్త్రికి సీఓఏ కౌంటర్..!) స్లెడ్జింగ్‌కు మారుపేరైన ఆసీస్ ఆటగాళ్లు కోహ్లిని టార్గెట్ చేస్తారనడంలో సందేహమేలేదు. 2012 ఆస్ట్రేలియా పర్యటనలో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లిని అభిమానులు గేలి చేయడంతో అతడు చేతితో అసభ్య సంజ్ఞలు చేసి విమర్శల పాలయ్యాడు. ఇక 2014లోనూ ఆసీస్ ప్రధాన బౌలర్ మిచెల్ జాన్సన్‌తో గొడవకు దిగాడు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొన్న సీఓఏ కోహ్లికి పలు సూచనలు చేసినట్టు తెలుస్తోంది. (‘అందువల్లే కోహ్లి నియంత్రణ కోల్పోయాడు’) -
‘ఇప్పుడా జట్టు కోహ్లి లేని టీమిండియా వంటిది’
కోల్‌కతా: కీలక టీమిండియా ఆస్ట్రేలియా పర్యటన నేపథ్యంలో బెంగాల్ క్రికెట్ అసోషియేషన్ అధ్యక్షుడు, మాజీ సారథి సౌరవ్ గంగూలీ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బాల్ ట్యాంపరింగ్ వివాదంతో స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ వంటి కీలక బ్యాట్స్‌మెన్ సేవల్ని కోల్పోయిన ఆసీస్ జట్టు బలహీన పడిందని దాదా అభిప్రాయపడ్డాడు. సారథి విరాట్ కోహ్లి, స్టార్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మలు లేకుంటే టీమిండియా ఎలా ఉంటుందో ప్రస్తుతం ఆసీస్ జట్లు పరిస్థితి అలా తయారైందని పేర్కొన్నాడు. ఇక అన్ని విభాగాల్లో బలంగా ఉన్న కోహ్లి సేన ఆసీస్ గడ్డపై సిరీస్ గెలిచేందుకే ఇదే సరైన సమయమని అభిప్రాయం వ్యక్త చేశాడు. అయితే ఆసీస్‌ను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదని, ఆ జట్టు బౌలింగ్‌లో బలంగా ఉందని చెప్పుకొచ్చాడు. అయితే బ్యాటింగ్‌లో ఆసీస్ ఏ మేరకు రాణిస్తుందో వేచిచూడాలన్నాడు. ఇదిలాఉండగా.. టీమిండియా పేసర్ మహ్మద్ షమీ రంజీల్లో బెంగాల్ తరపున బరిలోకి దిగే విషయంపై కూడా గంగూలీ క్లారిటీ ఇచ్చాడు. షమీ ఫిట్నెస్తో ఉంటే త్వరలో కేరళతో జరిగే మ్యాచ్‌లో అతను పాల్గొనే అవకాశం ఉందని దాదా తెలిపాడు. ఇక అభిమానిపై కోహ్లి చేసిన కామెంట్ (దేశం వదిలి వెళ్లు) పై స్పందించేందుకు సౌరవ్ ఇష్టపడలేదు. -
వారే నా అండా దండా!
జహీర్ ఖాన్ తర్వాత సరైన లెఫ్టార్మ్ పేసర్ లేక టీమిండియా ఇబ్బందులకు గురైన విషయం తెలిసిందే. సెలక్టర్లు సైతం యువ లెఫ్టార్మ్ పేసర్లకు అవకాశమిచ్చినా వారు సద్వినియోగం చేసుకోలేదు. ఈ క్రమంలో ఆసియా కప్ వంటి మెగా టోర్నీ కోసం దేశవాళీలో నిలకడగా రాణిస్తున్న రాజస్థాన్ యువ బౌలర్ ఖలీల్ అహ్మద్‌కు సెలక్టర్ల నుంచి పిలుపొచ్చింది. భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన ఈ యువ బౌలర్ విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు. దీంతో భవిష్యత్‌పై ఆశలు రేపిన ఖలీల్‌కు అసలు సవాల్ ఆస్ట్రేలియాలో ఎదురుకానుంది. ఉపఖండపు పిచ్‌లపై రాణించిన ఈ లెఫ్టార్మ్ పేసర్.. పేస్‌కు స్వర్గధామమైన ఆసీస్ పిచ్‌లపై రాణిస్తాడా లేక చేతులెత్తేస్తాడా వేచి చూడాలి. అయితే ఆసీస్ సిరీస్‌కు ఎంపిక కావడం, గత సిరీస్‌లలో తన ప్రదర్శణ , సీనియర్ల సూచనలు తదితర అంశాల గురించి ఖలీల్ ఓ ప్రముఖ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆ ముగ్గురు ప్రోద్బలంతోనే.. తొలి సారి టీమిండియాకు ఎంపిక కావడంతో ఉద్వేగం, ఆనందం, భయం కలిగిందని, కానీ సీనియర్ల సలహాలు, వారి ప్రోత్సాహం మరువలేనిదని, ముఖ్యంగా ఎంఎస్ ధోని, సారథి విరాట్ కోహ్లి, రోహిత్ శర్మల సూచనలు తనకు ఎంతో మేలు చేశాయని ఖలీల్ అహ్మద్ పేర్కొన్నాడు. మాజీ సారథి, సీనియర్ ఆటగాడు ఎంఎస్ ధోని వికెట్ వెనకాల ఉంటే ఏ బౌలర్‌కైనా సగం పని సులువవుతుందని ఖలీల్ తెలిపాడు. బ్యాట్స్‌మన్ కదలికలు వివరించడం, బౌలింగ్ విధానం బట్టి ఫీల్డర్లను అమర్చడంలో ధోనికి సాటిలేరని స్పష్టం చేశాడు. ఇక కొత్త ఆటగాళ్లను ప్రోత్సహించడంలో ధోని ఎప్పుడూ ముందుంటాడని తెలిపాడు. అతనిచ్చిన స్వేచ్చతోనే.. ఇక తన తొలి మ్యాచ్ సారథి రోహిత్ శర్మను ఈ యువ పేసర్ ప్రశంసలతో ముంచెత్తాడు. బౌలింగ్ చేసేటప్పుడు స్వేచ్చనిచ్చేవాడని, ఎన్నో విలువైన సూచనలు ఇచ్చాడని తెలిపాడు. ఆసియాకప్‌ను రోహిత్‌ను అందుకున్న తర్వాత ఆ ట్రోఫిని తనకివ్వడంతో ఒక్క సారిగా ఉద్వేగానికి గురయ్యానని తెలిపాడు. ఇక ఆసియాకప్‌తో సహా, వెస్టిండీస్‌పై నెగ్గిన వన్డే, టీ20 సిరీస్ ట్రోఫీలను సారథులు ఖలీల్‌కు అందించిన విషయం తెలిసిందే. కోహ్లి ఫిట్నెస్ మంత్రం రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లి మైదానంలో ఎంత దూకుడుగా ఉంటాడో.. డ్రెస్సింగ్ రూమ్‌లో ఎంలో ఫన్నీగా ఉంటాడని తెలియజేశాడు. కోహ్లి అనగానే తనకు గుర్తొచ్చేది కష్టపడటం, బాడీ ఫిట్‌గా ఉంచుకోవడమని తెలిపాడు. టీమిండియా పరుగుల యంత్రం నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని, అతడిలా ఫిట్నెస్ కాపాడుకుంటే భవిష్యత్‌లో గొప్ప బౌలర్ అవుతాననే నమ్మకం ఏర్పడిందని అభిప్రాయపడ్డాడు. ఇక బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ ఇచ్చిన అమూల్యమైన సూచనలు గత సిరీస్‌లలో రాణించడానికి ఎంతగానో ఉపయోగపడ్డాయని తెలిపాడు. ఆసీస్ సిరీస్ గురించి.. ఆస్ట్రేలియా సిరీస్ గురించి ఎలాంటి ఆందోళన చెందడం లేదని ఖలీల్ స్పష్టం చేశాడు. కానీ తన అసలైన సవాల్ ఆసీస్‌లోనే మొదలవుతుందన్నాడు. లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేయడమే తన ప్రధాన సూత్రమని, ఆసీస్‌లో అది కచ్చితంగా అమలు చేస్తానని వివరించాడు. అయితే ఉపఖండపు పిచ్‌లతో పోలిస్తే ఆస్ట్రేలియాలో కాస్త కఠినంగా ఉంటాయని, పక్కా ప్రణాళికలతో బౌలింగ్ చేస్తే ఆసీస్ బ్యాట్స్‌మెన్‌ను ఔట్ చేయవచ్చని అభిప్రాయపడ్డాడు. -
ఆస్ట్రేలియా సిరీస్‌తో పునరాగమనం: రోహిత్ శర్మ
గాయం కారణంగా ఇంగ్లండ్ సిరీస్‌కు దూరమైన భారత స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ఆస్ట్రేలియా సిరీస్‌పై కన్నేశాడు. భారత పర్యటనకు వస్తున్న ఆస్ట్రేలియాతో తలపడేందుకు సిద్ధమవుతున్నట్లు చెప్పాడు. గతేడాది న్యూజిలాండ్‌తో జరిగిన చివరి వన్డేలో గాయపడిన రోహిత్ తొడకు లండన్‌లో శస్త్ర చికిత్స జరిగింది. అనంతరం జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో పునరావాస శిబిరంలో పాల్గొన్న అతనికి ఎన్సీఏ సహాయక సిబ్బంది తోడ్పాటునందించిందని పేర్కొన్నాడు. ఆసీస్‌తో సిరీస్ సమయానికి పూర్తిస్థాయి ఫిట్నెస్తో అందుబాటులో ఉంటానని చెప్పాడు. -
ఉఫ్... హమ్మయ్య!
ఊహించినట్లుగానే ఆస్ట్రేలియా ఐదో రోజు ఉదయాన్నే 349 పరుగుల లక్ష్యంతో భారత్‌ను బ్యాటింగ్‌కు పిలిచింది. తొలి రెండు సెషన్లు విరాట్ అండ్ కో ఆచితూచి ఆడి 57 ఓవర్లలో 2 వికెట్లకు 160 పరుగులు చేసి టీ విరామానికి వెళ్లారు. ఇక్కడి నుంచి హై డ్రామా మొదలైంది. ఓ పావుగంట పాటు విజయ్ దడదడలాడించి భారత్ విజయం కోసం ఆడబోతోందని స్పష్టం చేశాడు. ఇక్కడే ఆస్ట్రేలియా బౌలర్లు సత్తా చూపించారు. టపటపా వికెట్లతో భారత్‌ను బెంబేలెత్తించారు. ఫలితం... 217/7. రహానే తప్ప అశ్విన్‌తో సహా ప్రధాన బ్యాట్స్‌మెన్ అంతా పెవిలియన్‌లో కూర్చున్నారు. విజయం సంగతి దేవుడెరుగు. 12 ఓవర్ల పాటు మూడు వికెట్లు పడకుండా కాపాడుకోవాలి. హైడ్రామాలకు పెట్టింది పేరైన సిడ్నీలో ఒక్కసారిగా అందరిలోనూ 2008 తలంపులు. క్లార్క్ ఆఖరి ఓవర్లో మూడు వికెట్లు తీసి మ్యాచ్‌ను భారత్ నుంచి లాగేసిన వైనం పదే పదే గుర్తొస్తోంది. ఓవైపు స్మిత్ కొత్త బంతి తీసుకుని ఎదురుదాడి మొదలుపెట్టాడు. రహానేకు జతగా భువనేశ్వర్... ప్రతి బంతికీ ఉత్కంఠ. ఉఫ్... హా... అయ్యో... ఇలాంటి నిట్టూర్పులు. మొత్తంమీద చివరి గంటలో సిడ్నీలో నరాలు తెగే ఉత్కంఠ. ఈ ఒత్తిడిని రహానే, భువనేశ్వర్ అద్భుతంగా అధిగమించారు. చుట్టూ ఫీల్డర్లు మోహరించినా... ధైర్యంగా మరో వికెట్ పడకుండా పోరాడి భారత్‌ను గట్టెక్కించారు. ఫలితంగా నాలుగు టెస్టుల సిరీస్‌లో ఆసీస్ ఆధిక్యం 2-0కు మించి పెరగకుండా చూశారు. సిడ్నీ: సమయానుకూలంగా ఆటతీరును మార్చుకుంటూ పోరాట స్ఫూర్తిని చూపెట్టిన భారత్ జట్టు... ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్టును డ్రాగా ముగించింది. చివరి సెషన్లో టపటపా వికెట్లు పడినా.. రహానే (38 నాటౌట్), భువనేశ్వర్ (20 నాటౌట్) సహనంతో బ్యాటింగ్ చేసి జట్టును గట్టెక్కించారు. సిడ్నీ మైదానంలో శనివారం ముగిసిన ఈ మ్యాచ్‌లో... 349 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 89.5 ఓవర్లలో 7 వికెట్లకు 252 పరుగులు చేసింది. విజయ్ (165 బంతుల్లో 80; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), కోహ్లి (95 బంతుల్లో 46; 3 ఫోర్లు), రోహిత్ (90 బంతుల్లో 39; 2 ఫోర్లు, 2 సిక్సర్లు)లు రాణించారు. స్టార్క్, లయోన్, హాజెల్‌వుడ్ తలా రెండు వికెట్లు తీశారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 251/6 వద్దే ఆసీస్ తమ రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. స్మిత్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’; ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు దక్కాయి. భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్ల మధ్య ముక్కోణపు వన్డే టోర్నీ 16 నుంచి జరుగుతుంది. స్కోరు వివరాలు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 572/7 డిక్లేర్డ్ భారత్ తొలి ఇన్నింగ్స్: 475 ఆలౌట్ ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: 251/6 డిక్లేర్డ్ భారత్ రెండో ఇన్నింగ్స్: విజయ్ (సి) హాడిన్ (బి) హాజెల్‌వుడ్ 80; రాహుల్ (సి) వార్నర్ (బి) లయోన్ 16; రోహిత్ (సి) స్మిత్ (బి) వాట్సన్ 39; కోహ్లి (సి) వాట్సన్ (బి) స్టార్క్ 46; రహానే నాటౌట్ 38; రైనా ఎల్బీడబ్ల్యూ (బి) స్టార్క్ 0; సాహా ఎల్బీడబ్ల్యూ (బి) లయోన్ 0; అశ్విన్ ఎల్బీడబ్ల్యూ (బి) హాజెల్‌వుడ్ 1; భువనేశ్వర్ నాటౌట్ 20; ఎక్స్‌ట్రాలు: 12; మొత్తం: (89.5 ఓవర్లలో 7 వికెట్లకు) 252. వికెట్ల పతనం: 1-48; 2-104; 3-178; 4-201; 5-203; 6-208; 7-217 బౌలింగ్: స్టార్క్ 19-7-36-2; హారిస్ 13-3-34-0; లయోన్ 30.5-5-110-2; హాజెల్‌వుడ్ 17-7-31-2; స్మిత్ 2-0-7-0; వాట్సన్ 8-2-22-1 సెషన్-1: విజయ్ జోరు లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన విజయ్, లోకేశ్ రాహుల్ (16) నెమ్మదిగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. కొత్త బంతిని ఆచితూచి ఆడటంతో తొలి ఏడు ఓవర్లలో కేవలం 9 పరుగులు మాత్రమే చేశారు. పిచ్ స్పిన్‌కు అనుకూలంగా ఉండటంతో ఆరో ఓవర్లోనే లయోన్‌కు స్మిత్ బంతి అప్పగించాడు. అయితే పదో ఓవర్లో విజయ్ చెలరేగి 16 పరుగులు రాబట్టడంతో భారత్ స్కోరు కాస్త వేగంగా కదిలింది. కానీ రెండో ఎండ్‌లో బాగా ఇబ్బందిపడ్డ రాహుల్ 14వ ఓవర్లో లయోన్ బంతిని వార్నర్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. దీంతో తొలి వికెట్‌కు 48 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఈ దశలో వచ్చిన రోహిత్ ఎదుర్కొన్న తొలి బంతికే స్టంప్ అవుటయ్యే అవకాశం నుంచి తప్పించుకున్నాడు. తర్వాత 6.4 ఓవర్ల వరకు ఒక్క పరుగు కూడా చేయలేకపోయాడు. చివరకు 24వ ఓవర్లో ఓ భారీ సిక్స్, బౌండరీతో గాడిలో పడ్డాడు. తర్వాత ఈ జోడి లంచ్ వరకు ఎలాంటి తడబాటు లేకుండా ఆడింది. ఓవర్లు: 29; పరుగులు: 73; వికెట్లు: 1 సెషన్-2 : కోహ్లి నిలకడ లంచ్ తర్వాత విజయ్, రోహిత్ నిలకడగా ఆడినా భారీ భాగస్వామ్యాన్ని మాత్రం నమోదు చేయలేకపోయారు. విరామం తర్వాత 9వ ఓవర్లో రోహిత్ ఇచ్చిన క్యాచ్‌ను స్లిప్‌లో డైవ్ చేస్తూ స్మిత్ ఒంటిచేత్తో అద్భుతంగా అందుకున్నాడు. విజయ్, రోహిత్ రెండో వికెట్‌కు 56 పరుగులు జోడించారు. తర్వాత వచ్చిన కోహ్లి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఇన్నింగ్స్‌ను సాఫీగా నడిపించాడు. దీంతో భారత్ 37వ ఓవర్లో వంద పరుగులకు చేరుకుంది. అయితే 42 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద విజయ్ ఇచ్చిన క్యాచ్‌ను షార్ట్ కవర్లో మార్ష్ వదిలేశాడు. తర్వాతి ఓవర్లోనే మరోసారి ఎల్బీ నుంచి తప్పించుకున్నాడు. విజయ్ అవుటైనట్లు రీప్లేలో స్పష్టమైనా అంపైర్ సంతృప్తి చెందలేదు. కొద్దిసేపటికే విజయ్ 135 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ సిరీస్‌లో అతనికిది నాలుగోది. ఈ జోడి నిలకడతో భారత్ 160/2 స్కోరుతో టీకి వెళ్లింది. ఓవర్లు: 28; పరుగులు: 87; వికెట్లు: 1 సెషన్-3: బౌలర్ల హవా ఇక చివరి సెషన్లో భారత్ గెలవాలంటే 189 పరుగులు చేయాలి. చేతిలో ఎనిమిది వికెట్లున్నాయి. క్రీజులో ఉన్న విజయ్, కోహ్లి మంచి జోరుమీదున్నారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలనుకున్న టీమిండియాకు ఆసీస్ బౌలర్లు ఊహించని షాక్ ఇచ్చారు. నిలకడగా ఆడుతున్న విజయ్ను 61వ ఓవర్లో హాజెల్‌వుడ్ బోల్తా కొట్టించాడు. దీంతో మూడో వికెట్‌కు 74 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. అప్పుడే వచ్చిన రహానే కుదురుకునేందుకు కాస్త సమయం తీసుకున్నాడు. కానీ భారత్ స్కోరు 200లకు చేరిన వెంటనే కోహ్లి, ఆ తర్వాత స్వల్ప వ్యవధిలో రైనా (0), సాహా (0)లు వెనుదిరి గారు. ఓవరాల్‌గా 7 పరుగుల వ్యవధిలో మూడు వికెట్లు చేజార్చుకోవడంతో భారత్ గెలుపుపై ఆశలు వదిలేసుకుంది. ఇక మ్యాచ్‌ను కాపాడే బాధ్యత రహానేపై పడింది. అశ్విన్‌తో కలిసి 7.1 ఓవర్లు బ్యాటింగ్ చేసి కేవలం 9 పరుగులు జోడించారు. అయితే 79వ ఓవర్లో అశ్విన్ అవుట్ కావడంతో భారత్ శిబిరంలో ఆందోళన మొదలైంది. ఈ దశలో భువనేశ్వర్ ఆపద్బాంధవుడి పాత్ర పోషించాడు. అత్యంత కీలకమైన 69 బంతులను ఓర్పుతో ఎదుర్కొన్న ఈ జంట ఎనిమిదో వికెట్‌కు అజేయంగా 35 పరుగులు జోడించి మ్యాచ్‌ను డ్రాగా ముగించింది. ఓవర్లు: 32.5; పరుగులు: 92; వికెట్లు: 5 3113 నాలుగు టెస్టుల్లో కలిపి ఆసీస్ చేసిన పరుగులు. గతంలో దక్షిణాఫ్రికా 2962 పరుగుల రికార్డును స్మిత్ సేన అధిగమించింది. 692 ఈ సిరీస్‌లో కోహ్లి చేసిన పరుగులు. ఆసీస్‌లో ఒక సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన తొలి భారత బ్యాట్స్‌మన్‌గా రికార్డులకెక్కాడు. కానీ ఏ సిరీస్‌లోనైనా ఎక్కువ పరుగులు చేసిన రెండో బ్యాట్స్‌మన్ విరాట్. గతంలో గవాస్కర్ రెండుసార్లు విండీస్‌పై 700కు పైగా పరుగులు చేశాడు. 482 ఈ సిరీస్‌లో మురళీ విజయ్ చేసిన పరుగులు. ఆస్ట్రేలియాలో భారత్ తరఫున ఓపెనింగ్ బ్యాట్స్‌మన్‌కు ఇదే అత్యధికం. 2 గత 20 ఏళ్లలో సిడ్నీలో డ్రా అయిన టెస్టుల సంఖ్య. ఈ కాలంలో 22 టెస్టులు ఆడితే ఆసీస్ 17 గెలవగా, మూడింటిలో ఓడింది. 5 చివరి ఏడు ఇన్నింగ్స్‌ల్లో రైనా ఐదుసార్లు డకౌటయ్యాడు. అలాగే మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో డకౌట్ కావడం ఇది రెండోసారి. 2011 ఓవల్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో డకౌట్ అయ్యాడు. ఓటమంటే నాకు అసహ్యం. పోటీ ఇవ్వడానికే ఇక్కడికి వచ్చాం. ప్రత్యర్థులు ఈ విషయాన్ని గ్రహించి మాకు సరైన గౌరవం ఇవ్వాలి. కుర్రాళ్లమని తేలికగా తీసిపారేయకూడదు. అలా ఆలోచించడం వారికే మంచిదికాదు. మేం ప్రపంచకప్‌ను గెలవబోతున్నాం. ఆ నమ్మకం మాకుంది. ఆసీస్‌లో మేం మంచి క్రికెట్ ఆడాం. ఈ అనుభవం మాకు వరల్డ్‌కప్‌లో ఉపయోగపడుతుంది. అంతర్జాతీయ స్థాయిలో బౌలింగ్ ఎలా చేయాలో ఆసీస్‌ను చూసి నేర్చుకోవాలి. నేను అవుటయ్యే వరకు విజయం కోసం ప్రయత్నించి చూడాలనుకున్నాం. మా ఆటగాళ్లు కూడా బాగా ఆడారు. బ్యాటింగ్, బౌలింగ్‌లో ఇంకా నిలకడ రావాలి. మాటల యుద్ధం సహజం. కానీ ప్రత్యర్థులు మమ్మల్ని గౌరవించడం నేర్చుకోవాలి. సిరీస్‌లో ఓడినా వ్యక్తిగతంగా నాకు సానుకూల ఫలితాన్నే ఇచ్చింది. నాపై నమ్మకం ఉంది కాబట్టి ఎక్కువగా ఒత్తిడి తీసుకోలేదు. ఇక టెస్టులను మర్చి వన్డేలపై దృష్టిపెడతాం. -కోహ్లి (భారత కెప్టెన్) ఈ సిరీస్‌లో 20 వికెట్లు తీయడం చాలా కష్టంగా మారింది. మేం ఊహించిన విధంగా పిచ్‌లు లేవు. లేకపోతే సిరీస్‌ను ఇంకా మెరుగైన ఆధిక్యంతో గెలిచేవాళ్లం. నాలుగు టెస్టుల్లో బౌలర్లు బాగా కష్టపడ్డారు. ఐదో రోజు భారత్‌ను ఆలౌట్ చేయకపోవడం కాస్త నిరాశ కలిగించింది. గెలిచి ఉంటే బాగుండేది. లయోన్ కొన్ని అవకాశాలను సృష్టించినా వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయాం. బావోద్వేగాల మధ్య ఈ సిరీస్ ఆడటం బాగా కష్టమైంది. అయినప్పటికీ సిరీస్ గెలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. కెప్టెన్సీని బాగా ఆస్వాదించా. అద్భుతమైన జట్టుకు నాయకత్వం వహించా. సీనియర్లు బాగా సహకరించారు. నేను కోరుకున్న విధంగా ఆటగాళ్లు రాణించారు. -స్మిత్ (ఆసీస్ కెప్టెన్) -
టెస్టు సిరీస్.. ఆస్ట్రేలియాదే!!
-
భారత్-ఆస్ట్రేలియా చివరి టెస్టు మ్యాచ్ డ్రా
-
హమ్మయ్యా..ఓటమి నుంచి బయట పడ్డారు!
సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరిగిన చివరి టెస్టు మ్యాచ్ లో టీమిండియా ఓటమి నుంచి బయట పడింది. శనివారం చివరి రోజు ఆటలో భాగంగా టీమిండియా అతికష్టం మీద గట్టెక్కింది. ఓ దశలో ఓటమి దిశగా పయనించిన టీమిండియాను అజ్యింకా రహానే, భువనేశ్వర్ జోడీ కాపాడింది. ఏడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న టీమిండియా మరో ఓటమి బారిన పడకుండా కాపాడి తమవంతు బాధ్యతను సమర్ధవంతంగా నిర్వర్తించారు. ఈ ఆఖరి మ్యాచ్ పై తొలుత ఇరు జట్లు గెలుపుపై ఆశలు పెట్టుకున్నాచివరకు డ్రాతో సరిపెట్టుకోక తప్పలేదు. 349 పరుగుల విజయలక్ష్యంతో శనివారం బ్యాటింగ్ ఆరంభించిన టీమిండియా ఆదిలో లక్ష్యం దిశగా పయనించినట్లు కనిపించింది. టీమిండియా ఓపెనర్ , గత ఇన్నింగ్స్ సెంచరీ హీరో కేఎల్ రాహుల్ (16)లు చేసి ఆదిలోనే పెవిలియన్ కు చేరాడు. ఆ సమయంలోమురళీ విజయ్ (80, రోహిత్ శర్మ(39) పరుగులు చేసి జట్టు పరిస్థితిని చక్కదిద్దారు. అనంతరం విరాట్ కోహ్లీ(46), సురేష్ రైనా(0), సాహా (0) వికెట్లను వరుసగా కోల్పోయిన టీమిండియా స్వల్ప వ్యవధిలో కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో ఆసీస్ కు మరో విజయానికి చేరువగా పయనించింది. కాగా అజ్యింకా రహానే తన మార్కు ఆటను ప్రదర్శించి ఆసీస్ అటాకింగ్ ను అడ్డుకున్నాడు.88 బంతులను ఎదుర్కొన్న రహానే ఐదు ఫోర్ల సాయంతో 38 పరుగులు చేసి నాటౌట్ గా మిగిలాడు. అతనికి జతగా భువనేశ్వర్ కుమార్ (20) పరుగులు చేసి టీమిండియా ఓటమిని అడ్డుకున్నాడు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్ , లయన్ లకు తలో రెండు వికెట్లు దక్కగా, హజిల్ వుడ్ లకు తలో రెండు వికెట్లు దక్కగా వాట్సన్ వికెట్ లభించింది. ఇప్పటికే రెండు టెస్టులను గెలిచిన ఆస్ట్రేలియా సిరీస్ ను కైవశం చేసుకున్న సంగతి తెలిసిందే. అడిలైడ్, బ్రిస్బేన్ టెస్టుల్లో ఆసీస్ గెలవగా.. మెల్ బోర్న్, సిడ్నీ టెస్టులు మాత్రం డ్రాగా ముగిశాయి. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ 572/7 డిక్లేర్, రెండో ఇన్నింగ్స్ 251/6 డిక్లేర్ భారత తొలి ఇన్నింగ్స్ 475, రెండో ఇన్నింగ్స్ 252/7 -
ఏడో వికెట్ కోల్పోయిన టీమిండియా(217/7)
సిడ్నీ: ఆస్ట్రేలియా తో జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా రెండో ఇన్నింగ్స్ లో 217 పరుగుల వద్ద ఏడో వికెట్ ను కోల్పోయింది.22 బంతులను ఎదుర్కొన్న రవి చంద్రన్ అశ్విన్ ఒక పరుగు మాత్రమే చేసి ఏడో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. అంతకుముందు సాహా, సురేష్ రైనాలు డకౌట్లుగా పెవిలియన్ కు చేరారు. ఈ ఇన్నింగ్స్ లో మురళీ విజయ్ (80), విరాట్ కోహ్లీ(46), రోహిత్ శర్మ(39) పరుగుల మినహా ఎవరూ ఆకట్టుకోలేదు. -
ఆరో వికెట్ ను కోల్పోయిన టీమిండియా(208/6)
సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా 208 పరుగుల వద్ద ఆరో వికెట్ ను కోల్పోయింది. సాహా పరుగులేమీ చేయకుండానే ఆరో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. కనీసం డ్రా చేస్తుందనుకన్నఅభిమానికి టీమిండియా వరుస వికెట్లను చేజార్చుకోవడం మింగుడు పడటం లేదు. ఇంకా నాలుగు వికెట్లు మాత్రమే ఉన్న టీమిండియా విజయానికి 140 పరుగుల దూరంలో ఉంది. -
సురేష్ రైనా డకౌట్ల పరంపర
సిడ్నీ: టీమిండియా స్టార్ ఆటగాడు సురేష్ రైనా టెస్టుల్లో డకౌట్ల పరంపర కొనసాగిస్తున్నాడు. మహేంద్ర సింగ్ ధోనీ టెస్టుల నుంచి వైదొలగడంతో ఆస్ట్రేలియాతో జరిగే చివరి టెస్టు మ్యాచ్ లోకి వచ్చిన రైనా తన ఖాతాను ఇంకా ఆరంభించలేదు. తొలి ఇన్నింగ్స్ లో రెండు బంతులనే ఎదుర్కొన్న రైనా పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ చేరిన సంగతి తెలిసిందే. అయితే కీలకమైన రెండో ఇన్నింగ్స్ లో రైనా తన సత్తా చాటుతాడని అభిమానులు భావించారు. కాగా రైనా ఏమాత్రం తన శైలిని మార్చుకోకుండా మళ్లీ డకౌట్ గా వెనుదిరిగాడు. ఈ మ్యాచ్ లో ఆరు బంతులను ఎదుర్కొన్న రైనా తన ఫుట్ వర్క్ లో ఘోరంగా విఫలమయ్యాడు. -
ఐదో వికెట్ కోల్పోయిన టీమిండియా(203/5)
సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా రెండో ఇన్నింగ్స్ లో 203 పరుగుల వద్ద ఐదో వికెట్ ను కోల్పోయింది. సురేష్ రైనా డకౌట్ రూపంలో వెనుదిరిగాడు. అంతకుముందు కేఎల్ రాహుల్(16), రోహిత్ శర్మ(39), మురళీ విజయ్ (80), విరాట్ కోహ్లీ(46) పరుగులు చేసి పెవిలియన్ కు చేరారు. ఇంకా ఐదు వికెట్లు మాత్రమే చేతిలో ఉన్న టీమిండియా విజయానికి 146 పరుగుల దూరంలో ఉంది. -
నాల్గో వికెట్ కోల్పోయిన టీమిండియా(201/4)
సిడ్నీ: ఆస్ట్రేలియాతో ఇక్కడ జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా నాల్గో వికెట్ ను కోల్పోయింది. విరాట్ కోహ్లీ (46) పరుగుల వద్ద పెవిలియన్ కు చేరాడు. టీమిండియా స్కోరు 201 పరుగుల వద్ద ఉండగా కోహ్లీ అనవసరపు షాట్ కోసం యత్నించి వెనుదిరిగాడు .ప్రస్తుతం అజ్యింకా రహానే(10) పరుగులతో క్రీజ్ లో ఉన్నాడు. ఇంకా ఆరు వికెట్లు చేతిలో ఉన్న టీమిండియా విజయానికి 148 పరుగుల దూరంలో ఉంది. -
మూడో వికెట్ ను కోల్పోయిన టీమిండియా
సిడ్నీ: ఆస్ట్రేలియాతో ఇక్కడ జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ ఆఖరి రోజు ఆటలో టీమిండియా మూడో వికెట్ ను కోల్పోయింది. 349 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ను ఆరంభించిన టీమిండియా 178 పరుగుల వద్ద మూడో వికెట్ ను నష్టపోయింది. మురళీ విజయ్(80) పరుగులు చేసి మూడో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. ఇంకా ఏడు వికెట్లు ఉన్న టీమిండియా 171 పరుగులను ఛేదించాల్సి ఉంది. ప్రస్తుతం విరాట్ కోహ్లీ క్రీజ్ లో ఉన్నాడు. -
టీ విరామ సమయానికి టీమిండియా స్కోరు 160/2
సిడ్నీ: ఆస్ట్రేలియాతో ఇక్కడ చివరి టెస్ట్ మ్యాచ్ ఆఖరి రోజులో టీమిండియా టీ విరామ సమయానికి రెండు వికెట్లు కోల్పోయి 160 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. 349 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా కేఎల్ రాహుల్(16), రోహిత్ శర్మ(39) వికెట్లను కోల్పోయింది. ప్రస్తుతం మురళీ విజయ్- విరాట్ కోహ్లీల జోడీ టీమిండియాకు మరమ్మత్తులు చేపట్టారు. ఈ ఇరువురి ఆటగాళ్లు ఆచితూచి ఆడుతూ ముందుకు సాగుతున్నారు. మురళీ విజయ్ (71), విరాట్ కోహ్లీ(26) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. -
మురళీ విజయ్ హాఫ్ సెంచరీ(134/2)
సిడ్నీ:ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరిటెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా ఆటగాడు మురళీ విజయ్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. 135 బంతులను ఎదుర్కొన్న విజయ్ 3 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 50 పరుగులు పూర్తి చేశాడు. ప్రస్తుతం టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 134 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. 349 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఆదిలోనే కేఎల్ రాహుల్(16) వికెట్ తో పాటు, రోహిత్ శర్మ(39) వికెట్ ను కూడా నష్టపో్యింది. అనంతరం మురళీ విజయ్ - విరాట్ కోహ్లీల జోడి కుదురుగా ఆడుతోంది. -
48 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన భారత్
-
రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా
సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరిటెస్ట్ మ్యాచ్ లో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియా 104 పరుగుల వద్ద రెండో వికెట్ ను కోల్పోయింది. టీమిండియా ఆటగాడు రోహిత్ శర్మ (39) పరుగులు చేసి రెండో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. 349 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఆదిలోనే కేఎల్ రాహుల్(16) వికెట్ ను కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆసీస్ తన రెండో ఇన్నింగ్స్ లో ఆరువికెట్ల నష్టానికి 251 పరుగులు చేసిన అనంతరం డిక్లేర్ చేసింది. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 475 పరుగులకు ఆలౌటైంది. ఇప్పటికే సిరీస్ కోల్పోయిన టీమిండియా ఈ మ్యాచ్ ను గెలవాలిని భావిస్తోంది. -
సిడ్నీ: లంచ్ సమయానికి భారత్ స్కోరు: 73/1
సిడ్నీ: ఆస్ట్రేలియా-టీమిండియా జట్ల మధ్య శనివారమిక్కడ ఆరంభమైన చివరి టెస్టులో ఐదవ రోజు రెండవ ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ లంచ్ విరామ సమయానికి 29.0 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 73 పరుగులు చేసింది. 349 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఐదవ రోజున 13.2 ఓవర్లలో 48 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. భారత్ ఓపెనర్ ఆటగాడు కేఎల్ రాహుల్ (40 బంతుల్లో 16 ; 3ఫోర్లు)తో లయోన్ బౌలింగ్‌లో వార్నర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. గెలుపే లక్ష్యంగా సాగుతున్న భారత్ జట్టు తొలి వికెట్ కోల్పోవడంతో క్రికెట్ అభిమానులను నిరాశపరిచింది. అయితే రాహుల్ భాగస్వామ్యంతో బరిలోకి దిగిన మురళీ విజయ్ (77 బంతుల్లో 35; 2 ఫోర్లు, 1 సిక్స్)తో నాటౌట్‌గా క్రీజులో ఉన్నాడు . రోహిత్ శర్మ (57 బంతుల్లో 19; 1 ఫోర్, 1 సిక్స్) పరుగులతో క్రీజులో ఉన్నాడు. కాగా, ఆసీస్ బౌలర్ లయోన్ తొలి వికెట్ పడగొట్టాడు. ఆసీస్ నిర్దేశించిన లక్ష్యాన్ని చేధించాలంటే భారత్ ఇంకా 276 పరుగులు చేయాల్సివుంది. అంతకముందు ఆసీస్ సెకండ్ ఇన్నింగ్స్ ను 251/6 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. నాలుగో టెస్ట్ సెకండ్ ఇన్నింగ్స్‌లో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ ఆరు వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యంతో కలుపుకొంటే భారత జట్టుకు 349 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 162 ఓవర్లలో 475 పరుగులకు ఆలౌటైంది. -
48 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన భారత్
సిడ్నీ: ఆస్ట్రేలియా-టీమిండియా జట్ల మధ్య శనివారమిక్కడ ఆరంభమైన చివరి టెస్టులో ఐదవ రోజు రెండవ ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ 13.2 ఓవర్లలో 48 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. భారత్ ఓపెనర్ ఆటగాడు కేఎల్ రాహుల్ (40 బంతుల్లో 16 ; 3ఫోర్లు)తో లయోన్ బౌలింగ్‌లో వార్నర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. రాహుల్ భాగస్వామ్యంతో బరిలోకి దిగిన మురళీ విజయ్ (46 బంతుల్లో 29; 2 ఫోర్లు, 1 సిక్స్)తో నాటౌట్‌గా క్రీజులో కొనసాగుతున్నాడు. రోహిత్ శర్మ (0) పరుగులతో క్రీజులో ఉన్నాడు. కాగా, ఆసీస్ బౌలర్ లయోన్ తొలి వికెట్ పడగొట్టాడు. ప్రస్తుతం భారత్ 16.6 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 48 పరుగులతో కొనసాగుతోంది. అంతకముందు ఆసీస్ సెకండ్ ఇన్నింగ్స్ ను 251/6 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. నాలుగో టెస్ట్ సెకండ్ ఇన్నింగ్స్‌లో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ ఆరు వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యంతో కలుపుకొంటే భారత జట్టుకు 349 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 162 ఓవర్లలో 475 పరుగులకు ఆలౌటైంది. -
ఐదవ రోజు ఆట ఆరంభించిన భారత్; విజయలక్ష్యం 349
సిడ్నీ: ఆస్ట్రేలియా-టీమిండియా జట్ల మధ్య శనివారమిక్కడ ఆరంభమైన చివరి టెస్టులో ఐదవ రోజు భారత్ జట్టు రెండవ ఇన్నింగ్స్ ఆరంభించింది. ఐదవ రోజు ఆటలో మురళీ విజయ్, కేఎల్ రాహుల్ ఓపెనర్లగా బరిలోకి దిగి శుభారంభాన్నిచ్చారు. ప్రస్తుతం మురళీ విజయ్ (4), కేఎల్ రాహుల్ (5) పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత్ 8.2 ఓవర్లలో 17 పరుగులతో కొనసాగుతోంది. అయితే ఆసీస్ సెకండ్ ఇన్నింగ్స్ ను 251/6 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఆఖరి సెషన్లో ఆసీస్ బ్యాట్స్‌మెన్ వీరవిహారం చేశారు. కెప్టెన్ స్మిత్ (70 బంతుల్లో 71; 8 ఫోర్లు, 1 సిక్స్), జో బర్న్స్ (39 బంతుల్లో 66; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపులు మెరిపించడంతో శుక్రవారం ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 40 ఓవర్లలో 6 వికెట్లకు 251 పరుగులు చేసింది. హాడిన్ (31 బ్యాటింగ్), హారిస్ (0 బ్యాటింగ్) పరుగులు చేశారు. ఆతిథ్య జట్టు ఆసీస్ 349 పరుగుల ఆధిక్యాన్ని చేజిక్కించుకుంది. మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యంతో కలుపుకొంటే భారత జట్టుకు 349 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 162 ఓవర్లలో 475 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఆసీస్‌కు 97 పరుగుల ఆధిక్యం దక్కింది. కోహ్లి (230 బంతుల్లో 147; 20 ఫోర్లు)కి తోడు అశ్విన్ (111 బంతుల్లో 50; 6 ఫోర్లు), భువనేశ్వర్ (75 బంతుల్లో 30; 5 ఫోర్లు) ఆకట్టుకున్నారు. స్టార్క్‌కు 3 వికెట్లు దక్కాయి. -
251/6 పరుగుల వద్ద ఆసీస్ సెకండ్ ఇన్నింగ్స్ డిక్లేర్
సిడ్నీ: ఆస్ట్రేలియా-టీమిండియా జట్ల మధ్య శనివారమిక్కడ ఆరంభమైన చివరి టెస్టులో ఐదవ రోజు ఆసీస్ సెకండ్ ఇన్నింగ్స్ ను 251/6 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. నాలుగో టెస్ట్ సెకండ్ ఇన్నింగ్స్‌లో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ ఆరు వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. ఆతిథ్య జట్టు ఆసీస్ 349 పరుగుల ఆధిక్యాన్ని చేజిక్కించుకుంది. అంతకుముందు ఆఖరి సెషన్లో భారత బౌలర్ల వైఫల్యాన్ని అందిపుచ్చుకున్న ఆసీస్ బ్యాట్స్‌మెన్ వీరవిహారం చేశారు. కెప్టెన్ స్మిత్ (70 బంతుల్లో 71; 8 ఫోర్లు, 1 సిక్స్), జో బర్న్స్ (39 బంతుల్లో 66; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపులు మెరిపించడంతో శుక్రవారం ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 40 ఓవర్లలో 6 వికెట్లకు 251 పరుగులు చేసింది. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 162 ఓవర్లలో 475 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఆసీస్‌కు 97 పరుగుల ఆధిక్యం దక్కింది. కోహ్లి (230 బంతుల్లో 147; 20 ఫోర్లు)కి తోడు అశ్విన్ (111 బంతుల్లో 50; 6 ఫోర్లు), భువనేశ్వర్ (75 బంతుల్లో 30; 5 ఫోర్లు) ఆకట్టుకున్నారు. స్టార్క్‌కు 3 వికెట్లు దక్కాయి. -
గట్టెక్కుతారా!
మూడు రోజుల పాటు బ్యాట్స్‌మెన్ పండగ చేసుకున్న సిడ్నీ పిచ్‌పై నాలుగో రోజు అనూహ్యంగా బంతి తిరిగింది. అయినా ఆస్ట్రేలియా వన్డే తరహాలో ఆడి మ్యాచ్‌ని ఫలితం దిశగా తీసుకెళ్లింది. ఇప్పటికే 348 పరుగుల ఆధిక్యంలో ఉన్న స్మిత్ సేన ఇదే స్కోరు వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసి భారత్‌కు సవాల్ విసిరే అవకాశం ఉంది. అడిలైడ్‌లో జరిగిన తొలి టెస్టులో భారత లక్ష్యం 364... డ్రా చేసుకుంటే గొప్ప అనుకున్న మ్యాచ్‌లో కోహ్లి సేన విజయం కోసం ప్రయత్నించి ఓడిపోయింది. ఆ పిచ్‌తో పోలిస్తే ప్రస్తుతం సిడ్నీ పిచ్ మీద బంతి మరింత తిరుగుతోంది. అడిలైడ్‌లో స్పిన్నర్ లయోన్ ఏడు వికెట్లతో భారత్ పతనాన్ని శాసించాడు. ఇప్పుడూ లయోన్‌పై నమ్మకంతో ఆసీస్ జట్టు భారత్‌ను ఊరిస్తోంది. దూకుడు మంత్రం పఠించే కోహ్లి విజయం కోసం ప్రయత్నిస్తాడా? లేదా ఏదోలా రోజు లాగించి డ్రా చేసుకుంటారా? లేక స్పిన్ వికెట్‌పై లయోన్‌కు మ్యాచ్ అప్పగిస్తారా? సిడ్నీ అంటేనే సంచలనాలకు మారుపేరు. 2007-08 సిరీస్‌లోనూ సిడ్నీలో హై డ్రామా జరిగింది. డ్రా అవుతున్న మ్యాచ్‌లో ఆఖరి ఓవర్లో క్లార్క్ మూడు వికెట్లు తీసి ఆసీస్‌ను గెలిపించాడు. ఈసారి ఏం జరగబోతోంది? సిడ్నీ: నాలుగో టెస్టు నాలుగో రోజులో ఒకే ఒక్క సెషన్ మ్యాచ్‌ను తలకిందులు చేసింది. దీంతో అప్పటి దాకా డ్రా దిశగా వెళ్లిన మ్యాచ్‌లో ఇప్పుడు ఫలితం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆఖరి సెషన్లో భారత బౌలర్ల వైఫల్యాన్ని అందిపుచ్చుకున్న ఆసీస్ బ్యాట్స్‌మెన్ వీరవిహారం చేశారు. వన్డే తరహా ఆటతీరుతో ఓవర్‌కు ఆరుకుపైగా రన్‌రేట్‌తో పరుగుల వర్షం కురిపించారు. కెప్టెన్ స్మిత్ (70 బంతుల్లో 71; 8 ఫోర్లు, 1 సిక్స్), జో బర్న్స్ (39 బంతుల్లో 66; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపులు మెరిపించడంతో శుక్రవారం ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 40 ఓవర్లలో 6 వికెట్లకు 251 పరుగులు చేసింది. హాడిన్ (31 బ్యాటింగ్), హారిస్ (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. రోజర్స్ (77 బంతుల్లో 56; 7 ఫోర్లు) రాణించాడు. అశ్విన్‌కు 4 వికెట్లు దక్కాయి. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 162 ఓవర్లలో 475 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఆసీస్‌కు 97 పరుగుల ఆధిక్యం దక్కింది. కోహ్లి (230 బంతుల్లో 147; 20 ఫోర్లు)కి తోడు అశ్విన్ (111 బంతుల్లో 50; 6 ఫోర్లు), భువనేశ్వర్ (75 బంతుల్లో 30; 5 ఫోర్లు) ఆకట్టుకున్నారు. స్టార్క్‌కు 3 వికెట్లు దక్కాయి. ఓవరాల్‌గా ఆసీస్ ప్రస్తుతం 348 పరుగుల ఆధిక్యంలో ఉంది. స్కోరు వివరాలు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 572/7 డిక్లేర్డ్ భారత్ తొలి ఇన్నింగ్స్: విజయ్ (సి) హాడిన్ (బి) స్టార్క్ 0; రాహుల్(సి) అండ్ (బి) స్టార్క్ 110; రోహిత్ (బి) లయోన్ 53; కోహ్లి (సి) రోజర్స్ (బి) హారిస్ 147; రహానే ఎల్బీడబ్ల్యూ (బి) వాట్సన్ 13; రైనా (సి) హాడిన్ (బి) వాట్సన్0; సాహా (సి) స్మిత్ (బి) హాజెల్‌వుడ్ 35; అశ్విన్ (సి) హాడిన్ (బి) స్టార్క్ 50; భువనేశ్వర్ (సి) వాట్సన్ (బి) లయోన్ 30; షమీ నాటౌట్ 16; ఉమేశ్ (సి) హాడిన్ (బి) హారిస్ 4; ఎక్స్‌ట్రాలు: 17; మొత్తం: (162 ఓవర్లలో ఆలౌట్) 475. వికెట్ల పతనం: 1-0; 2-97; 3-238; 4-292; 5-292; 6-352; 7-383; 8-448; 9-456; 10-475 బౌలింగ్: స్టార్క్ 32-7-106-3; హారిస్ 31-7-96-2; హాజెల్‌వుడ్ 29-8-64-1; లయోన్ 46-11-123-2; వాట్సన్ 20-4-58-2; స్మిత్ 4-0-17-0. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: రోజర్స్ (సి) రైనా (బి) భువనేశ్వర్ 56; వార్నర్ (సి) విజయ్ (బి) అశ్విన్ 4; వాట్సన్ (బి) అశ్విన్ 16; స్మిత్ ఎల్బీడబ్ల్యూ (బి) షమీ 71; మార్ష్ (సి) విజయ్ (బి) అశ్విన్ 1; బర్న్స్ (సి) ఉమేశ్ (బి) అశ్విన్ 66; హాడిన్ బ్యాటింగ్ 31; హారిస్ బ్యాటింగ్ 0; ఎక్స్‌ట్రాలు: 6; మొత్తం: (40 ఓవర్లలో 6 వికెట్లకు) 251. వికెట్ల పతనం: 1-6; 2-46; 3-126; 4-139; 5-165; 6-251; బౌలింగ్: భువనేశ్వర్ 8-0-46-1; అశ్విన్ 19-2-105-4; షమీ 6-0-33-1; ఉమేశ్ 3-0-45-0; రైనా 4-0-18-0. సెషన్-1 నిలబడ్డ అశ్విన్ 342/5 ఓవర్‌నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆట కొనసాగించిన కోహ్లి, సాహా (35) ఎక్కువసేపు క్రీజులో నిలబడలేకపోయారు. వ్యక్తిగత స్కోరుకు మరో ఏడు పరుగులు జోడించి కెప్టెన్ అవుటయ్యాడు. అప్పటికీ భారత్ ఫాలోఆన్ మార్క్‌కు మరో 21 పరుగులు చేయాల్సి ఉంది. విరాట్, సాహా ఆరో వికెట్‌కు 60 పరుగులు జోడించారు. తర్వాత వచ్చిన అశ్విన్ ఏమాత్రం తడబడకుండా ఆడాడు. వీలైనంత ఎక్కువసేపు బ్యా టింగ్ చేసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఎక్కువగా సింగిల్స్ తీయడంతో స్కోరు బోర్డు నెమ్మదిగా కదిలింది. సాహా షార్ట్ పిచ్‌లను ఎదుర్కోవడంలో బాగా ఇబ్బందులుపడ్డాడు. చివరకు ఇన్నింగ్స్ 131వ ఓవర్లో హాజెల్‌వుడ్ వేసిన షార్ట్ బంతిని టచ్ చేసి స్లిప్‌లో స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఈ దశలో వచ్చిన భువనేశ్వర్.. అశ్విన్‌కు మంచి సహకారం అందించడంతో మరో వికెట్ పడకుండా లంచ్‌కు వెళ్లారు. ఓవర్లు: 29; పరుగులు: 65; వికెట్లు: 2 సెషన్-2 ఆకట్టుకున్న భువీ లంచ్ తర్వాత అశ్విన్, భువనేశ్వర్ క్రమంగా జోరు పెంచారు. ఆసీస్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ వేగంగా పరుగులు చేశారు. ఈ క్రమంలో ఆశించిన స్థాయిలో ఆధిక్యం తగ్గుముఖం పట్టినా ఊహించని రీతిలో భువీ అవుటయ్యాడు. వేగంగా దూసుకొచ్చిన లయోన్ బంతి భువనేశ్వర్ బ్యాట్‌ను తాకి స్లిప్‌లో వాట్సన్ చేతిలోకి వెళ్లింది. బంతి నేలకు తాకలేదని రీప్లేలో స్పష్టం కావడంతో థర్డ్ అంపైర్ అవుట్‌గా ప్రకటించారు. అశ్విన్, భువీ మధ్య ఎనిమిదో వికెట్‌కు 65 పరుగుల భాగస్వామ్యం నెలకొంది. షమీ (16 నాటౌట్)తో జత కలిసిన అశ్విన్ మరో ఐదు ఓవర్ల తర్వాత అవుట్‌కాగా, ఆ కొద్దిసేపటికే ఉమేశ్ (4) వెనుదిరిగాడు. ఓవరాల్‌గా భారత్ 27 పరుగుల తేడాతో చివరి మూడు వికెట్లు చేజార్చుకుంది. తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్‌ను రెండో ఓవర్లోనే వార్నర్ (4)ను అశ్విన్ అవుట్ చేశాడు. అయితే రోజర్స్, వాట్సన్ (16) నిలకడగా ఆడి టీకి వెళ్లారు. ఓవర్లు: 18; పరుగులు: 68; వికెట్లు: 3 (భారత్) ఓవర్లు: 6; పరుగులు: 38; వికెట్లు: 1 (ఆసీస్) సెషన్-3 స్మిత్, బర్న్స్ జోరు టీ తర్వాత భారత బౌలర్లు ఘోరంగా విఫలమయ్యారు. లైన్ అండ్ లెంగ్త్ తప్పడంతో భారీగా పరుగులు సమర్పించుకున్నారు. రనౌట్ నుంచి బయటపడిన వాట్సన్‌ను విరామం తర్వాత రెండో ఓవర్లోనే అశ్విన్ పెవిలియన్‌కు పంపాడు. ఈ దశలో వచ్చిన స్మిత్ ఊహించని రీతిలో వేగంగా బ్యాటింగ్ చేశాడు. ఈ క్రమంలో 44 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేశాడు. 50 పరుగులు పూర్తి చేసుకున్న తర్వాత వేగంగా ఆడే క్రమంలో రోజర్స్ రైనాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ ఇద్దరు మూడో వికెట్‌కు 15.4 ఓవర్లలోనే 80 పరుగులు జోడించారు. తర్వాత స్వల్ప వ్యవధిలో షాన్ మార్ష్ (1), స్మిత్‌లు అవుటయ్యారు. అప్పటికే ఆసీస్ ఆధిక్యం 250 పరుగులు దాటింది. హాడిన్‌తో కలిసిన బర్న్స్ ఒక్కసారిగా భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు. టి20 తరహాలో బ్యాటింగ్ చేస్తూ 39 బంతుల్లో 66 పరుగులు చేశాడు. ఈ ఇద్దరు 8.4 ఓవర్లలో 86 పరుగులు సమకూర్చడంతో ఆసీస్ ఆధిక్యం 300లకు చేరింది. చివరి ఓవర్ నాలుగో బంతికి బర్న్స్ అవుటైనా అప్పటికే నష్టం జరిగిపోయింది. ఓవర్లు: 34; పరుగులు: 213; వికెట్లు: 5 చివరి సెషన్లో మేం భారీగా పరుగులు సమర్పించుకున్నాం. బ్యాట్స్‌మెన్ కూడా కొన్ని మంచి షాట్లు ఆడారు. కొత్త బంతితో మా ఆరంభం అసలు బాగాలేదు. లేకపోతే మ్యాచ్ మరోలా ఉండేది. శనివారం మేం కూడా అడిలైడ్‌లో ఆడినట్లుగా ఆడాలి. నేను బ్యాటింగ్‌కు వెళ్లినప్పుడు వీలైనన్ని ఎక్కువ ఓవర్లు ఆడాలని భావించా. పిచ్ నుంచి పెద్ద సహకారం లేకపోవడంతో పరుగులు చేయడానికి కష్టపడాల్సి వచ్చింది. జట్టు కోసం నేను కొన్ని అవకాశాలను సృష్టించాలనుకున్నా. అలా చేయడంతో నాలుగు వికెట్లు తీయగలిగా. మ్యాచ్‌ను ముందుకు తీసుకెళ్లాలనే దృక్పథంతో ఆసీస్ ఆటగాళ్లు కూడా బాగా బ్యాటింగ్ చేశారు. ఓవర్‌నైట్ స్కోరుతో డిక్లేర్ చేస్తే మేం కూడా ఫలితం కోసం ఆడతాం. -అశ్విన్ (భారత స్పిన్నర్) ఐదో రోజు ఆటలో స్పిన్నర్లు కీలకం. వికెట్ బాగా టర్న్ అవుతోంది. బ్యాటింగ్ చేయడం చాలా కష్టంగా ఉంది. కేవలం 10 అవకాశాల కోసం మేం ఎదురుచూస్తున్నాం. స్పిన్‌తోనే పది వికెట్లు తీయాలని భావిస్తున్నాం. భిన్నమైన బౌన్స్, రివర్స్ స్వింగ్ కోసం ప్రయత్నిస్తాం. డిక్లరేషన్‌పై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. నిర్ణయాలలో నా పాత్ర ఉండదు. ఇది కెప్టెన్‌కు సంబంధించిన అంశం. జట్టును మంచి స్థితిలో నిలిపినందుకు ఆనందంగా ఉంది. మ్యాచ్ గెలవడానికి మాకు చాలా అవకాశాలున్నాయి. స్మిత్ కూడా అద్భుతంగా ఆడాడు. అతన్ని చూసి చాలా నేర్చుకోవాలి. -బర్న్స్ (ఆసీస్ బ్యాట్స్‌మన్) టెస్టు సిరీస్‌లో ఎనిమిదిసార్లు 400 పైచిలుకు స్కోర్లు నమోదు కావడం ఇదే తొలిసారి. భారత్ తరఫున టెస్టుల్లో 100 వికెట్లు, వెయ్యి పరుగులు పూర్తి చేసిన 9వ ఆల్‌రౌండర్ అశ్విన్. ప్రపంచ క్రికెట్లో వేగంగా 100 వికెట్లు, వెయ్యి పరుగులు(24 మ్యాచ్‌ల్లో) పూర్తి చేసిన మూడో ఆటగాడు అశ్విన్. ఇంగ్లండ్ ఆటగాడు బోథమ్ (21 మ్యాచ్‌లు) పేరిట ఈ రికార్డు ఉంది. 23 ఏళ్లలో ఆసీస్ గడ్డపై ఒకే ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు తీసిన రెండో భారత స్పిన్నర్ అశ్విన్. ఈ సిరీస్‌లో ఉమేశ్ 4.66 రన్‌రేట్‌ను నమోదు చేశాడు. ఇప్పటి వరకు ఆసీస్‌లో ఆడిన భారత బౌలర్లలో ఇదే చెత్త ప్రదర్శన. ఓవరాల్‌గా మూడోది. ఎడ్వర్డ్స్, బ్రెట్ లీ ముందున్నారు. 250 క్యాచ్‌లు పూర్తి చేసుకున్న ఆసీస్ నాలుగో వికెట్ కీపర్‌గా హాడిన్ రికార్డులకెక్కాడు. టెస్టు క్రికెట్లో ఏడోవాడు. -
ఉమేష్ యాదవ్.. ఓ చెత్త రికార్డు!
అతడు వేసింది సరిగ్గా మూడంటే మూడు ఓవర్లు.. ఇచ్చింది 45 పరుగులు.. తీసిన వికెట్టు ఒక్కటీ లేదు. ఆస్ట్రేలియాపై సిడ్నీలో జరుగుతున్న చివరి టెస్టు నాలుగోరోజు భారత బౌలర్ ఉమేష్ యాదవ్ నమోదు చేసిన అతి చెత్త రికార్డు ఇది. ఇంతవరకు ఏ దేశంలోనూ భారత బౌలర్ ఎవరూ ఇంత చెత్త బౌలింగు చేయలేదని రికార్డులు చెబుతున్నాయి. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ ఒక్కొక్కరు విరుచుకుపడుతుంటే ఉమేష్ యాదవ్ తన వద్ద బంతులే లేనట్లు నిమ్మకుండిపోయాడు. సిడ్నీ క్రికెట్ గ్రౌండులో అతడిని దొరకబుచ్చుకుని మరీ బ్యాట్స్‌మెన్ ఆడుకున్నారు. దీంతో సిరీస్ మొత్తమ్మీద ఇంతవరకు ఏ భారత బౌలర్ టెస్టు క్రికెట్లో నమోదు చేయనంత ఘోరమైన ఎకానమీ రేటును ఉమేష్ యాదవ్ నమోదు చేశాడు. సగటున ఒక్కో ఓవర్‌కు అతడు 15 పరుగులు ఇచ్చినట్లయింది. -
సిడ్నీ టెస్టు : నాలుగో రోజు విశేషాలు!
-
భారత్-ఆస్ట్రేలియా చివరి టెస్టులో నాల్గో రోజు
-
నాల్గో రోజు ఆసీస్ స్కోరు 251/6
సిడ్నీ: బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా సిడ్నీ మైదానంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ లో ఆసీస్ తన రెండో ఇన్నింగ్స్ లో నాల్గో రోజు ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్లు కోల్పోయి 251 పరుగులు చేసింది. ఆసీస్ ఆటగాడు జో బర్న్స్ (66) పరుగులు చేసి ఆట కాసేపట్లో ముగుస్తుందనగా ఆరో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. శుక్రవారం ఆటలో టీమిండియా బౌలర్లు రాణించినా ఆసీస్ కు మెరుగైన ఆధిక్యం లభించింది. ఆసీస్ ఆదిలోనే వార్నర్(4) వికెట్ ను నేలరాల్చిన అశ్విన్ అదే ఊపును ప్రదర్శించాడు. అనంతరం షేన్ వాట్సన్(16) పరుగులకు పంపాడు. ఆ సమయంలో క్రిస్ రోజర్స్(56), కెప్టెన్ స్మిత్ (71) పరుగులతో ఆదుకున్నారు. ఈ రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ 348 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. టీమిండియా బౌలర్లలో అశ్విన్ కు నాలుగు వికెట్లు దక్కగా, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీలకు తలో వికెట్ దక్కింది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ 572/7 డిక్లేర్ టీమిండియా తొలి ఇన్నింగ్స్ 475 -
ఆరో వికెట్ ను కోల్పోయిన ఆస్ట్రేలియా
సిడ్నీ: టీమిండియాతో ఇక్కడ జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ లో ఆసీస్ తన రెండో ఇన్నింగ్స్ లో 251 పరుగుల వద్ద ఆరో వికెట్ ను కోల్పోయింది. కేవలం 39 బంతుల్లో 3 సిక్సర్లు, 8 ఫోర్లతో 66 పరుగులు చేసిన బర్న్స్ దూకుడుగా ఆడి అశ్విన్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. శుక్రవారం ఆటలో ఆసీస్ ఆదిలోనే వార్నర్ వికెట్ ను చేజార్చుకుంది. వార్నర్(4)పరుగులు చేసి పెవిలియన్ కు చేరగా... కాసేపటికే షేన్ వాట్సన్(16) పరుగులు చేసి అదే దారిలో నడిచాడు. ఆ సమయంలో క్రిస్ రోజర్స్(56), కెప్టెన్ స్మిత్(71) పరుగులతో ఆదుకున్నారు. ఆ తరువాత బర్న్స్ టీమిండియా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. బర్స్న్ ప్రమాదకరంగా మారుతున్న సమయంలో ఆరో వికెట్ రూపంలో అవుట్ కావడంతో టీమిండియా ఊపిరి పీల్చుకుంది. -
సిడ్నీ టెస్ట్: జో బర్న్స్ హాఫ్ సెంచరీ(242/5)
సిడ్నీ: టీమిండియాతో ఇక్కడ జరుగుతున్న చివరి టెస్ట్ లో ఆసీస్ ఆటగాడు జో బర్న్స్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. షాన్ మార్ష్(1) నిష్క్రమించిన అనంతరం క్రీజ్ లోకి వచ్చిన బర్న్స్ ఆకట్టుకున్నాడు. కేవలం 34 బంతులు ఎదుర్కొన్న బర్న్స్ రెండు సిక్సర్లు, ఏడు ఫోర్లతో హాఫ్ సెంచరీ చేశాడు. ప్రస్తుతం అతనికి జతగా హడిన్(30) క్రీజ్ లో ఉన్నాడు. -
ఐదో వికెట్ కోల్పోయిన ఆసీస్(165/5)
సిడ్నీ: టీమిండియాతో జరుగుతున్న చివరి టెస్టులో ఆసీస్ వరుస వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. శుక్రవారం రెండో ఇన్నింగ్స్ ను ఆరంభించిన ఆసీస్ 165 పరుగుల వద్ద ఐదో వికెట్ ను కోల్పోయింది. కెప్టెన్ స్టీవ్ స్మిత్ (71) పరుగులు చేసి ఐదో వికెట్ రూపంలో పెవిలియన్ కు చేరాడు. అంతకుముందు షాన్ మార్ష్ (1) పరుగు మాత్రమే చేసి నాల్గో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. ప్రస్తుతం ఆసీస్ 262 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. బర్న్స్ (19) పరుగులతో క్రీజ్ లో ఉన్నాడు. టీమిండియా బౌలర్లలో అశ్విన్ కు మూడు వికెట్లు లభించగా, భువనేశ్వర్ కుమార్ , షమీలకు తలో వికెట్ దక్కింది. -
నాల్గో వికెట్ కోల్పోయిన ఆసీస్(139/4)
సిడ్నీ: టీమిండియాతో జరుగుతున్న చివరి టెస్టులో ఆసీస్ వరుస వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. శుక్రవారం రెండో ఇన్నింగ్స్ ను ఆరంభించిన ఆసీస్ 139 పరుగుల వద్ద నాల్గో వికెట్ ను కోల్పోయింది. షాన్ మార్ష్ (1) పరుగు మాత్రమే చేసి నాల్గో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. ప్రస్తుతం ఆసీస్ 240 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. అంతకుముందు క్రిస్ రోజర్స్(56) పరుగులు చేసి మూడో వికెట్ గా పెవిలియన్ చేరాడు. ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్, బర్న్స్ లు జట్టు మరమ్మత్తులు చేపట్టారు. టీమిండియా బౌలర్లలో అశ్విన్ కు మూడు వికెట్లు దక్కగా, భువనేశ్వర్ కు ఒక వికెట్ దక్కింది. -
ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ హాఫ్ సెంచరీ
సిడ్నీ: టీమిండియాతో జరుగుతున్న చివరి టెస్టులో ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ మరోసారి ఆకట్టుకున్నాడు. ఒకప్రక్క ఆసీస్ వికెట్లు పడుతున్నా.. స్మిత్ మాత్రం తనదైన శైలిలో ఆటను కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే స్మిత్ నాలుగు టెస్టుల్లో నాలుగు సెంచరీలు చేసిన సంగతి తెలిసిందే. శుక్రవారం రెండో ఇన్నింగ్స్ ను ఆరంభించిన ఆసీస్ ఆదిలోనే వార్నర్ వికెట్ ను కోల్పోయింది. తొలి ఇన్నింగ్స్ లో సెంచరీతో ఆకట్టుకున్న వార్నర్ ఈ ఇన్నింగ్స్ లో నిరాశపరిచాడు. కేవలం నాలుగు పరుగులు మాత్రమే చేసి అశ్విన్ బౌలింగ్ లో నిష్క్రమించాడు. అనంతరం షేన్ వాట్సన్ (16) పరుగులు చేసి పెవిలియన్ కు చేరాడు. ఈ రెండు వికెట్లు అశ్విన్ కు లభించడం గమనార్హం. అంతకుముందు టీమిండియా 475 పరుగులకు ఆలౌటయిన సంగతి తెలిసిందే. -
మూడో వికెట్ ను కోల్పోయిన ఆసీస్(127/3)
సిడ్నీ: టీమిండియాతో జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ లో ఆసీస్ తన రెండో ఇన్నింగ్స్ లో127 పరుగుల వద్ద మూడో వికెట్ ను కోల్పోయింది. ఆసీస్ ఓపెనర్ (56) పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మూడో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. అంతకుముందు శుక్రవారం రెండో ఇన్నింగ్స్ ను ఆరంభించిన ఆసీస్ ఆదిలోనే వార్నర్ వికెట్ ను కోల్పోయింది. తొలి ఇన్నింగ్స్ లో సెంచరీతో ఆకట్టుకున్న వార్నర్ ఈ ఇన్నింగ్స్ లో నిరాశపరిచాడు. కేవలం నాలుగు పరుగులు మాత్రమే చేసి అశ్విన్ బౌలింగ్ లో నిష్క్రమించాడు. అనంతరం షేన్ వాట్సన్ (16) పరుగులు చేసి పెవిలియన్ కు చేరాడు. ఈ తొలి రెండు వికెట్లు అశ్విన్ కు లభించడం గమనార్హం. అంతకుముందు టీమిండియా 475 పరుగులకు ఆలౌటయిన సంగతి తెలిసిందే. -
క్రిస్ రోజర్స్ హాఫ్ సెంచరీ(122/2)
సిడ్నీ: టీమిండియాతో ఇక్కడ జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ రెండో్ ఇన్నింగ్స్ లో ఆసీస్ ఆటగాడ్ క్రిస్ రోజర్స్ మరో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. 72 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో 52 పరుగులతో నాటౌట్ గా క్రీజ్ లో ఉన్నాడు. మరో వైపు కెప్టెన్ స్టీవ్ స్మిత్ చూడచక్కని షాట్లతో అలరిస్తున్నాడు. ప్రస్తుతం ఆసీస్ రెండు వికెట్ల నష్టానికి 122 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. దీంతో ఆసీస్ కు 219 పరుగుల ఆధిక్యం లభించింది. -
రెండో వికెట్ ను కోల్పోయిన ఆసీస్(46/2)
సిడ్నీ:టీమిండియాతో ఇక్కడ జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా తన రెండో ఇన్నింగ్స్ లో 46 పరుగుల వద్ద రెండో వికెట్ ను కోల్పోయింది. శుక్రవారం రెండో ఇన్నింగ్స్ ను ఆరంభించిన ఆసీస్ ఆదిలోనే వార్నర్ వికెట్ ను కోల్పోయింది. తొలి ఇన్నింగ్స్ లో సెంచరీతో ఆకట్టుకున్న వార్నర్ ఈ ఇన్నింగ్స్ లో నిరాశపరిచాడు. కేవలం నాలుగు పరుగులు మాత్రమే చేసి అశ్విన్ బౌలింగ్ లో నిష్క్రమించాడు. అనంతరం షేన్ వాట్సన్ (16) పరుగులు చేసి పెవిలియన్ కు చేరాడు. ఈ రెండు వికెట్లు అశ్విన్ కు లభించడం గమనార్హం. అంతకుముందు టీమిండియా 475 పరుగులకు ఆలౌటయిన సంగతి తెలిసిందే. -
టీ విరామ సమయానికి ఆసీస్ స్కోరు 38/1
సిడ్నీ: టీమిండియాతో ఇక్కడ జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా టీ విరామ సమయానికి వికెట్ నష్టానికి 38 పరుగులు చేసింది. శుక్రవారం రెండో ఇన్నింగ్స్ ను ఆరంభించిన ఆసీస్ ఆదిలోనే వార్నర్ వికెట్ ను కోల్పోయింది. తొలి ఇన్నింగ్స్ లో సెంచరీతో ఆకట్టుకున్న వార్నర్ ఈ ఇన్నింగ్స్ లో నిరాశపరిచాడు. కేవలం నాలుగు పరుగులు మాత్రమే చేసి అశ్విన్ బౌలింగ్ లో నిష్క్రమించాడు. ప్రస్తుతం వాట్సన్ (13), రోజర్స్(21) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. అంతకుముందు టీమిండియా 475 పరుగులకు ఆలౌటయిన సంగతి తెలిసిందే. -
తొలి వికెట్ ను కోల్పోయిన ఆసీస్(6/1)
సిడ్నీ: టీమిండియాతో జరుగుతున్న చివరి టెస్ట్ లో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రేలియా ఆరు పరుగుల వద్ద తొలి వికెట్ ను కోల్పోయింది. తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ ఆకట్టుకున్న డేవిడ్ వార్నర్ ఈ ఇన్నింగ్స్ లో ఆదిలోనే పెవిలియన్ కు చేరాడు. వార్నర్(4) పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్ లో నిష్క్రమించాడు. అంతకుముందు టీమిండియా తన తొలి ఇన్నింగ్స్ లో 475 పరుగులకు ఆలౌటయ్యింది. ఐదు వికెట్ల నష్టానికి 342 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో నాల్గో రోజు ఆటను ఆరంభించిన టీమిండియా మరో 133 పరుగులు మాత్రమే జోడించింది. హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్న అశ్విన్ (50) పరుగుల వద్ద తొమ్మిదో వికెట్ రూపంలో నిష్క్రమించాడు. 110 బంతులను ఎదుర్కొన్న అశ్విన్ 6 ఫోర్ల సాయంతో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. శుక్రవారం నాల్గో రోజు ఆటలో విరాట్ కోహ్లీ(147), సాహా (30)లు నిష్ర్కమించిన అనంతరం అశ్విన్, భువనేశ్వర్ కుమార్ ల జోడి క్రీజ్ లో ఎక్కువ సేపు నిలబడటానికే ప్రాధాన్యత ఇచ్చింది. అనవసరపు షాట్లకు పోకుండా వీరిద్దరి జోడి ఆచితూచి ఆడింది. 112 బంతులను ఎదుర్కొన్న ఈ జోడి 50 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. -
475 పరుగులకు టీమిండియా ఆలౌట్
సిడ్నీ: ఆస్ట్రేలియాతో ఇక్కడ జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా తన తొలి ఇన్నింగ్స్ లో 475 పరుగులకు ఆలౌటయ్యింది. ఐదు వికెట్ల నష్టానికి 342 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో నాల్గో రోజు ఆటను ఆరంభించిన టీమిండియా మరో 133 పరుగులు మాత్రమే జోడించింది. హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్న అశ్విన్ (50) పరుగుల వద్ద తొమ్మిదో వికెట్ రూపంలో నిష్క్రమించాడు. 110 బంతులను ఎదుర్కొన్న అశ్విన్ 6 ఫోర్ల సాయంతో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. శుక్రవారం నాల్గో రోజు ఆటలో విరాట్ కోహ్లీ(147), సాహా (30)లు నిష్ర్కమించిన అనంతరం అశ్విన్, భువనేశ్వర్ కుమార్ ల జోడి క్రీజ్ లో ఎక్కువ సేపు నిలబడటానికే ప్రాధాన్యత ఇచ్చింది. అనవసరపు షాట్లకు పోకుండా వీరిద్దరి జోడి ఆచితూచి ఆడింది. 112 బంతులను ఎదుర్కొన్న ఈ జోడి 50 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. ఉమేశ్ యాదవ్ (4) పరుగులు చేసి చివరి వికెట్ రూపంలో పెవిలియన్ కు చేరగా, మహ్మద్ షమీ(16) పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్ కు మూడు వికెట్లు లభించగా, హారిస్ , లయన్ , వాట్సన్ లకు తలో రెండు వికెట్లు దక్కాయి. -
తొమ్మిదో వికెట్ కోల్పోయిన టీమిండియా(456/9)
ఆస్ట్రేలియాతో ఇక్కడ జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా ఆటగాడు రవి చంద్రన్ అశ్విన్ తొమ్మిదో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్న అశ్విన్ (50) పరుగుల వద్ద నిష్క్రమించాడు. 110 బంతులను ఎదుర్కొన్న అశ్విన్ 6 ఫోర్ల సాయంతో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. శుక్రవారం నాల్గో రోజు ఆటలో విరాట్ కోహ్లీ, సాహాలు నిష్ర్కమించిన అనంతరం అశ్విన్, భువనేశ్వర్ కుమార్ ల జోడి క్రీజ్ లో ఎక్కువ సేపు నిలబడటానికే ప్రాధాన్యత ఇచ్చింది. అనవసరపు షాట్లకు పోకుండా వీరిద్దరి జోడి ఆచితూచి ఆడింది. 112 బంతులను ఎదుర్కొన్న ఈ జోడి 50 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. ప్రస్తుతం టీమిండియా 456 పరుగులకు తొమ్మిది వికెట్లను కోల్పోయింది. -
సిడ్నీ టెస్ట్: అశ్విన్ హాఫ్ సెంచరీ
సిడ్నీ: ఆస్ట్రేలియాతో ఇక్కడ జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా ఆటగాడు రవి చంద్రన్ అశ్విన్ హాఫ్ సెంచరీ ఆకట్టుకున్నాడు. 110 బంతులను ఎదుర్కొన్న అశ్విన్ 6 ఫోర్ల సాయంతో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. శుక్రవారం నాల్గో రోజు ఆటలో విరాట్ కోహ్లీ, సాహాలు నిష్ర్కమించిన అనంతరం అశ్విన్, భువనేశ్వర్ కుమార్ ల జోడి క్రీజ్ లో ఎక్కువ సేపు నిలబడటానికే ప్రాధాన్యత ఇచ్చింది. అనవసరపు షాట్లకు పోకుండా వీరిద్దరి జోడి ఆచితూచి ఆడింది. 112 బంతులను ఎదుర్కొన్న ఈ జోడి 50 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. అయితే భువనేశ్వర్ కుమార్(30)పరుగుల వద్ద ఎనిమిదో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. ప్రస్తుతం టీమిండియా 455 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. -
ఎనిమిదో వికెట్ కోల్పోయిన టీమిండియా(448/8)
సిడ్నీ: ఆస్ట్రేలియాతో ఇక్కడ జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా తన తొలి ఇన్నింగ్స్ లో 448 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్ ను కోల్పోయింది. నాల్గో రోజు ఆటలో భాగంగా ఐదు వికెట్ల నష్టానికి 342 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ ను ఆరంభించిన టీమిండియా వెంటవెంటనే రెండు వికెట్లను కోల్పోయింది. విరాట్ కోహ్లీ(147), సాహా(35) పరుగులు చేసి పెవిలియన్ కు చేరారు. అనంతరం అశ్విన్ , భువనేశ్వర్ కుమార్ ల జోడి ఆసీస్ కు చాలా సేపు పరీక్షగా నిలిచింది. 75 బంతులను ఎదుర్కొన్న భువనేశ్వర్ కుమార్ 5 ఫోర్ల సాయంతో 30 పరుగులు చేసి ఎనిమిదో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. -
దీటుగా బదులిస్తున్న టీమిండియా
సిడ్నీ: ఆస్ట్రేలియాతో ఇక్కడ జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా దీటుగా బదులిస్తోంది. ఐదు వికెట్ల నష్టానికి 342 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో నాల్గో రోజు బ్యాటింగ్ ఆరంభించిన భారత ఆటగాళ్లు ఆచితూచి ఆడుతున్నారు. ఈ రోజు ఉదయం విరాట్ కోహ్లి(147), సాహా(35) పరుగుల వద్ద వికెట్లను భారత్ కోల్పోయింది. అనంతరం రవి చంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్ లు ఆసీస్ బౌలర్లకు పరీక్షగా నిలిచారు. అశ్విన్ (40), భువనేశ్వర్ కుమార్ (27) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. ప్రస్తుతం టీమిండియా ఏడు వికెట్ల నష్టానికి 447 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ఆసీస్ బౌలర్లలో స్టార్క్, వాట్సన్ లకు చెరో రెండు వికెట్లు లభించగా,హారిస్, హజిల్ వుడ్, లయన్ లకు తలో వికెట్ దక్కింది. ఆస్టేలియా తన తొలి ఇన్నింగ్స్ లో 572 పరుగుల వద్ద డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే. -
లంచ్ సమయానికి భారత్ స్కోరు: 407/7
సిడ్నీ: బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా సిడ్నీ మైదానంలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో రోజు ఆరంభమైన చివరి టెస్ట్ మ్యాచ్ లో లంచ్ విరామ సమయానికి భారత్ 144 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 407 పరుగులు చేసింది. ప్రస్తుతం అశ్వీన్ (74 బంతుల్లో 33 బ్యాటింగ్; 5 ఫోర్లు), భువనేశ్వర్ కుమార్ (39 బంతుల్లో 3 పరుగులు)తో క్రీజులో ఉన్నారు. అంతకముందు వీరాట్ కోహ్లీ (147), సాహా (35)లతో పెవిలియన్ చేరారు. 119.3 ఓవర్లో 352 పరుగుల వద్ద భారత్ కెప్టెన్ వీరాట్ క్లోహీ ఆరో వికెట్‌గా వెనుతిరిగాడు. మొత్తం 230 బంతుల్లో 20 ఫోర్లు బాదిన కోహ్లీ 147 పరుగులు చేసి హారీస్ బౌలింగ్‌లో రోజర్స్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తరువాత 352 పరుగుల వద్ద భారత్ ఏడో వికెట్ కోల్పోయింది. భారత్ ఆటగాడు సాహా 130.2 ఓవర్లలో ఏడో వికెట్ రూపంలో పెవిలియన్ చేరాడు. 96 బంతుల్లో 35 పరుగులు చేసిన సాహా, హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాటపట్టాడు. ఆసీస్ బౌలర్లలో లయోన్, హరీస్, హాజిల్‌వుడ్ తలో వికెట్ తీసుకోగా, స్టార్క్, వాట్సన్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. భారత్ ప్రస్తుతం 165 పరుగులతో వెనకబడి ఉంది. అయితే మూడో రోజు ఆటముగిసే సమయానికి టీమిండియా ఐదు వికెట్ల నష్టానికి 342 పరుగులు చేసింది. అంతకముందు ఆసీస్ తన తొలి ఇన్నింగ్స్‌ను 7 వికెట్ల నష్టానికి 572 పరుగుల వద్ద డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే. -
383 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయిన భారత్
సిడ్నీ: బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో ఇక్కడ జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ లో నాలుగో రోజు భారత్ 352 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది. భారత్ ఆటగాడు సాహా 130.2 ఓవర్లలో ఏడో వికెట్ రూపంలో పెవిలియన్ చేరాడు. 96 బంతుల్లో 35 పరుగులు చేసిన సాహా, హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాటపట్టాడు. అంతకముందు భారత్ కెప్టెన్ వీరాట్ క్లోహీ 119.3 ఓవర్లో ఆరో వికెట్ రూపంలో పెవిలియన్ చేరాడు. 230 బంతుల్లో 20 ఫోర్లు బాదిన కోహ్లీ 147 పరుగులు చేసి హారీస్ బౌలింగ్‌లో రోజర్స్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. భారత్ 132.5 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 390 పరుగులతో కొనసాగుతోంది. ప్రస్తుతం భువనేశ్వర్(0), అశ్వీన్ (19) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. అయితే మూడో రోజు ఆటముగిసే సమయానికి టీమిండియా ఐదు వికెట్ల నష్టానికి 342 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లలో లయోన్, హరీస్, హాజిల్‌వుడ్ తలో వికెట్ తీసుకోగా, స్టార్క్, వాట్సన్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. అంతకముందు ఆసీస్ తన తొలి ఇన్నింగ్స్‌ను 7 వికెట్ల నష్టానికి 572 పరుగుల వద్ద డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే. -
352 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయిన భారత్
సిడ్నీ: బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో ఇక్కడ జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ లో నాలుగో రోజు భారత్ 352 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. భారత్ కెప్టెన్ వీరాట్ క్లోహీ 119.3 ఓవర్లో ఆరో వికెట్ రూపంలో పెవిలియన్ చేరాడు. 230 బంతుల్లో 20 ఫోర్లు బాదిన కోహ్లీ 147 పరుగులు చేసి హారీస్ బౌలింగ్‌లో రోజర్స్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. భారత్ 122.6 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 359 పరుగులతో కొనసాగుతోంది. ప్రస్తుతం సాహా(17), అశ్వీన్ (4) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. అయితే మూడో రోజు ఆటముగిసే సమయానికి టీమిండియా ఐదు వికెట్ల నష్టానికి 342 పరుగులు చేసింది. టీమిండియా ఆటగాడు విరాట్ కోహ్లీ పరుగుల వర్షం కురిపించాడు. మూడో రోజు ఆటలో భాగంగా 162 బంతులను ఎదుర్కొన్న కోహ్లీ 17 ఫోర్ల సాయంతో సెంచరీ నమోదు చేశాడు. దీంతో నాలుగు టెస్టుల్లో నాలుగు సెంచరీలు చేసిన ఆటగాడిగా కోహ్లీ అరుదైన ఘనతను సాధించాడు. అంతకుముందు అడిలైడ్ లో రెండు సెంచరీలు, మెల్ బోర్న్ లో ఒక సెంచరీతో విరాట్ ఆకట్టుకున్నాడు. ఓవరాల్ గా విరాట్ కు టెస్టు మ్యాచ్ ల్లో 10 వ సెంచరీ. ఆసీస్ బౌలర్లలో లయోన్, హరీస్ తలో వికెట్ తీసుకోగా, స్టార్క్, వాట్సన్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. -
సిడ్నీ టెస్టు: నాలుగో రోజు ఆట ఆరంభించిన భారత్
సిడ్నీ: బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో ఇక్కడ జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ లో భారత్ నాలుగో రోజు ఆట ఆరంభించింది. భారత్ 118.1 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 350 పరుగులతో కొనసాగుతోంది. ప్రస్తుతం విరాట్ (145) సాహా(17) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. అయితే మూడో రోజు ఆటముగిసే సమయానికి టీమిండియా ఐదు వికెట్ల నష్టానికి 342 పరుగులు చేసింది. టీమిండియా ఆటగాడు విరాట్ కోహ్లీ పరుగుల వర్షం కురిపించాడు. మూడో రోజు ఆటలో భాగంగా 162 బంతులను ఎదుర్కొన్న కోహ్లీ 17 ఫోర్ల సాయంతో సెంచరీ నమోదు చేశాడు. దీంతో నాలుగు టెస్టుల్లో నాలుగు సెంచరీలు చేసిన ఆటగాడిగా కోహ్లీ అరుదైన ఘనతను సాధించాడు. అంతకుముందు అడిలైడ్ లో రెండు సెంచరీలు, మెల్ బోర్న్ లో ఒక సెంచరీతో విరాట్ ఆకట్టుకున్నాడు. ఓవరాల్ గా విరాట్ కు టెస్టు మ్యాచ్ ల్లో 10 వ సెంచరీ. ఆసీస్ బౌలర్లలో లయోన్ ఒక వికెట్ తీసుకోగా, స్టార్క్, వాట్సన్ తలో రెండు వికెట్లు తీసుకున్నారు. -
ద్రవిడ్, టెండూల్కర్లను అధిగమించిన కోహ్లీ
భారత టెస్టు జట్టుకు సరికొత్త సారథిగా వ్యవహరిస్తున్న విరాట్ కోహ్లీ.. ఓ సరికొత్త రికార్డు కూడా సృష్టించాడు. ఆస్ట్రేలియా జట్టు మీద ఆ దేశంలో ఆడిన సిరీస్‌లో ఇప్పటి వరకు ఏ భారతీయ బ్యాట్స్‌మన్ చేయనన్ని పరుగులు చేశాడు. సిరీస్‌లో నాలుగు సెంచరీలు చేసిన విరాట్ కోహ్లీ.. మొత్తం 639 పరుగులు చేశాడు. ఇప్పటివరకు ఆస్ట్రేలియాలో ఒక సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు రాహుల్ ద్రవిడ్ (619) పేరు మీద ఉంది. సచిన్ టెండూల్కర్ అయితే.. ఒక సిరీస్‌లో అత్యధికంగా 493 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో.. ఇప్పటివరకు ఆస్ట్రేలియా జట్టును వాళ్ల సొంత గడ్డ మీద వణికించిన వీరుడిగా విరాట్ నిలిచాడు. -
భారత్-ఆస్ట్రేలియా చివరి టెస్టులో మూడో రోజు
-
ఆట ముగిసే సమయానికి టీమిండియా స్కోరు 342/5
సిడ్నీ : ఆస్ట్రేలియాతో ఇక్కడ జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ లో మూడో రోజు ఆటముగిసే సమయానికి టీమిండియా ఐదు వికెట్ల నష్టానికి 342 పరుగులు చేసింది. ఈ రోజు ఆటలో టీమిండియా ఆటగాడు విరాట్ కోహ్లీ మరోసారి మెరిశాడు. మూడో రోజు ఆటలో భాగంగా 162 బంతులను ఎదుర్కొన్న కోహ్లీ 17 ఫోర్ల సాయంతో సెంచరీ నమోదు చేశాడు. దీంతో నాలుగు టెస్టుల్లో నాలుగు సెంచరీలు చేసిన ఆటగాడిగా కోహ్లీ అరుదైన ఘనతను సాధించాడు. అంతకుముందు అడిలైడ్ లో రెండు సెంచరీలు, మెల్ బోర్న్ లో ఒక సెంచరీతో విరాట్ ఆకట్టుకున్నాడు. ఓవరాల్ గా విరాట్ కు టెస్టు మ్యాచ్ ల్లో 10 వ సెంచరీ. ప్రస్తుతం విరాట్ (140) సాహా(14) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. ఈ రోజు ఉదయం వికెట్ నష్టానికి 71 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో బ్యాటింగ్ ఆరంభించిన టీమిండియాలో ఓపెనర్ కేఎల్ రాహుల్ (110) పరుగులతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. టెస్టుల్లో తొలి సెంచరీ నమోదు చేసిన రాహుల్ తన ఆడిన రెండో టెస్టులోనే సెంచరీ మార్కును చేరాడు. అంతకుముందు టీమిండియా రోహిత్ శర్మను వికెట్ ను చేజార్చుకుంది. రోహిత్ (53) పరుగులు చేసి పెవిలియన్ కు చేరాడు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్ , వాట్సన్ లకు తలో రెండు వికెట్లు లభించగా, లయన్ కు ఒక వికెట్ దక్కింది. -
సిడ్నీ టెస్టులోనూ మెరిసిన 'విరాట్'
-
సిడ్నీ టెస్ట్: సురేష్ రైనా డకౌట్
సిడ్నీ: ఆస్ట్రేలియాతో ఇక్కడ జరుగుతున్న చివరి టెస్టు మ్యాచ్ లో టీమిండియా ఆటగాడు సురేష్ రైనా డకౌట్ రూపంలో వెనుదిరిగాడు.తన ఆడిన తొలి బంతికే క్యాచ్ ఇచ్చిన రైనా పెవిలియన్ కు చేరాడు. 292 పరుగుల వద్ద టీమిండియా రైనా ఐదో వికెట్ రూపంలో నిష్ర్కమించాడు. వరుసగా రెండు వికెట్లను కోల్పోయిన టీమిండియా ఒక్కసారిగా కష్టాలను కొనితెచ్చుకుంది. అంతకుముందు అజ్యింకా రహానే (13) పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్ కు చేరిన సంగతి తెలిసిందే. -
నాల్గో వికెట్ కోల్పోయిన టీమిండియా(292/4)
సిడ్నీ: ఆస్ట్రేలియాతో ఇక్కడ జరుగుతున్న చివరి టెస్టు మ్యాచ్ లో టీమిండియా 292 పరుగుల వద్ద నాల్గో వికెట్ ను కోల్పోయింది. మిడిల్ ఆర్డర్ ఆటగాడు అజ్యింకా రహానే(13) పరుగుల వద్ద నాల్గో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. అంతకుముందు విరాట్ కోహ్లీ సెంచరీ నమోదు చేశాడు. మూడో రోజు ఆటలో భాగంగా 162 బంతులను ఎదుర్కొన్న కోహ్లీ 15 ఫోర్ల సాయంతో శతకం పూర్తి చేశాడు. దీంతో నాలుగు టెస్టుల్లో నాలుగు సెంచరీలు చేసిన ఆటగాడిగా కోహ్లీ మరో ఘనతను సాధించాడు.అంతకుముందు అడిలైడ్ లో రెండు సెంచరీలు, మెల్ బోర్న్ లో ఒక సెంచరీతో విరాట్ ఆకట్టుకున్నాడు. ఓవరాల్ గా విరాట్ కు టెస్టు మ్యాచ్ ల్లో 10 వ సెంచరీ. -
సిడ్నీ టెస్టులోనూ మెరిసిన 'విరాట్'
సిడ్నీ : ఆస్ట్రేలియాతో ఇక్కడ గురువారం జరుగుతున్న చివరి, నాల్గో టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా ఆటగాడు విరాట్ కోహ్లీ మరోసారి మెరిశాడు. మూడో రోజు ఆటలో భాగంగా 162 బంతులను ఎదుర్కొన్న కోహ్లీ 17 ఫోర్ల సాయంతో సెంచరీ నమోదు చేశాడు. దీంతో నాలుగు టెస్టుల్లో నాలుగు సెంచరీలు చేసిన ఆటగాడిగా కోహ్లీ అరుదైన ఘనతను సాధించాడు. అంతకుముందు అడిలైడ్ లో రెండు సెంచరీలు, మెల్ బోర్న్ లో ఒక సెంచరీతో విరాట్ ఆకట్టుకున్నాడు. ఓవరాల్ గా విరాట్ కు టెస్టు మ్యాచ్ ల్లో 10 వ సెంచరీ. ఈ రోజు ఉదయం వికెట్ నష్టానికి 71 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో బ్యాటింగ్ ఆరంభించిన టీమిండియాలో ఓపెనర్ కేఎల్ రాహుల్ (110) పరుగులతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. టెస్టుల్లో తొలి సెంచరీ నమోదు చేసిన రాహుల్ తన ఆడిన రెండో టెస్టులోనే సెంచరీ మార్కును చేరాడు. అంతకుముందు టీమిండియా రోహిత్ శర్మను వికెట్ ను చేజార్చుకుంది. రోహిత్ (53) పరుగులు చేసి పెవిలియన్ కు చేరాడు. -
టెస్టుల్లో రాహుల్ తొలి సెంచరీ
-
మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా(238/3)
సిడ్నీ:ఆస్ట్రేలియాతో ఇక్కడ జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా 238 పరుగుల వద్ద మూడో వికెట్ ను కోల్పోయింది. కేఎల్ రాహుల్ (110) పరుగులు చేసి మూడో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ(79) పరుగులతో బ్యాటింగ్ కొనసాగిస్తున్నాడు. అతనికి జతగా అజ్యింకా రహానే క్రీజ్ లోకి వచ్చాడు. టీమిండియా ఓపెనర్ కెఎల్ రాహుల్ టెస్టుల్లో తొలి సెంచరీ చేయడంతో రెండో టెస్టులోనే సెంచరీ చేసిన ఆటగాడిగా అరుదైన గుర్తింపు పొందాడు. 262 బంతులను ఎదుర్కొన్నఈ కర్ణాటక ఓపెనర్ 13 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో శతకం మైలురాయిన అధిగమించాడు. -
టీ విరామ సమయానికి టీమిండియా స్కోరు 234/2
సిడ్నీ: ఆస్ట్రేలియాతో ఇక్కడ జరుగుతున్న చివరి, నాల్గో టెస్ట్ మ్యాచ్ మూడో రోజు ఆటలో టీ విరామ సమయానికి టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 234 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ప్రస్తుతం కేఎల్ రాహుల్(106;256 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్స్), విరాట్ కోహ్లీ(67;121 బంతుల్లో 5ఫోర్లు,2 సిక్సర్లు) లు నాటౌట్ గా క్రీజ్ లో ఉన్నారు. టీమిండియా ఓపెనర్ కెఎల్ రాహుల్ టెస్టుల్లో తొలి సెంచరీ(102) నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇక్కడ ఆస్ట్రేలియాతో జరగుతున్న చివరి టెస్టులో రాహుల్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. 253 బంతులను ఎదుర్కొన్నఈ కర్ణాటక ఓపెనర్ 11ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో శతకం పూర్తి చేశాడు. తను ఆడిన రెండో టెస్టులోనే సెంచరీ చేసిన క్రికెటర్ గా రాహుల్ రికార్డు నెలకొల్పాడు. -
టెస్టుల్లో కెఎల్ రాహుల్ తొలి సెంచరీ
సిడ్నీ: టీమిండియా ఓపెనర్ కెఎల్ రాహుల్ టెస్టుల్లో తొలి సెంచరీ(102) నమోదు చేశాడు. ఇక్కడ ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి టెస్టులో రాహుల్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. 253 బంతులను ఎదుర్కొన్నఈ కర్ణాటక ఓపెనర్ 11ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో శతకం పూర్తి చేసి నాటౌట్ గా క్రీజ్ లో ఉన్నాడు. తను ఆడిన రెండో టెస్టులోనే సెంచరీ చేసిన క్రికెటర్ గా రాహుల్ రికార్డు నెలకొల్పాడు. రాహుల్ కు జతగా విరాట్ కోహ్లీ(67) పరుగులతో క్రీజ్ లో ఉన్నాడు. ప్రస్తుతం టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 230 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. అంతకుముందు రోహిత్ శర్మ(53) పరుగుల వద్ద పెవిలియన్ కు చేరిన సంగతి తెలిసిందే. వికెట్ నష్టానికి 71 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో మూడు రోజు ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియా ఆచితూచి బ్యాటింగ్ కొనసాగిస్తోంది. -
సిడ్నీ టెస్ట్ : విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ
సిడ్నీ:ఆస్ట్రేలియాతో ఇక్కడ జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరోసారి హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. మూడో రోజు ఆటలో భాగంగా తొలి ఇన్నింగ్స్ ను ఆరంభించిన టీమిండియా రోహిత్ శర్మ (53)ను కోల్పోయింది. అనంతరం ఓపెనర్ కేఎల్ రాహుల్ కు జతకలిసిన కోహ్లీ బాధ్యతాయుతంగా ఆడి స్కోరు బోర్డును చక్కదిద్దాడు.108 బంతులను ఎదుర్కొన్న కోహ్లీ 9 ఫోర్ల సాయంతో హాఫ్ సెంచరీ చేశాడు. ప్రస్తుతం రెండు వికెట్లు కోల్పోయిన టీమిండియా 201 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌ను 7 వికెట్ల నష్టానికి 572 పరుగుల వద్ద డిక్లేర్ చేయగా, భారత్ రెండో రోజున తొలి ఇన్నింగ్స్ 25 ఓవర్లలో వికెట్ నష్టానికి 71 పరుగులు చేసిన తెలిసిందే. -
లంచ్ సమయానికి భారత్ స్కోరు: 122/2
సిడ్నీ: బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా సిడ్నీ మైదానంలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో రోజు ఆరంభమైన చివరి టెస్ట్ మ్యాచ్ లో లంచ్ విరామ సమయానికి భారత్ 55 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది. ప్రస్తుతం లోకేష్ రాహుల్ (164 బంతుల్లో 50 బ్యాటింగ్; 5 ఫోర్లు), భారత్ కెప్టెన్ వీరాట్ కోహ్లీ (33 బంతుల్లో 16 బ్యాటింగ్; 3 ఫోర్లు)తో క్రీజ్‌లో ఉన్నారు. భారత్ ఆటగాడు కేఎల్ రాహుల్ 118 పరుగుల వద్ద హాఫ్ సెంచరీ చేయగా, రోహిత్ శర్మ 96 పరుగుల వద్ద హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. మురళీ విజయ్ (0), రోహిత్ శర్మ(53) పరుగులు చేసి పెవిలియన్ చేరారు. ఆ తరువాత బరిలోకి దిగిన భారత్ ఆటగాడు రాహుల్, కెప్టెన్ వీరాట్ కోహ్లీ భాగస్వామ్యంతో నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్, లయోన్ తలో వికెట్ తీసుకోన్నారు. కాగా, భారత్ ప్రస్తుతం మరో 450 పరుగులు వెనుకబడి ఉంది. రెండోరోజు ఓపెనర్ ఆటగాడు మురళీ విజయ్ పరుగులేమి చేయకుండానే చేతులేత్తేశాడు. అదే రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 25 ఓవర్లలో వికెట్ నష్టానికి 71 పరుగులు చేసింది. కాగా, ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌ను 7 వికెట్ల నష్టానికి 572 పరుగుల వద్ద డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే. -
118 పరుగుల వద్ద రాహుల్ హాఫ్ సెంచరీ
సిడ్నీ: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ చివరి టెస్టులో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఆరంభమైన మూడో రోజు మ్యాచ్‌లో భారత్ ఆటగాడు కేఎల్ రాహుల్ 118 పరుగుల వద్ద హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ప్రస్తుతం భారత్ మూడో రోజు ఆటలో 54.2 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 121 పరుగులతో కొనసాగుతోంది. భారత్ ఆటగాడు రాహుల్, కెప్టెన్ వీరాట్ కోహ్లీ భాగస్వామ్యంతో నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. ప్రస్తుతం లోకేష్ రాహుల్ (164 బంతుల్లో 50 బ్యాటింగ్; 5 ఫోర్లు), భారత్ కెప్టెన్ వీరాట్ కోహ్లీ (26 బంతుల్లో 13 బ్యాటింగ్; 3 ఫోర్లు)తో క్రీజ్‌లో ఉన్నారు. భారత్ ప్రస్తుతం మరో 454 పరుగులు వెనుకబడి ఉంది. రెండోరోజు ఓపెనర్ ఆటగాడు మురళీ విజయ్ పరుగులేమి చేయకుండానే చేతులేత్తేశాడు. అదే రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 25 ఓవర్లలో వికెట్ నష్టానికి 71 పరుగులు చేసింది. కాగా, ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌ను 7 వికెట్ల నష్టానికి 572 పరుగుల వద్ద డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే. -
సిడ్నీ టెస్టు: రెండో వికెట్ కోల్పోయిన భారత్
సిడ్నీ: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ చివరి టెస్టులో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఆరంభమైన మూడో రోజు మ్యాచ్‌లో 97 పరుగుల వద్ద భారత్ రెండో వికెట్ కోల్పోయింది. భారత్ ఓపెనర్ ఆటగాడు రోహిత్ శర్మ 43.4 ఓవర్లలో రెండో వికెట్ రూపంలో పెవిలియన్ చేరాడు. 96 పరుగుల వద్ద హాఫ్ సెంచరీ నమోదు చేసిన రోహిత్ శర్మ (133 బంతుల్లో 53 బ్యాటింగ్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు)తో లయోన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. భారత్ మూడో రోజు ఆటలో 47.1 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 108 పరుగులతో కొనసాగుతోంది. రోహిత్ తరువాత బరిలోకి దిగిన భారత్ కెప్టెన్ వీరాట్ కోహ్లీ జట్టు పగ్గాలు అందుకున్నాడు. కోహ్లీ (12 బంతుల్లో 8 బ్యాటింగ్; 2 ఫోర్లు), రాహుల్ (142 బంతుల్లో 45 బ్యాటింగ్; 4 ఫోర్లు) పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. రెండోరోజు ఓపెనర్ ఆటగాడు మురళీ విజయ్ పరుగులేమి చేయకుండానే చేతులేత్తేశాడు. అనంతరం రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 25 ఓవర్లలో వికెట్ నష్టానికి 71 పరుగులు చేసింది. కాగా, ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌ను 7 వికెట్ల నష్టానికి 572 పరుగుల వద్ద డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే. -
96 పరుగుల వద్ద రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ
సిడ్నీ: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ చివరి టెస్టులో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఆరంభమైన మూడో రోజు మ్యాచ్‌లో భారత్ ఓపెనర్ ఆటగాడు రోహిత్ శర్మ 96 పరుగుల వద్ద హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ప్రస్తుతం భారత్ మూడో రోజు ఆటలో 43.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 97 పరుగులతో కొనసాగుతోంది. భారత్ ఆటగాడు రోహిత్, రాహుల్ భాగస్వామ్యంతో నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. రోహిత్ శర్మ (132 బంతుల్లో 53 బ్యాటింగ్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), లోకేష్ రాహుల్ (128 బంతుల్లో 42 బ్యాటింగ్; 4 ఫోర్లు) క్రీజ్‌లో ఉన్నారు. రెండోరోజు ఓపెనర్ ఆటగాడు మురళీ విజయ్ పరుగులేమి చేయకుండానే చేతులేత్తేశాడు. అనంతరం రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 25 ఓవర్లలో వికెట్ నష్టానికి 71 పరుగులు చేసింది. కాగా, ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌ను 7 వికెట్ల నష్టానికి 572 పరుగుల వద్ద డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే. -
మూడో రోజు ఆట ఆరంభించిన భారత్
సిడ్నీ: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ చివరి టెస్టులో భాగంగా సిడ్నీ మైదానంలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో రోజు మ్యాచ్ ఆరంభమైంది. రెండో రోజు ఆటలో ‘భారీ’ సవాల్ విసిరిన ఆస్ట్రేలియా జోరుకు జవాబు ఇచ్చే దిశగా భారత్ మూడో రోజు మ్యాచ్ కొనసాగుతోంది. ప్రస్తుతం భారత్ 26.4 ఓవర్లలో వికెట్ నష్టానికి 75 పరుగులతో కొనసాగుతోంది. అయితే రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 25 ఓవర్లలో వికెట్ నష్టానికి 71 పరుగులు చేసింది. విజయ్ (0) తొలి ఓవర్లోనే వెనుదిరగ్గా రోహిత్ శర్మ (82 బంతుల్లో 40 బ్యాటింగ్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), కేఎల్ రాహుల్ (75 బంతుల్లో 35 బ్యాటింగ్; 3 ఫోర్లు) క్రీజ్‌లో ఉన్నారు. భారత్ ప్రస్తుతం మరో 497 పరుగులు వెనుకబడి ఉంది. మూడో రోజు బ్యాట్స్‌మెన్ నిలకడగా ఆడి భారీ స్కోరు చేస్తేనే ఈ టెస్టులో మనకు అవకాశాలు మిగిలి ఉంటాయి. అంతకుముందు ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌ను 7 వికెట్ల నష్టానికి 572 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. స్టీవెన్ స్మిత్ (208 బంతుల్లో 117; 15 ఫోర్లు) ఈ సిరీస్‌లో వరుసగా నాలుగు టెస్టుల్లో నాలుగో సెంచరీ పూర్తి చేసుకోవడం విశేషం. -
తడబడతారా..! నిలబడతారా..!
రెండు సెంచరీలు...నాలుగు అర్ధ సెంచరీలు...తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ ప్రదర్శన ఇది. బ్యాటింగ్‌కు పూర్తిగా అనుకూలిస్తున్న పిచ్‌పై వరుసగా ఒక్కో కొత్త రికార్డు నెలకొల్పుతూ ఆసీస్ బ్యాట్స్‌మెన్ పరుగుల పండగ చేసుకున్నారు. పరుగులు ఇవ్వడంలో మన బౌలర్లు కూడా నలుగురు సెంచరీలు పూర్తి చేసుకున్నారు. జీవం లేని పిచ్‌పై ఏమీ చేయలేక, బౌలింగ్‌లో కొత్తదనం, వ్యూహాల్లో వైవిధ్యం లేక అలా బంతులు విసిరి విసిరి అలసిపోయారు. పేస్ బౌలింగ్‌లో ‘పేస్’ తగ్గి సాధారణ బౌలర్లుగా మిగిలిపోయారు. కొండంత స్కోరు కళ్ల ముందు ఉండగా, విజయ్ డకౌట్‌తో భారత్‌కు తొలి దెబ్బ. అయితే రోహిత్, రాహుల్ తడబడకుండా నిలబడ్డారు. రెండు రోజుల ఆట తర్వాత కూడా ఎలాంటి జీవం లేని పిచ్ ఇంకా బ్యాటింగ్‌కు బాగా అనుకూలిస్తోంది. ఇప్పుడు ఇదే ఆరంభాన్ని భారత్ తమకు అనుకూలంగా మార్చుకోవాలి. ఇక మూడో రోజు మన బ్యాట్స్‌మెన్ సత్తా చూపాలి. రోజంతా నిలబడి ఆసీస్ స్కోరుకు చేరువైతేనే మ్యాచ్‌లో నిలబడతాం. ఏమాత్రం తడబడినా ఇక మ్యాచ్ మీద ఆశలు వదులుకోవాల్సిన ప్రమాదం ఏర్పడుతుంది. సిడ్నీ: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ చివరి టెస్టులో భారత్ ముందు ‘భారీ’ సవాల్ నిలిచింది. ఆస్ట్రేలియా జోరుకు జవాబిస్తూ మ్యాచ్ రెండో రోజు బుధవారం ఆట ముగిసే సమయానికి భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 25 ఓవర్లలో వికెట్ నష్టానికి 71 పరుగులు చేసింది. విజయ్ (0) తొలి ఓవర్లోనే వెనుదిరగ్గా రోహిత్ శర్మ (76 బంతుల్లో 40 బ్యాటింగ్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), కేఎల్ రాహుల్ (71 బంతుల్లో 31 బ్యాటింగ్; 2 ఫోర్లు) క్రీజ్‌లో ఉన్నారు. భారత్ ప్రస్తుతం మరో 501 పరుగులు వెనుకబడి ఉంది. మూడో రోజు బ్యాట్స్‌మెన్ నిలకడగా ఆడి భారీ స్కోరు చేస్తేనే ఈ టెస్టులో మనకు అవకాశాలు మిగిలి ఉంటాయి. కాస్త తడబడినా ఆసీస్‌కు చేజేతులా అవకాశం ఇచ్చినట్లే. అంతకుముందు ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌ను 7 వికెట్ల నష్టానికి 572 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. స్టీవెన్ స్మిత్ (208 బంతుల్లో 117; 15 ఫోర్లు) ఈ సిరీస్‌లో వరుసగా నాలుగు టెస్టుల్లో నాలుగో సెంచరీ పూర్తి చేసుకోవడం విశేషం. షాన్ మార్ష్ (116 బంతుల్లో 73; 9 ఫోర్లు, 1 సిక్స్), జో బర్న్స్ (114 బంతుల్లో 58; 10 ఫోర్లు) కూడా రాణించారు. భారత బౌలర్లలో షమీ (5/112) కెరీర్లో రెండో సారి ఐదు వికెట్లు పడగొట్టాడు. స్కోరు వివరాలు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: రోజర్స్ (బి) షమీ 95; వార్నర్ (సి) విజయ్ (బి) అశ్విన్ 101; వాట్సన్ (సి) అశ్విన్ (బి) షమీ 81; స్మిత్ (సి) సాహా (బి) ఉమేశ్ 117; మార్ష్ (సి) సాహా (బి) షమీ 73; బర్న్స్ (సి) రాహుల్ (బి) షమీ 58; హాడిన్ (నాటౌట్) 9; హారిస్ (సి) అశ్విన్ (బి) షమీ 25; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (152.3 ఓవర్లలో 7 వికెట్లకు) 572 డిక్లేర్డ్. వికెట్ల పతనం: 1-200; 2-204; 3-400; 4-415; 5-529; 6-546; 7-572. బౌలింగ్: భువనేశ్వర్ 34-5-122-0; ఉమేశ్ 27-5-137-1; షమీ 28.3-3-112-5; అశ్విన్ 47-8-142-1; రైనా 16-3-53-0. భారత్ తొలి ఇన్నింగ్స్: విజయ్ (సి) హాడిన్ (బి) స్టార్క్ 0; రాహుల్ (బ్యాటింగ్) 31; రోహిత్ (బ్యాటింగ్) 40; ఎక్స్‌ట్రాలు 0; మొత్తం (25 ఓవర్లలో వికెట్ నష్టానికి) 71. వికెట్ల పతనం: 1-0. బౌలింగ్: స్టార్క్ 6-2-17-1; హారిస్ 7-1-17-0; హాజల్‌వుడ్ 4-1-10-0; లయోన్ 8-1-27-0. ఆస్ట్రేలియా ఆటగాళ్లంటే అంతే మరి... మామూలుగానే స్లెడ్జింగ్ వారికి మంచినీళ్ల ప్రాయంలా కనిపిస్తుంది. ఇక మొదటి ఓవర్లోనే వికెట్ తీస్తే ఎలా ఉంటుంది? ఆసీస్ బౌలర్ మిషెల్ స్టార్క్ కూడా సరిగ్గా అదే చేశాడు. తన మూడో బంతికే మురళీ విజయ్ను అవుట్ చేయడంతో తనను తాను నియంత్రించుకోలేకపోయాడు. ఒక వైపు తన ఉద్వేగాన్ని ప్రదర్శిస్తూనే, పెవిలియన్ వైపు వెళుతున్న విజయ్ వైపు చూస్తూ... వెళ్లమంటూ నోటికి పని చెప్పాడు. దీనికి విజయ్ స్పందించకపోయినా స్టార్క్ చర్య మాత్రం తీవ్రంగా కనిపించింది. చివరకు కెప్టెన్ స్మిత్ కూడా తన ఆటగాడికి మద్దతు పలకలేదు. ‘ఆ రకంగా స్టార్క్ ప్రవర్తించడం ఆటకు మంచిది కాదు. ఇకపై వికెట్ తీసినా మా ఆటగాళ్లు అలా చేయరు’ అని స్మిత్ అన్నాడు. సెషన్-1: స్మిత్ శతకం రెండో రోజు కూడా ఆసీస్ ఎక్కడా తగ్గకుండా తమ జోరు కొనసాగించింది. ఆట ప్రారంభమైన కొద్ది సేపటికే స్మిత్ 168 బంతుల్లో శతకాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత మాత్రం భారత్‌కు కాస్త ఊరట లభించింది. తక్కువ వ్యవధిలో వాట్సన్ (183 బంతుల్లో 81; 7 ఫోర్లు), స్మిత్ వెనుదిరిగారు. షమీ బౌలింగ్‌లో పుల్ షాట్ ఆడిన వాట్సన్ డీప్ మిడ్వికెట్లో క్యాచ్ ఇవ్వడంతో 196 పరుగుల మూడో వికెట్ భాగస్వామ్యానికి తెర పడింది. ఆ వెంటనే స్మిత్ కూడా ఉమేశ్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. మార్ష్ 9 పరుగుల వద్ద అశ్విన్ బౌలింగ్‌లో గల్లీలో విజయ్ క్యాచ్ వదిలేయడం మరోసారి మన ఫీల్డింగ్ వైఫల్యాన్ని చూపించింది. మరో వైపు బర్న్స్ కూడా మొదటి 17 బంతుల్లో ఒక్క పరుగు కూడా తీయలేకపోయాడు. ఓవర్లు: 30, పరుగులు: 72, వికెట్లు: 2 సెషన్-2: మరో భాగస్వామ్యం లంచ్ తర్వాత మాత్రం మార్ష్, బర్న్స్ క్రీజ్‌లో నిలదొక్కుకున్నారు. దూకుడు ప్రదర్శించకపోవడంతో పరుగుల వేగం తగ్గినా... మన బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తగా బ్యాటింగ్ చేశారు. ఈ క్రమంలో మార్ష్ 87 బంతుల్లో, బర్న్స్ 94 బంతుల్లో అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. ఐదో వికెట్‌కు 114 పరుగులు జత చేసిన అనంతరం షమీ బౌలింగ్‌లో సాహా చక్కటి క్యాచ్ పట్టడంతో మార్ష్ పెవిలియన్ చేరాడు. ఈ సెషన్ చివర్లో ఆసీస్ బ్యాట్స్‌మెన్ వేగంగా ఆడారు. ఓవర్లు: 29, పరుగులు: 118, వికెట్లు: 1 సెషన్-3: భారత్‌కు షాక్ ఈ సెషన్ రెండో ఓవర్లోనే బర్న్స్ వెనుదిరిగాడు. అయితే అనూ హ్యంగా ర్యాన్ హారిస్ (25) చెలరేగిపోయాడు. భువనేశ్వర్ వేసిన ఒకే ఓవర్లో నాలుగు ఫోర్లు సహా అతను 19 పరుగులు రాబట్టడం విశేషం. చివరకు షమీ బౌలింగ్‌లో మరో భారీ షాట్ ఆడబోయి హారిస్ అవుట్ కావడంతో ఆసీస్ తమ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఆసీస్ తొలి వికెట్ తీసేం దుకు భారత్‌కు దాదాపు మూడు గంటలు పడితే, ఆసీస్ మాత్రం మూడో బంతికే దానిని దక్కించుకుంది. ఈ సిరీస్‌లో ఫామ్‌లో ఉన్న విజయ్, స్టార్క్ బౌలింగ్‌లో బంతిని వెంటాడి విజయ్, కీపర్‌కు క్యాచ్ ఇచ్చాడు. ఈ దశలో జత కలిసిన రోహిత్, రాహుల్ ఆకట్టుకున్నారు. గత టెస్టులో విఫలమైన రాహుల్ జాగ్రత్తగా ఆడగా, రోహిత్ మాత్రం కాస్త దూకుడు ప్రదర్శించాడు. లయోన్ బౌలింగ్‌లో అతను రెండు భారీ సిక్సర్లు కొట్టాడు. చివర్లో వీరిద్దరు కొంత ఉత్కంఠకు లోనైనా, మరో వికెట్ పడనీయలేదు. (ఆసీస్) ఓవర్లు: 3.3, పరుగులు: 34, వికెట్లు: 2 (భారత్) ఓవర్లు: 25, పరుగులు: 71, వికెట్లు: 1 3 ఒకే సిరీస్‌లో వరుసగా నాలుగు టెస్టుల్లోనూ సెంచరీ చేసిన మూడో ఆటగాడు స్మిత్. 1931-32లో బ్రాడ్‌మన్, 2003-04లో కలిస్ ఈ ఘనత సాధించారు. 24 ఒక ఇన్నింగ్స్‌లో నలుగురు భారత బౌలర్లు ఒక్కొక్కరు వందకు పైగా పరుగులు ఇవ్వడం ఇది 24వ సారి 1 ఈ సిరీస్‌లో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు పడగొట్టిన తొలి భారత బౌలర్ షమీ. 2011-12 సిరీస్‌లోనూ ఒకే భారత బౌలర్ (ఉమేశ్) ఐదు వికెట్లు తీశాడు. 1 ఆస్ట్రేలియాలో జట్టులోని టాప్-6 బ్యాట్స్‌మెన్ అందరూ కనీసం అర్ధ సెంచరీ చేయడం ఇదే తొలిసారి. -
భారత్-ఆస్ట్రేలియా చివరి టెస్టులో రెండోరోజు
-
లంచ్ సమయానికి ఆస్ట్రేలియా స్కోరు: 420/4
సిడ్నీ: బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా సిడ్నీ మైదానంలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో రోజు ఆరంభమైన చివరి టెస్ట్ మ్యాచ్ లో లంచ్ విరామ సమయానికి ఆస్ట్రేలియా 120.0 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 420 పరుగులు చేసింది. ప్రస్తుతం మార్ష్(14), బర్న్స్ (0) క్రీజులో ఉన్నారు. ఆసీస్ ఓపెనర్లు కెప్టెన్ స్టీవ్ స్మిత్ (117), వాట్సన్ (81) పరుగులు చేసి పెవిలియన్ చేరారు. స్మిత్ ఆడిన నాలుగు టెస్టు సిరీస్ లలో ఎనిమిదోవ సెంచరీ నమోదు చేసి తన ఖాతాలో వేసుకున్నాడు. ఇరువురి భాగస్వామ్యంలో తొలిరోజు నుంచి రెండోరోజు వరకూ నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఆకాశమే హద్దుగా.. భారత్ బౌలర్ల ఎత్తులను చిత్తు చేస్తూ వచ్చిన బంతిని వచ్చినట్టు బౌండరీలు దాటించారు. స్మిత్ 208 బంతుల్లో 15 ఫోర్లు బాది 117 పరుగులకు ఔటయ్యాడు. వాట్సన్ 183 బంతుల్లో 7 ఫోర్లు బాది 81 పరుగులకే వెనుతిరిగాడు. భారత్ బౌలర్లలో మహ్మద్ షమీ రెండు వికెట్లు, అశ్విన్, యాదవ్ తలో వికెట్ తీసుకోన్నారు. -
415 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా
సిడ్నీ: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో రోజు ఆరంభమైన చివరి టెస్ట్ మ్యాచ్ లో ఆసీస్ 113.3 ఓవర్లలో 415 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. ఆసీస్ ఓపెనర్ గా బరిలోకి దిగిన స్మిత్ నాలుగో వికెట్ రూపంలో పెవిలియన్ చేరాడు. తొలిరోజు నుంచి నిలకడగా ఆడుతూ వాట్సన్ భాగస్వామ్యంలో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. రెండో రోజూ కూడా స్మిత్ అదే దూకుడును ప్రదర్శిస్తూ ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడాడు. స్మిత్ ఆడిన నాలుగు టెస్టు సిరీస్ లలో ఎనిమిదోవ సెంచరీ నమోదు చేసి తన ఖాతాలో వేసుకున్నాడు. యాదవ్ బౌలింగ్ లో సహా కు క్యాచ్ ఇచ్చి స్మిత్ పెవిలియన్ కు చేరాడు. రెండు రోజులు కలిపి 208 బంతుల్లో 15 ఫోర్లు బాదిన స్మిత్ 117 పరుగులకు ఔటయ్యాడు. ఆస్ట్రేలియా 116.1 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 416 పరుగులతో కొనసాగుతోంది. ప్రస్తుతం మార్ష్(10), బర్న్స్ (0) క్రీజులో ఉన్నారు. కాగా, టీమిండియా బౌలర్లలో మహ్మద్ షమీ రెండు వికెట్లు తీసుకోగా, అశ్విన్, యాదవ్ తలో వికెట్ తీసుకోన్నారు. -
400 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా
సిడ్నీ: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో రోజు ఆరంభమైన చివరి టెస్ట్ మ్యాచ్ లో ఆసీస్ 107.2 ఓవర్లలో 400 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. ఆసీస్ ఓపెనర్ గా బరిలోకి దిగిన వాట్సన్ మూడో వికెట్ రూపంలో పెవిలియన్ చేరాడు. తొలిరోజు నుంచి నిలకడగా ఆడుతూ స్మిత్ భాగస్వామ్యంలో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. రెండో రోజూ కూడా వాట్సన్ అదే దూకుడును ప్రదర్శించాడు. ఇంతలో మహ్మద్ షమీ బౌలింగ్ లో ఆశ్వీన్ కు క్యాచ్ ఇచ్చిన వాట్సన్ పెవిలియన్ బాటపట్టాడు. రెండు రోజులు కలిపి 183 బంతుల్లో 7 ఫోర్లు బాదిన వాట్సన్ 81 పరుగులకే వెనుతిరిగాడు. ఆస్ట్రేలియా 111.2 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 412 పరుగులతో కొనసాగుతోంది. ప్రస్తుతం మార్ష్ (9), స్మిత్ 110 పరుగులతో క్రీజులో ఉన్నారు. కాగా, టీమిండియా బౌలర్లలో అశ్విన్ ఒక వికెట్ తీసుకోగా, మహ్మద్ షమీ రెండు వికెట్లు పడగొట్టాడు. -
సిడ్నీ టెస్ట్: ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ సెంచరీ
సిడ్నీ: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో రోజు ఆరంభమైన చివరి టెస్ట్ మ్యాచ్ లో ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ సెంచరీ నమోదు చేశాడు. రెండో రోజు ఆట ఆరంభించిన ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ తొలిరోజులా అదే దూకుడును ప్రదర్శించాడు. స్మిత్ ఆడిన వరుసగా నాలుగు టెస్టు సిరీస్ లలో నాలుగు సెంచరీలు నమోదు చేసి తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం 175 బంతుల్లో 15 ఫోర్లు బాదిన స్మిత్ 107 పరుగులతో క్రీజులో ఉన్నాడు. అతడికి జతగా వాట్సన్ 166 బంతుల్లో 7 ఫోర్లు, 78 పరుగులతో క్రీజులో కొనసాగుతున్నాడు. వీరిద్దరి భాగస్వామ్యంలో ఆసీస్ స్కోరు 102.3 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 393 పరుగులతో కొనసాగుతోంది. కాగా, టీమిండియా బౌలర్లలో అశ్విన్ , మహ్మద్ షమీలకు తలో వికెట్ దక్కింది.