సిడ్నీ: ఆస్ట్రేలియాతో ఇక్కడ జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ ఆఖరి రోజు ఆటలో టీమిండియా మూడో వికెట్ ను కోల్పోయింది. 349 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ను ఆరంభించిన టీమిండియా 178 పరుగుల వద్ద మూడో వికెట్ ను నష్టపోయింది. మురళీ విజయ్(80) పరుగులు చేసి మూడో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. ఇంకా ఏడు వికెట్లు ఉన్న టీమిండియా 171 పరుగులను ఛేదించాల్సి ఉంది. ప్రస్తుతం విరాట్ కోహ్లీ క్రీజ్ లో ఉన్నాడు.