సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా 208 పరుగుల వద్ద ఆరో వికెట్ ను కోల్పోయింది. సాహా పరుగులేమీ చేయకుండానే ఆరో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. కనీసం డ్రా చేస్తుందనుకన్నఅభిమానికి టీమిండియా వరుస వికెట్లను చేజార్చుకోవడం మింగుడు పడటం లేదు. ఇంకా నాలుగు వికెట్లు మాత్రమే ఉన్న టీమిండియా విజయానికి 140 పరుగుల దూరంలో ఉంది.