sidney cricket ground
-
NZ Vs Pak: కివీస్‌ను చిత్తు చేసి.. ఫైనల్లో పాకిస్తాన్
ICC Mens T20 World Cup 2022 - New Zealand vs Pakistan, 1st Semi-Final Updates In Telugu: రిజ్వాన్, బాబర్ ఆజం జోరు కొనసాగుతోంది. ఏడో ఓవర్ ఆఖరి బంతికి బాబర్ విషయంలో కివీస్ రివ్యూకు వెళ్లగా నిరాశే ఎదురైంది. 8 ఓవర్లు ముగిసే సరికి రిజ్వాన్ 32, బాబర్ 33 పరుగులతో క్రీజులో ఉన్నారు. దంచి కొడుతున్న పాక్ ఓపెనర్లు పాక్ ఓపెనర్లు రిజ్వాన్, బాబర్ ఆజం దంచికొడుతున్నారు. ఆచితూచి ఆడుతూనే వీలు చిక్కినప్పుడల్లా బంతిని బౌండరీకి తరలిస్తున్నారు. దీంతో పవర్ ప్లేలో పాక్ వికెట్ నష్టపోకుండా 55 పరుగులు చేయగలిగింది. రిజ్వాన్ 28, బాబర్ 25 పరుగులతో క్రీజులో ఉన్నారు. 3 ఓవర్లలో పాక్ స్కోరెంతంటే! కివీస్‌ను నామమాత్రపు స్కోరుకే కట్టడి చేసిన పాక్ బ్యాటింగ్ కొనసాగిస్తోంది. ఓపెనర్లు మహ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజం నిలకడగా ఆడుతున్నారు. 3 ఓవర్లలో పాక్ స్కోరు: 24-0 పాక్‌తో తొలి సెమీ ఫైనల్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. కివీస్ ఇన్నింగ్స్‌లో డారిల్ మిచెల్(53- నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కెప్టెన్ కేన్ విలియమ్సన్ 46 పరుగులతో రాణించాడు. పాక్ బౌలర్లలో షాహిన్ ఆఫ్రిదికి రెండు, మహ్మద్ నవాజ్‌కు ఒక వికెట్ దక్కాయి. డారిల్ మిచెల్ అర్థ శతకం ►ఎట్టకేలకు కివీస్ ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ నమోదైంది. హారిస్ రవూఫ్ బౌలింగ్‌లో రెండు పరుగులు తీసిన మిచెల్ ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. స్కోరు: 144-4(19 ఓవర్లలో) ►డారిల్ మిచెల్ హాఫ్ సెంచరీకి చేరువయ్యాడు. 18 ఓవర్లు ముగిసే సరికి జట్టు స్కోరు 133-4 కాగా.. మిచెల్ 46 పరుగులతో క్రీజులో ఉన్నాడు. నాలుగో వికెట్ డౌన్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ రూపంలో కివీస్ నాలుగో వికెట్ కోల్పోయింది. 17 వ ఓవర్ రెండో బంతికి షాహిన్ ఆఫ్రిది కివీస్ సారథిని బౌల్డ్ చేశాడు. దీంతో 46 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద విలియమ్సన్ నిష్క్రమించాడు. నీషమ్, మిచెల్ క్రీజులో ఉన్నారు. ►అర్థ శతకానికి చేరువలో కేన్ మామ! 15 ఓవర్లు ముగిసే సరికి విలియమ్సన్ 43, మిచెల్ 31 పరుగులతో క్రీజులో ఉన్నారు ►మిచెల్, విలియమ్సన్ ఆచితూచి ఆడుతున్నారు. 13 ఓవర్లు ముగిసే సరికి విలియమ్సన్ 35, మిచెల్ 22 పరుగులతో క్రీజులో ఉన్నారు. ►11 ఓవర్లలో కివీస్ స్కోరు: 73-3 ►10 ఓవర్లలో కివీస్ స్కోరు: 59/3.. విలియమ్సన్, మిచెల్ బ్యాటింగ్ మూడు వికెట్లు డౌన్ ►గ్లెన్ ఫిలిప్స్‌ను అవుట్ చేసిన నవాజ్ ►ఆరో ఓవర్ ఆఖరి బంతికి కివీస్ ఓపెనర్ కాన్వే రనౌట్ అయ్యాడు. దీంతో న్యూజిలాండ్ రెండో వికెట్ కోల్పోయింది. పవర్ ప్లేలో న్యూజిలాండ్ స్కోరు: 38/2 ►5 ఓవర్లలో కివీస్ స్కోరు: 30/1. కాన్వే, విలియమ్సన్ బ్యాటింగ్ తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్‌కు తొలి ఓవర్లోనే షాక్ తగిలింది. షాహీన్ అఫ్రిది బౌలింగ్‌లో ఫిన్ అలెన్ (4) ఎల్బీడబ్యూగా వెనుదిరిగాడు. పాక్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తుది జట్లు: న్యూజిలాండ్ ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే(వికెట్ కీపర్), కేన్ విలియమ్సన్(కెప్టెన్), గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్, టిమ్ సౌతీ, ఇష్ సోధి, లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్ పాకిస్థాన్: మహ్మద్ రిజ్వాన్(వికెట్ కీపర్), బాబర్ ఆజం(కెప్టెన్), మహ్మద్ హరీస్, షాన్ మసూద్, ఇఫ్తికర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, మహ్మద్ వసీం జూనియర్, నసీమ్ షా, హరీస్ రవూఫ్, షాహీన్ అఫ్రిది సై అంటే సై టీ20 ప్రపంచకప్-2022 టోర్నీలో తొలి సెమీ ఫైనల్ మ్యాచ్‌కు తెర లేచింది. సిడ్నీ వేదికగా న్యూజిలాండ్- పాకిస్థాన్ మధ్య మ్యాచ్ ఆరంభం కానుంది. ఫైనల్‌కు అర్హత సాధించే క్రమంలో ఇరు జట్లు బుధవారం(నవంబరు 9) అమీ తుమీ తేల్చుకోనేందుకు సిద్ధమయ్యాయి. గతేడాది రన్నరప్ కివీస్ ఈసారి టైటిల్ వేటే లక్ష్యంగా ముందుకు సాగుతుండగా.. సెమీస్ గండం గట్టెక్కి తుది మెట్టుకు చేరుకోవాలని పాక్ ఉవ్విళ్లూరుతోంది. -
మరీ ఇంత దారుణ వైఫల్యమా? నీలాంటి ‘కెప్టెన్’ ఈ భూమ్మీద మరొకరు ఉండరు!
ICC Mens T20 World Cup 2022 - South Africa vs Bangladesh- Sidney: టీ20 ఫార్మాట్లో సౌతాఫ్రికా కెప్టెన్ తెంబా బవుమా వైఫల్యం కొనసాగుతోంది. ప్రపంచకప్-2022లో భాగంగా సిడ్నీలో బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో ఈ ఓపెనింగ్ బ్యాటర్ పూర్తిగా నిరాశపరిచాడు. మొత్తంగా ఆరు బంతులు ఎదుర్కొని కేవలం 2 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. కాగా గత కొంతకాలంగా పొట్టి క్రికెట్లో బవుమా పూర్తిగా తేలిపోతున్న సంగతి తెలిసిందే. దారుణ ప్రదర్శన గత ఏడు ఇన్నింగ్స్‌లో టీ20 ఫార్మాట్లో బవుమా చేసిన పరుగులు వరుసగా... 8, 8*, 0, 0, 3, 2*, 2. అంతేకాదు మొత్తంగా ఇప్పటి వరకు 31 అంతర్జాతీయ టీ20లు ఆడిన బవుమా సాధించిన పరుగులు 571. అత్యధిక స్కోరు 72. హాఫ్ సెంచరీ ఒకటి. ఇక వన్డేల్లోనూ 20 మ్యాచ్‌లలో అతడు సాధించిన పరుగులు 730. ఇందులో రెండు సెంచరీలు, రెండు అర్ధ శతకాలు ఉన్నాయి. ఈ ఫార్మాట్లో బవుమా అత్యధిక స్కోరు 113. టెస్టుల విషయానికొస్తే 51 మ్యాచ్‌లలో 2612 పరుగులు చేశాడు. ఇందులో ఓ శతకం, 19 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. నువ్వు కెప్టెన్ కదా! కాగా బంగ్లాతో మ్యాచ్‌లో బవుమా మరోసారి నిరాశ పరిచిన నేపథ్యంలో ఈ గణాంకాలను ప్రస్తావిస్తూ అతడిని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. ‘‘బవుమా అద్భుత ఫామ్ కొనసాగుతోంది. సూపర్‌గా ఆడుతున్నాడు. 31 అంతర్జాతీయ టీ20లలో ఒకే ఒక్క హాఫ్ సెంచరీ.. వరుసగా సింగిల్ డిజిట్ స్కోర్లు.. సారథిగా భేష్.. అయినా పాపం ఇంత ఘోరంగా ఆడే ఓ క్రికెటర్ ఈ భూమ్మీద కెప్టెన్‌గా ఉండగలడా?’’ అంటూ వ్యంగ్యంగా కామెంట్లు చేస్తున్నారు. అయితే, బ్యాటర్‌గా విఫలమవుతున్నా టీ20 ప్రపంచకప్ ఆరంభానికి ముందు 20 మ్యాచ్‌లకు టీ20లకు సారథిగా వ్యవహరించిన బవుమా.. 13 గెలిచాడు. ఈ విషయాన్ని గుర్తు చేస్తూ అతడి అభిమానులు ట్రోల్స్‌కు కౌంటర్ ఇస్తున్నారు. ఇక బంగ్లాతో మ్యాచ్‌లో రిలీ రోసో, క్వింటన్ డికాక్ రాణించడంతో సహా బౌలర్లు అద్భుత ప్రదర్శన కనరచడంతో బవుమా బృందం 104 పరుగుల భారీ తేడాతో గెలిచింది. కాగా గతేడాది కెప్టెన్సీ చేపట్టిన బవుమా.. ఈ ఘనత సాధించిన తొలి బ్లాక్ ఆఫ్రికన్‌గా చరిత్రకెక్కాడు. చదవండి: Rilee Rossouw: అద్భుత సెంచరీతో రికార్డులు సృష్టించిన రోసో.. అరుదైన ఘనతలు టీ20 వరల్డ్‌కప్‌లో సెంచరీ హీరోలు వీరే.. భారత్ నుంచి ఒకే ఒక్కడు The curious case of Temba Bavuma.. 51 Tests - 1 Hundred... 30 T20Is - 1 Fifty, 115 SR.. How on the earth he is in Team, even T20I Captain 🤷🏻♂️ #tembabavuma #SAvsBAN #BANvSA #ICCT20WorldCup #ICCT20WorldCup2022 pic.twitter.com/UmhNosRXVG — Anil R Pradhan (@anilrpradhan) October 27, 2022 Temba Bavuma in the last 7 innings in T20I: 8(10), 8*(11), 0(4), 0(7), 3(8), 2*(2) & 2(6). — Johns. (@CricCrazyJohns) October 27, 2022 Excellent Form for Temba Bavuma Continues. Dismissed for 2 runs on 6 balls. I will Delete my Twitter if he ever scores a 35 or less balls Half Century against any team in T20s. — Afsha (@AfshaCricket) October 27, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4911494512.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); View this post on Instagram A post shared by ICC (@icc) -
Ind Vs Ned: కండరాల నొప్పి?! స్టార్ ప్లేయర్‌కు రెస్ట్? క్లారిటీ ఇచ్చిన కోచ్
T20 World Cup 2022- India Vs Netherlands: పాకిస్తాన్‌తో మ్యాచ్ సందర్భంగా టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గాయపడ్డాడా? కండరాల నొప్పితో బాధపడిన అతడు నెదర్లాండ్స్‌తో తదుపరి మ్యాచ్‌కు దూరం కానున్నాడా? కీలక మ్యాచ్‌లకు సన్నద్ధం చేసేందుకు మేనేజ్మెంట్ అతడికి విశ్రాంతినివ్వనుందా? అసలు పాండ్యా ఫిట్‌గానే ఉన్నాడా? లేదంటే టీమిండియాకు కష్టాలు తప్పవు! అంటూ అభిమానుల్లో ఆందోళనల రేకెత్తిన వేళ భారత బౌలింగ్ కోచ్ పారస్ మాంబ్రే స్పందించాడు. పాండ్యా ఫిట్‌నెస్‌పై క్లారిటీ ఇచ్చాడు. మ్యాచ్ డేందుకు అన్ని రకాలుగా అతడు సన్నద్ధంగా ఉన్నట్లు వెల్లడించాడు. అదరగొట్టాడు కదా! టీ20 ప్రపంచకప్-2022లో తమ ఆరంభ మ్యాచ్‌లో పాక్‌పై రోహిత్ సేన 4 వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ విరాట్ కోహ్లి(82, నాటౌట్)తో పాటు హార్దిక్ పాండ్యా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 40 పరుగులు చేయడం సహా 3 వికెట్లు తీసి జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. అయితే, మ్యాచ్ ముగిసే సమయంలో అతడు కండరాల నొప్పితో ఇబ్బందికి గురైనట్లు సమాచారం. అతడు లేకపోతే ఎట్లా? ఈ నేపథ్యంలో తదుపరి మ్యాచ్‌కు అతడికి విశ్రాంతినివ్వాలని యాజమాన్యం భావించినట్లు వార్తలు రాగా.. పారస్ మాంబ్రే వాటిని కొట్టిపడేశాడు. ప్రెస్ కాన్ఫరెన్స్‌లో అతడు మాట్లాడుతూ.. ‘‘నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌కు మేము ఎవరికీ విశ్రాంతినివ్వడం లేదు. టోర్నీలో మొమెంటం కొనసాగించాలనుకుంటున్నాం. ఫామ్‌లో ఉన్నవాళ్లు తప్పకుండా జట్టులో ఉంటారు’’ అంటూ తొలి విజయం ఇచ్చిన జోష్ నేపథ్యంలో మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతామని వెల్లడించాడు. హార్దిక్ పాండ్యా జట్టులో కీలక సభ్యుడని.. అతడు అన్ని మ్యాచ్‌లు ఆడతాడని పేర్కొన్నాడు. పాక్‌తో మ్యాచ్ సమయంలో ఈ ఆల్‌రౌండర్ రాణించిన తీరు, ఆటిట్యూడ్ గురించి ఈ సందర్భంగా పారస్ మాంబ్రే ప్రస్తావించాడు. తదుపరి మ్యాచ్‌లలో క్లిష్ట పరిస్థితుల్లో కోహ్లికి పాండ్యా అండగా నిలబడ్డ తీరును కొనియాడాడు. కాగా నెదర్లాండ్స్‌తో సిడ్నీలో మ్యాచ్ నేపథ్యంలో పాండ్యాకు విశ్రాంతినిచ్చి అతడి స్థానంలో దీపక్ హుడాకు ఛాన్స్ ఇస్తారనే అభిప్రాయాలు వ్యక్తమైన విషయం తెలిసిందే. ఇక సూపర్-12లో నెదర్లాండ్స్ తర్వాత సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, జింబాబ్వేలతో మిగిలిన మ్యాచ్‌లు ఆడనుంది. ఇవి కూడా చదవండి: Ind Vs Pak: టీమిండియా మోసం చేసి గెలిచిందంటూ అక్కసు.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన దిగ్గజ అంపైర్ WC 2022: పాక్‌తో మ్యాచ్‌లో విఫలం.. అందరి దృష్టి అతడిపైనే! నెట్స్‌లో తీవ్ర సాధన! పసికూనతో అయినా Ravichandran Ashwin: చంద్రముఖిలా మారిన కోహ్లి.. ముందుగా డీకేను తిట్టుకున్నాను! ఆ తర్వాత T20 WC 2022: ఆ విషయంలో టీమిండియా ఆటగాళ్ల తీవ్ర అసంతృప్తి?.. కానీ ఐసీసీ మాత్రం అంతే! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4911494512.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
WC 2022: టీమిండియా ఆటగాళ్ల తీవ్ర అసంతృప్తి.. కానీ ఐసీసీ మాత్రం అంతే!
T20 World Cup 2022- India Vs Netherlands: సిడ్నీలో నెట్ సెషన్ సందర్భంగా తమకు సరైన భోజనం లభించలేదంటూ టీమిండియా ఆటగాళ్లలో కొంతమంది అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. దీంతో ప్రాక్టీస్ ముగించుకుని హోటల్‌కు వెళ్లిన తర్వాతే వారు లంచ్ చేసినట్లు తెలుస్తోంది. టీ20 ప్రపంచకప్-2022లో తమ ఆరంభ మ్యాచ్‌లో దాయాది పాకిస్తాన్‌పై విజయంతో భారత జట్టు శుభారంభం చేసిన విషయం తెలిసిందే. హోటల్ చాలా దూరం..! ఈ క్రమంలో నెదర్లాండ్స్‌తో సిడ్నీ వేదికగా గురువారం తమ తదుపరి మ్యాచ్ ఆడనుంది. ఇందుకోసం ఇప్పటికే అక్కడికి చేరుకున్న రోహిత్ సేన మంగళవారం ప్రాక్టీసు సెషన్లో పాల్గొంది. కాగా టీమిండియా బస చేసే హోటల్‌కు.. గ్రౌండ్‌కు దాదాపు 42 కిలోమీటర్ల దూరం ఉన్నట్లు తెలుస్తోంది. ఇంతదూరం నుంచి ప్రాక్టీసుకు వెళ్లిన ఆటగాళ్లకు మధ్యాహ్నం సరైన భోజన వసతి కల్పించడంలో టోర్నీ నిర్వాహకులు(ఐసీసీ) విఫలమైనట్లు తెలుస్తోంది. కెప్టెన్ రోహిత్ శర్మ సహా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి, దినేశ్ కార్తిక్, రిషభ్ పంత్, కేఎల్ రాహుల్ తదితరులు నెట్ సెషన్లో పాల్గొనగా.. ప్రాక్టీస్ తర్వాత సరైన భోజనం పెట్టలేదని బీసీసీఐ సన్నిహిత వర్గాలు తెలిపినట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఫుడ్ బాగా లేదు! ‘‘ఫుడ్ అస్సలు బాగాలేదు. ప్రాక్టీస్ తర్వాత కనీసం వేడి వేడి సాండ్విచ్ కూడా ఇవ్వలేదు. దీంతో కొంతమంది ఆటగాళ్లు హోటల్‌కు వెళ్లిన తర్వాతే భోజనం చేయాలని భావించారు’’ అని భారత జట్టుకు చెందిన ఓ వ్యక్తి పేర్కొన్నట్లు న్యూస్ ఏజెన్సీ పీటీఐ వెల్లడించింది. ఇక సిడ్నీలో ఆతిథ్యం విషయంలో అసంతృప్తితో ఉన్న టీమిండియా ఆటగాళ్లు బీసీసీఐ అధికారికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఐసీసీ అలాగే చేస్తుంది ఈ నేపథ్యంలో ఆప్షనల్ ట్రెయినింగ్ సెషన్‌ను కొంతమంది బాయ్‌కాట్ చేసినట్లు వార్తలు రాగా.. బీసీసీఐ అధికారి ఒకరు తాజాగా స్పందించారు. ‘‘ఎవరూ నెట్ సెషన్ బాయ్‌కాట్ చేయలేదు. కొంతమంది పండ్లు, ఫెలాఫెల్(బీన్స్‌తో చేసే డీప్ ఫ్రై వంటకం- మధ్యప్రాచ్య దేశాల్లో ఎక్కువగా తింటారు) తిన్నారు. అయితే, లంచ్ హోటల్లోనే చేయాలని భావించారు. అసలు సమస్య ఏమిటంటే.. లంచ్ తర్వాత ఐసీసీ వేడి వేడి వంటకాలు వడ్డించదు. ద్వైపాక్షిక సిరీస్ సమయంలో అయితే.. ఆతిథ్య దేశానికి చెందిన క్యాటరింగ్ ఇన్చార్జ్ ఈ వ్యవహారాలు చూసుకుంటారు. ప్రాక్టీస్ సెషన్ తర్వాత భారతీయ వంటకాలు వడ్డిస్తారు. అయితే, ఐసీసీ మాత్రం అన్ని దేశాల ఆటగాళ్లకు ఒకే రకమైన భోజనం ఇస్తుంది. అవకాడోతో తయారు చేసిన చల్లారిపోయిన సాండ్విచ్ మాత్రమే కాదు.. టొమాటో, దోసకాయ వంటివి కూడా భోజనంలో ఉంటాయి’’ అని పీటీతో వ్యాఖ్యానించారు. చదవండి: WC 2022: పాక్‌తో మ్యాచ్‌లో విఫలం.. అందరి దృష్టి అతడిపైనే! నెట్స్‌లో తీవ్ర సాధన! పసికూనతో అయినా Ind Vs Pak: టీమిండియా మోసం చేసి గెలిచిందంటూ అక్కసు.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన దిగ్గజ అంపైర్ -
ఆసీస్‌ను చిత్తు చేసిన న్యూజిలాండ్.. 89 పరుగుల తేడాతో ఘన విజయం
New Zealand vs Australia, 13th Match, Super 12 Group 1- Updates: టీ20 ప్రపంచకప్-2022 సూపర్-12 తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఘోర పరాజయం పాలైంది. సిడ్నీ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 89 పరుగుల తేడాతో ఆసీస్ ఓటమి చెందింది. 201 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 111 పరుగులకే కుప్పకూలింది. న్యూజిలాండ్ బౌలర్లలో శాంట్నర్, సౌథీ మూడు వికెట్లతో ఆస్ట్రేలియా పతనాన్ని శాసించగా.. బౌల్ట్, ఫెర్గూసన్, సోధి తలా వికెట్ సాధించారు. ఆసీస్ బ్యాటర్లలో మ్యాక్స్‌వెల్ 28 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఓటమికి చేరువలో ఆస్ట్రేలియా న్యూజిలాండ్‌తో సూపర్-12 తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓటమికి చేరవైంది. 16.3 ఓవర్లకు 109 పరుగులు చేసి 9 వికెట్లు కోల్పోయింది. 16 ఓవర్ వేసిన కివీస్ పేసర్ వరుసగా స్టార్క్, జంపాను పెవిలియన్‌కు పంపాడు. గ్లెన్ మాక్స్వెల్ అవుట్ ఆసీస్ ఇన్నింగ్స్‌లో ఇప్పటి వరకు టాప్ స్కోరర్‌గా ఉన్న గ్లెన్ మాక్స్వెల్ (28) సైతం పెవిలియన్ చేరాడు. దీంతో కంగారూ జట్టు ఏడో వికెట్ కోల్పోయింది. భారీ లక్ష్యం ముందున్న వేళ టాపార్డర్ కుప్పకూలడంతో 14 ఓవర్లు ముగిసే సరికి కనీసం వంద(91-7) పరుగులు కూడా చేయలేకపోయింది. ఫెర్గూసన్‌కు తొలి వికెట్ ఆసీస్ ఆరో వికెట్ కోల్పోయింది. ఫెర్గూసన్ బౌలింగ్‌లో మాథ్యూ వేడ్ పెవిలియన్ చేరాడు. స్కోరు: 86/6 (12.4) ఐదో వికెట్ కోల్పోయిన ఆసీస్ హిట్టర్ టిమ్ డేవిడ్ రూపంలో ఆస్ట్రేలియా ఐదో వికెట్ కోల్పోయింది. సాంట్నర్ బౌలింగ్‌లో అతడు పెవిలియన్ చేరాడు. 11 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా 5 వికెట్ల నష్టానికి 74 పరుగులు చేసింది. స్టొయినిస్ అవుట్ సాంట్నర్ బౌలింగ్‌లో స్టొయినిస్ షాట్ ఆడగా.. గ్లెన్ ఫిలిప్స్ అద్బుత క్యాచ్‌తో అతడికి షాకిచ్చాడు. దీంతో ఆసీస్ నాలుగో వికెట్ కోల్పోయింది. కివీస్ బౌలర్లు సౌతీ, సాంట్నర్ ఇప్పటి వరకు చెరో రెండు వికెట్లు తీశారు. తొమ్మిది ఓవర్లలో ఆసీస్ స్కోరు: 54-4 మూడో వికెట్ డౌన్.. మిచెల్ మార్ష్ అవుట్ ఆరంభంలోనే ఆసీస్‌కు చుక్కలు చూపిస్తున్నారు కివీస్ బౌలర్లు. సౌతీ .. వార్నర్, మిచెల్ మార్ష్‌లను పెవిలియన్‌కు పంపగా.. సాంట్నర్.. ఫించ్ వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. 5 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ స్కోరు: 34-3 ఆరోన్ ఫించ్ రూపంలో రెండో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా 4 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ స్కోరు- 30/2 View this post on Instagram A post shared by ICC (@icc) ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. వార్నర్ అవుట్ 201 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. 5 పరుగులు చేసిన డెవిడ్ వార్నర్.. సౌథీ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి మిచెల్ మార్ష్ వచ్చాడు. కాన్వే అద్భుత ఇన్నింగ్స్.. కివీస్ స్కోరెంతంటే ఓపెనర్లు ఫిన్ అలెన్ (16 బంతుల్లో 42 పరుగులు), డెవాన్ కాన్వే (92 పరుగులు- నాటౌట్) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో న్యూజిలాండ్ 3 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. 17 ఓవర్లు ముగిసే సరికి కివీస్ స్కోరు- 161/3 మూడో వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్ 15.6 ఓవర్ వద్ద కివీస్ మూడో వికెట్ కోల్పోయింది. హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో గ్లెన్ ఫిలిప్స్ అతడికే క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. 15 ఓవర్లు ముగిసే సరికి కివీస్ స్కోరు: 144/2 కాన్వే 70, గ్లెన్ ఫిలిప్స్ 7 పరుగులతో క్రీజులో ఉన్నారు. రెండో వికెట్ డౌన్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ రూపంలో న్యూజిలాండ్ రెండో వికెట్ కోల్పోయింది. జంపా బౌలింగ్‌లో విలియమ్సన్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. 23 బంతులు ఎదుర్కొన్న అతడు 23 పరుగులు చేశాడు. అర్ధ శతకం పూర్తి చేసుకున్న కాన్వే ఆసీస్‌తో ఆరంభ మ్యాచ్‌లో కివీస్ ఓపెనర్ డెవాన్ కాన్వే హాఫ్ సెంచరీ సాధించాడు. 13వ ఓవర్ మొదటి బంతికి జంపా బౌలింగ్‌లో సిక్స్ కొట్టి అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. పది ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ స్కోరు: 97-1 కాన్వే 42, విలియమ్సన్ 12 పరుగులతో క్రీజులో ఉన్నారు.(28) పవర్ ప్లే ముగిసే సరికి కివీస్ స్కోరు: 69/1 కెప్టెన్ కేన్ విలియమ్సన్ 4, ఓపెనర్ డెవాన్ కాన్వే 19 పరుగులతో క్రీజులో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన కివీస్ ఫిన్ అలెన్ రూపంలో న్యూజిలాండ్ తొలి వికెట్ కోల్పోయింది. 42 పరుగులతో జోరు మీదున్న అలెన్‌ను హాజిల్‌వుడ్ తన అద్భుతమైన బంతితో బౌల్డ్ చేశాడు. కేన్ విలియమ్సన్, డెవాన్ కాన్వే క్రీజులో ఉన్నారు. 4.1 ఓవర్లలో కివీస్ స్కోరు- 56/1. దంచి కొడుతున్న ఫిన్ అలెన్ ఆసీస్ ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన కివీస్ జట్టుకు ఓపెనర్లు ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే శుభారంభం అందించారు. అలెన్ 15 బంతుల్లోనే 5 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో 42 పరుగులు సాధించాడు. కాన్వే 9 బంతులు ఎదుర్కొని 2 ఫోర్ల సాయంతో 14 పరుగుల వద్ద ఉన్నాడు. వీరిద్దరి విజృంభణతో 4 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ 56 పరుగులు చేసింది. టీ20 ప్రపంచకప్-2022 అసలైన సమరానికి తెరలేచింది. సూపర్-12 ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా- రన్నరప్ న్యూజిలాండ్ సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వేదికగా తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. తుది జట్లు: న్యూజిలాండ్ డెవాన్ కాన్వే(వికెట్ కీపర్), ఫిన్ అలెన్, కేన్ విలియమ్సన్(కెప్టెన్), గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్, టిమ్ సౌతీ, ఇష్ సోధి, లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్. ఆస్ట్రేలియా: ఆరోన్ ఫించ్(కెప్టెన్), డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్వెల్, మార్కస్ స్టొయినిస్, టిమ్ డేవిడ్, మాథ్యూ వేడ్(వికెట్ కీపర్), పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హాజిల్‌వుడ్. చదవండి: Rohit Sharma: తొమ్మిదేళ్లుగా ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా గెలవలేదు.. అయితే ఈసారి మాత్రం.. -
Aus Vs NZ: అసలైన పోరుకు ముందు కివీస్‌కు ఎదురుదెబ్బ.. స్టార్ ప్లేయర్ అవుట్
T20 World Cup 2022- Aus Vs NZ: టీ20 ప్రపంచకప్-2022 టోర్నీలో తమ ఆరంభ మ్యాచ్‌కు ముందు న్యూజిలాండ్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఆల్‌రౌండర్ డారిల్ మిచెల్ గాయం కారణంగా ఆస్ట్రేలియాతో మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఈ విషయాన్ని కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ధ్రువీకరించాడు. వరల్డ్‌కప్-2022 సూపర్ 12 దశ ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఆసీస్- గతేడాది రన్నరప్ న్యూజిలాండ్ తలపడనున్న విషయం తెలిసిందే. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వేదికగా శనివారం(అక్టోబరు 22) ఇరు జట్లు పోటీపడనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రెస్ కాన్ఫరెన్స్‌లో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మాట్లాడుతూ.. డారిల్ మిచెల్ గాయం గురించి అప్డేట్ ఇచ్చాడు. డారిల్ దూరం ఈ మేరకు.. ‘‘డారిల్ ఇంకా అందుబాటులోకి రాలేదు. అయితే, జట్టులో మిగతా వాళ్లంతా ఫిట్‌గా ఉన్నారు’’ అని పేర్కొన్నాడు. కాగా స్వదేశంలో పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లతో ట్రై సిరీస్‌కు ముందు డారిల్ మిచెల్ చేతి వేలికి గాయమైంది. దీంతో ఆ సిరీస్‌కు దూరమైన అతడు.. ఇప్పుడు కీలక మ్యాచ్ కూడా ఆడలేకపోతున్నాడు. ఇక గత ప్రపంచకప్ ఈవెంట్లో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో అదరగొట్టిన ఈ 31 ఏళ్ల ఆల్‌రౌండర్.. సెమీస్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఆరోజు దురదృష్టవశాత్తూ ఇదిలా ఉంటే.. గత ప్రపంచకప్ ఫైనల్ నాటి జ్ఞాపకాలను కేన్ విలియమ్సన్ ప్రెస్ కాన్ఫరెన్స్ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు. ‘‘ఆరోజు మ్యాచ్ గొప్పగా సాగింది. అయితే, దురదృష్టవశాత్తూ మేము ఓడిపోయాం. ఆస్ట్రేలియా అద్భుత ప్రదర్శన కనబరిచింది. ఇక రేపటితో అసలైన టోర్నీ మొదలుకాబోతోంది. మ్యాచ్ ఆరంభం నుంచే పట్టు బిగించడం ముఖ్యం. ఆస్ట్రేలియాతో మొదటి మ్యాచ్ ఆడటం చాలెంజింగ్‌గా ఉంటుంది’’ అని కేన్ విలియమ్సన్ అన్నాడు. ఇక ఆస్ట్రేలియా గడ్డపై తమ రికార్డు గురించి ప్రస్తావిస్తూ.. ‘‘మేము ఆ విషయాల గురించి పెద్దగా పట్టించుకోము. ఆస్ట్రేలియా ఎంతో పటిష్టమైన జట్టు. మాకు గట్టిపోటీనిస్తుంది. అయితే, అన్నిసార్లు పరిస్థితులు ఒకేలా ఉండవు’’ అని పేర్కొన్నాడు. కాగా 2009 తర్వాత కివీస్.. ఆసీస్‌లో ఏ ఫార్మాట్లోనూ ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. చదవండి: T20 WC 2022- Ind Vs Pak: ‘అలా అయితే అక్టోబరు 23న ఇండియాతో పాక్ మ్యాచ్ ఆడదు’ -
ఉఫ్... హమ్మయ్య!
ఊహించినట్లుగానే ఆస్ట్రేలియా ఐదో రోజు ఉదయాన్నే 349 పరుగుల లక్ష్యంతో భారత్‌ను బ్యాటింగ్‌కు పిలిచింది. తొలి రెండు సెషన్లు విరాట్ అండ్ కో ఆచితూచి ఆడి 57 ఓవర్లలో 2 వికెట్లకు 160 పరుగులు చేసి టీ విరామానికి వెళ్లారు. ఇక్కడి నుంచి హై డ్రామా మొదలైంది. ఓ పావుగంట పాటు విజయ్ దడదడలాడించి భారత్ విజయం కోసం ఆడబోతోందని స్పష్టం చేశాడు. ఇక్కడే ఆస్ట్రేలియా బౌలర్లు సత్తా చూపించారు. టపటపా వికెట్లతో భారత్‌ను బెంబేలెత్తించారు. ఫలితం... 217/7. రహానే తప్ప అశ్విన్‌తో సహా ప్రధాన బ్యాట్స్‌మెన్ అంతా పెవిలియన్‌లో కూర్చున్నారు. విజయం సంగతి దేవుడెరుగు. 12 ఓవర్ల పాటు మూడు వికెట్లు పడకుండా కాపాడుకోవాలి. హైడ్రామాలకు పెట్టింది పేరైన సిడ్నీలో ఒక్కసారిగా అందరిలోనూ 2008 తలంపులు. క్లార్క్ ఆఖరి ఓవర్లో మూడు వికెట్లు తీసి మ్యాచ్‌ను భారత్ నుంచి లాగేసిన వైనం పదే పదే గుర్తొస్తోంది. ఓవైపు స్మిత్ కొత్త బంతి తీసుకుని ఎదురుదాడి మొదలుపెట్టాడు. రహానేకు జతగా భువనేశ్వర్... ప్రతి బంతికీ ఉత్కంఠ. ఉఫ్... హా... అయ్యో... ఇలాంటి నిట్టూర్పులు. మొత్తంమీద చివరి గంటలో సిడ్నీలో నరాలు తెగే ఉత్కంఠ. ఈ ఒత్తిడిని రహానే, భువనేశ్వర్ అద్భుతంగా అధిగమించారు. చుట్టూ ఫీల్డర్లు మోహరించినా... ధైర్యంగా మరో వికెట్ పడకుండా పోరాడి భారత్‌ను గట్టెక్కించారు. ఫలితంగా నాలుగు టెస్టుల సిరీస్‌లో ఆసీస్ ఆధిక్యం 2-0కు మించి పెరగకుండా చూశారు. సిడ్నీ: సమయానుకూలంగా ఆటతీరును మార్చుకుంటూ పోరాట స్ఫూర్తిని చూపెట్టిన భారత్ జట్టు... ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్టును డ్రాగా ముగించింది. చివరి సెషన్లో టపటపా వికెట్లు పడినా.. రహానే (38 నాటౌట్), భువనేశ్వర్ (20 నాటౌట్) సహనంతో బ్యాటింగ్ చేసి జట్టును గట్టెక్కించారు. సిడ్నీ మైదానంలో శనివారం ముగిసిన ఈ మ్యాచ్‌లో... 349 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 89.5 ఓవర్లలో 7 వికెట్లకు 252 పరుగులు చేసింది. విజయ్ (165 బంతుల్లో 80; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), కోహ్లి (95 బంతుల్లో 46; 3 ఫోర్లు), రోహిత్ (90 బంతుల్లో 39; 2 ఫోర్లు, 2 సిక్సర్లు)లు రాణించారు. స్టార్క్, లయోన్, హాజెల్‌వుడ్ తలా రెండు వికెట్లు తీశారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 251/6 వద్దే ఆసీస్ తమ రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. స్మిత్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’; ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు దక్కాయి. భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్ల మధ్య ముక్కోణపు వన్డే టోర్నీ 16 నుంచి జరుగుతుంది. స్కోరు వివరాలు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 572/7 డిక్లేర్డ్ భారత్ తొలి ఇన్నింగ్స్: 475 ఆలౌట్ ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: 251/6 డిక్లేర్డ్ భారత్ రెండో ఇన్నింగ్స్: విజయ్ (సి) హాడిన్ (బి) హాజెల్‌వుడ్ 80; రాహుల్ (సి) వార్నర్ (బి) లయోన్ 16; రోహిత్ (సి) స్మిత్ (బి) వాట్సన్ 39; కోహ్లి (సి) వాట్సన్ (బి) స్టార్క్ 46; రహానే నాటౌట్ 38; రైనా ఎల్బీడబ్ల్యూ (బి) స్టార్క్ 0; సాహా ఎల్బీడబ్ల్యూ (బి) లయోన్ 0; అశ్విన్ ఎల్బీడబ్ల్యూ (బి) హాజెల్‌వుడ్ 1; భువనేశ్వర్ నాటౌట్ 20; ఎక్స్‌ట్రాలు: 12; మొత్తం: (89.5 ఓవర్లలో 7 వికెట్లకు) 252. వికెట్ల పతనం: 1-48; 2-104; 3-178; 4-201; 5-203; 6-208; 7-217 బౌలింగ్: స్టార్క్ 19-7-36-2; హారిస్ 13-3-34-0; లయోన్ 30.5-5-110-2; హాజెల్‌వుడ్ 17-7-31-2; స్మిత్ 2-0-7-0; వాట్సన్ 8-2-22-1 సెషన్-1: విజయ్ జోరు లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన విజయ్, లోకేశ్ రాహుల్ (16) నెమ్మదిగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. కొత్త బంతిని ఆచితూచి ఆడటంతో తొలి ఏడు ఓవర్లలో కేవలం 9 పరుగులు మాత్రమే చేశారు. పిచ్ స్పిన్‌కు అనుకూలంగా ఉండటంతో ఆరో ఓవర్లోనే లయోన్‌కు స్మిత్ బంతి అప్పగించాడు. అయితే పదో ఓవర్లో విజయ్ చెలరేగి 16 పరుగులు రాబట్టడంతో భారత్ స్కోరు కాస్త వేగంగా కదిలింది. కానీ రెండో ఎండ్‌లో బాగా ఇబ్బందిపడ్డ రాహుల్ 14వ ఓవర్లో లయోన్ బంతిని వార్నర్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. దీంతో తొలి వికెట్‌కు 48 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఈ దశలో వచ్చిన రోహిత్ ఎదుర్కొన్న తొలి బంతికే స్టంప్ అవుటయ్యే అవకాశం నుంచి తప్పించుకున్నాడు. తర్వాత 6.4 ఓవర్ల వరకు ఒక్క పరుగు కూడా చేయలేకపోయాడు. చివరకు 24వ ఓవర్లో ఓ భారీ సిక్స్, బౌండరీతో గాడిలో పడ్డాడు. తర్వాత ఈ జోడి లంచ్ వరకు ఎలాంటి తడబాటు లేకుండా ఆడింది. ఓవర్లు: 29; పరుగులు: 73; వికెట్లు: 1 సెషన్-2 : కోహ్లి నిలకడ లంచ్ తర్వాత విజయ్, రోహిత్ నిలకడగా ఆడినా భారీ భాగస్వామ్యాన్ని మాత్రం నమోదు చేయలేకపోయారు. విరామం తర్వాత 9వ ఓవర్లో రోహిత్ ఇచ్చిన క్యాచ్‌ను స్లిప్‌లో డైవ్ చేస్తూ స్మిత్ ఒంటిచేత్తో అద్భుతంగా అందుకున్నాడు. విజయ్, రోహిత్ రెండో వికెట్‌కు 56 పరుగులు జోడించారు. తర్వాత వచ్చిన కోహ్లి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఇన్నింగ్స్‌ను సాఫీగా నడిపించాడు. దీంతో భారత్ 37వ ఓవర్లో వంద పరుగులకు చేరుకుంది. అయితే 42 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద విజయ్ ఇచ్చిన క్యాచ్‌ను షార్ట్ కవర్లో మార్ష్ వదిలేశాడు. తర్వాతి ఓవర్లోనే మరోసారి ఎల్బీ నుంచి తప్పించుకున్నాడు. విజయ్ అవుటైనట్లు రీప్లేలో స్పష్టమైనా అంపైర్ సంతృప్తి చెందలేదు. కొద్దిసేపటికే విజయ్ 135 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ సిరీస్‌లో అతనికిది నాలుగోది. ఈ జోడి నిలకడతో భారత్ 160/2 స్కోరుతో టీకి వెళ్లింది. ఓవర్లు: 28; పరుగులు: 87; వికెట్లు: 1 సెషన్-3: బౌలర్ల హవా ఇక చివరి సెషన్లో భారత్ గెలవాలంటే 189 పరుగులు చేయాలి. చేతిలో ఎనిమిది వికెట్లున్నాయి. క్రీజులో ఉన్న విజయ్, కోహ్లి మంచి జోరుమీదున్నారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలనుకున్న టీమిండియాకు ఆసీస్ బౌలర్లు ఊహించని షాక్ ఇచ్చారు. నిలకడగా ఆడుతున్న విజయ్ను 61వ ఓవర్లో హాజెల్‌వుడ్ బోల్తా కొట్టించాడు. దీంతో మూడో వికెట్‌కు 74 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. అప్పుడే వచ్చిన రహానే కుదురుకునేందుకు కాస్త సమయం తీసుకున్నాడు. కానీ భారత్ స్కోరు 200లకు చేరిన వెంటనే కోహ్లి, ఆ తర్వాత స్వల్ప వ్యవధిలో రైనా (0), సాహా (0)లు వెనుదిరి గారు. ఓవరాల్‌గా 7 పరుగుల వ్యవధిలో మూడు వికెట్లు చేజార్చుకోవడంతో భారత్ గెలుపుపై ఆశలు వదిలేసుకుంది. ఇక మ్యాచ్‌ను కాపాడే బాధ్యత రహానేపై పడింది. అశ్విన్‌తో కలిసి 7.1 ఓవర్లు బ్యాటింగ్ చేసి కేవలం 9 పరుగులు జోడించారు. అయితే 79వ ఓవర్లో అశ్విన్ అవుట్ కావడంతో భారత్ శిబిరంలో ఆందోళన మొదలైంది. ఈ దశలో భువనేశ్వర్ ఆపద్బాంధవుడి పాత్ర పోషించాడు. అత్యంత కీలకమైన 69 బంతులను ఓర్పుతో ఎదుర్కొన్న ఈ జంట ఎనిమిదో వికెట్‌కు అజేయంగా 35 పరుగులు జోడించి మ్యాచ్‌ను డ్రాగా ముగించింది. ఓవర్లు: 32.5; పరుగులు: 92; వికెట్లు: 5 3113 నాలుగు టెస్టుల్లో కలిపి ఆసీస్ చేసిన పరుగులు. గతంలో దక్షిణాఫ్రికా 2962 పరుగుల రికార్డును స్మిత్ సేన అధిగమించింది. 692 ఈ సిరీస్‌లో కోహ్లి చేసిన పరుగులు. ఆసీస్‌లో ఒక సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన తొలి భారత బ్యాట్స్‌మన్‌గా రికార్డులకెక్కాడు. కానీ ఏ సిరీస్‌లోనైనా ఎక్కువ పరుగులు చేసిన రెండో బ్యాట్స్‌మన్ విరాట్. గతంలో గవాస్కర్ రెండుసార్లు విండీస్‌పై 700కు పైగా పరుగులు చేశాడు. 482 ఈ సిరీస్‌లో మురళీ విజయ్ చేసిన పరుగులు. ఆస్ట్రేలియాలో భారత్ తరఫున ఓపెనింగ్ బ్యాట్స్‌మన్‌కు ఇదే అత్యధికం. 2 గత 20 ఏళ్లలో సిడ్నీలో డ్రా అయిన టెస్టుల సంఖ్య. ఈ కాలంలో 22 టెస్టులు ఆడితే ఆసీస్ 17 గెలవగా, మూడింటిలో ఓడింది. 5 చివరి ఏడు ఇన్నింగ్స్‌ల్లో రైనా ఐదుసార్లు డకౌటయ్యాడు. అలాగే మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో డకౌట్ కావడం ఇది రెండోసారి. 2011 ఓవల్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో డకౌట్ అయ్యాడు. ఓటమంటే నాకు అసహ్యం. పోటీ ఇవ్వడానికే ఇక్కడికి వచ్చాం. ప్రత్యర్థులు ఈ విషయాన్ని గ్రహించి మాకు సరైన గౌరవం ఇవ్వాలి. కుర్రాళ్లమని తేలికగా తీసిపారేయకూడదు. అలా ఆలోచించడం వారికే మంచిదికాదు. మేం ప్రపంచకప్‌ను గెలవబోతున్నాం. ఆ నమ్మకం మాకుంది. ఆసీస్‌లో మేం మంచి క్రికెట్ ఆడాం. ఈ అనుభవం మాకు వరల్డ్‌కప్‌లో ఉపయోగపడుతుంది. అంతర్జాతీయ స్థాయిలో బౌలింగ్ ఎలా చేయాలో ఆసీస్‌ను చూసి నేర్చుకోవాలి. నేను అవుటయ్యే వరకు విజయం కోసం ప్రయత్నించి చూడాలనుకున్నాం. మా ఆటగాళ్లు కూడా బాగా ఆడారు. బ్యాటింగ్, బౌలింగ్‌లో ఇంకా నిలకడ రావాలి. మాటల యుద్ధం సహజం. కానీ ప్రత్యర్థులు మమ్మల్ని గౌరవించడం నేర్చుకోవాలి. సిరీస్‌లో ఓడినా వ్యక్తిగతంగా నాకు సానుకూల ఫలితాన్నే ఇచ్చింది. నాపై నమ్మకం ఉంది కాబట్టి ఎక్కువగా ఒత్తిడి తీసుకోలేదు. ఇక టెస్టులను మర్చి వన్డేలపై దృష్టిపెడతాం. -కోహ్లి (భారత కెప్టెన్) ఈ సిరీస్‌లో 20 వికెట్లు తీయడం చాలా కష్టంగా మారింది. మేం ఊహించిన విధంగా పిచ్‌లు లేవు. లేకపోతే సిరీస్‌ను ఇంకా మెరుగైన ఆధిక్యంతో గెలిచేవాళ్లం. నాలుగు టెస్టుల్లో బౌలర్లు బాగా కష్టపడ్డారు. ఐదో రోజు భారత్‌ను ఆలౌట్ చేయకపోవడం కాస్త నిరాశ కలిగించింది. గెలిచి ఉంటే బాగుండేది. లయోన్ కొన్ని అవకాశాలను సృష్టించినా వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయాం. బావోద్వేగాల మధ్య ఈ సిరీస్ ఆడటం బాగా కష్టమైంది. అయినప్పటికీ సిరీస్ గెలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. కెప్టెన్సీని బాగా ఆస్వాదించా. అద్భుతమైన జట్టుకు నాయకత్వం వహించా. సీనియర్లు బాగా సహకరించారు. నేను కోరుకున్న విధంగా ఆటగాళ్లు రాణించారు. -స్మిత్ (ఆసీస్ కెప్టెన్) -
టెస్టు సిరీస్.. ఆస్ట్రేలియాదే!!
-
భారత్-ఆస్ట్రేలియా చివరి టెస్టు మ్యాచ్ డ్రా
-
హమ్మయ్యా..ఓటమి నుంచి బయట పడ్డారు!
సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరిగిన చివరి టెస్టు మ్యాచ్ లో టీమిండియా ఓటమి నుంచి బయట పడింది. శనివారం చివరి రోజు ఆటలో భాగంగా టీమిండియా అతికష్టం మీద గట్టెక్కింది. ఓ దశలో ఓటమి దిశగా పయనించిన టీమిండియాను అజ్యింకా రహానే, భువనేశ్వర్ జోడీ కాపాడింది. ఏడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న టీమిండియా మరో ఓటమి బారిన పడకుండా కాపాడి తమవంతు బాధ్యతను సమర్ధవంతంగా నిర్వర్తించారు. ఈ ఆఖరి మ్యాచ్ పై తొలుత ఇరు జట్లు గెలుపుపై ఆశలు పెట్టుకున్నాచివరకు డ్రాతో సరిపెట్టుకోక తప్పలేదు. 349 పరుగుల విజయలక్ష్యంతో శనివారం బ్యాటింగ్ ఆరంభించిన టీమిండియా ఆదిలో లక్ష్యం దిశగా పయనించినట్లు కనిపించింది. టీమిండియా ఓపెనర్ , గత ఇన్నింగ్స్ సెంచరీ హీరో కేఎల్ రాహుల్ (16)లు చేసి ఆదిలోనే పెవిలియన్ కు చేరాడు. ఆ సమయంలోమురళీ విజయ్ (80, రోహిత్ శర్మ(39) పరుగులు చేసి జట్టు పరిస్థితిని చక్కదిద్దారు. అనంతరం విరాట్ కోహ్లీ(46), సురేష్ రైనా(0), సాహా (0) వికెట్లను వరుసగా కోల్పోయిన టీమిండియా స్వల్ప వ్యవధిలో కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో ఆసీస్ కు మరో విజయానికి చేరువగా పయనించింది. కాగా అజ్యింకా రహానే తన మార్కు ఆటను ప్రదర్శించి ఆసీస్ అటాకింగ్ ను అడ్డుకున్నాడు.88 బంతులను ఎదుర్కొన్న రహానే ఐదు ఫోర్ల సాయంతో 38 పరుగులు చేసి నాటౌట్ గా మిగిలాడు. అతనికి జతగా భువనేశ్వర్ కుమార్ (20) పరుగులు చేసి టీమిండియా ఓటమిని అడ్డుకున్నాడు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్ , లయన్ లకు తలో రెండు వికెట్లు దక్కగా, హజిల్ వుడ్ లకు తలో రెండు వికెట్లు దక్కగా వాట్సన్ వికెట్ లభించింది. ఇప్పటికే రెండు టెస్టులను గెలిచిన ఆస్ట్రేలియా సిరీస్ ను కైవశం చేసుకున్న సంగతి తెలిసిందే. అడిలైడ్, బ్రిస్బేన్ టెస్టుల్లో ఆసీస్ గెలవగా.. మెల్ బోర్న్, సిడ్నీ టెస్టులు మాత్రం డ్రాగా ముగిశాయి. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ 572/7 డిక్లేర్, రెండో ఇన్నింగ్స్ 251/6 డిక్లేర్ భారత తొలి ఇన్నింగ్స్ 475, రెండో ఇన్నింగ్స్ 252/7 -
ఏడో వికెట్ కోల్పోయిన టీమిండియా(217/7)
సిడ్నీ: ఆస్ట్రేలియా తో జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా రెండో ఇన్నింగ్స్ లో 217 పరుగుల వద్ద ఏడో వికెట్ ను కోల్పోయింది.22 బంతులను ఎదుర్కొన్న రవి చంద్రన్ అశ్విన్ ఒక పరుగు మాత్రమే చేసి ఏడో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. అంతకుముందు సాహా, సురేష్ రైనాలు డకౌట్లుగా పెవిలియన్ కు చేరారు. ఈ ఇన్నింగ్స్ లో మురళీ విజయ్ (80), విరాట్ కోహ్లీ(46), రోహిత్ శర్మ(39) పరుగుల మినహా ఎవరూ ఆకట్టుకోలేదు. -
ఆరో వికెట్ ను కోల్పోయిన టీమిండియా(208/6)
సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా 208 పరుగుల వద్ద ఆరో వికెట్ ను కోల్పోయింది. సాహా పరుగులేమీ చేయకుండానే ఆరో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. కనీసం డ్రా చేస్తుందనుకన్నఅభిమానికి టీమిండియా వరుస వికెట్లను చేజార్చుకోవడం మింగుడు పడటం లేదు. ఇంకా నాలుగు వికెట్లు మాత్రమే ఉన్న టీమిండియా విజయానికి 140 పరుగుల దూరంలో ఉంది. -
సురేష్ రైనా డకౌట్ల పరంపర
సిడ్నీ: టీమిండియా స్టార్ ఆటగాడు సురేష్ రైనా టెస్టుల్లో డకౌట్ల పరంపర కొనసాగిస్తున్నాడు. మహేంద్ర సింగ్ ధోనీ టెస్టుల నుంచి వైదొలగడంతో ఆస్ట్రేలియాతో జరిగే చివరి టెస్టు మ్యాచ్ లోకి వచ్చిన రైనా తన ఖాతాను ఇంకా ఆరంభించలేదు. తొలి ఇన్నింగ్స్ లో రెండు బంతులనే ఎదుర్కొన్న రైనా పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ చేరిన సంగతి తెలిసిందే. అయితే కీలకమైన రెండో ఇన్నింగ్స్ లో రైనా తన సత్తా చాటుతాడని అభిమానులు భావించారు. కాగా రైనా ఏమాత్రం తన శైలిని మార్చుకోకుండా మళ్లీ డకౌట్ గా వెనుదిరిగాడు. ఈ మ్యాచ్ లో ఆరు బంతులను ఎదుర్కొన్న రైనా తన ఫుట్ వర్క్ లో ఘోరంగా విఫలమయ్యాడు. -
ఐదో వికెట్ కోల్పోయిన టీమిండియా(203/5)
సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా రెండో ఇన్నింగ్స్ లో 203 పరుగుల వద్ద ఐదో వికెట్ ను కోల్పోయింది. సురేష్ రైనా డకౌట్ రూపంలో వెనుదిరిగాడు. అంతకుముందు కేఎల్ రాహుల్(16), రోహిత్ శర్మ(39), మురళీ విజయ్ (80), విరాట్ కోహ్లీ(46) పరుగులు చేసి పెవిలియన్ కు చేరారు. ఇంకా ఐదు వికెట్లు మాత్రమే చేతిలో ఉన్న టీమిండియా విజయానికి 146 పరుగుల దూరంలో ఉంది. -
నాల్గో వికెట్ కోల్పోయిన టీమిండియా(201/4)
సిడ్నీ: ఆస్ట్రేలియాతో ఇక్కడ జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా నాల్గో వికెట్ ను కోల్పోయింది. విరాట్ కోహ్లీ (46) పరుగుల వద్ద పెవిలియన్ కు చేరాడు. టీమిండియా స్కోరు 201 పరుగుల వద్ద ఉండగా కోహ్లీ అనవసరపు షాట్ కోసం యత్నించి వెనుదిరిగాడు .ప్రస్తుతం అజ్యింకా రహానే(10) పరుగులతో క్రీజ్ లో ఉన్నాడు. ఇంకా ఆరు వికెట్లు చేతిలో ఉన్న టీమిండియా విజయానికి 148 పరుగుల దూరంలో ఉంది. -
మూడో వికెట్ ను కోల్పోయిన టీమిండియా
సిడ్నీ: ఆస్ట్రేలియాతో ఇక్కడ జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ ఆఖరి రోజు ఆటలో టీమిండియా మూడో వికెట్ ను కోల్పోయింది. 349 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ను ఆరంభించిన టీమిండియా 178 పరుగుల వద్ద మూడో వికెట్ ను నష్టపోయింది. మురళీ విజయ్(80) పరుగులు చేసి మూడో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. ఇంకా ఏడు వికెట్లు ఉన్న టీమిండియా 171 పరుగులను ఛేదించాల్సి ఉంది. ప్రస్తుతం విరాట్ కోహ్లీ క్రీజ్ లో ఉన్నాడు. -
టీ విరామ సమయానికి టీమిండియా స్కోరు 160/2
సిడ్నీ: ఆస్ట్రేలియాతో ఇక్కడ చివరి టెస్ట్ మ్యాచ్ ఆఖరి రోజులో టీమిండియా టీ విరామ సమయానికి రెండు వికెట్లు కోల్పోయి 160 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. 349 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా కేఎల్ రాహుల్(16), రోహిత్ శర్మ(39) వికెట్లను కోల్పోయింది. ప్రస్తుతం మురళీ విజయ్- విరాట్ కోహ్లీల జోడీ టీమిండియాకు మరమ్మత్తులు చేపట్టారు. ఈ ఇరువురి ఆటగాళ్లు ఆచితూచి ఆడుతూ ముందుకు సాగుతున్నారు. మురళీ విజయ్ (71), విరాట్ కోహ్లీ(26) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. -
మురళీ విజయ్ హాఫ్ సెంచరీ(134/2)
సిడ్నీ:ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరిటెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా ఆటగాడు మురళీ విజయ్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. 135 బంతులను ఎదుర్కొన్న విజయ్ 3 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 50 పరుగులు పూర్తి చేశాడు. ప్రస్తుతం టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 134 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. 349 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఆదిలోనే కేఎల్ రాహుల్(16) వికెట్ తో పాటు, రోహిత్ శర్మ(39) వికెట్ ను కూడా నష్టపో్యింది. అనంతరం మురళీ విజయ్ - విరాట్ కోహ్లీల జోడి కుదురుగా ఆడుతోంది. -
48 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన భారత్
-
రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా
సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరిటెస్ట్ మ్యాచ్ లో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియా 104 పరుగుల వద్ద రెండో వికెట్ ను కోల్పోయింది. టీమిండియా ఆటగాడు రోహిత్ శర్మ (39) పరుగులు చేసి రెండో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. 349 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఆదిలోనే కేఎల్ రాహుల్(16) వికెట్ ను కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆసీస్ తన రెండో ఇన్నింగ్స్ లో ఆరువికెట్ల నష్టానికి 251 పరుగులు చేసిన అనంతరం డిక్లేర్ చేసింది. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 475 పరుగులకు ఆలౌటైంది. ఇప్పటికే సిరీస్ కోల్పోయిన టీమిండియా ఈ మ్యాచ్ ను గెలవాలిని భావిస్తోంది. -
సిడ్నీ: లంచ్ సమయానికి భారత్ స్కోరు: 73/1
సిడ్నీ: ఆస్ట్రేలియా-టీమిండియా జట్ల మధ్య శనివారమిక్కడ ఆరంభమైన చివరి టెస్టులో ఐదవ రోజు రెండవ ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ లంచ్ విరామ సమయానికి 29.0 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 73 పరుగులు చేసింది. 349 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఐదవ రోజున 13.2 ఓవర్లలో 48 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. భారత్ ఓపెనర్ ఆటగాడు కేఎల్ రాహుల్ (40 బంతుల్లో 16 ; 3ఫోర్లు)తో లయోన్ బౌలింగ్‌లో వార్నర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. గెలుపే లక్ష్యంగా సాగుతున్న భారత్ జట్టు తొలి వికెట్ కోల్పోవడంతో క్రికెట్ అభిమానులను నిరాశపరిచింది. అయితే రాహుల్ భాగస్వామ్యంతో బరిలోకి దిగిన మురళీ విజయ్ (77 బంతుల్లో 35; 2 ఫోర్లు, 1 సిక్స్)తో నాటౌట్‌గా క్రీజులో ఉన్నాడు . రోహిత్ శర్మ (57 బంతుల్లో 19; 1 ఫోర్, 1 సిక్స్) పరుగులతో క్రీజులో ఉన్నాడు. కాగా, ఆసీస్ బౌలర్ లయోన్ తొలి వికెట్ పడగొట్టాడు. ఆసీస్ నిర్దేశించిన లక్ష్యాన్ని చేధించాలంటే భారత్ ఇంకా 276 పరుగులు చేయాల్సివుంది. అంతకముందు ఆసీస్ సెకండ్ ఇన్నింగ్స్ ను 251/6 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. నాలుగో టెస్ట్ సెకండ్ ఇన్నింగ్స్‌లో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ ఆరు వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యంతో కలుపుకొంటే భారత జట్టుకు 349 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 162 ఓవర్లలో 475 పరుగులకు ఆలౌటైంది. -
48 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన భారత్
సిడ్నీ: ఆస్ట్రేలియా-టీమిండియా జట్ల మధ్య శనివారమిక్కడ ఆరంభమైన చివరి టెస్టులో ఐదవ రోజు రెండవ ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ 13.2 ఓవర్లలో 48 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. భారత్ ఓపెనర్ ఆటగాడు కేఎల్ రాహుల్ (40 బంతుల్లో 16 ; 3ఫోర్లు)తో లయోన్ బౌలింగ్‌లో వార్నర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. రాహుల్ భాగస్వామ్యంతో బరిలోకి దిగిన మురళీ విజయ్ (46 బంతుల్లో 29; 2 ఫోర్లు, 1 సిక్స్)తో నాటౌట్‌గా క్రీజులో కొనసాగుతున్నాడు. రోహిత్ శర్మ (0) పరుగులతో క్రీజులో ఉన్నాడు. కాగా, ఆసీస్ బౌలర్ లయోన్ తొలి వికెట్ పడగొట్టాడు. ప్రస్తుతం భారత్ 16.6 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 48 పరుగులతో కొనసాగుతోంది. అంతకముందు ఆసీస్ సెకండ్ ఇన్నింగ్స్ ను 251/6 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. నాలుగో టెస్ట్ సెకండ్ ఇన్నింగ్స్‌లో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ ఆరు వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యంతో కలుపుకొంటే భారత జట్టుకు 349 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 162 ఓవర్లలో 475 పరుగులకు ఆలౌటైంది. -
ఐదవ రోజు ఆట ఆరంభించిన భారత్; విజయలక్ష్యం 349
సిడ్నీ: ఆస్ట్రేలియా-టీమిండియా జట్ల మధ్య శనివారమిక్కడ ఆరంభమైన చివరి టెస్టులో ఐదవ రోజు భారత్ జట్టు రెండవ ఇన్నింగ్స్ ఆరంభించింది. ఐదవ రోజు ఆటలో మురళీ విజయ్, కేఎల్ రాహుల్ ఓపెనర్లగా బరిలోకి దిగి శుభారంభాన్నిచ్చారు. ప్రస్తుతం మురళీ విజయ్ (4), కేఎల్ రాహుల్ (5) పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత్ 8.2 ఓవర్లలో 17 పరుగులతో కొనసాగుతోంది. అయితే ఆసీస్ సెకండ్ ఇన్నింగ్స్ ను 251/6 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఆఖరి సెషన్లో ఆసీస్ బ్యాట్స్‌మెన్ వీరవిహారం చేశారు. కెప్టెన్ స్మిత్ (70 బంతుల్లో 71; 8 ఫోర్లు, 1 సిక్స్), జో బర్న్స్ (39 బంతుల్లో 66; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపులు మెరిపించడంతో శుక్రవారం ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 40 ఓవర్లలో 6 వికెట్లకు 251 పరుగులు చేసింది. హాడిన్ (31 బ్యాటింగ్), హారిస్ (0 బ్యాటింగ్) పరుగులు చేశారు. ఆతిథ్య జట్టు ఆసీస్ 349 పరుగుల ఆధిక్యాన్ని చేజిక్కించుకుంది. మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యంతో కలుపుకొంటే భారత జట్టుకు 349 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 162 ఓవర్లలో 475 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఆసీస్‌కు 97 పరుగుల ఆధిక్యం దక్కింది. కోహ్లి (230 బంతుల్లో 147; 20 ఫోర్లు)కి తోడు అశ్విన్ (111 బంతుల్లో 50; 6 ఫోర్లు), భువనేశ్వర్ (75 బంతుల్లో 30; 5 ఫోర్లు) ఆకట్టుకున్నారు. స్టార్క్‌కు 3 వికెట్లు దక్కాయి. -
251/6 పరుగుల వద్ద ఆసీస్ సెకండ్ ఇన్నింగ్స్ డిక్లేర్
సిడ్నీ: ఆస్ట్రేలియా-టీమిండియా జట్ల మధ్య శనివారమిక్కడ ఆరంభమైన చివరి టెస్టులో ఐదవ రోజు ఆసీస్ సెకండ్ ఇన్నింగ్స్ ను 251/6 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. నాలుగో టెస్ట్ సెకండ్ ఇన్నింగ్స్‌లో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ ఆరు వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. ఆతిథ్య జట్టు ఆసీస్ 349 పరుగుల ఆధిక్యాన్ని చేజిక్కించుకుంది. అంతకుముందు ఆఖరి సెషన్లో భారత బౌలర్ల వైఫల్యాన్ని అందిపుచ్చుకున్న ఆసీస్ బ్యాట్స్‌మెన్ వీరవిహారం చేశారు. కెప్టెన్ స్మిత్ (70 బంతుల్లో 71; 8 ఫోర్లు, 1 సిక్స్), జో బర్న్స్ (39 బంతుల్లో 66; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపులు మెరిపించడంతో శుక్రవారం ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 40 ఓవర్లలో 6 వికెట్లకు 251 పరుగులు చేసింది. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 162 ఓవర్లలో 475 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఆసీస్‌కు 97 పరుగుల ఆధిక్యం దక్కింది. కోహ్లి (230 బంతుల్లో 147; 20 ఫోర్లు)కి తోడు అశ్విన్ (111 బంతుల్లో 50; 6 ఫోర్లు), భువనేశ్వర్ (75 బంతుల్లో 30; 5 ఫోర్లు) ఆకట్టుకున్నారు. స్టార్క్‌కు 3 వికెట్లు దక్కాయి. -
గట్టెక్కుతారా!
మూడు రోజుల పాటు బ్యాట్స్‌మెన్ పండగ చేసుకున్న సిడ్నీ పిచ్‌పై నాలుగో రోజు అనూహ్యంగా బంతి తిరిగింది. అయినా ఆస్ట్రేలియా వన్డే తరహాలో ఆడి మ్యాచ్‌ని ఫలితం దిశగా తీసుకెళ్లింది. ఇప్పటికే 348 పరుగుల ఆధిక్యంలో ఉన్న స్మిత్ సేన ఇదే స్కోరు వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసి భారత్‌కు సవాల్ విసిరే అవకాశం ఉంది. అడిలైడ్‌లో జరిగిన తొలి టెస్టులో భారత లక్ష్యం 364... డ్రా చేసుకుంటే గొప్ప అనుకున్న మ్యాచ్‌లో కోహ్లి సేన విజయం కోసం ప్రయత్నించి ఓడిపోయింది. ఆ పిచ్‌తో పోలిస్తే ప్రస్తుతం సిడ్నీ పిచ్ మీద బంతి మరింత తిరుగుతోంది. అడిలైడ్‌లో స్పిన్నర్ లయోన్ ఏడు వికెట్లతో భారత్ పతనాన్ని శాసించాడు. ఇప్పుడూ లయోన్‌పై నమ్మకంతో ఆసీస్ జట్టు భారత్‌ను ఊరిస్తోంది. దూకుడు మంత్రం పఠించే కోహ్లి విజయం కోసం ప్రయత్నిస్తాడా? లేదా ఏదోలా రోజు లాగించి డ్రా చేసుకుంటారా? లేక స్పిన్ వికెట్‌పై లయోన్‌కు మ్యాచ్ అప్పగిస్తారా? సిడ్నీ అంటేనే సంచలనాలకు మారుపేరు. 2007-08 సిరీస్‌లోనూ సిడ్నీలో హై డ్రామా జరిగింది. డ్రా అవుతున్న మ్యాచ్‌లో ఆఖరి ఓవర్లో క్లార్క్ మూడు వికెట్లు తీసి ఆసీస్‌ను గెలిపించాడు. ఈసారి ఏం జరగబోతోంది? సిడ్నీ: నాలుగో టెస్టు నాలుగో రోజులో ఒకే ఒక్క సెషన్ మ్యాచ్‌ను తలకిందులు చేసింది. దీంతో అప్పటి దాకా డ్రా దిశగా వెళ్లిన మ్యాచ్‌లో ఇప్పుడు ఫలితం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆఖరి సెషన్లో భారత బౌలర్ల వైఫల్యాన్ని అందిపుచ్చుకున్న ఆసీస్ బ్యాట్స్‌మెన్ వీరవిహారం చేశారు. వన్డే తరహా ఆటతీరుతో ఓవర్‌కు ఆరుకుపైగా రన్‌రేట్‌తో పరుగుల వర్షం కురిపించారు. కెప్టెన్ స్మిత్ (70 బంతుల్లో 71; 8 ఫోర్లు, 1 సిక్స్), జో బర్న్స్ (39 బంతుల్లో 66; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపులు మెరిపించడంతో శుక్రవారం ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 40 ఓవర్లలో 6 వికెట్లకు 251 పరుగులు చేసింది. హాడిన్ (31 బ్యాటింగ్), హారిస్ (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. రోజర్స్ (77 బంతుల్లో 56; 7 ఫోర్లు) రాణించాడు. అశ్విన్‌కు 4 వికెట్లు దక్కాయి. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 162 ఓవర్లలో 475 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఆసీస్‌కు 97 పరుగుల ఆధిక్యం దక్కింది. కోహ్లి (230 బంతుల్లో 147; 20 ఫోర్లు)కి తోడు అశ్విన్ (111 బంతుల్లో 50; 6 ఫోర్లు), భువనేశ్వర్ (75 బంతుల్లో 30; 5 ఫోర్లు) ఆకట్టుకున్నారు. స్టార్క్‌కు 3 వికెట్లు దక్కాయి. ఓవరాల్‌గా ఆసీస్ ప్రస్తుతం 348 పరుగుల ఆధిక్యంలో ఉంది. స్కోరు వివరాలు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 572/7 డిక్లేర్డ్ భారత్ తొలి ఇన్నింగ్స్: విజయ్ (సి) హాడిన్ (బి) స్టార్క్ 0; రాహుల్(సి) అండ్ (బి) స్టార్క్ 110; రోహిత్ (బి) లయోన్ 53; కోహ్లి (సి) రోజర్స్ (బి) హారిస్ 147; రహానే ఎల్బీడబ్ల్యూ (బి) వాట్సన్ 13; రైనా (సి) హాడిన్ (బి) వాట్సన్0; సాహా (సి) స్మిత్ (బి) హాజెల్‌వుడ్ 35; అశ్విన్ (సి) హాడిన్ (బి) స్టార్క్ 50; భువనేశ్వర్ (సి) వాట్సన్ (బి) లయోన్ 30; షమీ నాటౌట్ 16; ఉమేశ్ (సి) హాడిన్ (బి) హారిస్ 4; ఎక్స్‌ట్రాలు: 17; మొత్తం: (162 ఓవర్లలో ఆలౌట్) 475. వికెట్ల పతనం: 1-0; 2-97; 3-238; 4-292; 5-292; 6-352; 7-383; 8-448; 9-456; 10-475 బౌలింగ్: స్టార్క్ 32-7-106-3; హారిస్ 31-7-96-2; హాజెల్‌వుడ్ 29-8-64-1; లయోన్ 46-11-123-2; వాట్సన్ 20-4-58-2; స్మిత్ 4-0-17-0. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: రోజర్స్ (సి) రైనా (బి) భువనేశ్వర్ 56; వార్నర్ (సి) విజయ్ (బి) అశ్విన్ 4; వాట్సన్ (బి) అశ్విన్ 16; స్మిత్ ఎల్బీడబ్ల్యూ (బి) షమీ 71; మార్ష్ (సి) విజయ్ (బి) అశ్విన్ 1; బర్న్స్ (సి) ఉమేశ్ (బి) అశ్విన్ 66; హాడిన్ బ్యాటింగ్ 31; హారిస్ బ్యాటింగ్ 0; ఎక్స్‌ట్రాలు: 6; మొత్తం: (40 ఓవర్లలో 6 వికెట్లకు) 251. వికెట్ల పతనం: 1-6; 2-46; 3-126; 4-139; 5-165; 6-251; బౌలింగ్: భువనేశ్వర్ 8-0-46-1; అశ్విన్ 19-2-105-4; షమీ 6-0-33-1; ఉమేశ్ 3-0-45-0; రైనా 4-0-18-0. సెషన్-1 నిలబడ్డ అశ్విన్ 342/5 ఓవర్‌నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆట కొనసాగించిన కోహ్లి, సాహా (35) ఎక్కువసేపు క్రీజులో నిలబడలేకపోయారు. వ్యక్తిగత స్కోరుకు మరో ఏడు పరుగులు జోడించి కెప్టెన్ అవుటయ్యాడు. అప్పటికీ భారత్ ఫాలోఆన్ మార్క్‌కు మరో 21 పరుగులు చేయాల్సి ఉంది. విరాట్, సాహా ఆరో వికెట్‌కు 60 పరుగులు జోడించారు. తర్వాత వచ్చిన అశ్విన్ ఏమాత్రం తడబడకుండా ఆడాడు. వీలైనంత ఎక్కువసేపు బ్యా టింగ్ చేసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఎక్కువగా సింగిల్స్ తీయడంతో స్కోరు బోర్డు నెమ్మదిగా కదిలింది. సాహా షార్ట్ పిచ్‌లను ఎదుర్కోవడంలో బాగా ఇబ్బందులుపడ్డాడు. చివరకు ఇన్నింగ్స్ 131వ ఓవర్లో హాజెల్‌వుడ్ వేసిన షార్ట్ బంతిని టచ్ చేసి స్లిప్‌లో స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఈ దశలో వచ్చిన భువనేశ్వర్.. అశ్విన్‌కు మంచి సహకారం అందించడంతో మరో వికెట్ పడకుండా లంచ్‌కు వెళ్లారు. ఓవర్లు: 29; పరుగులు: 65; వికెట్లు: 2 సెషన్-2 ఆకట్టుకున్న భువీ లంచ్ తర్వాత అశ్విన్, భువనేశ్వర్ క్రమంగా జోరు పెంచారు. ఆసీస్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ వేగంగా పరుగులు చేశారు. ఈ క్రమంలో ఆశించిన స్థాయిలో ఆధిక్యం తగ్గుముఖం పట్టినా ఊహించని రీతిలో భువీ అవుటయ్యాడు. వేగంగా దూసుకొచ్చిన లయోన్ బంతి భువనేశ్వర్ బ్యాట్‌ను తాకి స్లిప్‌లో వాట్సన్ చేతిలోకి వెళ్లింది. బంతి నేలకు తాకలేదని రీప్లేలో స్పష్టం కావడంతో థర్డ్ అంపైర్ అవుట్‌గా ప్రకటించారు. అశ్విన్, భువీ మధ్య ఎనిమిదో వికెట్‌కు 65 పరుగుల భాగస్వామ్యం నెలకొంది. షమీ (16 నాటౌట్)తో జత కలిసిన అశ్విన్ మరో ఐదు ఓవర్ల తర్వాత అవుట్‌కాగా, ఆ కొద్దిసేపటికే ఉమేశ్ (4) వెనుదిరిగాడు. ఓవరాల్‌గా భారత్ 27 పరుగుల తేడాతో చివరి మూడు వికెట్లు చేజార్చుకుంది. తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్‌ను రెండో ఓవర్లోనే వార్నర్ (4)ను అశ్విన్ అవుట్ చేశాడు. అయితే రోజర్స్, వాట్సన్ (16) నిలకడగా ఆడి టీకి వెళ్లారు. ఓవర్లు: 18; పరుగులు: 68; వికెట్లు: 3 (భారత్) ఓవర్లు: 6; పరుగులు: 38; వికెట్లు: 1 (ఆసీస్) సెషన్-3 స్మిత్, బర్న్స్ జోరు టీ తర్వాత భారత బౌలర్లు ఘోరంగా విఫలమయ్యారు. లైన్ అండ్ లెంగ్త్ తప్పడంతో భారీగా పరుగులు సమర్పించుకున్నారు. రనౌట్ నుంచి బయటపడిన వాట్సన్‌ను విరామం తర్వాత రెండో ఓవర్లోనే అశ్విన్ పెవిలియన్‌కు పంపాడు. ఈ దశలో వచ్చిన స్మిత్ ఊహించని రీతిలో వేగంగా బ్యాటింగ్ చేశాడు. ఈ క్రమంలో 44 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేశాడు. 50 పరుగులు పూర్తి చేసుకున్న తర్వాత వేగంగా ఆడే క్రమంలో రోజర్స్ రైనాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ ఇద్దరు మూడో వికెట్‌కు 15.4 ఓవర్లలోనే 80 పరుగులు జోడించారు. తర్వాత స్వల్ప వ్యవధిలో షాన్ మార్ష్ (1), స్మిత్‌లు అవుటయ్యారు. అప్పటికే ఆసీస్ ఆధిక్యం 250 పరుగులు దాటింది. హాడిన్‌తో కలిసిన బర్న్స్ ఒక్కసారిగా భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు. టి20 తరహాలో బ్యాటింగ్ చేస్తూ 39 బంతుల్లో 66 పరుగులు చేశాడు. ఈ ఇద్దరు 8.4 ఓవర్లలో 86 పరుగులు సమకూర్చడంతో ఆసీస్ ఆధిక్యం 300లకు చేరింది. చివరి ఓవర్ నాలుగో బంతికి బర్న్స్ అవుటైనా అప్పటికే నష్టం జరిగిపోయింది. ఓవర్లు: 34; పరుగులు: 213; వికెట్లు: 5 చివరి సెషన్లో మేం భారీగా పరుగులు సమర్పించుకున్నాం. బ్యాట్స్‌మెన్ కూడా కొన్ని మంచి షాట్లు ఆడారు. కొత్త బంతితో మా ఆరంభం అసలు బాగాలేదు. లేకపోతే మ్యాచ్ మరోలా ఉండేది. శనివారం మేం కూడా అడిలైడ్‌లో ఆడినట్లుగా ఆడాలి. నేను బ్యాటింగ్‌కు వెళ్లినప్పుడు వీలైనన్ని ఎక్కువ ఓవర్లు ఆడాలని భావించా. పిచ్ నుంచి పెద్ద సహకారం లేకపోవడంతో పరుగులు చేయడానికి కష్టపడాల్సి వచ్చింది. జట్టు కోసం నేను కొన్ని అవకాశాలను సృష్టించాలనుకున్నా. అలా చేయడంతో నాలుగు వికెట్లు తీయగలిగా. మ్యాచ్‌ను ముందుకు తీసుకెళ్లాలనే దృక్పథంతో ఆసీస్ ఆటగాళ్లు కూడా బాగా బ్యాటింగ్ చేశారు. ఓవర్‌నైట్ స్కోరుతో డిక్లేర్ చేస్తే మేం కూడా ఫలితం కోసం ఆడతాం. -అశ్విన్ (భారత స్పిన్నర్) ఐదో రోజు ఆటలో స్పిన్నర్లు కీలకం. వికెట్ బాగా టర్న్ అవుతోంది. బ్యాటింగ్ చేయడం చాలా కష్టంగా ఉంది. కేవలం 10 అవకాశాల కోసం మేం ఎదురుచూస్తున్నాం. స్పిన్‌తోనే పది వికెట్లు తీయాలని భావిస్తున్నాం. భిన్నమైన బౌన్స్, రివర్స్ స్వింగ్ కోసం ప్రయత్నిస్తాం. డిక్లరేషన్‌పై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. నిర్ణయాలలో నా పాత్ర ఉండదు. ఇది కెప్టెన్‌కు సంబంధించిన అంశం. జట్టును మంచి స్థితిలో నిలిపినందుకు ఆనందంగా ఉంది. మ్యాచ్ గెలవడానికి మాకు చాలా అవకాశాలున్నాయి. స్మిత్ కూడా అద్భుతంగా ఆడాడు. అతన్ని చూసి చాలా నేర్చుకోవాలి. -బర్న్స్ (ఆసీస్ బ్యాట్స్‌మన్) టెస్టు సిరీస్‌లో ఎనిమిదిసార్లు 400 పైచిలుకు స్కోర్లు నమోదు కావడం ఇదే తొలిసారి. భారత్ తరఫున టెస్టుల్లో 100 వికెట్లు, వెయ్యి పరుగులు పూర్తి చేసిన 9వ ఆల్‌రౌండర్ అశ్విన్. ప్రపంచ క్రికెట్లో వేగంగా 100 వికెట్లు, వెయ్యి పరుగులు(24 మ్యాచ్‌ల్లో) పూర్తి చేసిన మూడో ఆటగాడు అశ్విన్. ఇంగ్లండ్ ఆటగాడు బోథమ్ (21 మ్యాచ్‌లు) పేరిట ఈ రికార్డు ఉంది. 23 ఏళ్లలో ఆసీస్ గడ్డపై ఒకే ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు తీసిన రెండో భారత స్పిన్నర్ అశ్విన్. ఈ సిరీస్‌లో ఉమేశ్ 4.66 రన్‌రేట్‌ను నమోదు చేశాడు. ఇప్పటి వరకు ఆసీస్‌లో ఆడిన భారత బౌలర్లలో ఇదే చెత్త ప్రదర్శన. ఓవరాల్‌గా మూడోది. ఎడ్వర్డ్స్, బ్రెట్ లీ ముందున్నారు. 250 క్యాచ్‌లు పూర్తి చేసుకున్న ఆసీస్ నాలుగో వికెట్ కీపర్‌గా హాడిన్ రికార్డులకెక్కాడు. టెస్టు క్రికెట్లో ఏడోవాడు. -
భారత్-ఆస్ట్రేలియా చివరి టెస్టులో నాల్గో రోజు
-
352 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయిన భారత్
సిడ్నీ: బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో ఇక్కడ జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ లో నాలుగో రోజు భారత్ 352 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. భారత్ కెప్టెన్ వీరాట్ క్లోహీ 119.3 ఓవర్లో ఆరో వికెట్ రూపంలో పెవిలియన్ చేరాడు. 230 బంతుల్లో 20 ఫోర్లు బాదిన కోహ్లీ 147 పరుగులు చేసి హారీస్ బౌలింగ్‌లో రోజర్స్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. భారత్ 122.6 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 359 పరుగులతో కొనసాగుతోంది. ప్రస్తుతం సాహా(17), అశ్వీన్ (4) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. అయితే మూడో రోజు ఆటముగిసే సమయానికి టీమిండియా ఐదు వికెట్ల నష్టానికి 342 పరుగులు చేసింది. టీమిండియా ఆటగాడు విరాట్ కోహ్లీ పరుగుల వర్షం కురిపించాడు. మూడో రోజు ఆటలో భాగంగా 162 బంతులను ఎదుర్కొన్న కోహ్లీ 17 ఫోర్ల సాయంతో సెంచరీ నమోదు చేశాడు. దీంతో నాలుగు టెస్టుల్లో నాలుగు సెంచరీలు చేసిన ఆటగాడిగా కోహ్లీ అరుదైన ఘనతను సాధించాడు. అంతకుముందు అడిలైడ్ లో రెండు సెంచరీలు, మెల్ బోర్న్ లో ఒక సెంచరీతో విరాట్ ఆకట్టుకున్నాడు. ఓవరాల్ గా విరాట్ కు టెస్టు మ్యాచ్ ల్లో 10 వ సెంచరీ. ఆసీస్ బౌలర్లలో లయోన్, హరీస్ తలో వికెట్ తీసుకోగా, స్టార్క్, వాట్సన్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. -
భారత్-ఆస్ట్రేలియా చివరి టెస్టులో మూడో రోజు
-
ఆట ముగిసే సమయానికి టీమిండియా స్కోరు 342/5
సిడ్నీ : ఆస్ట్రేలియాతో ఇక్కడ జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ లో మూడో రోజు ఆటముగిసే సమయానికి టీమిండియా ఐదు వికెట్ల నష్టానికి 342 పరుగులు చేసింది. ఈ రోజు ఆటలో టీమిండియా ఆటగాడు విరాట్ కోహ్లీ మరోసారి మెరిశాడు. మూడో రోజు ఆటలో భాగంగా 162 బంతులను ఎదుర్కొన్న కోహ్లీ 17 ఫోర్ల సాయంతో సెంచరీ నమోదు చేశాడు. దీంతో నాలుగు టెస్టుల్లో నాలుగు సెంచరీలు చేసిన ఆటగాడిగా కోహ్లీ అరుదైన ఘనతను సాధించాడు. అంతకుముందు అడిలైడ్ లో రెండు సెంచరీలు, మెల్ బోర్న్ లో ఒక సెంచరీతో విరాట్ ఆకట్టుకున్నాడు. ఓవరాల్ గా విరాట్ కు టెస్టు మ్యాచ్ ల్లో 10 వ సెంచరీ. ప్రస్తుతం విరాట్ (140) సాహా(14) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. ఈ రోజు ఉదయం వికెట్ నష్టానికి 71 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో బ్యాటింగ్ ఆరంభించిన టీమిండియాలో ఓపెనర్ కేఎల్ రాహుల్ (110) పరుగులతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. టెస్టుల్లో తొలి సెంచరీ నమోదు చేసిన రాహుల్ తన ఆడిన రెండో టెస్టులోనే సెంచరీ మార్కును చేరాడు. అంతకుముందు టీమిండియా రోహిత్ శర్మను వికెట్ ను చేజార్చుకుంది. రోహిత్ (53) పరుగులు చేసి పెవిలియన్ కు చేరాడు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్ , వాట్సన్ లకు తలో రెండు వికెట్లు లభించగా, లయన్ కు ఒక వికెట్ దక్కింది. -
సిడ్నీ టెస్టులోనూ మెరిసిన 'విరాట్'
-
సిడ్నీ టెస్ట్: సురేష్ రైనా డకౌట్
సిడ్నీ: ఆస్ట్రేలియాతో ఇక్కడ జరుగుతున్న చివరి టెస్టు మ్యాచ్ లో టీమిండియా ఆటగాడు సురేష్ రైనా డకౌట్ రూపంలో వెనుదిరిగాడు.తన ఆడిన తొలి బంతికే క్యాచ్ ఇచ్చిన రైనా పెవిలియన్ కు చేరాడు. 292 పరుగుల వద్ద టీమిండియా రైనా ఐదో వికెట్ రూపంలో నిష్ర్కమించాడు. వరుసగా రెండు వికెట్లను కోల్పోయిన టీమిండియా ఒక్కసారిగా కష్టాలను కొనితెచ్చుకుంది. అంతకుముందు అజ్యింకా రహానే (13) పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్ కు చేరిన సంగతి తెలిసిందే. -
నాల్గో వికెట్ కోల్పోయిన టీమిండియా(292/4)
సిడ్నీ: ఆస్ట్రేలియాతో ఇక్కడ జరుగుతున్న చివరి టెస్టు మ్యాచ్ లో టీమిండియా 292 పరుగుల వద్ద నాల్గో వికెట్ ను కోల్పోయింది. మిడిల్ ఆర్డర్ ఆటగాడు అజ్యింకా రహానే(13) పరుగుల వద్ద నాల్గో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. అంతకుముందు విరాట్ కోహ్లీ సెంచరీ నమోదు చేశాడు. మూడో రోజు ఆటలో భాగంగా 162 బంతులను ఎదుర్కొన్న కోహ్లీ 15 ఫోర్ల సాయంతో శతకం పూర్తి చేశాడు. దీంతో నాలుగు టెస్టుల్లో నాలుగు సెంచరీలు చేసిన ఆటగాడిగా కోహ్లీ మరో ఘనతను సాధించాడు.అంతకుముందు అడిలైడ్ లో రెండు సెంచరీలు, మెల్ బోర్న్ లో ఒక సెంచరీతో విరాట్ ఆకట్టుకున్నాడు. ఓవరాల్ గా విరాట్ కు టెస్టు మ్యాచ్ ల్లో 10 వ సెంచరీ. -
సిడ్నీ టెస్టులోనూ మెరిసిన 'విరాట్'
సిడ్నీ : ఆస్ట్రేలియాతో ఇక్కడ గురువారం జరుగుతున్న చివరి, నాల్గో టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా ఆటగాడు విరాట్ కోహ్లీ మరోసారి మెరిశాడు. మూడో రోజు ఆటలో భాగంగా 162 బంతులను ఎదుర్కొన్న కోహ్లీ 17 ఫోర్ల సాయంతో సెంచరీ నమోదు చేశాడు. దీంతో నాలుగు టెస్టుల్లో నాలుగు సెంచరీలు చేసిన ఆటగాడిగా కోహ్లీ అరుదైన ఘనతను సాధించాడు. అంతకుముందు అడిలైడ్ లో రెండు సెంచరీలు, మెల్ బోర్న్ లో ఒక సెంచరీతో విరాట్ ఆకట్టుకున్నాడు. ఓవరాల్ గా విరాట్ కు టెస్టు మ్యాచ్ ల్లో 10 వ సెంచరీ. ఈ రోజు ఉదయం వికెట్ నష్టానికి 71 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో బ్యాటింగ్ ఆరంభించిన టీమిండియాలో ఓపెనర్ కేఎల్ రాహుల్ (110) పరుగులతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. టెస్టుల్లో తొలి సెంచరీ నమోదు చేసిన రాహుల్ తన ఆడిన రెండో టెస్టులోనే సెంచరీ మార్కును చేరాడు. అంతకుముందు టీమిండియా రోహిత్ శర్మను వికెట్ ను చేజార్చుకుంది. రోహిత్ (53) పరుగులు చేసి పెవిలియన్ కు చేరాడు. -
టెస్టుల్లో రాహుల్ తొలి సెంచరీ
-
మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా(238/3)
సిడ్నీ:ఆస్ట్రేలియాతో ఇక్కడ జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా 238 పరుగుల వద్ద మూడో వికెట్ ను కోల్పోయింది. కేఎల్ రాహుల్ (110) పరుగులు చేసి మూడో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ(79) పరుగులతో బ్యాటింగ్ కొనసాగిస్తున్నాడు. అతనికి జతగా అజ్యింకా రహానే క్రీజ్ లోకి వచ్చాడు. టీమిండియా ఓపెనర్ కెఎల్ రాహుల్ టెస్టుల్లో తొలి సెంచరీ చేయడంతో రెండో టెస్టులోనే సెంచరీ చేసిన ఆటగాడిగా అరుదైన గుర్తింపు పొందాడు. 262 బంతులను ఎదుర్కొన్నఈ కర్ణాటక ఓపెనర్ 13 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో శతకం మైలురాయిన అధిగమించాడు. -
టీ విరామ సమయానికి టీమిండియా స్కోరు 234/2
సిడ్నీ: ఆస్ట్రేలియాతో ఇక్కడ జరుగుతున్న చివరి, నాల్గో టెస్ట్ మ్యాచ్ మూడో రోజు ఆటలో టీ విరామ సమయానికి టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 234 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ప్రస్తుతం కేఎల్ రాహుల్(106;256 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్స్), విరాట్ కోహ్లీ(67;121 బంతుల్లో 5ఫోర్లు,2 సిక్సర్లు) లు నాటౌట్ గా క్రీజ్ లో ఉన్నారు. టీమిండియా ఓపెనర్ కెఎల్ రాహుల్ టెస్టుల్లో తొలి సెంచరీ(102) నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇక్కడ ఆస్ట్రేలియాతో జరగుతున్న చివరి టెస్టులో రాహుల్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. 253 బంతులను ఎదుర్కొన్నఈ కర్ణాటక ఓపెనర్ 11ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో శతకం పూర్తి చేశాడు. తను ఆడిన రెండో టెస్టులోనే సెంచరీ చేసిన క్రికెటర్ గా రాహుల్ రికార్డు నెలకొల్పాడు. -
టెస్టుల్లో కెఎల్ రాహుల్ తొలి సెంచరీ
సిడ్నీ: టీమిండియా ఓపెనర్ కెఎల్ రాహుల్ టెస్టుల్లో తొలి సెంచరీ(102) నమోదు చేశాడు. ఇక్కడ ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి టెస్టులో రాహుల్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. 253 బంతులను ఎదుర్కొన్నఈ కర్ణాటక ఓపెనర్ 11ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో శతకం పూర్తి చేసి నాటౌట్ గా క్రీజ్ లో ఉన్నాడు. తను ఆడిన రెండో టెస్టులోనే సెంచరీ చేసిన క్రికెటర్ గా రాహుల్ రికార్డు నెలకొల్పాడు. రాహుల్ కు జతగా విరాట్ కోహ్లీ(67) పరుగులతో క్రీజ్ లో ఉన్నాడు. ప్రస్తుతం టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 230 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. అంతకుముందు రోహిత్ శర్మ(53) పరుగుల వద్ద పెవిలియన్ కు చేరిన సంగతి తెలిసిందే. వికెట్ నష్టానికి 71 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో మూడు రోజు ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియా ఆచితూచి బ్యాటింగ్ కొనసాగిస్తోంది. -
సిడ్నీ టెస్ట్ : విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ
సిడ్నీ:ఆస్ట్రేలియాతో ఇక్కడ జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరోసారి హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. మూడో రోజు ఆటలో భాగంగా తొలి ఇన్నింగ్స్ ను ఆరంభించిన టీమిండియా రోహిత్ శర్మ (53)ను కోల్పోయింది. అనంతరం ఓపెనర్ కేఎల్ రాహుల్ కు జతకలిసిన కోహ్లీ బాధ్యతాయుతంగా ఆడి స్కోరు బోర్డును చక్కదిద్దాడు.108 బంతులను ఎదుర్కొన్న కోహ్లీ 9 ఫోర్ల సాయంతో హాఫ్ సెంచరీ చేశాడు. ప్రస్తుతం రెండు వికెట్లు కోల్పోయిన టీమిండియా 201 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌ను 7 వికెట్ల నష్టానికి 572 పరుగుల వద్ద డిక్లేర్ చేయగా, భారత్ రెండో రోజున తొలి ఇన్నింగ్స్ 25 ఓవర్లలో వికెట్ నష్టానికి 71 పరుగులు చేసిన తెలిసిందే. -
లంచ్ సమయానికి భారత్ స్కోరు: 122/2
సిడ్నీ: బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా సిడ్నీ మైదానంలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో రోజు ఆరంభమైన చివరి టెస్ట్ మ్యాచ్ లో లంచ్ విరామ సమయానికి భారత్ 55 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది. ప్రస్తుతం లోకేష్ రాహుల్ (164 బంతుల్లో 50 బ్యాటింగ్; 5 ఫోర్లు), భారత్ కెప్టెన్ వీరాట్ కోహ్లీ (33 బంతుల్లో 16 బ్యాటింగ్; 3 ఫోర్లు)తో క్రీజ్‌లో ఉన్నారు. భారత్ ఆటగాడు కేఎల్ రాహుల్ 118 పరుగుల వద్ద హాఫ్ సెంచరీ చేయగా, రోహిత్ శర్మ 96 పరుగుల వద్ద హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. మురళీ విజయ్ (0), రోహిత్ శర్మ(53) పరుగులు చేసి పెవిలియన్ చేరారు. ఆ తరువాత బరిలోకి దిగిన భారత్ ఆటగాడు రాహుల్, కెప్టెన్ వీరాట్ కోహ్లీ భాగస్వామ్యంతో నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్, లయోన్ తలో వికెట్ తీసుకోన్నారు. కాగా, భారత్ ప్రస్తుతం మరో 450 పరుగులు వెనుకబడి ఉంది. రెండోరోజు ఓపెనర్ ఆటగాడు మురళీ విజయ్ పరుగులేమి చేయకుండానే చేతులేత్తేశాడు. అదే రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 25 ఓవర్లలో వికెట్ నష్టానికి 71 పరుగులు చేసింది. కాగా, ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌ను 7 వికెట్ల నష్టానికి 572 పరుగుల వద్ద డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే. -
118 పరుగుల వద్ద రాహుల్ హాఫ్ సెంచరీ
సిడ్నీ: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ చివరి టెస్టులో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఆరంభమైన మూడో రోజు మ్యాచ్‌లో భారత్ ఆటగాడు కేఎల్ రాహుల్ 118 పరుగుల వద్ద హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ప్రస్తుతం భారత్ మూడో రోజు ఆటలో 54.2 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 121 పరుగులతో కొనసాగుతోంది. భారత్ ఆటగాడు రాహుల్, కెప్టెన్ వీరాట్ కోహ్లీ భాగస్వామ్యంతో నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. ప్రస్తుతం లోకేష్ రాహుల్ (164 బంతుల్లో 50 బ్యాటింగ్; 5 ఫోర్లు), భారత్ కెప్టెన్ వీరాట్ కోహ్లీ (26 బంతుల్లో 13 బ్యాటింగ్; 3 ఫోర్లు)తో క్రీజ్‌లో ఉన్నారు. భారత్ ప్రస్తుతం మరో 454 పరుగులు వెనుకబడి ఉంది. రెండోరోజు ఓపెనర్ ఆటగాడు మురళీ విజయ్ పరుగులేమి చేయకుండానే చేతులేత్తేశాడు. అదే రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 25 ఓవర్లలో వికెట్ నష్టానికి 71 పరుగులు చేసింది. కాగా, ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌ను 7 వికెట్ల నష్టానికి 572 పరుగుల వద్ద డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే. -
సిడ్నీ టెస్టు: రెండో వికెట్ కోల్పోయిన భారత్
సిడ్నీ: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ చివరి టెస్టులో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఆరంభమైన మూడో రోజు మ్యాచ్‌లో 97 పరుగుల వద్ద భారత్ రెండో వికెట్ కోల్పోయింది. భారత్ ఓపెనర్ ఆటగాడు రోహిత్ శర్మ 43.4 ఓవర్లలో రెండో వికెట్ రూపంలో పెవిలియన్ చేరాడు. 96 పరుగుల వద్ద హాఫ్ సెంచరీ నమోదు చేసిన రోహిత్ శర్మ (133 బంతుల్లో 53 బ్యాటింగ్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు)తో లయోన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. భారత్ మూడో రోజు ఆటలో 47.1 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 108 పరుగులతో కొనసాగుతోంది. రోహిత్ తరువాత బరిలోకి దిగిన భారత్ కెప్టెన్ వీరాట్ కోహ్లీ జట్టు పగ్గాలు అందుకున్నాడు. కోహ్లీ (12 బంతుల్లో 8 బ్యాటింగ్; 2 ఫోర్లు), రాహుల్ (142 బంతుల్లో 45 బ్యాటింగ్; 4 ఫోర్లు) పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. రెండోరోజు ఓపెనర్ ఆటగాడు మురళీ విజయ్ పరుగులేమి చేయకుండానే చేతులేత్తేశాడు. అనంతరం రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 25 ఓవర్లలో వికెట్ నష్టానికి 71 పరుగులు చేసింది. కాగా, ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌ను 7 వికెట్ల నష్టానికి 572 పరుగుల వద్ద డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే. -
96 పరుగుల వద్ద రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ
సిడ్నీ: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ చివరి టెస్టులో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఆరంభమైన మూడో రోజు మ్యాచ్‌లో భారత్ ఓపెనర్ ఆటగాడు రోహిత్ శర్మ 96 పరుగుల వద్ద హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ప్రస్తుతం భారత్ మూడో రోజు ఆటలో 43.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 97 పరుగులతో కొనసాగుతోంది. భారత్ ఆటగాడు రోహిత్, రాహుల్ భాగస్వామ్యంతో నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. రోహిత్ శర్మ (132 బంతుల్లో 53 బ్యాటింగ్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), లోకేష్ రాహుల్ (128 బంతుల్లో 42 బ్యాటింగ్; 4 ఫోర్లు) క్రీజ్‌లో ఉన్నారు. రెండోరోజు ఓపెనర్ ఆటగాడు మురళీ విజయ్ పరుగులేమి చేయకుండానే చేతులేత్తేశాడు. అనంతరం రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 25 ఓవర్లలో వికెట్ నష్టానికి 71 పరుగులు చేసింది. కాగా, ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌ను 7 వికెట్ల నష్టానికి 572 పరుగుల వద్ద డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే. -
మూడో రోజు ఆట ఆరంభించిన భారత్
సిడ్నీ: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ చివరి టెస్టులో భాగంగా సిడ్నీ మైదానంలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో రోజు మ్యాచ్ ఆరంభమైంది. రెండో రోజు ఆటలో ‘భారీ’ సవాల్ విసిరిన ఆస్ట్రేలియా జోరుకు జవాబు ఇచ్చే దిశగా భారత్ మూడో రోజు మ్యాచ్ కొనసాగుతోంది. ప్రస్తుతం భారత్ 26.4 ఓవర్లలో వికెట్ నష్టానికి 75 పరుగులతో కొనసాగుతోంది. అయితే రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 25 ఓవర్లలో వికెట్ నష్టానికి 71 పరుగులు చేసింది. విజయ్ (0) తొలి ఓవర్లోనే వెనుదిరగ్గా రోహిత్ శర్మ (82 బంతుల్లో 40 బ్యాటింగ్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), కేఎల్ రాహుల్ (75 బంతుల్లో 35 బ్యాటింగ్; 3 ఫోర్లు) క్రీజ్‌లో ఉన్నారు. భారత్ ప్రస్తుతం మరో 497 పరుగులు వెనుకబడి ఉంది. మూడో రోజు బ్యాట్స్‌మెన్ నిలకడగా ఆడి భారీ స్కోరు చేస్తేనే ఈ టెస్టులో మనకు అవకాశాలు మిగిలి ఉంటాయి. అంతకుముందు ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌ను 7 వికెట్ల నష్టానికి 572 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. స్టీవెన్ స్మిత్ (208 బంతుల్లో 117; 15 ఫోర్లు) ఈ సిరీస్‌లో వరుసగా నాలుగు టెస్టుల్లో నాలుగో సెంచరీ పూర్తి చేసుకోవడం విశేషం. -
తడబడతారా..! నిలబడతారా..!
రెండు సెంచరీలు...నాలుగు అర్ధ సెంచరీలు...తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ ప్రదర్శన ఇది. బ్యాటింగ్‌కు పూర్తిగా అనుకూలిస్తున్న పిచ్‌పై వరుసగా ఒక్కో కొత్త రికార్డు నెలకొల్పుతూ ఆసీస్ బ్యాట్స్‌మెన్ పరుగుల పండగ చేసుకున్నారు. పరుగులు ఇవ్వడంలో మన బౌలర్లు కూడా నలుగురు సెంచరీలు పూర్తి చేసుకున్నారు. జీవం లేని పిచ్‌పై ఏమీ చేయలేక, బౌలింగ్‌లో కొత్తదనం, వ్యూహాల్లో వైవిధ్యం లేక అలా బంతులు విసిరి విసిరి అలసిపోయారు. పేస్ బౌలింగ్‌లో ‘పేస్’ తగ్గి సాధారణ బౌలర్లుగా మిగిలిపోయారు. కొండంత స్కోరు కళ్ల ముందు ఉండగా, విజయ్ డకౌట్‌తో భారత్‌కు తొలి దెబ్బ. అయితే రోహిత్, రాహుల్ తడబడకుండా నిలబడ్డారు. రెండు రోజుల ఆట తర్వాత కూడా ఎలాంటి జీవం లేని పిచ్ ఇంకా బ్యాటింగ్‌కు బాగా అనుకూలిస్తోంది. ఇప్పుడు ఇదే ఆరంభాన్ని భారత్ తమకు అనుకూలంగా మార్చుకోవాలి. ఇక మూడో రోజు మన బ్యాట్స్‌మెన్ సత్తా చూపాలి. రోజంతా నిలబడి ఆసీస్ స్కోరుకు చేరువైతేనే మ్యాచ్‌లో నిలబడతాం. ఏమాత్రం తడబడినా ఇక మ్యాచ్ మీద ఆశలు వదులుకోవాల్సిన ప్రమాదం ఏర్పడుతుంది. సిడ్నీ: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ చివరి టెస్టులో భారత్ ముందు ‘భారీ’ సవాల్ నిలిచింది. ఆస్ట్రేలియా జోరుకు జవాబిస్తూ మ్యాచ్ రెండో రోజు బుధవారం ఆట ముగిసే సమయానికి భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 25 ఓవర్లలో వికెట్ నష్టానికి 71 పరుగులు చేసింది. విజయ్ (0) తొలి ఓవర్లోనే వెనుదిరగ్గా రోహిత్ శర్మ (76 బంతుల్లో 40 బ్యాటింగ్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), కేఎల్ రాహుల్ (71 బంతుల్లో 31 బ్యాటింగ్; 2 ఫోర్లు) క్రీజ్‌లో ఉన్నారు. భారత్ ప్రస్తుతం మరో 501 పరుగులు వెనుకబడి ఉంది. మూడో రోజు బ్యాట్స్‌మెన్ నిలకడగా ఆడి భారీ స్కోరు చేస్తేనే ఈ టెస్టులో మనకు అవకాశాలు మిగిలి ఉంటాయి. కాస్త తడబడినా ఆసీస్‌కు చేజేతులా అవకాశం ఇచ్చినట్లే. అంతకుముందు ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌ను 7 వికెట్ల నష్టానికి 572 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. స్టీవెన్ స్మిత్ (208 బంతుల్లో 117; 15 ఫోర్లు) ఈ సిరీస్‌లో వరుసగా నాలుగు టెస్టుల్లో నాలుగో సెంచరీ పూర్తి చేసుకోవడం విశేషం. షాన్ మార్ష్ (116 బంతుల్లో 73; 9 ఫోర్లు, 1 సిక్స్), జో బర్న్స్ (114 బంతుల్లో 58; 10 ఫోర్లు) కూడా రాణించారు. భారత బౌలర్లలో షమీ (5/112) కెరీర్లో రెండో సారి ఐదు వికెట్లు పడగొట్టాడు. స్కోరు వివరాలు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: రోజర్స్ (బి) షమీ 95; వార్నర్ (సి) విజయ్ (బి) అశ్విన్ 101; వాట్సన్ (సి) అశ్విన్ (బి) షమీ 81; స్మిత్ (సి) సాహా (బి) ఉమేశ్ 117; మార్ష్ (సి) సాహా (బి) షమీ 73; బర్న్స్ (సి) రాహుల్ (బి) షమీ 58; హాడిన్ (నాటౌట్) 9; హారిస్ (సి) అశ్విన్ (బి) షమీ 25; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (152.3 ఓవర్లలో 7 వికెట్లకు) 572 డిక్లేర్డ్. వికెట్ల పతనం: 1-200; 2-204; 3-400; 4-415; 5-529; 6-546; 7-572. బౌలింగ్: భువనేశ్వర్ 34-5-122-0; ఉమేశ్ 27-5-137-1; షమీ 28.3-3-112-5; అశ్విన్ 47-8-142-1; రైనా 16-3-53-0. భారత్ తొలి ఇన్నింగ్స్: విజయ్ (సి) హాడిన్ (బి) స్టార్క్ 0; రాహుల్ (బ్యాటింగ్) 31; రోహిత్ (బ్యాటింగ్) 40; ఎక్స్‌ట్రాలు 0; మొత్తం (25 ఓవర్లలో వికెట్ నష్టానికి) 71. వికెట్ల పతనం: 1-0. బౌలింగ్: స్టార్క్ 6-2-17-1; హారిస్ 7-1-17-0; హాజల్‌వుడ్ 4-1-10-0; లయోన్ 8-1-27-0. ఆస్ట్రేలియా ఆటగాళ్లంటే అంతే మరి... మామూలుగానే స్లెడ్జింగ్ వారికి మంచినీళ్ల ప్రాయంలా కనిపిస్తుంది. ఇక మొదటి ఓవర్లోనే వికెట్ తీస్తే ఎలా ఉంటుంది? ఆసీస్ బౌలర్ మిషెల్ స్టార్క్ కూడా సరిగ్గా అదే చేశాడు. తన మూడో బంతికే మురళీ విజయ్ను అవుట్ చేయడంతో తనను తాను నియంత్రించుకోలేకపోయాడు. ఒక వైపు తన ఉద్వేగాన్ని ప్రదర్శిస్తూనే, పెవిలియన్ వైపు వెళుతున్న విజయ్ వైపు చూస్తూ... వెళ్లమంటూ నోటికి పని చెప్పాడు. దీనికి విజయ్ స్పందించకపోయినా స్టార్క్ చర్య మాత్రం తీవ్రంగా కనిపించింది. చివరకు కెప్టెన్ స్మిత్ కూడా తన ఆటగాడికి మద్దతు పలకలేదు. ‘ఆ రకంగా స్టార్క్ ప్రవర్తించడం ఆటకు మంచిది కాదు. ఇకపై వికెట్ తీసినా మా ఆటగాళ్లు అలా చేయరు’ అని స్మిత్ అన్నాడు. సెషన్-1: స్మిత్ శతకం రెండో రోజు కూడా ఆసీస్ ఎక్కడా తగ్గకుండా తమ జోరు కొనసాగించింది. ఆట ప్రారంభమైన కొద్ది సేపటికే స్మిత్ 168 బంతుల్లో శతకాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత మాత్రం భారత్‌కు కాస్త ఊరట లభించింది. తక్కువ వ్యవధిలో వాట్సన్ (183 బంతుల్లో 81; 7 ఫోర్లు), స్మిత్ వెనుదిరిగారు. షమీ బౌలింగ్‌లో పుల్ షాట్ ఆడిన వాట్సన్ డీప్ మిడ్వికెట్లో క్యాచ్ ఇవ్వడంతో 196 పరుగుల మూడో వికెట్ భాగస్వామ్యానికి తెర పడింది. ఆ వెంటనే స్మిత్ కూడా ఉమేశ్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. మార్ష్ 9 పరుగుల వద్ద అశ్విన్ బౌలింగ్‌లో గల్లీలో విజయ్ క్యాచ్ వదిలేయడం మరోసారి మన ఫీల్డింగ్ వైఫల్యాన్ని చూపించింది. మరో వైపు బర్న్స్ కూడా మొదటి 17 బంతుల్లో ఒక్క పరుగు కూడా తీయలేకపోయాడు. ఓవర్లు: 30, పరుగులు: 72, వికెట్లు: 2 సెషన్-2: మరో భాగస్వామ్యం లంచ్ తర్వాత మాత్రం మార్ష్, బర్న్స్ క్రీజ్‌లో నిలదొక్కుకున్నారు. దూకుడు ప్రదర్శించకపోవడంతో పరుగుల వేగం తగ్గినా... మన బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తగా బ్యాటింగ్ చేశారు. ఈ క్రమంలో మార్ష్ 87 బంతుల్లో, బర్న్స్ 94 బంతుల్లో అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. ఐదో వికెట్‌కు 114 పరుగులు జత చేసిన అనంతరం షమీ బౌలింగ్‌లో సాహా చక్కటి క్యాచ్ పట్టడంతో మార్ష్ పెవిలియన్ చేరాడు. ఈ సెషన్ చివర్లో ఆసీస్ బ్యాట్స్‌మెన్ వేగంగా ఆడారు. ఓవర్లు: 29, పరుగులు: 118, వికెట్లు: 1 సెషన్-3: భారత్‌కు షాక్ ఈ సెషన్ రెండో ఓవర్లోనే బర్న్స్ వెనుదిరిగాడు. అయితే అనూ హ్యంగా ర్యాన్ హారిస్ (25) చెలరేగిపోయాడు. భువనేశ్వర్ వేసిన ఒకే ఓవర్లో నాలుగు ఫోర్లు సహా అతను 19 పరుగులు రాబట్టడం విశేషం. చివరకు షమీ బౌలింగ్‌లో మరో భారీ షాట్ ఆడబోయి హారిస్ అవుట్ కావడంతో ఆసీస్ తమ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఆసీస్ తొలి వికెట్ తీసేం దుకు భారత్‌కు దాదాపు మూడు గంటలు పడితే, ఆసీస్ మాత్రం మూడో బంతికే దానిని దక్కించుకుంది. ఈ సిరీస్‌లో ఫామ్‌లో ఉన్న విజయ్, స్టార్క్ బౌలింగ్‌లో బంతిని వెంటాడి విజయ్, కీపర్‌కు క్యాచ్ ఇచ్చాడు. ఈ దశలో జత కలిసిన రోహిత్, రాహుల్ ఆకట్టుకున్నారు. గత టెస్టులో విఫలమైన రాహుల్ జాగ్రత్తగా ఆడగా, రోహిత్ మాత్రం కాస్త దూకుడు ప్రదర్శించాడు. లయోన్ బౌలింగ్‌లో అతను రెండు భారీ సిక్సర్లు కొట్టాడు. చివర్లో వీరిద్దరు కొంత ఉత్కంఠకు లోనైనా, మరో వికెట్ పడనీయలేదు. (ఆసీస్) ఓవర్లు: 3.3, పరుగులు: 34, వికెట్లు: 2 (భారత్) ఓవర్లు: 25, పరుగులు: 71, వికెట్లు: 1 3 ఒకే సిరీస్‌లో వరుసగా నాలుగు టెస్టుల్లోనూ సెంచరీ చేసిన మూడో ఆటగాడు స్మిత్. 1931-32లో బ్రాడ్‌మన్, 2003-04లో కలిస్ ఈ ఘనత సాధించారు. 24 ఒక ఇన్నింగ్స్‌లో నలుగురు భారత బౌలర్లు ఒక్కొక్కరు వందకు పైగా పరుగులు ఇవ్వడం ఇది 24వ సారి 1 ఈ సిరీస్‌లో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు పడగొట్టిన తొలి భారత బౌలర్ షమీ. 2011-12 సిరీస్‌లోనూ ఒకే భారత బౌలర్ (ఉమేశ్) ఐదు వికెట్లు తీశాడు. 1 ఆస్ట్రేలియాలో జట్టులోని టాప్-6 బ్యాట్స్‌మెన్ అందరూ కనీసం అర్ధ సెంచరీ చేయడం ఇదే తొలిసారి. -
భారత్-ఆస్ట్రేలియా చివరి టెస్టులో రెండోరోజు
-
లంచ్ సమయానికి ఆస్ట్రేలియా స్కోరు: 420/4
సిడ్నీ: బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా సిడ్నీ మైదానంలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో రోజు ఆరంభమైన చివరి టెస్ట్ మ్యాచ్ లో లంచ్ విరామ సమయానికి ఆస్ట్రేలియా 120.0 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 420 పరుగులు చేసింది. ప్రస్తుతం మార్ష్(14), బర్న్స్ (0) క్రీజులో ఉన్నారు. ఆసీస్ ఓపెనర్లు కెప్టెన్ స్టీవ్ స్మిత్ (117), వాట్సన్ (81) పరుగులు చేసి పెవిలియన్ చేరారు. స్మిత్ ఆడిన నాలుగు టెస్టు సిరీస్ లలో ఎనిమిదోవ సెంచరీ నమోదు చేసి తన ఖాతాలో వేసుకున్నాడు. ఇరువురి భాగస్వామ్యంలో తొలిరోజు నుంచి రెండోరోజు వరకూ నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఆకాశమే హద్దుగా.. భారత్ బౌలర్ల ఎత్తులను చిత్తు చేస్తూ వచ్చిన బంతిని వచ్చినట్టు బౌండరీలు దాటించారు. స్మిత్ 208 బంతుల్లో 15 ఫోర్లు బాది 117 పరుగులకు ఔటయ్యాడు. వాట్సన్ 183 బంతుల్లో 7 ఫోర్లు బాది 81 పరుగులకే వెనుతిరిగాడు. భారత్ బౌలర్లలో మహ్మద్ షమీ రెండు వికెట్లు, అశ్విన్, యాదవ్ తలో వికెట్ తీసుకోన్నారు. -
415 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా
సిడ్నీ: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో రోజు ఆరంభమైన చివరి టెస్ట్ మ్యాచ్ లో ఆసీస్ 113.3 ఓవర్లలో 415 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. ఆసీస్ ఓపెనర్ గా బరిలోకి దిగిన స్మిత్ నాలుగో వికెట్ రూపంలో పెవిలియన్ చేరాడు. తొలిరోజు నుంచి నిలకడగా ఆడుతూ వాట్సన్ భాగస్వామ్యంలో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. రెండో రోజూ కూడా స్మిత్ అదే దూకుడును ప్రదర్శిస్తూ ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడాడు. స్మిత్ ఆడిన నాలుగు టెస్టు సిరీస్ లలో ఎనిమిదోవ సెంచరీ నమోదు చేసి తన ఖాతాలో వేసుకున్నాడు. యాదవ్ బౌలింగ్ లో సహా కు క్యాచ్ ఇచ్చి స్మిత్ పెవిలియన్ కు చేరాడు. రెండు రోజులు కలిపి 208 బంతుల్లో 15 ఫోర్లు బాదిన స్మిత్ 117 పరుగులకు ఔటయ్యాడు. ఆస్ట్రేలియా 116.1 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 416 పరుగులతో కొనసాగుతోంది. ప్రస్తుతం మార్ష్(10), బర్న్స్ (0) క్రీజులో ఉన్నారు. కాగా, టీమిండియా బౌలర్లలో మహ్మద్ షమీ రెండు వికెట్లు తీసుకోగా, అశ్విన్, యాదవ్ తలో వికెట్ తీసుకోన్నారు. -
400 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా
సిడ్నీ: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో రోజు ఆరంభమైన చివరి టెస్ట్ మ్యాచ్ లో ఆసీస్ 107.2 ఓవర్లలో 400 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. ఆసీస్ ఓపెనర్ గా బరిలోకి దిగిన వాట్సన్ మూడో వికెట్ రూపంలో పెవిలియన్ చేరాడు. తొలిరోజు నుంచి నిలకడగా ఆడుతూ స్మిత్ భాగస్వామ్యంలో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. రెండో రోజూ కూడా వాట్సన్ అదే దూకుడును ప్రదర్శించాడు. ఇంతలో మహ్మద్ షమీ బౌలింగ్ లో ఆశ్వీన్ కు క్యాచ్ ఇచ్చిన వాట్సన్ పెవిలియన్ బాటపట్టాడు. రెండు రోజులు కలిపి 183 బంతుల్లో 7 ఫోర్లు బాదిన వాట్సన్ 81 పరుగులకే వెనుతిరిగాడు. ఆస్ట్రేలియా 111.2 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 412 పరుగులతో కొనసాగుతోంది. ప్రస్తుతం మార్ష్ (9), స్మిత్ 110 పరుగులతో క్రీజులో ఉన్నారు. కాగా, టీమిండియా బౌలర్లలో అశ్విన్ ఒక వికెట్ తీసుకోగా, మహ్మద్ షమీ రెండు వికెట్లు పడగొట్టాడు. -
సిడ్నీ టెస్ట్: ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ సెంచరీ
సిడ్నీ: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో రోజు ఆరంభమైన చివరి టెస్ట్ మ్యాచ్ లో ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ సెంచరీ నమోదు చేశాడు. రెండో రోజు ఆట ఆరంభించిన ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ తొలిరోజులా అదే దూకుడును ప్రదర్శించాడు. స్మిత్ ఆడిన వరుసగా నాలుగు టెస్టు సిరీస్ లలో నాలుగు సెంచరీలు నమోదు చేసి తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం 175 బంతుల్లో 15 ఫోర్లు బాదిన స్మిత్ 107 పరుగులతో క్రీజులో ఉన్నాడు. అతడికి జతగా వాట్సన్ 166 బంతుల్లో 7 ఫోర్లు, 78 పరుగులతో క్రీజులో కొనసాగుతున్నాడు. వీరిద్దరి భాగస్వామ్యంలో ఆసీస్ స్కోరు 102.3 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 393 పరుగులతో కొనసాగుతోంది. కాగా, టీమిండియా బౌలర్లలో అశ్విన్ , మహ్మద్ షమీలకు తలో వికెట్ దక్కింది. -
సిడ్నీ: రెండో రోజు ఆట ఆరంభించిన ఆస్ట్రేలియా
సిడ్నీ: బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య సిడ్ని మైదానంలో జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ లో రెండో రోజు ఆసీస్ ఆట ఆరంభమైంది. రెండో రోజు ఆట ఆరంభించిన ఆసీస్ 93.5 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 353 పరుగులతో కొనసాగుతోంది. ప్రస్తుతం షేన్ వాట్సన్ , కెప్టెన్ స్టీవ్ స్మిత్ లు హాఫ్ సెంచరీలతో క్రీజ్ లో ఉన్నారు. స్మిత్(83) పరుగులు, అతనికి జతగా వాట్సన్ (62) పరుగులతో ఆడుతున్నాడు. మొదటి రోజు మ్యాచ్.. తొలి సెషన్లో ఆసీస్ ఆటగాళ్లు చెలరేగి ఆడుతూ భారత్ బౌలర్ల ఎత్తులను చిత్తుచేశారు. విసిరిన బంతులను విసిరినట్టే వరుసగా బౌండరీలు దాటించారు. ఫలితంగా తొలిరోజు ఆట ముగిసే సరికి ఆసీస్ 90 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 348 పరుగులతో భారీ స్కోరును నమోదు చేసింది. తొలిరోజు టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ జట్టులో ఓపెనర్లగా బరిలోకి దిగిన డేవిడ్ వార్నర్ (101), రోజర్స్ (95) పరుగులు చేసి పెవిలియన్ కు చేరారు. కాగా, టీమిండియా బౌలర్లలో అశ్విన్ , మహ్మద్ షమీలకు తలో వికెట్ దక్కింది. -
భారత్-ఆస్ట్రేలియా చివరి టెస్టులో తొలిరోజు
-
తొలి రోజు ఆసీస్ స్కోరు 348/2
సిడ్నీ: టీమిండియాతో ఇక్కడ జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ లో తొలిరోజు ఆటముగిసే సమయానికి ఆసీస్ తన తొలి ఇన్నింగ్స్ లో రెండు వికెట్లు కోల్పోయి 348 పరుగులు చేసింది. ప్రస్తుతం షేన్ వాట్సన్ , కెప్టెన్ స్టీవ్ స్మిత్ లు హాఫ్ సెంచరీలతో క్రీజ్ లో ఉన్నారు. స్మిత్(82) పరుగులు చేసి మరోసారి ఆకట్టుకోగా, అతనికి జతగా వాట్సన్ (62) పరుగులతో ఆడుతున్నాడు. అంతకుముందు ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (101), రోజర్స్ (95) పరుగులు చేసి పెవిలియన్ కు చేరారు. టాస్ గెలిచిన ఆసీస్ తొలుత బ్యాటింగ్ తీసుకుంది. టీమిండియా బౌలర్లలో అశ్విన్ , మహ్మద్ షమీలకు తలో వికెట్ దక్కింది. -
షేన్ వాట్సన్ హాఫ్ సెంచరీ(321/2)
సిడ్నీ: టీమిండియాతో ఇక్కడ జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ లో ఆసీస్ ఆటగాడు షేన్ వాట్సన్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. అంతకుముందు కెప్టెన్ స్టీవ్ స్మిత్ హాఫ్ సెంచరీ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రెండు వికెట్లు కోల్పోయిన ఆసీస్ 321 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (101), రోజర్స్ (95) పరుగులు చేసి పెవిలియన్ కు చేరారు. టాస్ గెలిచిన ఆసీస్ తొలుత బ్యాటింగ్ తీసుకుంది. టీమిండియా బౌలర్లలో అశ్విన్ , మహ్మద్ షమీలకు తలో వికెట్ దక్కింది. -
సిడ్నీ టెస్ట్ : స్మిత్ హాఫ్ సెంచరీ(279/2)
సిడ్నీ: టీమిండియాతో ఇక్కడ జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ లో ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. కేవలం 71 బంతులు ఎదుర్కొన్న స్మిత్ 8 ఫోర్ల సాయంతో హాఫ్ సెంచరీ చేశాడు. అంతకుముందు ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (101), రోజర్స్ (95) పరుగుల తో శుభారంభాన్నివ్వడంతో ఆసీస్ తొలి రోజు భారీ స్కోరును నమోదు చేసే దిశగా సాగుతోంది. కెప్టెన్ స్మిత్ (53), షేన్ వాట్సన్ (31 ) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. టీమిండియా బౌలర్లలో అశ్విన్, మహ్మద్ షమీలకు తలో వికెట్ లభించింది. -
భారీ స్కోరు దిశగా ఆసీస్
సిడ్నీ: టీమిండియాతో ఇక్కడ మంగళవారం ఆరంభమైన చివరి టెస్ట్ మ్యాచ్ లో ఆసీస్ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (101), రోజర్స్ (95) పరుగుల తో శుభారంభాన్నివ్వడంతో ఆసీస్ తొలి రోజు భారీ స్కోరును నమోదు చేసే దిశగా సాగుతోంది. కెప్టెన్ స్మిత్ (28), షేన్ వాట్సన్ (10) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. లంచ్ వరకూ వికెట్లు కోల్పోని ఆసీస్ ఆ తరువాత వెనువెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. టీమిండియా బౌలర్లలో అశ్విన్, మహ్మద్ షమీలకు తలో వికెట్ లభించింది. ఈ రోజు ఆటలో 59 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయిన ఆసీస్ టీ సమయానికి 242 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ఇంకా ఈ రోజు ఆటలో సుమారు ముప్ఫై ఓవర్లు ఉండటంతో ఆసీస్ భారీ స్కోరు చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.ఇప్పటికే టెస్ట్ సిరీస్ ను కోల్పోయిన టీమిండియా ఈ చివరి టెస్టును తప్పక గెలిచి పరువు నిలుకోవాలని యత్నిస్తోంది. టెస్ట్ మ్యాచ్ లను మహేంద్ర సింగ్ ధోనీ వైదొలగడంతో విరాట్ కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా బరిలోకి దిగింది. -
తృటిలో సెంచరీ కోల్పోయిన రోజర్స్
సిడ్నీ:టీమిండియాతో ఇక్కడ జరుగుతున్న చివరి టెస్ట్ లో ఆసీస్ వెనువెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. రోజర్స్(95) పరుగుల వద్ద పెవిలియన్ కు చేరి తృటిలో సెంచరీ కోల్పోయాడు. అంతకుముందు డేవిడ్ వార్నర్ (101) పరుగులు చేసి అవుట్ కావడం తెలిసిందే. 200 పరుగుల వద్ద తొలి వికెట్ ను కోల్పోయిన ఆసీస్ మరో నాలుగు పరుగులు మాత్రమే జోడించిన రెండో వికెట్ ను నష్టపోయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఆరంభించిన ఆసీస్ కు ఓపెనర్లు శుభారంభాన్నిచ్చారు. టీమిండియా బౌలర్లలో అశ్విన్ , మహ్మద్ షమీలకు తలో వికెట్ లభించింది. -
తొలి వికెట్ ను కోల్పోయిన ఆసీస్(200/1)
సిడ్నీ: టీమిండియాతో ఇక్కడ జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ లో ఆసీస్ 200 పరుగుల వద్ద తన తొలి వికెట్ ను కోల్పోయింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ సెంచరీ చేసిన అనంతరం ఒక పరుగు మాత్రమే చేసి పెవిలియన్ కు చేరాడు. ఆసీస్ కు ఓపెనర్లు శుభారంభాన్నిచ్చారు. మరో ఓపెనర్ రోజర్స్(91) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. టీమిండియా బౌలర్ అశ్విన్ కు తొలి వికెట్ దక్కింది. -
వార్నర్ సెంచరీ: ఆసీస్ కు శుభారంభం
సిడ్నీ: టీమిండియాతో ఇక్కడ ఆరంభమైన చివరిదైన నాల్గో టెస్ట్ లో ఆసీస్ కు శుభారంభం లభించింది. తొలి ఇన్నింగ్స్ లో భాగంగా ఆసీస్ ఓపెనర్లు వార్నర్, రోజర్స్ లు ధాటిగా బ్యాటింగ్ ఆరంభించారు. వార్నర్(108 బంతుల్లో 16 ఫోర్లతో సెంచరీ నమోదు చేయగా, రోజర్స్(79)పరుగులతో క్రీజ్ లో ఉన్నాడు. ఈ సెంచరీతో వార్నర్ టెస్టుల్లో 12 సెంచరీలను నెలకొల్పాడు. ప్రస్తుతం ఆసీస్ వికెట్ నష్టపోకుండా 41.1 ఓవర్లలో 187 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ఇప్పటికే టెస్ట్ సిరీస్ ను కోల్పోయిన టీమిండియా ఈ చివరి టెస్టును తప్పక గెలిచి పరువు నిలుకోవాలని యత్నిస్తోంది. టెస్ట్ మ్యాచ్ లను మహేంద్ర సింగ్ ధోనీ వైదొలగడంతో విరాట్ కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా బరిలోకి దిగింది. -
సిడ్నీ టెస్టు: లంచ్ విరామ సమయానికి ఆస్ట్రేలియా 123/0
సిడ్ని టెస్టు: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మంగళవారమిక్కడ ఆరంభమైన నాలుగో టెస్టు మ్యాచ్ తొలిరోజు ఆటలో లంచ్ విరామ సమయానికి ఆస్ట్రేలియా 28 ఓవర్లలో 123 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఆసీస్ కు ఓపెనర్లు శుభారంభాన్నిచ్చారు. వార్నర్ 45 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేయగా, రోజర్స్ 92 బంతుల్లో 50 పరుగులు చేశాడు. ప్రస్తుతం వార్నర్ (63) రోజర్స్ (52) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. ఇప్పటికే టెస్ట్ సిరీస్ ను కోల్పోయిన టీమిండియా ఈ చివరి టెస్టును తప్పక గెలిచి పరువు నిలుకోవాలని యత్నిస్తోంది. టెస్ట్ మ్యాచ్ లను మహేంద్ర సింగ్ ధోనీ వైదొలగడంతో విరాట్ కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా బరిలోకి దిగింది. -
సిడ్నీ టెస్టు: రోజర్స్, వార్నర్ హాఫ్ సెంచరీ పూర్తి
సిడ్నీ: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మంగళవారమిక్కడ జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్ లో తొలిరోజు మ్యాచ్ లో తొలుత ఓపెనర్లుగా బరిలోకి దిగిన ఆసీస్ ఆటగాళ్లు వార్నర్, రోజర్స్ హాఫ్ సెంచరీలు పూర్తి చేశారు. వార్నర్ 45 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేయగా, రోజర్స్ 92 బంతుల్లో 50 పరుగులు చేశాడు. ప్రస్తుతం 27 ఓవర్లలో 120 పరుగులతో ఆస్ట్రేలియా ఆట కొనసాగుతోంది. రోజర్స్ 93 బంతుల్లో 7 ఫోర్లు బాది (52), వార్నర్ కూడా అదే దూకుడుగా ఆడుతూ 74 బంతుల్లో 9 ఫోర్లు బాది 63 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ఇరువురి భాగస్వామ్యంలో ఆసీస్ స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. -
నాలుగో టెస్టు: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా
సిడ్నీ: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మంగళవారమిక్కడ సిడ్నీక్రికెట్ మైదానంలో జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్ లో తొలిరోజు ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఆసీస్ ఓపెనర్లగా రోజర్స్, వార్నర్ లు బరిలోకి దిగారు. ఇదిలా ఉండగా, భారత జట్టులో నాలుగు మార్పులు జరిగాయి. గత మూడు టెస్టు మ్యాచ్ లలో పేలవమైన ఆటను ప్రదర్శించి నిరాశపరిచిన భారత్ ఆటగాళ్లు ధావన్, పూజారా, ఇషాంత్ శర్మలకు సిడ్ని మైదానంలో జరిగే కీలకమైన నాలుగో టెస్టు మ్యాచ్ లో చోటు దక్కలేదు. వారు పెవిలియన్ కే పరమితమైయ్యారు. వారి స్థానంలో రైనా, సహా, రోహిత్, భువనేశ్వర్ లకు చోటు దక్కింది. అయితే టీమిండియా సారథిగా ధోని టెస్టులకు వీడ్కోలు పలికిన తర్వాత కొత్త సారథి విరాట్ కోహ్లి నేతృత్వంలోని టీమిండియా తొలి మ్యాచ్ ఆడుతోంది. దీంతో ఐదు రోజుల ఫార్మాట్లో భారత్ దశా, దిశ ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే సిరీస్‌లో 0-2తో వెనుకబడిన భారత్.. మెల్బోర్న్లో డ్రాతో సరిపెట్టుకుంది. అయితే సిడ్నీలో మాత్రం పక్కా ప్రణాళికలతో విజయం కోసం బరిలోకి దిగుతోంది. ఈ సిరీస్‌లో మూడు శతకాలు సాధించిన కెప్టెన్ కోహ్లి నాయకత్వ ప్రతిభపై కూడా ఆసక్తికర చర్చ జరుగుతోంది. మైదానంలో దూకుడుగా ఉండే విరాట్... ఒత్తిడిని ఎలా జయిస్తాడని అందరూ ఎదురుచూస్తున్నారు. వ్యక్తిగత ప్రదర్శనతో అడిలైడ్‌లో జట్టును విజయం దరిదాపుల్లోకి తెచ్చినా... సిడ్నీలో సహచరులను నడిపించడంలో ఎలా వ్యవహరిస్తాడో వేచి చూడాలి. -
భావోద్వేగాల నడుమ...
ఆరు వారాల కిందట హ్యూస్ మరణించడంతో భావోద్వేగాల మధ్య ప్రారంభమైన టెస్టు సిరీస్... ఇప్పుడు తుది అంకానికి చేరుకుంది. సహచరుడి కోసం ఏ మైదానంలో అయితే క్రికెటర్లు కన్నీళ్లు కార్చారో... ఇప్పుడు మళ్లీ అదే గ్రౌండ్లో మ్యాచ్ ఆడబోతున్నారు. దీంతో సహజంగా ఆటతో పాటు అప్పటి ఉద్విగ్న క్షణాలపై కూడా చర్చ మొదలైంది. హ్యూస్ జ్ఞాపకాలు ఆసీస్ జట్టును వెంటాడుతుంటే... కొత్త కెప్టెన్ కోహ్లి సారథ్యంలో భారత్ నవశకం వైపు అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో సిడ్నీ క్రికెట్ మైదానంలో నేటి నుంచి జరగనున్న నాలుగో టెస్టు ప్రాధాన్యత సంతరించుకుంది. సిడ్నీ: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ చేజారినప్పటికీ... భారత క్రికెట్ జట్టు మాత్రం కొత్త శకంలోకి అడుగుపెడుతోంది. విజయవంతమైన కెప్టెన్‌గా పేరు తెచ్చుకున్న ధోని టెస్టులకు వీడ్కోలు పలికిన తర్వాత కొత్త సారథి విరాట్ కోహ్లి నేతృత్వంలోని టీమిండియా తొలి మ్యాచ్ ఆడబోతోంది. దీంతో ఐదు రోజుల ఫార్మాట్లో భారత్ దశా, దిశ ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో సిడ్నీ మైదానంలో నేటి నుంచి భారత్, ఆస్ట్రేలియాల మధ్య చివరిదైన నాలుగో టెస్టు జరగనుంది. సిరీస్‌లో 0-2తో వెనుకబడిన భారత్.. మెల్బోర్న్లో డ్రాతో సరిపెట్టుకుంది. అయితే సిడ్నీలో మాత్రం పక్కా ప్రణాళికలతో విజయం కోసం బరిలోకి దిగుతోంది. ఈ సిరీస్‌లో మూడు శతకాలు సాధించిన కెప్టెన్ కోహ్లి నాయకత్వ ప్రతిభపై కూడా ఆసక్తికర చర్చ జరుగుతోంది. మైదానంలో దూకుడుగా ఉండే విరాట్... ఒత్తిడిని ఎలా జయిస్తాడని అందరూ ఎదురుచూస్తున్నారు. వ్యక్తిగత ప్రదర్శనతో అడిలైడ్‌లో జట్టును విజయం దరిదాపుల్లోకి తెచ్చినా... సిడ్నీలో సహచరులను నడిపించడంలో ఎలా వ్యవహరిస్తాడో చూడాలి. 20 వికెట్లు తీయలేకే... బ్యాటింగ్‌లో విరాట్‌సేన బలంగా కనిపిస్తున్నా... బౌలింగ్ మాత్రం తీవ్రంగా కలవరపెడుతోంది. ఒక్క మ్యాచ్‌లో కూడా బౌలర్లు 20 వికెట్లు తీయలేకపోతున్నారు. ఈ ఒక్క కారణంతోనే భారత్ టెస్టు విజయాల్లో వెనుకబడిపోతోంది. డిసెంబర్ 2013 నుంచి భారత్ ఆడిన టెస్టులను పరిశీలిస్తే... ప్రతి మ్యాచ్‌లోనూ వచ్చిన అవకాశాలను బౌలర్లు సద్వినియోగం చేసుకోలేపోయారు. దీంతో ప్రస్తుతం సరైన బౌలర్లను ఎంపిక చేసుకోవడం కోహ్లిపైన ఉన్న అతిపెద్ద బాధ్యత. అయితే ఈ మ్యాచ్‌లో అతను ఐదుగురు బౌలర్ల వ్యూహాన్ని అమలు చేస్తాడో లేదో చూడాలి. ధోని స్థానంలో సాహా జట్టులోకి రానున్నాడు. తాత అంత్యక్రియల కోసం భారత్‌కు వచ్చిన వరుణ్ ఆరోన్ ఆసీస్‌కు తిరిగొచ్చాడు. భువనేశ్వర్ నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఉమేశ్, షమీ, కులకర్ణి బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు. స్పిన్నర్లలో అశ్విన్, కరణ్, అక్షర్‌లు కూడా సిద్ధంగా ఉన్నారు. దీంతో కోహ్లి వీళ్లలో ఎవర్ని ఎంచుకుంటాడో చూడాలి. ఇక బ్యాటింగ్‌లో ఓపెనర్‌గా ధావన్ విఫలమవుతున్నాడు. ఇతని స్థానంలో లోకేశ్‌ను ప్రమోట్ చేసి మిడిలార్డర్లో రైనాను తీసుకుంటారా? పేలవ ఫామ్‌తో ఇబ్బందిపడుతున్న పుజారాను కొనసాగిస్తారా? లేదా రోహిత్‌ను తీసుకొస్తారా? కోహ్లి తుది జట్టు కూర్పు ఎలా ఉండబోతోందన్నది వేచి చూడాల్సిందే. ఆత్మ విశ్వాసంతో ఆసీస్ మరోవైపు మంచి ఆత్మ విశ్వాసంతో ఉన్న ఆసీస్ ఈ సిరీస్‌ను విజయంతో ముగించాలని భావిస్తోంది. అయితే ఇదే మైదానంలో హ్యూస్ మరణించడంతో అతని జ్ఞాపకాలు సహచరులను వెంటాడుతున్నాయి. ఇలాంటి భావోద్వేగ పరిస్థితును కంగారులు అధిగమిస్తారా లేదో చూడాలి. ఈ మ్యాచ్‌కు హ్యూస్ కుటుంబ సభ్యులు హాజరయ్యే అవకాశం ఉండటంతో పరిస్థితి మరింత భిన్నంగా ఉండనుంది. బ్యాటింగ్‌లో అందరూ ఫామ్‌లో ఉండటం జట్టుకు కలిసొచ్చే అంశం. బౌలింగ్‌లో జాన్సన్ లేని లోటును స్టార్క్ తీరుస్తాడో లేదో చూడాలి. ఓవరాల్‌గా భారత బ్యాటింగ్‌కు ఆసీస్ బౌలర్లకు ఈ మ్యాచ్ సవాలుగా మారనుంది. జట్లు (అంచనా) భారత్: కోహ్లి (కెప్టెన్), విజయ్, ధావన్, పుజారా, రహానే, రైనా / రాహుల్, సాహా, అశ్విన్, భువనేశ్వర్ / ఉమేశ్, వరున్ ఆరోన్, ఇషాంత్ శర్మ. ఆస్ట్రేలియా: స్మిత్ (కెప్టెన్), రోజర్స్, వార్నర్, వాట్సన్, మార్ష్, బర్న్స్, హాడిన్, హారిస్, స్టార్క్, హాజెల్‌వుడ్, లయోన్. భారత్... బోటు షికారు సిడ్నీలోని భారత హై కమిషనర్ విరాట్‌సేనకు ఆదివారం సాయంత్రం విందు ఇచ్చారు. ఈ సందర్భంగా జట్టు మొత్తం సిడ్నీ హర్బర్‌లో క్రూయిజ్‌లో ప్రయాణించింది. తర్వాత ‘షో బోట్ల’లో ప్రయాణిస్తూ ఉత్సాహంగా గడిపింది. విందుకు హాజరైన ఆటగాళ్లను హైకమిషనర్ బీరెన్ నందా సాదరంగా ఆహ్వానించారని బీసీసీఐ పేర్కొంది. జట్టు తరఫున కోహ్లి... నందాకు కతృ జ్ఞతలు తెలిపాడు. ఈ మ్యాచ్‌లోనూ పోరాట పటిమను చూపుతామని హామీ ఇచ్చాడు. గతంలో హైకమిషనర్లు ఇచ్చిన విందుకు భిన్నంగా ఇది సాగిందని, ఆటగాళ్లు 90 నిమిషాల పాటు సాగిన క్రూయిజ్ ప్రయాణాన్ని ఆస్వాదించారన్నాడు. విందుకు వచ్చిన అతిథులతో కలిసి ఫొటోలకు ఫొజులిచ్చిన క్రికెటర్లు... ఆటోగ్రాఫ్‌లు ఇస్తూ బిజీగా గడిపారు. మ్యాచ్ ముగిశాక డ్రెస్సింగ్ రూమ్‌లో ధోని రిటైర్మెంట్ విషయం చెప్పాడు. అంతే అందరూ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఏం మాట్లాడాలో కూడా తోచలేదు. ఎందుకంటే మహి ఉద్వేగ క్షణాల్లో ఉన్నాడు. మేం కూడా అదే పరిస్థితిలో ఉన్నాం. కఠిన పరిస్థితుల్లో ఎలా ఉండాలో ధోనిని చూసి చాలా నేర్చుకున్నా. కీలక సమయాల్లో తుది జట్టును ఎంచుకోవడం, నిర్ణయాలు తీసుకోవడంలో అతని తర్వాతే ఎవరైనా. ఈ అంశాలే కెప్టెన్‌కు చాలా కీలకం. అడిలైడ్ టెస్టు తర్వాత మెరుగుపడాల్సిన విషయాలను విశ్లేషించుకున్నా. ఆటలో చేస్తున్న తప్పులను సరిదిద్దుకోవాలని భావిస్తున్నా. ప్రతికూల సమయంలో కూడా సరైన నిర్ణయాలు తీసుకునేందుకు ప్రయత్నిస్తా. ప్రతిసారీ సానుకూల దృక్పథంతో ఆడతా. బౌలర్లు శక్తి మేరకు కష్టపడుతున్నా ఫలితాలు అందడం లేదు. ఓవరాల్‌గా ఓ మంచి టెస్టు జట్టుగా రూపాంతరం చెందాల్సిన అవసరం ఉంది -కోహ్లి (భారత కెప్టెన్) తొలి టెస్టులో కోహ్లి బాధ్యతలు బాగానే నిర్వర్తించాడు. కాకపోతే కాస్త దూకుడు ఎక్కువ. ఈ వారంలోనే భారత్ తరఫున రెండో కెప్టెన్‌తో మ్యాచ్ ఆడబోతున్నా. సిడ్నీ నాకు ఫెవరేట్ మైదానం. కాబట్టి ఈ మ్యాచ్‌పై పూర్తిగా దృష్టిపెట్టా. జాన్సన్ గాయంతో బాధపడుతున్నాడు. వరల్డ్‌కప్‌ను దృష్టిలో పెట్టుకుని అతన్ని పక్కకు తప్పించాం. మిగతా వారంతా ఫిట్‌గా ఉన్నారు. ఈ మ్యాచ్‌లో భావోద్వేగాలు ఉంటాయి. హ్యూస్ జ్ఞాపకాలు మాలో ఇంకా కదలాడుతూనే ఉన్నా యి. మైదానంలో మాటల యుద్ధం సహజం -స్మిత్ (ఆసీస్ కెప్టెన్) పిచ్, వాతావరణం ఆసీస్‌లో ఇతర వేదికల కంటే సిడ్నీ పిచ్ స్పిన్‌కు ఎక్కువ సహకరిస్తుంది. వికెట్‌పై గడ్డి ఎక్కువగా ఉండటంతో స్పిన్‌తో పాటు రివర్స్ స్వింగ్‌కు అనుకూలం. మ్యాచ్ జరిగే రోజుల్లో ఉష్ణోగ్రత 20 డిగ్రీల కంటే ఎక్కువగానే ఉంటుంది. అయితే అప్పుడప్పుడు చిరుజల్లులు పడే అవకాశాలున్నాయి. సిడ్నీలో ఆడిన చివరి 11 టెస్టుల్లో ఆస్ట్రేలియా 10 మ్యాచ్‌ల్లో గెలిచింది. 2010-11 యాషెస్ సిరీస్‌లో మాత్రం ఇంగ్లండ్ చేతిలో ఓడింది. ఈ మ్యాచ్‌లో విరాట్ సెంచరీ చేస్తే... ఒక టెస్టు సిరీస్‌లో నాలుగు శతకాలు చేసిన హెర్బెర్ట్ సుట్ల్కిఫ్, వాలీ హామండ్స్ సరసన నిలుస్తాడు. -
సిడ్నీ సమరానికి.. రంగం సిద్ధమైంది!!
-
రేపే తుది పోరు!!
ఆస్ట్రేలియన్లంటే చాలు.. ఒంటికాలి మీద లేచే విరాట్ కోహ్లీ పూర్తిస్థాయి నేతృత్వంలో టీమిండియా ఆడబోతున్న తొలి టెస్టు, ఈ సిరీస్‌లో చిట్ట చివరి టెస్టుకు రంగం సిద్ధమైంది. మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించడంతో విరాట్ పూర్తిస్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. నాలుగు టెస్టుల సిరీస్‌లో భారత్ రెండింటిని కోల్పోగా, మూడో టెస్టు డ్రాగా ముగిసింది. చిట్ట చివరిదైన సిడ్నీ టెస్టులో కోహ్లీ తన ఆవేశాన్ని పరుగుల రూపంలోకి మారుస్తాడా.. కనీసం ఈ చిట్టచివరి టెస్టులోనైనా నెగ్గి పరువు నిలబెడతాడా అని భారత అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ప్రియురాలు అనుష్కా శర్మ వచ్చిన తర్వాత మరింత రెచ్చిపోయి సెంచరీల మోత మోగిస్తున్న కోహ్లీ.. మైదానం నుంచే ఆమెకు ఫ్లయింగ్ కిస్సులు కూడా ఇచ్చాడు. ఇప్పుడు జట్టు సభ్యులందరినీ ఒక్కతాటి మీదకు తెచ్చి, ఇటీవలి కాలంలో పేలవమైన ఫాం చూపిస్తున్న శిఖర్ ధవన్ లాంటివాళ్లతో కూడా మూడంకెల స్కోర్లు నమోదు చేయించగలిగితే.. కోహ్లీ సక్సెస్ అయినట్లే. ధోనీ రాకముందు తాత్కాలికంగా జట్టు బాధ్యత వహించినప్పటి దారి వేరు.. ఇప్పుడు పూర్తి స్థాయి కెప్టెన్‌గా రంగప్రవేశం చేయడం వేరు. కాబట్టి ఇప్పుడు కోహ్లీని విమర్శకులు కూడా నిశితంగా గమనిస్తుంటారు. అతడి వ్యూహాలు ఎలా పనిచేస్తున్నాయో చూస్తారు. కాబట్టి.. తనను తాను నిరూపించుకోడానికి చక్కటి అవకాశం ఆస్ట్రేలియా మీద చివరి టెస్టు రూపంలో కోహ్లీకి వచ్చింది. ఏం చేస్తాడో చూద్దాం మరి!