సిడ్నీ: ఆస్ట్రేలియాతో ఇక్కడ జరుగుతున్న చివరి టెస్టు మ్యాచ్ లో టీమిండియా ఆటగాడు సురేష్ రైనా డకౌట్ రూపంలో వెనుదిరిగాడు.తన ఆడిన తొలి బంతికే క్యాచ్ ఇచ్చిన రైనా పెవిలియన్ కు చేరాడు. 292 పరుగుల వద్ద టీమిండియా రైనా ఐదో వికెట్ రూపంలో నిష్ర్కమించాడు. వరుసగా రెండు వికెట్లను కోల్పోయిన టీమిండియా ఒక్కసారిగా కష్టాలను కొనితెచ్చుకుంది. అంతకుముందు అజ్యింకా రహానే (13) పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్ కు చేరిన సంగతి తెలిసిందే.