Last test
-
సుందరం శార్దూలం...
ఒక్క తొలి టెస్టు తప్ప... ప్రతీ టెస్టుకు ముందు భారత్‌కు ప్రతికూలతలే. మ్యాచ్ మొదలయ్యాక కష్టాలే! అయినా సరే ప్రతికూలతలకు ఎదురీదుతోంది. కష్టాలన్నీ అధిగమిస్తోంది. మ్యాచ్ మ్యాచ్‌కూ అనుభవజ్ఞులు దూరమవుతున్నా... రిజర్వ్ బెంచ్ సత్తా చాటుతోంది. నిజం చెప్పాలంటే టీమిండియాది పోరాటం కాదు... అంతకుమించిన ఉక్కు సంకల్పం. అందుకేనేమో ప్రత్యర్థి పైచేయి సాధిస్తున్న ప్రతీసారి భారత్ పిడికిలి బిగిస్తోంది. ఆతిథ్య జట్టును ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దీంతో ఈ భారత్–ఆసీస్ సిరీస్ రసవత్తరంగా మారి యావత్ సంప్రదాయ క్రికెట్‌కు కొత్త జీవం పోస్తోంది. ఐదు రోజుల టెస్టు బోర్ కాదు బెస్ట్ అని చాటి చెబుతోంది. బ్రిస్బేన్: మెరుపుల టి20ల ముందు వెలవెల బోతున్న టెస్టులకు కాలం చెల్లలేదని భారత్, ఆస్ట్రేలియా సిరీస్ ప్రతీ మ్యాచ్‌లోనూ నిరూపిస్తోంది. కాదు కాదు చూపిస్తోంది. ఆఖరి టెస్టులో మూడో రోజు ఆటను భారత లోయర్ మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ శార్దుల్ ఠాకూర్ (115 బంతుల్లో 67; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), వాషింగ్టన్ సుందర్ (144 బంతుల్లో 62; 7 ఫోర్లు, 1 సిక్స్) మార్చేశారు. ఆతిథ్య బౌలర్లను వీళ్లిద్దరే శాసించారు. ఆదివారం తొమ్మిది మంది బ్యాటింగ్‌కు దిగితే ఈ జోడీ మాత్రమే ఆస్ట్రేలియాను చెమటలు కక్కించింది. భారత్‌ను కష్టాల నుంచి గట్టెక్కించింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 111.4 ఓవర్లలో 336 పరుగుల వద్ద ఆలౌటైంది. ఆసీస్ బౌలర్లలో హాజల్‌వుడ్ (5/57) ఆకట్టుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 33 పరుగుల ఆధిక్యమే పొందిన ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో ఆట నిలిచే సమయానికి వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. ఓపెనర్లు వార్నర్ (20 బ్యాటింగ్), హారిస్ (1 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం ఆసీస్ జట్టు ఓవరాల్ ఆధిక్యం 54 పరుగులు. నాలుగో రోజు రెండు జట్ల ఆటతీరే ఈ మ్యాచ్ ఫలితం ఎవరివైపు మొగ్గుతుందో తేల్చనుంది. భారత బౌలర్లు ఆసీస్ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేస్తారా... భారత బౌలింగ్‌ను ధీమాగా ఎదుర్కొని భారీ స్కోరు చేసి ఆసీస్ నిలబడుతుందా వేచి చూడాలి. ‘వంద’ వరకే బాగుంది తొలి సెషన్ ఆరంభంలో బాగున్నట్లు కనిపించిన భారత ఇన్నింగ్స్ లంచ్‌లోపే కష్టాల్లోకి జారుకుంది. ఓవర్‌నైట్ స్కోరు 62/2తో మూడో రోజు ఆట కొనసాగించిన భారత్ 100 పరుగుల దాకా బాగానే ఉంది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మెన్ చతేశ్వర్ పుజారా (94 బంతుల్లో 25; 2 ఫోర్లు), కెప్టెన్ రహానే (93 బంతుల్లో 37; 3 ఫోర్లు) నిలదొక్కుకుంటున్న తరుణంలో హాజల్‌వుడ్ దెబ్బతీశాడు. 105 స్కోరు వద్ద పుజారాను ఔట్ చేశాడు. వేగంగా దూసుకొచ్చి న బంతిని డిఫెన్స్ చేయడానికి ప్రయత్నించగా... అది పుజారా బ్యాట్ అంచును తగిలి కీపర్ పైన్ చేతుల్లో పడింది. తర్వాత లంచ్ విరామానికి కాస్తముందుగా రహానే ఆటను స్టార్క్ ముగించాడు. బెంబేలెత్తించిన హాజల్‌వుడ్ భారత్ 161/4 స్కోరుతో లంచ్ బ్రేక్‌కు వెళ్లొచ్చిన వెంటనే హాజల్‌వుడ్ నిప్పులు చెరిగే బౌలింగ్‌తో కుర్రాళ్లను హడలెత్తించాడు. దీంతో రెండో సెషన్ మొదలైన రెండో బంతికే మయాంక్ అగర్వాల్ (75 బంతుల్లో 38; 3 ఫోర్లు, సిక్స్) పెవిలియన్ చేరాడు. షాట్‌కు ప్రయత్నించిన మయాంక్ రెండో స్లిప్‌లో ఉన్న స్మిత్ చేతికి చిక్కాడు. కాసేపటికే రిషభ్ పంత్ (23; 2 ఫోర్లు) కూడా హాజల్‌వుడ్ బౌలింగ్‌లోనే అవుటయ్యాడు. బౌన్సర్‌ను షాట్‌గా మలిచేందుకు చేసిన పంత్ ప్రయత్నం బెడిసింది. అక్కడే గాల్లోకి లేచిన బంతిని గల్లీ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న గ్రీన్ అందుకోవడంతో పంత్ ఇన్నింగ్స్ ముగిసింది. అప్పటికి భారత్ స్కోరు 186/6. గత టెస్టులో తమతో ఓ ఆటాడుకున్న పంత్ పెవిలియన్ చేరడం, ఇకపై వచ్చే స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ ఎవరూ లేకపోవడంతో ఆసీస్ శిబిరంలో ఆనందం ఆకాశాన్నంటింది. ఫిఫ్టీ–ఫిఫ్టీలతో బాగుపడింది కెరీర్లో తొలి టెస్టు ఆడుతున్న వాషింగ్టన్ సుందర్ ... రెండో టెస్టు మాత్రమే ఆడుతున్న శార్దుల్ ఠాకూర్లు బౌలింగ్ కేటగిరీలోనే తుది జట్టులోకి వచ్చారు. ఇద్దరికీ బ్యాటింగ్ చేసే సామర్థ్యం ఉన్నప్పటికీ ఆసీస్ గడ్డపై... అది కూడా స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్‌నే గడగడలాడిస్తున్న ఆసీస్ పేస్ త్రయం హాజల్‌వుడ్, కమిన్స్, స్టార్క్‌ను ఎదుర్కోగలరని ఎవరూ ఊహించలేదు. కానీ వీరిద్దరి ఆట అరివీర పేసర్ల బంతుల్ని తుత్తునీయలు చేసింది. తర్వాత్తర్వాత పరుగులతో ఇన్నింగ్స్‌ను పేర్చేసింది. అటుపై కష్టాల నుంచి జట్టును గట్టెక్కించింది. ప్రత్యర్థి భారీ ఆధిక్యానికి లొంగాల్సిన చోట భారీ భాగస్వామ్యాన్ని నిర్మించింది. దీంతో పంత్ అవుటైనప్పటి ఆనందం ఆసీస్‌లో క్రమంగా ఆవిరైంది. ఓవర్లు గడిచేకొద్దీ... పరుగులు పెరిగేకొద్దీ... ఇద్దరు అర్ధశతకాలు బాదేసేదాకా సాగిపోయింది. ఇది భారత్ ఇన్నింగ్స్‌ను పటిష్టస్థితికి తీసుకెళ్లింది. ప్రత్యర్థి బౌలింగ్‌ను నీరుగార్చేసింది. కమిన్స్ ఓవర్లో బ్యాక్వర్డ్ స్క్వేర్‌లెగ్‌లో సిక్సర్ బాదిన శార్దుల్... బౌండరీలనైతే మంచినీళ్ల ప్రాయంగా బాదేశాడు. సుందర్ కూడా లయన్ బౌలింగ్‌లో భారీ సిక్సర్ కొట్టాడు. ఇద్దరు చక్కని సమన్వయంతో ఫిఫ్టీలను పూర్తి చేసుకున్నారు. జట్టు స్కోరు 300 మార్క్‌ను దాటింది. గబ్బాలో ఏడో వికెట్‌కు అత్యధికంగా 123 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాక శార్దుల్ ఔటయ్యాడు. తర్వాత భారత్ ఇన్నింగ్స్ ఎంతో సేపు సాగలేదు. సైనీ (5), సిరాజ్ (13)లను హాజల్‌వుడ్ ... సుందర్‌ను స్టార్క్ అవుట్ చేయడంతో టీమిండియా ఇన్నింగ్స్ ముగిసింది. స్కోరు వివరాలు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 369; భారత్ తొలి ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (సి) స్టార్క్ (బి) లయన్ 44; శుబ్‌మన్ గిల్ (సి) స్మిత్ (బి) కమిన్స్ 7; పుజారా (సి) పైన్ (బి) హాజల్‌వుడ్ 25; అజింక్య రహానే (సి) వేడ్ (బి) స్టార్క్ 37; మయాంక్ అగర్వాల్ (సి) స్మిత్ (బి) హాజల్‌వుడ్ 38; రిషభ్ పంత్ (సి) గ్రీన్ (బి) హాజల్‌వుడ్ 23; వాషింగ్టన్ సుందర్ (సి) గ్రీన్ (బి) స్టార్క్ 62; శార్దుల్ ఠాకూర్ (బి) కమిన్స్ 67; నవదీప్ సైనీ (సి) స్మిత్ (బి) హాజల్‌వుడ్ 5; సిరాజ్ (బి) హాజల్‌వుడ్ 13; నటరాజన్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (111.4 ఓవర్లలో ఆలౌట్) 336. వికెట్ల పతనం: 1–11, 2–60, 3–105, 4–144, 5–161, 6–186, 7–309, 8–320, 9–328, 10–336. బౌలింగ్: స్టార్క్ 23–3–88–2, హాజల్‌వుడ్ 24.4–6–57–5, కమిన్స్ 27–5–94–2, గ్రీన్ 8–1–20–0, లయన్ 28–9–65–1, లబ్‌షేన్ 1–1–0–0. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: హారిస్ (బ్యాటింగ్) 1; డేవిడ్ వార్నర్ (బ్యాటింగ్) 20; మొత్తం (6 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 21. బౌలింగ్: సిరాజ్ 2–1–12–0, నటరాజన్ 3–0–6–0, వాషింగ్టన్ సుందర్ 1–0–3–0. ► అరంగేట్రం టెస్టులోనే మూడు వికెట్లు తీయడంతోపాటు 50 అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన పదో క్రికెటర్‌గా, భారత్ నుంచి మూడో క్రికెటర్‌గా వాషింగ్టన్ సుందర్ గుర్తింపు పొందాడు. భారత్ నుంచి సుందర్కంటే ముందు దత్తూ ఫాడ్కర్ (1947లో ఆస్ట్రేలియాపై సిడ్నీలో... 51 పరుగులు; 3/14), హనుమ విహారి (2018లో ఇంగ్లండ్‌పై ఓవల్‌లో... 56 పరుగులు; 3/37) ఈ ఘనత సాధించారు. ► భారత్‌పై టెస్టుల్లో 33 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కడం ఆస్ట్రేలియాకిది మూడోసారి. గతంలో 33 పరుగుల ఆధిక్యం పొందిన రెండుసార్లూ ఆస్ట్రేలియా (1979లో కాన్పూర్; అడిలైడ్ 2003) ఆ టెస్టుల్లో ఓడిపోవడం గమనార్హం. ► ఆస్ట్రేలియా గడ్డపై భారత బ్యాట్స్‌మన్ జోడీ ఏడో వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పడం ఇది నాలుగోసారి. గతంలో రిషభ్ పంత్–రవీంద్ర జడేజా (204 పరుగులు; 2019లో సిడ్నీ)... విజయ్ హజారే–హేమూ అధికారి (132 పరుగులు; 1948లో అడిలైడ్)... అజహరుద్దీన్–మనోజ్ ప్రభాకర్ (101 పరుగులు; 1992లో అడిలైడ్) జోడీలు ఈ ఘనత సాధించాయి. -
పట్టు సడలింది!
బుమ్రా లేడు. అశ్విన్ ఆడలేదు. ఇద్దరు కొత్త బౌలర్లు... మరొకరు పట్టుమని పది ఓవర్లు కూడా వేయకుండా తప్పుకున్నాడు. అయినా సరే... ‘గాబా’ మైదానంలో తొలి రోజు ఎక్కువ భాగం భారత జట్టు ప్రత్యర్థిపై పట్టును నిలబెట్టుకుంది. ఆరంభంలో 17/2 వద్ద ఆ తర్వాత 213/5 వద్ద టీమిండియా ఆధిపత్యం స్పష్టంగా కని పించింది. అయితే అదే అనుభవలేమి కారణంగానే పట్టు సంపాదించాల్సిన చోట తడబడి కంగారూలను పూర్తిగా కుప్పకూల్చే అవకాశం టీమిండియాకు చేజారింది. లబ్‌షేన్ ఆదుకోవడంతో కీలకదశలో కోలుకున్న ఆస్ట్రేలియా సంతృప్తికర స్కోరు వద్ద తొలి రోజు ఆటను ముగించింది. రెండో రోజు మన బౌలర్లు మరింత మెరుగైన ప్రదర్శన కనబర్చి మిగిలిన ఐదు వికెట్లను త్వరగా పడగొడతారా? లేక ఆసీస్ భారీ స్కోరు సాధిస్తుందా అనేది ఆసక్తికరం. బ్రిస్బేన్: బోర్డర్–గావస్కర్ ట్రోఫీ ఫలితాన్ని తేల్చే చివరి టెస్టు మ్యాచ్‌ను తమకు అచ్చొచ్చిన మైదానంలో ఆతిథ్య జట్టు ఆత్మవిశ్వాసంతో ప్రారంభించింది. భారత్‌తో శుక్రవారం మొదలైన నాలుగో టెస్టులో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 87 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. మార్నస్ లబ్‌షేన్ (204 బంతుల్లో 108; 9 ఫోర్లు) కెరీర్లో ఐదో సెంచరీ సాధించాడు. ప్రస్తుతం కెప్టెన్ టిమ్ పైన్ (62 బంతుల్లో 38 బ్యాటింగ్; 5 ఫోర్లు), కామెరాన్ గ్రీన్ (70 బంతుల్లో 28 బ్యాటింగ్; 3 ఫోర్లు) క్రీజ్‌లో ఉన్నారు. వీరిద్దరు ఆరో వికెట్‌కు అజేయంగా 61 పరుగులు జోడించారు. భారత బౌలర్లలో నటరాజన్‌కు 2 వికెట్లు దక్కాయి. ఓపెనర్ల వైఫల్యం... ఆస్ట్రేలియాకు ఓపెనర్లు కలిసిరాక మరోసారి పేలవ ఆరంభం లభించింది. ఫిట్‌గా లేకపోయినా వరుసగా రెండో టెస్టులో తప్పనిసరి పరిస్థితుల్లో బరిలోకి దిగిన డేవిడ్ వార్నర్ (1) మొదటి ఓవర్లోనే వెనుదిరిగాడు. హైదరాబాద్ పేసర్ సిరాజ్ వేసిన బంతికి వార్నర్ ఇచ్చిన క్యాచ్‌ను రెండో స్లిప్‌లో రోహిత్ శర్మ అద్భుతంగా అందుకున్నాడు. గత ఐదు ఫస్ట్ క్లాస్ ఇన్నింగ్స్‌లలో ఒక్క అర్ధ సెంచరీ చేయకపోయినా... చివరి నిమిషంలో టెస్టు అవకాశం దక్కించుకున్న మార్కస్ హారిస్ (5)ను శార్దుల్ తన తొలి బంతికి పెవిలియన్ పంపించాడు. ఈ దశలో లబ్‌షేన్, స్టీవ్ స్మిత్ (77 బంతుల్లో 36; 5 ఫోర్లు) కలిసి జట్టును ఆదుకున్నారు. వీరిద్దరు భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొని పరుగులు రాబట్టడంతో లంచ్ వరకు ఆసీస్‌కు ఎలాంటి ఇబ్బందీ ఎదురు కాలేదు. ముఖ్యంగా శార్దుల్ బౌలింగ్‌లో స్మిత్ దూకుడు ప్రదర్శించాడు. అతను కొట్టిన ఐదు ఫోర్లూ శార్దుల్ బౌలింగ్‌లోనే రావడం విశేషం. అయితే రెండో సెషన్లో స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ వేసిన చక్కటి బంతిని నేరుగా షార్ట్ మిడ్ వికెట్ ఫీల్డర్ చేతుల్లోకి కొట్టి స్మిత్ అవుటయ్యాడు. ఇది సుందర్‌కు తొలి టెస్టు వికెట్ కావడం విశేషం. ఈ దశలో మరోసారి భారత్‌దే పైచేయిగా కనిపించింది. శతక భాగస్వామ్యం... రెండుసార్లు క్యాచ్‌లు వదిలేయడంతో బతికిపోయిన లబ్‌షేన్ 145 బంతుల్లో తన అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరో వైపు మాథ్యూ వేడ్ (87 బంతుల్లో 45; 6 ఫోర్లు) నుంచి అతనికి చక్కటి సహకారం లభించింది. వీరిద్దరు కొన్ని చక్కటి షాట్లతో చకచకా పరుగులు సాధించారు. శార్దుల్ వరుస ఓవర్లలో ఇద్దరు బ్యాట్స్‌మెన్ చెరో రెండు ఫోర్లు కొట్టారు. 100 పరుగులు జోడించిన ఈ జంటను విడదీసేందుకు భారత్ తీవ్రంగా ప్రయత్నించినా లాభం లేకపోగా... చివరకు వేడ్ తానే ఒక చెత్త షాట్‌తో వికెట్ సమర్పించుకున్నాడు. నటరాజన్ బౌలింగ్‌లో బంతిని గాల్లోకి లేపిన వేడ్ మిడాన్‌లో సునాయాస క్యాచ్ ఇచ్చాడు. ఇది నటరాజన్ మొదటి టెస్టు వికెట్. 195 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న లబ్‌షేన్‌ను తన తర్వాతి ఓవర్లోనే అవుట్ చేసి నటరాజన్ భారత్‌ను మళ్లీ ముందంజలో నిలిపాడు. అయితే పైన్, గ్రీన్ పట్టుదలగా ఆడటంతో భారత్‌కు పూర్తిగా పట్టు చిక్కలేదు. తడబాటు లేకుండా టీమిండియా బౌలింగ్‌ను ఎదుర్కొని మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడిన వీరిద్దరు కొత్త బంతితో ఆరు ఓవర్ల పాటు ఎలాంటి ప్రమాదం లేకుండా ముగించగలిగారు. ఐదుగురు బౌలర్లు... 3 1/4 మ్యాచ్‌ల అనుభవం! బ్రిస్బేన్‌లో తుది ఫలితం ఎలా ఉంటుందో కాస్త మరచిపోండి! ఇప్పుడు భారత జట్టు మ్యాచ్ గెలుస్తుందా లేదా అనేది కూడా అనవసరం! అంకెల్లో కనిపించే విజయాన్ని కాస్త పక్కన పెట్టి చూస్తే చివరి టెస్టులో తొలి బంతి పడటానికి ముందే భారత్ మనసుల్ని గెలిచేసింది! మొదటి రోజు భారత జట్టు బౌలింగ్ ప్రదర్శన, ప్రత్యర్థిని వారి సొంతగడ్డపై కట్టడి చేసిన తీరును ఎవరైనా ప్రశంసించకుండా ఉండలేరు. టెస్టు ఆరంభానికి ముందు సిరాజ్ అనుభవం 2 మ్యాచ్‌లు, సైనీ 1 మ్యాచ్, శార్దుల్ ఒక పూర్తి మ్యాచ్ కూడా కాదు (ఏకైక టెస్టులో అతను వేసినవి 10 బంతులే), ఇద్దరు అరంగేట్రం ఆటగాళ్లు. ఆ మాటకొస్తే సిరీస్‌కు ముందు ఒక్కరి ఖాతాలో ఒక్క వికెట్ కూడా లేదు. భారత్ టెస్టుల్లో అడుగు పెట్టినప్పుడు తప్ప ఇలా ఎప్పుడూ జరగలేదు! ఎప్పుడో 1946లో లార్డ్స్ టెస్టు ఆరంభానికి ముందు మాత్రం భారత జట్టులో అందరు బౌలర్లు కలిపి తీసిన వికెట్లు ఐదు ఉండగా... ఇన్నేళ్లకు ఈ మ్యాచ్‌కు ముందు కొంత మెరుగ్గా మన టాప్–5 కలిపి తీసినవి 11 వికెట్లే! ఆసీస్ తుది జట్టులోని ఆటగాళ్లంతా కలిసి టెస్టుల్లో తీసిన వికెట్లు ఏకంగా 1033! ఇలాంటి ఐదుగురి బృందం ఆస్ట్రేలియాను బెదరగొట్టింది. మధ్యలో కొంత పట్టు చేజారినా... ఈ బౌలింగ్‌కు అనుభవం లేకపోవడం జట్టుకు బలహీనతగా మారుతుందనే మాటను ఏ దశలో కూడా చెప్పే సాహసం ఎవరూ చేయలేకపోయారు. రెండు టెస్టుల క్రితం అరంగేట్రం చేసిన బౌలర్ ఇప్పుడు తానే బృంద సారథిగా ‘జూనియర్లకు’ సూచనలిస్తూ కనిపించాడు. వార్నర్‌ను సిరాజ్ అవుట్ చేసిన బంతి ఇన్నింగ్స్‌లో హైలైట్‌గా నిలిచింది. నటరాజన్ తాను యార్కర్ స్పెషలిస్ట్‌ను మాత్రమే కాదని, తన బౌలింగ్‌లో మరిన్ని అస్త్రాలు ఉన్నాయని నిరూపించగా, శార్దుల్ కూడా తొలి బంతికే వికెట్ తీసి సంబరాల్లో భాగమయ్యాడు. లబ్‌షేన్ క్యాచ్‌ను రహానే పట్టి ఉంటే సైనీ ఖాతాలో కూడా కీలక వికెట్ చేరేది. ఇక సుందర్ అయితే తన సీనియర్ అశ్విన్ నుంచి పాఠాలు నేర్చుకున్నట్లుగా స్మిత్‌ను పడగొట్టాడు. వరుసగా మూడు మెయిడిన్ల తర్వాత ఒక తెలివైన బంతితో స్మిత్‌ను అతను బోల్తా కొట్టించాడు. గత కొన్నేళ్లలో భారత జట్టు చిరస్మరణీయ విజయాల భారం మోసిన స్టార్ పేసర్లు ఇషాంత్, షమీ, బుమ్రా, ఉమేశ్ (అశ్విన్ కూడా) లేకుండా ఆస్ట్రేలియా గడ్డపై భారత జట్టు టెస్టు ఆడుతుండటమే ఒక విశేషమైతే... ఆసీస్ బ్యాట్స్‌మెన్ తడబడేలా చేసి వారిని నిలువరించిన తీరు అభినందనీయం. ఇంకా చెప్పాలంటే ఈ బౌలర్ల నేపథ్యాలు కూడా వారిపై గౌరవాన్ని పెంచుతాయి. ఆటోడ్రైవర్ కొడుకు ఒకరు... బస్సు డ్రైవర్ కొడుకు మరొకరు.. తల్లి కూరగాయలు అమ్మగా వచ్చిన మొత్తంతో జీవితాన్ని సాగించింది ఒకరైతే... తన పేద తండ్రి చదువు కోసం సహకరించిన వ్యక్తి పేరును (వాషింగ్టన్) తన పేరుగా పెట్టుకొని కృతజ్ఞత ప్రకటించింది మరొకరు. వీరంతా అంచనాలు, తమపై ఉంచిన నమ్మకానికి మించి మెరుగైన ప్రదర్శన కనబర్చారు. ఈ అవకాశాన్ని వృథా చేయకుండా బ్యాట్స్‌మెన్ కూడా సత్తా చాటితే జట్టుకు తిరుగుండదు. నటరాజన్ 300, సుందర్ 301 మెల్బోర్న్ టెస్టు తరహాలోనే బ్రిస్బేన్ టెస్టులోనూ భారత్ నుంచి ఇద్దరికి అరంగేట్రం చేసే అవకాశం లభించింది. భారత్ తరఫున టెస్టు మ్యాచ్‌లు ఆడిన 300వ ఆటగాడిగా లెఫ్టార్మ్ పేసర్ నటరాజన్... 301వ ఆటగాడిగా ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ నిలిచారు. ఇద్దరూ తమిళనాడు ఆటగాళ్లే కావడం విశేషం. నటరాజన్‌కు బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్... సుందర్‌కు సీనియర్ బౌలర్ అశ్విన్ క్యాప్‌లు అందజేశారు. ఒకే పర్యటనలో మూడు ఫార్మాట్లలో కూడా అరంగేట్రం చేసిన తొలి భారత ఆటగాడిగా నటరాజన్ నిలిచాడు. అంతర్జాతీయ క్రికెట్లో తొలి మ్యాచ్ ఆడిన 44 రోజుల వ్యవధిలోనే అతను ఈ ఘనతను సాధించడం చెప్పుకోదగ్గ అంశం. సైనీకి గాయం భారత జట్టు గాయాల జాబితాలో మరొకరు చేరారు. పేసర్ నవదీప్ సైనీ 7.5 ఓవర్లు బౌలింగ్ చేసిన తర్వాత గజ్జల్లో గాయంతో బౌలింగ్ నుంచి తప్పుకున్నాడు. అతడిని స్కానింగ్ కోసం తీసుకు వెళ్లినట్లు ప్రకటించిన బీసీసీఐ... గాయం తాజా పరిస్థితిపై ఇంకా ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. మూడు క్యాచ్‌లు నేలపాలు... కీలకదశలో భారత్ వదిలేసిన మూడు క్యాచ్‌లు ఆసీస్‌కు కలిసొచ్చాయి. ముఖ్యంగా సెంచరీ హీరో లబ్‌షేన్‌కు 37, 48 పరుగుల వద్ద రెండు లైఫ్‌లు వచ్చాయి. మొదటిసారి సైనీ బౌలింగ్‌లో గల్లీలో కెప్టెన్ రహానే సులువైన క్యాచ్ వదిలేయగా... రెండోసారి కొంత కష్టసాధ్యమైన క్యాచ్‌ను పుజారా జారవిడిచాడు. నటరాజన్ బౌలింగ్‌లో ఈ అవకాశం రాగా... పంత్ అత్యుత్సాహంతో మొదటి స్లిప్‌లోకి దూకి అక్కడే ఉన్న పుజారా ఏకాగ్రతను దెబ్బ తీశాడు. ఫలితంగా బంతి పుజారాకు అందలేదు. చివర్లో గ్రీన్ 19 పరుగుల వద్ద ఉన్నప్పుడు శార్దుల్ తన బౌలింగ్‌లోనే సునాయాసమైన రిటర్న్ క్యాచ్‌ను వదిలేశాడు. ఆరంభంలోనే లబ్‌షేన్ వెనుదిరిగితే పరిస్థితి ఎలా ఉండేదో! నాలుగు మార్పులతో... సిడ్నీ టెస్టులో ఆడిన బుమ్రా, అశ్విన్, జడేజా, విహారి గాయాల కారణంగా భారత తుది జట్టులో తప్పనిసరి మార్పులు చేయాల్సి వచ్చింది. నటరాజన్, సుందర్‌లతో పాటు శార్దుల్ ఠాకూర్, మయాంక్ అగర్వాల్ తుది జట్టులోకి వచ్చారు. తొలి రెండు టెస్టుల్లో వైఫల్యం తర్వాత స్థానం కోల్పోయిన మయాంక్ అగర్వాల్‌కు మరో అవకాశం దక్కింది. దురదృష్టవశాత్తూ ఈ పర్యటన ఆరంభం నుంచి జట్టుతో ఉంటున్న కుల్దీప్ యాదవ్ మాత్రమే ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండా వెనుదిరుగుతున్న ఏకైక ఆటగాడు కానున్నాడు. రెగ్యులర్ స్పిన్నర్‌గా జట్టులో ప్రాధాన్యతపరంగా అందరికంటే ముందుగానే ఉన్నా... కుల్దీప్ను తీసుకుంటే లోయర్ ఆర్డర్ బ్యాటింగ్ మరీ బలహీనపడిపోయే అవకాశం ఉండటంతో టీమ్ మేనేజ్మెంట్ సుందర్‌పై నమ్మకముంచింది. రెండేళ్ల క్రితం ఇదే ఆసీస్ పర్యటనలో సిడ్నీ టెస్టులో 5 వికెట్లు తీసి విదేశాల్లో మొదటి ప్రాధాన్యత కుల్దీప్కే అంటూ కోచ్ రవిశాస్త్రి ప్రశంసలు పొందిన బౌలర్‌కు ఇప్పటి వరకు మరో టెస్టు మ్యాచ్ ఆడే అవకాశమే దక్కలేదు! స్కోరు వివరాలు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: వార్నర్ (సి) రోహిత్ శర్మ (బి) సిరాజ్ 1; హారిస్ (సి) సుందర్ (బి) శార్దుల్ 5; లబ్‌షేన్ (సి) పంత్ (బి) నటరాజన్ 108; స్మిత్ (సి) రోహిత్ శర్మ (బి) సుందర్ 36; వేడ్ (సి) శార్దుల్ (బి) నటరాజన్ 45; గ్రీన్ (బ్యాటింగ్) 28; పైన్ (బ్యాటింగ్) 38; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (87 ఓవర్లలో 5 వికెట్లకు) 274 వికెట్ల పతనం: 1–4, 2–17, 3–87, 4–200, 5–213. బౌలింగ్: సిరాజ్ 19–8–51–1, నటరాజన్ 20–2–63–2, శార్దుల్ ఠాకూర్ 18–5–67–1, నవదీప్ సైనీ 7.5–2–21–0, వాషింగ్టన్ సుందర్ 22–4–63–1, రోహిత్ శర్మ 0.1–0–1–0. –సాక్షి క్రీడావిభాగం -
జోరు ఎవరిదో!
జొహన్నెస్‌బర్గ్: గత వారం రోజులుగా బాల్ ట్యాంప రింగ్ వివాదంతో వార్తల్లో నిలిచిన ఆస్ట్రేలియా... దక్షిణాఫ్రికా సిరీస్‌లో చివరి మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. వాండరర్స్ మైదానంలో శుక్రవారం మొదలయ్యే నాలుగో టెస్టు ‘డ్రా’ చేసుకుంటే దక్షిణాఫ్రికా సొంతగడ్డపై 1970 తర్వాత ఆస్ట్రేలియాపై సిరీస్ దక్కించుకుంటుంది. ఇప్పటికే ఆతిథ్య జట్టు 2–1తో ముందంజలో ఉంది. బాల్ ట్యాంపరింగ్ వివాదంతో స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, బాన్‌క్రాఫ్ట్‌లు దూరమై ఆత్మస్థైర్యాన్ని కోల్పోయిన ఆసీస్ ఈ మ్యాచ్‌లో గెలిచి తమ అభిమానుల మనసులు గెలవాలని భావిస్తోంది. మరోవైపు మూడో టెస్టులో విజయం సాధించిన సఫారీలు అదే జోరు కొనసాగించాలని చూస్తున్నారు. ఈ మ్యాచ్ అనంతరం అంతర్జాతీయ క్రికెట్‌కు దూరం కానున్న మోర్నీ మోర్కెల్‌పై అందరి దృష్టి నిలవనుంది. -
కివీస్‌దే తొలి టెస్టు
18 నుంచి చివరి టెస్టు డ్యునెడిన్: శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో న్యూజిలాండ్ జట్టు 122 పరుగుల తేడాతో విజయం సాధించింది. 405 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌కు దిగిన లంక సోమవారం చివరి రోజు మిగిలిన ఏడు వికెట్లు కోల్పోయి 95.2 ఓవర్లలో 282 పరుగులు మాత్రమే చేయగలిగింది. చండిమాల్ (132 బంతుల్లో 58; 11 ఫోర్లు), కుశాల్ మెండిస్ (150 బంతుల్లో 46; 5 ఫోర్లు) మాత్రమే రాణించారు. 109/3 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన లంక చేతిలో ఏడు వికెట్లున్నా మ్యాచ్‌ను కనీసం డ్రా చేసుకునేందుకైనా పోరాడలేకపోయింది. సౌతీకి మూడు, బౌల్ట్, సాట్నర్, వాగ్నర్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. గప్టిల్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. రెండు టెస్టుల సిరీస్‌లో కివీస్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. 18 నుంచి హామిల్టన్‌లో చివరి టెస్టు జరుగుతుంది. -
సచిన్ ఆత్మకథ తెలుగులో...
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఆత్మకథ ‘ప్లేయింగ్ ఇట్ మై వే’ తెలుగులో అందుబాటులోకి వచ్చింది. సచిన్ జీవితంలో బాల్యం నుంచి ఆఖరి టెస్టు దాకా అనేక విశేషాలతో గత ఏడాది ఇంగ్లిష్‌లో విడుదలైన ఈ పుస్తకం పెను సంచలనం సృష్టించింది. బొరియా మజుందార్ రాసిన పుస్తకాన్ని తెలుగులో హేమలత అనువదించారు. 450 పేజీల ఈ పుస్తకం ధర రూ.495. అన్ని ప్రముఖ పుస్తక షాపులలో అందుబాటులో ఉంది. -
ఉఫ్... హమ్మయ్య!
ఊహించినట్లుగానే ఆస్ట్రేలియా ఐదో రోజు ఉదయాన్నే 349 పరుగుల లక్ష్యంతో భారత్‌ను బ్యాటింగ్‌కు పిలిచింది. తొలి రెండు సెషన్లు విరాట్ అండ్ కో ఆచితూచి ఆడి 57 ఓవర్లలో 2 వికెట్లకు 160 పరుగులు చేసి టీ విరామానికి వెళ్లారు. ఇక్కడి నుంచి హై డ్రామా మొదలైంది. ఓ పావుగంట పాటు విజయ్ దడదడలాడించి భారత్ విజయం కోసం ఆడబోతోందని స్పష్టం చేశాడు. ఇక్కడే ఆస్ట్రేలియా బౌలర్లు సత్తా చూపించారు. టపటపా వికెట్లతో భారత్‌ను బెంబేలెత్తించారు. ఫలితం... 217/7. రహానే తప్ప అశ్విన్‌తో సహా ప్రధాన బ్యాట్స్‌మెన్ అంతా పెవిలియన్‌లో కూర్చున్నారు. విజయం సంగతి దేవుడెరుగు. 12 ఓవర్ల పాటు మూడు వికెట్లు పడకుండా కాపాడుకోవాలి. హైడ్రామాలకు పెట్టింది పేరైన సిడ్నీలో ఒక్కసారిగా అందరిలోనూ 2008 తలంపులు. క్లార్క్ ఆఖరి ఓవర్లో మూడు వికెట్లు తీసి మ్యాచ్‌ను భారత్ నుంచి లాగేసిన వైనం పదే పదే గుర్తొస్తోంది. ఓవైపు స్మిత్ కొత్త బంతి తీసుకుని ఎదురుదాడి మొదలుపెట్టాడు. రహానేకు జతగా భువనేశ్వర్... ప్రతి బంతికీ ఉత్కంఠ. ఉఫ్... హా... అయ్యో... ఇలాంటి నిట్టూర్పులు. మొత్తంమీద చివరి గంటలో సిడ్నీలో నరాలు తెగే ఉత్కంఠ. ఈ ఒత్తిడిని రహానే, భువనేశ్వర్ అద్భుతంగా అధిగమించారు. చుట్టూ ఫీల్డర్లు మోహరించినా... ధైర్యంగా మరో వికెట్ పడకుండా పోరాడి భారత్‌ను గట్టెక్కించారు. ఫలితంగా నాలుగు టెస్టుల సిరీస్‌లో ఆసీస్ ఆధిక్యం 2-0కు మించి పెరగకుండా చూశారు. సిడ్నీ: సమయానుకూలంగా ఆటతీరును మార్చుకుంటూ పోరాట స్ఫూర్తిని చూపెట్టిన భారత్ జట్టు... ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్టును డ్రాగా ముగించింది. చివరి సెషన్లో టపటపా వికెట్లు పడినా.. రహానే (38 నాటౌట్), భువనేశ్వర్ (20 నాటౌట్) సహనంతో బ్యాటింగ్ చేసి జట్టును గట్టెక్కించారు. సిడ్నీ మైదానంలో శనివారం ముగిసిన ఈ మ్యాచ్‌లో... 349 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 89.5 ఓవర్లలో 7 వికెట్లకు 252 పరుగులు చేసింది. విజయ్ (165 బంతుల్లో 80; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), కోహ్లి (95 బంతుల్లో 46; 3 ఫోర్లు), రోహిత్ (90 బంతుల్లో 39; 2 ఫోర్లు, 2 సిక్సర్లు)లు రాణించారు. స్టార్క్, లయోన్, హాజెల్‌వుడ్ తలా రెండు వికెట్లు తీశారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 251/6 వద్దే ఆసీస్ తమ రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. స్మిత్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’; ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు దక్కాయి. భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్ల మధ్య ముక్కోణపు వన్డే టోర్నీ 16 నుంచి జరుగుతుంది. స్కోరు వివరాలు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 572/7 డిక్లేర్డ్ భారత్ తొలి ఇన్నింగ్స్: 475 ఆలౌట్ ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: 251/6 డిక్లేర్డ్ భారత్ రెండో ఇన్నింగ్స్: విజయ్ (సి) హాడిన్ (బి) హాజెల్‌వుడ్ 80; రాహుల్ (సి) వార్నర్ (బి) లయోన్ 16; రోహిత్ (సి) స్మిత్ (బి) వాట్సన్ 39; కోహ్లి (సి) వాట్సన్ (బి) స్టార్క్ 46; రహానే నాటౌట్ 38; రైనా ఎల్బీడబ్ల్యూ (బి) స్టార్క్ 0; సాహా ఎల్బీడబ్ల్యూ (బి) లయోన్ 0; అశ్విన్ ఎల్బీడబ్ల్యూ (బి) హాజెల్‌వుడ్ 1; భువనేశ్వర్ నాటౌట్ 20; ఎక్స్‌ట్రాలు: 12; మొత్తం: (89.5 ఓవర్లలో 7 వికెట్లకు) 252. వికెట్ల పతనం: 1-48; 2-104; 3-178; 4-201; 5-203; 6-208; 7-217 బౌలింగ్: స్టార్క్ 19-7-36-2; హారిస్ 13-3-34-0; లయోన్ 30.5-5-110-2; హాజెల్‌వుడ్ 17-7-31-2; స్మిత్ 2-0-7-0; వాట్సన్ 8-2-22-1 సెషన్-1: విజయ్ జోరు లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన విజయ్, లోకేశ్ రాహుల్ (16) నెమ్మదిగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. కొత్త బంతిని ఆచితూచి ఆడటంతో తొలి ఏడు ఓవర్లలో కేవలం 9 పరుగులు మాత్రమే చేశారు. పిచ్ స్పిన్‌కు అనుకూలంగా ఉండటంతో ఆరో ఓవర్లోనే లయోన్‌కు స్మిత్ బంతి అప్పగించాడు. అయితే పదో ఓవర్లో విజయ్ చెలరేగి 16 పరుగులు రాబట్టడంతో భారత్ స్కోరు కాస్త వేగంగా కదిలింది. కానీ రెండో ఎండ్‌లో బాగా ఇబ్బందిపడ్డ రాహుల్ 14వ ఓవర్లో లయోన్ బంతిని వార్నర్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. దీంతో తొలి వికెట్‌కు 48 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఈ దశలో వచ్చిన రోహిత్ ఎదుర్కొన్న తొలి బంతికే స్టంప్ అవుటయ్యే అవకాశం నుంచి తప్పించుకున్నాడు. తర్వాత 6.4 ఓవర్ల వరకు ఒక్క పరుగు కూడా చేయలేకపోయాడు. చివరకు 24వ ఓవర్లో ఓ భారీ సిక్స్, బౌండరీతో గాడిలో పడ్డాడు. తర్వాత ఈ జోడి లంచ్ వరకు ఎలాంటి తడబాటు లేకుండా ఆడింది. ఓవర్లు: 29; పరుగులు: 73; వికెట్లు: 1 సెషన్-2 : కోహ్లి నిలకడ లంచ్ తర్వాత విజయ్, రోహిత్ నిలకడగా ఆడినా భారీ భాగస్వామ్యాన్ని మాత్రం నమోదు చేయలేకపోయారు. విరామం తర్వాత 9వ ఓవర్లో రోహిత్ ఇచ్చిన క్యాచ్‌ను స్లిప్‌లో డైవ్ చేస్తూ స్మిత్ ఒంటిచేత్తో అద్భుతంగా అందుకున్నాడు. విజయ్, రోహిత్ రెండో వికెట్‌కు 56 పరుగులు జోడించారు. తర్వాత వచ్చిన కోహ్లి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఇన్నింగ్స్‌ను సాఫీగా నడిపించాడు. దీంతో భారత్ 37వ ఓవర్లో వంద పరుగులకు చేరుకుంది. అయితే 42 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద విజయ్ ఇచ్చిన క్యాచ్‌ను షార్ట్ కవర్లో మార్ష్ వదిలేశాడు. తర్వాతి ఓవర్లోనే మరోసారి ఎల్బీ నుంచి తప్పించుకున్నాడు. విజయ్ అవుటైనట్లు రీప్లేలో స్పష్టమైనా అంపైర్ సంతృప్తి చెందలేదు. కొద్దిసేపటికే విజయ్ 135 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ సిరీస్‌లో అతనికిది నాలుగోది. ఈ జోడి నిలకడతో భారత్ 160/2 స్కోరుతో టీకి వెళ్లింది. ఓవర్లు: 28; పరుగులు: 87; వికెట్లు: 1 సెషన్-3: బౌలర్ల హవా ఇక చివరి సెషన్లో భారత్ గెలవాలంటే 189 పరుగులు చేయాలి. చేతిలో ఎనిమిది వికెట్లున్నాయి. క్రీజులో ఉన్న విజయ్, కోహ్లి మంచి జోరుమీదున్నారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలనుకున్న టీమిండియాకు ఆసీస్ బౌలర్లు ఊహించని షాక్ ఇచ్చారు. నిలకడగా ఆడుతున్న విజయ్ను 61వ ఓవర్లో హాజెల్‌వుడ్ బోల్తా కొట్టించాడు. దీంతో మూడో వికెట్‌కు 74 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. అప్పుడే వచ్చిన రహానే కుదురుకునేందుకు కాస్త సమయం తీసుకున్నాడు. కానీ భారత్ స్కోరు 200లకు చేరిన వెంటనే కోహ్లి, ఆ తర్వాత స్వల్ప వ్యవధిలో రైనా (0), సాహా (0)లు వెనుదిరి గారు. ఓవరాల్‌గా 7 పరుగుల వ్యవధిలో మూడు వికెట్లు చేజార్చుకోవడంతో భారత్ గెలుపుపై ఆశలు వదిలేసుకుంది. ఇక మ్యాచ్‌ను కాపాడే బాధ్యత రహానేపై పడింది. అశ్విన్‌తో కలిసి 7.1 ఓవర్లు బ్యాటింగ్ చేసి కేవలం 9 పరుగులు జోడించారు. అయితే 79వ ఓవర్లో అశ్విన్ అవుట్ కావడంతో భారత్ శిబిరంలో ఆందోళన మొదలైంది. ఈ దశలో భువనేశ్వర్ ఆపద్బాంధవుడి పాత్ర పోషించాడు. అత్యంత కీలకమైన 69 బంతులను ఓర్పుతో ఎదుర్కొన్న ఈ జంట ఎనిమిదో వికెట్‌కు అజేయంగా 35 పరుగులు జోడించి మ్యాచ్‌ను డ్రాగా ముగించింది. ఓవర్లు: 32.5; పరుగులు: 92; వికెట్లు: 5 3113 నాలుగు టెస్టుల్లో కలిపి ఆసీస్ చేసిన పరుగులు. గతంలో దక్షిణాఫ్రికా 2962 పరుగుల రికార్డును స్మిత్ సేన అధిగమించింది. 692 ఈ సిరీస్‌లో కోహ్లి చేసిన పరుగులు. ఆసీస్‌లో ఒక సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన తొలి భారత బ్యాట్స్‌మన్‌గా రికార్డులకెక్కాడు. కానీ ఏ సిరీస్‌లోనైనా ఎక్కువ పరుగులు చేసిన రెండో బ్యాట్స్‌మన్ విరాట్. గతంలో గవాస్కర్ రెండుసార్లు విండీస్‌పై 700కు పైగా పరుగులు చేశాడు. 482 ఈ సిరీస్‌లో మురళీ విజయ్ చేసిన పరుగులు. ఆస్ట్రేలియాలో భారత్ తరఫున ఓపెనింగ్ బ్యాట్స్‌మన్‌కు ఇదే అత్యధికం. 2 గత 20 ఏళ్లలో సిడ్నీలో డ్రా అయిన టెస్టుల సంఖ్య. ఈ కాలంలో 22 టెస్టులు ఆడితే ఆసీస్ 17 గెలవగా, మూడింటిలో ఓడింది. 5 చివరి ఏడు ఇన్నింగ్స్‌ల్లో రైనా ఐదుసార్లు డకౌటయ్యాడు. అలాగే మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో డకౌట్ కావడం ఇది రెండోసారి. 2011 ఓవల్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో డకౌట్ అయ్యాడు. ఓటమంటే నాకు అసహ్యం. పోటీ ఇవ్వడానికే ఇక్కడికి వచ్చాం. ప్రత్యర్థులు ఈ విషయాన్ని గ్రహించి మాకు సరైన గౌరవం ఇవ్వాలి. కుర్రాళ్లమని తేలికగా తీసిపారేయకూడదు. అలా ఆలోచించడం వారికే మంచిదికాదు. మేం ప్రపంచకప్‌ను గెలవబోతున్నాం. ఆ నమ్మకం మాకుంది. ఆసీస్‌లో మేం మంచి క్రికెట్ ఆడాం. ఈ అనుభవం మాకు వరల్డ్‌కప్‌లో ఉపయోగపడుతుంది. అంతర్జాతీయ స్థాయిలో బౌలింగ్ ఎలా చేయాలో ఆసీస్‌ను చూసి నేర్చుకోవాలి. నేను అవుటయ్యే వరకు విజయం కోసం ప్రయత్నించి చూడాలనుకున్నాం. మా ఆటగాళ్లు కూడా బాగా ఆడారు. బ్యాటింగ్, బౌలింగ్‌లో ఇంకా నిలకడ రావాలి. మాటల యుద్ధం సహజం. కానీ ప్రత్యర్థులు మమ్మల్ని గౌరవించడం నేర్చుకోవాలి. సిరీస్‌లో ఓడినా వ్యక్తిగతంగా నాకు సానుకూల ఫలితాన్నే ఇచ్చింది. నాపై నమ్మకం ఉంది కాబట్టి ఎక్కువగా ఒత్తిడి తీసుకోలేదు. ఇక టెస్టులను మర్చి వన్డేలపై దృష్టిపెడతాం. -కోహ్లి (భారత కెప్టెన్) ఈ సిరీస్‌లో 20 వికెట్లు తీయడం చాలా కష్టంగా మారింది. మేం ఊహించిన విధంగా పిచ్‌లు లేవు. లేకపోతే సిరీస్‌ను ఇంకా మెరుగైన ఆధిక్యంతో గెలిచేవాళ్లం. నాలుగు టెస్టుల్లో బౌలర్లు బాగా కష్టపడ్డారు. ఐదో రోజు భారత్‌ను ఆలౌట్ చేయకపోవడం కాస్త నిరాశ కలిగించింది. గెలిచి ఉంటే బాగుండేది. లయోన్ కొన్ని అవకాశాలను సృష్టించినా వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయాం. బావోద్వేగాల మధ్య ఈ సిరీస్ ఆడటం బాగా కష్టమైంది. అయినప్పటికీ సిరీస్ గెలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. కెప్టెన్సీని బాగా ఆస్వాదించా. అద్భుతమైన జట్టుకు నాయకత్వం వహించా. సీనియర్లు బాగా సహకరించారు. నేను కోరుకున్న విధంగా ఆటగాళ్లు రాణించారు. -స్మిత్ (ఆసీస్ కెప్టెన్) -
టెస్టు సిరీస్.. ఆస్ట్రేలియాదే!!
-
భారత్-ఆస్ట్రేలియా చివరి టెస్టు మ్యాచ్ డ్రా
-
హమ్మయ్యా..ఓటమి నుంచి బయట పడ్డారు!
సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరిగిన చివరి టెస్టు మ్యాచ్ లో టీమిండియా ఓటమి నుంచి బయట పడింది. శనివారం చివరి రోజు ఆటలో భాగంగా టీమిండియా అతికష్టం మీద గట్టెక్కింది. ఓ దశలో ఓటమి దిశగా పయనించిన టీమిండియాను అజ్యింకా రహానే, భువనేశ్వర్ జోడీ కాపాడింది. ఏడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న టీమిండియా మరో ఓటమి బారిన పడకుండా కాపాడి తమవంతు బాధ్యతను సమర్ధవంతంగా నిర్వర్తించారు. ఈ ఆఖరి మ్యాచ్ పై తొలుత ఇరు జట్లు గెలుపుపై ఆశలు పెట్టుకున్నాచివరకు డ్రాతో సరిపెట్టుకోక తప్పలేదు. 349 పరుగుల విజయలక్ష్యంతో శనివారం బ్యాటింగ్ ఆరంభించిన టీమిండియా ఆదిలో లక్ష్యం దిశగా పయనించినట్లు కనిపించింది. టీమిండియా ఓపెనర్ , గత ఇన్నింగ్స్ సెంచరీ హీరో కేఎల్ రాహుల్ (16)లు చేసి ఆదిలోనే పెవిలియన్ కు చేరాడు. ఆ సమయంలోమురళీ విజయ్ (80, రోహిత్ శర్మ(39) పరుగులు చేసి జట్టు పరిస్థితిని చక్కదిద్దారు. అనంతరం విరాట్ కోహ్లీ(46), సురేష్ రైనా(0), సాహా (0) వికెట్లను వరుసగా కోల్పోయిన టీమిండియా స్వల్ప వ్యవధిలో కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో ఆసీస్ కు మరో విజయానికి చేరువగా పయనించింది. కాగా అజ్యింకా రహానే తన మార్కు ఆటను ప్రదర్శించి ఆసీస్ అటాకింగ్ ను అడ్డుకున్నాడు.88 బంతులను ఎదుర్కొన్న రహానే ఐదు ఫోర్ల సాయంతో 38 పరుగులు చేసి నాటౌట్ గా మిగిలాడు. అతనికి జతగా భువనేశ్వర్ కుమార్ (20) పరుగులు చేసి టీమిండియా ఓటమిని అడ్డుకున్నాడు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్ , లయన్ లకు తలో రెండు వికెట్లు దక్కగా, హజిల్ వుడ్ లకు తలో రెండు వికెట్లు దక్కగా వాట్సన్ వికెట్ లభించింది. ఇప్పటికే రెండు టెస్టులను గెలిచిన ఆస్ట్రేలియా సిరీస్ ను కైవశం చేసుకున్న సంగతి తెలిసిందే. అడిలైడ్, బ్రిస్బేన్ టెస్టుల్లో ఆసీస్ గెలవగా.. మెల్ బోర్న్, సిడ్నీ టెస్టులు మాత్రం డ్రాగా ముగిశాయి. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ 572/7 డిక్లేర్, రెండో ఇన్నింగ్స్ 251/6 డిక్లేర్ భారత తొలి ఇన్నింగ్స్ 475, రెండో ఇన్నింగ్స్ 252/7 -
ఏడో వికెట్ కోల్పోయిన టీమిండియా(217/7)
సిడ్నీ: ఆస్ట్రేలియా తో జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా రెండో ఇన్నింగ్స్ లో 217 పరుగుల వద్ద ఏడో వికెట్ ను కోల్పోయింది.22 బంతులను ఎదుర్కొన్న రవి చంద్రన్ అశ్విన్ ఒక పరుగు మాత్రమే చేసి ఏడో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. అంతకుముందు సాహా, సురేష్ రైనాలు డకౌట్లుగా పెవిలియన్ కు చేరారు. ఈ ఇన్నింగ్స్ లో మురళీ విజయ్ (80), విరాట్ కోహ్లీ(46), రోహిత్ శర్మ(39) పరుగుల మినహా ఎవరూ ఆకట్టుకోలేదు. -
ఆరో వికెట్ ను కోల్పోయిన టీమిండియా(208/6)
సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా 208 పరుగుల వద్ద ఆరో వికెట్ ను కోల్పోయింది. సాహా పరుగులేమీ చేయకుండానే ఆరో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. కనీసం డ్రా చేస్తుందనుకన్నఅభిమానికి టీమిండియా వరుస వికెట్లను చేజార్చుకోవడం మింగుడు పడటం లేదు. ఇంకా నాలుగు వికెట్లు మాత్రమే ఉన్న టీమిండియా విజయానికి 140 పరుగుల దూరంలో ఉంది. -
సురేష్ రైనా డకౌట్ల పరంపర
సిడ్నీ: టీమిండియా స్టార్ ఆటగాడు సురేష్ రైనా టెస్టుల్లో డకౌట్ల పరంపర కొనసాగిస్తున్నాడు. మహేంద్ర సింగ్ ధోనీ టెస్టుల నుంచి వైదొలగడంతో ఆస్ట్రేలియాతో జరిగే చివరి టెస్టు మ్యాచ్ లోకి వచ్చిన రైనా తన ఖాతాను ఇంకా ఆరంభించలేదు. తొలి ఇన్నింగ్స్ లో రెండు బంతులనే ఎదుర్కొన్న రైనా పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ చేరిన సంగతి తెలిసిందే. అయితే కీలకమైన రెండో ఇన్నింగ్స్ లో రైనా తన సత్తా చాటుతాడని అభిమానులు భావించారు. కాగా రైనా ఏమాత్రం తన శైలిని మార్చుకోకుండా మళ్లీ డకౌట్ గా వెనుదిరిగాడు. ఈ మ్యాచ్ లో ఆరు బంతులను ఎదుర్కొన్న రైనా తన ఫుట్ వర్క్ లో ఘోరంగా విఫలమయ్యాడు. -
ఐదో వికెట్ కోల్పోయిన టీమిండియా(203/5)
సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా రెండో ఇన్నింగ్స్ లో 203 పరుగుల వద్ద ఐదో వికెట్ ను కోల్పోయింది. సురేష్ రైనా డకౌట్ రూపంలో వెనుదిరిగాడు. అంతకుముందు కేఎల్ రాహుల్(16), రోహిత్ శర్మ(39), మురళీ విజయ్ (80), విరాట్ కోహ్లీ(46) పరుగులు చేసి పెవిలియన్ కు చేరారు. ఇంకా ఐదు వికెట్లు మాత్రమే చేతిలో ఉన్న టీమిండియా విజయానికి 146 పరుగుల దూరంలో ఉంది. -
నాల్గో వికెట్ కోల్పోయిన టీమిండియా(201/4)
సిడ్నీ: ఆస్ట్రేలియాతో ఇక్కడ జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా నాల్గో వికెట్ ను కోల్పోయింది. విరాట్ కోహ్లీ (46) పరుగుల వద్ద పెవిలియన్ కు చేరాడు. టీమిండియా స్కోరు 201 పరుగుల వద్ద ఉండగా కోహ్లీ అనవసరపు షాట్ కోసం యత్నించి వెనుదిరిగాడు .ప్రస్తుతం అజ్యింకా రహానే(10) పరుగులతో క్రీజ్ లో ఉన్నాడు. ఇంకా ఆరు వికెట్లు చేతిలో ఉన్న టీమిండియా విజయానికి 148 పరుగుల దూరంలో ఉంది. -
మూడో వికెట్ ను కోల్పోయిన టీమిండియా
సిడ్నీ: ఆస్ట్రేలియాతో ఇక్కడ జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ ఆఖరి రోజు ఆటలో టీమిండియా మూడో వికెట్ ను కోల్పోయింది. 349 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ను ఆరంభించిన టీమిండియా 178 పరుగుల వద్ద మూడో వికెట్ ను నష్టపోయింది. మురళీ విజయ్(80) పరుగులు చేసి మూడో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. ఇంకా ఏడు వికెట్లు ఉన్న టీమిండియా 171 పరుగులను ఛేదించాల్సి ఉంది. ప్రస్తుతం విరాట్ కోహ్లీ క్రీజ్ లో ఉన్నాడు. -
టీ విరామ సమయానికి టీమిండియా స్కోరు 160/2
సిడ్నీ: ఆస్ట్రేలియాతో ఇక్కడ చివరి టెస్ట్ మ్యాచ్ ఆఖరి రోజులో టీమిండియా టీ విరామ సమయానికి రెండు వికెట్లు కోల్పోయి 160 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. 349 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా కేఎల్ రాహుల్(16), రోహిత్ శర్మ(39) వికెట్లను కోల్పోయింది. ప్రస్తుతం మురళీ విజయ్- విరాట్ కోహ్లీల జోడీ టీమిండియాకు మరమ్మత్తులు చేపట్టారు. ఈ ఇరువురి ఆటగాళ్లు ఆచితూచి ఆడుతూ ముందుకు సాగుతున్నారు. మురళీ విజయ్ (71), విరాట్ కోహ్లీ(26) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. -
మురళీ విజయ్ హాఫ్ సెంచరీ(134/2)
సిడ్నీ:ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరిటెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా ఆటగాడు మురళీ విజయ్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. 135 బంతులను ఎదుర్కొన్న విజయ్ 3 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 50 పరుగులు పూర్తి చేశాడు. ప్రస్తుతం టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 134 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. 349 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఆదిలోనే కేఎల్ రాహుల్(16) వికెట్ తో పాటు, రోహిత్ శర్మ(39) వికెట్ ను కూడా నష్టపో్యింది. అనంతరం మురళీ విజయ్ - విరాట్ కోహ్లీల జోడి కుదురుగా ఆడుతోంది. -
48 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన భారత్
-
రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా
సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరిటెస్ట్ మ్యాచ్ లో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియా 104 పరుగుల వద్ద రెండో వికెట్ ను కోల్పోయింది. టీమిండియా ఆటగాడు రోహిత్ శర్మ (39) పరుగులు చేసి రెండో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. 349 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఆదిలోనే కేఎల్ రాహుల్(16) వికెట్ ను కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆసీస్ తన రెండో ఇన్నింగ్స్ లో ఆరువికెట్ల నష్టానికి 251 పరుగులు చేసిన అనంతరం డిక్లేర్ చేసింది. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 475 పరుగులకు ఆలౌటైంది. ఇప్పటికే సిరీస్ కోల్పోయిన టీమిండియా ఈ మ్యాచ్ ను గెలవాలిని భావిస్తోంది. -
సిడ్నీ: లంచ్ సమయానికి భారత్ స్కోరు: 73/1
సిడ్నీ: ఆస్ట్రేలియా-టీమిండియా జట్ల మధ్య శనివారమిక్కడ ఆరంభమైన చివరి టెస్టులో ఐదవ రోజు రెండవ ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ లంచ్ విరామ సమయానికి 29.0 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 73 పరుగులు చేసింది. 349 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఐదవ రోజున 13.2 ఓవర్లలో 48 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. భారత్ ఓపెనర్ ఆటగాడు కేఎల్ రాహుల్ (40 బంతుల్లో 16 ; 3ఫోర్లు)తో లయోన్ బౌలింగ్‌లో వార్నర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. గెలుపే లక్ష్యంగా సాగుతున్న భారత్ జట్టు తొలి వికెట్ కోల్పోవడంతో క్రికెట్ అభిమానులను నిరాశపరిచింది. అయితే రాహుల్ భాగస్వామ్యంతో బరిలోకి దిగిన మురళీ విజయ్ (77 బంతుల్లో 35; 2 ఫోర్లు, 1 సిక్స్)తో నాటౌట్‌గా క్రీజులో ఉన్నాడు . రోహిత్ శర్మ (57 బంతుల్లో 19; 1 ఫోర్, 1 సిక్స్) పరుగులతో క్రీజులో ఉన్నాడు. కాగా, ఆసీస్ బౌలర్ లయోన్ తొలి వికెట్ పడగొట్టాడు. ఆసీస్ నిర్దేశించిన లక్ష్యాన్ని చేధించాలంటే భారత్ ఇంకా 276 పరుగులు చేయాల్సివుంది. అంతకముందు ఆసీస్ సెకండ్ ఇన్నింగ్స్ ను 251/6 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. నాలుగో టెస్ట్ సెకండ్ ఇన్నింగ్స్‌లో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ ఆరు వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యంతో కలుపుకొంటే భారత జట్టుకు 349 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 162 ఓవర్లలో 475 పరుగులకు ఆలౌటైంది. -
48 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన భారత్
సిడ్నీ: ఆస్ట్రేలియా-టీమిండియా జట్ల మధ్య శనివారమిక్కడ ఆరంభమైన చివరి టెస్టులో ఐదవ రోజు రెండవ ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ 13.2 ఓవర్లలో 48 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. భారత్ ఓపెనర్ ఆటగాడు కేఎల్ రాహుల్ (40 బంతుల్లో 16 ; 3ఫోర్లు)తో లయోన్ బౌలింగ్‌లో వార్నర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. రాహుల్ భాగస్వామ్యంతో బరిలోకి దిగిన మురళీ విజయ్ (46 బంతుల్లో 29; 2 ఫోర్లు, 1 సిక్స్)తో నాటౌట్‌గా క్రీజులో కొనసాగుతున్నాడు. రోహిత్ శర్మ (0) పరుగులతో క్రీజులో ఉన్నాడు. కాగా, ఆసీస్ బౌలర్ లయోన్ తొలి వికెట్ పడగొట్టాడు. ప్రస్తుతం భారత్ 16.6 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 48 పరుగులతో కొనసాగుతోంది. అంతకముందు ఆసీస్ సెకండ్ ఇన్నింగ్స్ ను 251/6 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. నాలుగో టెస్ట్ సెకండ్ ఇన్నింగ్స్‌లో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ ఆరు వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యంతో కలుపుకొంటే భారత జట్టుకు 349 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 162 ఓవర్లలో 475 పరుగులకు ఆలౌటైంది. -
ఐదవ రోజు ఆట ఆరంభించిన భారత్; విజయలక్ష్యం 349
సిడ్నీ: ఆస్ట్రేలియా-టీమిండియా జట్ల మధ్య శనివారమిక్కడ ఆరంభమైన చివరి టెస్టులో ఐదవ రోజు భారత్ జట్టు రెండవ ఇన్నింగ్స్ ఆరంభించింది. ఐదవ రోజు ఆటలో మురళీ విజయ్, కేఎల్ రాహుల్ ఓపెనర్లగా బరిలోకి దిగి శుభారంభాన్నిచ్చారు. ప్రస్తుతం మురళీ విజయ్ (4), కేఎల్ రాహుల్ (5) పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత్ 8.2 ఓవర్లలో 17 పరుగులతో కొనసాగుతోంది. అయితే ఆసీస్ సెకండ్ ఇన్నింగ్స్ ను 251/6 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఆఖరి సెషన్లో ఆసీస్ బ్యాట్స్‌మెన్ వీరవిహారం చేశారు. కెప్టెన్ స్మిత్ (70 బంతుల్లో 71; 8 ఫోర్లు, 1 సిక్స్), జో బర్న్స్ (39 బంతుల్లో 66; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపులు మెరిపించడంతో శుక్రవారం ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 40 ఓవర్లలో 6 వికెట్లకు 251 పరుగులు చేసింది. హాడిన్ (31 బ్యాటింగ్), హారిస్ (0 బ్యాటింగ్) పరుగులు చేశారు. ఆతిథ్య జట్టు ఆసీస్ 349 పరుగుల ఆధిక్యాన్ని చేజిక్కించుకుంది. మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యంతో కలుపుకొంటే భారత జట్టుకు 349 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 162 ఓవర్లలో 475 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఆసీస్‌కు 97 పరుగుల ఆధిక్యం దక్కింది. కోహ్లి (230 బంతుల్లో 147; 20 ఫోర్లు)కి తోడు అశ్విన్ (111 బంతుల్లో 50; 6 ఫోర్లు), భువనేశ్వర్ (75 బంతుల్లో 30; 5 ఫోర్లు) ఆకట్టుకున్నారు. స్టార్క్‌కు 3 వికెట్లు దక్కాయి. -
251/6 పరుగుల వద్ద ఆసీస్ సెకండ్ ఇన్నింగ్స్ డిక్లేర్
సిడ్నీ: ఆస్ట్రేలియా-టీమిండియా జట్ల మధ్య శనివారమిక్కడ ఆరంభమైన చివరి టెస్టులో ఐదవ రోజు ఆసీస్ సెకండ్ ఇన్నింగ్స్ ను 251/6 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. నాలుగో టెస్ట్ సెకండ్ ఇన్నింగ్స్‌లో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ ఆరు వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. ఆతిథ్య జట్టు ఆసీస్ 349 పరుగుల ఆధిక్యాన్ని చేజిక్కించుకుంది. అంతకుముందు ఆఖరి సెషన్లో భారత బౌలర్ల వైఫల్యాన్ని అందిపుచ్చుకున్న ఆసీస్ బ్యాట్స్‌మెన్ వీరవిహారం చేశారు. కెప్టెన్ స్మిత్ (70 బంతుల్లో 71; 8 ఫోర్లు, 1 సిక్స్), జో బర్న్స్ (39 బంతుల్లో 66; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపులు మెరిపించడంతో శుక్రవారం ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 40 ఓవర్లలో 6 వికెట్లకు 251 పరుగులు చేసింది. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 162 ఓవర్లలో 475 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఆసీస్‌కు 97 పరుగుల ఆధిక్యం దక్కింది. కోహ్లి (230 బంతుల్లో 147; 20 ఫోర్లు)కి తోడు అశ్విన్ (111 బంతుల్లో 50; 6 ఫోర్లు), భువనేశ్వర్ (75 బంతుల్లో 30; 5 ఫోర్లు) ఆకట్టుకున్నారు. స్టార్క్‌కు 3 వికెట్లు దక్కాయి. -
గట్టెక్కుతారా!
మూడు రోజుల పాటు బ్యాట్స్‌మెన్ పండగ చేసుకున్న సిడ్నీ పిచ్‌పై నాలుగో రోజు అనూహ్యంగా బంతి తిరిగింది. అయినా ఆస్ట్రేలియా వన్డే తరహాలో ఆడి మ్యాచ్‌ని ఫలితం దిశగా తీసుకెళ్లింది. ఇప్పటికే 348 పరుగుల ఆధిక్యంలో ఉన్న స్మిత్ సేన ఇదే స్కోరు వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసి భారత్‌కు సవాల్ విసిరే అవకాశం ఉంది. అడిలైడ్‌లో జరిగిన తొలి టెస్టులో భారత లక్ష్యం 364... డ్రా చేసుకుంటే గొప్ప అనుకున్న మ్యాచ్‌లో కోహ్లి సేన విజయం కోసం ప్రయత్నించి ఓడిపోయింది. ఆ పిచ్‌తో పోలిస్తే ప్రస్తుతం సిడ్నీ పిచ్ మీద బంతి మరింత తిరుగుతోంది. అడిలైడ్‌లో స్పిన్నర్ లయోన్ ఏడు వికెట్లతో భారత్ పతనాన్ని శాసించాడు. ఇప్పుడూ లయోన్‌పై నమ్మకంతో ఆసీస్ జట్టు భారత్‌ను ఊరిస్తోంది. దూకుడు మంత్రం పఠించే కోహ్లి విజయం కోసం ప్రయత్నిస్తాడా? లేదా ఏదోలా రోజు లాగించి డ్రా చేసుకుంటారా? లేక స్పిన్ వికెట్‌పై లయోన్‌కు మ్యాచ్ అప్పగిస్తారా? సిడ్నీ అంటేనే సంచలనాలకు మారుపేరు. 2007-08 సిరీస్‌లోనూ సిడ్నీలో హై డ్రామా జరిగింది. డ్రా అవుతున్న మ్యాచ్‌లో ఆఖరి ఓవర్లో క్లార్క్ మూడు వికెట్లు తీసి ఆసీస్‌ను గెలిపించాడు. ఈసారి ఏం జరగబోతోంది? సిడ్నీ: నాలుగో టెస్టు నాలుగో రోజులో ఒకే ఒక్క సెషన్ మ్యాచ్‌ను తలకిందులు చేసింది. దీంతో అప్పటి దాకా డ్రా దిశగా వెళ్లిన మ్యాచ్‌లో ఇప్పుడు ఫలితం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆఖరి సెషన్లో భారత బౌలర్ల వైఫల్యాన్ని అందిపుచ్చుకున్న ఆసీస్ బ్యాట్స్‌మెన్ వీరవిహారం చేశారు. వన్డే తరహా ఆటతీరుతో ఓవర్‌కు ఆరుకుపైగా రన్‌రేట్‌తో పరుగుల వర్షం కురిపించారు. కెప్టెన్ స్మిత్ (70 బంతుల్లో 71; 8 ఫోర్లు, 1 సిక్స్), జో బర్న్స్ (39 బంతుల్లో 66; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపులు మెరిపించడంతో శుక్రవారం ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 40 ఓవర్లలో 6 వికెట్లకు 251 పరుగులు చేసింది. హాడిన్ (31 బ్యాటింగ్), హారిస్ (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. రోజర్స్ (77 బంతుల్లో 56; 7 ఫోర్లు) రాణించాడు. అశ్విన్‌కు 4 వికెట్లు దక్కాయి. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 162 ఓవర్లలో 475 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఆసీస్‌కు 97 పరుగుల ఆధిక్యం దక్కింది. కోహ్లి (230 బంతుల్లో 147; 20 ఫోర్లు)కి తోడు అశ్విన్ (111 బంతుల్లో 50; 6 ఫోర్లు), భువనేశ్వర్ (75 బంతుల్లో 30; 5 ఫోర్లు) ఆకట్టుకున్నారు. స్టార్క్‌కు 3 వికెట్లు దక్కాయి. ఓవరాల్‌గా ఆసీస్ ప్రస్తుతం 348 పరుగుల ఆధిక్యంలో ఉంది. స్కోరు వివరాలు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 572/7 డిక్లేర్డ్ భారత్ తొలి ఇన్నింగ్స్: విజయ్ (సి) హాడిన్ (బి) స్టార్క్ 0; రాహుల్(సి) అండ్ (బి) స్టార్క్ 110; రోహిత్ (బి) లయోన్ 53; కోహ్లి (సి) రోజర్స్ (బి) హారిస్ 147; రహానే ఎల్బీడబ్ల్యూ (బి) వాట్సన్ 13; రైనా (సి) హాడిన్ (బి) వాట్సన్0; సాహా (సి) స్మిత్ (బి) హాజెల్‌వుడ్ 35; అశ్విన్ (సి) హాడిన్ (బి) స్టార్క్ 50; భువనేశ్వర్ (సి) వాట్సన్ (బి) లయోన్ 30; షమీ నాటౌట్ 16; ఉమేశ్ (సి) హాడిన్ (బి) హారిస్ 4; ఎక్స్‌ట్రాలు: 17; మొత్తం: (162 ఓవర్లలో ఆలౌట్) 475. వికెట్ల పతనం: 1-0; 2-97; 3-238; 4-292; 5-292; 6-352; 7-383; 8-448; 9-456; 10-475 బౌలింగ్: స్టార్క్ 32-7-106-3; హారిస్ 31-7-96-2; హాజెల్‌వుడ్ 29-8-64-1; లయోన్ 46-11-123-2; వాట్సన్ 20-4-58-2; స్మిత్ 4-0-17-0. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: రోజర్స్ (సి) రైనా (బి) భువనేశ్వర్ 56; వార్నర్ (సి) విజయ్ (బి) అశ్విన్ 4; వాట్సన్ (బి) అశ్విన్ 16; స్మిత్ ఎల్బీడబ్ల్యూ (బి) షమీ 71; మార్ష్ (సి) విజయ్ (బి) అశ్విన్ 1; బర్న్స్ (సి) ఉమేశ్ (బి) అశ్విన్ 66; హాడిన్ బ్యాటింగ్ 31; హారిస్ బ్యాటింగ్ 0; ఎక్స్‌ట్రాలు: 6; మొత్తం: (40 ఓవర్లలో 6 వికెట్లకు) 251. వికెట్ల పతనం: 1-6; 2-46; 3-126; 4-139; 5-165; 6-251; బౌలింగ్: భువనేశ్వర్ 8-0-46-1; అశ్విన్ 19-2-105-4; షమీ 6-0-33-1; ఉమేశ్ 3-0-45-0; రైనా 4-0-18-0. సెషన్-1 నిలబడ్డ అశ్విన్ 342/5 ఓవర్‌నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆట కొనసాగించిన కోహ్లి, సాహా (35) ఎక్కువసేపు క్రీజులో నిలబడలేకపోయారు. వ్యక్తిగత స్కోరుకు మరో ఏడు పరుగులు జోడించి కెప్టెన్ అవుటయ్యాడు. అప్పటికీ భారత్ ఫాలోఆన్ మార్క్‌కు మరో 21 పరుగులు చేయాల్సి ఉంది. విరాట్, సాహా ఆరో వికెట్‌కు 60 పరుగులు జోడించారు. తర్వాత వచ్చిన అశ్విన్ ఏమాత్రం తడబడకుండా ఆడాడు. వీలైనంత ఎక్కువసేపు బ్యా టింగ్ చేసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఎక్కువగా సింగిల్స్ తీయడంతో స్కోరు బోర్డు నెమ్మదిగా కదిలింది. సాహా షార్ట్ పిచ్‌లను ఎదుర్కోవడంలో బాగా ఇబ్బందులుపడ్డాడు. చివరకు ఇన్నింగ్స్ 131వ ఓవర్లో హాజెల్‌వుడ్ వేసిన షార్ట్ బంతిని టచ్ చేసి స్లిప్‌లో స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఈ దశలో వచ్చిన భువనేశ్వర్.. అశ్విన్‌కు మంచి సహకారం అందించడంతో మరో వికెట్ పడకుండా లంచ్‌కు వెళ్లారు. ఓవర్లు: 29; పరుగులు: 65; వికెట్లు: 2 సెషన్-2 ఆకట్టుకున్న భువీ లంచ్ తర్వాత అశ్విన్, భువనేశ్వర్ క్రమంగా జోరు పెంచారు. ఆసీస్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ వేగంగా పరుగులు చేశారు. ఈ క్రమంలో ఆశించిన స్థాయిలో ఆధిక్యం తగ్గుముఖం పట్టినా ఊహించని రీతిలో భువీ అవుటయ్యాడు. వేగంగా దూసుకొచ్చిన లయోన్ బంతి భువనేశ్వర్ బ్యాట్‌ను తాకి స్లిప్‌లో వాట్సన్ చేతిలోకి వెళ్లింది. బంతి నేలకు తాకలేదని రీప్లేలో స్పష్టం కావడంతో థర్డ్ అంపైర్ అవుట్‌గా ప్రకటించారు. అశ్విన్, భువీ మధ్య ఎనిమిదో వికెట్‌కు 65 పరుగుల భాగస్వామ్యం నెలకొంది. షమీ (16 నాటౌట్)తో జత కలిసిన అశ్విన్ మరో ఐదు ఓవర్ల తర్వాత అవుట్‌కాగా, ఆ కొద్దిసేపటికే ఉమేశ్ (4) వెనుదిరిగాడు. ఓవరాల్‌గా భారత్ 27 పరుగుల తేడాతో చివరి మూడు వికెట్లు చేజార్చుకుంది. తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్‌ను రెండో ఓవర్లోనే వార్నర్ (4)ను అశ్విన్ అవుట్ చేశాడు. అయితే రోజర్స్, వాట్సన్ (16) నిలకడగా ఆడి టీకి వెళ్లారు. ఓవర్లు: 18; పరుగులు: 68; వికెట్లు: 3 (భారత్) ఓవర్లు: 6; పరుగులు: 38; వికెట్లు: 1 (ఆసీస్) సెషన్-3 స్మిత్, బర్న్స్ జోరు టీ తర్వాత భారత బౌలర్లు ఘోరంగా విఫలమయ్యారు. లైన్ అండ్ లెంగ్త్ తప్పడంతో భారీగా పరుగులు సమర్పించుకున్నారు. రనౌట్ నుంచి బయటపడిన వాట్సన్‌ను విరామం తర్వాత రెండో ఓవర్లోనే అశ్విన్ పెవిలియన్‌కు పంపాడు. ఈ దశలో వచ్చిన స్మిత్ ఊహించని రీతిలో వేగంగా బ్యాటింగ్ చేశాడు. ఈ క్రమంలో 44 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేశాడు. 50 పరుగులు పూర్తి చేసుకున్న తర్వాత వేగంగా ఆడే క్రమంలో రోజర్స్ రైనాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ ఇద్దరు మూడో వికెట్‌కు 15.4 ఓవర్లలోనే 80 పరుగులు జోడించారు. తర్వాత స్వల్ప వ్యవధిలో షాన్ మార్ష్ (1), స్మిత్‌లు అవుటయ్యారు. అప్పటికే ఆసీస్ ఆధిక్యం 250 పరుగులు దాటింది. హాడిన్‌తో కలిసిన బర్న్స్ ఒక్కసారిగా భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు. టి20 తరహాలో బ్యాటింగ్ చేస్తూ 39 బంతుల్లో 66 పరుగులు చేశాడు. ఈ ఇద్దరు 8.4 ఓవర్లలో 86 పరుగులు సమకూర్చడంతో ఆసీస్ ఆధిక్యం 300లకు చేరింది. చివరి ఓవర్ నాలుగో బంతికి బర్న్స్ అవుటైనా అప్పటికే నష్టం జరిగిపోయింది. ఓవర్లు: 34; పరుగులు: 213; వికెట్లు: 5 చివరి సెషన్లో మేం భారీగా పరుగులు సమర్పించుకున్నాం. బ్యాట్స్‌మెన్ కూడా కొన్ని మంచి షాట్లు ఆడారు. కొత్త బంతితో మా ఆరంభం అసలు బాగాలేదు. లేకపోతే మ్యాచ్ మరోలా ఉండేది. శనివారం మేం కూడా అడిలైడ్‌లో ఆడినట్లుగా ఆడాలి. నేను బ్యాటింగ్‌కు వెళ్లినప్పుడు వీలైనన్ని ఎక్కువ ఓవర్లు ఆడాలని భావించా. పిచ్ నుంచి పెద్ద సహకారం లేకపోవడంతో పరుగులు చేయడానికి కష్టపడాల్సి వచ్చింది. జట్టు కోసం నేను కొన్ని అవకాశాలను సృష్టించాలనుకున్నా. అలా చేయడంతో నాలుగు వికెట్లు తీయగలిగా. మ్యాచ్‌ను ముందుకు తీసుకెళ్లాలనే దృక్పథంతో ఆసీస్ ఆటగాళ్లు కూడా బాగా బ్యాటింగ్ చేశారు. ఓవర్‌నైట్ స్కోరుతో డిక్లేర్ చేస్తే మేం కూడా ఫలితం కోసం ఆడతాం. -అశ్విన్ (భారత స్పిన్నర్) ఐదో రోజు ఆటలో స్పిన్నర్లు కీలకం. వికెట్ బాగా టర్న్ అవుతోంది. బ్యాటింగ్ చేయడం చాలా కష్టంగా ఉంది. కేవలం 10 అవకాశాల కోసం మేం ఎదురుచూస్తున్నాం. స్పిన్‌తోనే పది వికెట్లు తీయాలని భావిస్తున్నాం. భిన్నమైన బౌన్స్, రివర్స్ స్వింగ్ కోసం ప్రయత్నిస్తాం. డిక్లరేషన్‌పై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. నిర్ణయాలలో నా పాత్ర ఉండదు. ఇది కెప్టెన్‌కు సంబంధించిన అంశం. జట్టును మంచి స్థితిలో నిలిపినందుకు ఆనందంగా ఉంది. మ్యాచ్ గెలవడానికి మాకు చాలా అవకాశాలున్నాయి. స్మిత్ కూడా అద్భుతంగా ఆడాడు. అతన్ని చూసి చాలా నేర్చుకోవాలి. -బర్న్స్ (ఆసీస్ బ్యాట్స్‌మన్) టెస్టు సిరీస్‌లో ఎనిమిదిసార్లు 400 పైచిలుకు స్కోర్లు నమోదు కావడం ఇదే తొలిసారి. భారత్ తరఫున టెస్టుల్లో 100 వికెట్లు, వెయ్యి పరుగులు పూర్తి చేసిన 9వ ఆల్‌రౌండర్ అశ్విన్. ప్రపంచ క్రికెట్లో వేగంగా 100 వికెట్లు, వెయ్యి పరుగులు(24 మ్యాచ్‌ల్లో) పూర్తి చేసిన మూడో ఆటగాడు అశ్విన్. ఇంగ్లండ్ ఆటగాడు బోథమ్ (21 మ్యాచ్‌లు) పేరిట ఈ రికార్డు ఉంది. 23 ఏళ్లలో ఆసీస్ గడ్డపై ఒకే ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు తీసిన రెండో భారత స్పిన్నర్ అశ్విన్. ఈ సిరీస్‌లో ఉమేశ్ 4.66 రన్‌రేట్‌ను నమోదు చేశాడు. ఇప్పటి వరకు ఆసీస్‌లో ఆడిన భారత బౌలర్లలో ఇదే చెత్త ప్రదర్శన. ఓవరాల్‌గా మూడోది. ఎడ్వర్డ్స్, బ్రెట్ లీ ముందున్నారు. 250 క్యాచ్‌లు పూర్తి చేసుకున్న ఆసీస్ నాలుగో వికెట్ కీపర్‌గా హాడిన్ రికార్డులకెక్కాడు. టెస్టు క్రికెట్లో ఏడోవాడు. -
సిడ్నీ టెస్టు : నాలుగో రోజు విశేషాలు!
-
భారత్-ఆస్ట్రేలియా చివరి టెస్టులో నాల్గో రోజు
-
నాల్గో రోజు ఆసీస్ స్కోరు 251/6
సిడ్నీ: బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా సిడ్నీ మైదానంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ లో ఆసీస్ తన రెండో ఇన్నింగ్స్ లో నాల్గో రోజు ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్లు కోల్పోయి 251 పరుగులు చేసింది. ఆసీస్ ఆటగాడు జో బర్న్స్ (66) పరుగులు చేసి ఆట కాసేపట్లో ముగుస్తుందనగా ఆరో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. శుక్రవారం ఆటలో టీమిండియా బౌలర్లు రాణించినా ఆసీస్ కు మెరుగైన ఆధిక్యం లభించింది. ఆసీస్ ఆదిలోనే వార్నర్(4) వికెట్ ను నేలరాల్చిన అశ్విన్ అదే ఊపును ప్రదర్శించాడు. అనంతరం షేన్ వాట్సన్(16) పరుగులకు పంపాడు. ఆ సమయంలో క్రిస్ రోజర్స్(56), కెప్టెన్ స్మిత్ (71) పరుగులతో ఆదుకున్నారు. ఈ రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ 348 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. టీమిండియా బౌలర్లలో అశ్విన్ కు నాలుగు వికెట్లు దక్కగా, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీలకు తలో వికెట్ దక్కింది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ 572/7 డిక్లేర్ టీమిండియా తొలి ఇన్నింగ్స్ 475 -
ఆరో వికెట్ ను కోల్పోయిన ఆస్ట్రేలియా
సిడ్నీ: టీమిండియాతో ఇక్కడ జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ లో ఆసీస్ తన రెండో ఇన్నింగ్స్ లో 251 పరుగుల వద్ద ఆరో వికెట్ ను కోల్పోయింది. కేవలం 39 బంతుల్లో 3 సిక్సర్లు, 8 ఫోర్లతో 66 పరుగులు చేసిన బర్న్స్ దూకుడుగా ఆడి అశ్విన్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. శుక్రవారం ఆటలో ఆసీస్ ఆదిలోనే వార్నర్ వికెట్ ను చేజార్చుకుంది. వార్నర్(4)పరుగులు చేసి పెవిలియన్ కు చేరగా... కాసేపటికే షేన్ వాట్సన్(16) పరుగులు చేసి అదే దారిలో నడిచాడు. ఆ సమయంలో క్రిస్ రోజర్స్(56), కెప్టెన్ స్మిత్(71) పరుగులతో ఆదుకున్నారు. ఆ తరువాత బర్న్స్ టీమిండియా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. బర్స్న్ ప్రమాదకరంగా మారుతున్న సమయంలో ఆరో వికెట్ రూపంలో అవుట్ కావడంతో టీమిండియా ఊపిరి పీల్చుకుంది. -
సిడ్నీ టెస్ట్: జో బర్న్స్ హాఫ్ సెంచరీ(242/5)
సిడ్నీ: టీమిండియాతో ఇక్కడ జరుగుతున్న చివరి టెస్ట్ లో ఆసీస్ ఆటగాడు జో బర్న్స్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. షాన్ మార్ష్(1) నిష్క్రమించిన అనంతరం క్రీజ్ లోకి వచ్చిన బర్న్స్ ఆకట్టుకున్నాడు. కేవలం 34 బంతులు ఎదుర్కొన్న బర్న్స్ రెండు సిక్సర్లు, ఏడు ఫోర్లతో హాఫ్ సెంచరీ చేశాడు. ప్రస్తుతం అతనికి జతగా హడిన్(30) క్రీజ్ లో ఉన్నాడు. -
ఐదో వికెట్ కోల్పోయిన ఆసీస్(165/5)
సిడ్నీ: టీమిండియాతో జరుగుతున్న చివరి టెస్టులో ఆసీస్ వరుస వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. శుక్రవారం రెండో ఇన్నింగ్స్ ను ఆరంభించిన ఆసీస్ 165 పరుగుల వద్ద ఐదో వికెట్ ను కోల్పోయింది. కెప్టెన్ స్టీవ్ స్మిత్ (71) పరుగులు చేసి ఐదో వికెట్ రూపంలో పెవిలియన్ కు చేరాడు. అంతకుముందు షాన్ మార్ష్ (1) పరుగు మాత్రమే చేసి నాల్గో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. ప్రస్తుతం ఆసీస్ 262 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. బర్న్స్ (19) పరుగులతో క్రీజ్ లో ఉన్నాడు. టీమిండియా బౌలర్లలో అశ్విన్ కు మూడు వికెట్లు లభించగా, భువనేశ్వర్ కుమార్ , షమీలకు తలో వికెట్ దక్కింది. -
నాల్గో వికెట్ కోల్పోయిన ఆసీస్(139/4)
సిడ్నీ: టీమిండియాతో జరుగుతున్న చివరి టెస్టులో ఆసీస్ వరుస వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. శుక్రవారం రెండో ఇన్నింగ్స్ ను ఆరంభించిన ఆసీస్ 139 పరుగుల వద్ద నాల్గో వికెట్ ను కోల్పోయింది. షాన్ మార్ష్ (1) పరుగు మాత్రమే చేసి నాల్గో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. ప్రస్తుతం ఆసీస్ 240 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. అంతకుముందు క్రిస్ రోజర్స్(56) పరుగులు చేసి మూడో వికెట్ గా పెవిలియన్ చేరాడు. ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్, బర్న్స్ లు జట్టు మరమ్మత్తులు చేపట్టారు. టీమిండియా బౌలర్లలో అశ్విన్ కు మూడు వికెట్లు దక్కగా, భువనేశ్వర్ కు ఒక వికెట్ దక్కింది. -
ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ హాఫ్ సెంచరీ
సిడ్నీ: టీమిండియాతో జరుగుతున్న చివరి టెస్టులో ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ మరోసారి ఆకట్టుకున్నాడు. ఒకప్రక్క ఆసీస్ వికెట్లు పడుతున్నా.. స్మిత్ మాత్రం తనదైన శైలిలో ఆటను కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే స్మిత్ నాలుగు టెస్టుల్లో నాలుగు సెంచరీలు చేసిన సంగతి తెలిసిందే. శుక్రవారం రెండో ఇన్నింగ్స్ ను ఆరంభించిన ఆసీస్ ఆదిలోనే వార్నర్ వికెట్ ను కోల్పోయింది. తొలి ఇన్నింగ్స్ లో సెంచరీతో ఆకట్టుకున్న వార్నర్ ఈ ఇన్నింగ్స్ లో నిరాశపరిచాడు. కేవలం నాలుగు పరుగులు మాత్రమే చేసి అశ్విన్ బౌలింగ్ లో నిష్క్రమించాడు. అనంతరం షేన్ వాట్సన్ (16) పరుగులు చేసి పెవిలియన్ కు చేరాడు. ఈ రెండు వికెట్లు అశ్విన్ కు లభించడం గమనార్హం. అంతకుముందు టీమిండియా 475 పరుగులకు ఆలౌటయిన సంగతి తెలిసిందే. -
మూడో వికెట్ ను కోల్పోయిన ఆసీస్(127/3)
సిడ్నీ: టీమిండియాతో జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ లో ఆసీస్ తన రెండో ఇన్నింగ్స్ లో127 పరుగుల వద్ద మూడో వికెట్ ను కోల్పోయింది. ఆసీస్ ఓపెనర్ (56) పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మూడో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. అంతకుముందు శుక్రవారం రెండో ఇన్నింగ్స్ ను ఆరంభించిన ఆసీస్ ఆదిలోనే వార్నర్ వికెట్ ను కోల్పోయింది. తొలి ఇన్నింగ్స్ లో సెంచరీతో ఆకట్టుకున్న వార్నర్ ఈ ఇన్నింగ్స్ లో నిరాశపరిచాడు. కేవలం నాలుగు పరుగులు మాత్రమే చేసి అశ్విన్ బౌలింగ్ లో నిష్క్రమించాడు. అనంతరం షేన్ వాట్సన్ (16) పరుగులు చేసి పెవిలియన్ కు చేరాడు. ఈ తొలి రెండు వికెట్లు అశ్విన్ కు లభించడం గమనార్హం. అంతకుముందు టీమిండియా 475 పరుగులకు ఆలౌటయిన సంగతి తెలిసిందే. -
క్రిస్ రోజర్స్ హాఫ్ సెంచరీ(122/2)
సిడ్నీ: టీమిండియాతో ఇక్కడ జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ రెండో్ ఇన్నింగ్స్ లో ఆసీస్ ఆటగాడ్ క్రిస్ రోజర్స్ మరో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. 72 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో 52 పరుగులతో నాటౌట్ గా క్రీజ్ లో ఉన్నాడు. మరో వైపు కెప్టెన్ స్టీవ్ స్మిత్ చూడచక్కని షాట్లతో అలరిస్తున్నాడు. ప్రస్తుతం ఆసీస్ రెండు వికెట్ల నష్టానికి 122 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. దీంతో ఆసీస్ కు 219 పరుగుల ఆధిక్యం లభించింది. -
రెండో వికెట్ ను కోల్పోయిన ఆసీస్(46/2)
సిడ్నీ:టీమిండియాతో ఇక్కడ జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా తన రెండో ఇన్నింగ్స్ లో 46 పరుగుల వద్ద రెండో వికెట్ ను కోల్పోయింది. శుక్రవారం రెండో ఇన్నింగ్స్ ను ఆరంభించిన ఆసీస్ ఆదిలోనే వార్నర్ వికెట్ ను కోల్పోయింది. తొలి ఇన్నింగ్స్ లో సెంచరీతో ఆకట్టుకున్న వార్నర్ ఈ ఇన్నింగ్స్ లో నిరాశపరిచాడు. కేవలం నాలుగు పరుగులు మాత్రమే చేసి అశ్విన్ బౌలింగ్ లో నిష్క్రమించాడు. అనంతరం షేన్ వాట్సన్ (16) పరుగులు చేసి పెవిలియన్ కు చేరాడు. ఈ రెండు వికెట్లు అశ్విన్ కు లభించడం గమనార్హం. అంతకుముందు టీమిండియా 475 పరుగులకు ఆలౌటయిన సంగతి తెలిసిందే. -
టీ విరామ సమయానికి ఆసీస్ స్కోరు 38/1
సిడ్నీ: టీమిండియాతో ఇక్కడ జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా టీ విరామ సమయానికి వికెట్ నష్టానికి 38 పరుగులు చేసింది. శుక్రవారం రెండో ఇన్నింగ్స్ ను ఆరంభించిన ఆసీస్ ఆదిలోనే వార్నర్ వికెట్ ను కోల్పోయింది. తొలి ఇన్నింగ్స్ లో సెంచరీతో ఆకట్టుకున్న వార్నర్ ఈ ఇన్నింగ్స్ లో నిరాశపరిచాడు. కేవలం నాలుగు పరుగులు మాత్రమే చేసి అశ్విన్ బౌలింగ్ లో నిష్క్రమించాడు. ప్రస్తుతం వాట్సన్ (13), రోజర్స్(21) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. అంతకుముందు టీమిండియా 475 పరుగులకు ఆలౌటయిన సంగతి తెలిసిందే. -
తొలి వికెట్ ను కోల్పోయిన ఆసీస్(6/1)
సిడ్నీ: టీమిండియాతో జరుగుతున్న చివరి టెస్ట్ లో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రేలియా ఆరు పరుగుల వద్ద తొలి వికెట్ ను కోల్పోయింది. తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ ఆకట్టుకున్న డేవిడ్ వార్నర్ ఈ ఇన్నింగ్స్ లో ఆదిలోనే పెవిలియన్ కు చేరాడు. వార్నర్(4) పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్ లో నిష్క్రమించాడు. అంతకుముందు టీమిండియా తన తొలి ఇన్నింగ్స్ లో 475 పరుగులకు ఆలౌటయ్యింది. ఐదు వికెట్ల నష్టానికి 342 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో నాల్గో రోజు ఆటను ఆరంభించిన టీమిండియా మరో 133 పరుగులు మాత్రమే జోడించింది. హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్న అశ్విన్ (50) పరుగుల వద్ద తొమ్మిదో వికెట్ రూపంలో నిష్క్రమించాడు. 110 బంతులను ఎదుర్కొన్న అశ్విన్ 6 ఫోర్ల సాయంతో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. శుక్రవారం నాల్గో రోజు ఆటలో విరాట్ కోహ్లీ(147), సాహా (30)లు నిష్ర్కమించిన అనంతరం అశ్విన్, భువనేశ్వర్ కుమార్ ల జోడి క్రీజ్ లో ఎక్కువ సేపు నిలబడటానికే ప్రాధాన్యత ఇచ్చింది. అనవసరపు షాట్లకు పోకుండా వీరిద్దరి జోడి ఆచితూచి ఆడింది. 112 బంతులను ఎదుర్కొన్న ఈ జోడి 50 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. -
475 పరుగులకు టీమిండియా ఆలౌట్
సిడ్నీ: ఆస్ట్రేలియాతో ఇక్కడ జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా తన తొలి ఇన్నింగ్స్ లో 475 పరుగులకు ఆలౌటయ్యింది. ఐదు వికెట్ల నష్టానికి 342 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో నాల్గో రోజు ఆటను ఆరంభించిన టీమిండియా మరో 133 పరుగులు మాత్రమే జోడించింది. హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్న అశ్విన్ (50) పరుగుల వద్ద తొమ్మిదో వికెట్ రూపంలో నిష్క్రమించాడు. 110 బంతులను ఎదుర్కొన్న అశ్విన్ 6 ఫోర్ల సాయంతో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. శుక్రవారం నాల్గో రోజు ఆటలో విరాట్ కోహ్లీ(147), సాహా (30)లు నిష్ర్కమించిన అనంతరం అశ్విన్, భువనేశ్వర్ కుమార్ ల జోడి క్రీజ్ లో ఎక్కువ సేపు నిలబడటానికే ప్రాధాన్యత ఇచ్చింది. అనవసరపు షాట్లకు పోకుండా వీరిద్దరి జోడి ఆచితూచి ఆడింది. 112 బంతులను ఎదుర్కొన్న ఈ జోడి 50 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. ఉమేశ్ యాదవ్ (4) పరుగులు చేసి చివరి వికెట్ రూపంలో పెవిలియన్ కు చేరగా, మహ్మద్ షమీ(16) పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్ కు మూడు వికెట్లు లభించగా, హారిస్ , లయన్ , వాట్సన్ లకు తలో రెండు వికెట్లు దక్కాయి. -
తొమ్మిదో వికెట్ కోల్పోయిన టీమిండియా(456/9)
ఆస్ట్రేలియాతో ఇక్కడ జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా ఆటగాడు రవి చంద్రన్ అశ్విన్ తొమ్మిదో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్న అశ్విన్ (50) పరుగుల వద్ద నిష్క్రమించాడు. 110 బంతులను ఎదుర్కొన్న అశ్విన్ 6 ఫోర్ల సాయంతో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. శుక్రవారం నాల్గో రోజు ఆటలో విరాట్ కోహ్లీ, సాహాలు నిష్ర్కమించిన అనంతరం అశ్విన్, భువనేశ్వర్ కుమార్ ల జోడి క్రీజ్ లో ఎక్కువ సేపు నిలబడటానికే ప్రాధాన్యత ఇచ్చింది. అనవసరపు షాట్లకు పోకుండా వీరిద్దరి జోడి ఆచితూచి ఆడింది. 112 బంతులను ఎదుర్కొన్న ఈ జోడి 50 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. ప్రస్తుతం టీమిండియా 456 పరుగులకు తొమ్మిది వికెట్లను కోల్పోయింది. -
సిడ్నీ టెస్ట్: అశ్విన్ హాఫ్ సెంచరీ
సిడ్నీ: ఆస్ట్రేలియాతో ఇక్కడ జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా ఆటగాడు రవి చంద్రన్ అశ్విన్ హాఫ్ సెంచరీ ఆకట్టుకున్నాడు. 110 బంతులను ఎదుర్కొన్న అశ్విన్ 6 ఫోర్ల సాయంతో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. శుక్రవారం నాల్గో రోజు ఆటలో విరాట్ కోహ్లీ, సాహాలు నిష్ర్కమించిన అనంతరం అశ్విన్, భువనేశ్వర్ కుమార్ ల జోడి క్రీజ్ లో ఎక్కువ సేపు నిలబడటానికే ప్రాధాన్యత ఇచ్చింది. అనవసరపు షాట్లకు పోకుండా వీరిద్దరి జోడి ఆచితూచి ఆడింది. 112 బంతులను ఎదుర్కొన్న ఈ జోడి 50 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. అయితే భువనేశ్వర్ కుమార్(30)పరుగుల వద్ద ఎనిమిదో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. ప్రస్తుతం టీమిండియా 455 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. -
ఎనిమిదో వికెట్ కోల్పోయిన టీమిండియా(448/8)
సిడ్నీ: ఆస్ట్రేలియాతో ఇక్కడ జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా తన తొలి ఇన్నింగ్స్ లో 448 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్ ను కోల్పోయింది. నాల్గో రోజు ఆటలో భాగంగా ఐదు వికెట్ల నష్టానికి 342 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ ను ఆరంభించిన టీమిండియా వెంటవెంటనే రెండు వికెట్లను కోల్పోయింది. విరాట్ కోహ్లీ(147), సాహా(35) పరుగులు చేసి పెవిలియన్ కు చేరారు. అనంతరం అశ్విన్ , భువనేశ్వర్ కుమార్ ల జోడి ఆసీస్ కు చాలా సేపు పరీక్షగా నిలిచింది. 75 బంతులను ఎదుర్కొన్న భువనేశ్వర్ కుమార్ 5 ఫోర్ల సాయంతో 30 పరుగులు చేసి ఎనిమిదో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. -
దీటుగా బదులిస్తున్న టీమిండియా
సిడ్నీ: ఆస్ట్రేలియాతో ఇక్కడ జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా దీటుగా బదులిస్తోంది. ఐదు వికెట్ల నష్టానికి 342 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో నాల్గో రోజు బ్యాటింగ్ ఆరంభించిన భారత ఆటగాళ్లు ఆచితూచి ఆడుతున్నారు. ఈ రోజు ఉదయం విరాట్ కోహ్లి(147), సాహా(35) పరుగుల వద్ద వికెట్లను భారత్ కోల్పోయింది. అనంతరం రవి చంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్ లు ఆసీస్ బౌలర్లకు పరీక్షగా నిలిచారు. అశ్విన్ (40), భువనేశ్వర్ కుమార్ (27) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. ప్రస్తుతం టీమిండియా ఏడు వికెట్ల నష్టానికి 447 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ఆసీస్ బౌలర్లలో స్టార్క్, వాట్సన్ లకు చెరో రెండు వికెట్లు లభించగా,హారిస్, హజిల్ వుడ్, లయన్ లకు తలో వికెట్ దక్కింది. ఆస్టేలియా తన తొలి ఇన్నింగ్స్ లో 572 పరుగుల వద్ద డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే. -
లంచ్ సమయానికి భారత్ స్కోరు: 407/7
సిడ్నీ: బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా సిడ్నీ మైదానంలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో రోజు ఆరంభమైన చివరి టెస్ట్ మ్యాచ్ లో లంచ్ విరామ సమయానికి భారత్ 144 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 407 పరుగులు చేసింది. ప్రస్తుతం అశ్వీన్ (74 బంతుల్లో 33 బ్యాటింగ్; 5 ఫోర్లు), భువనేశ్వర్ కుమార్ (39 బంతుల్లో 3 పరుగులు)తో క్రీజులో ఉన్నారు. అంతకముందు వీరాట్ కోహ్లీ (147), సాహా (35)లతో పెవిలియన్ చేరారు. 119.3 ఓవర్లో 352 పరుగుల వద్ద భారత్ కెప్టెన్ వీరాట్ క్లోహీ ఆరో వికెట్‌గా వెనుతిరిగాడు. మొత్తం 230 బంతుల్లో 20 ఫోర్లు బాదిన కోహ్లీ 147 పరుగులు చేసి హారీస్ బౌలింగ్‌లో రోజర్స్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తరువాత 352 పరుగుల వద్ద భారత్ ఏడో వికెట్ కోల్పోయింది. భారత్ ఆటగాడు సాహా 130.2 ఓవర్లలో ఏడో వికెట్ రూపంలో పెవిలియన్ చేరాడు. 96 బంతుల్లో 35 పరుగులు చేసిన సాహా, హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాటపట్టాడు. ఆసీస్ బౌలర్లలో లయోన్, హరీస్, హాజిల్‌వుడ్ తలో వికెట్ తీసుకోగా, స్టార్క్, వాట్సన్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. భారత్ ప్రస్తుతం 165 పరుగులతో వెనకబడి ఉంది. అయితే మూడో రోజు ఆటముగిసే సమయానికి టీమిండియా ఐదు వికెట్ల నష్టానికి 342 పరుగులు చేసింది. అంతకముందు ఆసీస్ తన తొలి ఇన్నింగ్స్‌ను 7 వికెట్ల నష్టానికి 572 పరుగుల వద్ద డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే. -
383 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయిన భారత్
సిడ్నీ: బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో ఇక్కడ జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ లో నాలుగో రోజు భారత్ 352 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది. భారత్ ఆటగాడు సాహా 130.2 ఓవర్లలో ఏడో వికెట్ రూపంలో పెవిలియన్ చేరాడు. 96 బంతుల్లో 35 పరుగులు చేసిన సాహా, హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాటపట్టాడు. అంతకముందు భారత్ కెప్టెన్ వీరాట్ క్లోహీ 119.3 ఓవర్లో ఆరో వికెట్ రూపంలో పెవిలియన్ చేరాడు. 230 బంతుల్లో 20 ఫోర్లు బాదిన కోహ్లీ 147 పరుగులు చేసి హారీస్ బౌలింగ్‌లో రోజర్స్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. భారత్ 132.5 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 390 పరుగులతో కొనసాగుతోంది. ప్రస్తుతం భువనేశ్వర్(0), అశ్వీన్ (19) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. అయితే మూడో రోజు ఆటముగిసే సమయానికి టీమిండియా ఐదు వికెట్ల నష్టానికి 342 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లలో లయోన్, హరీస్, హాజిల్‌వుడ్ తలో వికెట్ తీసుకోగా, స్టార్క్, వాట్సన్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. అంతకముందు ఆసీస్ తన తొలి ఇన్నింగ్స్‌ను 7 వికెట్ల నష్టానికి 572 పరుగుల వద్ద డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే. -
352 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయిన భారత్
సిడ్నీ: బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో ఇక్కడ జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ లో నాలుగో రోజు భారత్ 352 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. భారత్ కెప్టెన్ వీరాట్ క్లోహీ 119.3 ఓవర్లో ఆరో వికెట్ రూపంలో పెవిలియన్ చేరాడు. 230 బంతుల్లో 20 ఫోర్లు బాదిన కోహ్లీ 147 పరుగులు చేసి హారీస్ బౌలింగ్‌లో రోజర్స్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. భారత్ 122.6 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 359 పరుగులతో కొనసాగుతోంది. ప్రస్తుతం సాహా(17), అశ్వీన్ (4) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. అయితే మూడో రోజు ఆటముగిసే సమయానికి టీమిండియా ఐదు వికెట్ల నష్టానికి 342 పరుగులు చేసింది. టీమిండియా ఆటగాడు విరాట్ కోహ్లీ పరుగుల వర్షం కురిపించాడు. మూడో రోజు ఆటలో భాగంగా 162 బంతులను ఎదుర్కొన్న కోహ్లీ 17 ఫోర్ల సాయంతో సెంచరీ నమోదు చేశాడు. దీంతో నాలుగు టెస్టుల్లో నాలుగు సెంచరీలు చేసిన ఆటగాడిగా కోహ్లీ అరుదైన ఘనతను సాధించాడు. అంతకుముందు అడిలైడ్ లో రెండు సెంచరీలు, మెల్ బోర్న్ లో ఒక సెంచరీతో విరాట్ ఆకట్టుకున్నాడు. ఓవరాల్ గా విరాట్ కు టెస్టు మ్యాచ్ ల్లో 10 వ సెంచరీ. ఆసీస్ బౌలర్లలో లయోన్, హరీస్ తలో వికెట్ తీసుకోగా, స్టార్క్, వాట్సన్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. -
సిడ్నీ టెస్టు: నాలుగో రోజు ఆట ఆరంభించిన భారత్
సిడ్నీ: బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో ఇక్కడ జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ లో భారత్ నాలుగో రోజు ఆట ఆరంభించింది. భారత్ 118.1 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 350 పరుగులతో కొనసాగుతోంది. ప్రస్తుతం విరాట్ (145) సాహా(17) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. అయితే మూడో రోజు ఆటముగిసే సమయానికి టీమిండియా ఐదు వికెట్ల నష్టానికి 342 పరుగులు చేసింది. టీమిండియా ఆటగాడు విరాట్ కోహ్లీ పరుగుల వర్షం కురిపించాడు. మూడో రోజు ఆటలో భాగంగా 162 బంతులను ఎదుర్కొన్న కోహ్లీ 17 ఫోర్ల సాయంతో సెంచరీ నమోదు చేశాడు. దీంతో నాలుగు టెస్టుల్లో నాలుగు సెంచరీలు చేసిన ఆటగాడిగా కోహ్లీ అరుదైన ఘనతను సాధించాడు. అంతకుముందు అడిలైడ్ లో రెండు సెంచరీలు, మెల్ బోర్న్ లో ఒక సెంచరీతో విరాట్ ఆకట్టుకున్నాడు. ఓవరాల్ గా విరాట్ కు టెస్టు మ్యాచ్ ల్లో 10 వ సెంచరీ. ఆసీస్ బౌలర్లలో లయోన్ ఒక వికెట్ తీసుకోగా, స్టార్క్, వాట్సన్ తలో రెండు వికెట్లు తీసుకున్నారు. -
భారత్-ఆస్ట్రేలియా చివరి టెస్టులో మూడో రోజు
-
ఆట ముగిసే సమయానికి టీమిండియా స్కోరు 342/5
సిడ్నీ : ఆస్ట్రేలియాతో ఇక్కడ జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ లో మూడో రోజు ఆటముగిసే సమయానికి టీమిండియా ఐదు వికెట్ల నష్టానికి 342 పరుగులు చేసింది. ఈ రోజు ఆటలో టీమిండియా ఆటగాడు విరాట్ కోహ్లీ మరోసారి మెరిశాడు. మూడో రోజు ఆటలో భాగంగా 162 బంతులను ఎదుర్కొన్న కోహ్లీ 17 ఫోర్ల సాయంతో సెంచరీ నమోదు చేశాడు. దీంతో నాలుగు టెస్టుల్లో నాలుగు సెంచరీలు చేసిన ఆటగాడిగా కోహ్లీ అరుదైన ఘనతను సాధించాడు. అంతకుముందు అడిలైడ్ లో రెండు సెంచరీలు, మెల్ బోర్న్ లో ఒక సెంచరీతో విరాట్ ఆకట్టుకున్నాడు. ఓవరాల్ గా విరాట్ కు టెస్టు మ్యాచ్ ల్లో 10 వ సెంచరీ. ప్రస్తుతం విరాట్ (140) సాహా(14) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. ఈ రోజు ఉదయం వికెట్ నష్టానికి 71 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో బ్యాటింగ్ ఆరంభించిన టీమిండియాలో ఓపెనర్ కేఎల్ రాహుల్ (110) పరుగులతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. టెస్టుల్లో తొలి సెంచరీ నమోదు చేసిన రాహుల్ తన ఆడిన రెండో టెస్టులోనే సెంచరీ మార్కును చేరాడు. అంతకుముందు టీమిండియా రోహిత్ శర్మను వికెట్ ను చేజార్చుకుంది. రోహిత్ (53) పరుగులు చేసి పెవిలియన్ కు చేరాడు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్ , వాట్సన్ లకు తలో రెండు వికెట్లు లభించగా, లయన్ కు ఒక వికెట్ దక్కింది. -
సిడ్నీ టెస్టులోనూ మెరిసిన 'విరాట్'
-
సిడ్నీ టెస్ట్: సురేష్ రైనా డకౌట్
సిడ్నీ: ఆస్ట్రేలియాతో ఇక్కడ జరుగుతున్న చివరి టెస్టు మ్యాచ్ లో టీమిండియా ఆటగాడు సురేష్ రైనా డకౌట్ రూపంలో వెనుదిరిగాడు.తన ఆడిన తొలి బంతికే క్యాచ్ ఇచ్చిన రైనా పెవిలియన్ కు చేరాడు. 292 పరుగుల వద్ద టీమిండియా రైనా ఐదో వికెట్ రూపంలో నిష్ర్కమించాడు. వరుసగా రెండు వికెట్లను కోల్పోయిన టీమిండియా ఒక్కసారిగా కష్టాలను కొనితెచ్చుకుంది. అంతకుముందు అజ్యింకా రహానే (13) పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్ కు చేరిన సంగతి తెలిసిందే. -
నాల్గో వికెట్ కోల్పోయిన టీమిండియా(292/4)
సిడ్నీ: ఆస్ట్రేలియాతో ఇక్కడ జరుగుతున్న చివరి టెస్టు మ్యాచ్ లో టీమిండియా 292 పరుగుల వద్ద నాల్గో వికెట్ ను కోల్పోయింది. మిడిల్ ఆర్డర్ ఆటగాడు అజ్యింకా రహానే(13) పరుగుల వద్ద నాల్గో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. అంతకుముందు విరాట్ కోహ్లీ సెంచరీ నమోదు చేశాడు. మూడో రోజు ఆటలో భాగంగా 162 బంతులను ఎదుర్కొన్న కోహ్లీ 15 ఫోర్ల సాయంతో శతకం పూర్తి చేశాడు. దీంతో నాలుగు టెస్టుల్లో నాలుగు సెంచరీలు చేసిన ఆటగాడిగా కోహ్లీ మరో ఘనతను సాధించాడు.అంతకుముందు అడిలైడ్ లో రెండు సెంచరీలు, మెల్ బోర్న్ లో ఒక సెంచరీతో విరాట్ ఆకట్టుకున్నాడు. ఓవరాల్ గా విరాట్ కు టెస్టు మ్యాచ్ ల్లో 10 వ సెంచరీ. -
సిడ్నీ టెస్టులోనూ మెరిసిన 'విరాట్'
సిడ్నీ : ఆస్ట్రేలియాతో ఇక్కడ గురువారం జరుగుతున్న చివరి, నాల్గో టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా ఆటగాడు విరాట్ కోహ్లీ మరోసారి మెరిశాడు. మూడో రోజు ఆటలో భాగంగా 162 బంతులను ఎదుర్కొన్న కోహ్లీ 17 ఫోర్ల సాయంతో సెంచరీ నమోదు చేశాడు. దీంతో నాలుగు టెస్టుల్లో నాలుగు సెంచరీలు చేసిన ఆటగాడిగా కోహ్లీ అరుదైన ఘనతను సాధించాడు. అంతకుముందు అడిలైడ్ లో రెండు సెంచరీలు, మెల్ బోర్న్ లో ఒక సెంచరీతో విరాట్ ఆకట్టుకున్నాడు. ఓవరాల్ గా విరాట్ కు టెస్టు మ్యాచ్ ల్లో 10 వ సెంచరీ. ఈ రోజు ఉదయం వికెట్ నష్టానికి 71 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో బ్యాటింగ్ ఆరంభించిన టీమిండియాలో ఓపెనర్ కేఎల్ రాహుల్ (110) పరుగులతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. టెస్టుల్లో తొలి సెంచరీ నమోదు చేసిన రాహుల్ తన ఆడిన రెండో టెస్టులోనే సెంచరీ మార్కును చేరాడు. అంతకుముందు టీమిండియా రోహిత్ శర్మను వికెట్ ను చేజార్చుకుంది. రోహిత్ (53) పరుగులు చేసి పెవిలియన్ కు చేరాడు. -
టెస్టుల్లో రాహుల్ తొలి సెంచరీ
-
మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా(238/3)
సిడ్నీ:ఆస్ట్రేలియాతో ఇక్కడ జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా 238 పరుగుల వద్ద మూడో వికెట్ ను కోల్పోయింది. కేఎల్ రాహుల్ (110) పరుగులు చేసి మూడో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ(79) పరుగులతో బ్యాటింగ్ కొనసాగిస్తున్నాడు. అతనికి జతగా అజ్యింకా రహానే క్రీజ్ లోకి వచ్చాడు. టీమిండియా ఓపెనర్ కెఎల్ రాహుల్ టెస్టుల్లో తొలి సెంచరీ చేయడంతో రెండో టెస్టులోనే సెంచరీ చేసిన ఆటగాడిగా అరుదైన గుర్తింపు పొందాడు. 262 బంతులను ఎదుర్కొన్నఈ కర్ణాటక ఓపెనర్ 13 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో శతకం మైలురాయిన అధిగమించాడు. -
టీ విరామ సమయానికి టీమిండియా స్కోరు 234/2
సిడ్నీ: ఆస్ట్రేలియాతో ఇక్కడ జరుగుతున్న చివరి, నాల్గో టెస్ట్ మ్యాచ్ మూడో రోజు ఆటలో టీ విరామ సమయానికి టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 234 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ప్రస్తుతం కేఎల్ రాహుల్(106;256 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్స్), విరాట్ కోహ్లీ(67;121 బంతుల్లో 5ఫోర్లు,2 సిక్సర్లు) లు నాటౌట్ గా క్రీజ్ లో ఉన్నారు. టీమిండియా ఓపెనర్ కెఎల్ రాహుల్ టెస్టుల్లో తొలి సెంచరీ(102) నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇక్కడ ఆస్ట్రేలియాతో జరగుతున్న చివరి టెస్టులో రాహుల్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. 253 బంతులను ఎదుర్కొన్నఈ కర్ణాటక ఓపెనర్ 11ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో శతకం పూర్తి చేశాడు. తను ఆడిన రెండో టెస్టులోనే సెంచరీ చేసిన క్రికెటర్ గా రాహుల్ రికార్డు నెలకొల్పాడు. -
టెస్టుల్లో కెఎల్ రాహుల్ తొలి సెంచరీ
సిడ్నీ: టీమిండియా ఓపెనర్ కెఎల్ రాహుల్ టెస్టుల్లో తొలి సెంచరీ(102) నమోదు చేశాడు. ఇక్కడ ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి టెస్టులో రాహుల్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. 253 బంతులను ఎదుర్కొన్నఈ కర్ణాటక ఓపెనర్ 11ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో శతకం పూర్తి చేసి నాటౌట్ గా క్రీజ్ లో ఉన్నాడు. తను ఆడిన రెండో టెస్టులోనే సెంచరీ చేసిన క్రికెటర్ గా రాహుల్ రికార్డు నెలకొల్పాడు. రాహుల్ కు జతగా విరాట్ కోహ్లీ(67) పరుగులతో క్రీజ్ లో ఉన్నాడు. ప్రస్తుతం టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 230 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. అంతకుముందు రోహిత్ శర్మ(53) పరుగుల వద్ద పెవిలియన్ కు చేరిన సంగతి తెలిసిందే. వికెట్ నష్టానికి 71 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో మూడు రోజు ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియా ఆచితూచి బ్యాటింగ్ కొనసాగిస్తోంది. -
సిడ్నీ టెస్ట్ : విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ
సిడ్నీ:ఆస్ట్రేలియాతో ఇక్కడ జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరోసారి హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. మూడో రోజు ఆటలో భాగంగా తొలి ఇన్నింగ్స్ ను ఆరంభించిన టీమిండియా రోహిత్ శర్మ (53)ను కోల్పోయింది. అనంతరం ఓపెనర్ కేఎల్ రాహుల్ కు జతకలిసిన కోహ్లీ బాధ్యతాయుతంగా ఆడి స్కోరు బోర్డును చక్కదిద్దాడు.108 బంతులను ఎదుర్కొన్న కోహ్లీ 9 ఫోర్ల సాయంతో హాఫ్ సెంచరీ చేశాడు. ప్రస్తుతం రెండు వికెట్లు కోల్పోయిన టీమిండియా 201 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌ను 7 వికెట్ల నష్టానికి 572 పరుగుల వద్ద డిక్లేర్ చేయగా, భారత్ రెండో రోజున తొలి ఇన్నింగ్స్ 25 ఓవర్లలో వికెట్ నష్టానికి 71 పరుగులు చేసిన తెలిసిందే. -
లంచ్ సమయానికి భారత్ స్కోరు: 122/2
సిడ్నీ: బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా సిడ్నీ మైదానంలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో రోజు ఆరంభమైన చివరి టెస్ట్ మ్యాచ్ లో లంచ్ విరామ సమయానికి భారత్ 55 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది. ప్రస్తుతం లోకేష్ రాహుల్ (164 బంతుల్లో 50 బ్యాటింగ్; 5 ఫోర్లు), భారత్ కెప్టెన్ వీరాట్ కోహ్లీ (33 బంతుల్లో 16 బ్యాటింగ్; 3 ఫోర్లు)తో క్రీజ్‌లో ఉన్నారు. భారత్ ఆటగాడు కేఎల్ రాహుల్ 118 పరుగుల వద్ద హాఫ్ సెంచరీ చేయగా, రోహిత్ శర్మ 96 పరుగుల వద్ద హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. మురళీ విజయ్ (0), రోహిత్ శర్మ(53) పరుగులు చేసి పెవిలియన్ చేరారు. ఆ తరువాత బరిలోకి దిగిన భారత్ ఆటగాడు రాహుల్, కెప్టెన్ వీరాట్ కోహ్లీ భాగస్వామ్యంతో నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్, లయోన్ తలో వికెట్ తీసుకోన్నారు. కాగా, భారత్ ప్రస్తుతం మరో 450 పరుగులు వెనుకబడి ఉంది. రెండోరోజు ఓపెనర్ ఆటగాడు మురళీ విజయ్ పరుగులేమి చేయకుండానే చేతులేత్తేశాడు. అదే రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 25 ఓవర్లలో వికెట్ నష్టానికి 71 పరుగులు చేసింది. కాగా, ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌ను 7 వికెట్ల నష్టానికి 572 పరుగుల వద్ద డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే. -
118 పరుగుల వద్ద రాహుల్ హాఫ్ సెంచరీ
సిడ్నీ: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ చివరి టెస్టులో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఆరంభమైన మూడో రోజు మ్యాచ్‌లో భారత్ ఆటగాడు కేఎల్ రాహుల్ 118 పరుగుల వద్ద హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ప్రస్తుతం భారత్ మూడో రోజు ఆటలో 54.2 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 121 పరుగులతో కొనసాగుతోంది. భారత్ ఆటగాడు రాహుల్, కెప్టెన్ వీరాట్ కోహ్లీ భాగస్వామ్యంతో నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. ప్రస్తుతం లోకేష్ రాహుల్ (164 బంతుల్లో 50 బ్యాటింగ్; 5 ఫోర్లు), భారత్ కెప్టెన్ వీరాట్ కోహ్లీ (26 బంతుల్లో 13 బ్యాటింగ్; 3 ఫోర్లు)తో క్రీజ్‌లో ఉన్నారు. భారత్ ప్రస్తుతం మరో 454 పరుగులు వెనుకబడి ఉంది. రెండోరోజు ఓపెనర్ ఆటగాడు మురళీ విజయ్ పరుగులేమి చేయకుండానే చేతులేత్తేశాడు. అదే రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 25 ఓవర్లలో వికెట్ నష్టానికి 71 పరుగులు చేసింది. కాగా, ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌ను 7 వికెట్ల నష్టానికి 572 పరుగుల వద్ద డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే. -
సిడ్నీ టెస్టు: రెండో వికెట్ కోల్పోయిన భారత్
సిడ్నీ: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ చివరి టెస్టులో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఆరంభమైన మూడో రోజు మ్యాచ్‌లో 97 పరుగుల వద్ద భారత్ రెండో వికెట్ కోల్పోయింది. భారత్ ఓపెనర్ ఆటగాడు రోహిత్ శర్మ 43.4 ఓవర్లలో రెండో వికెట్ రూపంలో పెవిలియన్ చేరాడు. 96 పరుగుల వద్ద హాఫ్ సెంచరీ నమోదు చేసిన రోహిత్ శర్మ (133 బంతుల్లో 53 బ్యాటింగ్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు)తో లయోన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. భారత్ మూడో రోజు ఆటలో 47.1 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 108 పరుగులతో కొనసాగుతోంది. రోహిత్ తరువాత బరిలోకి దిగిన భారత్ కెప్టెన్ వీరాట్ కోహ్లీ జట్టు పగ్గాలు అందుకున్నాడు. కోహ్లీ (12 బంతుల్లో 8 బ్యాటింగ్; 2 ఫోర్లు), రాహుల్ (142 బంతుల్లో 45 బ్యాటింగ్; 4 ఫోర్లు) పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. రెండోరోజు ఓపెనర్ ఆటగాడు మురళీ విజయ్ పరుగులేమి చేయకుండానే చేతులేత్తేశాడు. అనంతరం రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 25 ఓవర్లలో వికెట్ నష్టానికి 71 పరుగులు చేసింది. కాగా, ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌ను 7 వికెట్ల నష్టానికి 572 పరుగుల వద్ద డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే. -
96 పరుగుల వద్ద రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ
సిడ్నీ: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ చివరి టెస్టులో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఆరంభమైన మూడో రోజు మ్యాచ్‌లో భారత్ ఓపెనర్ ఆటగాడు రోహిత్ శర్మ 96 పరుగుల వద్ద హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ప్రస్తుతం భారత్ మూడో రోజు ఆటలో 43.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 97 పరుగులతో కొనసాగుతోంది. భారత్ ఆటగాడు రోహిత్, రాహుల్ భాగస్వామ్యంతో నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. రోహిత్ శర్మ (132 బంతుల్లో 53 బ్యాటింగ్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), లోకేష్ రాహుల్ (128 బంతుల్లో 42 బ్యాటింగ్; 4 ఫోర్లు) క్రీజ్‌లో ఉన్నారు. రెండోరోజు ఓపెనర్ ఆటగాడు మురళీ విజయ్ పరుగులేమి చేయకుండానే చేతులేత్తేశాడు. అనంతరం రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 25 ఓవర్లలో వికెట్ నష్టానికి 71 పరుగులు చేసింది. కాగా, ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌ను 7 వికెట్ల నష్టానికి 572 పరుగుల వద్ద డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే. -
మూడో రోజు ఆట ఆరంభించిన భారత్
సిడ్నీ: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ చివరి టెస్టులో భాగంగా సిడ్నీ మైదానంలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో రోజు మ్యాచ్ ఆరంభమైంది. రెండో రోజు ఆటలో ‘భారీ’ సవాల్ విసిరిన ఆస్ట్రేలియా జోరుకు జవాబు ఇచ్చే దిశగా భారత్ మూడో రోజు మ్యాచ్ కొనసాగుతోంది. ప్రస్తుతం భారత్ 26.4 ఓవర్లలో వికెట్ నష్టానికి 75 పరుగులతో కొనసాగుతోంది. అయితే రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 25 ఓవర్లలో వికెట్ నష్టానికి 71 పరుగులు చేసింది. విజయ్ (0) తొలి ఓవర్లోనే వెనుదిరగ్గా రోహిత్ శర్మ (82 బంతుల్లో 40 బ్యాటింగ్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), కేఎల్ రాహుల్ (75 బంతుల్లో 35 బ్యాటింగ్; 3 ఫోర్లు) క్రీజ్‌లో ఉన్నారు. భారత్ ప్రస్తుతం మరో 497 పరుగులు వెనుకబడి ఉంది. మూడో రోజు బ్యాట్స్‌మెన్ నిలకడగా ఆడి భారీ స్కోరు చేస్తేనే ఈ టెస్టులో మనకు అవకాశాలు మిగిలి ఉంటాయి. అంతకుముందు ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌ను 7 వికెట్ల నష్టానికి 572 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. స్టీవెన్ స్మిత్ (208 బంతుల్లో 117; 15 ఫోర్లు) ఈ సిరీస్‌లో వరుసగా నాలుగు టెస్టుల్లో నాలుగో సెంచరీ పూర్తి చేసుకోవడం విశేషం. -
తడబడతారా..! నిలబడతారా..!
రెండు సెంచరీలు...నాలుగు అర్ధ సెంచరీలు...తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ ప్రదర్శన ఇది. బ్యాటింగ్‌కు పూర్తిగా అనుకూలిస్తున్న పిచ్‌పై వరుసగా ఒక్కో కొత్త రికార్డు నెలకొల్పుతూ ఆసీస్ బ్యాట్స్‌మెన్ పరుగుల పండగ చేసుకున్నారు. పరుగులు ఇవ్వడంలో మన బౌలర్లు కూడా నలుగురు సెంచరీలు పూర్తి చేసుకున్నారు. జీవం లేని పిచ్‌పై ఏమీ చేయలేక, బౌలింగ్‌లో కొత్తదనం, వ్యూహాల్లో వైవిధ్యం లేక అలా బంతులు విసిరి విసిరి అలసిపోయారు. పేస్ బౌలింగ్‌లో ‘పేస్’ తగ్గి సాధారణ బౌలర్లుగా మిగిలిపోయారు. కొండంత స్కోరు కళ్ల ముందు ఉండగా, విజయ్ డకౌట్‌తో భారత్‌కు తొలి దెబ్బ. అయితే రోహిత్, రాహుల్ తడబడకుండా నిలబడ్డారు. రెండు రోజుల ఆట తర్వాత కూడా ఎలాంటి జీవం లేని పిచ్ ఇంకా బ్యాటింగ్‌కు బాగా అనుకూలిస్తోంది. ఇప్పుడు ఇదే ఆరంభాన్ని భారత్ తమకు అనుకూలంగా మార్చుకోవాలి. ఇక మూడో రోజు మన బ్యాట్స్‌మెన్ సత్తా చూపాలి. రోజంతా నిలబడి ఆసీస్ స్కోరుకు చేరువైతేనే మ్యాచ్‌లో నిలబడతాం. ఏమాత్రం తడబడినా ఇక మ్యాచ్ మీద ఆశలు వదులుకోవాల్సిన ప్రమాదం ఏర్పడుతుంది. సిడ్నీ: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ చివరి టెస్టులో భారత్ ముందు ‘భారీ’ సవాల్ నిలిచింది. ఆస్ట్రేలియా జోరుకు జవాబిస్తూ మ్యాచ్ రెండో రోజు బుధవారం ఆట ముగిసే సమయానికి భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 25 ఓవర్లలో వికెట్ నష్టానికి 71 పరుగులు చేసింది. విజయ్ (0) తొలి ఓవర్లోనే వెనుదిరగ్గా రోహిత్ శర్మ (76 బంతుల్లో 40 బ్యాటింగ్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), కేఎల్ రాహుల్ (71 బంతుల్లో 31 బ్యాటింగ్; 2 ఫోర్లు) క్రీజ్‌లో ఉన్నారు. భారత్ ప్రస్తుతం మరో 501 పరుగులు వెనుకబడి ఉంది. మూడో రోజు బ్యాట్స్‌మెన్ నిలకడగా ఆడి భారీ స్కోరు చేస్తేనే ఈ టెస్టులో మనకు అవకాశాలు మిగిలి ఉంటాయి. కాస్త తడబడినా ఆసీస్‌కు చేజేతులా అవకాశం ఇచ్చినట్లే. అంతకుముందు ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌ను 7 వికెట్ల నష్టానికి 572 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. స్టీవెన్ స్మిత్ (208 బంతుల్లో 117; 15 ఫోర్లు) ఈ సిరీస్‌లో వరుసగా నాలుగు టెస్టుల్లో నాలుగో సెంచరీ పూర్తి చేసుకోవడం విశేషం. షాన్ మార్ష్ (116 బంతుల్లో 73; 9 ఫోర్లు, 1 సిక్స్), జో బర్న్స్ (114 బంతుల్లో 58; 10 ఫోర్లు) కూడా రాణించారు. భారత బౌలర్లలో షమీ (5/112) కెరీర్లో రెండో సారి ఐదు వికెట్లు పడగొట్టాడు. స్కోరు వివరాలు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: రోజర్స్ (బి) షమీ 95; వార్నర్ (సి) విజయ్ (బి) అశ్విన్ 101; వాట్సన్ (సి) అశ్విన్ (బి) షమీ 81; స్మిత్ (సి) సాహా (బి) ఉమేశ్ 117; మార్ష్ (సి) సాహా (బి) షమీ 73; బర్న్స్ (సి) రాహుల్ (బి) షమీ 58; హాడిన్ (నాటౌట్) 9; హారిస్ (సి) అశ్విన్ (బి) షమీ 25; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (152.3 ఓవర్లలో 7 వికెట్లకు) 572 డిక్లేర్డ్. వికెట్ల పతనం: 1-200; 2-204; 3-400; 4-415; 5-529; 6-546; 7-572. బౌలింగ్: భువనేశ్వర్ 34-5-122-0; ఉమేశ్ 27-5-137-1; షమీ 28.3-3-112-5; అశ్విన్ 47-8-142-1; రైనా 16-3-53-0. భారత్ తొలి ఇన్నింగ్స్: విజయ్ (సి) హాడిన్ (బి) స్టార్క్ 0; రాహుల్ (బ్యాటింగ్) 31; రోహిత్ (బ్యాటింగ్) 40; ఎక్స్‌ట్రాలు 0; మొత్తం (25 ఓవర్లలో వికెట్ నష్టానికి) 71. వికెట్ల పతనం: 1-0. బౌలింగ్: స్టార్క్ 6-2-17-1; హారిస్ 7-1-17-0; హాజల్‌వుడ్ 4-1-10-0; లయోన్ 8-1-27-0. ఆస్ట్రేలియా ఆటగాళ్లంటే అంతే మరి... మామూలుగానే స్లెడ్జింగ్ వారికి మంచినీళ్ల ప్రాయంలా కనిపిస్తుంది. ఇక మొదటి ఓవర్లోనే వికెట్ తీస్తే ఎలా ఉంటుంది? ఆసీస్ బౌలర్ మిషెల్ స్టార్క్ కూడా సరిగ్గా అదే చేశాడు. తన మూడో బంతికే మురళీ విజయ్ను అవుట్ చేయడంతో తనను తాను నియంత్రించుకోలేకపోయాడు. ఒక వైపు తన ఉద్వేగాన్ని ప్రదర్శిస్తూనే, పెవిలియన్ వైపు వెళుతున్న విజయ్ వైపు చూస్తూ... వెళ్లమంటూ నోటికి పని చెప్పాడు. దీనికి విజయ్ స్పందించకపోయినా స్టార్క్ చర్య మాత్రం తీవ్రంగా కనిపించింది. చివరకు కెప్టెన్ స్మిత్ కూడా తన ఆటగాడికి మద్దతు పలకలేదు. ‘ఆ రకంగా స్టార్క్ ప్రవర్తించడం ఆటకు మంచిది కాదు. ఇకపై వికెట్ తీసినా మా ఆటగాళ్లు అలా చేయరు’ అని స్మిత్ అన్నాడు. సెషన్-1: స్మిత్ శతకం రెండో రోజు కూడా ఆసీస్ ఎక్కడా తగ్గకుండా తమ జోరు కొనసాగించింది. ఆట ప్రారంభమైన కొద్ది సేపటికే స్మిత్ 168 బంతుల్లో శతకాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత మాత్రం భారత్‌కు కాస్త ఊరట లభించింది. తక్కువ వ్యవధిలో వాట్సన్ (183 బంతుల్లో 81; 7 ఫోర్లు), స్మిత్ వెనుదిరిగారు. షమీ బౌలింగ్‌లో పుల్ షాట్ ఆడిన వాట్సన్ డీప్ మిడ్వికెట్లో క్యాచ్ ఇవ్వడంతో 196 పరుగుల మూడో వికెట్ భాగస్వామ్యానికి తెర పడింది. ఆ వెంటనే స్మిత్ కూడా ఉమేశ్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. మార్ష్ 9 పరుగుల వద్ద అశ్విన్ బౌలింగ్‌లో గల్లీలో విజయ్ క్యాచ్ వదిలేయడం మరోసారి మన ఫీల్డింగ్ వైఫల్యాన్ని చూపించింది. మరో వైపు బర్న్స్ కూడా మొదటి 17 బంతుల్లో ఒక్క పరుగు కూడా తీయలేకపోయాడు. ఓవర్లు: 30, పరుగులు: 72, వికెట్లు: 2 సెషన్-2: మరో భాగస్వామ్యం లంచ్ తర్వాత మాత్రం మార్ష్, బర్న్స్ క్రీజ్‌లో నిలదొక్కుకున్నారు. దూకుడు ప్రదర్శించకపోవడంతో పరుగుల వేగం తగ్గినా... మన బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తగా బ్యాటింగ్ చేశారు. ఈ క్రమంలో మార్ష్ 87 బంతుల్లో, బర్న్స్ 94 బంతుల్లో అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. ఐదో వికెట్‌కు 114 పరుగులు జత చేసిన అనంతరం షమీ బౌలింగ్‌లో సాహా చక్కటి క్యాచ్ పట్టడంతో మార్ష్ పెవిలియన్ చేరాడు. ఈ సెషన్ చివర్లో ఆసీస్ బ్యాట్స్‌మెన్ వేగంగా ఆడారు. ఓవర్లు: 29, పరుగులు: 118, వికెట్లు: 1 సెషన్-3: భారత్‌కు షాక్ ఈ సెషన్ రెండో ఓవర్లోనే బర్న్స్ వెనుదిరిగాడు. అయితే అనూ హ్యంగా ర్యాన్ హారిస్ (25) చెలరేగిపోయాడు. భువనేశ్వర్ వేసిన ఒకే ఓవర్లో నాలుగు ఫోర్లు సహా అతను 19 పరుగులు రాబట్టడం విశేషం. చివరకు షమీ బౌలింగ్‌లో మరో భారీ షాట్ ఆడబోయి హారిస్ అవుట్ కావడంతో ఆసీస్ తమ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఆసీస్ తొలి వికెట్ తీసేం దుకు భారత్‌కు దాదాపు మూడు గంటలు పడితే, ఆసీస్ మాత్రం మూడో బంతికే దానిని దక్కించుకుంది. ఈ సిరీస్‌లో ఫామ్‌లో ఉన్న విజయ్, స్టార్క్ బౌలింగ్‌లో బంతిని వెంటాడి విజయ్, కీపర్‌కు క్యాచ్ ఇచ్చాడు. ఈ దశలో జత కలిసిన రోహిత్, రాహుల్ ఆకట్టుకున్నారు. గత టెస్టులో విఫలమైన రాహుల్ జాగ్రత్తగా ఆడగా, రోహిత్ మాత్రం కాస్త దూకుడు ప్రదర్శించాడు. లయోన్ బౌలింగ్‌లో అతను రెండు భారీ సిక్సర్లు కొట్టాడు. చివర్లో వీరిద్దరు కొంత ఉత్కంఠకు లోనైనా, మరో వికెట్ పడనీయలేదు. (ఆసీస్) ఓవర్లు: 3.3, పరుగులు: 34, వికెట్లు: 2 (భారత్) ఓవర్లు: 25, పరుగులు: 71, వికెట్లు: 1 3 ఒకే సిరీస్‌లో వరుసగా నాలుగు టెస్టుల్లోనూ సెంచరీ చేసిన మూడో ఆటగాడు స్మిత్. 1931-32లో బ్రాడ్‌మన్, 2003-04లో కలిస్ ఈ ఘనత సాధించారు. 24 ఒక ఇన్నింగ్స్‌లో నలుగురు భారత బౌలర్లు ఒక్కొక్కరు వందకు పైగా పరుగులు ఇవ్వడం ఇది 24వ సారి 1 ఈ సిరీస్‌లో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు పడగొట్టిన తొలి భారత బౌలర్ షమీ. 2011-12 సిరీస్‌లోనూ ఒకే భారత బౌలర్ (ఉమేశ్) ఐదు వికెట్లు తీశాడు. 1 ఆస్ట్రేలియాలో జట్టులోని టాప్-6 బ్యాట్స్‌మెన్ అందరూ కనీసం అర్ధ సెంచరీ చేయడం ఇదే తొలిసారి. -
భారత్-ఆస్ట్రేలియా చివరి టెస్టులో రెండోరోజు
-
లంచ్ సమయానికి ఆస్ట్రేలియా స్కోరు: 420/4
సిడ్నీ: బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా సిడ్నీ మైదానంలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో రోజు ఆరంభమైన చివరి టెస్ట్ మ్యాచ్ లో లంచ్ విరామ సమయానికి ఆస్ట్రేలియా 120.0 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 420 పరుగులు చేసింది. ప్రస్తుతం మార్ష్(14), బర్న్స్ (0) క్రీజులో ఉన్నారు. ఆసీస్ ఓపెనర్లు కెప్టెన్ స్టీవ్ స్మిత్ (117), వాట్సన్ (81) పరుగులు చేసి పెవిలియన్ చేరారు. స్మిత్ ఆడిన నాలుగు టెస్టు సిరీస్ లలో ఎనిమిదోవ సెంచరీ నమోదు చేసి తన ఖాతాలో వేసుకున్నాడు. ఇరువురి భాగస్వామ్యంలో తొలిరోజు నుంచి రెండోరోజు వరకూ నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఆకాశమే హద్దుగా.. భారత్ బౌలర్ల ఎత్తులను చిత్తు చేస్తూ వచ్చిన బంతిని వచ్చినట్టు బౌండరీలు దాటించారు. స్మిత్ 208 బంతుల్లో 15 ఫోర్లు బాది 117 పరుగులకు ఔటయ్యాడు. వాట్సన్ 183 బంతుల్లో 7 ఫోర్లు బాది 81 పరుగులకే వెనుతిరిగాడు. భారత్ బౌలర్లలో మహ్మద్ షమీ రెండు వికెట్లు, అశ్విన్, యాదవ్ తలో వికెట్ తీసుకోన్నారు. -
415 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా
సిడ్నీ: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో రోజు ఆరంభమైన చివరి టెస్ట్ మ్యాచ్ లో ఆసీస్ 113.3 ఓవర్లలో 415 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. ఆసీస్ ఓపెనర్ గా బరిలోకి దిగిన స్మిత్ నాలుగో వికెట్ రూపంలో పెవిలియన్ చేరాడు. తొలిరోజు నుంచి నిలకడగా ఆడుతూ వాట్సన్ భాగస్వామ్యంలో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. రెండో రోజూ కూడా స్మిత్ అదే దూకుడును ప్రదర్శిస్తూ ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడాడు. స్మిత్ ఆడిన నాలుగు టెస్టు సిరీస్ లలో ఎనిమిదోవ సెంచరీ నమోదు చేసి తన ఖాతాలో వేసుకున్నాడు. యాదవ్ బౌలింగ్ లో సహా కు క్యాచ్ ఇచ్చి స్మిత్ పెవిలియన్ కు చేరాడు. రెండు రోజులు కలిపి 208 బంతుల్లో 15 ఫోర్లు బాదిన స్మిత్ 117 పరుగులకు ఔటయ్యాడు. ఆస్ట్రేలియా 116.1 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 416 పరుగులతో కొనసాగుతోంది. ప్రస్తుతం మార్ష్(10), బర్న్స్ (0) క్రీజులో ఉన్నారు. కాగా, టీమిండియా బౌలర్లలో మహ్మద్ షమీ రెండు వికెట్లు తీసుకోగా, అశ్విన్, యాదవ్ తలో వికెట్ తీసుకోన్నారు. -
400 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా
సిడ్నీ: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో రోజు ఆరంభమైన చివరి టెస్ట్ మ్యాచ్ లో ఆసీస్ 107.2 ఓవర్లలో 400 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. ఆసీస్ ఓపెనర్ గా బరిలోకి దిగిన వాట్సన్ మూడో వికెట్ రూపంలో పెవిలియన్ చేరాడు. తొలిరోజు నుంచి నిలకడగా ఆడుతూ స్మిత్ భాగస్వామ్యంలో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. రెండో రోజూ కూడా వాట్సన్ అదే దూకుడును ప్రదర్శించాడు. ఇంతలో మహ్మద్ షమీ బౌలింగ్ లో ఆశ్వీన్ కు క్యాచ్ ఇచ్చిన వాట్సన్ పెవిలియన్ బాటపట్టాడు. రెండు రోజులు కలిపి 183 బంతుల్లో 7 ఫోర్లు బాదిన వాట్సన్ 81 పరుగులకే వెనుతిరిగాడు. ఆస్ట్రేలియా 111.2 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 412 పరుగులతో కొనసాగుతోంది. ప్రస్తుతం మార్ష్ (9), స్మిత్ 110 పరుగులతో క్రీజులో ఉన్నారు. కాగా, టీమిండియా బౌలర్లలో అశ్విన్ ఒక వికెట్ తీసుకోగా, మహ్మద్ షమీ రెండు వికెట్లు పడగొట్టాడు. -
సిడ్నీ టెస్ట్: ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ సెంచరీ
సిడ్నీ: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో రోజు ఆరంభమైన చివరి టెస్ట్ మ్యాచ్ లో ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ సెంచరీ నమోదు చేశాడు. రెండో రోజు ఆట ఆరంభించిన ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ తొలిరోజులా అదే దూకుడును ప్రదర్శించాడు. స్మిత్ ఆడిన వరుసగా నాలుగు టెస్టు సిరీస్ లలో నాలుగు సెంచరీలు నమోదు చేసి తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం 175 బంతుల్లో 15 ఫోర్లు బాదిన స్మిత్ 107 పరుగులతో క్రీజులో ఉన్నాడు. అతడికి జతగా వాట్సన్ 166 బంతుల్లో 7 ఫోర్లు, 78 పరుగులతో క్రీజులో కొనసాగుతున్నాడు. వీరిద్దరి భాగస్వామ్యంలో ఆసీస్ స్కోరు 102.3 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 393 పరుగులతో కొనసాగుతోంది. కాగా, టీమిండియా బౌలర్లలో అశ్విన్ , మహ్మద్ షమీలకు తలో వికెట్ దక్కింది. -
సిడ్నీ: రెండో రోజు ఆట ఆరంభించిన ఆస్ట్రేలియా
సిడ్నీ: బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య సిడ్ని మైదానంలో జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ లో రెండో రోజు ఆసీస్ ఆట ఆరంభమైంది. రెండో రోజు ఆట ఆరంభించిన ఆసీస్ 93.5 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 353 పరుగులతో కొనసాగుతోంది. ప్రస్తుతం షేన్ వాట్సన్ , కెప్టెన్ స్టీవ్ స్మిత్ లు హాఫ్ సెంచరీలతో క్రీజ్ లో ఉన్నారు. స్మిత్(83) పరుగులు, అతనికి జతగా వాట్సన్ (62) పరుగులతో ఆడుతున్నాడు. మొదటి రోజు మ్యాచ్.. తొలి సెషన్లో ఆసీస్ ఆటగాళ్లు చెలరేగి ఆడుతూ భారత్ బౌలర్ల ఎత్తులను చిత్తుచేశారు. విసిరిన బంతులను విసిరినట్టే వరుసగా బౌండరీలు దాటించారు. ఫలితంగా తొలిరోజు ఆట ముగిసే సరికి ఆసీస్ 90 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 348 పరుగులతో భారీ స్కోరును నమోదు చేసింది. తొలిరోజు టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ జట్టులో ఓపెనర్లగా బరిలోకి దిగిన డేవిడ్ వార్నర్ (101), రోజర్స్ (95) పరుగులు చేసి పెవిలియన్ కు చేరారు. కాగా, టీమిండియా బౌలర్లలో అశ్విన్ , మహ్మద్ షమీలకు తలో వికెట్ దక్కింది. -
భారత్-ఆస్ట్రేలియా చివరి టెస్టులో తొలిరోజు
-
తొలి రోజు ఆసీస్ స్కోరు 348/2
సిడ్నీ: టీమిండియాతో ఇక్కడ జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ లో తొలిరోజు ఆటముగిసే సమయానికి ఆసీస్ తన తొలి ఇన్నింగ్స్ లో రెండు వికెట్లు కోల్పోయి 348 పరుగులు చేసింది. ప్రస్తుతం షేన్ వాట్సన్ , కెప్టెన్ స్టీవ్ స్మిత్ లు హాఫ్ సెంచరీలతో క్రీజ్ లో ఉన్నారు. స్మిత్(82) పరుగులు చేసి మరోసారి ఆకట్టుకోగా, అతనికి జతగా వాట్సన్ (62) పరుగులతో ఆడుతున్నాడు. అంతకుముందు ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (101), రోజర్స్ (95) పరుగులు చేసి పెవిలియన్ కు చేరారు. టాస్ గెలిచిన ఆసీస్ తొలుత బ్యాటింగ్ తీసుకుంది. టీమిండియా బౌలర్లలో అశ్విన్ , మహ్మద్ షమీలకు తలో వికెట్ దక్కింది. -
షేన్ వాట్సన్ హాఫ్ సెంచరీ(321/2)
సిడ్నీ: టీమిండియాతో ఇక్కడ జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ లో ఆసీస్ ఆటగాడు షేన్ వాట్సన్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. అంతకుముందు కెప్టెన్ స్టీవ్ స్మిత్ హాఫ్ సెంచరీ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రెండు వికెట్లు కోల్పోయిన ఆసీస్ 321 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (101), రోజర్స్ (95) పరుగులు చేసి పెవిలియన్ కు చేరారు. టాస్ గెలిచిన ఆసీస్ తొలుత బ్యాటింగ్ తీసుకుంది. టీమిండియా బౌలర్లలో అశ్విన్ , మహ్మద్ షమీలకు తలో వికెట్ దక్కింది. -
సిడ్నీ టెస్ట్ : స్మిత్ హాఫ్ సెంచరీ(279/2)
సిడ్నీ: టీమిండియాతో ఇక్కడ జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ లో ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. కేవలం 71 బంతులు ఎదుర్కొన్న స్మిత్ 8 ఫోర్ల సాయంతో హాఫ్ సెంచరీ చేశాడు. అంతకుముందు ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (101), రోజర్స్ (95) పరుగుల తో శుభారంభాన్నివ్వడంతో ఆసీస్ తొలి రోజు భారీ స్కోరును నమోదు చేసే దిశగా సాగుతోంది. కెప్టెన్ స్మిత్ (53), షేన్ వాట్సన్ (31 ) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. టీమిండియా బౌలర్లలో అశ్విన్, మహ్మద్ షమీలకు తలో వికెట్ లభించింది. -
భారీ స్కోరు దిశగా ఆసీస్
సిడ్నీ: టీమిండియాతో ఇక్కడ మంగళవారం ఆరంభమైన చివరి టెస్ట్ మ్యాచ్ లో ఆసీస్ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (101), రోజర్స్ (95) పరుగుల తో శుభారంభాన్నివ్వడంతో ఆసీస్ తొలి రోజు భారీ స్కోరును నమోదు చేసే దిశగా సాగుతోంది. కెప్టెన్ స్మిత్ (28), షేన్ వాట్సన్ (10) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. లంచ్ వరకూ వికెట్లు కోల్పోని ఆసీస్ ఆ తరువాత వెనువెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. టీమిండియా బౌలర్లలో అశ్విన్, మహ్మద్ షమీలకు తలో వికెట్ లభించింది. ఈ రోజు ఆటలో 59 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయిన ఆసీస్ టీ సమయానికి 242 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ఇంకా ఈ రోజు ఆటలో సుమారు ముప్ఫై ఓవర్లు ఉండటంతో ఆసీస్ భారీ స్కోరు చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.ఇప్పటికే టెస్ట్ సిరీస్ ను కోల్పోయిన టీమిండియా ఈ చివరి టెస్టును తప్పక గెలిచి పరువు నిలుకోవాలని యత్నిస్తోంది. టెస్ట్ మ్యాచ్ లను మహేంద్ర సింగ్ ధోనీ వైదొలగడంతో విరాట్ కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా బరిలోకి దిగింది. -
తృటిలో సెంచరీ కోల్పోయిన రోజర్స్
సిడ్నీ:టీమిండియాతో ఇక్కడ జరుగుతున్న చివరి టెస్ట్ లో ఆసీస్ వెనువెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. రోజర్స్(95) పరుగుల వద్ద పెవిలియన్ కు చేరి తృటిలో సెంచరీ కోల్పోయాడు. అంతకుముందు డేవిడ్ వార్నర్ (101) పరుగులు చేసి అవుట్ కావడం తెలిసిందే. 200 పరుగుల వద్ద తొలి వికెట్ ను కోల్పోయిన ఆసీస్ మరో నాలుగు పరుగులు మాత్రమే జోడించిన రెండో వికెట్ ను నష్టపోయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఆరంభించిన ఆసీస్ కు ఓపెనర్లు శుభారంభాన్నిచ్చారు. టీమిండియా బౌలర్లలో అశ్విన్ , మహ్మద్ షమీలకు తలో వికెట్ లభించింది. -
తొలి వికెట్ ను కోల్పోయిన ఆసీస్(200/1)
సిడ్నీ: టీమిండియాతో ఇక్కడ జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ లో ఆసీస్ 200 పరుగుల వద్ద తన తొలి వికెట్ ను కోల్పోయింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ సెంచరీ చేసిన అనంతరం ఒక పరుగు మాత్రమే చేసి పెవిలియన్ కు చేరాడు. ఆసీస్ కు ఓపెనర్లు శుభారంభాన్నిచ్చారు. మరో ఓపెనర్ రోజర్స్(91) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. టీమిండియా బౌలర్ అశ్విన్ కు తొలి వికెట్ దక్కింది. -
వార్నర్ సెంచరీ: ఆసీస్ కు శుభారంభం
సిడ్నీ: టీమిండియాతో ఇక్కడ ఆరంభమైన చివరిదైన నాల్గో టెస్ట్ లో ఆసీస్ కు శుభారంభం లభించింది. తొలి ఇన్నింగ్స్ లో భాగంగా ఆసీస్ ఓపెనర్లు వార్నర్, రోజర్స్ లు ధాటిగా బ్యాటింగ్ ఆరంభించారు. వార్నర్(108 బంతుల్లో 16 ఫోర్లతో సెంచరీ నమోదు చేయగా, రోజర్స్(79)పరుగులతో క్రీజ్ లో ఉన్నాడు. ఈ సెంచరీతో వార్నర్ టెస్టుల్లో 12 సెంచరీలను నెలకొల్పాడు. ప్రస్తుతం ఆసీస్ వికెట్ నష్టపోకుండా 41.1 ఓవర్లలో 187 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ఇప్పటికే టెస్ట్ సిరీస్ ను కోల్పోయిన టీమిండియా ఈ చివరి టెస్టును తప్పక గెలిచి పరువు నిలుకోవాలని యత్నిస్తోంది. టెస్ట్ మ్యాచ్ లను మహేంద్ర సింగ్ ధోనీ వైదొలగడంతో విరాట్ కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా బరిలోకి దిగింది. -
సిడ్నీ టెస్టు: లంచ్ విరామ సమయానికి ఆస్ట్రేలియా 123/0
సిడ్ని టెస్టు: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మంగళవారమిక్కడ ఆరంభమైన నాలుగో టెస్టు మ్యాచ్ తొలిరోజు ఆటలో లంచ్ విరామ సమయానికి ఆస్ట్రేలియా 28 ఓవర్లలో 123 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఆసీస్ కు ఓపెనర్లు శుభారంభాన్నిచ్చారు. వార్నర్ 45 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేయగా, రోజర్స్ 92 బంతుల్లో 50 పరుగులు చేశాడు. ప్రస్తుతం వార్నర్ (63) రోజర్స్ (52) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. ఇప్పటికే టెస్ట్ సిరీస్ ను కోల్పోయిన టీమిండియా ఈ చివరి టెస్టును తప్పక గెలిచి పరువు నిలుకోవాలని యత్నిస్తోంది. టెస్ట్ మ్యాచ్ లను మహేంద్ర సింగ్ ధోనీ వైదొలగడంతో విరాట్ కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా బరిలోకి దిగింది. -
సిడ్నీ టెస్టు: రోజర్స్, వార్నర్ హాఫ్ సెంచరీ పూర్తి
సిడ్నీ: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మంగళవారమిక్కడ జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్ లో తొలిరోజు మ్యాచ్ లో తొలుత ఓపెనర్లుగా బరిలోకి దిగిన ఆసీస్ ఆటగాళ్లు వార్నర్, రోజర్స్ హాఫ్ సెంచరీలు పూర్తి చేశారు. వార్నర్ 45 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేయగా, రోజర్స్ 92 బంతుల్లో 50 పరుగులు చేశాడు. ప్రస్తుతం 27 ఓవర్లలో 120 పరుగులతో ఆస్ట్రేలియా ఆట కొనసాగుతోంది. రోజర్స్ 93 బంతుల్లో 7 ఫోర్లు బాది (52), వార్నర్ కూడా అదే దూకుడుగా ఆడుతూ 74 బంతుల్లో 9 ఫోర్లు బాది 63 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ఇరువురి భాగస్వామ్యంలో ఆసీస్ స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. -
నాలుగో టెస్టు: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా
సిడ్నీ: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మంగళవారమిక్కడ సిడ్నీక్రికెట్ మైదానంలో జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్ లో తొలిరోజు ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఆసీస్ ఓపెనర్లగా రోజర్స్, వార్నర్ లు బరిలోకి దిగారు. ఇదిలా ఉండగా, భారత జట్టులో నాలుగు మార్పులు జరిగాయి. గత మూడు టెస్టు మ్యాచ్ లలో పేలవమైన ఆటను ప్రదర్శించి నిరాశపరిచిన భారత్ ఆటగాళ్లు ధావన్, పూజారా, ఇషాంత్ శర్మలకు సిడ్ని మైదానంలో జరిగే కీలకమైన నాలుగో టెస్టు మ్యాచ్ లో చోటు దక్కలేదు. వారు పెవిలియన్ కే పరమితమైయ్యారు. వారి స్థానంలో రైనా, సహా, రోహిత్, భువనేశ్వర్ లకు చోటు దక్కింది. అయితే టీమిండియా సారథిగా ధోని టెస్టులకు వీడ్కోలు పలికిన తర్వాత కొత్త సారథి విరాట్ కోహ్లి నేతృత్వంలోని టీమిండియా తొలి మ్యాచ్ ఆడుతోంది. దీంతో ఐదు రోజుల ఫార్మాట్లో భారత్ దశా, దిశ ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే సిరీస్‌లో 0-2తో వెనుకబడిన భారత్.. మెల్బోర్న్లో డ్రాతో సరిపెట్టుకుంది. అయితే సిడ్నీలో మాత్రం పక్కా ప్రణాళికలతో విజయం కోసం బరిలోకి దిగుతోంది. ఈ సిరీస్‌లో మూడు శతకాలు సాధించిన కెప్టెన్ కోహ్లి నాయకత్వ ప్రతిభపై కూడా ఆసక్తికర చర్చ జరుగుతోంది. మైదానంలో దూకుడుగా ఉండే విరాట్... ఒత్తిడిని ఎలా జయిస్తాడని అందరూ ఎదురుచూస్తున్నారు. వ్యక్తిగత ప్రదర్శనతో అడిలైడ్‌లో జట్టును విజయం దరిదాపుల్లోకి తెచ్చినా... సిడ్నీలో సహచరులను నడిపించడంలో ఎలా వ్యవహరిస్తాడో వేచి చూడాలి.