మూడో వికెట్ ను కోల్పోయిన ఆసీస్(127/3) | ausist lose third wicket at 127 | Sakshi
Sakshi News home page

మూడో వికెట్ ను కోల్పోయిన ఆసీస్(127/3)

Published Fri, Jan 9 2015 11:15 AM | Last Updated on Sat, Sep 2 2017 7:27 PM

ausist lose third wicket at 127

సిడ్నీ: టీమిండియాతో జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ లో ఆసీస్ తన రెండో ఇన్నింగ్స్ లో127 పరుగుల వద్ద మూడో వికెట్ ను కోల్పోయింది. ఆసీస్ ఓపెనర్ (56) పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మూడో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. అంతకుముందు శుక్రవారం రెండో ఇన్నింగ్స్ ను ఆరంభించిన ఆసీస్ ఆదిలోనే వార్నర్ వికెట్ ను కోల్పోయింది.

 

తొలి ఇన్నింగ్స్ లో సెంచరీతో ఆకట్టుకున్న వార్నర్ ఈ ఇన్నింగ్స్ లో నిరాశపరిచాడు. కేవలం నాలుగు పరుగులు మాత్రమే చేసి అశ్విన్ బౌలింగ్ లో నిష్క్రమించాడు. అనంతరం షేన్ వాట్సన్ (16) పరుగులు చేసి పెవిలియన్ కు చేరాడు. ఈ  తొలి రెండు వికెట్లు అశ్విన్ కు లభించడం గమనార్హం. అంతకుముందు టీమిండియా 475 పరుగులకు ఆలౌటయిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement