Sydney Cricket Ground
-
Aus Vs Pak: నా రికార్డు బద్దలు కొట్టే సత్తా అతడికే ఉంది: ఆసీస్ దిగ్గజం
Australia vs Pakistan, 3rd Test: ఆస్ట్రేలియా ఆఫ్ స్పిన్నర్ నాథన్ లియోన్ ఆట తీరుపై బౌలింగ్ దిగ్గజం గ్లెన్ మెగ్రాత్ ప్రశంసలు కురిపించాడు. ఆసీస్ తరఫున తాను నెలకొల్పిన రికార్డును బద్దలు కొట్టగల సత్తా లియోన్‌కు ఉందన్నాడు. కాగా పాకిస్తాన్‌తో సొంతగడ్డపై టెస్టు సిరీస్‌ను 2-0తో సొంతం చేసుకున్న కంగారూ జట్టు.. నామమాత్రపు ఆఖరి మ్యాచ్‌కు సిద్ధమైంది. ఆమె జ్ఞాపకార్థం ‘పింక్’ టెస్టు నిర్వహణ ఇరుజట్ల మధ్య బుధవారం (జనవరి 3) నుంచి ‘పింక్ టెస్టు’ ఆరంభం కానుంది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ ఇందుకు వేదిక. కాగా బ్రెస్ట్ క్యాన్సర్‌తో మరణించిన గ్లెన్ మెగ్రాత్ సతీమణి జ్ఞాపకార్థం ప్రతి ఏడాది పింక్ టెస్టును నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా సిడ్నీలో తాజాగా జరుగనున్న మ్యాచ్ 16వది. ఈ టెస్టు సందర్భంగా మెగ్రాత్ ఫౌండేషన్ విరాళాల సేకరణ చేపట్టనుంది. ఈ సందర్భంగా గ్లెన్ మెగ్రాత్ ప్రసంగిస్తూ.. నాథన్ లియోన్ బౌలింగ్ నైపుణ్యాలను కొనియాడాడు. ‘‘ప్రతి రికార్డును ఎవరో ఒకరు బ్రేక్ చేస్తారు. ఒకవేళ లియోన్ నన్ను దాటేస్తే అంతకంటే సంతోషం ఉండదు. అతడు అసాధారణ బౌలర్. అలా అయితే అతడికి తిరుగే ఉండదు లియోన్‌కు ఆల్ ది బెస్ట్. ఒకవేళ నాతో పాటు షానో(షేన్ వార్న్) రికార్డును కూడా అధిగమిస్తే అతిడికి తిరుగే ఉండదు. లియోన్ బౌలింగ్ నైపుణ్యాలు అద్భుతం. పరిస్థితులకు తగ్గట్లుగా ఆడటం అతడికి అలవాటు’’ అని మెగ్రాత్ పేర్కొన్నాడు. కాగా ఆస్ట్రేలియా తరఫున అత్యధిక వికెట్లు పడగొట్టిన ఫాస్ట్ బౌలర్‌గా గ్లెన్ మెగ్రాత్ ఘనత సాధించాడు. నేటికీ అతడి రికార్డు చెక్కుచెదరకుండా ఉంది. ఆసీస్ తరఫున 124 టెస్టులు ఆడిన రైటార్మ్ పేసర్ మెగ్రాత్ 563 వికెట్లు తీశాడు. 500 వికెట్ల క్లబ్లో నాథన్ లియోన్ మరోవైపు.. ఆఫ్ స్పిన్నర్ నాథన్ లియోన్ ఇటీవలే 500 వికెట్ల క్లబ్లో చేరాడు. పాకిస్తాన్‌తో పెర్త్ టెస్టు సందర్భంగా ఈ మైలురాయిని చేరుకున్నాడు. తాజా పింక్ టెస్టుకు ముందు అతడి ఖాతాలో మొత్తంగా 505 వికెట్లు ఉన్నాయి. సుమారు మరో నాలుగేళ్ల పాటు టెస్టు క్రికెట్ ఆడే సత్తా ఉన్న లియోన్ ఇంకో 59 వికెట్లు తీస్తే .. ఆసీస్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన ఓవరాల్ బౌలర్ల జాబితాలో మెగ్రాత్‌ను అధిగమిస్తాడు. ఇదిలా ఉంటే.. ఆసీస్ దిగ్గజ దివంగత స్పిన్నర్ షేన్ వార్న్ టెస్టుల్లో 708 వికెట్లు తీసి ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. చదవండి: IPL 2024: హార్దిక్ పాండ్యా దూరం! ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా బుమ్రా? -
టెస్ట్‌లకు డేవిడ్ వార్నర్ గుడ్ బై
ఆస్ట్రేలియా వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ రిటైర్మెంట్పై కీలక ప్రకటన చేశాడు. వచ్చే ఏడాది (2024) జనవరిలో తన సొంత మైదానమైన సిడ్నీలో తన చివరి టెస్ట్ మ్యాచ్ (పాకిస్తాన్) ఆడనున్నట్లు ప్రకటించాడు. ప్రస్తుతం టీమిండియాతో జూన్ 7 నుంచి జరుగబోయే డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం కఠోరంగా శ్రమిస్తున్న వార్నర్.. 2024 టీ20 వరల్డ్‌కప్ తనకు ఆస్ట్రేలియా తరఫున చివరి టోర్నీ అవుతుందని తెలిపాడు. ఈ విషయాలను అతనే స్వయంగా వెల్లడించాడు. కాగా, 36 ఏళ్ల వార్నర్ ఇటీవలి కాలంలో టెస్ట్‌ల్లో పెద్దగా రాణించడం లేదు. రెండేళ్ల వ్యవధిలో అతనాడిన 17 టెస్ట్‌ల్లో కేవలం ఒక్క సెంచరీ మాత్రమే చేశాడు. అయితే వార్నర్ పరిమిత ఓవర్ల ఫార్మాట్లో మాత్రం పర్వాలేదనిపిస్తున్నాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2023లో జట్టు మొత్తం విఫలమైన అతను మాత్రం ఇరగదీశాడు. ఇందుకేనేమో అతను పరిమిత ఓవర్ల ఫార్మాట్లో మరో ఏడాది పాటు కంటిన్యూ కావాలని భావిస్తున్నాడు. 2009లో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన వార్నర్.. ఇప్పటివరకు 103 టెస్ట్‌లు (25 శతకాలు, 34 అర్ధశతకాల సాయంతో 8158 పరుగులు), 142 వన్డేలు (19 సెంచరీలు, 27 హాఫ్‌సెంచరీల సాయంతో 6030 పరుగులు), 99 టీ20లు (సెంచరీ, 24 అర్ధ సెంచరీల సాయంతో 2894 పరుగులు) ఆడాడు. వార్నర్ 2009 నుంచి ఐపీఎల్లో వివిధ జట్ల తరఫున 176 మ్యాచ్‌లు ఆడి 4 సెంచరీలు, 61 హాఫ్ సెంచరీల సాయంతో 6397 పరుగులు చేశాడు. చదవండి: 93 ఏళ్ల కిందటి బ్రాడ్‌మన్ రికార్డు బద్దలు కొట్టిన ఇంగ్లండ్ ఓపెనర్ -
ఎస్సీజీ గేట్‌కు సచిన్ పేరు
సిడ్నీ: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సోమవారం (ఏప్రిల్ 24) 50వ పుట్టినరోజు జరుపుకున్నాడు. క్రికెట్ ప్రేక్షకులకు, ప్రత్యేకించి ‘మాస్టర్’ బ్యాట్స్‌మన్ అభిమానులకు ఇది పండగ రోజు. ఈ ‘ఫిఫ్టీ’ని మరింత చిరస్మరణీయం చేసుకునేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) వైపు నుంచి అపురూప కానుక లభించింది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ (ఎస్సీజీ)లోని ఓ గేట్‌కు సచిన్ పేరు పెట్టింది. ఈ మైదానం అతనికెంతో ప్రత్యేకమైంది. ఈ వేదికపై ‘లిటిల్ మాస్టర్’ మూడు శతకాలు సహా 785 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 241 (2004లో). ఇక్కడ సచిన్ 157 సగటు నమోదు చేయడం మరో విశేషం. సోమవారం సచిన్ 50వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఎస్సీజీ, న్యూసౌత్‌వేల్స్ వేదికల చైర్మన్ రాడ్ మెక్ గియోచ్, సీఈఓ కెర్రీ మాథెర్, క్రికెట్ ఆస్ట్రేలియా సీఈఓ నిక్ హాక్లీ ‘సచిన్ గేట్’ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సచిన్ అనుభవాన్ని ప్రస్తావించారు. ‘భారత్ వెలుపల సిడ్నీ నా ప్రియమైన మైదానం.1991–92లో నా తొలి ఆసీస్ పర్యటన మొదలు కెరీర్ ముగిసేదాకా ఎస్సీజీలో నాకు మరిచిపోలేని స్మృతులెన్నో వున్నాయి’ అని సచిన్ పేర్కొన్నారు. సచిన్ సమకాలికుడు బ్రియాన్ లారా (విండీస్) కూడా అక్కడ గొప్ప గొప్ప ఇన్నింగ్స్‌ల ఆడటంతో మరో గేట్‌కు లారా పేరు పెట్టారు. తనకు కలిసొచ్చిన ఈ మైదానం పేరును లారా తన కుమార్తెకు ‘సిడ్నీ’ అని పెట్టుకున్నాడు. -
'మీ ఆటకు ఫిదా.. అవేవి మిమ్మల్ని ఆపలేదు'
సిడ్నీ: ఆసీస్‌తో జరిగిన మూడో టెస్టులో భారత్ ఓటమి నుంచి తప్పించుకోవడంలో హనుమ విహారి, రవిచంద్రన్ అశ్విన్ చూపించిన తెగువపై అన్ని వైపుల నుంచి ప్రశంసలు లభిస్తున్న సంగతి తెలిసిందే. ఆసీస్ పేసర్ల బౌన్సర్లు వీరిని కలవరపెట్టినా ఏ మాత్రం బెదరకుండా ఇన్నింగ్స్ ఆడిన తీరు అద్భుతమనే చెప్పొచ్చు. కాగా విహారీ, అశ్విన్‌ల ఆటతీరుపై తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా ప్రశంసలు కురిపించాడు. (చదవండి: దుమ్మురేపిన జడేజా.. అగ్రస్థానంలో విలియమ్సన్) 'నిజంగా నిన్న అద్భుతమైన టెస్టు మ్యాచ్ చూశా! విహారి, అశ్విన్లిద్దరు ఒత్తిడిని అధిగమించి బ్యాటింగ్ కొనసాగించిన తీరుకు ఫిదా అయ్యా. ఆటలో భాగంగా ఆసీస్ బౌలర్ల నుంచి పదునైన బౌన్సర్లతో గాయాలవుతున్న అవేవి మిమ్మల్ని ఆపలేదు.. పైగా ఓటమిని దరిచేయకుండా అద్భుతమైన ఇన్నింగ్స్‌ను ఆడారు. మ్యాచ్‌ను డ్రా చేయాలనే మీ సంకల్ప దృడత్వాన్ని ఇక మీదట అలాగే కొనసాగించండి. మ్యాచ్ విజయం కన్నా డ్రాగా ముగించడం మరింత ఆనందాన్నిచ్చింది.'అంటూ తెలిపారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. హనుమ విహారి (161 బంతుల్లో 23 నాటౌట్; 4 ఫోర్లు), రవిచంద్రన్ అశ్విన్ (128 బంతుల్లో 39 నాటౌట్; 7 ఫోర్లు)ల మారథాన్ భాగస్వామ్యంతో మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. వీరిద్దరు 42.4 ఓవర్లపాటు క్రీజ్‌లో నిలిచి ఆరో వికెట్‌కు 62 పరుగులు జోడించారు. ఆసీస్ బౌలర్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ జోడీని విడదీయడంలో విఫలమయ్యారు. మ్యాచ్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచిన స్టీవ్ స్మిత్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఈ నెల 15 నుంచి బ్రిస్బేన్‌లో చివరిదైన నాలుగో టెస్టు జరుగుతుంది. (చదవండి: బుమ్రా ఔట్.. డైలమాలో టీమిండియా) -
'వీధి రౌడీలకంటే దారుణంగా ప్రవర్తించారు'
సిడ్నీ: టీమిండియా క్రికెటర్లు మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రాపై ఆసీస్ అభిమానులు జాతి వివక్ష వ్యాఖ్యలపై పలువురు మాజీ క్రికెటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. క్రికెట్లో ఇలాంటి వాటికి తావులేదని.. ఎవరైనా అలా చేస్తే మరే మ్యాచ్‌కు అనుమతి లేకుండా వారిపై జీవితకాల నిషేధం విధించాలని పేర్కొన్నారు. తాజాగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి బుమ్రా, సిరాజ్‌ల విషయంపై ట్విటర్లో సీరియస్ అయ్యాడు.(చదవండి: బ్రౌన్ డాగ్.. బిగ్ మంకీ అంటూ సిరాజ్‌పై మరోసారి) 'ఆసీస్‌తో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో కొందరు అభిమానులు వీధి రౌడీలకంటే దారుణంగా ప్రవర్తించారు. జెంటిల్మెన్ గేమ్‌కు పెట్టింది పేరైన క్రికెట్లో జాత్యహంకార వ్యాఖ్యలు సహించరానివి. గ్రౌండ్లో ఇప్పటికే ఇలాంటి ఎన్నో ఘటనలు చూశాం.. కానీ ఇవాళ చేసిన పని అసలు సిసలు రౌడీ ప్రవర్తనకు నిదర్శనంగా కనిపిస్తోంది. వెంటనే ఈ ఘటనపై విచారణ జరపాలి. మళ్లీ ఇలాంటివి జరగకుండా బాధ్యులపై కఠినమైన చర్యలు తీసుకోవాలంటూ' విరాట్ ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశాడు. Racial abuse is absolutely unacceptable. Having gone through many incidents of really pathetic things said on the boundary Iines, this is the absolute peak of rowdy behaviour. It's sad to see this happen on the field. — Virat Kohli (@imVkohli) January 10, 2021 కాగా సిడ్నీ టెస్టులో మూడో రోజు ఆటలో సిరాజ్, బుమ్రాను లక్ష్యంగా చేసుకొని జాతి వివక్ష వ్యాఖ్యలు చేసిన కొంతమంది.. నాలుగోరోజు మరోసారి సిరాజ్‌ను లక్ష్యంగా చేసుకొని వర్ణ వివక్ష వ్యాఖ్యలు చేశారు. నాలుగో రోజు రెండో సెషన్లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో బ్రౌన్ డాగ్, బిగ్ మంకీ అంటూ సిరాజ్‌నుద్దేశించి వ్యాఖ్యలు చేశారు. సిరాజ్ ఫిర్యాదుతో ఆ వ్యాఖ్యలు చేసిన వారిని పోలీసులు బయటకు పంపించేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఐసీసీ కూడ సీరియస్ అయింది. టీమిండియా ఇచ్చిన ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్న ఐసీసీ విచారణను కూడా చేపట్టింది.(చదవండి: కెప్టెన్‌తో గొడవ.. టీమ్ నుంచి వెళ్లిపోయిన ఆల్‌రౌండర్) -
బ్రౌన్ డాగ్.. బిగ్ మంకీ అంటూ సిరాజ్‌పై మరోసారి
సిడ్నీ: ఆసీస్‌తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా బౌలర్ మహ్మద్ సిరాజ్‌కు ఆదివారం మరోసారి చేదు అనుభవం ఎదురైంది. శనివారం మూడో రోజు ఆటలో భాగంగా సిరాజ్, బుమ్రాలపై జాతి వివక్ష వ్యాఖ్యలతో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే క్రికెట్ ఆస్ట్రేలియా బీసీసీఐని క్షమాపణ కోరింది. మరోవైపు ఐసీసీ కూడా దీనిని సీరియస్‌గా భావించి కఠిన చర్యలు తీసుకోవాలని భావిస్తుంది. ఇదంతా జరిగి ఒకరోజు గడవక ముందే మరోసారి సిరాజ్‌పై వర్ణ వివక్ష వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది.(చదవండి: బుమ్రా, సిరాజ్‌లపై వర్ణ వివక్ష వ్యాఖ్యలు) నాలుగోరోజు ఆటలో భాగంగా రెండో సెషన్లో బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న మహ్మద్ సిరాజ్‌ను కొందరు 'బ్రౌన్ డాగ్, బిగ్ మంకీ' అంటూ కామెంట్ చేశారు. దీంతో సిరాజ్ అంపైర్లను ఆశ్రయించి మరోసారి ఫిర్యాదు చేశాడు. సిరాజ్‌తో పాటు కెప్టెన్ రహానే ఫిర్యాదుతో కాసేపు చర్చించుకున్న అంపైర్లు ఆటను నిలిపివేసి పోలీసులను రంగంలోకి దింపారు. తనపై కామెంట్ చేసిన వారిని సిరాజ్ గుర్తించాడు. వెంటనే పోలీసులు వాళ్లను స్టేడియం నుంచి బయటికి వెళ్లిపోవాల్సిందిగా సూచించారు. ఇప్పటికే ఈ విషయంపై బీసీసీఐ గుర్రుగా ఉంది. టీమిండియా క్రికెటర్లు వెంటనే మేనేజ్మెంట్కు తెలియజేశారు. దీనిపై టీమిండియా మేనేజ్మెంట్ ఐసీసీకి ఫిర్యాదు చేసింది.(చదవండి: కెప్టెన్‌తో గొడవ.. టీమ్ నుంచి వెళ్లిపోయిన ఆల్‌రౌండర్) ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన ఐసీసీ, టీమిండియా ఫిర్యాదును స్వీకరించి విచారణకు సిద్ధమైంది. సిడ్నీ క్రికెట్ మైదానం నిర్వహణ బాధ్యతలు చూస్తున్న 'వెన్యూస్ న్యూసౌత్ వేల్స్' తో కలిసి సీసీ టీవీ కెమెరాల ఫుటేజిని పరిశీలిస్తోంది. కాగా క్రికెటర్లపై ఇలా జాతి వివక్ష కామెంట్లు చేసే ప్రేక్షకులను స్టేడియానికి రాకుండా జీవితకాలం నిషేధం విధించాలంటూ పలువురు మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. ఆస్ట్రేలియాలో పర్యటించే క్రికెట్ జట్లకు ఇలాంటి అనుభవాలు కొత్త కాదు. గతంలోనూ అనేక వివాదాలు వర్ణ వివక్ష వ్యాఖ్యల ఫలితంగానే జరిగాయి. సరిగ్గా 13 ఏళ్ల క్రితం ఇదే సిడ్నీ వేదికలో హర్భజన్, సైమండ్స్‌ల మధ్య చోటుచేసుకున్న మంకీ గేట్ వివాదం ఎంత రచ్చగా మారిందో అందరికి తెలిసిందే.(చదవండి: కిందా మీదా పడ్డాడు.. చివరకు రనౌట్ చేశాడు) Bring back Kohli for the 4th Test Match This drunk australians are Abusing Siraj non-stop#INDvsAUS pic.twitter.com/C56IIZcfow — Gaurav (@GauravK_8609) January 10, 2021 -
సిడ్నీ టెస్ట్: బుమ్రా, సిరాజ్‌లపై వర్ణ వివక్ష వ్యాఖ్యలు
సిడ్నీ వేదికగా ఆసీస్‌తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా బౌలర్లు మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రాలకు చేదు అనుభవం ఎదురైంది. మ్యాచ్ చూడడానికి వచ్చిన అభిమానుల్లో కొంతమంది డ్రింక్స్ సపోర్టర్స్ సిరాజ్, బుమ్రాలపై వర్ణ వివక్ష వ్యాఖ్యలు చేయడం వివాదాస్పందంగా మారింది. మూడోరోజు ఆటలో భాగంగా ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే టీమిండియా బౌలర్లపై చేసిన వర్ణ వివక్ష వ్యాఖ్యలు టీమిండియా దృష్టికి రావడంతో కెప్టెన్ అజింక్యా రహానే జట్టులోని సీనియర్ ఆటగాళ్లైన అశ్విన్, రోహిత్ శర్మలతో కలిసి ఆన్‌ఫీల్డ్ అంపైర్లతో పాటు మ్యాచ్ రిఫరీకి ఫిర్యాదు చేశాడు. కాగా బౌలర్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తుల గురించి సీసీ ఫుటేజీ ద్వారా ఆరా తీసి తగిన చర్య తీసుకుంటామని సిడ్నీ క్రికెట్ అసోసియేషన్ తెలిపింది.(చదవండి: వాటే సెన్సేషనల్ రనౌట్..!) కాగా సిరాజ్, బుమ్రాలపై డ్రింక్ సపోర్టర్స్ వ్యవహరించిన తీరును తప్పుబట్టిన టీమిండియా ఫిర్యాదుపై ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పింది.అంతేగాక వర్ణ వివక్షను వ్యతిరేకిస్తూ.. 2019 వరల్డ్ కప్ సాధించిన ఇంగ్లండ్ జట్టు గురించి ఒక వీడియోను రిలీజ్ చేసింది. ఇంగ్లండ్ జట్టు ప్రపంచకప్ సాధించడంలో జోఫ్రా ఆర్చర్ కీలకపాత్ర పోషించాడు. ఫైనల్ మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీయడంతో ఆర్చర్ సూపర్ ఓవర్‌ను సూపర్‌గా వేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. అతను నల్ల జాతీయుడు.. కానీ ఏనాడు అతన్ని ఇంగ్లండ్ జట్టు వేరుగా చేసి చూడలేదు. క్రికెట్ అంటేనే జెంటిల్మెన్ గేమ్‌కు పెట్టింది పేరు. తుది జట్టులో 11 మంది ఉంటే.. వారు విభిన్న వ్యక్తిత్వాలు కలిగి ఉంటారు. వైవిధ్యం లేకపోతే క్రికెట్ అనే పదానికి అర్థం లేదు. ఇలా వర్ణ వివక్ష వ్యాఖ్యలతో ఆటగాళ్లను మానసికక్షోభకు గురి చేయడం కరెక్ట్ కాదు. అంటూ ట్వీట్ చేసింది.(చదవండి: ఆసీస్ క్రికెటర్‌పై షేన్ వార్న్ అసభ్యకర వ్యాఖ్యలు) కాగా సిరాజ్, బుమ్రాలపై వర్ణ వివక్ష వ్యాఖ్యలు చేయడంపై సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టీమిండియా అభిమానులు సిడ్నీఅభిమానులపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా సరిగ్గా 13 ఏళ్ల క్రితం ఇదే సిడ్నీ మైదానంలో ఆసీస్ మాజీ ఆటగాడు ఆండ్రూ సైమండ్స్ , టీమిండియా వెటెరన్ బౌలర్ హర్భజన్ సింగ్‌ల మధ్య చోటుచేసుకున్న వివాదం అంత తేలిగ్గా ఎవరు మరిచిపోలేరు. అప్పటి టెస్టు మ్యాచ్‌లో వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ మంకీగేట్ వివాదంగా క్రికెట్ చరిత్రలో పెను సంచలనం రేపింది. -
డేవిడ్ వార్నర్ ఇన్.. బర్న్స్ అవుట్
సిడ్నీ : టీమిండియాతో జరగనున్న మూడో టెస్టుకు ఆసీస్ విధ్వంసక ఆటగాడు డేవిడ్ వార్నర్ అందుబాటులోకి రానున్నాడు. మొదటి రెండు టెస్టుల్లో ఆడిన ఓపెనర్ జో బర్న్స్ స్థానంలో వార్నర్‌ను ఎంపిక చేసినట్లు ఆసీస్ జట్టు సెలెక్టర్ ట్రేవర్ హోన్స్ తెలిపాడు. ఈ మేరకు మూడు, నాలుగు టెస్టులకు 18 మందితో ఆసీస్ జట్టును ప్రకటించింది. కాగా టీమిండియాతో జరిగిన రెండో వన్డేలో వార్నర్ గాయపడిన సంగతి తెలిసిందే.గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో చివరి వన్డేతో పాటు మూడు టీ20ల సిరీస్‌కు దూరమయ్యాడు. (చదవండి : ‘స్టీవ్ స్మిత్‌పై నాకు నమ్మకం ఉంది’) అయితే వార్నర్ టెస్టు సిరీస్‌కు అందుబాటులో ఉంటాడని అంతా భావించారు.. కానీ గాయం తీవ్రతపై స్పష్టం లేకపోవడంతో మొదటి రెండు టెస్టులకు అతన్ని పరిగణలోకి తీసుకోలేదు. తాజాగా వార్నర్ గాయం నుంచి పూర్తిగా కోలుకోవడంతో మిగిలిన రెండు టెస్టులకు ఎంపిక చేశామని క్రికెట్ ఆస్ట్రేలియా పేర్కొంది. వాస్తవానికి జో బర్న్స్ మొదటి రెండు టెస్టుల్లో పర్వాలేదనిపించే ప్రదర్శన నమోదు చేశాడు. బర్న్స్ నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 8,51*, 0,4 కలిపి 125 పరుగులు సాధించాడు. ఇందులో ఒక అర్థసెంచరీ ఉంది. అయితే మరో ఓపెనర్ మాథ్యూ వేడ్ ప్రదర్శన స్థిరంగా ఉండడంతో వార్నర్ కోసం బర్న్స్‌ను పక్కడపెట్టాల్సి వచ్చిందని స్పష్టం చేసింది. మరోవైపు త్యాగి బౌన్సర్‌తో గాయపడ్డ పుకోవిస్కిని ఎంపిక చేసినా తుది జట్టులోకి వచ్చే దానిపై స్పష్టత లేదని తెలిపింది. కాగా వార్నర్ రాకతో ఆసీస్ కాస్త బలంగా తయారైనట్లు కనిపిస్తుంది. అడిలైడ్ వేదికగా జరిగిన మొదటి టెస్టులో టీమిండియాపై ఘన విజయం సాధించిన ఆసీస్‌కు మెల్బోర్న్లో షాక్ తగిలింది. టీమిండియా సమిష్టి ప్రదర్శనతో రెండో టెస్టులో ఆసీస్ ఘోర పరాజయం మూటగట్టుకుంది. ఇరుజట్ల మధ్య మూడో టెస్టు సిడ్నీ వేదికగా జనవరి 7 నుంచి జరగనుంది. ఆస్ట్రేలియా జట్టు డేవిడ్ వార్నర్, విల్ పుకోవిస్కీ, మార్కస్ హారిస్, మాథ్యూ వేడ్, స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్, ట్రేవిస్ హెడ్, మాట్ హెన్రిక్స్, టిమ్ పైన్ (కెప్టెన్), పాట్ కమిన్స్, కెమెరాన్ గ్రీన్, సీన్ అబాట్,నాథన్ లైయన్, మిచెల్ స్టార్క్, మిచెల్ స్వెప్సన్, జోష్ హాజిల్‌వుడ్, జేమ్స్ ప్యాటిన్సన్, మైఖేల్ నాజర్ -
టీమిండియా క్లీన్‌స్వీప్ చేయనుందా ?
సిడ్నీ : ఆసీస్‌తో జరగుతున్న మూడో టీ20లో టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఏంచుకుంది. కాగా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఆస్ట్రేలియాతో టి20 సిరీస్‌ను సొంతం చేసుకున్న భారత్ క్లీన్‌స్వీప్‌పై కన్నేసింది. గత మ్యాచ్ వేదికలోనే ఇరు జట్లు మూడో టీ20లో తలపడనున్నాయి. వన్డే సిరీస్ తరహాలోనే చివరి మ్యాచ్ గెలిచి ఆసీస్ లెక్క సరి చేస్తుందా... లేక భారత్ తమ జోరు కొనసాగించి రెండోసారి ఆసీస్‌ను క్లీన్‌స్వీప్ చేస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. భారత్ ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగగా.. ఇక ఆసీస్ విషయానికి వస్తే గత మ్యాచ్‌కు దూరంగా ఉన్న రెగ్యులర్ కెప్టెన్ ఫించ్ మళ్లీ తుది జట్టులోకి వచ్చేశాడు. తుది జట్లు : భారత్ : కోహ్లి (కెప్టెన్), శిఖర్ ధావన్, రాహుల్, సామ్సన్, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, శార్దుల్, సుందర్, దీపక్ చహర్, నటరాజన్, చహల్ ఆస్ట్రేలియా : ఆరోన్ ఫించ్ (కెప్టెన్), మాథ్యూ వేడ్, మ్యాక్స్‌వెల్, డీ ఆర్సీ షార్ట్, హెన్రిక్స్, సీన్ అబాట్, స్యామ్స్, స్వెప్సన్, జంపా, ఆండ్రూ టై -
ఆసీస్‌కు ముగ్గురు కీలక ఆటగాళ్లు దూరం
సిడ్నీ : ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఏంచుకుంది. కాగా మూడు వన్డేల సిరీస్‌ను 2- 1 తేడాతో ఆతిథ్య జట్టుకు కోల్పోయిన టీమిండియా ఈ మ్యాచ్‌లో గెలిచి టీ 20 సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే వశం చేసుకోవాలని భావిస్తోంది. కాగా ఆసీస్ మాత్రం ఈ మ్యాచ్ గెలిచి సిరీస్‌ను సమం చేయాలని భావిస్తోంది. ఆసీస్‌తో జరిగిన చివరి వన్డేలో గెలుపు ద్వారా ఫామ్‌లోకి వచ్చిన టీమిండియా తొలి టి 20లో ప్రతాపం చూపింది. కోహ్లి సేన ఆఖరిదాకా లాక్కెళ్లకుండా రెండో మ్యాచ్‌లోనే పొట్టి సిరీస్ నెగ్గాలనే పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో రెండో టి20లో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. భారత్ విజయాల జోరులో ఉంటే... ఆస్ట్రేలియాను గాయాలు కలవరపెడుతున్నాయి. ఇప్పటికే డేవిడ్ వార్నర్ టీ20 సిరీస్‌కు దూరం కాగా, అరోన్ ఫించ్ సైతం రెండో టీ20కి దూరమయ్యాడు. గాయం కారణంగా ఫించ్ మ్యాచ్‌కు దూరమయ్యాడు. దాంతో ఆసీస్ కెప్టెన్‌గా మాథ్యూ వేడ్ వ్యవహరిస్తున్నాడు. దాంతో పాటు హజల్‌వుడ్, స్టార్క్‌లు కూడా రెండో టీ20కి అందుబాటులో లేరు. ముగ్గురు కీలక ఆటగాళ్లు దూరం కావడం ఆసీస్‌ను కలవర పరుస్తోంది. వీరి ముగ్గురు స్థానాల్లో సామ్స్, స్టోయినిస్, అండ్రూ టైలు తుది జట్టులోకి వచ్చారు. ఇక టీమిండియా విషయానికొస్తే గాయపడ్డ జడేజా స్థానంలో చహల్ తుది జట్టులోకి రాగా, మనీష్ పాండే స్థానంలో శ్రేయాస్ అయ్యర్‌ను తీసుకున్నారు. కాగా ఆసీస్ రెగ్యులర్ కెప్టెన్ ఫించ్ ఈ మ్యాచ్‌కు దూరంగా ఉండడంతో అతని స్థానంలో మాథ్యూ వేడ్ నాయకత్వం వహించనుండగా.. స్టార్క్ స్థానంలో డేనియల్ సామ్స్ తుది జట్టులోకి వచ్చాడు. తుది జట్లు : భారత్: కోహ్లి (కెప్టెన్), ధావన్, రాహుల్, సామ్సన్, శ్రేయాస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, సుందర్, దీపక్ చహర్, నటరాజన్, శార్దూల్ ఠాకూర్, చహల్ ఆస్ట్రేలియా: డార్సీ షార్ట్, వేడ్(కెప్టెన్), స్మిత్, మ్యాక్స్‌వెల్, హెన్రిక్స్, అబాట్, స్వెప్సన్, జంపా, స్టోయినిస్, అండ్రూ టై,డేనియల్ సామ్స్ -
ఎంఎస్ ధోని మరో మైలురాయి
సిడ్నీ: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని తన కెరీర్లో మరో మైలురాయిని అందుకున్నాడు. భారత్ తరపున అంతర్జాతీయ వన్డేల్లో పదివేల పరుగుల మార్కును ధోని చేరాడు. ఫలితంగా ఈ ఘనత సాధించిన ఐదో భారత క్రికెటర్‌గా ధోని గుర్తింపు పొందాడు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా సిడ్నీ వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో ధోని ఈ ఫీట్‌ను సాధించాడు. ఈ మ్యాచ్‌కు ముందు 9,999 పరుగులతో ఉన్న ధోని.. పరుగు సాధించడంతో పదివేల పరుగుల మార్కును చేరుకున్నాడు. ఆసీస్ పేసర్ రిచర్డ్సన్ బౌలింగ్‌లో సింగిల్ తీసి పదివేల క్లబ్లో చేరాడు. నిజానికి గతేడాదే ధోని 10వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. గడిచిన ఏడాది ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లోనే ధోని ఈ మార్కును చేరాడు. అయితే, అందులో 174 పరుగులు ఆసియా ఎలెవన్ తరఫున ఆడి చేసినవి కావడం విశేషం. 2007లో ఆఫ్రికా ఎలెవన్, ఆసియా ఎలెవన్ మధ్య జరిగిన ఆ టోర్నీలో మూడు వన్డేలాడిన ధోని 174 పరుగులు చేశాడు. తాజాగా వన్డే ఫార్మాట్లో భారత్ తరఫున పది వేల పరుగుల మార్కును ధోని అందుకున్నాడు. కాగా, భారత్ తరఫున ఇప్పటి వరకూ సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్ , విరాట్ కోహ్లిలు మాత్రమే పది వేల పరుగులు మైలురాయిని అందుకున్నారు. ఈ ఒక్క పరుగుని ధోని గత ఏడాది నవంబర్ నెలలో వెస్టిండిస్ జట్టు భారత్‌లో పర్యటించిన సమయంలోనే అందుకోవాల్సి ఉంది. తిరువనంతపురం వేదికగా జరిగిన ఐదో వన్డేకి ముందు ఎంఎస్ ధోని పది వేల పరుగుల మార్కును చేరుకునేందుకు పరుగు దూరంలో నిలిచాడు. ఆ మ్యాచ్‌లో ధోనికి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. విండీస్ నిర్దేశించిన 105 పరుగుల లక్ష్యాన్ని భారత్ వికెట్ కోల్పోయి ఛేదించడంతో ధోని బ్యాటింగ్ చేసే అవసరం లేకుండా పోయింది. ఆసీస్‌తో తాజా మ్యాచ్ ధోనికి 333 వన్డే. ఈ మ్యాచ్‌లో భారత్ 4 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 289 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన భారత్ మూడు ప్రధాన వికెట్లను ఆరంభంలోనే కోల్పోయింది. ఓపెనర్ శిఖర్ ధావన్ డకౌట్‌గా పెవిలియన్ చేరాడు. ధావన్ ఎదుర్కొన్న తొలి బంతికే ఔటయ్యాడు. దాంతో గోల్డెన్ డక్‌గా ఔటైన అపప్రథను మూటగట్టుకున్నాడు. అటు తర్వాత విరాట్ కోహ్లి(3), అంబటి రాయుడు(0)లు కూడా ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. ఈ తరుణంలో రోహిత్ శర్మతో జత కలిసిన ధోని ఇన్నింగ్స్ మరమ్మత్తులు చేపట్టాడు. -
తొలి వన్డే: పీకల్లోతు కష్టాల్లో టీమిండియా
సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. నాలుగు పరుగులకే మూడు ప్రధాన వికెట్లు కోల్పోయి ఎదురీదుతోంది. ఆసీస్ నిర్దేశించిన 289 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన టీమిండియా తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయింది. ఓపెనర్ శిఖర్ ధావన్ డకౌట్‌గా పెవిలియన్ చేరాడు. ధావన్ ఎదుర్కొన్న తొలి బంతికే ఔటయ్యాడు. దాంతో గోల్డెన్ డక్‌గా ఔటైన అపప్రథను మూటగట్టుకున్నాడు. ఆసీస్ పేసర్ బెహ్రాన్‌డార్ఫ్ వేసిన తొలి ఓవర్ ఆఖరి బంతిని ఆడటంలో తడబడిన ధావన్ వికెట్లు ముందు దొరికిపోయాడు. తొలి ఓవర్ ఐదో బంతికి ఎక్స్ట్రా(లెగ్ బై) రూపంలో పరుగు రాగా, ఆపై మరుసటి బంతికి ధావన్ ఎల్బీగా పెవిలియన్ చేరాడు. అటు తర్వాత విరాట్ కోహ్లి(3) సైతం నిరాశపరచడంతో టీమిండియా నాలుగు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆపై వెంటనే అంబటి రాయుడు డక్ ఔట్ కావడంతో భారత్ కష్టాల్లో పడింది. కోహ్లి, రాయుడు వికెట్లను యువ పేసర్ రిచర్డ్సన్ తీసి ఆసీస్‌కు బ్రేక్ ఇచ్చాడు. అంతకుముందు ఆసీస్ 50 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 288 పరుగులు చేసింది. ఉస్మాన్ ఖవాజా(59; 81 బంతుల్లో 6 ఫోర్లు), షాన్ మార్ష్(54; 70 బంతుల్లో 4 ఫోర్లు), హ్యాండ్ స్కాంబ్(73; 61 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు)లు హాఫ్ సెంచరీలతో రాణించడంతో పాటు మార్కస్ స్టోనిస్(47 నాటౌట్; 43 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆకట్టుకోవడంతో ఆసీస్ గౌరవప్రదమైన స్కోరు సాధించింది. -
టీమిండియా లక్ష్యం 289
సిడ్నీ: భారత్‌తో ఇక్కడ జరుగుతున్న తొలి వన్డేలో ఆస్ట్రేలియా 289 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆసీస్ జట్టులో ఉస్మాన్ ఖవాజా(59; 81 బంతుల్లో 6 ఫోర్లు), షాన్ మార్ష్(54; 70 బంతుల్లో 4 ఫోర్లు), హ్యాండ్ స్కాంబ్(73; 61 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు)లు హాఫ్ సెంచరీలతో రాణించడంతో పాటు మార్కస్ స్టోనిస్(47 నాటౌట్; 43 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు) బ్యాట్ ఝుళిపించాడు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ అరోన్ ఫించ్(6) మూడో ఓవర్లోనే ఔటయ్యాడు. భువనేశ్వర్ బౌలింగ్‌లో బౌల్డ్ కావడంతో ఆసీస్ ఎనిమిది పరుగుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోయింది. ఆపై అలెక్స్ క్యారీ (24), ఖవాజాల జోడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దింది. వీరిద్దరూ 33 పరుగులు జత చేసిన తర్వాత క్యారీ రెండో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. కుల్దీప్ బౌలింగ్‌లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చిన క్యారీ ఔటయ్యాడు. అటు తర్వాత షాన్ మార్ష్-ఖవాజాల జంట కుదురుగా బ్యాటింగ్ చేసింది. ఈ జోడి మరింత ప్రమాదకరంగా మారుతున్న సమయంలో ఖవాజాను జడేజా ఔట్ చేసి చక్కటి బ్రేక్ ఇచ్చాడు. ఆసీస్ జట్టు మరో 53 పరుగులు జోడించిన తర్వాత మార్ష్‌ను కుల్దీప్ యాదవ్ ఔట్ చేశాడు. కుల్దీప్ బౌలింగ్‌లో మార్ష్ భారీ షాట్‌కు యత్నించగా లాంగాన్‌లో మహ్మద్ షమీ క్యాచ్ పట్టాడు. దాంతో ఆసీస్ 186 పరుగుల వద్ద నాల్గో వికెట్‌ను చేజార్చుకుంది. ఆ తరుణంలో హ్యాండ్ స్కాంబ్ బాధ్యతాయుతంగా ఆడుతూ జట్టు స్కోరును ముందుకు తీసుకెళ్లాడు. అతనికి మార్కస్ స్టోనిస్ చక్కటి సహకారం అందించాడు. దాంతో ఆసీస్ 42వ ఓవర్లో రెండొందల పరుగుల మార్కును చేరింది. ప్రధానంగా కుల్దీప్ వేసిన 44 ఓవర్లో స్టోనిస్-హ్యాండ్ స్కాంబ్లు తలో సిక్సర్ కొట్టడంతో స్కోరులో వేగం పెరిగింది. ఇక భువనేశ్వర్ వేసిన 46వ ఓవర్లో వీరిద్దరూ చెరొక ఫోర్ కొట్టారు. ఆపై భువీ వేసిన 48 ఓవర్లో తొలి బంతిని సిక్స్ కొట్టిన హ్యాండ్ స్కాంబ్ మరుసటి బంతికి ఔటయ్యాడు. మరొకసారి భారీ షాట్‌కు ప్రయత్నించి శిఖర్ ధావన్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. చివరి రెండు ఓవర్లలో 29 పరుగులు రావడంతో ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 288 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆఖరి పది ఓవర్లలో కేవలం వికెట్ మాత్రమే తీసిన భారత జట్టు 93 పరుగుల్ని సమర్పించుకుంది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్‌లు తలో రెండు వికెట్లు తీయగా, రవీంద్ర జడేజాకు వికెట్ దక్కింది. -
సిడ్నీ టెస్టు : నాలుగో రోజు విశేషాలు!
-
నాల్గో రోజు ఆసీస్ స్కోరు 251/6
సిడ్నీ: బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా సిడ్నీ మైదానంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ లో ఆసీస్ తన రెండో ఇన్నింగ్స్ లో నాల్గో రోజు ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్లు కోల్పోయి 251 పరుగులు చేసింది. ఆసీస్ ఆటగాడు జో బర్న్స్ (66) పరుగులు చేసి ఆట కాసేపట్లో ముగుస్తుందనగా ఆరో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. శుక్రవారం ఆటలో టీమిండియా బౌలర్లు రాణించినా ఆసీస్ కు మెరుగైన ఆధిక్యం లభించింది. ఆసీస్ ఆదిలోనే వార్నర్(4) వికెట్ ను నేలరాల్చిన అశ్విన్ అదే ఊపును ప్రదర్శించాడు. అనంతరం షేన్ వాట్సన్(16) పరుగులకు పంపాడు. ఆ సమయంలో క్రిస్ రోజర్స్(56), కెప్టెన్ స్మిత్ (71) పరుగులతో ఆదుకున్నారు. ఈ రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ 348 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. టీమిండియా బౌలర్లలో అశ్విన్ కు నాలుగు వికెట్లు దక్కగా, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీలకు తలో వికెట్ దక్కింది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ 572/7 డిక్లేర్ టీమిండియా తొలి ఇన్నింగ్స్ 475 -
ఆరో వికెట్ ను కోల్పోయిన ఆస్ట్రేలియా
సిడ్నీ: టీమిండియాతో ఇక్కడ జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ లో ఆసీస్ తన రెండో ఇన్నింగ్స్ లో 251 పరుగుల వద్ద ఆరో వికెట్ ను కోల్పోయింది. కేవలం 39 బంతుల్లో 3 సిక్సర్లు, 8 ఫోర్లతో 66 పరుగులు చేసిన బర్న్స్ దూకుడుగా ఆడి అశ్విన్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. శుక్రవారం ఆటలో ఆసీస్ ఆదిలోనే వార్నర్ వికెట్ ను చేజార్చుకుంది. వార్నర్(4)పరుగులు చేసి పెవిలియన్ కు చేరగా... కాసేపటికే షేన్ వాట్సన్(16) పరుగులు చేసి అదే దారిలో నడిచాడు. ఆ సమయంలో క్రిస్ రోజర్స్(56), కెప్టెన్ స్మిత్(71) పరుగులతో ఆదుకున్నారు. ఆ తరువాత బర్న్స్ టీమిండియా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. బర్స్న్ ప్రమాదకరంగా మారుతున్న సమయంలో ఆరో వికెట్ రూపంలో అవుట్ కావడంతో టీమిండియా ఊపిరి పీల్చుకుంది. -
సిడ్నీ టెస్ట్: జో బర్న్స్ హాఫ్ సెంచరీ(242/5)
సిడ్నీ: టీమిండియాతో ఇక్కడ జరుగుతున్న చివరి టెస్ట్ లో ఆసీస్ ఆటగాడు జో బర్న్స్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. షాన్ మార్ష్(1) నిష్క్రమించిన అనంతరం క్రీజ్ లోకి వచ్చిన బర్న్స్ ఆకట్టుకున్నాడు. కేవలం 34 బంతులు ఎదుర్కొన్న బర్న్స్ రెండు సిక్సర్లు, ఏడు ఫోర్లతో హాఫ్ సెంచరీ చేశాడు. ప్రస్తుతం అతనికి జతగా హడిన్(30) క్రీజ్ లో ఉన్నాడు. -
ఐదో వికెట్ కోల్పోయిన ఆసీస్(165/5)
సిడ్నీ: టీమిండియాతో జరుగుతున్న చివరి టెస్టులో ఆసీస్ వరుస వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. శుక్రవారం రెండో ఇన్నింగ్స్ ను ఆరంభించిన ఆసీస్ 165 పరుగుల వద్ద ఐదో వికెట్ ను కోల్పోయింది. కెప్టెన్ స్టీవ్ స్మిత్ (71) పరుగులు చేసి ఐదో వికెట్ రూపంలో పెవిలియన్ కు చేరాడు. అంతకుముందు షాన్ మార్ష్ (1) పరుగు మాత్రమే చేసి నాల్గో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. ప్రస్తుతం ఆసీస్ 262 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. బర్న్స్ (19) పరుగులతో క్రీజ్ లో ఉన్నాడు. టీమిండియా బౌలర్లలో అశ్విన్ కు మూడు వికెట్లు లభించగా, భువనేశ్వర్ కుమార్ , షమీలకు తలో వికెట్ దక్కింది. -
నాల్గో వికెట్ కోల్పోయిన ఆసీస్(139/4)
సిడ్నీ: టీమిండియాతో జరుగుతున్న చివరి టెస్టులో ఆసీస్ వరుస వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. శుక్రవారం రెండో ఇన్నింగ్స్ ను ఆరంభించిన ఆసీస్ 139 పరుగుల వద్ద నాల్గో వికెట్ ను కోల్పోయింది. షాన్ మార్ష్ (1) పరుగు మాత్రమే చేసి నాల్గో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. ప్రస్తుతం ఆసీస్ 240 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. అంతకుముందు క్రిస్ రోజర్స్(56) పరుగులు చేసి మూడో వికెట్ గా పెవిలియన్ చేరాడు. ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్, బర్న్స్ లు జట్టు మరమ్మత్తులు చేపట్టారు. టీమిండియా బౌలర్లలో అశ్విన్ కు మూడు వికెట్లు దక్కగా, భువనేశ్వర్ కు ఒక వికెట్ దక్కింది. -
ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ హాఫ్ సెంచరీ
సిడ్నీ: టీమిండియాతో జరుగుతున్న చివరి టెస్టులో ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ మరోసారి ఆకట్టుకున్నాడు. ఒకప్రక్క ఆసీస్ వికెట్లు పడుతున్నా.. స్మిత్ మాత్రం తనదైన శైలిలో ఆటను కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే స్మిత్ నాలుగు టెస్టుల్లో నాలుగు సెంచరీలు చేసిన సంగతి తెలిసిందే. శుక్రవారం రెండో ఇన్నింగ్స్ ను ఆరంభించిన ఆసీస్ ఆదిలోనే వార్నర్ వికెట్ ను కోల్పోయింది. తొలి ఇన్నింగ్స్ లో సెంచరీతో ఆకట్టుకున్న వార్నర్ ఈ ఇన్నింగ్స్ లో నిరాశపరిచాడు. కేవలం నాలుగు పరుగులు మాత్రమే చేసి అశ్విన్ బౌలింగ్ లో నిష్క్రమించాడు. అనంతరం షేన్ వాట్సన్ (16) పరుగులు చేసి పెవిలియన్ కు చేరాడు. ఈ రెండు వికెట్లు అశ్విన్ కు లభించడం గమనార్హం. అంతకుముందు టీమిండియా 475 పరుగులకు ఆలౌటయిన సంగతి తెలిసిందే. -
మూడో వికెట్ ను కోల్పోయిన ఆసీస్(127/3)
సిడ్నీ: టీమిండియాతో జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ లో ఆసీస్ తన రెండో ఇన్నింగ్స్ లో127 పరుగుల వద్ద మూడో వికెట్ ను కోల్పోయింది. ఆసీస్ ఓపెనర్ (56) పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మూడో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. అంతకుముందు శుక్రవారం రెండో ఇన్నింగ్స్ ను ఆరంభించిన ఆసీస్ ఆదిలోనే వార్నర్ వికెట్ ను కోల్పోయింది. తొలి ఇన్నింగ్స్ లో సెంచరీతో ఆకట్టుకున్న వార్నర్ ఈ ఇన్నింగ్స్ లో నిరాశపరిచాడు. కేవలం నాలుగు పరుగులు మాత్రమే చేసి అశ్విన్ బౌలింగ్ లో నిష్క్రమించాడు. అనంతరం షేన్ వాట్సన్ (16) పరుగులు చేసి పెవిలియన్ కు చేరాడు. ఈ తొలి రెండు వికెట్లు అశ్విన్ కు లభించడం గమనార్హం. అంతకుముందు టీమిండియా 475 పరుగులకు ఆలౌటయిన సంగతి తెలిసిందే. -
క్రిస్ రోజర్స్ హాఫ్ సెంచరీ(122/2)
సిడ్నీ: టీమిండియాతో ఇక్కడ జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ రెండో్ ఇన్నింగ్స్ లో ఆసీస్ ఆటగాడ్ క్రిస్ రోజర్స్ మరో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. 72 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో 52 పరుగులతో నాటౌట్ గా క్రీజ్ లో ఉన్నాడు. మరో వైపు కెప్టెన్ స్టీవ్ స్మిత్ చూడచక్కని షాట్లతో అలరిస్తున్నాడు. ప్రస్తుతం ఆసీస్ రెండు వికెట్ల నష్టానికి 122 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. దీంతో ఆసీస్ కు 219 పరుగుల ఆధిక్యం లభించింది. -
రెండో వికెట్ ను కోల్పోయిన ఆసీస్(46/2)
సిడ్నీ:టీమిండియాతో ఇక్కడ జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా తన రెండో ఇన్నింగ్స్ లో 46 పరుగుల వద్ద రెండో వికెట్ ను కోల్పోయింది. శుక్రవారం రెండో ఇన్నింగ్స్ ను ఆరంభించిన ఆసీస్ ఆదిలోనే వార్నర్ వికెట్ ను కోల్పోయింది. తొలి ఇన్నింగ్స్ లో సెంచరీతో ఆకట్టుకున్న వార్నర్ ఈ ఇన్నింగ్స్ లో నిరాశపరిచాడు. కేవలం నాలుగు పరుగులు మాత్రమే చేసి అశ్విన్ బౌలింగ్ లో నిష్క్రమించాడు. అనంతరం షేన్ వాట్సన్ (16) పరుగులు చేసి పెవిలియన్ కు చేరాడు. ఈ రెండు వికెట్లు అశ్విన్ కు లభించడం గమనార్హం. అంతకుముందు టీమిండియా 475 పరుగులకు ఆలౌటయిన సంగతి తెలిసిందే. -
టీ విరామ సమయానికి ఆసీస్ స్కోరు 38/1
సిడ్నీ: టీమిండియాతో ఇక్కడ జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా టీ విరామ సమయానికి వికెట్ నష్టానికి 38 పరుగులు చేసింది. శుక్రవారం రెండో ఇన్నింగ్స్ ను ఆరంభించిన ఆసీస్ ఆదిలోనే వార్నర్ వికెట్ ను కోల్పోయింది. తొలి ఇన్నింగ్స్ లో సెంచరీతో ఆకట్టుకున్న వార్నర్ ఈ ఇన్నింగ్స్ లో నిరాశపరిచాడు. కేవలం నాలుగు పరుగులు మాత్రమే చేసి అశ్విన్ బౌలింగ్ లో నిష్క్రమించాడు. ప్రస్తుతం వాట్సన్ (13), రోజర్స్(21) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. అంతకుముందు టీమిండియా 475 పరుగులకు ఆలౌటయిన సంగతి తెలిసిందే. -
తొలి వికెట్ ను కోల్పోయిన ఆసీస్(6/1)
సిడ్నీ: టీమిండియాతో జరుగుతున్న చివరి టెస్ట్ లో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రేలియా ఆరు పరుగుల వద్ద తొలి వికెట్ ను కోల్పోయింది. తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ ఆకట్టుకున్న డేవిడ్ వార్నర్ ఈ ఇన్నింగ్స్ లో ఆదిలోనే పెవిలియన్ కు చేరాడు. వార్నర్(4) పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్ లో నిష్క్రమించాడు. అంతకుముందు టీమిండియా తన తొలి ఇన్నింగ్స్ లో 475 పరుగులకు ఆలౌటయ్యింది. ఐదు వికెట్ల నష్టానికి 342 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో నాల్గో రోజు ఆటను ఆరంభించిన టీమిండియా మరో 133 పరుగులు మాత్రమే జోడించింది. హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్న అశ్విన్ (50) పరుగుల వద్ద తొమ్మిదో వికెట్ రూపంలో నిష్క్రమించాడు. 110 బంతులను ఎదుర్కొన్న అశ్విన్ 6 ఫోర్ల సాయంతో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. శుక్రవారం నాల్గో రోజు ఆటలో విరాట్ కోహ్లీ(147), సాహా (30)లు నిష్ర్కమించిన అనంతరం అశ్విన్, భువనేశ్వర్ కుమార్ ల జోడి క్రీజ్ లో ఎక్కువ సేపు నిలబడటానికే ప్రాధాన్యత ఇచ్చింది. అనవసరపు షాట్లకు పోకుండా వీరిద్దరి జోడి ఆచితూచి ఆడింది. 112 బంతులను ఎదుర్కొన్న ఈ జోడి 50 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసింది.