నాల్గో రోజు ఆసీస్ స్కోరు 251/6 | fourth day play comes to an end at 251 runs | Sakshi
Sakshi News home page

నాల్గో రోజు ఆసీస్ స్కోరు 251/6

Published Fri, Jan 9 2015 12:29 PM | Last Updated on Sat, Sep 2 2017 7:27 PM

నాల్గో రోజు ఆసీస్ స్కోరు 251/6

నాల్గో రోజు ఆసీస్ స్కోరు 251/6

సిడ్నీ: బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా సిడ్నీ మైదానంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ లో ఆసీస్ తన రెండో ఇన్నింగ్స్ లో నాల్గో రోజు ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్లు కోల్పోయి 251 పరుగులు చేసింది. ఆసీస్ ఆటగాడు జో బర్న్స్ (66) పరుగులు చేసి ఆట కాసేపట్లో ముగుస్తుందనగా ఆరో వికెట్ రూపంలో వెనుదిరిగాడు.  శుక్రవారం ఆటలో టీమిండియా బౌలర్లు రాణించినా ఆసీస్ కు మెరుగైన ఆధిక్యం లభించింది.  ఆసీస్ ఆదిలోనే వార్నర్(4) వికెట్ ను నేలరాల్చిన అశ్విన్ అదే ఊపును ప్రదర్శించాడు. అనంతరం షేన్ వాట్సన్(16) పరుగులకు పంపాడు.  ఆ సమయంలో క్రిస్ రోజర్స్(56),  కెప్టెన్ స్మిత్ (71) పరుగులతో ఆదుకున్నారు. 

 

ఈ రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ 348 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.  టీమిండియా బౌలర్లలో అశ్విన్ కు నాలుగు వికెట్లు దక్కగా, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీలకు తలో వికెట్ దక్కింది.

 

ఆసీస్ తొలి ఇన్నింగ్స్ 572/7 డిక్లేర్
టీమిండియా తొలి ఇన్నింగ్స్ 475

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement