సిడ్నీ: ఆస్ట్రేలియాతో ఇక్కడ జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా తన తొలి ఇన్నింగ్స్ లో 448 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్ ను కోల్పోయింది. నాల్గో రోజు ఆటలో భాగంగా ఐదు వికెట్ల నష్టానికి 342 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ ను ఆరంభించిన టీమిండియా వెంటవెంటనే రెండు వికెట్లను కోల్పోయింది.
విరాట్ కోహ్లీ(147), సాహా(35) పరుగులు చేసి పెవిలియన్ కు చేరారు. అనంతరం అశ్విన్ , భువనేశ్వర్ కుమార్ ల జోడి ఆసీస్ కు చాలా సేపు పరీక్షగా నిలిచింది. 75 బంతులను ఎదుర్కొన్న భువనేశ్వర్ కుమార్ 5 ఫోర్ల సాయంతో 30 పరుగులు చేసి ఎనిమిదో వికెట్ రూపంలో వెనుదిరిగాడు.