సిడ్నీ: టీమిండియాతో జరుగుతున్న చివరి టెస్టులో ఆసీస్ వరుస వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. శుక్రవారం రెండో ఇన్నింగ్స్ ను ఆరంభించిన ఆసీస్ 165 పరుగుల వద్ద ఐదో వికెట్ ను కోల్పోయింది.
కెప్టెన్ స్టీవ్ స్మిత్ (71) పరుగులు చేసి ఐదో వికెట్ రూపంలో పెవిలియన్ కు చేరాడు. అంతకుముందు షాన్ మార్ష్ (1) పరుగు మాత్రమే చేసి నాల్గో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. ప్రస్తుతం ఆసీస్ 262 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. బర్న్స్ (19) పరుగులతో క్రీజ్ లో ఉన్నాడు. టీమిండియా బౌలర్లలో అశ్విన్ కు మూడు వికెట్లు లభించగా, భువనేశ్వర్ కుమార్ , షమీలకు తలో వికెట్ దక్కింది.