సిడ్నీ: టీమిండియాతో ఇక్కడ జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా టీ విరామ సమయానికి వికెట్ నష్టానికి 38 పరుగులు చేసింది. శుక్రవారం రెండో ఇన్నింగ్స్ ను ఆరంభించిన ఆసీస్ ఆదిలోనే వార్నర్ వికెట్ ను కోల్పోయింది. తొలి ఇన్నింగ్స్ లో సెంచరీతో ఆకట్టుకున్న వార్నర్ ఈ ఇన్నింగ్స్ లో నిరాశపరిచాడు.
కేవలం నాలుగు పరుగులు మాత్రమే చేసి అశ్విన్ బౌలింగ్ లో నిష్క్రమించాడు. ప్రస్తుతం వాట్సన్ (13), రోజర్స్(21) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. అంతకుముందు టీమిండియా 475 పరుగులకు ఆలౌటయిన సంగతి తెలిసిందే.