
దీటుగా బదులిస్తున్న టీమిండియా
సిడ్నీ: ఆస్ట్రేలియాతో ఇక్కడ జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా దీటుగా బదులిస్తోంది. ఐదు వికెట్ల నష్టానికి 342 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో నాల్గో రోజు బ్యాటింగ్ ఆరంభించిన భారత ఆటగాళ్లు ఆచితూచి ఆడుతున్నారు. ఈ రోజు ఉదయం విరాట్ కోహ్లి(147), సాహా(35) పరుగుల వద్ద వికెట్లను భారత్ కోల్పోయింది. అనంతరం రవి చంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్ లు ఆసీస్ బౌలర్లకు పరీక్షగా నిలిచారు. అశ్విన్ (40), భువనేశ్వర్ కుమార్ (27) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. ప్రస్తుతం టీమిండియా ఏడు వికెట్ల నష్టానికి 447 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది.
ఆసీస్ బౌలర్లలో స్టార్క్, వాట్సన్ లకు చెరో రెండు వికెట్లు లభించగా,హారిస్, హజిల్ వుడ్, లయన్ లకు తలో వికెట్ దక్కింది. ఆస్టేలియా తన తొలి ఇన్నింగ్స్ లో 572 పరుగుల వద్ద డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే.