సిడ్నీ: టీమిండియాతో ఇక్కడ జరుగుతున్న చివరి టెస్ట్ లో ఆసీస్ ఆటగాడు జో బర్న్స్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. షాన్ మార్ష్(1) నిష్క్రమించిన అనంతరం క్రీజ్ లోకి వచ్చిన బర్న్స్ ఆకట్టుకున్నాడు. కేవలం 34 బంతులు ఎదుర్కొన్న బర్న్స్ రెండు సిక్సర్లు, ఏడు ఫోర్లతో హాఫ్ సెంచరీ చేశాడు. ప్రస్తుతం అతనికి జతగా హడిన్(30) క్రీజ్ లో ఉన్నాడు.