సిడ్నీ: టీమిండియాతో ఇక్కడ జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ లో ఆసీస్ తన రెండో ఇన్నింగ్స్ లో 251 పరుగుల వద్ద ఆరో వికెట్ ను కోల్పోయింది. కేవలం 39 బంతుల్లో 3 సిక్సర్లు, 8 ఫోర్లతో 66 పరుగులు చేసిన బర్న్స్ దూకుడుగా ఆడి అశ్విన్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. శుక్రవారం ఆటలో ఆసీస్ ఆదిలోనే వార్నర్ వికెట్ ను చేజార్చుకుంది.
వార్నర్(4)పరుగులు చేసి పెవిలియన్ కు చేరగా... కాసేపటికే షేన్ వాట్సన్(16) పరుగులు చేసి అదే దారిలో నడిచాడు. ఆ సమయంలో క్రిస్ రోజర్స్(56), కెప్టెన్ స్మిత్(71) పరుగులతో ఆదుకున్నారు. ఆ తరువాత బర్న్స్ టీమిండియా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. బర్స్న్ ప్రమాదకరంగా మారుతున్న సమయంలో ఆరో వికెట్ రూపంలో అవుట్ కావడంతో టీమిండియా ఊపిరి పీల్చుకుంది.