సిడ్నీ: టీమిండియాతో జరుగుతున్న చివరి టెస్టులో ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ మరోసారి ఆకట్టుకున్నాడు. ఒకప్రక్క ఆసీస్ వికెట్లు పడుతున్నా.. స్మిత్ మాత్రం తనదైన శైలిలో ఆటను కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే స్మిత్ నాలుగు టెస్టుల్లో నాలుగు సెంచరీలు చేసిన సంగతి తెలిసిందే. శుక్రవారం రెండో ఇన్నింగ్స్ ను ఆరంభించిన ఆసీస్ ఆదిలోనే వార్నర్ వికెట్ ను కోల్పోయింది. తొలి ఇన్నింగ్స్ లో సెంచరీతో ఆకట్టుకున్న వార్నర్ ఈ ఇన్నింగ్స్ లో నిరాశపరిచాడు. కేవలం నాలుగు పరుగులు మాత్రమే చేసి అశ్విన్ బౌలింగ్ లో నిష్క్రమించాడు.
అనంతరం షేన్ వాట్సన్ (16) పరుగులు చేసి పెవిలియన్ కు చేరాడు. ఈ రెండు వికెట్లు అశ్విన్ కు లభించడం గమనార్హం. అంతకుముందు టీమిండియా 475 పరుగులకు ఆలౌటయిన సంగతి తెలిసిందే.