సిడ్నీ: బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా సిడ్నీ మైదానంలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో రోజు ఆరంభమైన చివరి టెస్ట్ మ్యాచ్ లో లంచ్ విరామ సమయానికి భారత్ 144 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 407 పరుగులు చేసింది. ప్రస్తుతం అశ్వీన్ (74 బంతుల్లో 33 బ్యాటింగ్; 5 ఫోర్లు), భువనేశ్వర్ కుమార్ (39 బంతుల్లో 3 పరుగులు)తో క్రీజులో ఉన్నారు. అంతకముందు వీరాట్ కోహ్లీ (147), సాహా (35)లతో పెవిలియన్ చేరారు. 119.3 ఓవర్లో 352 పరుగుల వద్ద భారత్ కెప్టెన్ వీరాట్ క్లోహీ ఆరో వికెట్గా వెనుతిరిగాడు. మొత్తం 230 బంతుల్లో 20 ఫోర్లు బాదిన కోహ్లీ 147 పరుగులు చేసి హారీస్ బౌలింగ్లో రోజర్స్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
ఆ తరువాత 352 పరుగుల వద్ద భారత్ ఏడో వికెట్ కోల్పోయింది. భారత్ ఆటగాడు సాహా 130.2 ఓవర్లలో ఏడో వికెట్ రూపంలో పెవిలియన్ చేరాడు. 96 బంతుల్లో 35 పరుగులు చేసిన సాహా, హాజిల్వుడ్ బౌలింగ్లో స్మిత్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాటపట్టాడు. ఆసీస్ బౌలర్లలో లయోన్, హరీస్, హాజిల్వుడ్ తలో వికెట్ తీసుకోగా, స్టార్క్, వాట్సన్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. భారత్ ప్రస్తుతం 165 పరుగులతో వెనకబడి ఉంది.
అయితే మూడో రోజు ఆటముగిసే సమయానికి టీమిండియా ఐదు వికెట్ల నష్టానికి 342 పరుగులు చేసింది. అంతకముందు ఆసీస్ తన తొలి ఇన్నింగ్స్ను 7 వికెట్ల నష్టానికి 572 పరుగుల వద్ద డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే.
లంచ్ సమయానికి భారత్ స్కోరు: 407/7
Published Fri, Jan 9 2015 7:23 AM | Last Updated on Sat, Sep 2 2017 7:27 PM
Advertisement
Advertisement